4, ఏప్రిల్ 2020, శనివారం

ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
*మాండూక్యోపనిషత్.6*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*హరిॐఓంॐ*

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.


ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.


ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.

మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.

*ఆగమ ప్రకరణం*

*మాండూక్యోపనిషత్తు*

మొదటి మంత్రము : ఓమిత్యేతదక్షరమిదగ్౦ సర్వం, తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకారమేవ / య చ్చాన్యత్ త్రికాలాతీతం తదప్ఓంకార ఏవ //

రెండవ మంత్రము : సర్వగ్౦ హేతద్ బ్రహ్మ / అయమాత్మా బ్రహ్మ / సో> యమాత్మా
చతుష్పాత్ //

మూడవ మంత్రము : జాగరితస్థానో బహిష్ప్రజ్ఞ : / సప్తాఙ్గ : ఏకోనవింశతిముఖ : ,
స్థూలభుక్, వైశ్వానర : ప్రథమపాద : //

నాలుగవ మంత్రము : స్వప్నస్తానో౦త : ప్రజ్ఞ : సప్తాఙ్గ : ఏకోన వింశతి ముఖ :
ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయపాద : //

ఐదవ మంత్రము : యత్ర సుప్తోన కంచన కామం కామయతే, న కంచన స్వప్నం పశ్యతి ,
తత్సుషుప్తమ్ /
సుషుప్త స్థాన ఏకీ భూత : ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో
హ్యానన్డభుక్, చేతో ముఖ:ప్రాజ్ఞ స్తృతీయ: పాద : //

ఆరవ మంత్రం :   ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో>౦తర్యామ్యేష యోని :  /
                             సర్వస్య ప్రభవాప్య యౌ  హి భూతానాం //


మనం మూడవపాదము లోని ప్రాజ్ఞుని గురించి చెప్పుకుంటున్నాము కదా !  ఈ ప్రాజ్ఞుడు సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి.  సర్వమునకు ఉత్పత్తిస్థానము యిక్కడే.  అన్నిప్రాణుల జనన మరణాలకు ప్రాజ్ఞుడే స్థానభూతుడు అవుతున్నాడు.


ప్రాజ్ఞుడు ఎవరికి ఈశ్వరుడు ?   అధిదైవికమునకు, ఆధిభౌతికమునకు  అనగా సృష్టి, స్థితి లయములను నియంత్రణ చేసే ఈశ్వరుడు.   ప్రాజ్ఞునికి జాగ్రద్ స్వప్నములనే భేద అవస్థల జ్ఞానము వున్నది.  కానీ సాక్షి చైతన్యముగానే వుంటున్నాడు.   సుషుప్తి నుండి బైటకు వచ్చి చేయవలసిన పనులను యధాప్రకారం కొనసాగించగల నేర్పు ఈ ప్రాజ్ఞుడే యిస్తున్నాడు.   ప్రాజ్ఞుడు సర్వజ్ఞుడు.


ఇతడు అంతర్యామి అనగా,   ప్రాజ్ఞుడు సర్వప్రాణుల లో ప్రవేశించి వుండి నియంత్రిస్తూ వుంటాడు.    ప్రాజ్ఞునికీ ఈశ్వరునికీ  భేదము లేకపోవుట వలననే, ప్రజ్ఞాచైతన్యము, అంతటితో ఆగక,  జాగ్రత్స్వప్నములలో ప్రవేశించి, సర్వమును నియంత్రిస్తున్నది.  


ఈతడు జాగ్రత్  స్వప్న అవస్థలకు తల్లివంటి వాడని చెప్పుకున్నాము, వెనుకటి మంత్రంలో.   కాబట్టి యితడు యోని అని పిలువబడుట సహజమే !  జాగ్రత్ స్వప్నములకు ప్రాజ్ఞుడే యోని.   మట్టినుండి పుట్టి, తిరిగి మట్టిలో కాలాంతరమున కరిగినట్లు, ఈశ్వరుని నుండి ఉత్పత్తి బొంది, కాలాంతరమున ఈశ్వరునితో లీనమగుట భూతములకు గమ్యము కాబట్టి, జీవులన్నింటికీ, ఈశ్వరుడే ఉపాదాన కారణము.


జాగ్రద్ స్వప్నావస్థలు సుషుప్తినుండే పుట్టి, తిరిగి సుషుప్తిలోనే లీనమవుతున్నవి. అని ఆధ్యాత్మికంగా అన్వయించుకుంటే, సుషుప్తి అవస్థ ఈశ్వర తత్వమనే సమన్వయము  కలుగుతుంది.


ప్రధమ ప్రకరణములో  మొత్తము 29  కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా !  అందులో 9  కోరికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.



శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.

ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష :  హ్య౦త :  ప్రజ్ఞస్తు తైజస  :   /
ఘన ప్రజ్ఞస్తథా  ప్రాజ్ఞ :  ఏక ఏవ త్రిధాస్మృత  :   //


బాహ్యప్రపంచమును అనుభవించేవాడైన విశ్వుడు, సూక్ష్మములైన అంతర్విషయములు   గ్రహించు తైజసుడు, ఘనీభూతమైన ప్రజ్ఞ గలవాడైన  ప్రాజ్ఞుడు, ఈ మూడు అవస్థల, మూడు భేదములనే  జీవుడు స్మృతుడు అనే పేరుతో అనుభవిస్తున్నాడు.


జాగ్రద్ స్వప్న, గాఢనిద్రలు  క్రమముగా, మూడు స్థానములు ఆక్రమించడం వలన, ఈ మూడింటి యందు సంచరించే, నేనొక్కడినే, అనే జ్ఞానం, పురస్కరించుకుని,  ఈ స్దాన త్రయంలో, ఏకత్వము, శుద్ధత్వము, అసంగత్వము ఆత్మకు సిద్ధిస్తుందని ఈ కారిక అభిప్రాయము.


మహామత్యము, స్వతంత్రంగా నదీ జలాలలో విహరిస్తూ నది గుణ దోషముల సంగము లేకుండా  ఎలా వుంటుందో,  ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి ఆకాశంతో సంగము లేకుండా ఎలా వుంటుందో,  అలాగే ఆత్మ, ఈ మూడు అవస్థలయందు విహరిస్తూ వుంటుంది.   ఆయా ఉపాధుల గుణదోషములు దానికి అంటవు.


గౌడపాదాచార్యులు ,  ఆదిశంకరుల గురుదేవుల గురువు.

🕉🌞🌎🌙🌟🚩



▶నేనెవడను?

▶నేనెవడను?

▶ ఈ విశ్వం ఏమిటి?
ఈ ప్రపంచం ఏమిటి?వీటి తత్త్వాలు ఏమిటి?దీనిని పనిగట్టుకొని ఎవరైనా సృష్టించారా? లేక ఇది స్వయంభువు నా?

▶ అసలు ఈ ఇంద్రియ గోచర ప్రపంచం నిజంగా ఉందా? లేక ఇంద్రియాలు,మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా?

▶ మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? ఈ జీవితానికి అర్థం/పరమార్థం అంటూ ఉందా?

▶మనస్సు అంటే ఏమిటి? మనో వ్యాపారాలు అనుభవించగలుగుతున్నా, మనస్సు యొక్క నిర్వచనం ఏమిటి?

  ▶ నేనెవడను? ఎక్కడ నుండి ఈ పంచ భూతాత్మక ప్రపంచానికి వచ్చాను?

▶పునర్జన్మ ఉందా? మరణం తర్వాత నేనెవడను? మరణం ముందు నేనెవడను?

▶ ఇంతకీ ఈ "నేను" ఎవరు?
   మానవుడు స్వతంత్రుడా? అస్వతంత్రుడా? అతనికి నిర్ణయ స్వేచ్ఛ (free will) ఉందా? ఈ రోజు మనం అనుభవిస్తున్నదేనా మానవ జీవితం? ఇంత కంటే పరమార్థం ఏదైనా ఉందా?

  ▶ ఈ ప్రపంచంలో ఈ రోజు ఉన్న స్థితిలో నేనెందుకు ఉన్నాను? ఇంకోలా ఎందుకు లేను? నేనెవడను? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడికి వెళతాను?

▶ ప్రాణం అంటే ఏమిటి?

▶ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?

▶ ఏది తప్పు? ఏది ఒప్పు?లోకంలో ఎందుకింత క్రౌర్యం? లోకం లో కారుణ్యం మాత్రం ఎందుకు?

  ▶ మానవులలో ఒక వైపు క్రౌర్యం,హింస...మరొక వైపు, చీమను కూడా చంపడానికి చేతులు రానంత దయాళుత్వం...అన్ని భూతాలను తనలోనూ, తనను అన్ని భూతాలలోనూ చూసుకోగలిగినంత అధ్యాత్మిక ఔన్నత్యం...ఆశ్చర్య కరమైన ఈ ద్వంద్వ ప్రవృత్తులు ఎలా వచ్చాయి? అసలు మానవ జీవిత పరమార్థం/
పరమావధి ఏమిటి?

▶కర్మ ఫలాన్ని కర్మలే ఇస్తాయా? బ్రహ్మమా?

▶కర్మ ఫలాన్ని ఈ జన్మ లోనే అనుభవించాలా?

▶జీవులు వ్యాపకులా? అణు స్వరూపులా?

▶జీవులకు సూక్ష్మ శరీరాలు, ముక్తిలో కూడా ఉంటాయా?

▶అసలు ముక్తి అంటే ఏమిటి?

▶ముక్తులు మరల జన్మ తీసుకుంటారా? లేదా?

▶ఈ విశ్వానికి స్థితి ఉన్నదా? అది మిథ్యనా?

▶జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మమా?ప్రకృతియా?

▶బ్రహ్మము వ్యాపకమా?పరిచ్ఛిన్నమా?దాని కన్నా పరమమైనది ఉన్నదా?

▶ఏ వెల్గులకీ ప్రస్థానం?

➡️ తత్త్వ విచారం...ఈ విధంగానే సాగాలి.

ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.7
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.


ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.


ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.


మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.


ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.


శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.

ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //

రెండవ కారిక :   దక్షిణాక్షి ముఖే విశ్వ  :  మనస్యాన్తశ్చ తైజస :  /
                        ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత :  //

విశ్వుడు కుడికంటి  ద్వారమున,  తైజసుడు మనస్సులోనూ,  ప్రాజ్ఞుడు  హృదయ ఆకాశములో వ్యవహరిస్తున్నారు.  ఈ విధంగా ఆత్మ ఒక్కటే అయివుండి,  అందులో మూడు విధములుగా ఈ మూడు అవస్థలు స్థానీయములై వున్నవి.


విశ్వుడు, కుడికన్ను ద్వారమై వుండగా, (  అనగా పందొమ్మిది ద్వారములలో కుడికంటికి    ప్రాధాన్యత నిచ్చి,)   స్థూల విషయములను చూసేవాడిగా విశ్వుడనే నామంతో కార్యక్రమములు నిర్వర్తిస్తూ వుంటాడు, అని చెప్పబడింది.   ఇతడిని ఇంధుడు అని కూడా అంటారు. ఇంధుడు అనగా, కాంతిగుణము కలిగిన వైశ్వానరుడు.  సూర్యమండల అంతర్గతుడు.  విరాట్ సూర్యఅంతర్గతుడు కాబట్టి, విరాట్ విశ్వులు  ఒక్కరే ! 


ఇక్కడ కేవలము కుడికంటికే విశ్వుడు ద్రష్టయై వుంటే, సమష్టి శరీరమైన సూక్హ్మ   తత్వంలో, క్షేత్రజ్ఞుడు,  వ్యష్టి దేహములోని జీవుడు మరియొకడై వుండవలెను కదా అనే సందేహం రావచ్చు.    దానికి సమాధానము, జీవునికీ పరమాత్మకూ అభేదమని ఇప్పటికే ప్రతిపాదించి ఉన్నందున,  వ్యష్టి సమష్టి దేహములకు వ్యత్యాసము లేదని తెలియు చున్నది.   ఎందుకంటే, సూర్యుని ప్రకాశం , జీవుని దృష్టీ ఒక్కటే. 


అన్ని ఇంద్రియములలో, ఒకే విశేషమున్నా, కుడికంటితో మనం దృశ్యములను చూడడడం అసంకల్పితం.  అందువలన కుడికంటికి ప్రాధాన్యం.  కుడికంటికి ఎడమ కంటికంటే దర్శనశక్తి ఎక్కువ.  మిగిలిన జ్ఞానేంద్రియాలు, విషయములు వాటివద్దకు వచ్చినప్పుడే వాటితో అనుసంధానం అవుతునాయి. అయితే, నేత్రము,  ప్రయత్న బలంతో దూరప్రదేశాలను చూసి, గ్రహించి, తిరిగి స్వస్థానమునకు వచ్చి, మనస్సుకు తెలియజేస్తుంది.   అందువలననే,  కారికలోనేత్రమునకు, అందునా కుడినేత్రమునకు విశ్వుని స్థానము కల్పించబడింది.


సూర్య దీపకాంతులలో విశ్వుడు ఒక రూపాన్ని చూసి, కళ్ళుమూసుకుని, ఆ రూపాన్నే స్మరిస్తూ, మనస్సులో స్థిరపరుచుకుంటాడు.  అదే వాసనారూపంలో, స్వప్నంలో, మనస్సు యొక్క తేజస్సు వలన ప్రకాశమై అభివ్యక్తం అవుతుంది.   అందువలననే, తైజసుడు, విశ్వుని రూపమే.  జాగ్రత్తులో కళ్ళుమూసుకుని ఆలోచించే వానిస్థితి, స్వప్నములో దృశ్యములను చూసే స్థితి అందుకనే ఒకటిగా వుంటుంది.    కాబట్టి తైజసుని మనస్యంతుడని  వర్ణించడం అయింది.


హృదయమనే ఆకాశంలో, ఆలోచనలను, సంకల్పములను నేను నాది అనే అభిమానాన్ని, మూటగట్టుకుని,  కదలక, మెదలక వుంటే, విశ్వుడే ప్రాజ్ఞుడై, ఏకీభూతుడై, ఘనీభవించిన మనోవ్యాపారుడు అవుతున్నాడు.  అది ఎలాగంటే,  సుషుప్తిలో మనోవ్యాపారములు ఏమీ లేనందున, మాత్రమే.  


అనగా, మనోవ్యాపారములవలన విశ్వుడనీ,  అట్టి విశ్వుడి అంతర వాసనలందు మనోవ్యాపారముల వలన తైజసుడనీ,  మనోవ్యాపార సూన్యత వలన ప్రాజ్ఞుడనీ తెలియబడుతున్నాడు.


దర్శనము, స్మరణము ఈ రెండూ మనస్సు యొక్క స్పందనలు.  ఈ రెండూ  లేనిచో,  హృదయములో, విశేషణా రహితముగా విశ్వునకు, నివాసము కలుగుతున్నది.  నిశ్చలంగా, నిర్వికారంగా వుంటున్నాడు, జాగ్రదవస్థలోనే.   ఈవిధంగా,  విశ్వునికీ విరాట్ కీ, ప్రాజ్ఞునికీ, ఈశ్వరునికి సంబంధము నెలకొల్పబడింది. 


ఇక తైజస హిరణ్యగర్భుల విషయంలో, అభేదం ఎలాంటిది అంటే,  మనోమయ పురుషుడే హిరణ్యగర్భుడు.   తైజసుడు మనోవాసనలందే,  కేవలం స్వప్నంలోనే వ్యష్టి తత్వంలో ఉంటున్నాడు.  వ్యష్టి సమష్టి తత్త్వం  సమన్వయ సిద్ధి వలన వీరిద్దరికీ అభేదము.


ఇక  దర్శన స్పర్శ రహితమైన విశ్వుడు ప్రాణాత్మతో,  చేరినప్పుడు,  ప్రాణుడు అవ్యాకృతుడు అయివుంటాడని చెప్పివున్నారు.   అయితే,  ' దేహములో, గాఢనిద్ర యందు ఉచ్వాస  నిశ్వాసలు చేయుట, గురకలు పెట్టుట  ప్రక్కన వున్నవారికి తెలుస్తూ వుంటుంది కదా,   అప్పుడు అవ్యాకృతుడు ఎలా అవుతున్నాడు ? '  అనే సందేహానికి,  భాష్యం లో సమాధానం చెబుతున్నారు, ఆదిశంకరులు.

🕉🌞🌙🌎🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి