*👁️సుదర్శనం👁️*
_మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందిద్దాం_
_💲ఆరోగ్యమునకు కేవలం ఔషధములే ప్రధానము కాదు, *ఈ మంచి మాటలు* మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహానికి అమృతత్వము నందించే టానిక్కులు._
_💲దుర్భావములూ, దుశ్చింతలూ హృదయములో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు._
_💲ఏ డాక్టర్లు చిక్కకపోయినప్పటికీ సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతనలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమేగాక ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి. ఆత్మసందర్శనాన్ని కూడా కలిగిస్తాయి._
_నేడు మనం అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనస్సుకు సరైన పోషణ లేకనే !_
_💲శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాం._
_కానీ మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు._
_అది లేకనే రోగములన్నీ వచ్చి మీద పడుతున్నాయి._
_💲నిత్యం ఓంకారం, భగవన్నామమును స్మరించుట, దీనుల సేవలలో పాల్గొనుట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తుంటే ఏ రోగమూ మన దరి చేరదు ! ఏ పీడా మనను ఏమీ చేయలేదు..
*💲నామరూప రహితుడు అంటే...*
*అన్ని రూపములు, అన్ని నామములు తానైనవాడు అని అంతరార్థం.*
*💲రావణ రాజ్యం లో ఉన్నా కూడా విభీషణుడు చెడిపోలేదు.*
*రామ రాజ్యం లో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు.*
*💲చెడిపోవటం, బాగుపడటం అనేది మనిషి స్వభావమే నిర్ణయిస్తుంది*
*_💲సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం. దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంక పరుస్తూ వస్తుంది_*
*💲మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన, ఆరాటం, ఆసక్తి తన ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో చూపడం లేదు. జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ, పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు. ఇంకనూ మెుక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు కానీ గుడి బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చడు!. భగవంతుణ్ణి రాతి బండలలో చూసేకన్నా మనిషి గుండెలలో చూడగలగడమే అసలైన జ్ఞానం. దీని నిమిత్తం త్యాగ గుణం అలవరచుకోవాలి. భగవంతుడు ఎవరినైనా ధనవంతులుగా చేసారంటే వారు దీనులను ఆదుకుంటారని, తద్వారా వారికి సద్గతి కలిగించాలనియే!. దీనికి ఏకైక మార్గం త్యాగమే. త్యాగ నిరతి లేకుండా ఆత్మజ్ఞానం పొందాలంటే అది అసాధ్యం*
💙💲💲💲
*“నేను ఎవరు ?”* అని మంత్రంలాగా జపిస్తూ ఉండవలెనా...
💲అవసరం లేదు. *'నేను ఎవరు'* అన్నది మంత్రం కాదు. దానికి అర్థం అన్ని ఆలోచనలకు మూలమైన *'నేను'* అనే ఆలోచన నీలో ఎక్కడ పుడుతోందో కనుక్కోవాలని.
కానీ నీకు ఈ విచారణా మార్గం కష్టమనిపిస్తే *'నేను', 'నేను'* అని మరలా మరలా వల్లెవేస్తూ ఉండు. ఇది ఆ గమ్యానికి చేరుస్తుంది. *'నేను'* ను మంత్రంగా ఉపయోగించుకుంటే కలిగే నష్టం ఏమీలేదు. అది దైవానికి మొదటి పేరు.
💲దైవం అంతటా ఉన్నాడు. కానీ దైవాన్ని ఆ విధంగా ఊహించడం చాలా కష్టం. అందుకే శాస్త్రాలు, *“దైవం అంతటా ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీవే దైవం; కాబట్టి ఆ సంగతిని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు"* అంటాయి.
*'నేను'* అని జపిస్తూ ఉంటే, అదే చివరకు నిన్ను *'నేనే బ్రహ్మాన్ని'* అన్న స్థితికి చేరుస్తుంది.
💛💲💲💲
"సంసారాన్ని భుజాల మీద పెట్టుకో. భగవంతుణ్ణి బుద్ధిలో పెట్టుకో"
💲 మంచిమాట, మంచి నడవడిక, మంచి తలంపు ఇప్పటికిప్పుడు మీకు ఫలితం కనబడకపోవచ్చును. వచ్చే జన్మలో అయినా కనిపిస్తుంది.
ఇతరులకు సహాయ సహకారాలు అందరూ చెయ్యలేరు. అలా చెయ్యడానికి మనస్సుని సన్నద్ధం చెయ్యాలి.
💲 మెలుకువలో నిద్రపోవడం నేర్చుకోండి. అదే నిజమైన సాధన.
సంపదల ప్రవాహం, ఆపదల ప్రవాహం మీ మెదడు మీదకు రానివ్వకండి, రానిస్తే బహిర్ముఖంగా ఉంటారు.
💲అంతర్ముఖం ఎప్పుడూ నిండు కుండలా ఉంటుంది. నీ లక్ష్యం ఉన్నతంగా ఉంటే నీలో పక్వత వస్తుంది.
*శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం*
*శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః*
💲శోకము ధైర్యమును నశింపజేయును, శాస్త్ర జ్ఞానమును మరచునట్లు చేయును, సమస్తమును నష్టపరచును. కావున శోకమునకు సమమైన శత్రువు మరియొకడు లేడు...
💲నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో
💲నీడను చూసి భయపడకూడదు దగ్గరలో వెలుతురుంటేనే నీడపడుతుంది
💲కాకులతో కలిసి తిరిగితే పావురం రూపుమరకపోవచ్చు కాని బుద్ధి మారుతుంది
💲మన కొసం మనం చెసె పని మనతొనె అంతరించిపొతుందు. పరులకొసం చెసె పని శాశ్వతంగా నిలిచిపొతుందీ
💲సత్యమే పలుకు , మాట్లాడే ముందు అల్లోచించి మాట్లాడు , ఆ తర్వాత లిఖించు
💲జీవితం లో ధనము కోల్పోతే కొంతకోల్పోయినట్లు వ్యక్తిత్వం కోల్పోతే అంతా కోల్పోయినట్లు...
💚💲💲💲
దేహానికి అనారోగ్యం సంకల్పించినప్పుడు దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ధ్వంసమైంది అని భావిస్తూ ఉంటారు.
వాస్తవానికి దేహం ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకోగలదు. మీ యొక్క భయాలతో , సందేహాలతో, నిరాశకర దృక్పథంతో, దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ను ఆటంకం పరుస్తున్నారు.
💲 ఎటువంటి వ్యాధినైనా దేహం నయం చేసుకోగలదు. ఆత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం విస్తారంగా ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా అధిగమించి ఆనందంగా జీవించే విధానం తెలుస్తుంది.
💲 ఆ జ్ఞానం వెలుగులో జీవితంలోని పరిస్థితులు ఉన్నతమైన రీతిలో మార్పులు చెందుతాయి
జ్వరం జలుబు వంటి వాటికి కూడా భయాందోళనలకు లోనవుతారు వ్యాధి మరింతగా ముదిరిపోయి ప్రాణం పోతుందేమో అని
భయపడుతుంటారు. ఇలాంటి భయాలు రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తాయి.
💲ఎవరికైనా ఏ వ్యాధియైనా వస్తే భయాందోళనలతో ఆ వ్యాధిని మీరు అంటు వ్యాధిగా స్వీకరిస్తున్నారు.
ఆ విధంగా ఆ వ్యాధి అందరికీ (వ్యాధి వస్తుంది అని నమ్మిన వారందరికీ) ప్రాకుతుంది.
💲ఒక *వ్యక్తికి సంక్రమించిన వ్యాధి నాకు అంటు వ్యాధిగా సంక్రమించదు అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నట్లు* అయితే ఆ వ్యాధి మీ దరి చేరదు.
💲 *మీరు భయంతో కానీ, ఆందోళనతో కానీ, నమ్మకాలతో కాని, మీరు ఆహ్వానిస్తే తప్ప ఏ వ్యాధి మిమ్మల్ని తాగదు, ఏ వ్యాధి మీ దరిచేరదు.*
💲 నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను. నాలోని భయాలు, అనుమానాలు, సందేహాలు, నెగటివ్ నమ్మకాలు, అన్నింటినీ వదలి, నేను నా సమాజం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాం సంల్పించుకోవాలి
💲 దేహం యొక్క ఆరోగ్య రక్షణ వ్యవస్థ అపరిమితమైన శక్తి సామర్ధ్యాలు.
💲భయంతో ఆందోళనతో అనారోగ్యం పాలవుతున్నారు.
*ధైర్యమే జీవితం. బలమే జీవితం*
*భయమే పాపం బలహీనతే పాపం.*
💲ఏ విశ్వమైన చైతన్య పరిణామం చెందటానికి ముఖ్య కారణం ఆ విశ్వకేంద్రం లోని బ్లాక్ హోల్ నుంచి బ్లాస్ట్ అయి ప్రసారము అవుతున్న శక్తివంతమైన "గామా ప్లాస్మా ఫోటాన్ లైట్ ఎనర్జీ" ప్రసరిస్తూ విశ్వపు అంచులవరకు వ్యాపిస్తుంది...
💲ఇది నెలకి మూడు నాలుగుసార్లు జరుగుతుంది..ఈ క్రమంలో ఈ ప్లాస్మా ఫోటాన్ లైట్ మహా కేంద్ర సూర్యుడి నుండి కేంద్రసూర్యుడికి అటుపిమ్మట లోకల్ సూర్యుడికి ప్రసరిస్తూ రీఛార్జ్ అవుతూ విశ్వపు అంచులవరకు శక్తివంతంగా ప్రయాణిస్తూ తన దారిలో ఉన్న అన్ని గ్రహాలను మరియు జీవరాశిని చైతన్యపరంగా ఎదిగేలా చేస్తుంది..అయితే ఈ గామా ఫోటాన్ లైట్ యొక్క షుమాన్ రెసోనెన్సు 40 హెట్జ్ నుంచి 100 హేట్జ్ ఉంటుంది దీని ప్రభావం వలన 3 వ పరిధి నుంచి 12 పరిధి వరకు ఉన్న అన్ని గ్రహాలు ఎదుగుతాయి ,,ఇది సహజంగా జరిగే ప్రక్రియ.... ప్రస్తుతం ఇదే భూమిపై జరుగుతోంది..
💲మార్పు లేని వస్తువు, మార్పు కలిగిన వస్తువుగా తోచడమే 'మాయ'.
_" 💲సులభంగా వచ్చేదేదీ జీవితాంతం నిలబడదు._
*_జీవితాంతం మనతో వుండేదేదీ అంత సులభంగా చేతికి అందదు."_*
*💲నిన్న చెడ్డ రోజు.....!__రేపు మంచి రోజు_ _వస్తుంది...._*
*_అనే__ఆశ వదిలి__ఈ రోజుని నీ రోజుగా మార్చుకో....*
🖤💲💲💲
*💲కామక్రోధముల నుంచి విముక్తి ఎలా...*
*ఒకే ఒక తలంపుకు అంటి పెట్టుకొని, మిగిలిన తలపులన్నీ పారద్రోలుము.*
*నామజపంలో ఒక్కోసారి మనసు నిలయు స్థితిని పొందుతుంది (తాత్కాలికమైన నిలకడ లయ). మితనిద్ర, మితాహారము జపానికి చక్కగా పనికి వస్తుంది. అతిఆహారము, అతినిద్ర పనికిరాదు. నిద్రలేచిన వెంటనే ఆత్మ గురించే ఆలోచించు. రోజంతాకూడ అదే (ఆత్మను గురించిన) ఎరుకతో వుండు. మనసు ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూవుంటుంది. ఇంకా జపం గురించిన మరపు, లోలోపల మాట్లాడుకుంటూ వుంటుంది మనసు - ఇవన్నీ అవరోధాలు*
*జపంలో కళ్ళు మూయవలెనా, తెరవవలెనా..*
*💲ఏదైనా ఒకటే. నీకేది నచ్చితే అదే చేయి. చూచుట, వినుట అనునవి మనసు వాటివాటి మీద వుండే ఆశక్తిని బట్టి వుంటుంది. మనసు ఆత్మ మీద నిలకడగా, నిశ్చలంగా వుంటే నీవు బయట ఏ దృశ్యాన్నిగాని, శబ్ధాన్నిగాని గమనించ లేవు. మనసు ఆత్మమీద లేనపుడు నీవు కళ్ళు తెరచినా, మూసినా ఒకటే. మనసుని అంతర్ముఖం చేసి ఆత్మ మీద నిలపవలెను. కళ్ళు మూసినా కూడా ఆలోచన పరంపర కొనసాగుతూ వుంటుంది. కళ్ళు తెరచి ధ్యానం చేస్తే మనసును అంతర్ముఖం చేయడం కష్టమౌతుంది. దానికి మనోబలం బాగుండాలి. కనుక నీవు కళ్ళు మూసినా, తెరచినా గమ్యం మనసును ఆత్మమీద మాత్రమే నిలపవలెను.*
💜💲💲💲
*‘సౌశీల్య సంపద కలవాడికి సముద్రం పిల్ల కాలువలా కనిపిస్తుంది. మేరు పర్వతం చిన్న రాయిలా అగుపిస్తుంది. సింహం- జింకపిల్లలా తోస్తుంది’*
*సచ్ఛీలత కలిగినవాడికి పాము పూలదండగా, కాలకూట విషం అమృతంగా మారతాయి*
*💲సదాచారుడికి పరాజయమే ఉండదు. ఎందుకంటే- అతడు ధర్మవర్తనుడు, సత్యసంధుడు, పర హిత వ్రతుడై ఉంటాడు. ఏ ఆపదా ఏమీ చేయలేదు. ఏ సమస్యా కుంగదీయదు. ఏ దుఃఖమూ దుర్బలుణ్ని చేయదు.*
*మనిషి తన జీవిత కాలంలో ఏ క్షణమూ విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం* .
**ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా మళ్లీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు.*
*శీలసంపద పోతే, తిరిగి పొందడం దుర్లభం* .
*💲భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సౌశీల్య సంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిది*
*అతడు ఆర్జించే విద్య, విత్తం, కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదేశోభిశోభిల్లవు*
*మనిషికి మంచి నడవడి ప్రధానమని, అది నశిస్తే ఏ విధమైన శక్తీ అతణ్ని రక్షించలేదు*
*సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు.*
*💲శీలవంతుడు అంటే...*
*ధార్మికుడు, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా అపరిచితుడైనా మేలు చేసేవాడు- సచ్ఛీలుడు. సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు- తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఇతర పెద్దల్ని ఆదరించే సంస్కారం గలవాడు శీలవంతుడు. అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు; క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే సచ్ఛీలుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సజ్జనుడనేవాడు అరిషడ్వర్గాలకు, సప్త వ్యసనాలకు నిరంతరం దూరంగానే ఉంటాడు.*
*💲మనిషికి సచ్ఛీల సంపద సిద్ధింపజేయడానికి....యమ-నియమాలు....*
*బ్రహ్మచర్యం,*
*దూషణ భూషణలకు అతీతంగా ఉండటం,*
*పరమాత్మ ధ్యానం,*
*నిష్కపటం,*
*పరుల సంపద ఆశించకపోవడం,*
*మధుర సంభాషణ,*
*💲ఇంద్రియ నిగ్రహం- వీటిని యమము లంటారు.*
*a. స్నానం,*
*b. మౌనం,*
*c. ఉపవాసం,*
*d. యజ్ఞ నిర్వహణ,*
*e. వేదాధ్యయనం,*
*f. గురు శుశ్రూష,*
*g. బ్రహ్మచర్య దీక్ష,*
*h. శాంత స్వభావం,*
*i. విధి నిర్వహణలో జాగరూకత*
*- వీటిని నియమాలు గా పేర్కొంటోంది స్మృతి.*
*తేజస్సు, క్షమ, ధైర్యం, అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి, నిరహంకారం - మానవుడి శీల సంపదను రెట్టింపు చేస్తాయి.*
*ఈ లక్షణాలతో మానవుడు భగవంతుడు కాగలడు..*
*💲రామాయణ భారత భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో సౌశీల్యవంతుల పాత్రలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. అవే నేటి మానవాళికి అనుసరణీయాలు.*
*శీలానికి అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి రెండూ అవసరమే* .
*💲విద్య, ధనం, యశస్సు పుష్కలంగా లభించినా కొందరు మాననీయులు కాలేరు. వారి మనసు వికారాలతో నిండి ఉండటమే అందుకు కారణం.*
*శీలాన్ని మించిన సిరులు లేవు, అదే మనిషిని అందరికన్నా గొప్పగా చేస్తుంది*
*💲సచ్ఛీలుడి సాత్విక బుద్ధి ఒక్కటే దైవ తత్వాన్ని అందించగలుగుతుంది.*
*దైవ చింతన సచ్ఛీలుడికే సత్ఫలితమిస్తుంది- అధర్మార్జనతో గుళ్లు గోపురాలు కట్టించేవాడికో, కీర్తి కాంక్షతో దానధర్మాలు చేసేవాడికో కాదు.*
*💲ప్రాపంచిక విషయ కశ్మలంలో కొట్టుమిట్టాడేవాడికీ పారమార్థిక చింతన అసలే ఒంటపట్టదు.*
*వ్యామోహ మమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ, మానవుడు సుగుణాలు పెంచుకోగలుగుతాడు.*
*అప్పుడే ముక్తిసాధనకు ఏ కంటకాలూ లేని చక్కటి బాట ఏర్పడుతుంది!*
*💲జ్ఞానం అంటే మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవటం.*
*శ్రీనివాస నామజపం అంటే మనతో మనం విస్తారంగా ఉండటం*
_*💲కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు*
💛💲💲💲
_*"ప్రాణ వాయువు లేకుండా బ్రతకగలను కానీ, రామనామం లేకుండా బ్రతకలేను"*
*ఆత్మ ఎవరికి తెలియబడాలి అని అనుకుంటుందో వారికే తెలియబడుతుంది !*_
_*మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ, కారణం లేకుండా భక్తిరాదు. కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు !*_
_*💲నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలాగే నీ హృదయంలో ఉన్న ఈశ్వరునిపై అనురాగం, ఆప్యాయత, భక్తి ప్రవహిస్తూ ఉండాలి.*_
_*భగవంతుని మీద ఇంత ప్రేమ, భక్తి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటే కారణం కనబడకూడదు*
_*💲మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా... దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా ? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదని అంటే శుద్ధ తప్పు.*_
_*💲దైవాన్ని కనుగొనే వరకు తగిన గురు సహాయంతో శోధించి, తిరిగి ఏ ప్రశ్న తలెత్తని స్థితిని సాధించినప్పుడు దైవం గురించి తాను మాట్లాడే అర్హత సాధించినవాడవుతాడు ! ఈలోగా తనకున్న పాండిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకుండా, శుష్క ప్రేలాపణలు, కువిమర్శలు చేసే వాడు తనకు తెలిసిన పరిమిత విజ్ఞానంతో అజ్ఞానిగానే మిగిలిపోతాడు...*
_*💲గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు, ఇబ్బందులకు లోనై కిందపడినా, బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడేగాని నేలకు అతుక్కొని ఉండిపోడు. అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టిముద్దలా కాదు...*_
🧡💲💲💲
_*ఉత్కృష్టమైనది, అనితర సాధ్యమైనదే గురువు గారి నుండి ఆశించుదాం...*_
_*💲తత్త్వజ్ఞాని యొక్క శాంతి లక్షణాలే మనకు మార్గదర్శకం. అలాంటి ఉత్తమోత్తమమైన శాంతికోసమే గురువు గారిని ఆశ్రయించాలి. లౌకిక ఫలాలకోసం, జ్యోతిష్యం కోసం, భవిష్యత్ ఫలాల కోసం ఆశ్రయిస్తే సముద్రం దగ్గరకు వెళ్లి ఉద్దరిణతో నీళ్ళు తెచ్చుకున్నట్లే అవుతుంది. గురువు గారికి ఇహము, పరము రెండూ తెలుసు కనుక ఈ జీవనగమనంలో మనకు కొంత అండనిస్తారు. కానీ కేవలం అందుకే వినియోగించుకోవాలని అనుకుంటే అందుకు గురువే అవసరం లేదు. ఈ సృష్టిలో చెట్టూ, పుట్టా దేన్ని నమ్ముకున్నా ఆ ఫలాలు వస్తాయి. ఉత్కృష్టమైనదీ, అనితర సాధ్యమైనదే గురువు గారిని అడగాలి. వారినుండి ఆశించాలి. గురువు గారి ద్వారా లభించే జ్ఞానం చేతనే సంకల్పాలు, వికల్పాలు, సందేహాలు నివృత్తి అయి చిత్తం నిర్మలమై శాంతిగా ఉంటుంది*
🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి