29, డిసెంబర్ 2018, శనివారం

(పాఠశాల ల్లో హాస్యం) (2)


అబ్బబ్బ వెధవ బండి' 💥

(వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం)
🌺🌺🌺🌺🌺🌺

👉🏿ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.

👉🏿బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.

👉🏿పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది.
కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.

👉🏿దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).

👉🏿
దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.

*****

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.
👉🏿ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

👉🏿రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

👉🏿అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

👉🏿దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

👉🏿పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

👉🏿ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

👉🏿అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

👉🏿ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

👉🏿, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదాలు.


శ్రీమతిగారు!
ఇవాళ అధ్భుతమైన భోజనము చేసినట్లుగా కలొచ్చింది!

మీ కలలో కన్నా అత్యధ్భతమైన వంటకాల రుచి ఈరోజు చూడబోతున్నారు శ్రీవారూ!

ఆహా! ఏమి నా భాగ్యము!
ఇలలో స్వర్గమంటే ఇదేరా!
శ్రీమతిగారూ! నీకేమి కావాలో కోరుకో మరి!

వద్దులెండి, మీకిబ్బందిగా వుంటుందేమో?

నీ కోరిక తీర్చకుంటేనే నాకు నరకం తెలుసా?

అంత మాటనకండి పతిదేవా!
ఇదిగో నా చిట్టా!
1 మా అమ్మ నాన్న అన్నయ్య వదిన చెల్లి మరది వాళ్ళ సంతానాలూ వస్తున్నారు,
వాళ్ళందరినీ జాగ్రత్తగా టేక్సి లో ఇంటికి తెండి
2 వాళ్ళున్న నెల్లాళ్ళు సెలవు పెట్టి అనేక ప్రదేశాలు తిప్పండి
3 వాళ్ళు వెళ్ళేప్పడు ఘనంగా సత్కరించి సాగనంపండి!
మీ పాద ధాసి ఈ చిరు కోర్కె తీర్చండి ప్రభూ!
--((**))--
భార్య : ఏవండోయ్.. ఇవాళ సాయంకాలం తొందరగా ఇంటికి రండి సినిమాకు వెళ్దాం....

భర్త : నా దగ్గర TRS 🚙గుర్తేమైనా ఉందా, ఉండేది TDP🚲 గుర్తు... ఆలస్యం అవుతుందేమో!

భార్య : సకాలానికి వస్తే BJP🌹 గుర్తు, ఆలస్యమైతే కాంగ్రెస్✋ గుర్తు, మరీ ఆలస్యమైతే AAP🏒 గుర్తు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం....
.
.
.
.
.
ఇంకా నయం ఈ మహాతల్లికి CPI గుర్తు గుర్తురాలేదు...
--((**))--
అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి...

భర్త:- ఏమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ)

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది?

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది ...

#అందుకే_నా_మొబైల్_పాస్_వర్డ్_ఎవరికీ_తెలియనిదీ_అసలెవరూ_ఊహించనిదీ_పెట్టుకున్నా_లేపి_తన్నించుకోవడం_ఎందుకులే_అని
--((**))--

నేటి హాస్యం
శ్రీవారూ! I love u So much!

ఏమైనా కావాలా శ్రీమతిగారూ?

ఏమీ అఖ్ఖర్లేదు శ్రీవారూ!
రేపు మా చెల్లి వస్తుంది, శ్రీ రామ చంద్రుడు లా వుండండి చాలు!!!
--((**))--
సుషీ! నీ మీదొట్టు!
తాగడం మానేసి షాలా సంచ్రాలయిందే!
నీ హ్రుదయంలో కాస్త చోటు ఇవ్వవే!

పానకాలు గారూ! మీ ఇల్లు పక్క వీదిలోనుంది! వేగంగా దయచేయండి,
ఈలోగా మా ఆయన గాని వచ్చారో,
మీ స్థానం హ్రుదయాల్లో కాదు,
స్మశానవాటికలో వుంటాది!
--((**))--
బావా! నా పాలకోవా!
ఈ జన సంచారము లేని అడవిలో
మనమిద్దరమూ
డ్యూయెట్ పాడుకందామా?

ఏం పాట?

నీ యిష్టమే!

నాకిష్టమైన పాటలలో నువ్ దేనికి సూట్ అవవే!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
పాడదామంటే నువ్ డ్రస్ వేసుకున్నట్లు తదేకంగా చూస్తే గాని తెలీదు

నా హ్రుదయంలో నిదురించే చెలీ అని పాడదామంటే నీకు నా ఆస్తుల మీద పడుక్కోవడము మాత్రమే ఇష్టం

నీ జెడ వలపు పాశమవి బెదరితిలే అని పాడదామంటే నీ వున్న జుత్తునే తగ్గించేశావు

లేదనిపించే నీ నడుము పాట పాడదామంటే నడకలో పందెం కడితే తాబేలు నీ కన్నా ముందుంటుంది

తీగెలాంటి నడుము దాన అని పాడదామంటే నీ నడుము దట్టమైన వటవ్రుక్షంలా వుంటుంది

ఇది అయే పని కాదు గాని నీకు రెండు గంటల సేపు తినగలిగే తిసు భండారాలు తెస్తాను.
అవి హాయిగా తినేస్తే ఇంటికి పోదాం

బావోయ్
తంధూరీ చికెన్ తేవడం మర్చిపోకేం!
--((**))--

--((**))--
మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు.
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు.
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?'

మీరు తీర్చలేరు వదిలేయండి సార్!

నా మాట నమ్మండి...
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!
--((**))--

28, డిసెంబర్ 2018, శుక్రవారం


ప్రాంజలి హాస్య ప్రభ  
1 . కుటుంబంలో నవ్వులు(సంగీతమ్)  

ఎమ్మా " మీ అమ్మాయికి సంగీతం నేర్పిస్తిన్నావా" 
అయ్యే రామా "మూడో కంటికి తెలియకుండా" నేర్పిస్తున్నానే 
ఎం నేర్పింస్తున్నావో ఏమో "ప్రకంపనలకు" గిన్నెలు క్రింద పడ్డాయి 
అవునాండి "నేను సర్దుతాను లే" 
పక్క పోషన్ ఆవిడ వచ్చి సంగీతాన్ని ఇంట్లో కాకుండా బయఁట ఎక్కడన్నా నేర్పించవచ్చుగా 
అదే అను కున్నానండీ " మీ దగ్గర డబ్బులు ఉంటె ఇవ్వండి", 
సంగీత పాఠశాల హాస్టల్ ల్లో చేర్పించి మరీ నేర్పిస్తా
నాకెందుకమ్మా నీ కూతురు  నీఇష్టం 
ఇదుగోనమ్మ ఇది తీసుకో 
ఇదేమిటి 
చెవిలో పెట్టుకోండి దూది 
వద్దులేమ్మా మేమే ఖాళీ చేసి వెళ్లి పోతాం 
మంచిది తక్షణం అందరు ఇక్కడ నుండి వెళ్ళండి 
వెళ్ళక చస్తామా  
అమ్మా సంగీతం పాడమంటావా 
మీనాన్న వచ్చాక ఇద్దరూ కలసి పాడండి
అప్పుడు నీవు బయటకు వెల్తావు కదమ్మా 
అందరితో పాటు నేను కూడా తప్పదమ్మా ఏంచేద్దాం 
వద్దు ఇప్పుడే పాడుతా ..... 
సా... రీ... గా ........?
అమ్మా ఏమిటి అట్లా పడిపొయ్యావు లేమ్మా 
సరిగమపా సరిగమపా సరిగమపా .....సా ... సా ... సా 
--((**))--

ప్రాంజలి హాస్య ప్రభ  
2 . కుటుంబంలో నవ్వులు (నెల తప్పఁటం)
సుభద్రా నీకో విషయం చెప్పాలే  
ఏమిటో ఆ గొప్ప విశేషము 
నేను నెల తిప్పానే 
మీ వారికి చెప్పవా 
చెప్పానే 
డైమండ్ నెక్లెస్ తెస్తానన్నాడా 
లేదే 
మరేమీటే   
ఎప్పుడే ఎందుకు పిల్లలూ ఎబార్షన్ చేయిన్చుకోమన్నాడే 
ఆ ..    ఆ..    
మా ఆయినైతే ఎంచక్కా పుట్టింటికి పంపి 
బుర్ర తిరిగినప్పుడు వచ్చేవాడే 
ఆ ... ఆ....     

--((**))--

ప్రాంజలి హాస్య ప్రభ  
3 . కుటుంబంలో నవ్వులు (కట్నం )

పంకజం బాగున్నావా 
దిబ్బరొట్టెలాగా ఉంటె నీ కళ్ళకు కనిపించుటలేదా  
కొత్తగా పెళ్లైంది కదా అడిగాను 
అవునే 5 లక్షలు ఇచ్చి ఆయన కొన్నాను కదా అందుకని 
అన్నీ పనులు మా ఆయనే చేస్తున్నాడే 
ఒక్క పిల్లలు కనటం తప్పా 
ఆ ..  ఆ లేదు ఊ లేదు ... 
నాకన్నా ముందు పెళ్లైంది కదే నీకు
అవునే కట్నం వద్దు, ఉద్యోగం చేస్తే చాలన్నాడే 
మరింకే మంచిదే కదా      
వళ్ళు గుల్ల ఇంట్లో ఒక్క పనీ చేయడే 
ఆ ..  ఆ లేదు ఊ లేదు ... 
బ్రహ్మ వ్రాసిన వ్రాత ఇంతేనని సర్దుకు పోదాం 
అంతేనా ..... అంతే....        
--((**))--
 
ప్రాంజలి హాస్య ప్రభ  
మల్లాప్రగడ రామకృష్ణ 
4 . కుటుంబంలో నవ్వులు ( సవతి పోరు )

శ్రీదేవి మీ అయన లో నీకు బాగా నచ్చినదేది 
ముందు మీ ఆయన లో నచ్చింది చెప్పు భూదేవి 
అట్లాగే 
నన్ను దాటి ఎక్కడికీ పోలేడు ఎప్పుడు నామీదే ఉంటాడు  
నువ్వు చెప్పు 
అయన ఎవ్వరికీ నచ్చరు అదే నాకు నచ్చింది 
చూసాక మల్లి మల్లి వచ్చి చూస్తారు 
 ఆ ....   ఆ ....    


ప్రాంజలి హాస్య ప్రభ  
మల్లాప్రగడ రామకృష్ణ 


5 . కుటుంబంలో నవ్వులు ( కోరిక  )

ఊర్వసి ఏమిటలా ఉన్నావు 
నేను బాగానే ఉన్నాను కదా రంభ
లేదు నీవు ఎదో చెప్పలేను కున్నావు చెప్పు 
రాత్రి మీ ఆయన చికాట్లో వచ్చి నన్ను కౌగలించుకున్నాడే 
అప్పుడేం చేసావే చెప్పు త్వరగా 
అప్పుడు 
ఆ అప్పుడు 
అప్పుడు కాసేపు మీ ఆయన్నే మా ఆయన అనుకున్నా అంతే 
ఆ ......  ఆ....      


ప్రాంజలి హాస్య ప్రభ  

మల్లాప్రగడ రామకృష్ణ 
6 . కుటుంబంలో నవ్వులు 

భర్త: భార్యతో బయట గోడుగులమ్మే వాడు వెళుతున్నాడు పిలవవే 
       మిరేమ్చేస్తున్నారు కాలుమీద కాలు వేసుకొని పాపరు చదవటం    
       తప్పా
       మాటకు మాట సమాదానం చేపతావు, నేనే పిలుస్తాను 
       ఇదిగో గొడుగులు అమ్మే అబ్బాయి ఇటురా 
       అన్న మాటలకు 
       పెద్ద మనిషి  లాగున్నారు గౌర వించి మాట్లాడడం రాదా మీకు 
       నేనేం తప్పు మాట్లాడ లేదే అన్నాడు దశరధ రామయ్య 
       మరి నేను గోడుగులు అమ్మే వాడిలాగా కనిపిస్తున్నానా 
       మరి ఆ గోడుగులన్ని మోసుకేల్తా వెందుకు  
       " ఎ ఎండకు ఆ గొడుగు పట్టమని " మా   నాన్న చెప్పాడు
       నాలుగురకాల గొడుగులు ఉంచుకుంటా   
       అసలే కోట సంవస్చరం మొదాటి రోజే మాటలు పడాల్సి వచ్చింది 
       ఆ.......... లోపలనుమ్చి ఒకటే నవ్వులు 
                   
               --((**))--


ప్రాంజలి హాస్య ప్రభ  

మల్లాప్రగడ రామకృష్ణ 


7  . కుటుంబంలో నవ్వులు 

భర్త : అలసి పొయి  ఇంటికి వస్తే, గమనిమ్చవే 
భార్య :  టి. వి.  సీరియల్ అయి పోయేదాకా ఓపిక పట్టండి.
భర్త :    నాకు బాగా ఆకలేస్తుందే  ఏమైనా ఉంటే పెట్టు
భార్య : ఉండండి సరిగ్గా సమయానికి వచ్చారు     
           టి. వి. లో పిండి వంటలు  ఎలా చేయాలో చెపుతున్నారు 
           రాసుకొని వచ్చి వంట చేసి పెడతా కాస్త ఓపిక పట్టండి నాకోసం
భర్త :    కొత్త సంవస్చరం కదే
భార్య : రోజు వండు కొని తినటం కదా మనం చేసేది. 
భర్త:  ఈ రోజు అమరావతి బిరియాని తెచ్చా తిందాం రా 
భార్య: ఇటివ్వండి టివి చూస్తూ తినేస్తా 

ఆ...    ఆ..    

26, డిసెంబర్ 2018, బుధవారం

పాదారవిందే ప్రణత: ప్రపద్యే





ప్రాంజలి ప్రభ : ఆర్.కె మల్లాప్రగడ IUIUUIIUIUU జ త జ గ గ (తెల్గు దేశం) సమాన ప్రాబల్య పరోక్ష ప్రాధా న్యతా మహీపూజ మనో ప్రభావ స్వయం అనూహ్యా అమరావతీ ని ర్మాణం ధర్మాన్వేషి కృషి వల్ల తీర్పే UUIUUIIUIUU (తతజగ ) (తెల్గు దేశం) కాలం సమావృత్త ప్రభావమే గ మ్యా గమ్య, సవ్యా సహజత్వ మాల స్వరూప విజ్ఞాన నవీన భావ సత్యా ధర్మ ప్రపంచం మన తెల్గు దేశం

గెల్చేది ప్రాబల్య మనో వికాసం
సామాణ్య సంతోషము గెల్పు కోరే
సాంఘీక భావాలను నమ్మి కొల్చే
సత్య ప్రపంచం మన తెల్గు దేశం

గెలుపు గుర్రానికి వచ్చు గర్వం
పెదవి జాడ్యానికి వచ్చు బూతుల్
మనిషి ఉన్మాదియు చిచ్చు పెట్టూ
తెలివి ఉన్నా మది చిచ్చు పెట్టూ

సిగ్గు లజ్జ ఉంటె విశ్వాసం ఉన్నదా ఉచ్ఛ నీచ ఉంటె వాగ్దానం ఉన్నదా చంక నాకె పల్కు సారూప్యం ఉన్నదా ముఖ్య మంత్రి పల్కు భావ్యంగా ఉన్నదా

  

19, డిసెంబర్ 2018, బుధవారం

శుభోదయ వేళ జీవిత రాగం-3

నేటి కవిత-10007
పంజలి ప్రభ
సరిహద్దు సాహిత్యం

వాహనాల శబ్దాలు ఒకవైపు
తుపాకి గుండ్ల మోతలు మరోవైపు
ఎవరు ఎటు వైపునుండి వస్తారో
ఏ విధంగా ప్రవర్తిస్థారో

ఏ దుర్వార్త వినాల్సొతుందో
ఏ స్థితిలో చీకటి నీడలు వ్యాపిస్తాయి
కాలు బయటపెట్టలేక
కంటినిండా నిద్రలేక
ఉన్నబట్ట కట్టుకొనలేక
కడుపునిండా తిండి లేక
సరిఅయిన రక్షణ లేక
పగలే చీకటి నీడలు వ్యాపిస్తాయి
బాంబుల భయముతో
తట్ట, బుట్ట, బట్ట, సర్దుకోవటం
అనుబంధాలను తట్టలో పెట్టుకొని
జ్ఞాపకాలను బుట్టలో పెట్టుకొని
చినిగిన బట్టలు సర్దుకొని

కోతకొచ్చిన పొలాన్ని వదిలేసి
అనారోగ్యులను భుజాన మోసి
క్షణ క్షణ చావుని చూసి
ఉన్నా ఊరు వదిలేసి

సరిహద్దు బ్రతుకు చావా
బ్రతుకా అని మెండిగేసి
తల్లి పిల్ల విడిపోయి ఉండలేక
కూర్చొనక ,
భయం గుప్పెట పట్టి బయలుదేరారు
క్షతగాత్రులను పట్టించుకొనేవారు లేరు
తుపాకుల నీడలు కమ్ముకుంటున్నాయి



--((**))--

నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ. 

మన బలహీనత 
సానుభూతి స్పర్శ చాలు  
మన వివాదం 
రేపటికి మర్చిపోతే చాలు 

మన అనారోగ్యం 
మనసుకు చేర కుంటే చాలు 
మన ఆహ్లాదం 
ఎవ్వర్నీ భాధించు కుంటే చాలు

మన కన్నీళ్లు 
తక్కువ చేయ కుండా ఉంటె చాలు  
మన నిరాశలు  
నిరుత్సాహము లేకుంటే చాలు 

మన నిట్టూర్పులు 
జోల పాటలన కుండా ఉంటె చాలు
మన ఆశయాలు 
ప్రశ్నలతో వేధించకుండా ఉంటె చాలు 

మన ఓటమి 
తిరుగుబాటు రాకుండా ఉంటే చాలు 
మన కలిమి 
వేరొకరు ఈర్ష్య పడకుండా ఉంటేచాలు  

మన బలిమి 
భయపడ కుండా ఉంటె చాలు 
మన చెలిమి 
ఎప్పటికీ చెడకుండా ఉంటె చాలు 

--((*))--

నీ నవ్వు నీ నడక నీ వెలుగు
నాకు కిరణంలా అనే చాలు
నీ ప్రేమ నీ భాష నీ తృప్తి
నాకు సంక్రాంతి లా ఉంటె చాలు

నీ ప్రాణం నీ ఊపిరి నీ వయసు
నాకు పతంగం లా ఉంటె చాలు
 నీ పరువు నీ మెరుపు నీ తలపు
నాకు ముత్యం లా ఉంటె చాలు

నీ మార్పు నీ ఓర్పు నీ తీర్పు
నాకు త్రాసు లా ఉంటె చాలు
నీ గుణం నీ తరుణం నీ సొగసు
నాకు అరుణం లా ఉంటె చాలు

నీ కలిమి నీ బలిమి నీ చెలిమి
నాకు నదిలా ఉంటె చాలు
నీ ఊహలు నీ ఆశలు నీ భావాలు
నాకు మంచులా ఉంటె చాలు

నీ కోపాలు నీ శాపాలు నీ తాపాలు
నాకు మేఘం లా ఉంటె చాలు
నీ కునుకు నీ వణుకు నీ పలుకు
నాకు జాబిల్లి లా ఉంటె చాలు

నీ గాలి నీ జాలి నీ లాలి
నాకు లతలా ఉంటె చాలు
నీ పాట నీ మాట నీ ఆట
నాకు రంభ లా ఉంటె చాలు

నీ చూపు నీ కైపు నీ మోపు
నాకు బెల్లం లా ఉంటె చాలు
నీ నేత్రం నీ చక్రం నీ మంత్రం
నాకు ఔపోసన లా ఉంటె చాలు   


--((**))--


సంక్రాంతి సరదా కబుర్లు 
రచయత: మాలాప్రగడ రామకృష్ణ 
సంక్రాంతి వెలుగు కిరణాలు 

పెద్దల పాదాలకు పూజ చేసి  
హృదయాల్ని పరవశింప చేస్తా 
 ప్రేమ పాలనలో లాలింపచేసి
సంతోషాలతో ఆనందింపచేస్తా  

ఇచ్చిపుచ్చుకొనే మాటనమ్మేసి 
నిత్యం సంక్రాంతి శోభను అందిస్తా 
నదాల ఉపయోగం క్రమం చేసి 
ప్రాణాన్ని నిలిచేట్లు కృషిచేస్తా   

మట్టిలో ఖనిజాల్ని పైకితీసి
ఇంధన సంపదను పెంచేస్తా    
హరితవనాల్ని పెంపచేసి 
రోగాలకు విముక్తిని కల్పిస్తా 

సంద్రం అగ్నితో మరగింపచేసి 
మేఘాన్ని సృష్టించి వర్షాన్నందిస్తా
ఋతువుల గుణం తెలియచేసి     
ఉత్తేజం ఉత్సాహం కల్పింపచేస్తా 

--((**))--


సంక్రాంతి లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

మల్లెపూల గుభాళింపు మత్తులే  
కల్లలేని మనసుల చూపులే 
కరుణ చూపులతో కవ్వింపులే 
వెల్లువెత్తి విరిసే మమతలే 

విల్లువంటి నడుమ వనితలే  
ప్రేమభరిత తెలుపు సుధలే  
కలువ కన్నుల దొంగచూపులే  
చెరకుగడ కోసమే గంతులే 

చిన్నదాని నడకల నవ్వులే 
పిల్లలతో పాలకుల చిందులే 
చురకల మాటలతో గంతులే 
వలపు విరుపులతో వింతలే 

యదను తడుపు సంభాషణలే 
కలత తొలగించే హృదయాలే  
కన్నె కవ్వించే చిరునగవులే 
చిన్న పెదవులతో మదనాలే 

--((**))--

సంక్రాంతి సరదా
రచయత : మల్లా ప్రగడ రామకృష్ణ

మనసెరిగిన మమతల అక్క 
రుచిమరిగిన మనుగడ  నక్క 
బొమికతినిన వినయపు కుక్క   
చిరునగవుల పెదవులు చుక్క 

ప్రతిపలుకులొ నిజమును ఒక్క 
వలువలువలె  విడిచిన తొక్క 
మధురమును తెలిపెడి బొక్క 
బ్రతుకువిలువ కనబడు చొక్క

కలతలను వదలని గుక్క 
మనగడను కలిపెడి ముక్క 
మనసులను వెతికెడి చెక్క       
వయసులను నలిపెడి పక్క 


అక్కడ ఇక్కడ ఎక్కడ
తక్కెడ మక్కువ ఎక్కువ 

--((**))--

సంక్రాతి లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మాతృమూర్తి వరాల తల్లి ప్రాణము పోసె  
ఊపిరే నిలిపే సమాన ప్రేమంతో 
న్యాయ దేవత తల్లి పల్కువెల్లువతల్లి   
సంతసంతొ మనల్ని పెంచెమాతృశ్రీ 

తండ్రిబిడ్డల పోషణాల కేప్రేమ ఖర్చె   
చేసియే తనువే నవోదయం చెందే     
కొత్తబట్టలు కోరుకున్న కోర్కల్ని తీర్చె    
నిత్య సాధన చేసి పొందు సంక్రాతే   

ప్రేమ తల్లి జగాన తండ్రిప్రేమ యుగాన 
ధర్మ మార్గ విధాన  జీవితం సల్పే 
నిత్య బోధ ప్రభావ మార్పు తెచ్చె తల్లి
సంబరంతొ సుఖాల వెల్లువే  క్రాంతీ
  

--((**))--


సంక్రాంతి  లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

పల్లెలన్నీ పచ్చతోరణాల వెల్లువ 
రంగుల రంగవల్లితో పువ్వు లెల్లువ 
ముంగిళ్ళ గొబ్బెమ్మలతో ముచ్చట్లేళ్లువ
హరిదాసు గాణమ్ముతో భక్తి వెల్లువ  

గంగిరెద్దు ఆటతో సన్నాయి వెల్లువ 
సంపదతో పుంజుపోరు పందాలెళ్లువ
పట్టన వీధులయందు ప్రభలెళ్లువ    
లోగిళ్ల వేడుకలతో హర్షం వెల్లువ  

బావామరదుళ్లతో సందడి వెల్లువ 
కొత్తబట్టలతో కోరికల వెల్లువ  
కొత్తబియ్యంతో పొంగలి వెల్లువ 
గాలిపటాల పోటీ  పిల్లల వెల్లువ 

--((**))--

ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU 26 ఉత్కృతి 5680475
శుభోదయ వేళ జీవిత రాగం (46 )
మల్లి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నాగమల్లి వరాళ మల్లి పాఠము మల్లి జాతి ప్రేమల మల్లి సేవయే చేసే న్యాయ దేవతమల్లి పల్కువెల్లువ మల్లి సాంఘికలయమల్లి సంతసం చేసే మాతృమల్లి నవీనమల్లి నాట్యముమల్లి సాధన కరమల్లి సోధనే చేసే జామురాతిరిమల్లి కొంగుచూపిటిమల్లి కోటినయనమల్లి కోరికే చూపే జాతిమల్లి జయాలమల్లి జాప్యముమల్లి జాగరకలమల్లి జాతకం చూపే రామమల్లి రమాలమల్లి రాగముమల్లి రాతిరిజతమల్లి తామసం చూపే చారుమల్లి జగాన ఛాతిమల్లి యుగాన ఛాయమార్గముమల్లి చామరం తీసే భావమల్లి భయాన భీతిమల్లి ప్రియాన బాధమల్లి తపస్సు పూర్తియే చేసే
--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (46 )
తపనేలా - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

గొప్ప సేవ చేసి యుండ, కలసి కొక తపనేలా కొమ్మ చాటు పువ్వు యుండ, మురిసి కొక తపనేలా బుగ్గ మీద చుక్క లుండ. తడుము కొక తపనేలా గుండె లోన ఆశ లుండ, నిదుర తట్ట తపనేలా హద్దు లన్ని వేరు చేసి, పనులు చేయు తపనేలా ముద్దు లన్ని పంచి వేసి, అదిమి పట్టి తపనేలా ఊపి రాడ సద్దు చేసి, ఒడిసి పట్ట తపనేలా సిగ్గు లొల్కు కన్ను చూసి, మనసు పెట్ట తపనేలా ప్రేమ నంత పంచ నెంచి, కరము పట్ట తపనేలా ఓర్పు నంత ఇచ్చి వేసి, తనువు పట్ట తపనేలా మార్పు నంత చేసి వేసి, తలపు తట్ట తపనేలా తీర్పు నంత చెప్పి వేసి, తళుకు లెట్ట తపనేలా
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (45 )
ధరహాశి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ధరహాసముతో, సరససల్లాపముతో ఉవ్విల్లూరించి సుఖపెట్టు చుండు ! శృంగార కలాపముతో, మత్తుచూపులతో మగని ఆకర్షించు చుండు ! వంపు సొంపులతో మగని ఆకర్షించి క్షోభపెట్టి మన్మధలీల సాగిమ్చుచుండు ! ఉద్యోగముచేస్తూ, పతి సేవచేస్తూ, పిల్లలను ఇంటిని సరిదిద్దుకోను చుండు ! చక్కని చుక్కనిచుక్కనుచూసి మక్కునపడకుండ మగని కోర్క తీర్చుచుండు ! శరీరములొఉన్న శుక్ర సొణిత ధాతు కణములవలన సుఖపెట్టి సుఖపడు చుండు ! కొన్ని పరిస్థితులలో చిత్తమునకు చిచ్చుపెట్టి దరిచేరవద్దని భాదపెట్టు చుండు ! కాలముబట్టి, సమయముబట్టి, మన్మధలీలు, క్రీడలు, మార్పు చేయు చుండు ! కన్నవారికోర్కలు తీరుస్తూ, అత్తమావలకు శేవచేస్తూ, మగని కోర్క తీర్చుచుండు ! మౌనము పాటించి, అనుకున్నది సాధించేవరకు దూరముగా వుంచి జీవించు చుండు ! కలసిమెలసి బ్రతుకుట జీవితధ్యేయమని, పరమార్ధమని భావించు చుండు ! నవ్వులతో, అనురాగము పంచుతూ, ఆత్మీయులను పలకరింపులతో సంతోషముగా ఉండు ! --((*))--
శుభోదయ వేళ జీవిత రాగం (44 )
జీవితము - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
క్షణం క్షణం నీవు నేను కరిగి పోతున్నాము నన్ను నీవు నిన్ను నేను నిత్యం భరించటము ఒపిక లేక ఓదార్పుతో బ్రతుకుతున్నాము ఈ క్షణం తక్కువ ఎక్కువ అనవసరము మన ఇద్దరిది ఒక విడిపోని బంధము ఎన్నాళ్ళో మనం కలసి సమాంతర యానము చీకటిలో మనం కరగని కొవ్వత్తులము గుర్తింపని గుహలో నలిగి చిక్కి ఉన్నాము భగవంతుడే శరణా గతి అని అందాము ఇద్దరమూ నిత్యం భగవన్నామము చేద్దాము మన ఏకత్వాన్ని సార్ధకము చేసుకుందాము కాలాన్ని అర్ధం చేసుకొని నడ్చే జీవితము

--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (43 )
కవి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నాలో నీవు నీలో నేను పాలల్లో నీళ్ళలా కల్సిఉందాము నాలో నీరూపు నీలో నారూపు కళ్ళలో నీళ్ళలా కల్సిఉందాము నాలో గుణం నీలో తేజం పప్పులో ఉప్పులా కల్సిఉందాము నాలో పొంగు నీలో హంగు మన్నులో మంచులా కల్సిఉందాము నాలో ప్రేమ నీలో కీర్తి సంద్రంలో గంగలా కల్సిఉందాము నాలో శక్తి నీలో యుక్తి మబ్బులో మేఘంలా కల్సిఉందాము నాలో ఓర్పు నీలో కూర్పు
గడ్డిలో అన్నంలా కల్సిఉందాము నాలో నేర్పు నీలో తీర్పు
గూటిలో గువ్వలా కల్సి ఉందాము

నాలో రాగం నీలో తాళం వీణలో తీగలా కల్సిఉందాము నాలో గానం నీలో పాఠం స్వరంలో స్వరంలా కల్సిఉందాము
--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (42 )
మగువ   - ప్రాంజలి ప్రభ 


రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మమత ఒక్కటే కాని - ఆలోచన తీరు వేరు 
మార్గము ఒక్కటే కాని - పయనము తీరు వేరు
దృష్టి ఒక్కటే కాని - అనుకరణ తీరు వేరు
హాస్యము ఒక్కటే కాని - నవ్వుల తీరు వేరు

ఏడుపు ఒక్కటే కాని - భాదల తీరు వేరు 
దేశము ఒక్కటే కాని - భాషల తీరు వేరు
మనసు ఒక్కటే కాని - షరతుల తీరు వేరు  
తనువు ఒక్కట కాని - గుణాల తీరు వేరు

దేవుడు ఒక్కడే కాని - పూజలు తీరు వేరు
దేవత ఒక్కతే కాని  - ప్రేమలు తీరు వేరు 
మగాడు ఒక్కడే కాని - సంపాదన శ్రమ వేరు
మగువ ఒక్కతే  కాని - ఆశలు తీరు వేరు 


--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (41  )
మగువ   - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సైకత శిల్ప కలికి సౌందర్యం
పద్మము మీద కులుకు సౌభాగ్యం 
జీవము పుట్టి మనసు మాధుర్యం 
వీణను పట్టి నయన కారుణ్యం

ధారుడ్యంతో మూర్తిభవించిన సౌందర్యం 
కారుణ్యంతో  చూపువరించిన సౌభాగ్యం   
సాహిత్యంతో వీణ నినాదమె మాధుర్యం
సాఫల్యంతో  సేవ మనోరమ ప్రాదాణ్యం 

నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము
ప్రేమా కళ శృతి సంతృప్తి ముభావవిందము 
స్మ్రుతీ కళ దృతి సంతోషి మనోభివిందము 
శ్వేస్చా లయ కృతి సద్బోధ సుఖాబివిందము   


శుభోదయ వేళ జీవిత రాగం (40 )
మగువ   - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మగువ తెగువే మానవుల అభ్యుదయానికి నాంది 
మగతనానికి ధీటైన సమాధానం తరుణి ఇది
మానవత్వాన్ని నిలిపేటి మహా శక్తి తరుణమిది
మహిలో మనస్సున మత్తును తుంచేటి మగువ ఇది

మహిళల మనో శక్తే సకల శుభాలకు పునాది  
మదన కామపరులకు బుద్ది చెప్పే నవ యుగాది
మరులు గొలిపి మన్ననతో మైమరిపింప చేసేది             
మచ్చ రానియ్యకుండా సంసారాన్ని నడిపే నావఇది

మబ్బుల్లో కదిలే మేఘంలా నవ్వుల జల్లు అందిస్తుంది
మమతాను రాగంతో మది దోచి పులకింప చేస్తుంది 
మంచు ముక్కై ఉండి వేడి సేగకే కన్నీరు కారుస్తుంది    
మంత్రము ఉందొ లేదో కాని మగని పొందు శక్తి ఉంది   

--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (39 )
కవి   - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సమర్థులు వారు ... అమృతం రుచి చెప్పేవారు 
మహనీయులు వారు .... మన్మధ చేష్టలు చెప్పేవారు 
వేదాంతులు వారు .... వేదాంత వాదాలు తీర్చేవారు 
ప్రసిద్ధులు వారు ... మబ్బు మెరుపు లెక్కించేవారు 

వాసన పసిగట్టేవారు ..  చూడక కల్పవృక్ష వాసన చెప్పేవారు 
రహస్యం వివరించేవారు ... హృదయకల్పనను వ్రాసేవారు 
దృశ్యాన్ని చూసేవారు.. సూర్యుడు చూడని చోటు చూసేవారు 
కవిత్వం వ్రాసేవారు .... కవి లోకోత్తర వర్ణనతో రంజింపచేసేవారు    

--((**))--



శుభోదయ వేళ జీవిత రాగం (38 )
కవి   - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చూసా చూసా రెప్పపాటు అందాన్ని
 ... కదిలే కాలాన్ని ఆగమని అడిగా  
ఆశా పాశ మోప్పొకోక  అందాన్ని
 ..... అడవిని కాచిన వెన్నెలా అని అడిగా 

మబ్బు చాటు మేఘ మేర్పు అందాన్ని
..ఎడారిలోకుర్సే వానేనా అని అడిగా   
రెక్క ల్లేని చుక్క చుక్క అందాన్ని
 ... చంద్రుడు లేక మాయమా అని అడిగా  

కొకచాటు గొబ్బి పువ్వు అందాన్ని 
.... గాలికి తొలిగే పమిట నడిగా
వికసించె పువ్వు పువ్వు అందాన్ని 
... ఉషోదయ కిరణాన్ని అడిగా 

నాలో లేని నీలో ఉన్న అందాన్ని
 ... ఆకలి దాహంతో అడిగా 
నీలో ఉన్న నాలో లేని అందాన్ని
 .. వయసు ఉడుకుతో అడిగా 

ఎంతైనా గతం తిరిగి రాదని అడిగా 
పస్తుతం ప్రేమ పొందాలని అడిగా 
భవిష్యత్తు ఊహిన్చలేనని అడిగా 
కాలగమనంలో ఏకమవ్వాలని అడిగా 

 ---((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (37 )
జలంలా  - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎండిపోతున్న చెట్టుకు జలంలా 
వాడిపోతున్న పువ్వుకు జలంలా 
మండిపోతున్న కొంపకి జలంలా 
కూలిపోతున్న  వంతెన జలంలా 

ఆకలోతున్న బిడ్డకు జలంలా 
పుట్టబోతున్న బిడ్డకు జలంలా  
చావబోతున్న ప్రాణికి జలంలా 
దాహమౌతున్న జీవికి జలంలా 

కళ్ళవెంటున్న ఏడ్పుకు జలంలా  
పొంగిపోతున్న నవ్వుకు జలంలా 
కుళ్ళిపోతున్న పండుకు జలంలా 
వెక్కిరిస్తున్న  మాయకు జలంలా 

ఏకమౌతున్న ముద్దుకు జలంలా 
నిద్దరౌతున్న కళ్ళలొ జలంలా 
కష్టమౌతున్న బాటలొ జలంలా

ఇష్టమౌతున్న ఆటలొ జలంలా 


--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (37 )
 - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

కలాకండ కమ్మదనమే  
కమలాల తియ్యదనమే  
కనికరం చూపే  చల్లదనమే  
కమ్మని కలతో సమానమే  

కరువులో విలయతాండవమే  
కలతలో కూని రాగమే  
కతలో దొర్లే విషాదమే  
కమ్మని కలతో సమానమే  

కలువ పరిమళమే  
కళ గొప్పదనమే  
కన్య ఉడుకుతనమే   
కమ్మని కలతో సమానమే 

కోమలి కులుకు తనమే  
కోయల మధుర గానమే  
కోతలు కూసే తరుణమే  
కమ్మని కలతో సమానమే 


--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (36 )
 - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఝాటల - స/త/జ/గగ IIU UU - IIUI UU 
11 త్రిష్టుప్పు 356 
సకలానందం - సుమ తేజ మార్గం 
సమయానందం - సుఖ భావ యుక్తం 
మనసా నందం - సమ భక్తి భావం  
తపసా నందం - దరి చేరు మోక్షం 

మనసావాచా - మహిలోన నిన్నే 
తిరువీధుల్లో - తిరిగే భూ దేవీ
రమ శ్రీ నాధా - మమతానురాగా 
లను అందించే - సిరి వళ్లి దేవా  


--((**)-- 



శుభోదయ వేళ జీవిత రాగం (36 )
వెన్నెల  - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చీకటి వెనుక దాగి ఉండి
నా కడ్డం తొలుగు అన్నది వెన్నెల
పరదా చాటుగా ఉండి
గాలికి తోలగ వేమి అన్నది వెన్నెల

మనసు లోతును కదిలించి
మనస్సు శాంతిగా మార్చేది వెన్నెల
కన్నీటి కధలను తొలగించి
ఆనంద భాష్పాలుగా మార్చేది వెన్నెల

ప్రకృతి సుఖాలు అందించి
విధి వేసిన చీకటిని తరిమేది వెన్నెల
మౌనంగా గుండెను కదిల్చి
వేడితగ్గించి చల్లదనం ఇచ్చేది వెన్నెల

ఆవేదనలను తొలగించి
మనసు పడే విధంగా మార్చేది వెన్నెల
సంఘర్షణలు తొలగించి
మౌన వాణిని విని పించేది వెన్నెల

ఎకాంతపు సుఖాన్నిచ్చి
చెలిమిగా నేనున్నానన్నది వెన్నెల
మనసైన వలపు ఇచ్చి .


మనో ధైర్యాన్ని ఇస్తున్నది వెన్నెల
--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (36 )
అవతారా దశ - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
  
మనిషికి నమ్మకం పోయినా -- చేప గట్టున బడ్డా బ్రతుకు దుర్లభం  
మనిషి పాము బ్రతుకు దుర్లభం .... నీరు, భూమి చలించే తాబేలు నయం 
తిమింగలంలా బ్రతుకు దుర్లభం ...వయసులో ప్రవర్తనయే వరాహం.
మానిషి మృగంగా బ్రతుకు దుర్లభం....  మృగం నుంచి మనిషే నరసింహం.
పొట్టోడని నిర్లక్ష్యం బ్రతుకు దుర్లభం.... గుణ సంపన్నుడు వామనుడు 
క్రోధం ఉంటె బ్రతుకు దుర్లభం.... క్రోధం తగదనేది పరుశురాముడు 
ప్రేమ పోతే బ్రతుకు దుర్లభం....  సత్య,ధర్మ,న్యాయ పరుడే శ్రీ రాముడు 
భక్తి లేని బ్రతుకు దుర్లభం....  విశ్వమంతా రక్షకుడే శ్రీకృష్ణుడు.
మనిషి బ్రతుకు దుర్లభం....  జన్మ కారణ మెరిగిన వాడే బుద్ధుదు.

అజ్ఞానిగా బ్రతుకు దుర్లభం.... కర్తవ్యపరుడు కల్కి భగవానుడు 


శుభోదయ వేళ జీవిత రాగం (35 )
- ప్రాంజలి ప్రభ - ఎడారే  
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

కాలం బంగారం .... కాదనుకుంటే ఎడారే  
జీవం బంగారం .... వద్దనుకుంటే ఎడారే 
మౌనం బంగారం .... వాదనఅంటే ఎడారే 
దీపం బంగారం .... చీకటిఅంటే ఎడారే 

ప్రేమం బంగారం .... మోసముఅంటే ఎడారే 
దేహం బంగారం .... మాయయుఅంటే ఎడారే  
దాహం బంగారం .... చేదియుఅంటే ఎడారే

దానం బంగారం .... కష్టముఅంటే ఎడారే 


శుభోదయ వేళ జీవిత రాగం (35 )
- ప్రాంజలి ప్రభ - ఎప్పుడు 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

కాలమా నూతన ఒరవడి ఎప్పుడు 
కోపమా వేదన  మరచుట ఎప్పుడు 
శాపమా దేశము వదులుట ఎప్పుడు 
ఆకలీ తీరుట తెలియుట ఎప్పుడు   

ప్రేమయే పొందుట సమయము ఎప్పుడు
స్నేహమే ఇచ్చుట విషయము ఎప్పుడు   
బాధ్యతే తెల్పుట  పదవులు ఎప్పుడు 
భాగ్యమే పంచుట తగువులు ఎప్పుడు 

--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (34 )
- ప్రాంజలి ప్రభ - చుట్టరికం 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

ప్రేమించు మనసుకేది .... పట్టగల్గు చుట్టరికం 
విప్పారు లతలుకేది ....చూపగల్గు చుట్టరికం 
జ్వలించు వెలుగుకేది .... అంటగల్గు చుట్టరికం 
మేఘాలు కురుయుటేది ....నిల్పగల్గు చుట్టరికం

వెల్గుల్లొ తరువుకేది ....దాచగల్గు చుట్టరికం  
కొల్వుల్లొ మనిషికేది ....చెప్పగల్గు చుట్టరికం  
పల్కుల్లొ అమలుకేది ....తెల్పగల్గు చుట్టరికం   
చూపుల్లొ మెరుపుకేది ....మోయగల్గు చుట్టరికం 


--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (33 )
జీవుడు - ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

నమ్మకం లోనే దొరుకుతుంది నిర్మలం
నిర్మల మనస్సులో తెలియదు కాలం
కాలంలో కరిగేటి వయసు పొందలేం 
వయస్సు మార్పుల్లో పెరుగును ఉత్తేజం 

ఉత్తేజం లో ఒక్కోసారి పెర్గు ఉన్మత్తం 
ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిస్తేజం  
నిస్తేజం చెందేవారు పొందలేరు శాంతి
శాంతి పొందుటకు వదలాలి ఆగ్రహం 

ఆగ్రహం వదిలితే ఉంటుంది ప్రశాంతం
ప్రశాంతంతో దేహాల్లో కలిగే తన్మయం 
తన్మయమే తరింప చేసే మనోధైర్యం
మనోధైర్యంతో పెర్గు మమతాను రాగం 

--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (32 )
వృద్ధుడు- ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

బతుకు బాటలో తప్పులు సరి దిద్దువాడు 
మనసు వేటలో హెచ్చరికలు చెప్పువాడు 
మమత మాటతో కష్టసుఖము తెల్పువాడు   
అనుభ వాలతో ఆదుకొనెటి ఈశ్వరుడు  

తక్కువచేసి మాట్లాడితే వృద్ధుడు వ్యర్థుడు 
మక్కువచేసి మాట్లాడితే వృద్ధ సామాన్యుడు  
వద్దని చెప్పి వేదించినా తృప్తి సద్బుద్ధుడు   
వృద్ధుడు సిద్ధప్రాభావమే వంశ ప్రాధాన్యుడు

అంతర్గతంగా తలపండిన వాడే పండితుడు 
సంతోష ప్రాధాన్యత నిచ్చినవాడే పండితుడు 
స్నేహం సమానత్వ సమన్విత లక్ష్యం పండితుడు 
సద్బోధ శాంతీ సహవాసము చేసేది వృద్ధుడు 

వృద్ధుల సారధిలో యువకులు విజయలౌతారు 
వృద్ధుల ప్రోద్భవమే సతిపతులు జయలౌతారు  
వృద్ధుల ప్రేరణతో సహనము వినయులౌతారు 
వృద్ధుల సేవలతో ప్రకృతి  త్రివిక్రమలౌతారు   


--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం -2

శుభోదయ వేళ జీవిత రాగం (31 )
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

దాహము తీర్చు తృప్తి దప్పిక మేను
- జపమన్నది అందిస్తూ చేరు స్వప్నము 

కాలము మారి సేవ ద్రుష్టితొ మెను  
- ప్రకృతన్నది అందిస్తూ చేరు స్వప్నము  

బాధ్యత నిండి ప్రేమ నోముతొ మెను 
- తపనన్నది అందిస్తూ చేరు సప్నము 
  
మాయయు నిండి మౌన భాషతొ మేను 
- మనసన్నది అందిస్తూ చేరు స్వప్నము 

తామర పువ్వు వలే  మెత్తని మేను 
-  అధరంబులు అందిస్తూ పొందు స్వర్గం

బూరుగ పువ్వు వలే మెత్తని నాభి
 - కుచ ముంజలు చూపిస్తూ ఇచ్చు స్వర్గం 

చెంపక పువ్వు ఛాయ తపించు మోము
 -  మంచి మాటల తోహెచ్చు పంచు స్వర్గం

హంసల తెల్వి వేడ్క  లెస్సగ  సాగి 
 -   బంతి ఆటలతో కుల్కి  పొందె స్వర్గం       


--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (30 )
రచయత ప్రగడ రామకృష్ణ 

వేసిన ఓటు కో ధీమా 
ఎదో దక్కుతుందని ఆశ 
నా నాయకుడిని 
ఎన్నుకుంటున్నానని నమ్మకం ...

నిన్ను గుర్తించే నాధుడు ఉండడు   
నీ సమస్యను నాయకుడిదాకా తీసుకెళ్ళవు  
పిక్కలరిగేలా తిరిగినా  
నాయకుడికెట్టా తెలుసు?

తిప్పలు దెచ్చు చిక్కులెన్నో 
చకోరాలు చుట్టేశాయి నిశీ రాత్రుల్లో 
చాపకింద నీరులా 
తారుమారు జేసి గెలిచేయాలని
చేసేదే రాజకీయం 

మనిషి నిద్రించినా మనసుకి 
నిద్ర రాదు నవ రాజకీయాలు చూసి  
జేసే రాచకార్యాల తాలూకా నీచ 
ఎత్తుగడలు మెదడును చిట్లించక 
ధనాన్ని కూడబెడతాయి 

తాంత్రిక జ్ఞానం మాంత్రిక జలగలై
రక్తం పిల్చి నీరసించావని‌
పొట్లం రసమిచ్చి మభ్యపెట్టి
నిలువునా సమాజాన్ని దోచేస్తోంది
అద్దంలా ఉంటారు కానీ ఎవ్వరూ పట్టుకోలేరు 
ఇదే రాజకీయం 

సాంకేతిక విప్లవం ప్రజాస్వామ్య
విలువలకు తూట్లు పొడిచేలా‌ కాక
పారదర్శకతకు పీఠం వేసి పొగరు
బోతుల ఆగడాలకు పాతరేశేయాలి
అది ఎప్పుడు జరుగుతుందో 
మనుష్యుల మధ్య ఐకమత్యం లోపించింది 
రాజాకీయానికి పునాది అదే అవసరం 

అక్షర శరములు సంధించా 
కోటి కారకాలై భావ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ
పదమాలికలై మీ మదినలకరించి
సమాజం నిత్య చేతనత్వంలో నడవాలని
ఆశించే జీవులలో నేనొకడ్ని 

  --((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (29 )
రచయత ప్రగడ రామకృష్ణ 

మగువే మనో భద్రా - మనసే మనో నిద్ర  
మరుపే మనో తపం - మనిషే ఒ యంత్రం  
తరుణం సమానమే - మధురం సమానమే 
పరువం సమానమే - మగువే  ఒ  మంత్రం 

పదవే సుఖాలయం - పరువే సమాలయం 
పిలుపే సుధాలయం - పలుకే ఒ తంత్రం 
 సదిశే ఉషోదయం - సదశా ఉపాధియే 

సకలం సమాదరం - సమయం ఒ జంత్రం 

వినయంలొ నిర్మలం - వినయంలొ తన్మయం
వినయం లొ విస్మయం - వినయంలొ కాంతీ
శతకం లొ సూక్తులే  - శతకం లొ సత్యమే
శతకం లొ   మంగళం - శతకం లొ ప్రేమా      
--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (28 )
Pranjali Prabha (Mallaparagada Ramakrishna)

IIUIUIU  - IIUIUIU  
ఛందస్సు (న్యాయము )
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ

సమయం లొ భోజనం  - పరువం లొ యవ్వనం 
విషయం లొ ప్రేరణం - విజయం లొ విస్మయం 
ప్రణయం లొ ఉత్సవం - గగనం లొ సంబరం 
తరుణం లొ తన్మయం - వినయం లొ సంతసం   

అరవింద పుష్పమే  - అరవింద చూపులే
అరవింద కోరికే  - మనసంత   ప్రేమే
నవమల్లి నాట్యమే  - నవమల్లి భాష్యమే
నవమల్లి మార్గమే  -  మనసంత ప్రీతీ

తనువంత తామసం - తనువంత కొవ్వుయే
తనువంత వెచ్చనే  - తనువంత  నిత్యం                                   
మనయందు దాహమే - మనయందు ఊహాలే 
మనయందు ఆకలే  - మనయందు శక్తే 

సిరులంటె ఇంపుగా - సిరులంటె ఆశగా 
సిరులంటె మొహమే - సిరులంటె ప్రీతీ 
తరుణంలొ  కష్టమే - తరుణంలొ నష్టమే
తరుణంలొ లాభమే - తరుణంలొ  భ్రాంతీ

--((*))--

శుభోదయ వేళ జీవిత రాగం (27 )
- త/ర/ర/య/జ/గ UUI UIU UI - UIU UI UIU 

ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే 
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే 
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే 
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే 

సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి      


16 అష్టి 21141 

జీవమ్ము రత్న దీపమై - చూపులే నవ్య తేజమై
భావాలు దివ్య పుష్పమై - శ్రీకరా శోభ లందుకో 
నామాట నమ్మకం తోనె - నాకు ఆధారి మంజరీ      
ప్రేమమ్ము తో సదా నీకు - సేవలే చేస్థ మాధురీ

నీమాట వింటినే నేను - మంచినీ పంచు త్రోవగా
సంతోష మంటివి సంత - సమ్ముతో ప్రియ నెస్తమా
భేదమ్ము లేలకో వింత - శోభనే  అంది పుచ్చుకో 
రాగమ్ము పాటతో రాస -  లీలలో మున్గి  తేలిపో     

 కాలమ్ము నీదిగా  నన్ను - దారు లాలించి మోహినీ
 నావైపు చూడవా  తేలు - నావగా పిల్చు  త్రోవగా 
కోపంబు లెప్పుడూ చూప -కెన్నడూ నాతొ ఉండవే        
దేహమ్ము  నాదిగా నీవు -  శాంతి సౌఖ్యమ్ము లందుకో

హేమంబుఁ రాత్రిలో స్వర్గ -  మేదియో నాకు చూపవే 
కామార్ధ మందునే ఉంటి - కామి తార్దము తీర్చవే
నేరమ్ము నాదియే నీవు -  నేరుగా  జెప్పు తప్పులన్ 
హారమ్ము వేతురా నీకు -  హరియో చిత్త హారి రా 

నామాట నీదిగా నేను -  నీకు శోభాయ మానమే 
నీమాట నాదిగా నీవు - నాకు సౌఖ్యాల  నావవే  
--((*))--



శుభోదయ వేళ జీవిత రాగం (  26 )
రచన: మల్లాప్రగడ రామకృష్ణ  

మౌన రోదన ఎందుకు - కార్చు కన్నీరు 
కన్ను రెప్పలు చూడకు - కార్చుకన్నీరు  
గుండెని అన్వేషించకు - కార్చుకన్నీరు
హృదయాన్ని మరువకు - కార్చుకన్నీరు

భవబంధాన్కి చిక్కకు - కార్చుకన్నీరు  
ఒంటరి ఓర చూపుకు - కార్చుకన్నీరు              
మనస్సు మెప్పు దలకు - కార్చుకన్నీరు 
జ్ఞాపకం గుర్తించుటకు - కార్చుకన్నీరు  

నిత్య గెలుపు బాటకు   - కార్చుకన్నీరు
సత్య మాట నిల్పుటకు  - కార్చు కన్నీరు  
దివ్య వెల్గు పంచుటకు  - కార్చు కన్నీరు   
అమ్మ మాట నిల్పుటకు  - కార్చు కన్నీరు  

ప్రేమ బతి కించుటకు - కార్చు కన్నీరు 
సంతృప్తి పరుచుటకు  - కార్చు కన్నీరు 
జాతిని గుర్తించుటకు - కార్చు కన్నీరు 
భాద తొలగించుటకు  -కార్చు కన్నీరు      

నీ సుఖమందించుటకు - కార్చుకన్నీరు  
ప్రత్యేక గుర్తింపునకు  -కార్చుకన్నీరు   
ఆనందము పంచుటకు  -కార్చు కన్నీరు
ఆత్మస్థైర్యం వదలకు - కార్చుకన్నీరు  


--((**))--


శుభోదయ వేళ జీవిత రాగం (  25 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  


తోయజ లోచన అర్ధం చేసుకుంటూ     
తోయజాక్షి మనసు వెన్నపూసంటూ 
తోయలి అమృతపలకులు వింటూ 
మనో బలం పెంచి తృప్తి పరిచేది  

నళిన లోచన మార్గం ధర్మం మంటూ 
ధవళాక్షి ధవళ రంగు వెల్గ0టూ
నళినాక్షి నవ్వు కురిపిస్తూవుంటూ  
మనో బలం పెంచి తృప్తి పరిచేది      

ముద్దురాల మనసు ముచ్చట్లు వింటూ 
ముద్దుగుమ్మ సర్దుకు పోతూనే ఉంటూ 
ముద్దులాడి మైమార్పిస్తూ కల్సి ఉంటూ 

మనో బలం పెంచి తృప్తి పరిచేది

--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం (  24 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  

గుప్పుగుప్పున పరిమళాలతో నంట  
ఉప్పొంగు సుధల మధు శోభితాలంట
నర్తించే నవయవ్వన యువతులంట    
నిండు ముత్తైదువులచే హారతులంట  

తళుకు తారల హడావిడిలే అంట
పన్నీటి జల్లుల పులకరింపులంట    
శిరస్సులపై జిలకర్రబెల్లఁమంట  
అగ్ని ప్రదక్షణతో ఏకమైన జంట

భాజా భజంత్రీలతో స్వరాలంట
దీవెనలతో బహుమతులిచ్చిరంట  
జంటకు ఉండాలి ఆదర్శ సిరి పంట
తాంబూల పౌష్టికాహార భోజనమంట

దేవతలు దిగివచ్చి దీవించి రంట 
దేవతా మూర్తులచే ఆశీర్వాదమంట  
సత్యం, న్యాయం, ధర్మానికి నివాసమంట
కళ్యాణ వైభోగంతో ముచ్చటైన జంట    

--((**))--

  

శుభోదయ వేళ జీవిత రాగం (  23 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  
తత్వ బోధ - (చందస్సు) 

కాలమే తీర్పు - కామమే ఓర్పు - జీవితమ్ములే 
భాష్యమే నేర్పు - బంధమే కూర్పు - ప్రాభవమ్ములే 
వేదమే శక్తి  - సాధ్యమే భుక్తి -   సాహసమ్ములే 
శోధనే యుక్తి  - ప్రార్ధనే ముక్తి - మానసమ్ములే    
   
బాహ్య ప్రేరణే - మానసములో - ఇంద్రియాలులే
కళ్ళ చూపులే  - చెవ్ల గ్రాహనే  - నోరు వాక్కులే
మామనస్సునా - సత్య సేవలే - ధర్మ బోధలే
ఆత్మ అన్నదే - చావు లేనిదే - వ్యాప కాలులే

దూరదర్శినే - దూరవస్తువుల్ - చూడ చూఫులే
సూక్ష్మ దర్శినే - దగ్గరొస్తువుల్ -  చూడ చూఫులే
ప్రేమ భావమే - భాగ్య దాయకం - అర్ధ చూఫులే
స్నేహ మార్గమే - దేహ సౌఖ్యమే  - ప్రేమ చూపులే    

జీవితం నీతొ - నాతొ హాయిగా - సంతసమ్ములే 
సాహసం నీతొ - నాతొ సంబరం - సంభవమ్ములే 
మామనో నేత - మామనో దేవ - తల్లితండ్రులే     
సాహసో పేత - ప్రాణ రక్షణా - గుర్వు వాక్కులే  


--((*))--


శుభోదయ వేళ జీవిత రాగం (  2 2 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  
ప్రాంజలి ప్రభ (ఛందస్సు )

రోజులు మారుతూ ఉన్నాయి 
రాజి పడక సతమత అవుతావు ఎందు కే  
కాజును తిని తపన
మోజును వదలక తికమక పడతావెందుకే  

చూపుల కలయిక జరిపి 
పోపుల ఘాటును తెలియక మరోవైపు చూపే 
తేపుల వలన సెగలు 
కాపులా తనువులు నగవులు ఏకమవుటకే కాదే

నచ్చేటి పాటలు పాడి నా   
మెచ్చేటి భావమ్ము  మనసుకు చేరుట లేదే 
పంచేటి లక్షణము ఉన్నను 
పుచ్చుకునే లక్షణము లేనివారికి భాదయే కదా  

కలయిక కోసము కధలు 
కలలోని మాటలు వరుసగా చెప్పుట కాదే 
ఇలలో జరుగు చున్నట్టి 
వలపు తలపులు తెలుపుట కష్టము కాదే 

కరుణ చూపిన కదలక 
కారాలు మిరియాలు చూపి మనసును  విరిచే
చిరకాల వాంఛ తీరుటకు 
పరకాయ శాంతికి అవసరము కనపడక ఉండే 


అతివాంఛ అనర్ధము - తృప్తిలో ఉంది శ్రేయోదాయకము  


శుభోదయ వేళ జీవిత రాగం ( 21 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  
*నేస్తమా

నేస్తమా నన్నొదిలి పోలేవు
అర్ధం చేసుకో లేక ఉన్నావు

వాస్తవాలు తెల్ప లేకున్నావు  
నేస్తమా మనసు మెప్పించావు

నను వలచి వెంబడించావు
నను తలచి తపన్ చెందావు
నను కలసి మాటల్ చెప్పావు

 నేస్తమా మనసు మెప్పించావు

నీవు ధర్మమార్గాన్ని చూపావు       
స్వార్ధం మన మధ్యన  చేరవు
నిస్వార్ధ సేవల్  ఇకతప్పవు

 నేస్తమా మనసు మెప్పించావు

నీ వెప్పుడొస్తావో తెలపవు
నీ వెలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు

 నేస్తమా మనసు మెప్పించావు

భేదాలు మన మధ్యకు రావు 
సుస్వరభావామృతం పంచావు 
మదిని మరిపింప చేసావు  
నేస్తమా మనసు మెప్పించావు

మనసారా నన్ను పిలిచావు
మనసును నీవే తెలిపావు
హృదయ స్పందన చూపించావు

నేస్తమా మనసు మెప్పించావు

నేస్తానికి ప్రాణం ఇచ్చేసావు
ప్రాణానికి దేహం అర్పించావు
దేహానికి దేహం ప్రేమ న్నావు 

 నేస్తమా మనసు మెప్పించావు 
--((**))--

శుభోదయ వేళ జీవిత రాగం ( 20 )


రచన మల్లాప్రగడ రామకృష్ణ  
నేటి కవిత 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

మేము ఒక యంత్రము 
విధ్యుత్ లేక నడిచే యంత్రము 
అది మా మేధస్సు మంత్రము 
మాకు తెలియదు తంత్రము 

జీవితాన్ని కొదువ పెట్టిన బానిసలం 
సమయాన్ని పాటించే వాళ్ళం    
ప్రజా సంపదే మాకు నిలయం 
వారికోసమే శ్రమిస్తాం ప్రతినిముషం  

అర్ధం లోనే ఉంది జీవితం 
అర్ధాన్ని అందించటంలోనే యుక్తం 
రాజకీయానికి నలిగే పావులం 
వత్తిడికి చిక్కే మూగ జీవులం  

విత్తంలోనే ఉంది చిత్తం 
చిత్తంగా పనిచేసే జీవం 
శ్రమకు తగ్గ ప్రతిఫలం 
అదియే జీవనాధారం 

ఎప్పుడు చూపవద్దు జాలి 
తక్కువచేసి చేయవద్దు ఎగతాళి 
ఆడవద్దు మాతో వైకుంఠ పాళి
అందుకే ఉద్యోగానికి కడతాం తాళి   



__((*))--


శుభోదయ వేళ జీవిత రాగం ( 19 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ  
*ప్రస్థానం ( భగవానుడు)

పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి పిల్లని గ్రోవి ధరియించువాడు ..
కాటుకతో అందమునిచ్చు కనులవాడు
శిఖి నందు పింఛమమరిన. చిన్నవాడు.

వెలుగు విరజిమ్ము పసిడి మోమువాడు
నీలి మేఘ జలదంపు మేని వన్నె వాడు
సమస్త సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తేనె ప్రత్యక్షమయ్యె వాడు

ఆకాశం లో శాంతి నెలకొల్ప గల వాడు
భూమండలం లోనూ శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణుల్లో శాంతి నెలకొనువాడు

పాద మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగమున లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తి ఇచ్చు అవతారమొందినాడు
భక్తల మనస్సు  బ్రోచిన భాగవతుడు
ఇహమునకు .పరమునకు ఈప్సితుడు 
ముక్తి.. మార్గమ్ము జూపెట్టెడి గీతాచార్యుడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితి నందు ధర్మాని కాపాడేవాడు
మనుష్యుల దేహాలల్లో దేవుడై ఉంటాడు
లీలతో ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__