8, జూన్ 2015, సోమవారం

Self Confidence -28 (Political Leader - Average Man )

ఓం శ్రీ రామ్                           ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -28 కర్మన్యే  వాధికారస్తే మా ఫలేషు కదాచన 
మా కర్మఫల హేతు ర్భూ తే సంగో స్త్య కర్మణి (గీత 2-47)

కర్మలు చేయడానికి ప్రతిఒక్కరికి అధికారమున్నది. కానీ కర్మఫలాల విషయంలో మాత్రం అధికారం లేదు.  కర్మ ఫలాలకు నువ్వు కారణం కాదు, అలాగని కర్మలు చేయటం మానకూడదు. 

మనం చేసిన కర్మల వళ్ళ కలిగే పలితాన్ని కర్మ ఫలం అంటారు
ఆ కర్మ ఫలం అనుభ వించడాన్ని ప్రారబ్దం అంటారు 
వదిలిన మాట భాణం లా పనిచేస్తుంది ఒక్క సారి విల్లునుండి  వదిలిన బాణాన్ని తరిగి వెనుకకు తీసుకోలేనట్లే, 
గురువులు, నాయకులు, ప్రజలు వారి మాటలు ప్రవర్తన మంచిగా ఉండాలి, ఎవ్వరికి హాని కలుగ కుండా ఉండాలి, మానసిక వత్తిడికి లోను కాకుండాఉండాలి. మాటలు వెనుకకు తీసుకొనె భాణంలా ఉండకూడదు 

మనం చేసే కర్మలను బట్టి అనుసరించే ఫలితాలు కలుగుతాయి సత్కర్మలు చేస్తే సత్పలితాల్నీ, దుష్కర్మలను చేస్తే దుష్ప లితాల్నీ పొందుతాం,.  కాబట్టి మనం చేసే ప్రతీ కర్మనూ అత్యంత జాగరూకతో మాట్లాడుతూ నిర్వతించాలి

ఆందోళన చెంద కుండా కర్మలు నిర్వరించే వారు ఉత్తములు,  కర్మ ఫలితాలను ఆశించి కర్మలను చేసేవారు  మద్యమములు, కర్మఫలితం మన ఆధీనంలో లేదని కర్మలు చేయనివారు అధములు. 
 రాజకీయ నాయకులు, సగటు మనుష్యులు వారి కర్మ ఫలాలు ఆ పరమాత్ముని ఆధీనములోనే ఉంటాయి
మన మనస్సులో సుస్తిరపరచుకోగలిగితే మనం ఆశించిన ఫలితాలు రాలేదని దు:ఖం గానీ, ఇతరులకు మంచి ఫలితాలు వచ్చాయన్న అసూయ గానీ మనలొపొడ సూపవు. అప్పుడు కర్మ ఫలితం ఆ పరమాత్ముని ప్రసాదంగా భావిస్తూ, ప్రశాంతంగా కర్మలు నిర్వహించాలి (అందుకే రాజకీయనాయకులు మరియు సగటు మనుషుల గురించి భావ కవితను ఇందు పొందు పరిచాను   .   .
రాజీలేని రాజకీయ నాయకుడు

తరుముకొచ్చే సమస్యలతో 
తారతమ్యం తెలిపే మాటలతో 
తరతమ భేదం లేకుండా చూపులతో 
రాత్రిళ్ళు సైతం సేవ చేసే నిశాచరుడు

తగాదాలు పరిష్కరిస్తూ
తనయులు చేసే తప్పులు తప్పిస్తూ 
తడిపొడి మాటలతో తారుమారు చేస్తూ 
చాతుర్యముగల చతురుడితడు

తనవారికి పదవిలిస్తూ
కానివారికి అవసర కోర్కలు తీరుస్తూ
ఎదురు తిరిగిన వాణ్ని లొంగదీస్తు 
కనిపించని ఆలోచనా పరుడితడు

ప్రతి పనికి కమీషన్ కావాలంటూ 
దక్షణ లేనిదే ఫైల్ కదలదంటూ 
తను చెప్పే మాటలు వేదాలంటూ
దమ్ముంటే తప్పుపట్టండి అనే నీతి పరుడు

పుత్రుల పరీక్షకోసం పాపర్లు మారుస్తూ 
పుత్రుల ఉద్యోగ ఉత్తీర్నతకు సహకరిస్తూ
పదవితో పిల్లలకు పుస్తకాలు ఇస్తూ
పుత్రుల మాటలు విన్న అల్పసంతోషిడితడు

అమ్మాయిల పెళ్లిళ్లకు కానుకలిస్తూ 
సంభందం లేనివారికి ముద్దు లిస్తూ 
అడిగిఅడగని స్త్ర్తీల కోర్కలు తీరుస్తూ
స్త్రీల ద్రుష్టిలొ కారన జన్మడితడు

ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి
సర్వసుఖ స్వర్గాన్ని నిర్మిస్తామని వాగ్దానం  చేసి 
అడిగిన కోర్కను వెంటనే తీరుస్తానని వాగ్దానం చేసి      
 అవసరమైతే పై వారి కాళ్ళుపట్టే వసుదేవుడితడు

అలిగిన వారిని బుజ్జగిస్తూ
రాజీనామా అన్నవారి ఆశలు తీరుస్తూ
ఆశయాల కోటకు బీటలు వేస్తూ
అర్ధం కోరి కోరని అమాయకుడితడు

పాతపునాదుల్లో కొత్త పునాది వేస్తూ
పాతఫలకాలు తీసి కొత్త ఫలకాలు వ్రాయిస్తూ 
పాతవారిని మరలా దరికి రానిస్తూ 
అందరికి వారసత్వ వారధి యితడు

సునామి వచ్చి ప్రజలను భాద పెట్టిన 
కుటుంబాల్లో కలహాలోచ్చిన
కులాల్లో, మతాల్లో కలతలోచ్చిన 
సహకరించే సమర్ధ నాయకుడితాడు

కరవాలము చేతబట్టి 
సత్యం,న్యాయం,ధర్మం నిలబెట్టి 
దుష్ట శక్తులను అరికట్టి 
నిజమైన ఉపాధ్యాయుడితడు 

 

సగటు మనిషి 

ప్రతిభలేక బ్రతుకుల్లో ప్రగతి లేక
మనసు లేక మనుషుల్లో బ్రతకలేక 
యశస్సు లేక  జీవితంలో తమస్సు తరమ లేక
అయినా బ్రతుకు తున్న కాల ధర్మాన్ని ఎదిరించి 

అమాయక ఇల్లాలుని నమ్మించ లేక
ప్రజల్లోకి  చొచ్చుకొని పో లేక 
ఎ భాషను సరిగా అర్ధం చేసుకోలేక 
అయినా బ్రతుకుతున్న అర్ధాన్ని పొంది 

నిజాన్ని చెప్పలేక  నిప్పులా బ్రతకలేక 
న్యాయాన్ని అమ్మలేక  త్రాసులా ఉండలేక 
ధర్మాన్ని బ్రతికించలేక ధరిత్రిలా ఉండలేక 
అయినా బ్రతుకుతున్నా నిత్య పుష్పంలా ఉండి 

నిచ్చానలా  ఉండి  పై కేక్కించ లేక
పవలిమ్పుగా ఉండి సుఖ నిద్ర ఇవ్వ లేక 
పంటలను తెచ్చి వండి పెట్ట లేక 
అయినా బ్రతుకుతున్నా తృప్తి పరచి 

మనస్సుకు ఆహ్లాదం ఇవ్వ లేక
విజ్ఞానాన్ని గ్రహించ లేక
దుర్మార్గాన్ని ఓర్పుతో ఎదిరించ లేక
 అయినా బ్రతుకుతున్నా నీతికికట్టు బడి 

నిజాఐతీకి బాటలు వేయలేక 
సమయానుకూలంగా మాట్లాడలేక
ప్రాణ ప్రదమైన దాన్ని బ్రతికించు కోలేక
 అయినా బ్రతుకుతున్నా ధర్మాన్ని కట్టుబడి 

ఉత్తమ గుణాలతో బ్రతక లేక 
వంశపారం కళను బ్రతికించ లేక
చెప్పే రహస్యాలను దాచుకోలేక    
అయినా బ్రతుకుతున్నా కళను నమ్మి 

మాననీయుల మద్య బ్రతక లేక 
మహాత్ముల భోద అర్ధం చేసుకోలేక
సుగుణ శీలుర నీతిని తెలుసుకోలేక
అయినా బ్రతుకుతున్నా ధర్మాన్ని తెలుసుకొని 

కొవ్వొత్తిల కరిగి వెలుగుని పంచ లేక 
కుక్కలా ఉండి విశ్వాసాన్ని పంచ లేక
మేఘంలా ఉండి వర్షాన్ని కురిపించ లేక 
అయినా బ్రతుకుతున్నా సూర్యుడిల తిరిగి 

పప్పులో ఉప్పులా ఇమడ లేక 
నీలల్లొ పంచదారలా కరుగ లేక 
రోకలితో దెబ్బలు తినే రోలులా ఉండ లేక 
అయినా బ్రతుకుతున్నా కలచక్రం ఎదిరించి 

ఈ కవితలపై మీ అభిప్రాయలు తెలుపగలరు తప్పులుంటే సరిదిద్ద గలను