5, జూన్ 2015, శుక్రవారం

Self confidence -27 (Trangini -Adults only)


 ఓం శ్రీ రామ్              ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -27






తరంగిణి

పెళ్లి అనే భంధంతో, ప్రేమ అనే మాధుర్యాన్ని పంచుకొని, సృష్టికర్తగా మారి, అమ్మలు కన్న అమ్మ అని  అనిపించుకొని, ఆరద్యదేవతగా మారి, ఆహార్నిసాలు పిల్లల బాగు కోసం తపన చెంది, ఆది దంపతులుగా  మారి, పార్వతీ పరమేశ్వరులుగా చేరి, పిల్ల కోసం తుది రక్త బిందువు దాక శ్రమను అందించి ఆత్మీయతా అనురాగాలమద్య ఆనందాన్ని పొందేదే నిజమైన దాంపత్యం(లోకంలో నూటికి 98%శాతము అందరూ ఈవిధముగా ఉంటారని నా ప్రఘాడ నమ్మకం )

ఆ 2% శాతము విధి వంచనకు నలిగి పోయి అంగడి బొమ్మగా మరి చావలేక బ్రతకలేక తనతోటి వారిని బ్రతికించుకో వటానికి వేరే మార్గం లేక నలిగి పోయే పువ్వులా, నిలకడ లేని నీడలా, చలించి పోయే జలపాతంలా, పులికి చిక్కిన జింకలా, మేము చేసేది తప్పు అని చెప్పేవారులేక, ప్రభుత్వసహకారంతో మామూల్లు ఇస్తూ శరీరాన్నె అమ్ముకొని బ్రతుకుతున్న అభాగ్యులకు, ఆవేశంతో తపనను తగ్గించుకొనే మగమహారాజులకు ఇందు ఒక అంత్యాను ప్రాసతో కవితను పొందు పరుస్తున్నాను (నా మదిలో మెదిలిన భావాలుమత్రమే ఈ కవితకు ఆధారాలు మరియు నామేలుకు పంపిన అనేక స్త్రీ బొమ్మలు చూసి అనేక కవితలు చదవటం వళ్ళ నా భావనతో  వేశ్యల బ్రతుకు గురించి     ఈ తెల్ల వారుజామున వ్రాద్దామని కూర్చున్నాను నా ఉద్దేశ్యాన్ని ఇందు పొందు పరుస్తున్నాను (ఎఒక్కరైన ఆకర్షణకు లొంగి అభాసు కాకూడని,  ఏ " స్త్రీ " కష్టాలు వచ్చిన డబ్బు కోసం ఆశపడక శీలం అమ్ముకో కూడదని వ్రాస్తున్నాను (చదివి మీ అభిప్రాయాలు తెలియ్యపరుచగలరు) తప్పులు వ్రాస్తే క్షమించగలరు తెలిపిన ఇందు తీసి వేయగలను  



నేనొక వీణానాదాన్ని,
 మీటి నట్లుగా స్వరాన్ని అందించే వనితను
నేనొక హిమపాతాన్ని,
 వేడెక్కిన వానికి చల్లబరచి పంపె దానాను
నేనొక ఆర్తనాదాన్ని, 
భాదను చెప్పుకున్నా గుర్తించేవారు లేనిదానను
నేనొక క అగ్నిశిఖని,
 ఓర్పుతో కోర్కలను తీర్చి మండి పోయేదానను


నేనొక చిరుదివ్వెని,
 చీకటిలో వెలుగు పంచి ఆశను తీర్చె దానాను
నేనొక మాట్లాడే బొమ్మని, 
మాటల మైకముతో సుఖాన్ని పంచేదానను
నేనొక యవ్వన జవ్వని,
 తృప్తిపరచి సంతృప్తిగా  అర్ధాన్ని అందుకోనే దానను
నేనొక తారాజువ్వని, 
గగనంలో వెలుగును విరజిమ్మి మాడి నేలను చేరే దానాను


నేనొక సుడిగుండాన్ని, 
ఆకర్షణలతో మంచివారిని కూడా నాలో లాక్కొనే దానను
 నేనొక విలయాన్ని,
 ఎవరు ఎమన్నా నాపని నేను చేసుకొని బ్రతుకు తాను
నేనొక భూకంపాన్ని, 
నాలో ఉన్న కల్ముషాన్ని మోయలేక అగ్నిలా పైకి వచ్చేదానాను
నేనొక యమపాశాన్ని,
 పాశానికి ప్రాణాలు పోయినట్లుగా శీలంపోయి ప్రాణంలేని జీవితను


❤️️LOVE


నేనొక యువతరంగాన్ని, 
యవ్వణాన్ని ధారపోసి మమతను పంచేదానను
నేనొక జలపాతాన్ని,
ఎన్ని అడ్డంకులు వచ్చిన గమ్యం చేరే దానను 
నేనొక దావానలాన్ని, 
మనసుకు కీడు కలిగించేవారిని దగ్దం చేసేదానాను 
నేనొక నాట్య మయూరిని 
మనసును బట్టి నాట్యము చేసి తృప్తి పరిచే దానను


నేనొక నగాన్ని ,
అందమైన ఆభరణాలాతో వటులను ఆకర్షిమ్చే దానను 
నేనొక బొంగరాన్ని,
ఆడించి నట్లుగా తిరిగి త్రిరిగి నేలకు వరిగే దానను 
నేనొక వేటకరాన్ని,
వలలో చిక్కి తప్పించు కోలేని జింక పిల్లను, మాట్లాడే చిలకను
నేనొక మమకారాన్ని,
మనసున్న మనిషిని, ఆత్మీయతకోసం ఆరాటం పడుదానను


నేనొక ప్రాణాన్ని 
ప్రేమను పంచి ఆనందాన్ని ఉల్లాసాన్ని పెంచే దానను 
నేనొక రుణాన్ని,
ఎప్పుడో చేసిన అప్పుకు బాకీ క్రింద తనువును అర్పించు దానను
నేనొక ప్రభందాన్ని,
ఎన్ని సార్లు చదివినా క్రొత్తగా కనిపించే ప్రభంధమును నేను 
నేనొక భందాన్ని,
బందీ లకు చిక్కి బ్రతకలేక బ్రతుకి నలుగు తున్న దానను


Decent Image Scraps: Butterfly

నేనొక ఆకారాన్ని
ముఖానికి రంగులు దిద్దుకొని చీకట్లో  అందాన్ని పంచేదానను  
నేనొక స్వప్నాన్ని,
యవ్వనసౌజన్యంతో కలలోకి వచ్చి సుఖపెట్టు దానను 
నేనొక వరాన్ని,
ఈ నికృష్ట సంపాదనతో వరములు తీర్చె వరదాయినిగా మారాను
నేనొక స్వరాన్ని
స్వరమాదుర్యముతో, పారవశ్యముతో పాడి నాట్య మాడే దానను


నేనొక సరవేగా తరంగాన్ని,
ఎందరొచ్చిన యద నందించి వేగంగా ఆశలు తీర్చెదానను 
నేనొక నాటకరంగాన్ని,
వావి వరుసలు లేక ఎట్లా ఆడిస్తే అట్లా అడే నాటకరంగ కర్తను  
 నేనొక వికారాన్ని, 
చీకట్లో నలిగి పోయి అకారములేని ఆన్దపరిచే వికారమును 
నేనొక ప్రాకారాన్ని,
కొందరి జీవితాల సక్రమముగా మార్చుటకు  ప్రాకారమును


నేనొక శక్తి పాతాన్ని,
శక్తిని పంచి యుక్తిగా ధనమును దోచేదానాను 
నేనొక నాగాన్ని,
మేలికలి మెలికలు తిరిగి ఆవేశానికి ననలిగిన దానను 
నేనొక ప్రళయాన్ని,
వత్తిడిని భరించలేక ప్రళయాన్ని సృష్టించే దానను
నేనొక విప్పిన వస్త్రాన్ని,
ఎన్ని సార్లు నలిగినా చిరగనా పనికొచ్చే వస్త్రపు నౌకను


నేనొక పువ్వుని,
వాసన చూసి నలిపి నలిపి  పారేసినా భాద పడను
నేనొక ఫలాన్ని,
అకాలిని తీర్చి ఆకాశానికి బలాన్నిచ్చే  దానను 
నేనొక అద్దాన్ని,
ఉన్నది ఉన్నట్లుగా,లేనట్లుగా చూపి మరిపించే దానను
నేనొక త్రుణాన్ని,
ఎంత నలిగినా మెత్తదనాన్ని పంచి ఆహారముగా మారుతాను 


నేనొక అనంతాన్ని,
ఇంత, అంత అని అంతు పట్టని సుఖము నందించే దానను
నేనొక ఆత్మని,
సుఖాలను పొందలేక  జీవాత్మలా తిరిగే దానను 
నేనొక ఆకలిని,
ఆకలిగా ఉన్నవారికి అనంత సుఖాలందించే దానను
నేనొక వ్యభిచారిణి,
ధనం ఆశించి, భందాలను తెంచుకొని బ్రతికే దానను

నేనొక హాయిని,
విలాస వంతులకు హాయిని అందించి ధనం  పొందే దానను 
నేనొక లయని 
ఆడించే వాడు ఆడ మనట్లుగా ఆడి కృశించే దానను 
నేనొక మాయని,. 
మాయలు చేయలేక మౌనముగా ఉన్న ఆడ దానను 
నేనొక సృష్టిని,
కడుపులో 10 నెలలు మోసి సృష్టిని బ్రతి కించే దానాను


ఒక స్త్రీ వ్యభిచారినిగా మారటానికి కారకుడు ముఖ్యంగా పురుషుడు, పరిస్తితులు వేమ్బడించి నప్పుడు, అవకాసములేనప్పుడు, ఎ ఆధారము దొరకనప్పుడు, తను బ్రతికి కుటుంబాన్ని బ్రతికించు కొనుటకు ఇది ఒక ఆధారము మాత్రమే.. గృహస్తుని మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటుంది, మల్లి నిమ్న స్థాయికి దగి పోతుంది 
అతడు ఒక్కోసారి అత్యంత రక్తి కలిగి ఉంటాడు కామిని కాంచనాల నడుమ నివసించ వలసి ఉంటుంది. పురుషుడు ఈగ లాంటి వాడు ఈగ ఒక్కసారి జిలేబి మీద వాలుతుంది మరోసారి క్రుళ్ళిన పండు మీద వాలుతుంది. 
పువ్వుల్లాగా స్త్రీలు తెనెటీగలు లాగా పురుషులు జీవించాలి "తెనె టీగలు కేవలం పువ్వుల మీదనె వాలుతాయి, మకరందాన్ని గ్రోలుతాయి. వాటికి వేరే రుచించదు
భావవ్యక్తీకరణ అన్న అంశం మనస్సులో మెదిలి నప్పుడల్లా, వాల్టేర్ అనే  ప్రముఖుని మాటలే గుర్తుకొస్తాయి 
వారు - I may not believe a single word of what you say; but I shall defend with my life your right to say so - . 

నీవు చెప్పినదాంట్లో ఒక్క వషయాన్ని కూడా నేను అంగీకరించ పొవచ్చు, కాని నీ అభిప్రాయాన్ని నిస్సంశయముగా  వ్యక్తపరచే అవకాశాన్ని నీకిస్తాను 

Democracy needs a measure of tolerance of other people's views and ways -
ప్రజాస్వామ్య జీవనములో సాటి మనిషి ఆలొచనలనూ, వారు అనుసరించే మార్గాలనూ సామరస్యంతో సహించడం కనీసధర్మం          

విశాల హృదయ్యంతో స్త్రీ ని ఆదరించుదాం, స్వేచ్చను కల్పించుదాం,  జీవితంలో తప్పు త్రోవ త్రొక్క కుండా సుఖసంతోషాలతో కలసి మెలసి జీవించుదాం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి