భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1(మొదటి అధ్యాయము )
దృష్టి దోషమున్నను కన్న దృష్టియు ఇది
సంఘటన లన్ని మన వారు సరయు మధ్య
వయసు మీరిన యుద్దపు విషయ వాంఛ
నిత్య ఆరాట ముయె పోరు నీకు నాకు ---- 1
గురువు ని ప్రార్ధించె ఫలము గొప్ప దగును
తగ్గ ఫలితము పొందుట తగిన రీతి
తక్కువయు ఎక్కువయు చూపు తప్పు అనకు
శిష్యు లందరు ఒకటి గా శాంతి చేయు ----- 2
గొప్ప తనమును తెలిసియు గోల అనకు
మంచి ఎవ్వరు చెప్పినా మనసు పంచు
గౌరవమ్మును కలిగించు గురువు సేవ
గురువు లే నేర్పు విద్యయు గళము తెల్పు ---- 3
ఎదుటి వారి తెలివి గాను యదలొ చేరు
వారి వంశంలొ తెలివిని విషయ వరము
నడవడిక బట్టి కొంతయు నటన తెలియు
మనకు ఉపయోగ మెంతయో మరులు గొలుపు --- 4
స్నేహితులు పరిమితము గా సేవ పెరుగు
అపరిమితము వున్న చెలిమి ఆశ కరుగు
ధైర్యమున్న వాడును ఉన్న దారి కలుగు
నమ్మకము బలం పైనను నేర్పు కలుగు ----- 5
సింహ నాదము అవసరం సిరుల వెంట
ఒకని వల్లనే ఇబ్బంది వదలి వెడలు
వచ్చు ముప్పుకు ఎదురేగి వలదు అనకు
సాధనమున పనులు వచ్చి సహన మయ్యె --- 6
గుండె దడలు పెరుగు శబ్ద గురక ఉన్న
భయపు వాయిద్యాల తొ ఘోష బోధ చేయు
ఉత్తేజము పెర్గి విజయము ఉలికి పడును
యుద్ధ భేరీ నినాదము యముని పిలుపు ---- 7
గొప్పలకు పోయి తిప్పలు గొలుసు లయ్యె
ధైర్యముతొ ఎదు రీతలు దరిని చేర్చు
సాధనతొ సాధించుట గొప్ప శాంతి కలుగు
అహము అనుకున్నది తరిమి అవగతముగు --- 8
ప్రీతి కల్గించు క్షణము యే పిలుపు లాయె
ప్రతిది అనుభవమును బట్టి ప్రీతి కలుగు
దేశ కాలస్థితి గమనం దైవ తీర్పు
మనలొ వత్యాసం తెలుసుకో మౌనముగను ----9
అందరిలొ మంచి గమనించి ఆదరణలు
నీకు ఆలోచనలు మంచి నీడ నిచ్చు
నిన్ను నీవుగా నమ్మాలి నియమ బుద్ధి
ఏది అయినను ఎరుకగా యదను పంచు ----- 10
సంకటస్థితి లోనైన శాంతి చూపు
దిక్కులేనిసమయమునఁ దైవ నీడ
మనిషి నాలుగు రోడ్లలో మౌన మన్న
ఏది దారో తెలియక యే ఏమి అనరు ----- 11
జాలి అన్నీవిధముల లో జూప వలదు
బంధు వర్గపు ప్రేమలు బాధ్యత యగు
జాలితో బ్రతుకుటఏగ చపల మేళ
గుండె కరిగేట్లు నటనలు గాలు టేల ----- 12
విద్యయున్న నిరాయుధ విజయ మేళ
మనసు తల్లడిల్లిన ఫల మేళ కలుగు
వణకి బేజారు అవుటయు వలదు నీకు
పిరికి వానివలెనీవు పలుకు లేల ----- 13
సమయముయెదుర్విని యోగ సేవ లేల
చేతిలోవున్న విద్యను జాగు నేల
తప్పు పనులను ఆపుట తొంద రవుట
తప్పు జోలికి పోకుండ తపన లుంచు ---- 14
ధర్మమార్గము వీడక ధైర్య ముంచు
దైవచింతన మానక ధైర్య ముంచు
కరుణయన్నది తోడుగా కార్య మయ్యె
కక్షతో మదినింపకు కరువు వచ్చు ----- 15
పొందగలగేటి సుఖమును పోరు అనకు
గద్దెకెక్కిన నేమియు గోల అవదు
జ్ఞానమన్నది లేకయే జాగు అనకు
పరులసొమ్ములు దోచినా పలుక వద్దు ----- 16
మాటలెన్నోఅనుటయేల మడమ తిప్పు
మూలమూలలు గమనించి మనసు తెలుపు
మూలమే మఱచిన నీకు యూత మేళ
ఆట బొమ్మగా ప్రతి ఒక్క రేను నిజము ----- 17
పనిని విస్మరించుట ఏల పలుకు లేల
తనమన అనుట ధర్మపు తలపు లేల
ధర్మముయె నిన్ను రక్షించు ధరణి యందు
ఉత్తమము లక్ష్య సాధన ఉంచి కదులు ----- 18
ఇంద్రియాల నిగ్రహము యే ఇలలొ మేలు
నిజము తెల్ప గలిగి ఉంటె నీకు మేలు
తెలుసు కోలేని ఘటనలు తలపు లగును
స్త్రీ పురుషులలో ప్రేమయే స్థిరము యగును --19
దేహమున మంట కలుగుట దైవ ఇఛ్ఛ
మందు లకు తగ్గనిది మంట మౌన మాయె
ద్రోహముతొ కల్గు మంటలు దాడి చేయు
దాహముతొ వచ్చు మంటలు దరిలొ కరుగు ---- 20
విద్య నిన్నునిన్నుగను యే వింత మార్పు
విద్య దానం చేసే కొద్ది వినయ మిచ్చు
విద్య ఉండి లేదన్నను వింత మృగము
విద్య ఉన్నశాంతియు పోతె వీధి తెలుపు ---- 21
కళ్లపై రెప్పలు కనులు కాపు కాయు
నిద్రలో రెప్పలను మూయు నీకు రక్ష
కథలు వలదులే కనుపాప కరువు ఐన
నయనమే ప్రధానము నీకు నేస్త ముగను ---22
రాతలను కోసె కోతలు రవ్వ లగును
చింపు కాగితం జీవితం చెత్త లుగను
మోయు మొతలుగా జీవితం మారు టగును
మారకయె ముందు మట్టిలో మనసు యగును ---23
ఊపిరిని ఇచ్చు రాతలు ఉరక లయ్యె
రాతి మనుషుల మధ్యన రాయ లయ్యె
మనసు కరిగిపోవుట సహజ మాయ లయ్యె
జీవతంలొ జయ అపజయం జీత మయ్యె ---- 24
మంచి చెడులని వెనకకు మరల వద్దు
శుబ్రత మనకు శుభముయే శాంతి నిచ్చు
మనలొ ఉన్నమలినమంత మనసు చెఱచు
నిత్యమూ మనసున మాట నిన్ను మార్చు ----25
నేడు కాదు రేపుఅనిన నమ్మ వద్దు
లక్ష్య సాధనకు కృషిలో లాలి జూపు
భయము తనవారు తోనైన బాధ తెచ్చు
ఆత్మబంధువు ధర్మము ఆశ పెంచు ----- 26
పగలు రేయి కలవవు లే పట్టు విడుపు
భగవదాకాంక్ష ఆకాంక్ష భక్తి బట్టి
కామనా రహితులు ఉంటె కార్య ఫలము
శాస్త్ర పాండిత్యము ను నమ్మి సేవ చేయు ---27
కర్మచేతను అమరత్వ కార్య మవదు
సంతతితొ ధనము ను తోడు శాంతి రాదు
త్యాగమువలన ధర్మము తృప్తి నిచ్చు
ధర్మమార్గము సూక్ష్మము దారి లేదు ----28
కామినీ కాంచనాలను కలువ కుండ
కాల మంతాను దైవము కోరి ఉన్న
చీకటిని తరిమే వెలుగు చెంత మిగులు
కోరికలను త్యజించుట గొప్ప శక్తి ---29
అంతరాత్మకు తృప్తియు అంతము లేదు
సాధకుణ్ణి వెంబడించును సాక్షి లాగ
మనసు ఆలోచనల దృష్టి మంత్ర మయ్యె
అనుభవించ దలచిననే అంత మాయ ---30
భక్త జీవితముయు కోర్క బద్ద మగును
త్యాగమును భక్తి యుక్తము తీపి గుర్తు
జ్ఞానమనె అగ్ని పట్టుట జపము తీర్చు
హృదయ పూర్వకంగాకోరు హాయి పొందు ---31
తనయు లందరూ దుష్టులై తాడు తెంచ
కష్టమైనను కర్మగా కారు చిచ్చు
నీదు కర్తవ్య మును ఎంచి నటన కాక
మార్గ మీదైన సంహార మొవ్వ వలెను --- 32
తృప్తి యు నిజాయితీగను తెలపగలగు
ప్రాణములపైన ఆశల పలుకు వదులు
ధైర్యముగను మాట్లాడుట ధర్మ మగును
కష్ట నష్టము క్షణకము కాలమ గును ---33
సంతసమ్ముగా ఉండుట సమ్మతగును
సుఖము కష్టము స్నేహము స్థిరము కాదు
తృప్తి సంతృప్తి ఆతృప్తి తారుమారు
శాస్వితము ఏది లేదులే శాంతి కొరకు ---- 34
నిజము తెలిసియు నడచుట నీకు రక్ష
ఎదుటి వారిని ఊహించి యదను పంచు
అవసరములైతే ఎదుర్కొను ఆట లాగ
నిజము ధైర్యగా నీవెంట సిద్ధ మగును ---35
తప్పు కానిచో పోరాటం ఒప్పు అవును
మరణ మైనను వీరస్వర్గమని కదులు
శరణమా మరణము కాదు శాంతి రాదు
కార్య సాధకునికిధైర్య కార్య మగును ---36
నిన్ను నీవుగా రక్షణే -- నీకు మేలు
దాడి చేయను అంటెను -- తప్పు నీది
ధర్మమును తెల్పి ఓర్పుతో -- దాడి చేయి
చేత కాని వాడిల వద్దు -- చేత చూపు ------37
గుర్తు కొరకుగా గుర్తింపు -- గలుగునీకు
గొప్పకాదును అదియును -- గోప్య మొవ్వు
అక్కరకురాని వాడుగా -- అలుక వద్దు
ఆటు పోటులు తప్పవు -- ఆకలవ్వు ----38
విషము పెట్టియు బతుకుకు -- వివర నిచ్చె
కొంపలను కాల్చి ఏడ్చుట -- కాల మెనెను
భార్య తిట్టికొట్టియు ప్రేమ -- భయము చూపె
నీట ముంచి తెలివనెను -- నమ్మ కాన ---39
సర్వ మును హరించియు పాడు -- సేయువాడు
ఆయుధము ఉపాయము తెల్సి -- వాడ నాడు
భార్య ఉన్నా సుఖము లేక -- బాధ పెట్టు
వాడు వారును ఉన్నాను -- వల్ల కాడె ----40
మృగము ఆయితేను చంపాలి -- మౌనమోద్దు
దూరముంచుము మూర్ఖుణ్ణి -- దురద చేరు
మనము మారక తెలివిగా -- మెలగ వలెను
చచ్చె ముందు ధర్మము లేదు -- చావు తప్ప ---41
పాప పుణ్యాలు అనుటయు -- ఆపదవ్వు
యుద్ధ నీతితో పోరాడు -- జయము నిచ్చు
మనలొ వారు పరాయొరు -- మాట వద్దు
యుద్ధ కాంక్ష తీర్చుకొనుము -- మలుపు తిప్పు ---42
నిత్యమూ దురాశపరులు -- నిన్ను తాకు
అశ లనుచూపి ఆరాట -- ఆట నేర్పు
యుక్త వీక్షణక్షణ మేర - యశము అగును
మారుట సమంజసము అయ్యె -- మఱువ వలదు -43
మార్చలేనప్పుడు మనమే-- మనము మారె
నేర్చుకోవాలి జగతిలో -- నిజము మాట
దూరముంచిన కోపము -- దరిన చేరు
దరిన చేరిన కౌగిళి -- దారి మార్చు ---44
కులము నశించి పోవుట -- కలల నిజము
కులము ధర్మము నశించు - కళలు మరు
ధర్మము తొలగి యు అధర్మ - ధర్మ మగును
దుష్ట బుద్దులు పెరుగును -- ధరిణి యందు --45
వర్ణసాంకర్యమువలన-- వరుస మారు
స్త్రీ పురుషులలో భేదమే -- సొమ్ము చేయు
కులము విలువలు పడిపోవు -- కలత లగును
పెళ్లి యు కులాంతరముగా - పేరు మారు ---46
నరక పు ప్రాప్తి అన్నను -- నటన అనెను
నమ్మినచొ వెన్ను పాటుయే -- నాణ్యతవ్వు
నేడు సుఖముయు ప్రశ్నలే -- నేర్పు గాను
వయసు పోకడ అనుటయు -- వలపు లిచ్చు ---47
సమస్య క్లిష్టమైనది కాదని అనుకున్న వెంటనే,
ఆ సమస్య 99 శాతం నిర్జీవమైపోయినట్లే।
నేటి గీతా భాష్యం
కోరుకోవడం వల్ల లభించేవి - శాపాలు।
వచ్చినవి ఏకీభవిస్తే - వరాలు।
: నువ్వెవరో తెలిపి , ఏం చేయాలో నేర్పి, చివరివరకు నీ చెయ్యి పట్టుకుని నడిపించేదే --- ధ్యానం।
ఉత్తముని కోపము - నీటిపై వ్రాత వలె। (క్షణ కాలము)
మధ్యముని కోపము - ఇసుక పై వ్రాత వలె। (కొన్ని గంటలు)
అధముని కోపము - పలకపై వ్రాత వలె। (కొన్ని వారాలు/నెలలు)
అధమాధముని కోపము - శిలపై వ్రాత వలె। (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)
"గురుఁడవు పరమాత్మ ।।నీవే
నరులకు జ్ఞానమునొసఁగుము పరమాత్మా !
పరులనణఁచికావుమయా।।
సురుచిరహాసా ।।సురవర సుందర రూపా !!! "
----
" మరుదంశసంభవహనుమ ।।
పరులనణంచుచు భయమునుబాపుమ।।తండ్రీ !
నరవరరాఘవభక్తా !
ఉరుసాగరలంఘనవర ।।యో దనుజారీ !!! "