పని + మని + షి - రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ అమ్మగారు అమ్మగారు ఏమిటే కాకి అరిచినట్లు అరుస్తావు అదే పనిగా, ఇప్పుడేగా వచ్చింది నీవు, కాసేపు ఉండు అoట్ల గిన్నేలన్నీ మొరీలొ వేస్తాను.
ఎంటమ్మ గారు నేను రోజు చెపుతూనె ఉన్నానుగా, నేను టైం ప్రకారముగా వస్తాను, టైం ప్రకారముగా వెళ్తాను, నా టైం అంతా ఇక్కడే తినేస్తే తర్వాత వెళ్లి ఇళ్ళకు ఆలస్యముగా పోవాల్సి వస్తుంది. వారు పెట్టె సాపనార్దాలన్ని మీకొసమ్ నేను భరించాల్సి వస్తుంది అమ్మగారు.
ఎంటే ఒక్కటే సొద, నీ ఒక్క దానివే పనిచేస్తున్నట్లు, వేరెవ్వరు పనిచేయనట్లు. అసలే నీవు ఆదివారాలు రావు, నెలకు రెండు రోజులు సెలవు కావాలంటావు, ఒక్కరవు ఆలస్యమైన ఊరుకొవు.
వేరొకరితో నాకేం పనమ్మా, నామటుకు నేను వప్పు కున్న ఇళ్ళలో పనిచేసుకొని పోవాలి, ఆలస్యమైనదొ మా అయన త్రాగి మరీ వస్తాడు మీ ఇష్టం అన్నది పని మనిషి పార్వతమ్మ.
మీ ఆయన త్రాగుతాడే. త్రాగటం కాదమ్మా పచ్చి బూతులు తిడతాడు మిమ్మల్ని కాదు నన్ను మీ పరువు ఎక్కడికి పోతుందో నని భయము అన్నది.
అంత పని చేయకు నీవు చెప్పనట్లు రోజు ముందేలేచి గేన్నెలు సర్ది వేస్తాను. ఈ సారి సర్దుకో అన్నది ఇంటి యజమాని పద్మావతమ్మ.
వేసినవి వేసినట్లుగా నీల్లు పారబోస్తూ సబ్బు రుద్దుతూ గబగబా కడిగి గిన్నెలన్నీ బోర్లించి వేల్లోస్తానమ్మ గారు అన్నాది .
ఆ మరిచాను బట్టలు నానా పెట్టి ఉంచండి అమ్మగారు. బట్టలు ఉతికి ఇల్లు తుడిచి వెళతాను అని చెప్పి వెళ్ళింది.
పార్వతమ్మ పని బాగా చేస్తుంది, నేను ఎమన్నా నోరు విప్పదు. జీతము మూడు నెలల దాకా ఇవ్వ పోయిన ఎమీ అనదు.
వంద రూపాయలు తో పనిలోకి చేరింది. ఇప్పుడు రెండు వేలు ఇచ్చిన ఇంకా ఇమ్మని కాని అడుగదు. మనసులో అనుకుంది పద్మావతిగారు.
పద్మావతిగారికి సుచీ సుబ్రత మరీ ఎక్కువ. గిన్నెలు కడిగిన మరలా కడుకుంటుంది. ఇంట్లో ఉన్న పర్నిచర్, కిటికీలు తుడిచిన సంతృప్తి ఉండదు. మరీ ఇదుగో బూజు ఉంది తుడవవేమి అనేది.
పని మనిషి అనేవారు సుబ్రమైన బట్టలు వెసుకొ కూడదని ఒక షరతు పెడుతుంది. రోజు కాఫీ టిఫేన్లు మాత్రము ఉండవు అని గట్టిగా చెపుతుంది.
చేతినిండా డబ్బు ఉన్నది. తాతల ఆస్తిఉన్నది. భర్త రమణ రావు లెక్చరర్ పనిచేసి రిటైరయ్యారు.ఈమె కుడా టిచర్ గా పనిచేసి రిటైరైఇమ్ది,
ఇద్దరు కొడుకులను ఇంజనీర్ చదివించి , పెళ్ళిళ్ళు చేసింది. కాని వచ్చిన కోడళ్ళు కూడా బాగా చదువుకున్నవారు.అవటం వళ్ళ ఇతరదేశాలకు పోయి ఉద్యోగము చేసే అవకాసము దొరికింది. పిల్లలు వెళ్లి పోయారు.భార్య భర్తలు ఒకరి కొకరు సహాయ పడుతూ ఈ లంకంత కొంపలో ఉంటున్నారు.
పార్వతమ్మ తన కూతురు జ్యోతిని పిలిచి ఈ రోజు నా వంట్లో బాగోలేదు. కొంచము జ్వరము వచ్చినట్లు ఉన్నది. నీవు మొహమాట పడకమ్మ నేను అంట్లు తోవడానికి పంపినందుకు, ఆ అంట్లు తోమి నిన్ను ఇంత చదువు చదివించాను. మనం చేసే పనికి చదువుతో పని లేదు. మనం విశ్వాసముగా పనిచేస్తామని మంచి పేరు ఉన్నది. ఆ పేరు మాత్రమూ చెడకొట్ట కుండగా, నీచదువు బయట పెట్ట కుండగా బ్రతకాలమ్మ.
వారు ఏదన్న గట్టిగా అడిగిన మాది వానాకాలం చదువమ్మగారు అని మాత్రము అంటావని నాకు వాగ్దానం చేయమ్మా. నిన్ను పంపఁ కూడదు. ఒక్క రెండు రోజు పోయావనుకో నాకు కొంత ఓపిక వస్తుంది తర్వాత నేనే వెళ్తాను అన్నది.
అమ్మ నాకు పరిక్షలు ఉన్నాయి నేను హైదరాబాద్ పోయి రాయాలి. వారం రోజుల్లో తిరిగి వస్తాను. ఈ వారం రోజులు ఇంటి దగ్గరే ఉండు. నామీద ఒట్టు నీవు పనికి పోవద్దు. నాకు సెలవులోస్తాయి, నేనే ఖచ్చితంగా అక్కడ పనికి పోతాను అన్నది.
నాతల్లే ఎంత మంచి మాట చేప్పావు ముందు పరీక్షలు వ్రాయి. నీ చదువు పూర్తి చేసి బీదవారికి ఉచితముగా సహాయ పడతావని ఒక చీన్న ఆశ అంతే.
ఈ రోజు పనికి పోను, రేపు వెళతాను అన్నది . ఎం పార్వతమ్మ రానని కబురు పంపావు, ఇమొనమ్మా జ్వరము వచ్చినట్టుంది , మీరు పెద్దవారు చేసుకోగలరో లేదు అని మల్లి వచ్చాను.
నీ వేమన్న చిన్నదానివా మాకన్నా 6 సంవత్చరాలు చిన్న అంతేకదా అన్నది.
ఏదో కాస్త మీతొ మాట్లాడితే నామనసు కుదుట పడుతుమ్దమ్మ.
అవునే నీతొ మాట్లాడుతుంటే నాకు నీకు ఏనాటి రుణమో అని పిస్తున్నది నాకు.
అవునమ్మ మొన్న పాపర్లో ఆద్యాత్మిక విషయాల గురించి చాలా చక్కగా "రఘుపతి గోపాలం గారు" వివరిమ్చారమ్మ దానిని చదివానమ్మ. ఎం చదివావే.
ప్రతిఒక్కరికి మంచి మనసు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయటమ్మ, మంచి పనులు చేస్తారటమ్మ, వారి చుట్టూ మంచివారే స్నేహితులవతారటమ్మ. బాహ్య సౌందర్యము కన్నా అంతర్ సౌందర్యము చాలా గోప్పదటమ్మ. మన శరీరమ్లొ దేవుడు ఉంటాడమ్మ.
అవునే మనలో దేవుడు ఉంటాడే ఆదేవుడే మనల్ని ఆడిస్తూ ఉంటాడే , ఆదేవుని లీలలు మనకు అర్ధం కావే, ఇంకా చెప్పు
"శరీరము శాశ్వితమైనది కాదు, అల్లాగే ఐశ్వర్యము నిత్యమైనదికాదు, మరణమనేది నిత్యమూ వెంటాడుతూనే ఉంటుంది.
కనుక ధర్మగుణములు సంపాదించుకొని వాటి కనుగుణముగా నడుచు కోవటమే ప్రతి జీవియు చేయవలసిన పని.
ప్రతి జీవిలొ పది లక్షణాలు ఉంటాయమ్మ ధైర్యము, క్షమా, మనోనిగ్రహము, అస్తేయం, పవిత్రత ఇంద్రియనిగ్రహము, సాత్విక బుద్ది, ఆద్యాత్మిక విద్యా, సత్య భాషణము, క్రోధము వహిమ్చాకుమ్దుట అనేవి.
మనసులో కోరకలున్నయంటే పునర్ జన్మ పోమ్దవలసినదే కనుక " యిచ్ఛా, వాసన, కామన, త్రుస్తాడులను " సర్వదా పరిత్యజిమ్చాలి, సదా దేవుని ప్రార్ధనలో ఉండాలి అని వ్రాసారమ్మ.
నేను మాత్రము నేను నమ్మిన ఆ వేంకటేశ్వరుని కొలవందే బయటకు రానమ్మ అది మా నమ్మకము.
అవునే నీవు మాట్లాడు తుంటే, నేను మీ అయ్యగారు ఒక వారం రోజులు తీర్ధ యాత్రలు చేసి వస్తే బాగుండునని అనిపిస్తున్నదే.
సరేనే ఈరోజునుంచి నీకు వారం రోజులు సెలవు ఇస్తున్నాను. జీతము మాత్రము కట్చేయనులే అసలే నీ ఆరోగ్య్యము బాగోలేదు.
అట్లాగే నమ్మగారు.
జాగర్తగా వెళ్లి జాగర్తగా రండి అన్నది. ఇదుగొనమ్మ ఈ ముడుపు దేవుని హుమ్డిలో వేయండమ్మ అని, తనకు పనిచేసినందుకు ఇచ్చిన నెల జీతము కవర్లో పెట్టి ఇచ్చింది.
సరే అట్లాగే వస్తానులే అన్నది పద్మావతమ్మగారు.
మేము వచ్చేదాకా ఇల్లు మాత్రము చూస్తూ ఉండు అన్నది. అట్లాగేనమ్మ అని వేను తిరిగింది పార్వతమ్మ.
వారం రోజులు తీర్ధ యాత్రలు చేసి వచ్చారు. కాని పద్మావతి గారికి తీర్ధ యాత్రలో నీరు పడలేదు. జ్వరము వచ్చింది. ఆ జ్వరం తగ్గ కుండా టై ఫాడ్ మారింది. డాక్టర్ చెప్పారు. పద్మా వతి కొడుకులను చాడాలనిపట్టు పట్టటం వళ్ళ రమణ రావు వంటనే అమెరికాలో ఉన్న కొడుకుల్ని కోడళ్ళను పిలిపించారు.
కొడుకులు కోడళ్ళు కలసివచ్చి తల్లి తండ్రులను పలకరించారు డాక్టర్ను కలసి మంచి మందులు వాడండి మా అమ్మగారు కోలుకోవాలి. డబ్బులు గురించి ఆలోచించకండి అని చెపారు. . డాక్టర్ గారు కొడుకులతో ఈమె చాలా బలహీనతగా ఉన్నది.ఈమెకు దగ్గర ఉండి మందులు వాడాలి. గంట గంటకు జ్వరం చూడాలి. పేషంట్ వద్ద ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి తలియ పరిచాడు డాక్టర్
కొడుకులిద్దరూ "రామ లక్ష్మణులు" నాన్న మేము వచ్చి చాలా రోజులైంది అమ్మ జ్వరం తగ్గలేదు. కాని పక్ష వాతం కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెపుతున్నారు. అక్కడ ఉద్యగామునకు ఎలావు పెట్టి వచ్చాము. మేము పోకపోతే మా ఉద్యోగాలు ఇబ్బందిలో పడతా యి అసలే మేము పనిచేసేది ప్రవేట్ కమ్పెనీలు.
మీకు డబ్బులు ఏమైనా సహాయము చేయమంటే మేము చేస్తాము. మేము ఇక్కడ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటాము అన్నారు. అమ్మకు బాగోలేదు కదా ఒక పని చేయండి మీ భార్యలను ఇక్కడ ఉంచి వెళ్ళండి. అన్నాడు తండ్రి రమణ రావు.
ఏట్లా కుదురుతుంది నాన్న, మా భార్యలు లేకపోతె మాకు అక్కడ కష్టం అన్నారు ముక్త కంఠం గా. సరే మీ ఇష్టం నేను చెప్పేది చెప్పా మీరు ఆలోచించ కొండి అన్నాడు తండ్రి.
అంతలో పద్మావతమ్మకు పక్షవాతం వచ్చినట్లుగా డాక్టర్ గుర్తించారు."ఒక కాలు, ఒక చేయి, నోరు, పడి పోయింది.
పని మనిషి పార్వతమ్మ వచ్చి పద్మావతమ్మను చూసి బోరున ఏడ్చింది.
అమ్మగారు గల గల మాట్లాడే వారు. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి . అన్నాది.
డాక్టర్ రమణ రావును పిలిచి మీ శ్రీమతికి మందులు వాడాలి అవి క్రమం తప్పకుండా జరగాలి మీరు ఒక నమ్మకస్తులను ఈమె వద్ద ఉంచండి అని చెప్పారు .
మీరు ఇంటివద్ద ఈమెకు వైద్యము చేయించు కుంటా నంటే మంచి డాక్టర్ జాహ్నవి వచ్చి పరిక్ష చేసి మందులు వ్రాసి ఇస్తుంది అవి మీరు వాడండి.
కొడుకులిద్దరూ ఇంటికి తీసుకెల్దాము నాన్న పనిమనిషి పార్వతమ్మను ఉండమని చెప్పుదాము అన్నారు.
రోజులు గడుస్తున్నాయి పద్మావతమ్మకు తగ్గు ముఖం కనిపించలేదు.
భంధువులు వచ్చారు చూసి వెళ్ళారు. ఎవ్వరు ఉండి సేవ చేసే వారు కనిపించలేదు
రమణ రావు ఎంత చెప్పిన కొడుకులు కోడళ్ళు వచ్చిన దారిన వెళ్ళారు. నానా అమ్మను చూడటానికి మల్లి సెలవు పెట్టుకొని వస్తాము అన్నారు
చివరకు పర్వతమ్మే ధైర్యము చేసి నేను నాకూతురు అమ్మగారివద్ద హమేషా ఉండి మందులు వాడతాం అయ్యగారుతో అన్నది.
అయ్యగారు మనకు తోడూ ఒక పనివాడ్ని పెట్టుకుందాం బయటనుండి మందులు టి ఫెన్ క్యారేజ్ తేవటానికి ఎవరైనా కావాలి అన్నది పార్వతామ్మ.
పార్వతమ్మ ఇది నీ ఇల్లే అనుకో, నీవు డబ్బులు గురించి ఆలోచించకు అమ్మగారు బాగుపడాలి, ముందరిలా తిరగాలి ఆ మాత్రం సహాయము చేసి పెట్టు అన్నాడు రమణ రావు. నేను తిరుగుదామంటే పెద్దవాడ్ని అయ్యాను. కళ్ళజోడు ఉన్న చూడ లేక పోతున్నాను.
వెంటనే పార్వతమ్మ కూతుర్ని ఉంచి అమ్మగాఋ కొలుకొనెవిధముగా అన్ని పనులు నీవె చేయాలి మందులు ఇవ్వడం, స్నానం చేయిన్చటమ్ , చీర మార్చటం ఒక రోగికి చేయ వలసిన పనులన్నినీవె చేయల్లై అని చెప్పింది. తల్లి చెప్పినట్లు ప్రోద్దునా సాయంత్రము దగ్గర ఉండి సేవ చేస్తున్నది. జ్యోతి
ఉదయం పూట సాయంత్రము పూట ఫిజియో తెరఫి చేయిస్తున్నారు జ్యోతి ఎప్పటికపుడు ఫైల్ మీద గంట గంటకు మారిన బి. పి.
చూస్తున్నది. అవసరమైనప్పుడు ఇంజక్ష న్ ఇస్తున్నది. మంచి ఖరీదైన మందులు వాడుతున్నాది. వారం రోజులు తిరక్కముందే మెల్ల మెల్లగా పద్మావతమ్మకు గుణం కనపడింది.
కాస్త కాస్త మాట లోచ్చాయి. ప్రతి విషయాన్ని శ్రద్దగా దగ్గరుండి జ్యోతి చూసు కుంటున్నది.
అపుడే రెగ్యలర్ చెకప్ చేసే డాక్టర్ద జాహ్నవి వచ్చి అమ్మగారి పరిస్తితి చూసి చాలా ఆశ్చర్య పడింది. వారంలో ఇంత మార్పా ఏమిటి విశేషము ఆని ఫైల్ లో ఉన్న షీట్ చూసి మందులు ఎలావాడిందో అన్ని వివరముగా వ్రాసి ఉన్నది.
తను వ్రాసినమందులు కాకుండా ప్రత్చేకమైన మందులు వాడింది.
రమణ రావు గారిని డాక్టర్ జాహ్నవి పిలిచి అమ్మగారు 90% శాతము కోలుకున్నట్ట్లే. వీరికి సేవ చేసినవారు ఎవరో బాగుగా చదువుకున్న వారు. మామూలు వారు కాదు ఎవరో చెప్పండి. మా పని మనిషి కూతురు జ్యోతి సేవలు చేసింది. అదిగో ఆ లోపల ఉన్న ఆవిడ అన్నాడు.
వెంటనే ఆమెను చూసి తనకు గుర్తుకొచ్చింది. ఎం డి. గోల్డ్ మెడల్ సంపాదించి, రాష్ట్ర పతి ద్వారా ప్రశంసా పత్రము పొందిన వారిలో మన ఆంద్ర ప్రదేశ్ నుండి ఎన్ని కైన ఎకేక వ్యక్తి డాక్టర్ జ్యోతి. ఆమె ఈమె అని నిర్ధారించు కున్నది. ఆప్పుడు మాట్లాడిన మాటలు కూడా నాకు ఇంకా గుర్తు కోస్తున్నాయి.
చాలామంది ఇతర దేశాలకు పొయి చదవమని కోరారు. ఆమె ఒకటే మాట చెప్పింది.
నేను నాదేశానికి రుణ పడి ఉన్నాను. నాదేశ ప్రజలకు ఉచిత సేవ చాయాలన్నాదే నా లక్ష్యం
డాక్టర్ జ్యోతి గారు అని పిలిచింది జాహ్నవి
అంతలో పార్వతమ్మ అక్కడకొచ్చి అమ్మయి పిలుస్తుంటే పలుకవే అన్నాది.
నమస్తే డాక్టర్ గారు మీరు అనుకున్న డాక్టర్ నేనే, కాని రమణ రావు గారికి కూడా తెలీదు నేను డాక్టరని
నీవు ఎం డి చదివి ఇంత సింపుల్గా ఉన్నావంటే నాకే ఆశ్చర్య మేస్తుమ్ది.
డాక్టర్ గారు అన్ని విషయాలు మీకు తెలియ పరుస్తాను, నేను చేయాల్సిన పనిని చెయనీ యండి, అమ్మగారు కోలుకోనివ్వండి.
ఈ విషయము మన ఇద్దరి మద్య మాత్రమె ఉమ్చండి అన్నది. ఈ మందుల వళ్ళ అమ్మగారుకోలుకున్నారు. ఇవే వాడితే రెండురోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అన్నది జ్యోతి
గాలిలో ఎగిరే పక్షిని తీసుకొ చ్చి బోనులో పెట్టితే ఎలా గిల గిల కొట్టు కుంటు, దాని స్వేచ్చకు అడ్డు తగిలిందని భాద పడుతుంది. అదే విధముగా మన శరీరములొ కొన్ని సూక్ష్మ జీవులు ప్రవేసించి మనిషిని వెదిస్తాయి దానికి తగ్గ మందు పడితే అవి మరణిస్తాయి.
రక్తం సవ్యముగా ప్రవహిస్తా, గాలిద్వారా జీవి ఆరోగ్యవంతుడుగా మారుతాడు, బలమైన ఆహారము తీసుకొని స్వేచ్చగా తిరిగే పక్షి లాగా జీవించాలని అనుకుంటుంది. మనసు. పద్మావతమ్మ కోలుకొని చిన్నగా వంట చేయటం మొదలు పెట్టింది. కాలు చేతులుకోద్దిగా కదిలిస్తుంది. మాట కూడా వచ్చింది. తన పని తను చేసుకోగలుగుతుంది.
అమ్మగారు మందులు వేసుకోండి, మందులు మానకండి అన్నది. నాకు వేరే పనుంది నేను ఇక ఇక్కడకు రావటముకుదరదు అన్నది.
అట్లా అనకూడదు డాక్టర్ జ్యోతి గారు, ఏమ్మిటమ్మగారు మీరనెది, నేను అంతా విన్నానే నాకోసం నీవు ఇంత కష్ట పడ్డావు. నీ వృత్తిని కూడా ప్రక్కన పెట్టి ఒక పని మనిషిలా డాక్టర్లా నాకు ఎంతో సేవలు చేసావు.
అవునే నీవు పూర్తిగ కొలు కోవాటానికి పార్వతమ్మ, దాని కూతురు జ్యోతి మరియు ఈ పిల్లవాడు ఎంతో కష్ట పడ్డారు అన్నాడు రమణ రావు.
అవునండి నేను " సుందరాకాండలో " చదివాను " కృతే చ ప్రతి కర్తవ్య మేష ధర్మ సనాతన:"
ఎవర్రైనా ఉపకారము చేసినపుడు వారికి ప్రత్యుపకారము చేయవలెను ఇది అతి ప్రాచీన ధర్మము అన్నది పద్మావతమ్మ.
మన కన్న బిడ్డలు ఉండి కూడా సేవలు చేయకుండా వెళ్లి పోయారు. ఈ వారము నీవు పూర్తిగా మామూలు మనిషిగా మారాక మనము వీరికి ఏదైనా సహాయము చేద్దాము. అన్నాడు. భర్త రమణా రావు ..
భర్త వడిలో చేరి నేను మరల బ్రతుకుతాననుకోలేదు. నాకు ఆ సమయములో చాలా భయమేసింది బిడ్డలు నాకు సమయము లేదని వెళ్ళినప్పుడు నా బ్రతుకు బిడ్డలు లేనివారితో సమానమని భాధపడి నాను. కాని పార్వతమ్మ కూతురు జ్య్యోతి చాలా ఓపిక కల స్త్రీ ఎందు కంటే ఒక పనిమనిషి కూతురు అని తక్కువచేసి మాట్లాడాను. నోటికి వచ్చినట్లు తిట్టాను చిదరిమ్చుకున్నాను. ఏమి అనకుండా తనపని తను చేసుకుంటూ ఉండేది. పల్లెత్తి మాటనలేదు.
మిమ్మల్ని సంప్రదించి ఆమెకు మనమేమైనా సహాయము చేయాలి అన్నది. మనకు చాల ఆస్తి ఉన్నది కదా
రమణ రావు అన్నాడు మనకు కూతురు లేని లోటు తీర్చిమ్ది. జ్యోతినే మన సొంత కూతురను కుందాం.
దాం కాదండి.
నేనొక నిర్ణయానికి వచ్చాను.
ఈ ఇంటి క్రింద పోషణ్ మొత్తము ఒక నర్సింగ్ హొమ్గా మార్చి దానికి పూర్తి భాద్యతలు జ్యోతికి వ్రాసి ఇద్దామని అనిపిస్తుంది.
మన కుమారులను అడగాలి కదా అన్నాడు భర్త.
దీనిలొ అడిగేదేముంది ఇది మన కష్టార్జితం మనం ఇష్టం వచ్చినవారికి దానం చెయ్యవచ్చు అన్నది.
జ్యోతి వివాహము చేసుకోలేదు, చేసుకొని వెళ్ళిపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వ్యర్ధం అవుతుంది అన్నాడు భర్త.
దానికి నేను ఆలోచించాను. నా తమ్ముడు ఫారంలో డాక్టర్ చదువుకొని ఇక్కడకు వస్తున్నాడు. ఆతను పెళ్లి చేసు కుంటా నంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు భర్త.
అనుకోని విధముగా తమ్ముడు "ప్రకాష్ " " జ్యోతి "ని ఇష్టపడటం, జ్యోతి కుడా వప్పుకోవడం, పార్వతి సంతోష పడటం అంతా క్షణాల్లో జరిగి పోయింది.
క్రింద పోషణ్ మొత్తం పద్మావతి నర్సింగ్ హొమ్ గా మార్చారు (ఇక్కడ వైద్యము పూర్తిగా ఉచితం)
డాక్టర్ జ్యోతి ప్రకాష్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి