సాహిత్యం, సంగీతం, గానం:కట్ల. శ్రీనివాసాచార్యులు
ll పల్లవి ll
వెకిలి చేష్టలు మాని వేదకవో విష్ణుని మనసా
సకాలావస్థలయందు శ్రీహరే సర్వదరక్ష!!
ll1చరణం ll
పరులసొమ్ముకై పాటుబడి బాధలనొంది
పరకాంతలకై ప్రాకులాడి భంగపడి
మురికి చెత్తను జూసి మురుసిమురుసి ఆడకా
ధరణీదరునే తలచి తరియించవో మనసా!!
ll2చరణం ll
శరణాగతి తెలియకా చెడిపోదుమే గానీ
హరి తన దాసుల నాగమూ చేయడు
ఎరిగి అతని మహిమలు ఎదనిలుపుకో
మరిగి మురహరి నామం మరువకే మనసా!!
ll3చరణం ll
ఏ వ్యవహారమునందు లేదు ఎట్టి సారము
దేవదేవునీ కొలచినదే ధన్య జన్మము
శ్రీనివాస దాసులై పొందుమిట్టేస్వర్గమూ
ఈ భావం ఎపుడు ఎద మరువకే మనసా!!
🕉🌞🌎🌟🌙🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 356-5
సంపుటము: 4-331
రాగము: గుండక్రియ
॥పల్లవి॥
అందిచూడఁగ నీకు నవతారమొకటే
యెందువాఁడవైతివి యేఁటిదయ్యా !!
llచరణం 1ll
నవనీతచోరా నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా!!
॥అంది॥
llచరణం 2ll
పట్టపు శ్రీరమణా భవరోగవైద్య
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ
పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి
యెట్టని నమ్మవచ్చు నిది యేఁటిదయ్యా !!
॥అంది॥
llచరణం 3ll
వేదాంతనిలయా వివిధాచరణా
ఆదిదేవ శ్రీవేంకటాచలేశ
సోదించి తలఁచినచోట నీ వుండుదువట
యేదెస నీ మహిమే యిదేఁటిదయ్యా!!
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య
సంకీర్తన*
🕉🌞🌎🌙🌟🚩
1422
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-6
సంపుటము: 1-60
రాగము: కళ్యాణి.
ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే
వేదవిరహితులకు వెఱతు మటుగాన !!
॥పల్లవి॥
ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁ
బరికించవలెఁగాని భజియింపరాదు
గరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_
స్మరణ విజ్ఞానవాసన గాదుగాన!!
॥ఏది॥
యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు
సహజమనవలెఁగాని సరిఁ గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు
గ్రహియింపరా దవగ్రాహములు గాన!!
॥ఏది॥
యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁ
జింతింపవలెఁగాని సేవింపరాదు
అంతయు ననరుహమును నరుహంబనఁగరాదు
అంతవానికిఁ బరుల కలవడదుగాన!!
॥ఏది॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు
---------------------------
వేదవిరహితులకు = వేదములను నమ్మనివారు
గరిమచెడి = భ్రష్టుడైన
దవగ్రాహములు = భక్తి జ్ఞానములకు అడ్డంకులు
భావామృతం
----------------------
ఓ దేవదేవా నాకు ఏది చూచినా నీ రూపమే కనుపిస్తుంది. మరి ఇన్నింటిలోనూ నీవే వున్నట్లు తోచుచున్నది. కానీ వేదములను నమ్మనివారు కొందరుంటారు. వారంటే మాత్రం నేను భయపడతాను. ఆ నాస్తికులకు పెరధర్మముల వారికి నావిదే విన్నపములు.
రకరకములైన ఈ దేవతారూపంబులలో నున్న నిన్ను గమనించి దర్శించవలెను అంతేకాని వారి భజన చేయరాదు. ఎందుకంటే ఎవడైన హరిభక్తుడు భ్రష్టుడై సత్సంగమును విడిచిపెడితే నీయొక్క స్మరణ వాడికి విజ్ఞాన వాసన కలిగించదు. అందుకని సత్సంగము ద్వారా సదా నీ స్మరణలో వుండాలి కాని కుతర్కములు పనికిరావు. ఇహలోకంలో ప్రాపంచిక కోరికలు కోరినట్లే తీర్చే దేవతలు అనేక వైభవాలతో దీప్తించుచుందురు. వారికాశక్తి అనుగ్రహించినది నీవే. ఆ వైభవం అందువలన వారికి సహజమే అనుకొనవలెను. అంతేగాని వారిని గొలువరాదు. ఆ హిమాంశుడైన చంద్రుని కిరణములు పడని చోటు బయట వుంటుందా. ఆ కిరణాలలో దారి చూసుకోవాలి గాని శృంగారభావాలను పొందరాదు. ఎందుకని అవి భక్తి జ్ఞానములకు అడ్డంకులు. అందుచేత ఓ శ్రీవేంకటేశ్వరా ఇదంతా నీ అస్ధిత్వము తగినట్లు ఇట్లు భావించుట దోషముకాదు. కానీ యెవరిన పడితే వారిని సేవించరాదు. నీ సృష్టిలో అన్నీ అర్హమే అయినప్పటికీ విష్ణు విరహితములు సేవించుటకు అనర్హంబులు.వాటిని అనర్హములననేకూడదు. ఎందుకంటే అంత హరియే అనే భావన ఆ వేదవిరహితులైన ఇతరులకు ఆ భావన అలవడదు కదా అందుకని అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీఅన్నమయ్య సంకీర్తన
🕉🌞🌟🌎🌙🚩
రేకు: 27-3
సంపుటము: 1-164
సంస్కృత కీర్తన
ll పల్లవి ll
బ్రువంతి బౌద్ధా బుద్ధ ఇతి
స్తువంతి భక్తా సులభ ఇతి!!
గదంతికిల సాంఖ్యాస్త్వాం పురుషం
పదవాక్య జాః పదమితిచ
విదంతి త్వా వేదాంతిన-
స్సదా బ్రహ్మ లసత్పదమితిచ !!
జపంతి మీమాంసకా స్త్వాం చ
విపులకర్మణో విభవ ఇతి
లపంతి నయసకలా స్సతతం
కృపాళుకుర్తా కేవలమితిచ!!
భణంతి వేంకటపతే మునయో-
హ్యణిమాదిప్రద మతులమితి
గుణవంతం నిర్గుణం పునరితి
గృణంతి సర్వే కేవలమితిచ!!
🕉🌞🌟🌎🌙🚩 సంకీర్తన
🕉🌞🌙🌎🌟🚩
సంగీతం,గానం.శ్రీ గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు
దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు జనకుఁడఅన్నమాచార్యుఁడ విచ్చేయవే
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించవిచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుఁగూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్లఁబాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే
🕉🌞🌙🌎🌟🚩
🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌙🌎🌟🚩
గానం: చివుకుల
ఉషాజయంతి గారు
ఇతనికంటే మరి
దైవముకానము
యెక్కడ వెదకిన యితడే
అతిశయమగు
మహిమలతో వెలసెను
అన్నిటి కాధారము తానె!!
మది జలధుల
నొక దైవము వెదకిన
మత్స్యావతారం బితడు
అదివో పాతాళ
మందు వెదకితే
ఆది కూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల
వెదకి చూచితే
భూవరాహమని కంటిమి
చెదఱక కొండల
గుహల వెదకితే
శ్రీ నరసింహం బున్నాడు!!
తెలిసి భూనభోం
తరమున వెదకిన
త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో
వెదకి చూచితే
పరశురాముడొకడైనాడు
తలపున శివుడును
పార్వతి వెదకిన
తారకబ్రహ్మము రాఘవుడు
కెలకుల నావులమందల
వెదకిన కృష్ణుడు రాముడుఐనారు!!
పొంచి అసుర
కాంతలలో వెదకిన
బుధ్ధావతారంబైనాడు
మించిన కాల
ము
కడపట వెదకిన
మీదటి కల్క్యావతారము
అంచెల జీవుల
లోపల వెదకిన
అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున
పరమున వెదకిన
యీతడే శ్రీవేంకటవిభుడు!!
🕉🌞🌙🌎🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి