27, ఏప్రిల్ 2014, ఆదివారం

129. Love Story-33 ( Life is kalpana )

                                                                        

కారుణ్య ఉన్నారండి అంటు బయట నుండి పిలుపు.  ఆది ఆడగొంతు లాగుంది. కల్పన ఎందుకైనా మంచిదని,  కిటికీ తలుపు తీసి చూసింది. ఎవరో నా వయసులొ ఉన్న వనిత  లాగున్నారు,  తలపు తీసి చూద్దామని తలుపు తీయగా " హాయ్ కల్పనా " ఎంత చీక్కిపొయావె "  అప్పుడు  'ఎర్రగా బుర్రగా ఉండే దానివి.  ఇప్పుడు చింపిరి జుట్టేసుకొని మడ్డి  మొహంతో ఉన్నావు.

ఎప్పుడొచ్చావే  "శిరీషా"  అసలు ఇండియాలోనే లేవు " ఎప్పు డొచ్చావు, ఎందుకొచ్చావు",  ఈ బీదరాలిని చూడాలని వచ్చావా.
నే నోచ్చిమ్ది  మావారి కొరికమీద  ఇండియాలో బిజినెస్ చేద్దామని వచ్చాను.  నీకు  ఇండియా బాగా తెలుసుకదా చూసిరా అన్నారు. వెంటనే నీవు గుర్తుకోచ్చావు  రెక్కలు కట్టుకొని నీ దగ్గర్కు వచ్చి  వాలాను.   నీ ఇల్లు కను క్కోవడం ఒక్కరవ్  కష్టమైన దనుకొ   I .T కారుణ్యా  అంటే  ఎవ్వరు  చెప్పలేదు.  రైల్లో కలుస్తూ ఉంటారుట, పెద్దాయన  మాత్రము ఈ ఇల్లు అని చూపిమ్చారు.

ఒట్టి  మాటలేనా కాఫీ టిఫిన్ లేదా.

నీవు కనిపించిన సంతోషములో మరిచిపోయాను, అమ్మాయి కరుణ అని పిలవగా కరుణ వచ్చింది అంటికి నమస్కారం పెట్టమ్మ అన్న మాటలకు వచ్చి పాదాలకు నమస్కారం చేసింది. నీవు వెళ్లి చదువుకొమ్మ, బాబు కిరణ్ అని పిలవగా కిరణ్ వచ్చాడు అంటికి నమస్కారం చేయమనగానే పాదాలకు నమస్కారము చేసాడు.  నీవు వెళ్లి చదువుకో బాబు అన్నది కల్పన.

ఏమిటి నీకు అప్పుడే ఇద్దరు పిల్లలా ఎం చదువుతున్నారు. అమ్మాయి 7 th ,  అబ్బా యి 9 th  ఒక్కనిముషము T .V. చూస్తువుండు
నేను రోజు చూసేది ఆ  T .V. కాస్త నేను కూడా నీకు వంటలో సహాయము చేస్తూ మాట్లాడు కుందాం అన్నది.

నీ పరిస్తితి అంత బాగున్నట్లు లేదు,  అసలు నీ కధ ఏమిటో చేపుతావా ముందు కాసేపు ఈకార పూస నవులుతూ విను అన్నది.
నీకు గుర్తుందికదా మేమిద్దరం ఒకే బ్రాంచిలో పనిచేసే వాల్లము ఆ ఎందుకు గుర్తులేదు. ముందు మీ పెళ్లి విషయాలు చెప్పు 

నీకు తెలుసు నేను కారుణ్య ఒకే బ్రాంచిలో పనిచేసాము.  మాఇఒద్దరిలొ ఒకటే భావము. బయటకు చెప్పుకోలేదు.కారుణ్య తనమనసులో ఉన్నదంతా కవితా రూపములో నాకు మెసేజ్ పంపించాడు.

నా హృదయ రానివి నీవు, నా ప్రేమ సామ్రాజ్యానికి రారానివి వీవు
నా హృదయ స్పందనవునీవు, నాగుండెలో దాగిఉన్న దేవతవు నీవు
నా జీవితము అమృత మయము చేసే అమృత వాహినివి నీవు
నా బ్రతుకును పూల బాటగా మార్చే నా దానవు, కల్పనవు   

కంటికే ముద్దొచ్చే నీరూపు, కను విందు చేసే నీ పెదవులు
పరువాన్ని నాకొరకు పదిలపరిచినావు, నాకిస్తావ ముద్దులు 
చెవుల కింపుగా మధుర స్వరం పాడినావు, తీరుస్తావు నా కలలు
నీ చేయితొ +నా చేయి కలుపుకొని తీర్చు కుందాము కోరికలు కల్పన

తెలిసింది నీకు నేనంటే ఇష్టమని
హృదయాన్ని అర్ధం చేసుకుంటావని    
నీకు నేనంటే ఎంతో అనురాగమని
నా ప్రేమ అంగీకరిమ్చి ఒప్పు కుమ్తావ కల్పన

ఇట్లు నీ ప్రేమికుడు కారుణ్య 

చివరకు మేము పార్కులో కలుసుకొని అభిప్రాయాలు చెప్పుకొని పెద్దలు ఒప్పుకుంటే ఒకటవుదామని నేను చెప్పను.
కారుణ్య, వాళ్ళ నాన్నగ్గారు, అమ్మగారు మా యింటికి వచ్చి నన్ను పెల్లి చూపుల్లొ  చూసి,  పిల్ల నచ్చింది మేము చేసుకుంటామని చెప్పారు వారు. మా పెళ్లి పెద్ద ఆర్భాటముగా జరుగలేదు. కేవలము గుడిలో ఉన్న కల్యాణ మండపములో మా పెళ్లి జరిగింది. అందరు వచ్చారు ఆశీర్వదిమ్చారు.

కాలం గిర్రని తిరిగిమది. ఒక పది సంవత్చరాలు సంతోషముగా జరిగింది. కారుణ్య అమేరికాకు  పోవాలని కంపెని వారు వత్తిడి చేసారు. నన్ను బెంగలూరు పొమ్మని వత్తిడి చేసారూ ఇరువురము చెరో దిక్కు పనిచేయుట ఇష్టము లేక ఉద్యోగములకు రాజీనామా చేసినాము.  అప్పటికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు.
మావారు వేరే ఉద్యోగము వెతుదామని అనుకోనేటప్పుడే ఎప్పుడో వ్రాసిన  "APPSC "  పరిక్షల ఉత్తిర్న్డైన వారిలో పేరు ఉండటం వళ్ళ  వెంటనే  గవెర్నమెంటు  ఉద్యోగములో  చేరమని ఆర్డరు వచ్చింది. అదియు సీనియర్ అకౌంటెంట్ గా వచ్చింది.
వాళ్ళ నాన్నగారు చేరమని గొడవ చేయుట వల్ల చేరాడు. ఆ ఉద్యోగమే ఇప్పుడే చేసేది.  వెడినీల్లకు చన్నిల్లుగా నేను కూడా ఉద్యోగము చేస్తానంటే ఇంట్లో ఉండు పిల్లలు చిన్నవారు, అమ్మనాన్నలు వృద్ధులు వారుణి చూసు కుంటు ఇంటిలో ఉండు నాజీతముతొ ఇల్లు గడుపాతాను, నీవేమి భయపడకు, నన్ను భయపెట్టకు

అపుడే మా మావగారికి పెద్ద జబ్బు చేసింది. హార్టు ఎటాక్ వచ్చింది.వెంటనే డాక్టర్కు చూపించగా గుండె ఆపరేషన్ చేయాలి కర్చు ఎక్కువతుంది అని  చెప్పారు
కర్చు ఎక్కువైనా సరే మానాన్న బాగుండాలి అని అప్పుచేసి మరి వైద్యము  చేఇమ్చారు. దేవుని దయవల్ల మా  మావగారు జబ్బు తగ్గి ఇంటికి వచ్చారు. కాని చేసిన అప్పు  మాత్రమూ పెరిగుతున్నాది.
అలా  రొజులు దొర్లుతున్నాయి కరుణ పెద్ద మనిషి అయిమ్ది. దాని పేరంటాని క్రింద కొంత కర్చు  అయింది.
మావాడు కిరాన్ క్రికేట్ర్ట్ ఆడుతూ  పరిగెడుతూ క్రింద పడ్డాడు. వాడిని డాక్టర్కు చూపగా నరము కదిలింది కట్టుకట్టాలి కొన్ని రోజులు కాలు కదలకుండా జాగర్తగా ఉండాలి అని డాక్టర్ అన్నారు.
చూసావుగా  శిరీషా మా పిల్లలను నీ వచ్చేముందే మా కిరణ్కు కట్టు విప్పారు.  ఇదే మా జీవిత పడవ సముద్రములో తెలియాడుతూ ప్రయాణ మవుతున్నాది.  ఒడ్డుకు  చేరేదేప్పుడో  అన్నది కల్పన

ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఇంత చిన్న ఇంటిలో ఎట్లా ఉమ్టున్నావే,  నీ ఓర్పుకు నేను మెచ్చుకోక తప్పదు. అన్నది శిరీష
అదేనే జీవితము భర్త కష్టపడుతున్నా కష్టము తెలియకుండా సుఖపెట్టేదే భార్య.  భర్త వచ్చేమ్గానే సంతోషంగా పలకరిస్తే వాళ్ళ ఆనందము అంతా ఇంతా కాదు. వారి అవసరాలు అన్ని దగ్గరుండి తీరుస్తు వుంటే సాగేదే జీవితము.
మీ మావగారుకనబడలేదు ఏమిటి, ఆకధ తరువాత చెపుతాను . ముందు ఈ టిఫెన్ తిను టి త్రాగు కాస్త  విశ్రాంతి తీసుకొ. ముందు

నీకధ చెప్పు నాకధచెప్పుకుంటు  పోయాననుకో నీవు తట్టుకోలేవు. ఇన్ని కష్టాలు ఎట్లాపడుతున్నావే అంటావు.

కల్పనా నీవనుకున్నంత  గొప్ప  జీవితము కాదు నాది. కమ్పెనీద్వారా అమెరికా వెళ్లాను అక్కడ మన ఇండియా వారు చాలామంది ఉన్నారు. అక్కడ నాకు ఒక బ్రోకర్ తగిలాడు. మంచి సంబందం ఉంది పెళ్లి చేసుకుంటారా అని ఫోటో తీసుకురా అబ్బాయి ఏమిచేస్తు ఉంటాడు. బిటెక్  చదివి  I .T  కమ్పెనీలొ ఉద్యోగమూ చేస్తున్నాడు. అని చెప్పేడు.   పెద్ద ఆర్భాటము లేకుండా రిజిస్టార్ ఆఫీసులొ పెళ్లి చేసుకున్నాము మేము మూడు  నెలలలో స్వర్గ సుఖాలు అనుభావిమ్చాము.  నాకు ప్రేగ్నేన్టు అని నిర్ధారణ అయింది. 4వ నెల అని తేలింది. మావారు వచ్చి అబార్షన్ చేయిమ్చుకోమని గొడవ చేసారు. నాకు ఇష్టం లేదని గట్టిగాచేప్పను మా ఇద్దరి మద్య వాదాలు పెరిగాయి మావారు త్రాగిరావటం మొదలుపెట్టారు. ఏమాట అన్న తప్పుగా భావించి చెయ్ చేసుకోవటం మొదలుపెట్టారు. వానితో కాపురం చెయ్యలేక విడాకులు తీసుకొని బయటకు వచ్చాను.
ఆఫీసుకు సెలవు పెట్టి ఆశ్రమంలో ఉండి  పాపకు జన్మ ఇచ్చాను. ఆ పాపను ఎలా  పెంచాలా అని ఆశ్రమ పెద్దలు అడిగాను. వారు చెప్పిన సలహా మీరు మల్లి పెళ్లి చేసుకొండి  అన్నారు. అప్పుడే ఆశ్రమ పెద్ద అక్కడకు వచ్చాడు నన్ను  పాపను చూసాడు లోపలకు రమ్మనమన్నాడు. నేను ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాను నాకు ఇప్పుడు నీవు భార్యగా ఉంటావా నా ఆస్తులన్నీ నీపేరుతొ వ్రాస్తాను అన్నాడు. నాకన్నా 15 ఏళ్ళు పెద్దైన  బ్రతుకు తెరువు కోసం పెళ్ల్లి చేసుకున్నాను. నన్ను సంతోషపెడతాడు ఇంతకన్నా నాకు కావలసిన దేముంది  . మా కమ్పెనీ వ్యాపారులు పెరిగినాయి కోట్లు గడిమ్చాను ఇండియాలో ఏదైనా ఆశ్రమము పెడదామని వచ్చాను నిన్ను కలిసాను నీ కధ వింటున్నాను అన్నది శిరీష. 

నే చెప్ప్దే దేముందే ఇటువంటి కష్టాలు మరేవ్వరికి రాకూడదంట నెలరోజుల క్రితం మావయ్యగారికి  హార్టు స్ట్రోక్ వచ్చింది. హాస్పటల్లో చేర్చాము పదిరోజులుమ్చాము మందులు వాడాము కాని ప్రాణాలు దక్కించుకోలేక పోయాము. ఖర్ర్చు నిమ్మిత్తము ఇల్లు తాకట్టు పెట్టాము అప్పు అప్పు గానే  ఉన్నది.  ఇంటికి పెద్ద మావయ్యగారు లేకపోతే ఎదోలాగున్నాది. మావారు వాళ్ళ నాన్నను  తలుచు కుంటు  భాధపడుతున్నారు. నేను ప్రతికిమ్చుకోలేక పోయ్యానని.
నేను ఓపికతో భాద తొలగించటానికి ప్రయత్నించాను.
అసలే గోరుచుట్టు దానిమీద కారం పడింది,  దాన్ని ఎవరో తోక్కారుట ఒకటే మంటతో  భాద పడ్డారుట
అట్లాగే మావారికి ప్రమోషన్  వచ్చింది  "ఎస్ టి ఓ "  గా హైదరాబాద్ నుండి 160 కిలొమీటర్లొ ఉన్న నిజామాబాద్  డిస్ట్రి క్ ట్రజరి లో ఉద్యోగము మార్చారు.
రోజు రైలులో వెళ్లి మరీ వస్తున్నారు.
పొనీమీరె వెళ్ళవచ్చు కదా అన్నది  శిరీష
అదికూడా  ఆలోచించాము, అత్తయ్యగారు ఇక్కడనుండి కదలనన్నారు,  ఎప్పుడు నా జీవితము ఈ ఇట్లోనే వెళ్ళాలి అంటారు.
ఈ రోజు శనివారము కదా మీవారు ఇంకా రాలేదేమిటి అని అడిగింది. ఒక్క ఆదివారము తప్ప అన్నిరోజులు ఆఫీసుకు పోవాలిసిందే అన్నది.
ఆ వచ్చేదేవరు కారుణ్య కదు, అవును మావారు వస్తున్నారు.
అంత చిక్కి పోయాడు, అందలో గడ్డము బాగా పెరిగింది.
చూసావుగా మాజీవితాలు 

ఎవరు వచ్చింది శిరీష గారా, బాగున్నారా మీరెమ్చెస్తున్నారు, అమెరికాలోనే ఉన్నారా ఇండియాకు వచ్చారా మీ స్నేహితురాలుతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే  ఫ్రెష్ అయి వస్తాను అని లోపాలు వెళ్ళాడు.
ఎం చెప్పాలె  మా పరిస్తితి  ఇల్లు వేలం వేస్తారుట అప్పు తీర్చ నందుకు  బ్యాంకు వారు,  పిల్లను చదివించాలి ఫీజులు ఎలా పెరిగాయో నీకు తెలిసే ఉంటుంది. అమ్మాయి చదువు అయినతర్వాత పెళ్లిచేయాలి మా ఇంటి పరిస్తితి మొత్తం ఇది.. నా కధచేప్పి నిన్ను భాద పెట్టాను.
మావారు చెపుతుంటారు మనం చేసే ప్రయత్నాలు అన్ని జరుగుతాయని అనుకోకు మనం ధర్మ  మార్గమున నడుస్తున్నాము ఎ క్షణాన ఐన జాతకము మారవచ్చు అంటు ఉంటారు       కష్టాలు సాస్వితముగా ఉండవు,  నీవు ధైర్యం గా  ఉండు నాకు ధైర్యం చెప్పు అనేవాడు.
నీ కత వింటుంటే నా హృదయము ద్రవించింది. నాకు చేతనైన సహాయము చేస్తా అన్నది. అప్పుడే వచ్చాడు కారుణ్య  మీతొ ఇందాక మాట్లాడలేదు ఏమనుకోకండి.
నేను అమెరికాకు వెళ్ళాక మీకు పూర్తి సహాయము చేస్తాను, మీరు వద్దనకండి,   అదే నేను కోరు కొనేది.   మీ పెళ్ళికి నేను రాలేక పోయాను మీ పెళ్లి గిఫ్టుగా ఈ కవరు ఇస్తున్నాను , నేను వెళ్ళేదాకా కవరు తీసి చూడొద్దు.
నాకు శెలవిస్తే నేను వెళ్ళొస్తా అని చెప్పింది.
దూరంగా ఉన్న కారు దగ్గరకు వచ్చింది, కారు ఎక్కి  శిరీష  వెళ్ళింది.
ఏమిట్రా అబ్బాయి ఆ వచ్చిమ్దేవరు అలా  వచ్చి ఇలా వెళ్ళారు  అన్నది అత్తయ్యగారు.
దానిలో ఏమున్నదో రేపు చూద్దా మండి.  ఈరొజు విశ్రాంతి తీసు కొండి. ఆన్నది
ప్రొద్దున్నే లేచి ఇద్దరు కలసి కవరు విప్పారు దానిలో 10 లక్షల డి డి  కల్పన పేరు మీద ఉన్నాది
నాకు నమ్మకము ఉన్నది మీరు ఎవరి ఋణము  ఉంచు కోరని భవిషత్తులో  ఆమెకు సహాయము చేద్దాం, కాదన కండి  చేసిన సహాయమును.వప్పు కొండి  

నువ్వ్వేనాకు ప్రాణం నీ సంతోషమె నా సంతోషము,  ఇప్పుడే బ్యాంకికి పోదాము చెక్కు మార్చి అప్పుతీరుద్దాము.
మన కష్టాలు  తీర్చిన దేవుడి గుల్లో మీ న్నాన్న గారి పేరుమీద అన్నదానము చేద్దాము. మన కష్టాలు తీర్చినది శిరీష కదే అవును అమ్మవారికి కుంకుమ పూజ  శిరీష పేరు మీద చెయిద్దాము అన్నది.
నా గృహ దేవతవు, అదృష్ట దేవతవు  నీవె కల్పన.                     
                                                       .      .    .            .