ప్రాంజలి ప్రభ ..MALLAPRAGADA ( అంతర్జాల తెలుగు పత్రిక )
ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన పత్రిక .. Mallapragada Sridevi ramakrishna
22, ఏప్రిల్ 2014, మంగళవారం
126. Philos'ophy story -30 (నిశ్శబ్ధ జ్ఞానం)
http://vocaroo.com/i/s0ap8jAHUUrE ( lisan nissabdha jnaanam)
నిశ్శబ్ధ జ్ఞానం
నా భావ కవితా సూ క్తం
అంత్యప్రాస భావ రత్నం
జయ ఉగాది వసంతం
తల్లితండ్రులకు అంకితం
జాతి కుల మత వర్గ భేదములు సమయు గాక
విశ్వమున శాంతి, సుఖం నిత్యం వెలయు గాక
తల్లిగాలాలిస్తూ భర్త హృదయం శాంతి నిచ్చు గాక
భగవంతుడున్నాడని నగ్న సత్యం తెలుపు గాక
పుడమితల్లిని పూజిమ్చి సన్మార్గం నడువు గాక
వేదధర్మాలనుఆచరించి సంసారిఅవుదువు గాక
చేదు నిజం తెలివిగా చెప్పి సర్దు కుందువు గాక
బంధు ప్రీతిఉన్న భార్య మాట అనుకరించు గాక
మధుర రసముల భాష మనస్సును చేరు గాక
సహృదయ పాటకులకు సమస్యలు తీరు గాక
పడచు గాలి వెంబ డించిన నిగ్ర హించు గాక
ఓదార్పు ఔవ్నత్యం ప్రతి ఒక్కరిలొ ఉండు గాక
నిజం తెలుసుకొని మసలుకుంటే నింగిలో ఉండు గాక
తల్లి తండ్రుల నను కరిస్తే జగతిలో పేరు ఉండు గాక
పెద్దలు ఓర్పు వహించి పిల్లలసమస్యలను తీర్చు గాక
నీకు వారసత్వం అనేది దానం కాదు విద్య ఉండు గాక
రోజు కొక్క తీరు రోగాలు వచ్చు గాక
లంఖనమే రోగానికి మందగు గాక
కంపువాసననైనా ఇంపుగుండు గాక
తల్లితండ్రులను పూజిస్తు ఉండు గాక
సంప్రదాయ కళలు ఉద్భవిమ్చు గాక
దెయ్యపు బుద్దిని తరిమి గొట్టు గాక
దేశాన్నిసుభిక్షముగా ఉంచెదరు గాక
సంకల్పం ఉంటే సాధించ వచ్చు గాక
పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా వెళ్ళెదరు గాక
తల్లితండ్రులు పండిన పండ్లులా పృద్విని చేరుగాక
మాన వత్వాన్ని రక్షించి మనిషిగా జీవించు గాక
పాలకుల అవినీతి బయట పెట్టి ఉండేదరు గాక
మట్టి పొరల మాటున మణిక్యంలా ఉందురు గాక
కడలిగర్భానదాగియున్న రత్నంలా ఉందురు గాక
పిల్లలకుపెళ్ళిచేసి పిల్లలా తిరుగుతూ బ్రతికెదరు గాక
తెలుగు వారంత ఒకే కుటుంబంగా ఉందురు గాక
నన్ను వెంబడిస్తుంది ఏదో ఒక కన్ను
కన్నుకాదు అది ఆశలు చూపే జున్ను
జున్నుకన్నా మధురం పెదవుల పన్ను
పన్నుకాదు అది కొర్కలు తీర్చె మన్ను
నన్ను ఆరాధించే వారికి అవుతాను ప్రసన్ను
ప్రసన్నత చెందినా ఎపుడు కోలుస్తాను నిన్ను
నువ్వుతప్ప వేరొకరిని మనసులోకి రావాలన్ను
రావాలి మనిద్దరిమనసు ప్రశాంతముగా ఉండాలి
గిలి గిలి పెట్ట మాకు, చిమ చిమ చూపమాకు
జల జల జార మాకు, టక టక నడవ మాకు
దడ దడ లాడ మాకు, గిర గిర తిరుగ మాకు
తహ తహ లాడ మాకు, పకపక నవ్వ మాకు
భగ భగ చూడ మాకు, పట పట కొరక మాకు
బుడబుడ మట్లాడమాకు, బుస బుస లాడకు
బెక బెక అర వకు, ముసి ముసి నవ్వ మాకు
వెల వెల పోమాకు, హుహు హుహు అనకు
పుడమి తల్లి పురిటి నెప్పులతొ ఆవేదన
ప్రక్రుతి మాత పరవసించ లేక నిర్వేదన
కాలుష్యభూతం ప్రపంచమంతా ఆక్రందన
పచ్చదనంమాయం నగరాల ముసుగున
నీరు అందు బాటులేక ప్రజలు నరక యాతన
గాలి కాలుష్యమై తల్లడిల్లిపోతున్నారు జగాన
పక్షిజాతి మాయం, వన్య ప్రాణి మాయం యుగాన
ఈ దేశంలో మేధావులు పని తనం శూన్యమెన
నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తా రెందుకు నాయకులు
జాతీయ సంపదను తన సంపదగా మార్చే నాయకులు
గద్దేలునేక్కి ప్రజలపై పన్నుల భాదలేకుండా చేస్తే మేలు
వరాలు అవసరము లేదు, మింగ మెతుకు ఉంటే చాలు
ప్రజలను కష్టాల వైపుకు నెట్ట కుంటే చాలు
మాటలతో ప్రజలను మభ్యపెట్ట కుంటే మేలు
చేయలేనివివద్దు అనవసరపు ఉపన్యాసాలు
మాలో కలహాలు పెట్ట కుండా ఉంటే మేలు
ఉండెందుకు లేదు చోటు, చదివెమ్దుకు రాదు కాన్మేమ్టు సీటు
నోటికి చేదుగా మారే స్వీటు, తీరమ్ దాటేందుకు లేదు బోటు
లొకంతీరు చూస్తె తలపోటు, అనుకున్నాము మాకు గ్రహపాటు
మేమువేస్తాము మీకు ఓటు, మాకు చేయాలి ఏమిలేకుండ లోటు
సృష్టిలో మనోహర మైనది, మధుర మైనది నిశ్శబ్దం
అందరి మనసులో ఉండేది, ఆనంద మైనది నిశ్శబ్దం
కిటికీ వెన్నెల చూపింది, పౌర్ణమిలా వచ్చింది నిశ్శబ్దం
మౌనం మనోహర మైనది, చంద్రుని చూపులు నిశ్శబ్దం
మనసు కోరుకో మంది, ఉత్చాహం చూపిమ్ది నిశ్శబ్దం
మనసంతా వేలుగుతో నిండింది, పరివర్తనలో నిశ్శబ్దం
అనుమానాల నిలయమైనది, గురు ఉపదేశం నిశ్శబ్దం
ఆలోచనలు లేవని తెలిసింది, ఏదోఆకర్షించటం నిశ్శబ్దం
మనసు పువ్వులా విచ్చుకుంది, నాలో తెలియని వెలుగు నిశ్శబ్దం
నాకల్లు కాని కల్లతో చూడడం జరిగింది, నాలో అనుభూతి నిశ్శబ్దం
కలపండుట నాకుజరిగింది, గురువుగారి కళ్ళు నాకివ్వడం నిశ్శబ్దం
లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది, నాగుండ సందేహాలు తీర్చడమె నిశ్శబ్దం
నా మార్గం స్పష్టం
నా మాట స్పష్టం
నా లక్ష్యం స్పష్టం
నా ఆలోచన నిశ్శబ్దం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి