22, ఏప్రిల్ 2014, మంగళవారం

127. love story -31 (సహజత్వం ఏది ?)

సహజత్వం ఏది ?

తీయటి సువాసనలను వెదజల్లే గులాబీ పూలను మరిచారు,  మత్తును పెంచే సంపెంగ పూలను  మరిచారు,  మొగలిరేకులతో జేడ ఎవరు వేసుకుంటున్నారు,  కాని నేడు సహజత్వము వదలి గడ్డి పూలు పెట్టు కుంటున్నారు.   కుంకుమ  బొట్టు పెట్టుకోమంటే బొట్టు బిళ్ళలు పెట్టుకుంటున్నారు   ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమయము సరి పోవుటలేదు.  అలంకరించు కొని ఆదరా బాదరాగా నాల్గు మెతుకులు తిని కొంత బాక్సులో పెట్టుకొని వెళ్తున్నారు.  స్తిరంగా కూర్చొని భోజనము చేయలేక పోతున్నారు ఇట్లా   చేయుట సంపాదన కొరకేనా,  ఎనిమిది గంటలు పనిచేసి ఆరోగ్యముగా ఉండ మంటె, 12 గం. పనిచేస్తే ఎక్కువ పైకము వస్తుందని ఆశిస్తున్నారు.  కానీ ఆరోగ్యము పాడై పోతున్నదని తెలుసుకోలేక పోతున్నారు.    ఎక్కువ సమయము ఉద్యోగము చేయుట అవసరమా ?

ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండి పనిచేయుట వళ్ళ వారు సహజత్వమును కోల్పోతున్నారు. ప్రకృతి సౌందర్యాలను చూడ లెక పొతున్నారు ప్రకృతి చల్లగాలి/వేడిగాలి/ చిరు జల్లు గాలి   అందు కోలేక పోతున్నారు.  పకృతి పరవశంతో ఆకుల మద్య పూలు నాట్యము చెస్తున్నాయి, వర్షపు చినుకులు పడి  సువాసనలు వేదజల్లుతున్నాయి.  వాటిని గమనిమ్చిందెవరు ? వాటిని ధరిమ్చునదెవరు?

సహజముగా ఉన్న పూలను కోసి పెట్టుకుంటే వాని అందము వేరు, ప్రిజులో పెట్టి ఎప్పుడో  పెట్టు కుంటే  వాటి సహజత్వము పోతుంది.
గంట గంటకు " టి " త్రాగటం  లెదా కాఫీ త్రాగటం అలవాటు చేసు కుంటున్నారు. భారీ శరీరాలుగా మారుతున్నారు. వయసుకు తగ్గ  బరువుకన్నా ఎక్కువగా మారుతున్నారు. ఎవరైనా సహజ మైనటు వంటి  బార్లి నీరుగాని, సబ్జాల నీరుగాని,. కొబ్బరినీళ్ళు గాని   త్రాగుతున్నారా, గోలి  షోడా లేదా నిమ్మకాయ షోడా త్రాగు తున్నారా కొన్ని మంచి అలవాట్లు లేనివారికి ఆరోగ్యముగా ఉండాలన్న ఉండలేరు. కేవలము  రోజు   నడిస్తే ఆరోగ్యముగా  ఉండ గలరని చాలామంది అను కుంటున్నారు.   అది నిజాము కాదు, మనం తినే ఆహారమును బట్టి, రోజు  చేసే వ్యయామము బట్టి  శరీరము బరు తగ్గించుకోవచ్చు సహజముగా ఉన్నవి అనగా  "పండ్లు " తింటే మంచిది. బయట అమ్మే తినుబండారాలు రుచిగా ఉన్న అదేపనిగా తినకూడదు.       

పక్షులకు,  మృగాలకు ఆశయాలు లేవు, సంతోషముగా అకాసమున అడ్డు లేకుండా ఎగర గలవు,  మృగాలు అడవుల్లో సమ్చరిస్తున్నా యి. కాని ఈనాడు పక్షులు కనుమరుగైనాయి. కారణము కాలుష్యం వళ్ళ కొన్నవేల పక్షులు చనిపోతున్నయి, అడవులు  తొలగిమ్చుట వల్ల జంతువులు మాయమైనాయి. వీటికి, ఆశయాలు కాని,  ఆదర్సాలు కాని, అనుకరణ కాని ఎమీలెవు,  మనుష్యులు ఆదర్శాలతో అనుకరణతో ద:ఖితులవు తున్నారు, తన సహజ గుణాన్ని,  స్వభావాన్ని,  కోల్పోయి ఆనందం లేక ఘర్షణ లో వ్య క్తి సహజత్వమును పోగొట్టు కుంటున్నాడు.  మనిషి తనలాగా ఉండక ఇతరులాగా ఉండాలని తపనతో ఉండి  రెంటికి చెడిన   రేవటిగా మారుతున్నాడు.

మనిషి తనది కాని పరుగులాటలో పడిపోయాడు. అమ్దరి దృష్టిలో గొప్పవాడుగా, అందంగా ఉండాలని ప్రయత్నించు చున్నాడు.ప్రక్రుతి అమ్దిమ్చిన సహజ సౌందర్యము వదలి కృత్రిమ సౌందర్యము కొరకు పరిగేడు చున్నాడు.  

ఒకసారి ఒఅక గ్రానీణుదు నగరానికి వచ్చాడు,  అతడు నిస్కపటమైన, సహజమైన గ్రామీన జీవితమ్ గడిపినవాడు. అతనికి నటనలు, మోసకారి తనాలు,  మోసాలు, దొమ్గ తనాలు, తెలియవు.న  గరం నలువైపులా చూస్తు ఆనందం అనుభవిస్తున్నాడు. నడిరోడ్డులో ఒక బొమ్మను చూసి ఆగి పోయాడు. దానివల్ల వేగముగా వచ్చుచున్న గారు బ్రేకు వేయటం వళ్ళ చిన్న యాక్సిడెంట్  జరిగింది.  దీనికి కారణం సహజత్వం లోపించి అర్ధనగ్న దృశ్యాలను ఉంచడం వళ్ళ జరిగిందని అందరకి తెలిసిన ఎవరికివారు వెళ్ళిపోయారు. 
తనకు జుట్టు పెరుగుట వలన క్షవరం చే ఇంచు కొవాలని దగ్గరలో ఉన్న క్షౌరసాలకు చేరాడు.లోపలకు వెళ్ళబోతూ అతనికి ఒక బోర్డు కానీ పించింది.  అందులో వ్రాసిన విషయం చూసి చాల ఆశ్చర్య పోయాడు. .
అందులో : 1. మీరు ఎ ట్లాగున్నారో అట్లాగే ఉంచి జట్టు కొంత తగ్గించి నందుకు ఒక రేటు.
               2. మీరు ఎ సినమా నటుల రూపమ్లొ ఉండాలని భావిస్తారో వారిలాగా చేసి నందుకు ఒక రేటు.
               3. మీరు ఇతరులకు ఎట్లా కనిపించాలని అనుకున్నారో నాకు చెపితే అట్లా తయారు చేస్తాను.  దానికి ఒక రేటు.
               4. మూడు    కత్తెరలకు ఒకరేటు, బోడిగుండు చేయుటకు ఒకరేటు, తలకు రంగు, మీసలకు రంగు, జుతుకు తైల మర్ధనకు
                   ఒక రేటు.
లోపలకేల్లి నీ మాయమాటల్తో అనేక మంది ని బుట్టలో వేసుకుంటున్నావు. తప్పు కాదా ప్రజలు అమాయకులు కడు బీదవారు నీవు పెట్టిన రేట్లకు వాల్లు తూగ గలర అన్నాడు.
ఎలోకలో ఉన్నావు, ఇప్పుడు అందముగా కనబడటం కావాలి అందరికి, తనకున్న రూపనకన్న అందముగా కనిపిమ్చేతట్లు చేసినవారికి పైకము ఇస్తున్నారు. నీవేమో అమాయకుడులా కనిపిస్తున్నావు.
సహజత్వము వదలి వెర్రి వేషాల్లు వేస్తున్నారని అంటావు.  దబ్బున్నవాఅరు విగ్గు పెట్టు కుంటున్నారు.
ప్రతిఒక్కరు  మనము ఇతరుల  దృష్టిలో మనం ఎలా ఉంటే బావుటుందో అలా తయారవుతున్నారు. ఇది లొకంతీరు.
ఇంతకు నీకు ఎలాంటి క్షౌరము చేయాలి అని అడిగాడు.
అయ్యా నాకు వేరేరకము నాకొద్దు. నారూపం తగ్గట్టుగా జుట్టు తగ్గించు.
ప్రక్రుతి తనకు ఏది ఇచ్చిందో  అది  సహజమైనది .  కృత్రిమ మైనది మొదట అందముగా కనిపిమ్చినను అది సాస్వితముకాదు.   .

                                                  

సృష్టిలో కళాకారులెందరో ఉన్నారు వారిని గుర్తించి వారికి తగిన ప్రో త్చాహము  కల్పించి వారి ద్వార అనేక మందికి ఉపాది కల్పించటం సహజం, అది ఎంత వరకు జరుగుతుంది మనదేశంలో..
ఒక అందమైన తీగ దేవాలయములో పాకి దానిద్వార పూలు  పూయటం  మొదలి పెట్టింది.  ఆతీగ అనుకొంది . నేను దేవుని చెప్పిన ప్రక్కరముగా పూలు పూయటము  అవసరమా  నాకు స్వేచ్చ లేదా అని తపస్సు చేసింది. దేవుని వరము కోరుకుంది. నేను పెరగకుండా నాకు వరమియ్యమని కోరింది. . నాకిష్టము వచ్చినపుడు పెరిగే శక్తి ఇమ్మని కోరింది.  ప్రకృతికి వ్యతరేకముగా కోరే వరాలు నేను ఇవ్వలేను ని ప్రయత్నం నీవు  చేసుకునే హక్కు ఉంది ప్రయత్నించి అని అంతర్ధానమయ్యాడు దేవుడు.
ఇంకేముంది నాకు  వరము ఇచ్చాడు నేను పెరగను అనుకుంది.   ఎంత ప్రయత్నించిన తన పెరుగుదలను ఆపలెక పోయింది . పెరగటం అనేది ప్రక్రుతి సహజం దానిని ఆపడం ఎవరి తరము కాదు.  అట్లా అనుకోవటం వారి మూర్ఖత్వమ్. .
పొంగే కెరటాలను ఎవ్వరు ఆపలేరు, వచ్చే ప్రళయాలను ఎవ్వరు ఆపలేరు, నదులు వెళ్లి సముద్రంలో  కలిసేది ఎవ్వరు ఆపలేరు. కనీసము తమ పిల్లలను అదుపులోపెట్టి పెమ్చాలను కోవటం సహజము కాదు.
అట్లాగే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వడం సహజం. అందం పోతుందని పాలు ఇవ్వ కుండా  ఉంటే పిల్లకు తల్లికి ప్రమాదము అని గ్రహిమ్చాలి.
సహజముగా మనం  బరువులను మోయం,   కాని అభిప్రాయాల భారం, ఆదర్శాల భారం,  ఆకర్షణల భారం,  మతాల భారం, తల్లి తండ్రులు, పెళ్ళాం పిల్లల భారం  మనతలపై ఉంటుంది. మనం మోస్తున్నమన్న మాట మర్చిపోవాలి. ప్రతి విషయాన్ని తేలిక తీసుకొవాలి ఆదేవుని దూతగా ఈ పపమ్చము లోకి వచ్చాను,  దేవుడు నన్ను ఎంతవరకు చేయమంటే అంతవరకు ధర్మ మార్గమున నాకు తెలిసినది సహజముగా చేయుటకు ఎల్లప్పుడు నా ప్రయత్నాలు చేస్తాను.        
ప్రక్రుతివ్యతరేకముగా ఎవ్వరు ఏమిచేయలేరు.
నీకు నిద్రలో వచ్చికలలు ఎట్లా నిలబడవో నీవు ఎన్ని ఆలోచనలు చేసి చేసినా జరిగే పని జరుగక మానదు. చేద్దామన్న పని చెడి పోవచ్చు, అనుకోని పని జరగవచ్చు  దేవుని చేసే లీలలు  ఎవ్వరు గమనిమ్చలేరు.
ప్రక్రుతి అనుసరించి ప్రతిఒక్కరు ప్రయాణము చేయ్యుటే నిజమైన సహజత్వం.    .  .         

                                              

          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి