27, జూన్ 2015, శనివారం

Self Confidence -34 (Godavari pushkaram -2015)

ఓం శ్రీ రామ్                        ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -34
ప్రాంజలి 



సర్వేజనా సుఖినోభవంతు 
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:


ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..!
(కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.)
ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. 2015 జూలై 14నుంచి 25వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు.
పుష్కరం అంటే ఏమిటి, పుష్కర సమయంలో దానాలు, పూజలు

పుష్కరం అంటే ఏమిటి, స్నానం ఎలా చెయ్యాలి..... స్నానం చేయటం వలన ఫలితమేమిటి వంటి వివరాలు

పుష్కర సమయంలో పుష్కర నది నీటిలో అనిర్వచనీయమైన దైవశక్తి నిఘూడమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేయటం వలన మనిషికి ఎన్నో ఆయుష్మిక ప్రయోజనాలు లభిస్తాయి. పుష్కర స్నానం చేసేముందు గంగాస్తుతి చదువుకుంటూ,
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ..
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు"
దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని, తలపై మూడుసార్లు పోసుకొని అప్పుడు స్నానం చెయ్యాలి.

స్నానం చేయటం వలన ఫలితం ఏమిటంటే - ఒక పుష్కర దినంలో (గోదావరి) స్నానంచేస్తే ప్రతిరోజు ప్రాతఃకాలంలో గంగానదిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. గంగ, యమున నదుల సంగమంలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నర్మదా నది ఒడ్డున తపమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది.

పుష్కర వ్రతం - అంటే పుష్కరం 12 రోజుల్లో మన యథాశక్తి స్నానాలు, దానాలు, సూర్యార్చనలు, ధ్యానం, హోమాలు, తర్పణాలు, అర్ఘ్యాలు, అనుష్టానాలు, పితృ పిండప్రదానాలు చెయ్యాలి. ఈవిధంగా 12 రోజులు చేస్తే, 12 ముఖ్య మహాకల్పాల్లో జరిపే వ్రతానికి ఇవి సమానం అని పెద్దలు అంటారు.

పుష్కర సమయంలో 12 రోజుల్లో దానాలు, పూజలు ఏవి చేస్తే మంచిదో తెలుసుకుందాం

రోజులు దేవుడు దానాలు
1వ రోజు నారాయణుడు బంగారం, ధాన్యం, రజితం
2వ రోజు భాస్కరుడు వస్త్రాలు, ఉప్పు, గోవు, రత్నం
3వ రోజు మహాలక్ష్మీ బెల్లం, కూరలు, (ఏదైనా) వాహనం
4వ రోజు గణపతి నెయ్యి, నువ్వులు, తేనె, పాలు,వెన్న
5వ రోజు శ్రీకృష్ణుడు ----- ధాన్యము, (ఏదైనా)బండి, గేదె(బర్రె), ఎద్దు, నాగలి
6వ రోజు సరస్వతి కస్తూరి, మంచిగంధం చెక్క, కర్పూరం
7వ రోజు పార్వతీదేవి గృహదానం, ఆసనం, శయ్య
8వ రోజు పరమేశ్వరుడు కందమూలాలు, పుష్పమాలలు, అల్లం
9వ రోజు అనంతుడు కన్య, దాసదాసీ, పరుపు, చాప
10వ రోజు నరసింహస్వామి దుర్గాదేవి, లక్ష్మీదేవి, దేవీపూజ, సాలగ్రామం
11వ రోజు వామనుడు ----- కంబళి, సరస్వతి, యజ్ఞోపవీతం, వస్త్రం, తాంబూలం
12వ రోజు శ్రీరాముడు దశ, షోడశ మహాదానాలు
(ఈ దానాలు చేయడం వలన కోటిజన్మల పాపాలు నశిస్తాయని దైవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు.)

గోదావరి నది "గో కళేబరం"ను ఆవరించి ప్రవహించిన కారణం వలన "గోదావరి" అని పేరు వచ్చింది.
కృతయుగంలో 'తుందిలుడు' అనే మహాతపస్వి చేసిన తపస్సును చూసి మెచ్చి పరమశివుడు అతనికి మూడు కోట్ల ఏభై లక్షల పుణ్యతీర్ధాలకు ఆధిపత్యాన్ని ఇస్తూ 'తుందిలిని' అధిపతిగా చేసాడు. అంతే కాకుండా శివుడు తన అష్టమ స్థానంలో ఒకడైన జలస్థానం తుందిలునకు శాశ్వత స్థానంగా కల్పించాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మ...పరమశివుని ప్రసన్నం చేసుకొని ఆ జలసార్వభౌముడు - పుష్కరుని తన సృష్టి కార్యనిర్వహణకు సహకరించే విధంగా తనకు ఇవ్వమని ప్రార్థించాడు. వెంటనే శివుడు సంతోషించి ఆ పుష్కరుడిని వరప్రసాదంగా బ్రహ్మకు ఇచ్చాడు. ఎన్నో మహిమలున్న ఆ పుష్కరుని తన కమండలములో ఉంచి 'సృస్తికార్యం' ప్రారంభించాడు బ్రహ్మ.

ఒకనాడు బృహస్పతి బ్రహ్మకోసం ఘోరతపస్సు చేసి సకల ప్రాణులకు జీవాధారుడైన పుష్కరుని తనకు వరంగా అనుగ్రహించమని కోరుతాడు. అది విన్న పుష్కరుడు బ్రహ్మను వీడి వెళ్ళనంటాడు. ఇంక చేసిదిలేక బ్రహస్పతిని, పుస్కరుని ఇద్దరికీ సమన్యాయం చెయ్యాలని నిర్ణయించి ఈవిధంగా చెప్పాడు. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదులలో పుష్కరుడు కూడా ప్రవేసిస్తాడు. ఆ సమయాన్ని 'పుష్కర కాలం' అంటారు.

బ్రహ్మ నియమానికి వారు కట్టుబడడం వల్ల ఒక్కొక్క సంవత్సరం, ఒక్కో నదికి పుష్కర సమయంగా నిర్ణయించబడింది. పత్నీ సమేతుడై ఇంద్రుడు 33 కోట్ల దేవతులు, సర్వగ్రహాలు, 50 లక్షల తీర్థాలు, ఆ పుష్కరకాలలో నివసిస్తూ ఉంటారు. అందుకే ఆయా నదుల పుష్కరకాలంలో మొదటి పన్నెండు రోజులూ మహా పుణ్యప్రదమైన పుష్కరరోజులుగా నిర్ణయిస్తారు.

పుష్కరం వచ్చే నది బృహస్పతి ప్రవేసించే రాశి పుష్కరం వచ్చే ప్రాంతం

1) గంగానది మేషరాశి కాశీ
2) నర్మదానది వృషభం అహ్మదాబాద్ లోని నారీశ్వర్
3) సరస్వతి నది మిధునరాశి ఉత్తరప్రదేశ్ లోని భీంపూర్
4) యమునానది కర్కాటకరాశి మధుర
5) గోదావరినది సింహరాశి రాజమండ్రి & భద్రాచలం
6) కృష్ణానది కన్యారాశి విజయవాడ, శ్రీశైలం
7) కావేరీనది తులారాశి శ్రీరంగం
8) తామ్రపర్ణీనది వృశ్చికరాశి తమిళనాడులోని బాణతీర్థం
9) బ్రహ్మపుత్రానది ధనూరాశి రాజస్థాన్ (అజ్మీర్ ప్రాంతం)
10) తుంగభద్రానది మకరరాశి మంత్రాలయం - కర్నూల్ జిల్లా
11) సింధూనది కుంభరాశి ఇది పాకిస్తాన్లో ఉన్నందున గంగానదిలో చేస్తారు
12) ప్రణీతనది మీనరాశి చోప్రా (కాళేశ్వరం సమీపంలో ఉంది)

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా పవిత్రమైన పుణ్యకాలం. అటువంటిది గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం 12 సంవత్సరాలుగా ఇతర నదులలో చేసిన పుణ్యం కంటే వెయ్యిరెట్లు ఎక్కువని, పుష్కర స్నానం చేస్తే - ఏడు జన్మలుగా చేసిన పాపాలు కూడా నశిస్తాయని, గంగానదిలో స్నానం చేయటం, నర్మదా తీరంలో తపస్సు చేయటం, కురుక్షేత్రంలో దానం చేయటం, కాశీలో (మరణం)మోక్షాన్ని ఇస్తాయని పెద్దలు చెప్పారు.
పుష్కరకాలంలో చేసే ప్రతీపని(పుణ్యకార్యము) ఎంతటి అధిక ఫలాన్ని అందిస్తుందో..... ఆ రోజుల్లో చేసే పాపకార్యాలు కూడా వందరెట్లై నరక కూపంలోకి తోసెయ్యటం కూడా అంతేనని చెప్పారు.

జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కరాలలో పాల్గొందాం ..... మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం
మరో కధ  

గోదావరీ పుష్కారాలు - అపర భగీరధుడు !
ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి ! తెలుగు వాడికి ఒక మంచి సుగుణం ఉంది.'అన్నదాత'ను మరచిపోడు. మరచిపోకపోవటమే కాదు,వీలున్నప్పుడల్లా స్మరించుకుంటాడు.పోయినసారి గోదావరీ పుష్కారాలకి వెళ్ళినపుడు,అక్కడి పురోహితులు,అర్ఘ్యాలు విడిపించేటప్పుడు --ఒక చక్కని శ్లోకం చెప్పి నా చేత అర్ఘ్యం విడిపించారు.ఆ శ్లోకం ఈ విధంగా ఉంది---



"నిత్య గోదావరీ స్నాన పుణ్యదో
యో మహామతిహి:
స్మరా మ్యాంగ్లేయ దేశీయం
స్మరామి ఆంగ్లేయ
కాటనుం తం భగీరధం!
(మాకు గోదావరీ స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన,అపర భగీరధుడు,ఆంగ్ల దేశానికి చెందిన కాటన్ గారికి నిత్యం స్మరించి తరిస్తున్నాము.)
ఈ శ్లోకం ప్రవచించిన మహానీయులెవరో ఇంతవరకు తెలియదు. కానీ,గోదావరీ నదీ వాసులు చాలామంది నేటికీ ఈ శ్లోకం చెప్పి కాటన్ దొరగారికి అర్ఘ్య ప్రధానం చేస్తూనే ఉన్నారు.ఒక సారి కాటన్ దొరగారు రాజమండ్రిలో పడవ ఎక్కుతుండగా,రేవులో ఈ శ్లోకం వినపడి--'కాటన్' అన్న మాట దొరగారి చెవిన పడిందట.దొరగారు,ఆయన అనువాదకుడి వైపు చూసి,పడవ దిగి సంకల్పం చెప్పుకుంటున్న ఆ బ్రాహ్మణుడిని--దాని అర్ధం గురించి అడిగి రమ్మని అన్నారట.ఆ బ్రాహ్మణుడు, అనువాదకునికి ఆ శ్లోకం అర్ధం వివరించి చెప్పి,అటువంటి భూసురిడిని (భూమి పై తిరిగే దేవుడు అనే అర్ధం)నిత్యం తలచుకుంటామని చెప్పాడట."ఆ దేవుడు మరెవరో కాదు,పడవలో ఉన్న ఆ కాటన్ దొరగారే!",అని ఆ అనువాదకుడు ఆ బ్రాహ్మణుడికి చెప్పగానే,ఆ బ్రాహ్మణోత్తముడు రేవులోకి పోయి దొరగారికి వందనం చేసాడట.దొరగారు సంతోషించి,ఆ బ్రాహ్మణుడికి పది రూపాయలు దక్షిణగా ఇచ్చి సత్కరించారట.
ఆ రోజుల్లో పది రూపాయలు అంటే వందేళ్ళ నాటి ధరల ప్రకారం,ఒక కుటుంబానికి నాలుగు మాసాలు సరిపడే జీవనభృతి.శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు తమ ఆత్మకథలో కూడా కాటన్ దొరగారి విషయం ప్రస్తావించారు.అందులో,ఆయన ఈ విధంగా చెప్పారు.---బ్రాహ్మణులు గోదావరీ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు,"కాటన్ దొర స్నాన మహం కరిష్యే" అని చెప్పుకునేవారట.
గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి 'అన్నదాత' గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొరగారి పాలరాతి విగ్రహాన్నిఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. స్నానపానాదులు,అర్ఘ్యప్రధానాలు ముగించుకొని,ఆ మహనీయుని విగ్రహానికి నమస్కరించి రావటం నేటికీ జరుగుతున్నది.అటువంటి మహనీయుడు,అపర భగీరధుడు అయిన కాటన్ దొరగారిని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 15 -05 -1803 న, Oxford లో జన్మించారు.బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరుగా పనిచేసేవారు.కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు.ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే నెరవేరింది.
1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. ఆర్ధర్ కాటన్,1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ఒకడు.15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు.
ఈ కాలువల విభజన,అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి.కాటన్ 1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే.ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.ఆ మనీయుడు, 25-07-1899న, డోర్కింగ్ లో (బ్రిటన్) మరణించారు.
తెలుగు వారేకాదు తమిళులు,ఒరియాలు,బెంగాలీలు, బీహారీలు...మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.మూడున్నర ఏళ్ళ క్రితం కాటన్ దొరగారి మునిమనవడు అయిన శ్రీ రాబర్ట్ కాటన్ గారు, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరగారిని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ఆ మధ్య లండన్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో,తెలుగువారు శ్రీ రాబర్ట్ కాటన్ దంపతులను ఘనంగా సత్కరించారు. తెలుగువారి కృతజ్ఞతా భావానికి వారి కళ్ళు చెమ్మగిల్లాయి.‌
ఆ అపర భగీరదుడిని మనం కూడా స్మరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందాం!
  

శ్రీరామ పాదాలు కడగంగా

రామదాసుని నోట తిరగంగా

నన్నయ్య గంటాన సుడులు తిరుగుతూవచ్చి

తెలుగింటి వేదమై భూదారి గంగ

మా వాడకొచ్చింది గోదారిగంగ…


కోనసీమా ఆకుపచ్చ చీరకట్టి

కోటిలింగాలతో మెడకు హారాలెట్టి

పాపికొండలపైట పరువాలకే చుట్టి

శబరితో కలిసింది గౌతమై కరిగింది

దక్షిణాదికి గంగ గోదారిగంగ

దక్షవాటికి చేరె నేడు శివగంగ..

వెన్నెలంతా మేసి తాను నెమరేసింది

ఎంకి పాటలు పాడి ఎల్లువైపోయింది

పడతి కిన్నెర్సానిలా పరుగులెత్తింది

పదములే పాడింది పైరులై పండింది

శ్రీనాధ సీసమై శృంగార గంగ

వీరేశలింగాల విజ్ఞానగంగ..
 
( పాట సాహిత్యం .. వేటూరి సుందర రామ మూర్తి గారు)


గోదావరి

కదులుతోంది కదులుతోంది
కులుకు నడకల తోని కలికి గోదారి
కదలి సాగుతోంది కడలి చేర గోరి

త్ర్యంబకాచలోత్పాతియై
త్ర్యంబకేశ్వరుని పూజించి
అడుగులందు అడుగేసి
కదులుతుంది అంబుధిలో
కలువనెంచి కరుగనెంచి

మరాఠీ సంస్కృతుల
మోసుకొచ్చె మహాఝరీ
తెలుగునాట కాలిడిన
తేనెలూరు మధురవాహి

తెలంగాణ సంస్కృతుల
నాచమనమొనరించి
మంజీరా హరిద్రలను
తనలోనా కలుపుకునీ
వాసరమ్మ పాదాలను
ప్రక్షాళన గావింపగ
పరుగుతోడ కదులుతుంది
పరువాలా గోదావరి

పోచంపాడు లో కొంత
మజిలీయె చేసె తాను
బంజరు భూముల తడిప
బంగారము పండించె
అన్నమునిచ్చెను తల్లీ
అన్నదాత గోదావరి

ధర్మపురి నరసింహునీ
సేవింపగ కదిలె వేగ
ముక్తేశ్వర స్వామి కకడ
మొక్కుబడులు చెల్లించగ
కాళేశ్వరము జేరి
కదులుతుంది సాగుతుంది
కడలికొరకు వేగాన.....

ఆప్యాయతతోడ
శబరిని తా జేర్చుకోని
భద్రగిరి రామన్నను
భక్తితోడ సేవింపగ
పరుగుపెంచి కదులుతుంది పాపికొండలలొకి

వట్టిసీమ కరిగి యచట
వీరేశ్వరుని కొలిచి
సాగుతుంది మునుమందుకు
సాగరాన్ని చేరదలచి

ప్రియుని నంగమాన్నిగోరి
సంద్రంతొ సంగమింప
రయమున సాగుతోంది
రంజుగాను సాగుతోంది

రాజమహేంద్రమందు
రెండుపాయలై చీలి
వశిష్టగౌతమివై
అంతర్వేది జేరుతుంది

గౌతమిగా తానేమో
యానాము కదలి వెళ్ళు
అద్భుత పయనమందు
అలరించెను అవని తల్లి

నీదయతో సుక్షేత్రపు
కేదారములే విరిసే
నీనడకల హొయలుతోడ
ప్రకృతమ్మ యెదమురిసె.


    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి