7, ఏప్రిల్ 2020, మంగళవారం

కుండలినీ శక్తి


కుండలినీ శక్తి

        --- 1 ---

"కుండలిని" అనేది ఒక సంస్కృత పదము. దీని అర్థం "భుజంగము" అనగా పాము. కుండలినీ శక్తి ఒక నిగూఢ శక్తి అయి ఉండి, ఈ శక్తి శరీర అంతర్భాగము నందు వశిస్తూ ఉన్నది.  ఈ కుండలినీ శక్తి చుట్టలు చుట్టుకుని మూలాధార చక్రము నందు వశిస్తూ ఉన్నది. మిగతా చక్రములు లేదా శక్తి కేంద్రములు  స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రారము. ఈ శక్తి మానవ శరీరంలో దాగి ఉన్న సృజన శక్తిగా విశ్లేషించడం జరిగినది. శాక్తేయము, తంత్ర శాస్త్రాలలో ఈ శక్తిని.... కుండలిని అంటే దుర్గ అని శక్తి (పార్వతి) అని, భక్తి యోగంలో ఆహ్లాదిని శక్తి అని, హఠ యోగంలో "కుండలిని" , మంత్రయోగంలో "జగదంబ" గానూ....ఇలా అనేక ఉపమానాలతో.....ఈ మహా శక్తిని పిలుస్తారు.
  

   ఉపనిషత్తులలో ఈ శక్తి  చుట్టలు చుట్టుకుని ఉన్న పాముగా విశ్లేషించ బడింది. 3 1/2 (మూడున్నర)  మెలికలు తీసుకొని శరీరంలో మూలాధారం వద్ద ఒక నిగూఢమైన భుజంగ శక్తి ఉంటుంది.  ఈ మూడున్నర (3 1/2) మెలికలలో మూడు(3) అంకె, "జాగృతి, స్వప్న, సుషుప్తి" స్థితులకు సంబంధించినది. అర (1/2) అంకె, ఈ మూడు స్థితులను మించిన "తురీయాన్ని" సూచిస్తుంది. పరిణామ క్రియా విశ్లేషణలో రాయి,రప్ప-మొదటి చుట్టు, చెట్టు, చేమ - రెండవ చుట్టు, జంతువు,పక్షి - మూడవ చుట్టు, మిగతా "అర" చుట్టు - మనిషి మనో వికాసం కొంత వరకే పరిణామం చెందినట్లు....మిగతా అర చుట్టు - పూర్తి కావలసిన పరిణామానికి సూచనగా కూడా, వర్ణించ బడింది. ఏది ఏమైనా "కుండలినీ శక్తి" సంపూర్ణంగా సిద్ధింప జేసుకున్న వాడు, మానవ పరిణామ క్రమాన్ని దాటి వెళ్ళిపోతాడు. అతడి మనో మట్టాలు, సామాన్య మానవులకు మల్లే ఉండవు. అతడు మహా యోగి, సిద్ధుడు, ప్రకృతి ఆ సిద్ధునికి కైవశమై ఉంటుంది. జీవన్ముక్తునిగా కూడా ఆతడు పరిణమిస్తాడు.
   

 మానవులలో అంతర్గతంగా దాగి ఉన్న ఈ మహా శక్తినే "కుండలిని శక్తి" అంటారు. ఈ శక్తి మనిషి వెన్నెముక మూలం వద్ద, మొదటి చక్రమైన "మూలాధార స్థానం" వద్ద నిద్రాణమై వుంటుంది. చలనం లేకుండా దాగి ఉన్న ఈ శక్తిని జాగృత పరచడమే "కుండలినీ వికాసము". జప సాధన, ధ్యాన సాధన, కీర్తనలు, హఠ యోగ సాధన, మంత్ర సాధన....ఇవన్నీ కుండలినీ వికాసాన్ని కలిగిస్తాయి.(సశేషం)

సంకలనం : భట్టాచార్య
[12:42, 06/04/2020] +91 92915 82862: 136.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
136. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ॐॐॐॐॐॐॐॐॐॐ

పంచమ ఖండం నుంచి అష్టమ ఖండం వరకూ:
చిత్తము సంకల్పము కంటే గొప్పది. మనుష్యుడు చిత్తముతో నిండి ఉన్నప్పుడే సంకల్పము చేస్తాడు, వాంఛిస్తాడు. వాగీంద్రియము ప్రేరణ కలుగ జేస్తుంది. వాక్కు నామములో ప్రతిష్టింప బడుతుంది. నామములో మంత్రాలు ఏకమవుతున్నాయి. మంత్రాలలో కర్మలు ఏకమవుతున్నాయి. వీటన్నిటికీ చిత్తమే చివరి ఆశ్రయము. చిత్తమే వాటి ఆత్మ. ఇవన్నీ చిత్తములోనే ప్రతిష్టింప బడి ఉన్నాయి.


అందుకే ఎక్కువగా విషయములు తెలిసిన విద్వాంసుడు కూడా చిత్తము యొక్క సహకారములేకపోతే, ఏకాగ్రత లేనివాడైన యెడల అతనిని విద్వాంసుడని కాని తెలిసినవాడని కాని చెప్పరు కదా। ఇతడు నిజముగా విద్వాంసుడైతే ఈ విధంగా అజ్ఞానిలా మతిలేకుండా ఉండడు అంటారు.
గొప్ప విద్వాంసుడు కాకపోయినా కొంచెం విషయజ్ఞానం ఉన్నవాడయినా, జనులందరూ ఆతని మాటలు వినడానికి ఇష్టపడతారు. అందువల్ల చిత్తమే అన్నిటికీ చివరి ఆశ్రయము. చిత్తమే ఆత్మ. చిత్తమే ఆధారము. చిత్తమును పరబ్రహ్మము గా ఉపాసించు అని నారదునకు సనత్కుమారుడు చెప్పేడు.


ఈ రీతిగా చిత్తాన్ని ఉపాసించేవ్యక్తి దృఢచిత్తు డౌతాడు. ఈతడు సర్వాత్మకుడుగా అన్ని లోకాలలోను ప్రతిష్ఠ కలవాడవుతాడు. బుద్ధిని పరబ్రహ్మ గా ఉపాసించిన అతడు అన్ని భావాలు స్వతంత్రంగా కలవాడవుతాడు.
ఈ చిత్తానికంటే అధికమైన దేదయినా ఉందా? అని నారదుడు ప్రశ్నించగా ఉంది అంటూ సనత్కుమారుడు ధ్యాన స్థితి అనేదాని గురించి ఇలా చెబుతున్నాడు.


ధ్యానస్థితి అనేది చిత్తం కంటే చాలా గొప్పది. అంతరిక్షం, ద్యులోకం, నీరు, కొండలు, దేవతలు, మానవులు, మొదలైన సర్వమూ ధ్యానం చేస్తున్నట్లే కనిపిస్తాయి. ధ్యాన సిద్ధి వల్లనే మానవులు ఔన్నత్యాన్ని పొందుతున్నారు.


ధ్యానము చేయలేని వారు క్షుద్రులుగా, కలహప్రియులుగా, ఇతరుల తప్పుల నెంచు వారుగా అవుతున్నారు. పరోపకారి చేయాలనే మనస్సు ఉన్నవారు, మంచి ప్రకాశ వంతులు ధ్యానము యొక్క సత్ఫలితాలను అనుభవిస్తారు. అందువల్ల ధ్యానాన్ని పరబ్రహ్మముగా ఉపాసించాలి.
ధ్యానం కంటే కూడా మరేదయినా గొప్పది ఉందా అని అడిగిన నారదుని ప్రశ్నకు సనత్కుమారుడు ఇలా చెప్పేడు.


ధ్యానం కంటే కూడా విజ్ఞానం చాలా గొప్పది. విజ్ఞానం వల్లే, చతుర్వేదాలు, పంచమ వేదము అయిన ఇతిహాస పురాణాలు, షడంగాలు, భూత తంత్ర విద్య, క్షత్రవిద్య, నక్షత్తవిద్య, సర్వదేవ జన విద్యలు, భూమి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, క్రిమికీటకాలు, పతంగములు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు, మంచి చెడ్డలు, ప్రియా ప్రియములు మొదలైన సర్వస్వము విజ్ఞాన మయమై ఉన్నాయి. ఇవన్నీ విజ్ఞానం వల్లే తెలుస్తున్నాయి. కనుక విజ్ఞానాన్నే బ్రహ్మము గా ఉపాసించాలి.
విజ్ఞానాన్ని బ్రహ్మము గా ఉపాసించే వాడు విజ్ఞానమయలోకాల్ని చేరుతున్నాడు. ఆ విజ్ఞానం ఎంత వరకూ వ్యాప్తిచెందుతుందో అంతవరకూ ఆ ఉపాసకుడు స్వేచ్ఛగా సంచరిస్తాడు. అందుకే విజ్ఞానమే సర్వస్వమై ఉంది.


విజ్ఞానం కన్నా గొప్పదేదయినా ఉందా అని నారదుడడుగగా బలం విజ్ఞానంకన్నా గొప్పది అంటూ సనత్కుమారుడు ఇలా అన్నాడు. బలం గల వ్యక్తి ఒకసారి వందమంది జ్ఞానవంతులైన పండితుల్ని భయపెట్ట గలడు. మానవుడు బలవంతుడైతే అతనికి ధైర్యం చేకూరుతుంది.


అలా ధైర్యం గా నిలపగలిగిన వాడే సద్గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని తత్వాన్ని తెలుసుకోగలడు. బాగా వినగలుగుతాడు. మంచి బుద్ధితో మంచి పనులు చేయగలుగుతారు. చక్కగా జ్ఞానాన్ని ఆర్జిస్తాడు.


పృథివి, ఆకాశం, ద్యులోకం, దేవతలు, కొండలు మనుషులు, పశువులు, పక్షులు, క్షీరములు, వనస్పతులు, క్రిమికీటకాది సర్వ ప్రాణులు, సర్వలోకాలు, ఇవి అన్నీ బలం అనే ఆధారంతోనే నిలిచి ఉన్నాయి. కనుక నీవు బలాన్ని పరబ్రహ్మ గా ఉపాసిస్తే గొప్ప బలం కలవాడవవుతావు. అన్నాడు సనత్కుమారుడు.

🕉🌞🌎🌙🌟🚩
[12:45, 06/04/2020] +91 92915 82862: ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.8
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.

ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచ…
[12:51, 06/04/2020] +91 92915 82862: ఓం నమః శివాయ:
8..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

8. ఉపాదానే 2 ఖిలాధారే
జగంతి పరమేశ్వరే
సర్గస్థితి లయాన్యాన్తి
బుద్బుదా నివ వారిణి ||

అఖిల + ఆధారే = సర్వానికి ఆధారమైన, ఉపాదానే = సృష్టి యొక్క మూలసామగ్రికి కారణమైన,
పరమేశ్వరే = పరమాత్మయందు, జగంతి = లోకాలు,
 వారిణి = నీటియందు బుద్బుదాన్‌ ఇవ = బుడగల వలె, సర్గ-స్థితి-లయాన్‌ = పుట్టుట పెరుగుట నశించుట,
యాంతి = పొందుతున్నాయి.


తా||సర్వానికి ఆధారమైన సృష్టియొక్క మూల సామగ్రికి కారణమైన పరమేశ్వరుని యందు ప్రపంచాలు నీటి యందు బుడగలవలె పుట్టి, పెరిగి, నశిస్తున్నాయి.


వివరణ :- ప్రపంచం క్రమం తప్పకుండా కార్యరూపంలో కనిపిస్తుంది కనుక దీనికి మూలాధారమైన కారణం ఏమిటి? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లా పర్యాలోచన చేసిన నాడు సాధకునికి సాధనలో బ్రహ్మమే అని తెలుస్తుంది. కార్యకారణ సంబంధం బ్రహ్మమే అని తెలుస్తుంది. అయితే సర్వానికి ఆధారమైన బ్రహ్మసృష్టికి మూల సామగ్రి ఏది అని పరిశీలించిననాడు బ్రహ్మమే తప్ప మరొకటి లేదు అని తెలుస్తుంది.


కనుక బ్రహ్మ సృష్టి అయిన ప్రపంచాలన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. అన్నీ కూడా బ్రహ్మం నుంచే పుడుతూ, పెరుగుతూ, లయించిపోతున్నాయి. నీటి బుడగ నీటికంటే అన్యమైంది అవదు కదా? నీటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే నీటి బుడగకు కూడా ఉంటాయి కదా! కాన నీటికి నీటి బుడగకు ఏ భేదం ఉంటానికి వీలు లేదు కదా ? అట్లాగే బ్రహ్మాన్ని బ్రహ్మ సృష్టి అయిన లోకాలకు ఏ భేదం ఉంటానికి వీలులేదు కదా? అందువల్ల లోకాలు బ్రహ్మం రెండు కూడా బ్రహ్మమే అయి ఉన్నాయి.


ఉదాహరణకు ఆత్మను తీసుకొన్నట్లయితే ఆత్మ బ్రహ్మం కంటె వేరు అయింది కాదు కదా? మాయ ఆవరించిన ఆత్మయే జీవుడుగా జీవిస్తున్నాడు కాన పరాత్పరుని నుండి ప్రతిరోజు అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయించినట్లే జీవుని యందు ఈ లోకంలో అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయిస్తున్నాయి. జీవుడు స్వార్థచింతనలతో జగత్తుతో తాదాత్మ్యం చెందటం వల్ల వాస్తవ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కనుక జీవుడు అనేకమైన కోరికలను పుట్టిస్తూ, వాటిని వృద్ధిచేస్తూ, వాటితోనే లయించిపోతున్నాడు.


మానవుడు కలలో ఏ విధంగా తీరని కోరికలను తీర్చుకొంటూ, అనేకమైన వాటిని పుట్టిస్తూ, అనుభవిస్తూ, లయిస్తూ గడుపుతూ ఉన్నాడో అదే విధంగా జీవుడు భౌతికమైన జీవభ్రాంతితో ప్రతినిత్యం నూతనమైన కోరికలతో, విషవలయంలో పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతున్నాడు. దాని నుంచి విముక్తి పొందగోరిన జీవుడు మాత్రమే ప్రయత్న పూర్వకంగా సాధన చేసినవాడు సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మతో లీనం అవుతున్నాడు. అప్పుడు ఆత్మ బ్రహ్మంకంటే వేరు కాదు అని అటువంటి సాధకునికి తెలుస్తుంది.


ఒక వస్తువును సృష్టించాలంటే దానికి మూడు కారణాలు అవసరం.
1) ఉపాదాన కారణం,
2) నిమిత్త కారణం,
 3) సహకార కారణం.


 కుమ్మరికుండ చెయ్యాలనుకుంటే మూల సామగ్రి అయిన మన్ను ఉపాదాన కారణం అవుతుంది. కుమ్మరి నిమిత్త కారణం అవుతున్నాడు. అతని చక్రం సహకార కారణం అవుతుంది. ఇక్కడ సృష్టికి మూల సామగ్రి అయిన ఉపాదాన కారణం బ్రహ్మే అయ్యాడు. సృష్టించిన బ్రహ్మ నిమిత్తకారణం కూడా అయ్యాడు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండూ కూడా ఒక్కటే అయిపోయాయి.


కార్యకారణ సంబంధాన్ని ఆలోచించినప్పుడు బంగారం కారణం అయితే ఉంగరం కార్యం అయింది. దూది కారణం అయితే వస్త్రం కార్యం అయింది. మట్టి కారణం అయితే కుండ కార్యం అయింది. బ్రహ్మం కారణం అయితే సృష్టికార్యం అయింది. కావున సృష్టికి మూలద్రవ్యం అయిన ఉపాదాన కారణం బ్రహ్మమే అయింది. సాలెగూడుకు సాలీడే కారణం అయితే గూడు కార్యం అయింది.


 దానికి ఉపయోగపడిన మూలద్రవ్యమైన ఉపాదాన కారణం కూడా సాలీడే అయింది. ఈ విధంగా సాలెపురుగు సాలెగూడుకు నిమిత్త కారణం, సహాయ కారణం, ఉపాదాన కారణం మూడు కూడా తానే అయి ఉంది. అదే విధంగా బ్రహ్మం ఈ సృష్టికి అన్నీ తానే అయి ఉంది. అందువలన నీటిలో నీటిబుడగ పుట్టి పెరిగి లయించినట్లు ప్రపంచాలు బ్రహ్మంలోనే పుట్టి పెరిగి బ్రహ్మంలోనే లయిస్తున్నాయి.


అయినా ఏవీ బ్రహ్మంకు అంటటం లేదు. బ్రహ్మం సాక్షి మాత్రంగానే ఉంటుంది. దీనిని వర్ణించటానికే రమణ మహర్షి సినిమా హాలులో కనిపించే సినిమా తెరను ఉదాహరించారు. తెరపైకి బొమ్మలు వస్తుంటాయి. పోతుంటాయి. ఏవీ కూడా తెరకు అంటవు. అదే విధంగా సృష్టికర్తయైన బ్రహ్మానికి ఏదీ అంటకుండా సృష్టి సర్వం తనలోనే సాగిపోతుంటుంది. బ్రహ్మమయిన తెర నిత్యం అయితే సృష్టి అయిన ఈ ప్రపంచం లేక జీవరాసులు అనిత్యం అయి ఉన్నాయి.
సాధకుడు తానే బ్రహ్మమై నిలిచిన నాడు ఈ ప్రపంచం అంతా ఆతని హృదయ సీమయందు ఆ విధంగానే వస్తూపోతూ ఉంటుంది.


 ఏదీకూడా ఆ సిద్ధిపొందిన రమణ మహర్షి వంటి వారికి అంటదు. ఒక సందర్శకుడు రమణ మహర్షిని ''చిన స్వామి వారు ఈ పృచ్ఛకులతోనే ఎక్కువసేపు కాలం గడిపేస్తున్నారు. సాధనలో మునిగేది ఎప్పుడూ'' అని ప్రశ్నించాడు. రమణ మహర్షి ''మునగనిది ఎప్పుడు?'' అని ఎదురు ప్రశ్న వేశారు. అంటే నిరంతరం ఆత్మే అయి తాను జీవిస్తున్నానని చెప్పారు.


సుషుప్తి అంటే గాఢనిద్రలో మనస్సు లయించి పోవటం. అంత మాత్రాన మానవుడు లయించిపోతున్నాడా? లేదు కదా !'' మానవుడు మేల్కొనగానే జగత్తు అనుభవానికి వస్తుంది. మానవుని కోరికలే, ఆలోచనలే, భావనలే ప్రపంచాన్ని తయారుచేస్తున్నాయి. కనుక ప్రపంచం మానవునిలో ఉంది. మానవుడు ప్రపంచంలో ఉండటం కాదు.


 అందుకే సాధనలో ప్రపంచం లయించి పోతుంది. అట్లా అవ్వటానికి మూల కారణం సంకల్పాలే. కావున సంకల్పాలకు మూల కారణం అయిన కోరికలు జీవచైతన్యంలో అంటే ఆత్మలో లయించి పోయిననాడు సంకల్పాల చేత సృష్టింపబడ్డ జగత్తు కూడా లయించిపోతుంది. అంటే జీవుని యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ కూడా జీవచైతన్యమైన ఆత్మజ్ఞాన స్వరూపంలో కలిసిపోతున్నాయి.


ఆ విధంగా నీటి బుడగలు నీటిలో కలిసిపోయినట్లు జీవుడు ఆత్మలో కలిసిపోతున్నాడు. జీవుడు నేను ఆత్మను అని గ్రహించి ఆత్మజ్ఞానంతో జీవించిన నాడు మాత్రమే ఆత్మ అనంతమైన ఆత్మలో కలిసిపోతుంది. లేనినాడు జీవుడు చావుపుట్టుకల విషవలయంలో చిక్కుకొంటూ పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతుంటాడు.


సూర్యుడు ప్రధాన కేంద్రంగా ఉండి అనేకమైన గోళాలు దానిచుట్టూ తిరుగుతున్నాయి గదా ! అదే విధంగా సూర్యునిలా ఉన్నటువంటి మిగిలిన వాటిని పాలపుంతలు అంటున్నారు. అట్లాంటి పుంతలు ఇప్పటికి తొమ్మిదింటిని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు.


పూర్వులు సూర్యుని పుంతలనే సూర్యులన్నారేమోనని అనిపిస్తుంది. ద్వాదశాదిత్యులు భూమి చుట్టు వచ్చిననాడు భూమి లయించిపోతుంది అని చెప్పి ఉన్నారు కదా ! కాన సృష్టిరహస్యాలను సామాన్య జ్ఞానంతో వివరించలేము. బ్రహ్మం నుంచి ఎన్నిలోకాలు పుడుతున్నాయో ఎన్ని లయిస్తున్నాయో సామాన్యమైన మానవులు చెప్పలేరు.

🕉🌞🌏🌙🌟🚩
💎💥💎💥💎💥💎

🔺 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __
💎 వివేక చూడామణి.
స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.
ఆడియో నం.83

💎💥💎💥💎💥💎
కుండలినీ శక్తి - నాడీ విజ్ఞానము


            --- 2 ---

          మానవ శరీరమునందు 72,000 యోగ నాడులు కలవని, అనేక శాస్త్రములు  వివరిస్తున్నవి. ఉపనిషత్తులలో....  యోగోపనిషత్ ,దర్శనోపనిషత్, యోగ కుండల్యోపనిషత్, ధ్యాన బిందూపనిషత్.... వంటి అనేక యోగ గ్రంథములలో కూడ ఈ వివరణ కలదు.
యోగ సాధన లోని ఆసన-ప్రాణాయామ పద్ధతుల ద్వారా-ధారణ ధ్యానాదుల సాధనచేతను, శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న కుండలినీ శక్తిని ఉత్తేజపరచ వచ్చును. ఇడ(ఎడమ నాసాగ్రము నందు)నాడి,---పింగళ నాడి(కుడి నాసాగ్రమున),సుషుమ్న(నాసాగ్రము మధ్యన)కలదు. ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని, సూర్య నాడి అని కూడ చెప్పెదరు. ఈ నాడుల ఉద్దీపనను "కుండలిని ఉద్దీపనము" అని కూడ అనవచ్చును.
పాశ్చాత్యుల శాస్త్రము ప్రకారము మెదడు నందు గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతోను - మెదడు లొని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతోను సంబంధము కలదు .అనగా సింపతిటిక్ (sympathetic), పరా సింపతిటిక్ (para-sympathetic) మరియూ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నవి. ఆ నాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.
 శరీరము నందలి మూలాధారం నకు మీదుగా నాభి స్థానమునకు.... మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియొకటి కలదు. ఇడా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి. మనుజుల దేహంబున సూక్ష్మ,, స్థూల నాడులు కొన్నికోట్లు  ఉన్నవి.ఈ నాడులు ములాధారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధో (క్రింద ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగము గా వ్యాపించి ఉన్నాయి . మరియు పై నాడులను ఆశ్రయించి, కోట్లలో రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములు గా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సూక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాది వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండును. ఈ నాడులలో 72 వేల ప్రధాన నాడులు వాయు సంచార యోగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విధంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది. అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాధారమును ఆశ్రయించి, నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రధాన నాడులు సూక్ష్మ ఛిద్రములతో కూడి యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిధ అన్నపానాదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును .
పైన చెప్పిన నాడులలో ఇడా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్తి జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలమ్బుస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి. ఈ పదునాలుగు నాడులలో ఇడా నాడి మొదలు..... చారణ నాడి వరకు గల పది నాడులు ప్రాణాది వాయు వాహినులు అయి ఉన్నవి. ఈ నాడులన్నీ ప్రాణాది శక్తి వాహకాలు. అందువలన ఇవి ప్రధాన నాడులుగా గుర్తించబడుతున్నవి . ఇడా , పింగళ , సుషుమ్న అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును . గాంధారి, హస్తిజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షిణాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామ బాగంబున వ్యాపించి ఉండును. మధ్య బాగం నందు ఉండే ఒక నాడి  సమస్త కార్యంబులను చేయును .
వామ నాసిక యందు ఇడా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంధ్రము యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తిజిహ్వ, దక్షిణ కర్ణంబు పూషా , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుస , శిశ్న ములంబున కుహు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులు ను ఆశ్రయించి ఉండును.
ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేవదత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనుంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును. సుషుమ్నా నాడిననుసరించి, అలంబుస-కుహూ అనేనాడులుంటాయి. వారుణి, యశస్విని అనే నాడులు ...సుషుమ్నా నాడిలో ఉంటాయి. ఈ సుషుమ్నకు దక్షిణ భాగంలో....పింగళ అను నాడి, దాని మధ్యలో పూషా, పయశ్విని అనే నాడులు కలవు. సుషుమ్నకు మధ్య భాగంలో, కొంచెం పడమరగా సరస్వతీ నాడి కలదు. దానిననుసరించి శంఖిణి, గాంధారి నాడులు కలవు. సుషుమ్నకు ఉత్తర దిశలో ఒక ప్రాణ నాడి ఉంది. దాని ప్రక్కనే, హస్తి జిహ్వ, విశ్వోదర నాడులున్నాయి. నాద రూపాలయిన ఈ నాడులన్నీ నాదాధారాలు. బ్రహ్మ రంధ్రం మధ్య ప్రదేశం, ఊర్థ్వ కుండలినీతో కప్ప బడింది. ఇలా నాడీ గతులను,శ్వాస గతులను, వాయు సంచారాన్ని సాధకుడు బాగుగా అభ్యసించాలి. కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారణముకు ఉపయుక్తమై ఉండును. "పురీతతి" అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్ర కలుగును.

భట్టాచార్య
[10:12, 07/04/2020] +91 90009 72611: 🙏
[11:11, 07/04/2020] +91 7013 527 083: మార్మికుడు - నాగా సాధువు

(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)

    వింధ్య-సాత్పురా పర్వతాలలో ఉన్న అడవులలోకి వెళ్ళమని, ఒకసారి మహర్షి రాజర్ నన్ను ఆదేశించారు. నట్టడవిలో నేను తిరుగుతుండగా,  చుట్టూ పచ్చగా ఉన్న ఒక ప్రాంతం నన్ను ఆకర్షించింది. అక్కడ నేనొక పురాతనమైన స్మశానాన్ని చూసాను. బహుశ, పూర్వకాలానికి చెందిన ఆది వాసీలకు అది చెంది ఉండవచ్చును. అక్కడ నాకు "భర" అనే మూలాక్షరం కనిపించింది. నేను ఆ స్మశానం మధ్యలో కూర్చొని, "మార్తాండ భైరవుణ్ణి" ధ్యానించాలని నిర్ణయించుకున్నాను. కొన్ని గంటల తరువాత, నేను కళ్ళు తెరవగానే, నాకొక మరుగుజ్జు కనిపించింది. నాకు ఒక మీటరు దూరంలో నిల్చొని నవ్వింది. తన వెనుక రమ్మని సైగ చేసింది. మేము కొన్ని కొండలు దాటి, ఒక గుహను చేరుకున్నాం. గుహ లోపల చీకటిగా ఉంది. చాలా గబ్బిలాలు ఎగురుతున్నాయి. నేను గుహలోకి వెళ్ళగానే, మరుగుజ్జు మాయం అయ్యింది. నేను వెళ్తూ ఉన్నాను. అపుడు నేనొక నీలి వెలుగును గమనించాను. ఉన్నట్టుండి, గాఢ సువాసన ఎగజిమ్మింది. ఆ గుహచివరన,  రాతిపై అద్భుతమైన "మార్తాండ భైరవుడి" ప్రతిమ చూసాను. ఆ విగ్రహం ముందు కూర్చొని, భైరవుణ్ణి ధ్యానించాను. ఆ పారవశ్యంలో నేను 5 రోజులు ఉండి పోయాను. నేను వెళ్ళేందుకు లేవగానే, గుహ ద్వారం వద్ద ఒక "నాగా సాధువు" నిల్చొని ఉండడం చూసాను.

     ఆయన మధుర స్వరంతో "నువ్వు వెళ్ళాలనుకొంటే,నన్ను త్రోసి వెళ్ళు".....అన్నారు.

 నేను --- మీరు అనుమతించేవరకు, నేనిక్కడే ఉంటాను.

ఆయన --- సరే! నేను కపాల భైరవ తంత్రం చెబుతాను. కానీ ఆ తంత్రాన్ని-విధానాన్ని ఒక్కసారే చెబుతాను. నువ్వు గ్రహించాలి.

నేను --- మీ దయ వల్ల అలాగే గ్రహిస్తాను.

తర్వాత 16 గంటల్లో నేను ఆ తంత్రంతో దీవించబడ్డాను. ఆ నాగా సాధువు నాకొక మాల ఇచ్చి  అదృశ్యమయ్యాడు. నేను స్మశానానికి వెనక్కి వెళ్ళగానే,ఆశ్చర్యంగా, అక్కడ నాకోసం వేచిచూస్తూ మహర్షి రాజర్  కనిపించారు. ఆయన నన్ను హత్తుకొని ఆ మరుగుజ్జు భైరవుడిది " క్షం" బీజమని, నాగా సాధువు భైరవి "క్రౌం" బీజమని చెప్పారు. జీవితంలో మొదటిసారి నాకప్పుడే, ఆకారం లేని బీజాక్షరాలు కూడా మానవాకృతి దాల్
చగలవని తెలిసింది. దైవాన్ని కొనియాడండి. సర్వం దైవమయం.

---మార్మికుడు
మార్మికుడు - వైకుంఠ పాళి ఆట :

   ఒకసారి నా గురువైన రాజర్ నాకు ‘వైకుంఠపాళి’ ఆటబొమ్మను చూపారు. దాన్ని’ పరమపద సోపాన పటము’  అంటారు. ఆయన అందులో నిచ్చెన గురువని, పాము పితరులని అన్నారు. అందులోని పాచిక ఒక అవకాశం. కాని మీరు పాచికలు తిప్పేటప్పుడు ఎంచుకోలేరు. అలా ఎంపిక లేకుండా పాచికలు ఆడిస్తూ  (జీవితంలో కర్మ చేస్తూ ) ఒకరు ఒక ఇంటి నుంచి, ఒక ఇంటికి మారుతూ ఉంటారు. గురువనే నిచ్చెన వారు కర్మను కొంతవరకూ తప్పించుకునేలా సహాయపడతారు. కొన్ని ఇళ్ళకు మీరు వెళ్ళకుండా చేస్తారు. కాని, పితృదేవతలు అది గమనిస్తూ, మీరు ఎంపిక లేకుండా పాచికలు తిప్పేటప్పుడు, మీరు వారింటికి (పాము తలవద్దకు ) వచ్చేలా చేసి, మిమ్మల్ని క్రింది ఇంటికి వెనక్కు పంపుతారు. గురువు మిమ్మల్ని పైకి పంపడం ద్వారా కర్మను తప్పించుకోవడం బోధిస్తారు. పాచిక దైవం... ఆయన దాన్ని దొర్లిస్తూ, మీ లెక్కలు చెబుతారు. గురువుకు, పితృదేవతలకు మధ్య దైవం ఆటాడుతారు . ఈ ఆట అనేక జన్మల పాటు కొనసాగుతుంది. చిట్టచివరికి, మీరు పాచిక తిప్పుతూ ఉండగా, దైవం గురువుకు, పితరులకు మధ్య మీరు ప్రయాసతో ఆడిన ఆటతో తృప్తిని పొంది, మీరు చిట్టచివరి పెద్ద పామును తప్పించుకునేలా చేసి, పరమపదం చేరేందుకు అనుగ్రహిస్తారు. ఇదే వైకుంఠము... జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితి. ఈసారి మీరు ఈ ఆట ఆడేటప్పుడు, దీన్ని గురించి ఆలోచిస్తూ ఆడండి. అప్పుడు ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నా గురువు చూపిన జ్ఞానమార్గం.

vvs
🙏


కుండలిని శక్తి జాగృతి లో వివిధ అవస్థలు - (పిప్పిలకము (చీమ) -వైజ్ఞానిక విశ్లేషణ :

           --- 3 ---

 కుండలినీ శక్తి జాగృతమైన సమయంలో మూలాధార చక్రం వద్ద ఒక ప్రత్యేకమైన దురద వంటి ఉద్రేకము కలుగుతూ ఉంటుంది. అందువల్ల సాధకుడు కుండలినీ పీఠం "మూలాధారం" వద్ద ఉన్నదని భావించవచ్చును. యోగి తన శరీరంలోని ప్రతి కోశిక యందును, ఒక విచిత్రమైన విద్యుత్ స్పందనను అనుభవిస్తాడు. జాగరూకుడైన యోగి తన శరీరంలో జరిగే సూక్ష్మమైన అంతర్గత మార్పులన్నీ ఈ రకమైన అనుభవాలుగా పరిశీలనలోకి వస్తాయి.
      కుండలినీ శక్తి జాగృతి సమయంలో కోశికలు అన్నిటియందు ప్రవహించే విద్యుత్ ప్రవాహం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి 1. పిప్పిలకము 2. దర్దూరము 3.  సర్పము 4. విహంగము.

1. పిప్పిలకము :
 సంస్కృతంలో పిప్పిలక మనగా చీమ.  కుండలిని జాగృతి తొలి అవస్థలో కొన్నిసార్లు సాధకుడు తన శరీరంలో వందలాది, వేలాది చీమలు పైకెగ బ్రాకుతున్నట్లు  అనుభూతి చెందడం జరుగుతుంది.  తన శరీరములో పైకి ఎగబ్రాకే చీమల దాడికి గురయ్యానా... అని వ్యాకుల పడడం జరుగుతుంది. కొంతమంది సాధకులు అయితే లేనటువంటి ఆ చీమలను శరీరము నుండి దులిపి వేయడానికి ప్రయత్నిస్తారు.  కానీ వెంటనే అతడు నాడీమండలంలో కలిగే ప్రేరణగా గ్రహిస్తాడు. అయితే వాస్తవంగా లేనటువంటి చీమలు అవి పైకి ప్రాకి ఉన్నట్లుగా కలిగే అనుభూతి ఎందుకు కలగాలి ? అనే ప్రశ్న మన మనస్సులో ఉదయించును.
      శాస్త్రీయముగా దీనికి కారణం సుస్పష్టం. శరీరమునందలి కోసి కలలో సూక్ష్మమైన విద్యుత్ తరంగాలు ఏకీకృతమై ఒక్కసారి సంచలనాలు సృష్టిస్తాయి. ఈ సంచలనాలే  క్రింద నుంచి  పైకి,  అసంఖ్యాకమైన చీమలు ప్రాకుతున్నట్లుగా అనుభూతి కలిగిస్తాయి. చాలామంది యోగ సాధకులకు.... కుండలినీ శక్తి జాగృతి దశలో ఈ రకమైన అనుభూతి మొదటి అవస్థ. ఇటువంటి ప్రేరణ పూరితమైన అనుభవాన్ని శాంతింప చేయాలంటే సాధన కొనసాగించడం ద్వారా ఈ అవస్థను దాటి ముందుకు పోవచ్చు.

     కుండలిని జాగృతం సమయంలో శరీర క్రింది భాగంలో ప్రాకే అనుభూతి మన శరీరమందలి మూలాధారము, ప్రభావితమైందని చెప్పుకోవచ్చును. అంతేకాక మూలాధారము మన మోకాళ్ళకు క్రింద నున్న  శరీర భాగం పై పూర్తి ఆధీనము కలిగి ఉన్నది. ఆసక్తి గల వ్యక్తులు  "కుండలినీ విజ్ఞాన శాస్త్రము" నందు ఈ విషయమును పరిశోధించాలి. శరీరంలోని ఏదైనా భాగంలో రక్త ప్రవాహం తక్కువగా గానీ, ఆగి... ఆగి... ప్రవహిస్తున్నప్పుడు గాని ఈ రకమైన అనుభూతి కలుగును. అందుచే సాధకునికి కలిగే చీమలు ప్రాకే అనుభూతి రక్తప్రవాహం లోపం వలన కలుగుతుందా ? లేక ఆ భాగంలో గల నాడీ మండలపు నియంత్రణ లే
సడలినందువల్ల కలిగినదా..... అనే ఈ విషయము పరిశోధనాంశం. కుండలిని జాగృతం అయినప్పుడు కలిగే ఈ అనుభూతి నాడీ సంబంధమైనదేనని  చాలా మంది యోగుల అభిప్రాయము. ఎందుచేతననగా ప్రారంభ దశలో సాధకుని
 రక్త ప్రసరణ
 సామాన్యంగా గాని... అంతకన్నా  హెచ్చుగా గానీ ... ఉండును. కుండలిని జాగృత సమయంలో మొదటి యోగ చక్రం ప్రేరేపించబడినప్పుడు సాధకుని ముఖం మరింత తేజస్సుగానూ మరింత రక్తప్రసరణతో కూడినది గానూ ఉండును. మామూలు కంటే హెచ్చు స్థాయిలో రక్తప్రసరణ జరుగుతున్నదని మనకు తద్వారా తెలియచున్నది. అందుచేత కుండలిని జాగృత తొలి దశ అయిన పిప్పిలకావస్థలో  కలిగే ప్రేరణ నాడీమండల సంబంధమైనదని రక్త ప్రసరణ లోపం వల్ల కలిగినది కాదని మనకు అర్థం అగును. ప్రతి కోసికలోనూ, ముఖ్యముగా శరీరపు క్రింది భాగములో ఉద్భవించే విద్యుత్ సంచలనాలే, చీమలు పైకెగబ్రాకుతున్న అనుభూతికి కారణము. అయితే దీనికి నిరంతర సాధన అవసరము.(సశేషం)
 

1 కామెంట్‌: