26, ఏప్రిల్ 2014, శనివారం

128. comedy story-32(శ్రీధర్ మాష్టార్ గారికి సన్మానము)


                                                                         

శ్రీధర్ మాష్టార్ గారికి సన్మానము

ఎవరండి లోపల " శ్రీధర్ మాష్టార్ గారున్నారా  '  అని తలుపు కోట్టి  అడిగారు.   ఉన్నారు అంటు లోపల నుంచి  మధుర స్వరం విన బడింది. తలుపు తీసి  లోపలకు రండి  ఈ కుర్చీల్లొ కూర్చోండి.   నాన్న గారు పూజ చేసు కుంటున్నారు. ఇంకా 5 నిముషాలలో పూర్తి అవుతుంది. మీకు త్రాగేందుకు మంచి నీల్లు తెస్తాను అంటు కూతురు సురేఖ లోపలకు వెళ్ళింది,  మమ్చి నీల్లు తెచ్చి ఇచ్చి లోపలకు వెళ్ళింది .
ఒక్కసారి ఆ ఇంటి  వంక చూసారు ఇద్దరు.  అక్కడ దేశభక్తి నాయకుల ఫోటోలు ఉన్నాయి,  భారత్ మాత,  అంబేద్కర్, అల్లూ రిసీతారామరాజు,  సుభాష్ చెంద్రబోస్, మరియు గాంధి ఫోటోలు ఉన్నాయి దాని ప్రక్కనే ఆదిత్యుని ఫోటో, శ్రీ సీతారమ కళ్యాణ ఫోటో  కూడా  ఉన్నాది.
అంతలో గంట మ్రోగింది అమ్మాయి హారతి హద్దు కొమ్మ అన్న పిలుపు వినబడింది.
నాన్నగారు మీకొసమ్ ఎవరో ఇద్దరు వచ్చారు నాన్న  వారోవరో అడగపోయావా అన్నాడు.
ఎమోనాన్న నేను ఎమీ అడగలేదు, మీరె వెల్లి  చూడండి. నీను ఇవి అన్ని సర్ది,  టిఫిన్ చేస్తాను అన్నది. సరే అట్లాగే కాని నా చొక్కా తెచ్చి ఇస్తావమ్మ అన్నాడు తండ్రి శ్రీధర్.
చొక్కా సర్దు కుంటు,  కళ్ళజోడు పెట్టు కుంటు  లోపలనుమ్చి ఎవరు వచ్చింది అని అడిగాడు.
మేమే నండి మాష్టార్ గారు మీ స్కూల్లొ చదివిన   పాత విద్యార్డులం,  మంచిది అట్లా నుంచున్నా రెంటి  కూర్చోండి,   నేను కూర్చున్నాగా మీరు  కూర్చోండి, అంటు  పడక కుర్చీలో కూర్చున్నాడు.
ఖచ్చితంగా  14 సం.  క్రితం మేము మీ సూల్లొ 10వ తరగతి చదివా మండి. అప్పుడు మీరు మాకు లెక్కలు భోదిమ్చారు. అప్పుడు మీరు నేర్పిన విద్యవల్ల ఉన్నత  స్తితికి రాగాలిగాము అన్నారు.
ఇంతకీ  మీ పేర్లు చెప్పలేదు,  "ఆలస్యంగా వచ్చే రామకృష్ణ " అంటే మీకు బాగా  గుర్తు,  అవునొయి రామకృష్ణ నీవు అప్పుడు చింపిరి చ్జుట్టేసుకొని,  చినిగి పోయిన  నిక్కారు వేసుకొని, మడ్డి మొహము వేసుకొని ఆలస్యముగా వచ్చేవాడవు, నాకు ఇప్పుడు గుర్తు కొస్తుంది.
అప్పుడు ఆలస్యముగా వచ్చావని నానా దుర్భాషలు ఆడాను అవి అన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకున్నావా ఏమిటి.
అప్పుడే అనేవాడ్ని చదువనేది పట్టుదలతో చదవాలి,  ప్రశ్నలమీద ప్రశ్నలు వేసి మాష్టార కున్న తెలివిని సంపాదించాలి,  చదువే   మనకు ఆరోగ్యం,. చదువే మనకు ఆనందం,  చదువే మనకు ఒక ఇల్లు,  చదువు వళ్ళ  ఈస్వరుడిని ఆరాధించి మోక్షం పొందవచ్చు అనే వాడ్ని మీకు గుర్తు వుందా  అన్నాడు మాష్టారు.
మీరు మమ్మల్ని అన్నమాటలు మాకు  ఇంకా  గుర్తున్నాయి మాష్టారు గారు.
అవునొయి రామకృష్ణ ఒకసారి నీవు ఆలస్యముగా వస్తే బెమ్చీమిద నుమ్చోపెట్టి మరీ ప్రశ్న  వేసాను గుర్తుందా.
ఆ గుర్తుంది మాష్టార్  1000/10*10=? ఎంత అని  అడిగారు దానికి నేను 1000 అనిసమాదానము చెప్పాను,  మీరు అప్పుడు 10 ఎందుకు కాకూడదు అన్నప్పుడు నేను(బ్రాడ్మన్ ఫార్మల ప్రకారంగా ) అని చేప్పను వెంటనే  నన్ను కూర్చొమాన్నరు మీరు.
            .        .   
మరొక్కసారి ఆలస్యముగా వస్తే మీకు పిచ్చి కోపము వచ్చింది మాష్టార్ నన్ను ఇంటికెళ్ళి బర్రెలు కాచుకొని బ్రతమన్నారు మీరు, చదువుకొనే విద్యార్దు లెవరు ఆలస్యముగా రారు,  అని లోపలకు రమ్మనమని వెనుక గోడ కుర్చివేయమన్నారు. అప్పు డు కుడా ఒక ప్రశ్న  వేసారు గుర్తుందా మాష్టారుగారు
గుర్తొచ్చింది రామకృష్ణ ఆ ప్రశ్న " కరంటు వైర్ మీద 6 పక్షులున్నాయి హంటర్ వచ్చి తుపాకితో గురిచూసి కాల్చాడు పక్షులను అపుడు ఎన్ని పక్షులున్నాయి అని అడిగాను.
అప్పుడు నీవు నిజాము చెప్ప మంటారా  అభద్దము  చెప్ప  మంటారా అని పాతాళభైరవిలో తోట రాముడిలా పలికినావు , నిజమే చెప్పమన్నాను. అపుడు పక్షులేమి ఉండవు. అన్నావు. ఎట్లా అంటే శబ్దానికి ఎగిరిపొతాయి.
అభద్దము చెప్పమని అడిగాను అపుడు " ఒక పక్షికి గుండు  తగిలితే క్రింద పడి  ఉంటుదన్నావు గుర్తుంది.
ఇంతకీ  నీవెవరు నేను గుర్తుపట్ట లేదు అని రెండవ మనిషిని అడిగారు మాష్టారుగారు.
నేను గణపతిని మాష్టార్ ,  నీవు గణపతివా  అప్పుడు చాల  లావుగా ఉండే వాడివి కదా మరి ఇప్పుడు ఇంత సన్న   పడ్డా వేమిటి.
అప్పుడు విద్యార్ధులందరూ నిన్నుబామ్బుల  హీరొ అనేవారు. నీకు క్లాసు నుండి  బయటకు వేల్లాలను కుంటే చాలు   ఒక బాంబు  వేసే వాడవు
అంటే ముక్కు మూసుకొని అందరు బయటకు పరుగెత్తేవారు నాకు ఇంకా గుర్తుమ్ది  ఆ గణపతి వేనా. అవును మాష్టార్
అపుడు నిన్నొక ప్రశ్న  వేసాను అదేమిటో నాకు గుర్తుకు రావటము లేదు,  అదా మాష్టార్  నాకు గుర్తుమ్ది. అదే ఏమిటో నాకోసారుచేప్పు అన్నాడుమాష్టార్   
నాలుగు చెపాతీలు తినమని నీకు ఇచ్ఛా తిన్నాక ఏముంటుంది.  ఎమీ  ఆలోచించకుండా చెపాతీ కూర  ఉమ్టుమ్దని చెప్పావు అప్పు డు అందరు నవ్వుకున్నారు.   మీరుచెపాతీలు కదా తిన మన్నది కూరను కాదు కదా,  మరి కూర ఏమ్చేస్తావు లంచిలో అన్నంతో తింటాను మాష్టార్ అన్నప్పుడు క్లాసంతా   ఒక్కటే నవ్వు.
అప్ప టి  విషయాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చు కుంటే.  ఇప్పుడు  నవ్వు వస్తున్నది నాకు అన్నారు ఇద్దరు.
అవును బాల్యంలో చేసిన అల్లరే అల్లరి, అటువంటి అల్లరి మరలా జివితములో చేయలేరు. ఇమ్తకీ మీరు వచ్చిన పని అడగకుండా మీ పాత కధలు గుర్తు చేస్తున్నాను. పాత విద్యార్ధులందరూ కలసిమీకు సన్మానము చేయాలని అనుకున్నాము మాష్టార్.
ఇమ్తకీ  నీవు ఏమి చేస్తున్నావు రామకృష్ణ అని అడిగారు మాష్టార్ . నేను " ఎస్.ఐ  " గా సేలేక్టయ్యను, ఈమద్యలో నె డ్యుటిలో  జాయనయ్యాను.
ఈఒ సన్మానానికి  నేను రావాలంటే నా సలహాలు పాటి స్తానని నాకు చేతిలో చెయ్ పెట్టి ఒట్టు వేయాలి అన్నాడు          

నీవు లంచాలు పుచ్చుకోకుండా ఓర్పుతో చేయవలసిన పనిని నేర్పుతో , నిజాయితీగా చేయాలని నేను కోరుకుంటున్నాను.
నీవు అందరికి నీడ నిచ్చే వృక్షంలా, దప్పిక తీర్చె చలివెంద్రములా,  ఆకలి తీర్చి అన్నదాతలా, ధర్మాన్ని నిలబెట్టే ధర్మ దేవతగా ఉండాలని నేను కోరు కుంటున్నాను.
నీవు ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, ధైర్యముగా నేనున్నాను మీకు ఏమి భయములేదు, మీ సమస్య లన్నిం టిని  నేను పరిష్కరిస్తాను అని ప్రజల మనస్సులో నాటుకు పోయే విధముగా నీ  ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటున్నాను.
చేతనైతే ఆకలి భాదతో కన్నీళ్ళు కారుస్తున్న నిరుపేదలకు నిధులు సేకరించి ఆకలి తీర్చగలవని ఆశిస్తున్నాను. (స్త్రీ + సంపద) మనిషిని లొంగ తీయుటకు ప్రయత్నిస్తాయి. నిగ్రహ శక్తిని  పెంచుకొని కర్తవ్య దీక్ష పూనుకొవాలి.
నా అనుభావంతా రంగరించి నీకు భోధ చేస్తున్నాను. కొందరు ఆయ స్కామ్తం లా ఆకర్షిస్తారు, కొందరు వైరులో  కనబడ కుండా కరెంటు ఎలా ప్రవహిస్తుమ్దో , నీ వెనుక గోతులు త్రవ్వే వారుంటారు ఒక్కసారిగా కరంటు ప్రవహిమ్పచేస్తారు. అటు వంటి  షాకులు లేకుండా జాగ్ర్త త్త పడాలి
నీవు చేసే వృత్తి ఒక పొలము వంటిది అనగా "నీ మనసు " పొలము నాగలితో ఎత్తు  పల్లాలు లేకుండా  దున్నాలి " అట్లాగే నీ మనసులో ఎప్పుడు ప్రజలను రక్షించాలి,  ప్రజలు సంతోషముగా ఉండాలి,  ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనే తపన ఉండాలి.
పొలంకి నీరు పోసి, నారు పోసినట్లుగా  "ఎప్పటి సమస్యలు అప్పుడే పరిస్కరిమ్చాలి" . పొలం పైకి వచ్చినట్లుగా " ప్రజల మనస్సులో ఎటువంటి రొక్కము లేకుండా నిజాయితీగా పనిచెసే " ఎస్. యి " ఉన్నాడు మనకు అని సంతోషముగా "  కోతకు  వచ్చిన  చేనులాగా " ప్రజలమ్దరి మనసులోని కోరికలు తీరుస్త్తు  ఉండాలి  అన్నాది నాకోరిక, నా భావన, నీవు నామాటలు అమ్దరికినచ్చుతాయని  ఆశిస్తున్నాను.     
".            గుర్తుందా గణపతి ఒక రోజు నేను క్లాసుకు రాకముందే  బ్లాక్ బొర్ద్మీద రెండు వైపులా రెండు  కోడి బొమ్మలు వేసి ఒకటి పుంజు అని ఒకటి  పెట్ట  అని  వ్రాశావు .
అవును మాష్టర్ గారు
అప్పుడు మీరు వేసినవారు ఎవరో నిజాఐతీగ లేమ్మన్నప్పుడు నీవె  లేచావు, బొమ్మలు వేయటం నేర్చుకో పేర్లు వ్రాయటం కాదు పుం జుపై కిరీటము ఏది అది గీయలేదు తప్పుగదా ఆన్నప్పుడు, . ఇంకెప్పుడు  చేయను మాష్టార్  అన్నా వు.
రామకృష్ణ నీకు గుర్తుందా  అప్పుడు ఒక ప్రశ్న వేసాను. గుర్తుంది మాష్టార్
ఎ. = 5 పుంజులు,  బి.= 5 పెట్టలు , (ఎ +బి) హోల్డ్  స్క్వేర్   ఫోర్మలా విశదీకరిమ్చ మన్నారు మస్ష్టార్
అప్పుడు నేను నిజము చెప్పమంటార అభధము చెప్పమంటార అన్నాను.
నిజమే చెప్పు అన్నారు (ఎ స్క్వేర్ + బ. స్క్వేర్ + 2 ఎ. బి. ) మొత్తం 100 కోళ్ళు మాష్టార్ (50 పుంజులు, 50 పెట్టలు),
మరి అభధం  చెప్పరా  అన్నారు.   .    
ఎ. = 5 పుంజులు,  బి.= 5 పెట్టలు , (ఎ +బి) హోల్డ్  స్క్వేర్  పుంజు పెట్ట కలిసి పిల్లలు  వస్తాయి కదా మాష్టార్డు  మొత్తం ఎంతని చెపాలి అనంతం ""ఇంఫినిటి "" బలే చెప్పావురా అంటుంటే పిల్లలందరూ ఒక్కసారి చప్పట్లు  కొట్టారు ఒకటే నవ్వులు .  .
మాష్టార్ మాకు చాల సమయమైనది మీతొ మాట్లాడు తుంటే  సమయము తెలియలేదు. ఈరోజు   మీకు  అశోకా హోటల్లో సన్మానము మిమ్మల్ని  తీసుకొని వెళ్ళటానికి ఎవరైనా 6 గం. కు వస్తాము మీరు రడిగా ఉండండి.
ఇదిగో ఈ ""టి ""  త్రాగి వెళ్ళండి
మంచిది మాష్టార్ మాకు సెలవిస్తే మేము వేల్లోస్తాము "

అప్పుడే 5 గం.. పాత విద్యార్ధులందరూ వస్తున్నారు. శ్రీ ధర్ మాష్టార్గారు అనుకున్నట్లుగా 6 గం లకు వచ్చారు. .
ముందు దీపారాధన చేసారు. కొందరు విద్యార్ధులు ప్రార్ధనా గీతాలు పాడారు

యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవై: సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ ని:శ్శేష జాడ్యాపహా ||

పాశాంకుశధారా వాణి  వీణా  పుస్తక ధారిణి,
మమవక్త్రే వసేన్ని  త్యం  దుగ్ధ కుందేందు నిర్మలా
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ,
చతుర్దశసు లోకేషు సామే వాచి  వసేచ్చిరం

సరస్వతి నమస్తుభ్యం వరదే భాక్తవత్సలే ,
ఉపాయనం  ప్రదాస్వామి విద్యావృద్ధి  కురుష్వ  మే
భారతి ప్రతి గృహ్నాతు  భారతివై దదాతి చ,
భారతి  తారకోభాభ్యాం భారత్యె  తే  నమోనమ:

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

    తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
    యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
    భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
   ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
                                                


మీరు చేస్తున్న సన్మానము నాకు కాదు,  మీలొ ఉన్న ఒక గురువుకు, ఆ గురువు మీకు చేసిన విద్యా ప్రాప్తికి గుర్తుగా మీరు చేస్తున్నారు. మీరు ఎన్నో సంవత్చరాల  తర్వాత ప్రత్యేకముగా గుర్తిమ్చుకొని వచ్చ్హి మాస్టారు మాకు మీరు 10వ తరగతిలో నూటికి నూరు మార్కులు వచ్చెటట్లు లెక్కలు చేప్పారని సంతోషముతో ఈ సన్మానము చేస్తున్నామన్నారు.  నేను క్లాసు మొత్తము ఉతీర్నత చెందుటకు నా కృషి చేసాను. అందులో మీరు ఎక్కువ ఉత్చాహము చూపినారు. విజయము చెందినారు.
నేను కేవలము నా వృత్తి ధర్మము చేసినాను. దానికి తగిన పారితోషికము పోమ్దినాను.
కొన్ని ధర్మాలు మాత్రము ఇప్పుడు చెప్పగలను.  "మాతృదేవోభవ,  పితృదేవోభవ,, ఆచార్యదేవోభవ  "  శాస్త్రములో తల్లి, తండ్రి, గురువు అను మువ్వురు మూడు లోకముల వంటి  వారని, మూడు  వెదముల వంటి వారని దేవతలు తెలియపరిచారు.  తల్లి, తండ్రి, గురువును దైవముగా భావిమ్చినవారికి ప్రతి పనిని ధర్మ మార్గమున చేయగలుగుతారు.
శ్రీ భగవానుడు గీతలొ ముందుగా పెద్దలకు సేవచేయుటకు శారీరిక తపస్సుగా వివరించాడు.
విద్యార్దులారా మీరు సోమరితనమును, నిర్లక్ష్యవైఖరిని వీడి తల్లి, తండ్రి, గురువు (పెద్దల)సేవను పరమధర్మముగా భావించి భక్తితో వారిని సేవిమ్పుడు, పూజిమ్పుడు,  వారి యాజ్ఞాలను పాటింపుడు.
 మనువు తల్లి తండ్రులు, గురువు, గురిమ్చి ఈవిధముగా తెలియపరిచాడు.
పదుగురు ఉపాద్యాయుల కంటే ఒక ఆచార్యుడు,  నూరుగురు అచార్యుల కంటే ఒక తండ్రియు,  వేయిమంది తండ్రులు కంటే ఒక తల్లియు గౌరవాము చేత గొప్ప యగును.
ఈ సన్మాన సభలో ఆ పెద్ద ముత్తైదుని నేను సన్మా నిమ్చాలి   అనుకుంటున్నాను. విద్యార్దుల్లార మీర సహకరించండి. అని లేచి   గురువుగారు ఆమెకి పాదాలకు నమస్కరించి విద్యార్ధులు చేత నమస్కారమ్ చేయిమ్చాడు.

                                              
  
నేను విద్యార్ధులమ్దర్కి ఒక్క టే చెప్పేది., స్నెహభావముతొ,  ఒకరికొకరు కలసి మేలసి, సంతోషములోను, ద:ఖములోను జీవిస్తామని గురువు ముందు ప్రతిజ్ఞ చేయండి. దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాము. ఎలాప్పుడు సత్యం ధర్మం న్యాయం కోసం పోరాడతాం, ఎప్పుడు తల్లి తండ్రులను గురువులను పూజిస్తాము   అని ప్రతిజ్ఞ చేసారు.

                                            
                                                
విద్యార్ధుల అనుభవాలు చెప్పుకొని ఏర్పాటు చేసిన విందులో అందరు సమంగా పంచుకొని ఇటువంటి రోజు మల్లి మల్లి రాదు అను కుంటు సరదా సరదా జరుపుకున్నారు అందరు.        .