4, ఏప్రిల్ 2020, శనివారం




ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి-

1. మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం.

2. అసూయ, అనుమానం లేకుండా  ఉండడం.

3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.

🕉🌞🌎🌙🌟🚩
 భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩

గ్రీసు దేశములో ఒక గురువు శిష్యుడుని  ప్రపంచములో అతి భయంకరమైనది ఏది అని తెలుసుకొని రమ్మంటాడు. శిష్యుడు కొన్ని రోజులు ప్రపంచమంతా చూసి అతి భయంకరమైనది మానవుని *నాలుకఅని చెపుతాడు. అతి భయంకరమైనది తెలుసుకున్నావు. అలాగే అతి పవిత్రమైన విషయము గూడా నీ విద్యాభ్యాసము పూర్తి అయ్యే లోపల తెలుసుకొని చెప్పు అంటాడు.*


శిష్యుడు ప్రపంచమంతా వెళ్లి అతి పవిత్రమైన విషయము గూడా *నాలుకయేఅని చెప్తాడు. గురువు చాలా సంతోషిస్తాడు.*


మహాత్ముల జీవిత చరిత్రలు చూసుకుంటే మాటల పొందిక చాలా ఎక్కువగా ఉంటుంది. అపశబ్దము రాదు. మన నాలుకను ఎలా వాడుతున్నాము అనే దానిని బట్టి మనలో *కలి ఉంటాడు.*

🕉🌞🌎🌙🌟🚩


🕉🌞🌎🌙🌟🚩

ప్రశ్న : శ్రద్ధ - విశ్వాసం అంటే ఏమిటి !?"

భగవాన్ శ్రీరమణమహర్షి : ఒక ఆచార్యునివద్ద కొంతమంది శిష్యులుండేవారు. ఆయన ప్రబోధములు చేసేప్పుడు వారు పుస్తకాలలో వ్రాసుకునేవారు. మరునాడు తాము వ్రాసిన దానిని వారికి చూపి సరిచేయించుకొనేవారు. వారిలో ఒకడు బద్ధకించి తాను స్వయంగా వ్రాయలేక తోటివాడికి కొంత డబ్బిచ్చి తనవంతు కూడా వాడిచేత వ్రాయించుకునేవాడు. కొంత కాలానికి గురువు ఈ విషయం పసిగట్టారు. రెండు పుస్తకాలను ఒకరే వ్రాసినట్లు చేతివ్రాతను బట్టి తేలింది. గురువు వివరణ కోరగా వారు గతిలేక జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. మీరు నిజాన్ని చెప్పటం ప్రశంసించతగ్గదే కానీ ఆత్మసాక్ష్యాత్కారానికి శ్రద్ధచాలా అవసరం. 'శ్రద్దవాన్ లభతే జ్ఞానం' అని గీతావాచకం. ఈ విషయాన్ని చెప్పి సోమరిపోతులు ఆత్మవిద్యకు తగరంటూ ఆశ్రమం నుండి పంపివేశారు. ఆధ్యాత్మిక సాధనలో శ్రద్ధకు, విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది !

భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణో ౹
"యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరమ్ ౹౹"

శ్రద్ధావిశ్వాస రూపములుగావున్న భావానిభవులకు నమస్సులు.. అవి లేకుండా తమ స్వాంతంలోనే నెలకొన్న ఆత్మేశ్వరుని సిద్ధులు కూడా దర్శింపలేరు. విశ్వాసం అంటే ప్రగాఢ నమ్మకం. శ్రద్ధాయనగా ప్రేమ, ఆర్తి కలబోసిన నిశ్చయం, అని సెలవిచ్చారు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"గ్రహింపు సమయంలోనూ మనసు శుద్ధంగానే ఉంది..!" [అధ్యాయం -104]

🕉🌞🌎🌙🌟🚩
[14:35, 29/03/2021] +91 92915 82862: "ఋభుగీత " (311)
🕉🌞🌎🌙🌟🚩

"బ్రహ్మము"
21వ అధ్యాయము 

అద్వైతాత్మకమైన ఆత్మ ఈ సృష్టికార్యం కోసం ద్వైతంగా వ్యక్తమౌతుంది !

తానే ఆత్మనని తెలుసుకున్న వ్యక్తి ద్వైతాద్వైత విచారం చేయడు. ఎందుకంటే అద్వైతాత్మకమైన ఆత్మ ఈ సృష్టికార్యం కోసం ద్వైతంగా వ్యక్తమౌతుంది. ఎంత ద్వైతంగా ఉన్నా అది ఏకత నుండి భిన్నం కాకుండా అద్వైతస్థితిలోనే ఉంటుంది. అందుకే మహానుభావులు జీవనంలోని ద్వైతాన్ని గౌరవిస్తారు. అంతరంగంలో అద్వైతభావంతో ఉంటారు. ఆ భావం సంపూర్ణంగా అనుభవంలోకి వచ్చే వరకూ అంతా ఒక్కటే అన్నది మూలానికి, అంతరంగానికి చెందిన విషయం అన్న స్థిర నిశ్చయంతో సాధన సాగాలి. అద్వైతాన్ని బాహ్యానికి, ద్వైతాన్ని అంతరంగానికి ఆపాదిస్తే... ఎప్పటికీ సత్యం తెలియదు !

🕉🌞🌎🌙🌟🚩
[14:35, 29/03/2021] +91 92915 82862: 🧘‍♂️నేను – నాది అనే భావన నుంచి బయటపడాలి🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు. నేను మొదలవుతుంటే నాది అనేది దాని వెనక తోకల్లాగవస్తుంది. 


స్వార్థానికి 'నేను-నాది’ రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని” ఆ రెక్కలు వదులుకో అని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే.


‘నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో ! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు. అప్పుడు లోకం కూడా ఉండదు.


ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది.


అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా ? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మిక వాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు.


ప్రార్ధనచేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే 'నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది.


ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది. అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం.


దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.


చాలా మందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా ? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకు తింటూ ఉంటాయి.


అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచంబాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది. 


నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను. ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు.


సమబుద్ది కలవాడి కంటే మించినవాడు ఈ లోకంలో లేడు. ఈ సమత్వమే యోగం !

🕉️🌞🌍🌙🌟🚩
[14:36, 29/03/2021] +91 92915 82862: 206) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

జ్ఞానినాం విపరీతోఽ స్మాన్నిశ్చయః సమ్యగీక్ష్యతే ౹ స్వస్వనిశ్చయతో బద్ధో ముక్తోఽ హం చేతి మన్యతే ౹౹241౹౹

241. జ్ఞానుల నిశ్చయము దీనికి విపరీతమని స్పష్టముగ చూడగలము.వారి వారి నిశ్చయములను బట్టి ముక్తులును బద్ధులును అగుదురు.


వ్యాఖ్య:-  తత్త్వమనేది అద్వితీయమని తలచేవారు కూడా సంసారంలో పడుతున్నారు గదా !
ఇక,ఆ తత్త్వజ్ఞానంవల్ల ప్రయోజనం ఏమిటి ?   అంటే ---


ఈ ప్రపంచమనేది మాయారూపమని, తత్త్వమనేది అద్వితీయమైనదని చెప్పేవారు కూడా భ్రాంతికిలోనై ఉన్నారు,
కాబట్టి తత్త్వజ్ఞానంవల్ల ఏమీ ప్రయోజనం లేదని అనకూడదు.
ఎందుచేతనంటే,


ఇటువంటి వారికుండే భ్రాంతి,అజ్ఞానావస్థలో ఉండే భ్రాంతిలాంటిది కాదు.ప్రారబ్ధకర్మ వశంవల్ల ఎంతటి జ్ఞానులైనవారైనా సంసారిక వ్యవహారానికి వశమైనట్లు కన్పించిననూ-


 జ్ఞానులకు అదిసత్యమైనదని
కానీ ఇచ్చాదులు, ఆసక్తి కానీ లేక, అజ్ఞానావస్థలో ఉన్నటువంటి భ్రాంతిలాగా అంతటి తీవ్రత , ప్రభావము కానీ ఉండదు.


ఇక పూర్తిగా అజ్ఞానులభ్రాంతి విషయానికి వస్తే ,
 "స్త్రీ పుత్రాదులతో గూడిన ఈ సంసారము,స్వర్గాది సుఖానుభవంతో కూడిన ఆముష్మిక సంసారము అన్నీ యదార్థాలే !
అద్వైత మనేది కనిపించనూ కనిపించదు - లేనూలేదు", ---
అనేది అజ్ఞానులయొక్క నిశ్చయం.అది వారి నమ్మకం !


ఇక తత్త్వజ్ఞానులైన వారి విషయానికి వస్తే ,
అజ్ఞానుల నమ్మకంటే , జ్ఞానులైనవారి నిశ్చయం విలక్షణంగా ఉంటుంది.వారి వారి అనుభవాన్ని బట్టి జ్ఞానులైనవారు కొందరు,
"నేను సంసారబద్ధుడను" అనుకొంటారు.


మరికొందరు,
"నేను ముక్తుణ్ణి" అనుకొంటారు.
జ్ఞానులైన వారికి నిత్యము అద్వైతతత్త్వ స్ఫురణ ఉంటుంది.కాబట్టి ,
వారికి మోక్షమనే ఫలం ఉంటుంది. 


అజ్ఞానులకు పారమార్థికం కానట్టి ఈ సంసారమే ఫలంగా లభిస్తుంది. అంటే - 
ఎవరికైనా సరే , వారి వారి నిశ్చయానికి , విశ్వాసానికి తగిన ఫలమే లభిస్తుంది.
వారివారి నిశ్చయములను బట్టి ముక్తులును బద్ధులును అగుదురు.

🕉🌞🌏🌙🌟🚩

[14:36, 29/03/2021] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
వాడల వాడల 
రాగం:శ్రీరాగం 
అన్నమయ్య సంకీర్తనకు తన తియ్యని గాత్రాన్ని అందించిన జేసుదాసు గారు.


అన్నమయ్య కీర్తనలలో "వాడల వాడల వెంట వాడవో నీడనుండి చీరలమ్మే నేత బేహారి" అనే కీర్తన చాలా బాగుంటుంది.


🕉🌞🌎🌙🌟🚩

వాడల వాడల వెంట వాడెవో
నీడ నుండి చీర లమ్మే నేత బేహారి!!


పంచ భూతములనెడి పలు వన్నె నూలు
చంచలపు గంజి తోడ సరినేసి
కొంచపు కండెల నూలి గుణముల నేసి
మంచి మంచి చీరలమ్మే మారు బేహారి!!


మటుమాయముల దనమగువ పసిడినీరు
చిటిపోటి యలుకల చిలికించగా
కుటిలంపు చేతలు కుచ్చులుగా గట్టి
పటవాళి చీరలమ్మే బలు బేహారి!!


మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోన
వెచ్చపు కర్మ ధనము విలువ చేసి
పచ్చడాలుగా కుట్టి బలువేంకటపతి
ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి!!        

🕉🌞🌎🌙🌟🚩

ఇందులో అన్నమయ్య పరమాత్ముని ఒక చీరలు నేసే నేతవానిగా, ఇంకా వాటిని అమ్మే వ్యాపారిగా కీర్తిస్తారు.


పంచభూతములనే నూలుతో, మన దేహలనే చీరలు తయారవుతాయి. ఈ నూలు దారాలు స్థిరంగా నిలబడటానికి, మాయ అనే గంజి కలిపి, ఈ చీరలను నేస్తారు. ఇంకా ఆ చీరల మీద ఉండే పలు రకాల రంగు రంగుల డిజైన్ల కోసం, స్వామి గుణములనే నూలును వాడుతారట.


అయితే సంతలో ఈ చీరలను కొనుక్కునే జీవులకి, ఒకేసారి అనేక చీరలు కొనుక్కుని బీరువాలో దాచుకొనే సౌలభ్యం లేదు. తన దగ్గరున్న చీరను (దేహాన్ని) స్వామికి ఇచ్చేసి, ఇంకా తన కర్మ అనే ధనాన్ని వెచ్చించి, దానికి అనుగుణమైన కొత్త చీరను (దేహాన్ని) స్వామి నుండి కొనుక్కోవాలి. అందుకే స్వామిని అన్నమయ్య, మారు బేహారి అంటారు.


అయితే మరి స్వామి వ్యాపారం ఎప్పుడు బాగా గిట్టుబాటు అయినట్టు? ఆ ఊరిలోని జీవులందరికీ, ఇక చీరలు కొనే అవసరం ఎప్పుడు కలుగకుండా పోతుందో, (అంటే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పోతుందో) అప్పుడు. అందుకే అన్నమయ్య స్వామిని, నీడపట్టున (వైకుంఠంలో) కూర్చోకుండా, వాడల వాడల వెంట తిరుగుతూ, (గురువుల, మహాత్ముల రూపంలో, మాటిమాటికీ అవతరిస్తూ), వ్యాపారం చేసుకోమని, (జీవులందరినీ ఇక శరీరం ధరించే అవసరం లేని మోక్ష స్థితికి చేర్చుకోమని) సూచిస్తున్నారు.

🕉🌞🌎🌙🌟🚩


నిజమైన నాగరికత ఇంద్రియ సుఖానుభూతులనుండి, పశుత్వం నుండి మనిషిని ఉద్ధరించేదిగా ఉండాలి.

🕉🌞🌎🌙🌟🚩
[16:43, 27/03/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩

యోగాభ్యాసము చేసేటటువంటి వారికి  శ్వాసలు, మిగిలినవారికి జరిగే శ్వాసల కన్నా తక్కువగా జరుగుతాయి. ఎన్ని శ్వాసలు తక్కువగా జరుగుతుంటే అంత ఆయుర్దాయము ఉంటుంది. శ్వాసలనే 'హంసలు' అని అంటారు. మనకి మోహము, శోకము, ఆవేశము, కోపము వచ్చినప్పుడు శ్వాసలు ఎక్కువ ఖర్చు అవుతాయి. హంసలు ఖర్చయిపోతే ఆయుర్దాయము తగ్గిపోతుంది.


సద్గురువు మనసును శ్వాస మీద ఉంచే విషయము మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఆయుర్దాయము పెరగాలనేటటువంటి ఆశీర్వచనమే కాకుండా, ఆయుర్దాయము పెరగడానికి ఒక విధానము కూడా ఇస్తాడు.


బుద్ధిమంతులు అయిన వారు ఈ విధానమును అనుసరిస్తే మనసుకు, శ్వాసకు వేగము తగ్గి, ప్రశాంతత ఏర్పడుతుంది. స్పందనము తెలుస్తుంది. బయట విషయములు అంతగా అంటవు.
 
🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన

ఆధ్యాత్మిక జీవనంలో అనుకరణ అనేది సాధ్యపడదు. మన ఉద్దేశ్యంలోని నిజాయితీ భగవంతుని సాక…
[16:43, 27/03/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(842)
🕉🌞🌎🌙🌟🚩

గ్రహింపు, అనుభవం, స్మృతి వీటిని నియంత్రించటం ఎలా !?"

కేవలం గ్రహింపుగా ఉన్నది శుద్ధమనసు. 'నేను - నా అనుభవం', గ్రహించేది - గ్రహించబడేదిగా విడివడిన మనసే మనను బాధిస్తుంది. మనసు సూక్ష్మస్థాయిలో జరిగే పరిణామాలను మనం ఆపలేము. అంటే శుద్ధమనసు గ్రహింపుగా మారటం, ఆ గ్రహింపు అనుభవంగా నమోదు కావటం, అలా నమోదైన అనుభవాలు స్మృతిగా మారటం, అవి అనుకూల, ప్రతికూలతలుగా విభజన చెంది ఇష్టాఇష్టాలతో కోరికగా పరిణమించడం.. వంటి ప్రక్రియలను యోగిలా మనం నిరోధించలేము, నియంత్రించలేము. శుద్ధమనసు గ్రహింపుగా మారినందువల్ల, అది విషయాలను గ్రహిస్తున్నందువల్ల మనకు నష్టంలేదు. కానీ మనలో కలిగిన కోరికవల్ల అనుభవాలను తిరిగి బేరీజువేసుకునే గుణం మొదలై అశాంతికి కారణమవుతుంది. అంతరంగంలో ఏర్పడుతున్న ఆశ అనే గుణం పోతేగాని ఈ సమస్యకు పరిష్కారం లేదు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"గ్రహింపు సమయంలోనూ మనసు శుద్ధంగానే ఉంది..!" [అధ్యాయం -104]

ఋభుగీత "(309)
🕉🌞🌎🌙🌟🚩

"బ్రహ్మము"
21వ అధ్యాయము 

భావహీనత, బుద్ధిహీనత, దోషహీనతలన్నీ మనసువేకానీ ఆత్మవుకావు !

మనమే దైవమన్నది సత్యం. మనకి తెలియకపోయినా అది పరమ సత్యమే. చైతన్య స్వరూపమైన మనం నిజానికి మనోతీతులమే. అంటే నిరంతరం మనసుకు అతీతంగానే ఉంటాం. మనం మనసుగా వ్యక్తమయ్యేవారమే గానీ మనసు చేతిలో బందీలము కాము అని అర్ధం. పరబ్రహ్మము అంటే నేను బ్రహ్మను అన్న భావనకూడా లేని కేవల స్థితిగా ఉండటం. మనలోనూ, ఈ సకల చరాచర సృష్టిలోనూ వ్యక్తమయ్యే చైతన్యం ఆ బ్రహ్మపదార్థమే. భావహీనత, బుద్ధిహీనత, దోషహీనతలన్నీ మనసువేకానీ ఆత్మవుకావు. అందుకే చైతన్య స్వరూపమైన "నేను” ఎప్పుడూ వీటికి అతీతంగానే ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩
[16:43, 27/03/2021] +91 92915 82862: 🧘‍♂️వైరాగ్యము - సన్యాసము🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

వైరాగ్యము అంటే మమతానురాగముల నుండి భయముతో పారిపోవడము, సోమరిగా, నిర్వీర్యముగా, అర్థరహితముగా జీవించుట కాదు. జీవిత సమస్యల నుండి దూరముగా పారిపోవుట కాదు. నీవు ఎక్కడికి పారిపోయినను నీ సంసారము నీతో పాటే వస్తుంది (సంసారము మానసికము కనుక).


 వైరాగ్యము అంటే నిష్క్రియా పరమైనది కాదు. వైరాగ్యము అనగానే గుర్తుకు వచ్చేది సన్యాసము. సన్యాసము అనునది సంసార బాధలను భరించలేక వాటినుండి విముక్తి కొరకు స్వీకరించునది కాదు. కర్మ ఫలత్యాగము సన్యాసము. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయగలుగుట సన్యాసము.


 జీవిస్తూ జీవించని వాడిగా ఉండుట సన్యాసము. కర్మను చేయుట యందు కుశలత్వము కలిగియుండుట సన్యాసము. తామరాకుపై నీటిబొట్టులాగా సంసారము యందు మెలగ గలుగుట "సన్యాసము".

🕉️🌞🌍🌙🌟🚩
[16:43, 27/03/2021] +91 92915 82862: 204) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

యదద్వైతం శ్రుతం సృష్టేః ప్రాక్తదేవాద్య చోపరి ౹ ముక్తావపి వృథామాయా భ్రామయ త్యఖిలాన్ జనాన్  ౹౹238౹౹

238. శ్రుతి ప్రోక్తమైన అద్వైతము సృష్టికి పూర్వము ఉండెను, ఇప్పుడును కలదు, 
ఇకమీద ఉండును.
అనగా అది త్రికాలాబాధ్య సత్యమని భావము.


వ్యాఖ్య:-

తత్త్వజ్ఞానము లేని సకల జనులను మాయ వ్యర్థముగ భ్రమపెట్టుచుండును.


మాయ,జీవుడు,ఈశ్వరుడుకు ఉన్న భేదము--
జీవుడు,ఈశ్వరుడు అనే వారిద్దరూ,మాయ అనే కామధేనువు యొక్క రెండు దూడల లాంటివారు.ఆ యిద్దరూ ద్వైతమనే పాలను యిష్టం వచ్చినట్లు త్రాగితే త్రాగవచ్చు గాక !


కాని , పరమార్థం వాస్తవిక తత్త్వం మాత్రం అద్వైతమే !సిద్దాంతరూపంలో అద్వైతం మాత్రమే తెలుసుకోదగినది.


జీవుడు,ఈశ్వరుడు ఈ యిరువురు మాయికులు అయినందున వారి భేదం కూడా మిథ్యే అయితే కూటస్థుడు,బ్రహ్మ అనేవారు పారమార్థికమైతే వారి భేదం కూడా పారమార్థికమని అంగీకరించాలి గదా ! అనే సంశయం,కూటస్థునికి బ్రహ్మకు ఉన్న భేదం నామమాత్రమే !


ఘటాకాశం,మహాకాశం ఈ రెంటికి ఉన్న భేదం నామమాత్రమైనట్లు. అనంతమైన ఆకాశమైనా ఘటమునందలి ఆకాశమైనా పేరునకే కదా భేదము.


" సదేవ సోమ్యేదమగ్ర ఆసీ దేక మేవాద్వితీయం "
--చాందోగ్య 6-2-1   
అనే ఈ శ్రుతిలో సృష్టికి పూర్వం ఏ అద్వితీయ బ్రహ్మం ఉన్నట్లు ప్రతిపాదింపబడ్డదో, ఆబ్రహ్మమే ఆ అద్వితీయ తత్త్వమే సృష్టికి తరువాత ఈనాడు ప్రళయకాలం తరువాత కూడా(ముక్తిలో కూడా) ఉంటుంది.


ఈ విధముగా బ్రహ్మము త్రికాలా బాధ్యము అని తెలుస్తోంది.కాబట్టి సత్యం !


మనం అనుకొనే భేదమంతా మాయద్వారా ఈ జీవులన్నీ భ్రమకు లోనైనందు వలన కలిగిందే ! ఈ భ్రమకు కారణం తత్త్వజ్ఞానం లేకపోవడమే !


పూర్ణ బ్రహ్మ స్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరలా మునుపటివలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి.శ్రుతి స్మృతి మరియు వేదాంతం అన్నింటి సిద్ధాంతం ఇదే.

"జీవాత్మకు అచ్యుతపద ప్రాప్తి".

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి