ఓటరు ధర్మం - ఓటు వేయటం
పంతులుగారు బాగున్నరా అంటు వరండాలో కుర్చీలొ కూర్చున్న రామకృష్ణ పంతుల్ని సుబ్బారావు పలకరించారు.
బాగున్నావా సుబ్బారావు, ఇటురా ఈ కుర్చీలో కూర్చొ కాసేపు మాట్లాడుకుందాం . మరి ఎలక్షన్ ఒచ్చాయి ఓటు ఎవరికి వేస్తున్నావు అని అడిగారు పంతులుగారు.
అందరు తెలిసిన వారె, అందులో ఒకే కుటుంబము వారు వివిధ పార్టిలలో నిలబడ్డారు ఎవరికి ఒటెయ్యాలో నాకు అర్ధం కావటం లేదు. అమ్దరూ నాకు కావలసినవారు. ఎవరికీ వెయ్యాలో మీరె చెప్పండి.
చూడు సుబ్బారావు పచ్చని చేట్టు నీడ అందరికి పంచుతుంది, ఆచెట్టు పై అనేక పక్షులు నివసిస్తూ ఉంటాయి., అవి సాస్వితముగా ఆ చెట్టు పై ఉండలేవు, జలాశయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్లి పోతాయి, అట్లే నీడకు కూర్చున్నవారు కొద్ది సేపటికి మల్లి గమ్యానికి బయలు దేరటానికి మెదలు పెడతారు ఇదే లోక ధర్మం
పంతులుగారు దీనికి ఓట్లకు సంభందం ఏమిటి..
అక్కడకే ఒస్తున్న పచ్చని చెట్టు అనేది పదవి పక్షులు పోటిచేసేవారు. అందరు పదవి ఎక్కలేరుకదా ఎవరో ఒక్కరే ఎక్కగలుగుతారు, అంటే నీవు నేను ఓటు వెసి గెలిపించాలి మనకు నచ్చినవారికి, మనల్ని గుర్తిమ్చుకోనేవారికి, మనకు కావలసిన పనులు చేసేవారికి ఓటు వేయాలి.
అలాగే చెట్టు నీడ కూర్చొని వెళ్లి పోతాము అంటే మనం ఓటు వేసిన తర్వాత మన పనుల్లో మనం మునిగి పోతాము, కనీసము మనం ఓటు వేసి గెలిపిమ్చిన నాయకుడ్ని నా పని చేసి పెట్టమని నిలదీయలేము, మన అవసరాలకు వారికి ఉపయోగించలేము, గెలిచినవారు మాకేం చేయలేదని నలుగురికి చెప్పుకుంటాము.
అందు కనే సుబ్బారావు ఓటు వేసేటప్పుడు ఒక్క సారి ఆలోచించి వేయాలి అన్నాడు
ఏమో పంతులుగారు ఎవరికి ఓటు వేయాలో మేరే చేప్పండి .
ఓటరులారా ఓటు వేయండి, నీకు నచ్చిన వ్య క్తి, నిజాయితీగా ఉండే వ్యక్తి, అమ్దరికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరని ముందు నిర్దారిమ్చు కొండి. వారు జాతీయ పార్టికి చెందినవారా, రాష్ట్ర పార్టికి చెందిన వారా, లేక ఇండి పెండెంటు గా పొటి చేసేవారా గుర్తించి మీరు వారికి ఎగుర్తూ కేటా ఇమ్చారో ఆగుర్తు పై ముద్రవేయండి. లేదా ఓటర్ మిషన్ బుట్టేన్ నొక్కండి. ప్ల్గున్నవారిలో ఎవ్వరూ నచ్చక పొయినట్లేతే వేరే బటన్ ఉన్నది దానిని నొక్కండి. లేదా దానిపై ముద్రించండి .
ఎం పంతులుగారు ఈ సారి మాకు పాల్గున్నవారు ఎవ్వరు ఇష్టం లేదు అంటే వేరే బటన్ నొక్కాలా , అవును సుబ్బా రావు
ఆ చేప్పండి పంతులుగారు
ఓటు వేయటం ప్రాధమిక హక్కు, మనం అరోగ్యం కోసం అన్నం ఎట్లా తిమ్టామో, దేశ సౌభాగ్యం కోసం మీరు వేసే ఓటు విలువ ఎక్కువ.
ఎలక్షన్లో నిలబడ్డ వ్యక్తులు మీ ఇంటికి వచ్చి మరీ, మీరు మాకే ఓటు వేయండి అని అడుగుతారు. నేనొక రాజకీయ వాదిగా, అధికార పార్టి అభ్యర్ధిగా, లేదా ప్రామ్తీయ పార్టి అభ్యర్ధిగా మరియు స్వతంత్ర పార్టి అభ్యర్ధిగా పొటి చేస్తున్నాను, చేతులు ఎత్తి మీకాళ్ళకు దండం పెట్ట్టుతున్నాను, మీ ఆశీర్వాదమ్ మాకివ్వ్మడి, మాగుర్తుపై మీ ఓటు ముద్రలు వేయండి, మా పదవికి మీరు వేసే ఓటే మాకు పునాదిరాళ్ళు , మా పార్టి వారు చేస్తామన్న ప్రతి పని పూర్తి చేస్తాము అన్నవారిని మీరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి వోటు వేయండి.
వారు పెట్టిన వాహనాలు ఉపయోగిమ్చు కోకండి. ప్రభుత్వమువారు ఏర్పాటు చేసిన ఓటు వేసే గదిలో వెళ్ళగానే మీ ఓటు కు సంభందించిన కార్డు చూపి మీ ఓటు ఉపయోగిమ్చు కొండి, ఓటు వేసేవారు ముందే వెల్లి లైన్లో నుంచొని ఓటు వెయ్యండి, నా ఓటు ఎవ్వరో వేసారు అన్న ఎవరు ఏమిచేయలేరు, ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నాదా లేదా అని ముందే చూడండి లేకపోతె ఎలక్షన్ కమీషనర్ ఏర్పాటు చేసే చోటే మీ పేర్లు నమోదు చెఇమ్చుకొండి. ఓటింగ్ రోజు వచ్చి నావోటు లేదు అని గొడవ పెట్టుకున్న ఫలితము ఉండదు .
అవును పంతులుగారు మీరు చెప్పింది అక్షరాల నిజం మా మానవుడి ఓటు ఎక్కలేదు ఓటర్ లిస్టులోకి ఎక్కించాలి వాడు ఇప్పుడు నాదగ్గరే ఉండి చదువుకుంటున్నాడు వాడికి 18 సం.
ఆపని వెంటనే చేయాలి సుబ్బారావు అట్లాగే పంతులుగారు ఈరోజు మద్యాన్నం వెళ్తాను, ఇంకా చెప్పండి పంతులుగారు
ఒక్కసారి పోటిలొ నిలబడ్డ నాయకుల గురించి మీకు తెలియ పరుస్తాను. మితిమీరిన పదవీ కాంక్షతో వయసు పెరిగిన అనేక సారులు గెలిచినా ఇంకా నేనే నాయకుడ్ని నన్నే గెలిపించండి అనేవారున్నారు.
మా తాతగారిని గెలిపించారు, మానాన్నగారిని గెలిపించారు, మా ఇంట్లో ఉన్న ఒక్కర్ని పార్టీల అతితంగా గెలిపించారు మీకు ధన్యవాదాలు, ఇప్పుడు వంశ పారంపర్యంగా మేము పొటి చేస్తున్నాము మమ్ము గెలిపించండి అనేవారున్నారు.
స్వార్ధ పరులు ఒక చేత్తో తనసొమ్ము కానిది ప్రభుత్వము సొమ్ము అనగా ప్రజల సొమ్ము, లంచాలగా వచ్చిన సొమ్ము, ప్రభుత్వమువా రికి లెక్క చూపక ఉన్న సొమ్ము , ప్రజల సేవకే అంకితమవుతాం, అవసరమైతే మేము కట్టిన బ్రిడ్జిలను కూల్చి అక్కడ పేదలకు ఇల్లు కట్టిస్తాం అనేవారున్నారు.
మరి ఎవరికీ ఒటెయ్యమంటారు పంతులుగారు అది మాత్రం మీ ఇష్టం
ఎలక్షన్లో పొటి చేసే వారి ఆస్తి ఎంతో ముందే తెలియపరచాలని ప్రభుత్వమువారు నిర్ణ ఇమ్చారు. నాయకులు ప్రతి 5 సం.లకు పొటి చేస్తున్నారు గెలుస్తున్నారు. కాని వారి ఆస్తి ఎన్నికోట్లు పెరిగిందో ఎట్లా పెరిగిందో అడిగె హక్కు ప్రజలకు లేదు, ప్రభుత్వమువారు నాయకులను అడగలేరు.
అదిమాత్రం నిజం పంతులుగారు.మా ప్రాంత నాయకుడికి గత 5 సం ముందు 10ఎకరాలు ఉంటే ఇప్పు డు 100 ఎకరాలుగా మారింది ఇది 5 సం లలో నే సమ్పాఇమ్చారుట.
అదే సుబ్బారావు రజకీయమ్, నీవు కూడా రాజకీయములో దిగితే తెలుస్తుంది ఎట్లా సమ్పాఇమ్చాలొ
అది సరే పంతులుగారు ఎలక్షన్లో పొటి చేసేవారు ఇన్ని లక్షలు కర్చు పెట్టాలని చెప్పుతున్నారు, వాటికి లెక్కలు చూపిమ్చ మంటున్నారు. చూపిస్తున్నారు.
పరోక్షముగా గెలిచినవారు ఖర్చు కన్నా 5 రెట్లు సంపాదించుకొనే అవకాశములు కల్పిస్తున్నారు. దీని అడిగేవారెవరు లే
రా , ఎందుకు లేరు ఉన్నారు " సి.బి.ఐ " పట్టుకోవటం అక్రమ ఆస్తులని చెప్పటం జై ల్లలో పెట్టటం తర్వాత ఎమీ చూపలేక రాజకీయ నాయకులకు లొంగి వదిలేయటం మనం చూస్తునె ఉన్నాము కదా సుబ్బారావు.
అవును పంతులుగారు ఇది మాత్రం నిజం,
.
నాయకులు సంపాదించే నల్ల్ధ ధనమునకు పట్టుకోవడం చేతకాదు ప్రభుత్వంవారికి, కాని ఆధనమునకు టాక్సు కడితే పట్టు కొలె మంటారు ఇదెక్కడి రాజ్యామ్గామో
న్యాయాదికారులె లంచాలు తీసుకుంటున్నారు, ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తారో తెలియదు ప్రస్తుత పరిస్తితి.
చట్టం నాయకులకు చుట్టం దొడ్డిదారిన ఇష్టం లేకుండా పచ్చని కుటుంబమును రెండుగా చీల్చవచ్చు,
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా కడుపునిండా భోజనము చేయగలడు, అధికారం ఉందికదా అని హడావిడిగా చేయరాని పనులు చేస్తే పలితం అనుభవిస్తారు, వారికి కాలమే గుణపాటం చెపుతుంది .
భూముల్నే కాదు, స్మసానాన్ని దోచుకున్న నాయకులు, నమ్మిన వారిని నట్టేట ముంచిన నాయకులు ఉన్నారు
వారికి ఒటు వెసెప్పుడు ఆలోచించి ఓటేయండి.
అవినీతి పరులను అందలం ఎక్కిస్తే ప్రజలుకూడ అవినీతి పరులవుతారు
కొందరు నాయకులు ఓటేసిన ప్రజలను మర్చిపోతారు, వెన్నంటి నిలిచిన కార్య కర్తలను మరచిపోతారు, తమకోసం పదవులను త్యాగం చేసిన వారిని మరచిపోతారు, అహం నెత్తికెక్కి ఇది నాబలం, నాకుటుంబము చేసిన మంచి పనులవల్ల నేను గెలిచాను, నాతొ మీకు పని ఎమిటి అని విర్రవీగిపొతారు, అందుకనే మీ వోటు చాలా విలువైనది. ఆలోచిమ్చ్ మర్రి వేయండి
పంతులుగారు ఈరొజు మీరు నాకు ఓటు ఎందుకు వెయ్యాలో తెలియని చాలా విషయాలు చెప్పారు సంతోషం.
అసలు నాయకుకుడికి ఉండే లక్షణాలు చెపుతారా.
నేను చెప్ప్దేదేముంది ఆదికవి వాల్మికి రామాయణములో తెలియపరిచారు అవే మరొక్కసారి నీకు గుర్తుచెస్తాను.
అటువంటి లక్షణాలు ఉన్నవాడికే నీవు ఓటు వేయాలి జాగర్త,
ఇదిగో శ్రీమతిగారు మేము ఇక్కడ ఎంతో మాట్లాడు కుంటున్నాము " కాస్త " కాఫీ పంపించ కూడదు.
పంపిస్తాను మాట్లాడు కొండి "కాఫితో పాటు టిఫిన్ కూడా" పంపిస్తాను
చాలా మంచి దానివి త్వరగా, " త్వరగా అంటే కుదరదు " అయితే "నేను ఎవ్వరికి ఓటు వెయ్యాలో త్వరగా త్వరగా చెప్పండి " అది ఏట్లా కుదురుతుంది, ఇది కూడా అంతే
అవునే నీ ఇష్టం వచ్చినప్పుడు పంపిచు. ఇప్పుడు తొందర చేయుటలేదు కదా ,
మీరు ఆడగ కుండానే రడి చేసాను, కాని మీరు అడిగారు కదా అని కాస్త మాట్లాడాను ఎమను కోకండి.
అను కునేదే ముందే, ఇది ప్రతి ఇంటిలో ఉండే రాజకీయమ్
అవునా, ఇది నిజమా అయ్యో అంటు నాకు తెలియదే అంటు లోపాలకి వెళ్ళింది, శ్రీ మతి శ్రీదేవిగారు..
సరే నాయకుల లక్షణాలు చెపుతాను విను.
శ్రీ రాముడు ధర్మ స్వరూపుడు: తన రాజ్యంలో ప్రతిఒక్కరు ధర్మ పరులై, ధర్మాచరణులై ఉండే విధముగా ధర్మ పరిపాలన చేయు వాడే నిజమైన నాయకుడు .
శ్రీ రాముడు అరిందముడు: అరిషడ్వర్గాలను జయించి శత్రువులను తరిమి కొట్టువాడు, ఆసలు చూపక నిజాయితీగా పరిపాలన చేయువాడే నిజమైన నాయకుడు.
శ్రీ రాముడు కపటము ఎరాగనివాడు, ప్రశాంతముగా ఉండువాడు, వేదవేదాంగములు చదివినవాడు, మృదు స్వభావము కలిగినవాడు, నీతి మంతుడు, నిజాయితీపరుడు, చక్కని జ్ఞాపక శక్తి ఉన్నవాడు, మంచి పనులమీద దృష్టి సారిమ్చినవాడు, వ్యవసాయము నెరిగినవాడు, బ్రహ్మణులను ఆదరించినవాడు, సంక్లిష్టమైన విషయాన్ని కూడా తేలికగా సమాదాన పరుచువాడు, ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకోనేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు, గౌరవిస్తూ పలకరించేవాడు, ఏక పత్ని వ్రతుడు, ఏక భాణము కలిగినవాడు. నమ్మినబంటు హనుమంతుని ఆదరిమ్చినవాడు, హనుమంతుని చేసిన సహాయానికి నీకు ఏమి ఇచ్చిన ఋణము తీరదు, నా ఆలింగనము పంచుతున్నాను అని హృదయానికి హృదయం అందించాడు . (నా హృదయమే నీది , నీ హృదయమే నాది మన మిద్దరం " శివ కేశవులం" ).
రాముని లక్షణాలు అన్ని ప్రతి పాలకుడిలొ, ఉండాలి అటువంటి వారికే మీరు ఓటు వెయ్యాలి, అది మాత్రము గమనించండి.
రాముడు ఎ జీవిని అవమానిమ్చ లేదు, అడిగినవానికి లేదన కుండా సహాయము చేసినాడు, తనకు సహాయపడు వారి నందరినీ గౌరవించాడు., మూగ జీవులకు ఎక్కడ ఉన్న తిండికి కొరత లేకుండా చేసాడు.
చూడు సుబ్బారావు రాముడు లక్షణాలున్న నాయకుడు దొరకాలంటే ఈ కలియుగంలో కష్టం.
నా భావనలో నాయకుడనేవాడు, వక్తిగత ప్రయోజనాల్ని త్యజించి, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్య మిచ్చిన వాడే నాయకుడు ,
ఒకరి వళ్ళ ఒకరికి భాదలేకుండ, ఒకరి నొకరు స్నేహభావంతో, ఆదుకొనే పరిస్తితి కల్పిమ్చినవాడే నాయకుడు
న్యాయ వ్యవస్తలో లంచాలకు లొంగ కుండ అన్యాయాన్ని అరికట్టే వ్యవస్తను ఏర్పాటు చేసేవాడే నాయకుడు.
ధన-ప్రాణ మానాలకు రక్షణగా రక్షక భటులు, భక్షక భటులుగా మారకుండా ప్రజలకు రక్షణ కల్పిమ్చువాడు నాయకుడు.
నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించి, మత్తు పానీయాలను రద్దు పరచి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి, ప్రయాణ సాధనాల కర్చులు తగ్గించి, వృత్తి విద్యకు ప్రాధాన్యత నిచ్చి, ప్రతి విషయములో ప్రజలకు సహాయము చేసి, సేవ నమ్దిమ్చే వారికె మీరు ఓటు వేయండి.
నాయకుల్లో రాముడి లక్షణాలు అన్ని లేకపోయినా కొన్ని లక్షణాలు ఉన్న నాయకులున్నారు. వారిని గుర్తించి మీరు ఓటు వేయాలి,
చూడు సుబ్బారావు నాకు తెలిసిన విషయాలు చెప్పను, ఇవన్న తప్పు చెపితే క్షమించు .వినరా వినరా ఓటరా
తెలుసుకొని ఓటు వేయరా
ఓటు వేయుట నీ ధర్మం రా
ఓటుతో జాతకాలే మారునురా
ఓటుకు ఆడా మోగా తేడా లేదురా
ఓటుకు కులమతాలు అడ్డురావురా
ఓటు చిన్న పెద్ద ముతక వేయునురా
ఓటుతో రాజ్యామ్గాన్నే మార్చునురా
ఓటుకు పైకం యాచిమ్చకురా
ఓటును మత్తుకు అమ్ముకోకురా
ఓటు వేయుట నీ కర్తవ్యమురా
ఆశలు చూపెవార్కి ఓటే వెయకురా
ఓటులో ఉందిరా గమ్మత్తు
ఓటు కొందరిని చేయును ఛిత్తు
ఓటు తప్పిమ్చునురా విపత్తు
ఓటుతో చేస్తావురా కసరత్తు
నేలను చీల్చుకొని మొక్క వచ్చునురా
నిదురిమ్చి హ్రుదయాన్నిమేల్ కోల్పురా
భద్దక్కన్ని పారద్రోలి ఓటు వెయురా
ఓటుతో కొమ్దరి జీవితమె మారునురా
పంతులుగారు మీరు ఉన్న విషయాలను విశదపరిచారు అంతే, ఓటు వేయటం ఓటరుగా మన ధర్మం అన్నారు.
అన్నయ్యగారు మీకు ఇంటి దగ్గరనుమ్చి ఫోన్, ఎవరు చేసింది. ఇంకెవరు మీ శ్రీమతిగారు. ఇప్పుడే వస్స్తున్నానని చెప్పమ్మా నేను బయలుదేరుతున్నాను.
పంతులుగారు నాకు శెలవియ్యండి. రేపు ప్రొద్దున్నే పోలింగ్ బూతులో కలుద్దాం
అట్లాగే సుబ్బారావు
ఏమిటే పెళ్ళాం అంటే అంత భయమా అట్లా పరిగెత్తాడు, ఏమిటి మీకు లేదా భయం
ఆ ఏమన్నావు, ఎమీలెదు కూరలు తెండి, రేపోద్దున్నే ఒంట వండి పెట్టి ఓటు వేయడానికి వెళ్తాను, మీరు కూడా రేపు ప్రొద్దున్నే లేచి నాకు ఒంటకు సహాయము చేయండి. మీరు వెళ్లి వోటు వేయవచ్చు , నీ మాట ఎప్పుడన్నా కాదన్నాన శ్రీ దేవి, అం తో ద్దు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి