6, ఏప్రిల్ 2014, ఆదివారం

121. Love story -25 (mamakaaram)


  మనం  మానవులం,  మనం ప్రతి విషయంలో అలొచిస్తూ ఉంటాము, మన ఆలోచనలు రాత్రి పూట ఒక రకముగా,  పగిటి పూట ఒక రకముగా ఉంటాయి. మరియు  ప్రక్రుతి ననుసరించి,  మరో రకంగా ఉంటాయి. ఈ ఆలోచనలు మొదట రంగులు రంగులు గా ప్రకృతిలొ కనిపించి ఒకదాని వెంబడి, ఒకటిగా, ప్రయాణం చేస్తాయి. అవి వెలుగును చూసె  టప్పటి కల్ల అవి మాయ మవుతాయి. మనం నిద్రలో కుడా  కలలు వస్తూ ఉంటాయి    ఆ కలలు కొమ్దరికి  గుర్తుకు వస్తాయి కొందరికి గుర్తుకు రావు.
 
ఎవరిని నమ్మినా ,నమ్మకపోయినా ,మనలని  మనం నమ్మాలి, మన శక్తిని నమ్మాలి, మానవులు సృష్టిస్తున్న  శక్తిని   నమ్మాలి. దేవుడు సృష్టించిన ప్రకృతిని నమ్మాలి.  విశ్వంలో జరుగుతున్నా ప్రయోగాలు మనం చూస్తూనె ఉన్నాము. భూమిలొ జరిపిన ప్రయోగాలు చూస్తూనె ఉన్నాము.   పిల్లలపై మమకారము అందరికి ఉంటుంది. అందులో ఆడవారికి మరీ  ఎక్కువ, చిన్న  విషయానికి గాబరాపడి పోతారు. ఎమన్నా అడిగితె,  మెకెం మొగవారు మీరు పేగు తెంచుకొని పుట్టిన వారి భాద మాకు కదా తెలిసెది  అని అంటారు

ఏమండి తెల్లవారుజామున నాకు నిద్ర పట్టుట లేదండి ఎందుకో తెలియుటలేదు, నాకు అర్ధం కావటములేదు. మనమ్మాయిలు కలవరిస్తున్నారేమొనండి, ఒక్కసారి మన అమ్మాయిల  దగ్గరకు పోయి వద్దామా అన్నది భారతి భర్తతో.

ఎందుకు నిద్ర పట్టదు  ఇలా దగ్గరికి  జరుగు అంటు నడుము మీద చెఇ వేసి, భార్యను దగ్గరకు తీసుకోని హృదయానికి హతుకొని ముద్దులందిమ్చాడు  భర్త భరద్వాజ్,
ఏమండి ఈరొజు అమ్మాయిని చూడాలని ఉంది. నన్ను పిలుస్తున్నట్లు ఉన్నది. నా మనసు గాబరా పడుతున్నాది. నీ విక్కడ ఉన్నావు అమ్మా యి అక్కడ ఉన్నది అక్కడ జరిగే విషయాలు నికేట్లా తేలుస్తాయి అంత నీ బ్రమ  ఫోన్ వస్తే వేల్దాములే  అన్నాడు భర్త.
నాకు మాత్రం అమ్మాయని చూడాలని లేదా నీవు బయట  పడతావు, నేను బయట పడలేను. రేపు ఆదివారము వేల్దాములే హాయిగా నిద్రపో అన్నాడు. భార్య నిద్రలోకి జారుకుంది.   'కలవరిస్తూ  మావారు చాలా మంచివారు నామాట తూచా తప్ప కుండా పాటిస్తారు.అన్నది.       '
నా భార్య అల్ప సంతోషి నన్ను ఈమి అడగదు. ఇది కావాలని అది కావాలని వత్తిడి చేయనే చేయదు ఎదయినా  కొందామన్న  మనకెందుకు ఇప్పుడు మరీ అంటుంది.భార్య నిద్ర పోతున్నట్లు తెలుసుకొని నెమ్మదిగా లేచి ఐల్లంతా ఊడ్చి, అంట్ల  గిన్నెలు దొడ్లో వేసి, మురికి బట్టలు సర్ఫులో నాన పెట్టి, చెట్లకు నీరు  పోసి, పలప్యాకేట్టు తెచ్చి పాలు కాచి, పాపారు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అంతలో పాపారు అన్న మాటలకు భార్య భారతి లేచి అయ్యో మొద్దు నిద్ర పోయాను, ఇప్పుడే ఉండండి కాఫీ కలిపి తెస్తాను అన్నది.
నీవు ఈ పేస్టుతో మొఖం కడుక్కో ముందు, తర్వాత ఈ పాపారు చదువు,  నేను కాఫీ పట్టుకు వస్తా,  నెమ్మదిగా కూర్చొని కాఫీ త్రాగు అన్నాడు భర్త.  ఏమిటండి  ఆడవారు చేసే పనిలన్నీ మీరు చేస్తే ఎట్లా అన్నది. పనులకు ఆడమోగా తేడా  ఏమిటి. ఇప్పుడు అమ్దరూ సమానులే అమ్దరూ ఉద్యోగమూ చేస్తున్నారు. పిల్లలను పెంచుతున్నారు. పిల్లలను కంటము మాత్రము  ఆడవారు కష్టబడక తప్పదు.
అదికూడా  మీరె చేస్తే మా బ్రతుకులు ఎమోతాయో అన్నప్పుడు ఒక్కటే నవ్వులు వెలసిల్లాయి   ఆ ఇంటిలో.  
                                              


    మా ఆయన  అందరికి పులి లాగా కనిపిస్తాడు. నాకు మాత్రము పిల్లి లాగ ఉంటాడు.ఇదిగో కాఫీ అంటు సాసర్లో సగం పోసుకొని, మిగతా సగం కాఫీ  కప్పు చేతికందిమ్చాడు భర్త ,భార్యకు .
మీ సేవలు చూస్తుoటే నాకు సిగ్గేస్తుమ్డండి. ఇక సిగ్గు పడకు అమ్మాయి లందరి పెళ్ళిళ్ళు చేసాము. అల్లుడు పిలిస్తే మనము పోవాలి. మనం ఇప్పుడు  పోయినా గౌరవము ఉండదు. ఎదయినా అవసరము  ఉన్నప్పుడు పోదాము ఆన్నాడు. నాకు మీరు నీకు నేను ఒకరి కొకరం తోడూ నీడల్లా ఉందాము.
ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల, అవును గదండి నేను మా అమ్మా నాన్నను చూడా లంటే  ఎన్నో షరతులు పెట్టి పంపించేవారు మన పెళ్ళైన కొత్తలో,   అవును కదా అవన్నీ ఇప్పుడెందుకు,  మనమ్మాయి  దగ్గరకు నిన్ను పంపిస్తాను అన్నాడు.
ఇంటి దగ్గరలో ఆఫీసు ఉండటం వళ్ళ నెమ్మదిగా నడుచు కుంటు  బయలుదేరాడు భరద్వాజ్ .
అంతలో వెనుకనుండి భరద్వాజ్ అని పిలుపు వినబడింది. ఎవరా అని చూడగా చిన్నప్పటి స్నేహితుడు  సుబ్బారావు. అందరూ కులాసా అని అడిగాడు . అమ్దరూ కులాసా  అని చెప్పాడు. మొన్న హైదరాబాదుఃలో  మీ అల్లుడు కూతురుని కలిసాను, పలకరించాను మా ఇంటికి రంమ్మన్నారు వెళ్లాను.
వాళ్ళు సఖ్యతగా ఉన్నాట్లు నాకనిపించలేదు. ఏదో ఒకారికొకరు పోట్లాడుకుంటున్నారు అని చెప్పాడు.   అయినా మీ కుటుంబము  విషయములు నాకెందుకు అన్నాడు.
నీవు చెప్పేది నిజమా, అభద్దమా అన్నాడు. నేనెప్పుడయినా నీతొ అభద్దము చెప్పుతానా  నా కళ్ళారా చూసాను కాబట్టి నేను చెప్పగలిగాను అన్నాడు.సుబ్బారావు.
ఈ విషయము మరెక్కాడ చెప్పకు  నేను మా అమ్మాయి కుటుంబము సరిదిద్దుతా అన్నాడు.
నేను ఈ రోజే మా అమ్మ యి దగ్గరకు వెళ్లి విషయ ములు తెలుసుకుంటాను అన్నాడు సుబ్బారావుతో . నేను చెప్పానని కోపము తెచ్చుకోకు విషయము ఉన్నది ఉన్నట్లు చెప్పను అన్నాడు. సుబ్బారావు..

సుబ్బారావు చెప్పింది నిజమా కాదా . నమ్మాలా వద్ద అని ఆలోచనలో పడ్డాడు భరద్వాజ్ చూసాను నమ్మకముగా చెపుతున్నాడు, ఇతని మాటలు నాకు నమ్మకమనిపిస్తున్నాయి  నమ్మడం వళ్ళ ఆత్మ విశ్వాసం, ధైర్యము కలుగుతుంది. సహనంతో పరీక్ష జరిపి కాపురాలను జాగర్తగా నిలబెట్టాలి. అదే కుటుంబ పెద్దగా నేను చేయాల్సిన పని.
దిగులుగా ఉంటే పని కాదు. అని తలచి వెంటనే ఆఫీసుకు పొయి రెండు రోజులు సెలవు పెట్టి, ఇంటికి వెళ్లి  పెల్లంతో బట్టలు సర్దమని చెప్పి, ఆఫీసు పనిమీద మన అమ్మాయి ఉన్న ఊరు వెళుతున్నాను. నేను అక్కడకేల్లక నీకు ఫోన్ చేస్తాను. నీవు ఏమి గాబరా పడకు. అక్కడ విషయాలన్నీ నీకు తెలియపరుస్తాను. నేను రమ్మంటే అక్కడకు వచ్చేయి,  నీవు కూడా  బట్టలు సర్దుకొని ఉండు నేను ఫోన్ చేసాక బయలు దేరు అన్నాడు  భార్యతో భరద్వాజ్.
సరే నండి మీరు జాగర్తగా వెళ్ళండి. మీ ఫోన్స కోసం చూస్తాను అన్నది భార్య.
హైదరాబాద్ చేరాడు, అమ్మాయి ఇంటికి వచ్చాడు, నెమ్మదిగా ఇంటి ముందు ఉన్న బెల్ ను నొక్కాడు.
కూతురు కల్యాణి తెరిచింది. నాన్న ఏమిటి అనుకోకుండా ప్రత్యక్షమైనాఉ నాన్న
అమ్మాయి నీవు సుఖముగా ఉన్నావా,  అల్లుడు నిన్ను బాగా చూసు కుంటున్నాడా  అని అడిగాడు.
ఏమిటి నాన్న ఆట్లా అడుగుతారు, నేను బాగానే ఉన్నాను ముందు మంచి నీల్లు త్రాగండి, అమ్మను కూడా తెస్తే బాగుండేది. అమ్మ ఒక్కతే అక్కడ గాబరా బడుతు ఉంటుంది.
మీ అత్తగారు నిన్ను బాగా చూస్తున్నారా, అల్లుడు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టుట లేదు కదా  అన్నాడు.
నేను చాలా  సంతోషము గా  ఉన్నాను నాన్న
నాకు ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు నాన్న
నేను ఉద్యోగమూ చేస్తానన్న వద్దన్నారు నాన్న
ఇంట్లో ఉండి హయిగా వంట వండి పెట్టమన్నారు నాన్న
ఔనమ్మ ఏదో నిన్ను చూడాలని, నమ్మకస్తుడి ద్వారా విన్నాను నీకుటుమ్బములొ కలహాలు వున్నాయని చెప్పరమ్మ, అందుకే భయమేసి వచ్చానమ్మ అన్నాడు.
చెప్పుడు మాటలు విని రాకూడదు, కాని నిజమా అభాద్దమా తెలుసుకోవాలి కదమ్మ, నా స్నేహితుడు అభద్ధము చెప్పాడు
ఇందులో ఏదో జరిగింది అదే ఏమిటో తెలుసుకోవాలి అన్నాడు.
ఇక్కడమ్దరూ బాగున్నాము అదిగో వచ్చారు మీ అల్లుడు గారు వారినే అడగండి నేనేలాగున్నానో అన్నాదితండ్రితో 

అల్లుడుగారు మీరు సుబ్బారావును ఎప్పుడైనా కలిసారా, ఆ సుబ్బారావు  గదా మొన్న పెళ్ళిలో నాకు మీ అమ్మ యి కి కనిపించాడు. చక్కగా పలకరించాడు. మనింటికి కూదా రమ్మనమని అడిగాను వస్తానని చెప్పాడు కాని రాలేదు అన్నాడు.
ఆ రోజు రాత్రి వచ్చి ఉంటాడు మరొక్కసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. ఆ రోజు రాత్రి మేము నాటక రిహర్సులు వేస్తున్నాము. ఎవ్వరూ తలుపు కొట్టినట్లు తెలియ్యలేదు అన్నాడు. నాటక రిహర్సులా ఎవరెవరు అన్నాడు.
ఎవరేమిటి మీ అమ్మాయి నేను. శ్రీ రామనవమి స్టేజి మీద పోట్లాట రిహర్సులు చేసాము. మీ అమ్మాయి అందులో జీవిమ్చిది. కన్నీల్లు కూడా పెట్టింది.
అదా విషయము
ఎంతపని చేసావు, గోడలకు చేవు లుంటా యని గుర్తిమ్చాలేదా మీరు. మీ మాటలు తలుపుదాక వచ్చి విని మీ కుటుంబము కలహములొ ఉందని బ్రమిమ్చి వెనుకకు వెళ్లి పొయి ఉంటాడు నా స్నేహితుడు.
మావగారు మాకసలు తెలియలేదు
అమ్మాయి కల్యాణి నా అనుమానము తీరిమ్ది, ఇప్పుడు గుండె ధ్యేర్యముగా కొట్టు కుంటుంది.
మాట వరుసకైన నోటి వెంబటి అనరాని మాటలు అనకూదదు , ఏడుపు పెడబొబ్బలు రాకూడద్దమ్మ, ఇంటిలో నవ్వులు తప్ప మరి ఏమి వినబడ కూడదు.
సరే అమ్మకు ఫోన్ చేసి ఇక్కడకు రమ్మనమని పిలువు అన్నాడు కూతురుతొ.
అమ్మాయి నాన్న  అక్కడక్కోచ్చాడా నేను కూడా ఇపుడే బయలు దేరుతాను. అన్నది
అల్లుడుగారు మీరెమనుకొకమ్ది మీ మీద మమకారము ఉమ్దతమువల్ల అట్లా అడిగాము కాని మీ
మీద నమ్మకము లేక కాదు.
అవును మావయ్యగారు. మేము చేసిన రిహర్సులు ఇంతపని చేస్తాయని అనుకోలేదు.

                                          

       .                 .