అస్త మించు చున్న ఎర్రటి సూర్యుడు కొండ వెనుకకు జారు కుంటున్నాడు. గూటికి చేరే పక్షులు వస్తున్నాయి, పొలాలకు పోయిన పల్లె పడుచులు తిరిగి వస్తున్నారు, కొందరు రోడ్డు మీద పొగను పీలుస్తూ ఇంటికి బయలు దేరుతున్నారు., వెలిగి వెలగని వెలుతురులో వేగముతో నడుపుతున్న వాహనాల మద్య మానవుల ప్రయాణము కడు కష్ట తరమైనది. వ్యాపార నిమిత్తము వాహనాలు పెంచుతున్నారు. రోడ్లు విస్తరణలు చేయుటలేదు. పార్కులు చెరువులు కనుచూపులొ లేకుండా చేస్తున్నారు, దీనికి భాద్యు లెవరు "ప్రజలా " - "ప్రభుత్వమా " అని నాకు ప్రశ్నగ మిగిలి పోయింది.
రిటైరైన సీతాపతి గారు ప్రతిరోజు సాయంత్రం సమయాన పార్కుకు వెల్ల అలవాటు, రోజులాగా ఈ రోజు కూడా గొడుగు చేత పట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, నెమ్మదిగా పార్కుకు చేరుకున్నాడు.అంతలోనే నిండా 12 సం.. కూడా నిండని బాలుడు స్కూటర్ నడుపుతూ
సీతాపతిగారికి తగల కుండా తప్పించ బో యి ప్రక్కన్నున్న గోడకు తగిలి క్రింద పడ్డాడు, చిన్న దెబ్బలు తగిలినాయి. సీతాపతి ఆ అబ్బాయిని లేపి స్కూటర్ తాళం లాక్కొని పెద్దవాళ్ళను రమ్మనమని అబ్బాయిని, ఒక మనిషిని తోడు ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి ద గ్గరలొ ఉన్న అసుపత్రిలొ కట్టు కట్టించి, వాళ్ళ ఇంటిలో దిగాబెట్టిరా బాబు అన్నాడు సీతాపతి.
పార్కులో కాపలా కాయు వానికి స్కూటర్ తాళం ఇచ్చి స్కూటర్ సంభందించిన వాల్లు వస్తే ఇచ్చేయమని చెప్పాడు. " చిన్న పిల్లవాడు నడపమని ప్రోచ్చహించిన తల్లి తండ్రులది తప్ప లేదా ప్రభుత్వ వారు పిల్లలు నడిపితే చూసి చూడ కుండ ఉండే పొలీసువారిది తప్ప". ఏది ఏమైనా చిన్న పిల్లవాని ప్రాణాలు రక్ష్మిచటం అందరి భాద్యత అని అన్నాడు కాపలావానితో సీతాపతి.
నెమ్మదిగా పార్క్లోలోకి ప్రవేశించాడు, ఎప్పుడూ కూర్చొనె అరుగును చేరాడు, అక్కడ ఉన్న కొందరి మనుష్యుల మాటలు, చూపులు, ఆశలు రెకెత్తిస్తున్నాయి. చిన్న వయసులో మీసాలు కూడా రానివారు ప్రేమికులవు తున్నారు. ఇదేమి కాలమో అనుకున్నాడు. అప్పుడే పల్లీలు అమ్మేవాడు వచ్చి ప్యా కేట్ట్టు ఇస్తూ ఇది కలియుగం సార్ అన్నాడు.
చిరుజల్లు పడటం మొదలైంది చేతిలో ఉన్న, మొనంగా ఉన్న, మూగ రెక్కల పక్షి ఒక్కసారి విచ్చుకుంది. జల్లుకు చెట్టు చాటున చేరారు కొందరు, కొందరు బయటకు పరుగెత్తారు కొందరు. పార్కు అంతా కల కల లాడేది ఒక్కసారి ప్రసాంతముగా మౌనముద్ర వేసినట్లుగా మారింది. అడుగులో అడుగు వేసుకుంటూ గొడుగు చేతపట్టి జారుతున్న చెప్పులతో నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరాడు సీతాపతి
ఏమిటండి పార్కుకు పొయి ఇంత ఆలస్యము. నాకెంతో భయమేసింది. నాకు అన్ని పిచ్చి పిచ్చి అలోచనలు వస్తున్నాయి, మీకొసమ్ కళ్ళలో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నాను. అసలే వర్షము ఒకవైపు అన్నది.
నన్ను ఎమన్నా మాట్లాడ నిస్తావా అన్నాడు సీతాపతి, అయ్యో నామతి మండ మీకొసమ్ చెంబుతో నీల్లు తెచ్చి రడీగా ఉంచాను. కాళ్ళు కడుక్కొని లోపలకు రండి. నిదానంగా మాట్లాడుకుందాం.
ఇపుడన్నావు బాగుంది, లోపలకు " పా " నేను ఇప్పుడే వస్తాను.
ఎమీలేదె అసలే వర్షము, అందులో నా చెప్పులు జారుతున్నయి, అవి ఎక్కడే తెగుతాయో నని నెమ్మదిగా వచ్చాను, మరొవైపు ఈ గొడుగు చూడు గాలిలో పైకి లేస్తుంది, అందుకే ఆలస్యము.
ఏమిటే అట్లాగున్నావు, నాగురించి నీవు ఇంకా ఆలోచిస్తున్నావా, ఈ ముసలోడు రాగలడా లేదా అని, ఏమిలేదండి ఈ వయస్సులో పార్కులు వెంబడి తిరుగుట ఎందు కండి, మీరు ఏదైనా పురాణము చదువు కుంటూ హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని, ఆలోచిస్తున్నాను అంది.
కాదె నీ మనసు నాకు తెలుసు, నువ్వేమి ఆలోచిస్తున్నావో ఉన్నది ఉన్నట్లు చెప్పు, అభద్దాలు చెప్పకు నీ కలల్లో కొట్టచ్చి నట్లు కనబడుతుంది అన్నాడు సీతాపతి.
ఎమీ లేదండి ఇంట్లో ఉండి తోచక అమ్మాయికి, అబ్బాయికి ఫోన్ చేసాను. పండుగకు మేము మీదగ్గరకు వద్దా మను కుంటున్నాము అని అన్నాను.
ఇంకే అమ్మ మీరు రాకండి మేమే వస్తాము అని ఉంటారు.
అట్లా అంటే బాగుండే దండి , మరేమన్నారే,
మనబ్బా యి క్యాంపుకు వేలుతున్నాడుట, మరి ఇంకే కోడలిని పిల్లలను పంపిస్తాననంటాడు.
మీరు రావద్దు, వారురారు, పిల్లల చదువులు పోతాయి అన్నారు.
మరి అమ్మాయి ఏమంది.
మీరు వచ్చిన ఇంటికి రాకండి, స్టేషన్ ప్రక్కన హోటల్లో ఉండి ప్రొద్దున్నే రమ్మన్నది. ఎందు కంటే వాల్ల ఇంట్లో దోమలున్నాయట.
అన్నది.
చూడు సీతా పిల్లలను కని పెంచి ఉద్యోగమం కల్పిమ్చే వరకె మన భాద్యత. వాళ్ళ మీద పిచ్చి ప్రేమ పెంచుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇట్లా మాట్లాతూనె ఉంటావా నాకు ఏమైనా కాఫీ ఇస్తావా, అయ్యో నామతి మండ కాఫీ ఇప్పుడే తెస్తాను ఉండండి అన్నది సీత .
తాతయ్య కుర్చీలో కూర్చుమ్టు కళ్ళజోడు కోసం వెతుకు తున్నాడు, ఇదిగో శ్రీమతి " సీత " గారు నా కళ్ళజోడు ఎక్కడయినా చూసావా, బాబు మనోజ్ నాకల్ల జోడు ఎక్కడైనా చూసావా. అని అడిగాడు.
మనవుడు మనోజ్ వస్తూనె ఇదిగో తాతయ్య కళ్ళజోడు, ఏదిరా నాకల్ల జోడు అని మల్ల అడిగాడు. ఇదిగో చూడు తాతయ్య ఎక్కడుందో మీకె తెలుస్తుంది అంటు అద్దం చూపిమ్చాడు, నా తలమీద ఉందని చెప్పొచ్చుగా మరీ అద్దం తెచ్చి చూపిమ్చావు.
నేను చెప్పినా నీవు నమ్మవుగా తాతయ్య , మానవుడా నీతెలివికి నేను మెచ్చుకున్నాను ఏదైనా ప్రశ్న అడుగు సమాధానము చెపుతాను అన్నడు తాతయ్య.
నేను పెద్ద ప్రశ్న అడగలేను, మీరు ఎంతవరకు చదువుకున్నారు అన్నాడు. ఏమిటిరా మీ తాతయ్యను పట్టుకొని అలా అడుగుతున్నావు అన్నది అమ్మొమ్మ.
ఉండు సీతా, ఇదిగో మానవుడా ఇది కప్పు కదా దీని తిరగేసి ఉంచా, దీనిని బట్టి నేను చదివినది నీకు తెలియపరిచా అర్ధం చేసుకో అన్నాడు తాతయ్య.
అమ్మొమ్మ తాతయ్య చదువుగురించి అడిగితె కప్పు తిరగేసి ఉంచా అన్నాడు నాకేం అర్ధం కాలేదు.
నీవు పలకమీద కప్ స్పెల్లీగ్ వ్రాయి నీకె తెలుస్తుంది. ఆ వ్రాసాను ఆ అక్షరాలను వెనుకనుంచి ముందుకు వ్రాయి CUP - PUC
ఆ తెలిసింది PUC చదివాడు తాతయ్య అన్నాడు.
నాన్న కన్నా ఎక్కువ చదివాడా అమ్మొమ్మ, నీవు పెద్దయ్యాకా తెలుసు అన్ని తెలుసు కుందువుగాని ముందు చదువుకో అన్నది.
సరే అమ్మొమ్మ నీ మాట తాతయ్యమాట విని బాగా చదువుకుంటాను అని లోపలకు వెళ్ళాడు మనోజ్.
ఇదిగో నాకు కొంత ఫీవరి ష్ గా ఉంది ఈరొజు మీరు కాస్త కాఫీ పెట్ట కూడదు. "ఇష్ "లేదు ఫీవర్ గా ఉందని చెప్పొచ్చుగా అన్నడు.
మీ అంత తెలివుంటే మిమ్మల్నేమ్దుకు పెల్లిచేసు కుంటా, ఎ లక్షాదిఖారిని చేసుకోనేదాన్ని.
ఆ ఏమన్నావు 'ఆ లేదు ఊ లేదు ' ముందు కాఫీ పెట్టండి. అన్నది.
నెమ్మదిగా కాఫీ త్రాగుతూ ఇదిగో ఈ రుమాళ్ళు ఎలా వున్నాయి, చాలా బాగున్నాయి, ఎండాకాలం బాగా పనికొస్తా యి. ఎంత పెట్టి కొన్నావు
కొనలేదండి ఇవి ఉచితముగా ఇచ్చారు. ఎవరే అంత పుణ్యాత్ములు.
మీకు చెప్పలేదు కదా మొన్న షాపుకు వెళ్ళినప్పుడు మంచి జరీ ఛీర బాగుంది అది వెంటనే కొన్నానండి.
ఏమ్తపెట్టికోన్నావు, డబ్బులు ఎక్కడివి అని అడిగాడు సీతాపతి.
మీరిచ్చినవే మొన్న చీర కొనుక్కోమని ఇచ్చారు, అప్పుడు కొనలేదు ఇప్పుడు కొన్నాను అంతే
సరే ఎంత 15 వేలు మాత్రమె. దానికి ఉచితము రుమాళ్ళు, బాగున్నాయి కదండి చీర రుమా ళ్ళు
చాలా బాగున్నా యి, ఆ చీర ఇప్పుడు అవసరమా.
మీ సరదా తీర్చెమ్దుకు ఇప్పుడు కాక మరెప్పుడు కట్టుకోవాలి, పిల్లలు పిల్లలు అంటు ఒక్క మంచి చీర కట్టనిమ్చారా మీరు ఒక్క సారి గుమ్దెమీద చేయి వేసి చెప్పండి.
నిజమేనే " సీతా " నేను అంత ఆలోచించాలా ఇప్పుడు నీసుఖమ్ నాకు, నా సుఖం నీకు
కదా మరి , రేపు మంచిరోజు అమ్మవారికి పెట్టుకొని కట్టుకుంటా, ఇవి మీకు తెలుపు లాల్చి ఫిజమా బాగున్నయె ఇవికూడా అమ్మవారివద్దపెట్టు రేపు ఇద్దరం కట్టుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి కేల్లోద్దాము , మరి మనవుడికి తేలేదా. ఎందుకు తేలేదు ఇవి చూడండి మంచి డ్రస్స్ చాలా బాగున్నాయే.
సరే నేను అట్లా రోడ్డుదాక పోయోస్తాను అంటు ఏమైనా కూరతెమ్మమ్తె తెస్తాను, లావు పాటి ఓంకాయలు ఉంటే తెండి, నూనెలొ మగ్గపెట్టి కాయ కాయ చేసుకుందా, సరే అట్లాగే అంటు బయలుదెరాడు సీతాపతి.
కూరల సమ్చీతొ తిరిగివచ్చాడు, కూరల ధరలు చూస్తుమ్టే కల్లుతిరిగాయరా మనవడా అన్నాడు సీతాపాతి
తాతయ్య ఇదిగో కాసిని మజ్జిగ త్రాగండి అంటు మనవుడు తీసుకొనివచ్చి ఇచ్చాడు. అమ్మొమ్మ ఇంట్లో లేదు తాతయ్య . ఎదురింటిలో ఏదో పారంటమట వెళ్ళింది.
తాతయ్య నాకు ఒక డౌట్ వచ్చింది దానిని నీవు తీర్చాలి అన్నాడు. సరే చెప్పు నే తీరుస్తాను. అన్నాడు
పాలప్యాకేట్టుకు చిల్లు పడితే లీకవు తుంది నిజముకదా, ఆ లీకును పూడ్చవచ్చు కదా తాతయ్య ఖచ్చితంగా
సైకిల్ ట్యూ బుకు పంచరు పడి గాలి పోయింది, ట్యూ బుకు పంచరు పూడ్చి గాలికోట్టేతే గట్టిగా ఉంటుంది కదా
అసలు ఏమి చేపుతామనుకున్నవురా అన్నాడు మనవుడుతో తాతయ్య.
ఏమిలేదు తాతయ్య ఈ మంచు గడ్డ లీకవు తుంది, ఇది ఎట్లా పూడ్చాలొ నాకు తెలియుటలేదు చేప్పు తాత్తయ్య
అది నీల్లతో తయారైంది అది కారుతూనే ఉంటుంది, అట్లా కాదు తాతయ్య కారకుండా ఎట్లా పూడ్చాలి నాకు చెప్పు అన్నాడు.
తాతయ్య ఒక్క నిముషము ఆలోచించాడు. సమాధానం కోసం
ఎమిటి తాతా -,మనవుడు ఏదో ప్రశ్నకు జావాబు కోసం ఎదురుచూస్తున్నారు అన్నది సీతా
మంచు గడ్డ లీకు అవుతుందట, లీకు కాకుండా చేయ మంటున్నాడు మనవుడు, అన్నాడు సీతాపతి.
దానికి ఇంత సేపు ఆలోచించాలి ఉండండి నేను సమాధానము చెపుతాను అన్నది.
వడబోసే ఛిల్లుల గిన్నె తెచ్చి దానిలో మంచు ముక్క ఉంచారు చిల్లుల నుండి నీరు కారుతుంది చూసావా మనోజ్ లికవుతుమ్ది మనోజ్ అవును అమ్మొమ్మ
మంచు గడ్డ బయటకు తీయి మన్నది, దానిని తిసిన్ తర్వాత చిల్లులగిన్నే అడుగుణ ఉప్పు పోసి మంచు గడ్డ పెట్టమన్నది.
ఇప్పుడు చూడు మనోజ్ మంచుగడ్డ లీకవుతున్నదా,, లేదమ్మోమ్మ ఇప్పుడు నీ సందేహము పోయిందా, పోయింది అమ్మొమ్మ తాతయ్య నేను చదువు కోటానికి వేల్తున్నాను అన్నాడు.
సమయానికి నీవొచ్చావు అమ్మో ఇప్పటి పిల్లవాల్లకు చాల తెలివి ఉన్నది అన్నాడు
మీరొచ్చె ముందే అమ్మాయి, అబ్బాయి దగ్గరనుండి ఫోన్ వచ్చింది.
ఎం చెప్పారు పిల్లలు మీరు పిలిచారుగదా పండుగకు అక్కడుకు వద్దమను కుంటున్నాము, "అమ్మ" అల్లుడు స్కూ టర్ కొమ్దామను కుంటున్నారు కొంత డబ్బులు సర్దమన్నారు, నీ పుత్ర రత్నం ఏమడి గాడు వాడు ఇల్లు కొంటున్నాడట దానికి కొంత డబ్బు సర్ద మన్నాడు.
మరి నీవేమి చెప్పావు, మిమ్మల్ని కనుక్కొని చెపుతాను అన్నాను.
ఇదిగో నీకు eన్నో సార్లు చెప్పను, పిల్లల మీద ప్రేమతో నన్ను ఇరకాటంలో పడవేయకు, నా దగ్గర ఉన్నదంతా ఇద్దరికీ ఇచ్చాను. ఇక నాదగ్గర ఏముంది వాల్లకివ్వటానికి.
మనకు రోగమో, రోppo వస్తే మందులు కోసం దాచు కున్న డబ్బు ఇచ్చి నాకు రోగంగా ఉందిరా బిడ్డ డాక్టr చూపిస్తావుర అని ఆడు క్కో వాలి, నాకు అటువంటి పరిస్తితి తేకు నేను చెప్పినట్లు పిల్లలు చెప్పు అన్నాడు సీతాపతి.
మీ నాన్నగారు మీ చదువుకి పెళ్ళికి చేసిన అప్పు ఇంకా ఉంది అది మీరిద్దరు కలసి తీరుస్తా నంటే అప్పు ఎంత ఉందో మీకు చెపుతాను మీరిద్దరు ఆలోచించుకొని ఫోన్ చేయమని చెప్పు అన్నాడు.
ఆమాటలే చెప్పింది.
అమ్మ మీరు చేసిన అప్పు నిదానంగా తీర్చు కొండి మాకేం సంభందం అన్నారు ఇద్దరు.
అప్పు తీరెదాక నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను అని చేప్పు అన్నాడు సీతాపతి నిర్మొహమాటంగా పిల్లలతో
పండగకు వస్తే రమ్మనమను పిల్లలకు బట్టలు పెడతాను అనిమాత్రము చెప్పు అన్నాడు సీతాపతి.
అమాటలు విన్న కొడుకు కూతురు ఏదోలాగా మేమే ఏర్పాటు చేసుకుంటాము, మేము అడిగామని ఏమనుకోవద్దు
పండగకు మేము వచ్చేటట్టయితే మీకు ఫోన్ చేస్తాం అన్నారు ఇద్దరు.
చూడు పిల్లల మనస్తత్వం తెలుసుకున్నవు గదా, తెలుసుకున్నాను అన్నది
పిల్లలకు శక్తికిమిమ్చిన సంభందాలు చేసాము, వాళ్ళకోసం మన కోర్కలను కూడా త్యాగం చేసాము అది పిల్లలకు కూడా తెలుసు కాని వారి మాటలు విన్నావు కదా అన్నాడు సీతపతి.
మనవుడు వచ్చి తాతయ్య, అమ్మొమ్మ+ మిమ్మల్ని జాగర్తగా నెనుచూసు కుంటాను అన్నాడు
అమాటలన్నావు మాకు చాల సంతోషముగా ఉన్నది. అన్నారు.
తాతయ్య బయట పుష్పవర్షం కురుస్స్తుమ్ది గొడుగు వేసుకొని అలా బయటకు పోదామా ,
ఇదిగో నీవు కూడా రా ఇది పెద్ద వర్షము కాదులే అల తిరిగొద్దాం పార్కుదాక
మా తాతయ్య చాలా మంచివాడు నన్ను కూడా పార్కుకు తీసికెల్తున్నాడు, అని ఎగిరి గంతేశాడు, వాడి చేష్టలు చూసి ఒక్కటే నవ్వులే నవ్వులు .
పార్కులో చెట్టు క్రింద కూర్చొని ఒక బైరాగి ఈ పాట పాడు కుంటున్నాడు
సద్గునాలున్న బుద్ధిజీవులున్నరు ఈ లొకంలో
పుణ్యం చేసే పున్యాత్ములున్నారు ఈ లొకంలో
విద్యాధికులైనధర్మపరులున్నారు ఈ లొకంలో
ఐశ్వర్యమద మార్తాండులున్నారు ఈ లొకంలో
సదాశివ నీమాయను నేనెరుగను ఈ లొకంలో
చంద్రుడు లోకాల పాపాలను సశింప చేస్తున్నాడు
చంద్రుడు లోక ప్రాణులను ప్రకాశింప చేస్తున్నాడు . .
చంద్రుడుసముద్రాన్నిఉప్పొంగునట్లు చేస్తున్నాడు
చంద్రుడుపండువెన్నెలసుఖాన్ని అందిస్తున్నాడు
సదాశివ నీమాయను నేనెరుగను ఈ లొకంలో
వరి నారు పండిమ్చు టే కాని తిన లేవని తెలిసి చెమటోర్చి పండిన పంటను అప్పలువాళ్లకు పోసి
ఉత్చాహ శూన్యుడవు కాకు పరిస్తితులను చూసి
ద:ఖాక్రాంతుడవుకాకు పిల్లల స్థితిగతులనుచూసి
సదాశివ నీమాయను నేనెరుగను ఈ లొకంలో
భంధము కాళ్ళకు, చేతులకు గాని మనసుకు కాదు
పరువం వయస్సులో వయస్సు ఉడికి నప్పుడు కాదు
సంతోషంతో మనస్సునుప్రకాశింపచెయి కోపంతోకాదు
తేజోవంతమైన ముఖంతో కాలంగడుపు ద:ఖంతో కాదు
సదాశివ నీమాయను నేనెరుగను ఈ లొకంలో
సీతాపతి ఆ పాట పాడుచున్న బైరాగికి తన దగ్గరున్న పండ్లను కొంత డబ్బులు ఇచ్చాడు. మాకు డబ్బులతో పనిలేదు ఈరొజు ఆహారముగా పండ్లు ఇచ్చారు అవిచాలు మాకు డబ్బులతో పనిలేదు అన్నాడు. అవి తిసేసు కొండి. ఆ డబ్బులతో తిండి లేనివారికి భోజనము పెట్టండి అన్నాడు.
దగ్గరకు పొయి ముగ్గురు దండము పెట్టి ఆశిర్వాదము తీసుకున్నారు.
తాతయ్య ఆ పాట నాకేం అర్ధంకాలేదు, పెద్ద అయ్యాక అర్ధం అవుతుంది మనం బయలుదేరుదామా అన్నాడు సీతాపతి భార్య సీతతొ
ఈ బైరాగి ధర్మాత్ముడు లాగున్నాడండి. ఇల్లంటి వారున్నారు కాబాటే ఈ లోకం ఇలా వుంది .
.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి