14, జూన్ 2015, ఆదివారం

Selfce confidence -29 మానవ జన్మ.(paluku-Rajakiiyam)


ఓం శ్రీ రామ్                           ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -29











మానవ జన్మ.! ( వైకుంఠపాళీ -కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)
'భోగేన పుణ్యం కుశలేన పాపం'


అన్న చందాన కుశలబుద్ధితో పాముల్ని దాటుకుని,
సుగుణాత్మకాలైన నిచ్చెనలను ఎక్కి
పరమసుఖాన్ని భోగించడమే జీవుల జీవనోద్దేశ్యం.
.
“మాతా చ కమలాదేవీ పితా దేవో జనార్దనః।
బాంధవా విష్ణుభక్తా చ నివాసం భువనత్రయం॥“


వర్షపు చినుకు ద్వారా భూమికి చేరిన జీవి,
తండ్రి గర్భంలో మూడు నెలలు ఉండి, రేతస్సు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించి, అక్కడ తొమ్మిది నెలలు ఉండి ప్రసూతి వాయు తాడనం చే భూమి పైకి రావడం జరుగుతుంది.


ప్రాణమున్నంత వరకూ ఈ దేహాన్ని శరీరమని పిలుస్తారు.
‘శీర్యతేతి శరీరం’. శీర్య మంటే రోగాది ఉపద్రవాలని అర్థం. నానా విధాలైన దైహిక, మానసిక రుగ్మతలతో హింసపడే దేహాన్ని శరీరమంటారు. త్రిగుణాత్మకమైన ఈ శరీరంలో సాత్వికగుణం వల్ల దయ, క్షమ, శాంతి మొదలైనవి పుడతాయి.

 రజోగుణం వల్ల అనేక కర్మలను చేయడానికి బుద్ధి పుడుతుంది.
తమోగుణం వల్ల కామ, క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలు పుడతాయి.

నుదుటిన వ్రాసిన విధంగా జీవించి ప్రాణవాయువు తొలగగానే శరీరం కాస్తా శవమౌతుంది. యోగ్యులైన, యోగులైనా, అయోగ్యులైనా, చనిపోయిన వారి దేహాన్ని శవమనే పిలుస్తారు.

'శం సుఖం వహతీతి గచ్ఛతీతిశవం'. యోగులు, యోగ్యుల విషయంలో 'శవం' అన్నది సుఖాన్ని కొనిపోయేదిగా ఉంటుంది. అయోగ్యుల విషయంలో సంకటభూయిష్టమై, దుర్గంధభరితమై, జంతువుల కాహారమయ్యే పాంచభౌతిక దేహంగానే మిగిలిపోతుంది.

నేడు ఉండి మరునాడు శిథిలమైపోయే ఈ శరీరాన్ని దేవాలయంగా మార్చగలగడమే సాధన
.

 మంచిని గురించి నలుగురికి తెలపాలని ఆశయంతో నా మేలుకు వింజమూరి అప్పరావుగారు పంపిన  దానిని నలుగురు తెలుసుకోవాలని ఇందు పొందు పరుస్తున్నాను 

నా భావాలు
పలుకులో పవణాలు  

పలుకు పలుకులో తేనలు
తేన పలుకులలో పరిమళాలు
మనసుకుచేరు పరిమళ  పవణాలు
మనసులో కళలు తీరె ఆశలు

పలుకులో కానరాని విషాలు
విషపు మాటలతో విరోధాలు
కోపంతో పలుకే ఖటిన పదాలు
మనసుకు అర్ధంకాని నీతి పదాలు

ముల్లులా గుచ్చుకున్నాయి పలుకులు
కానరావు మెచ్చుకోలు పలుకులు
మెప్పించ లేవు మూర్ఖపు మతులు
మతిపోగోడుతాయి ములుకుల పలుకులు

సలహాగా చెప్పే ఉచిత పలుకులు
పలుకు పలుకు మద్య పలుకుబడులు
పలుకుతో పెరుగు గౌరవ మర్యాదలు
పలుకు వళ్ళ కలుగు శాంతి సౌక్యాలు

పలుకులో పలు రాగాలు
రాగాలతో పలు నాట్యాలు
పలుకు నీవు పసిడి పలుకు
పరులు మెచ్చు పలుకు పలుకు  

పలకగానే పలుకు
పసందైన పలుకు
సరళమైన పలుకు
సౌశీల్యం  బ్రతుకు

 పలుకువల్ల పెరిగాయి కొందరికి కక్షలు
పలుకల వల్ల కలిసాయి కుటుంబాలు
పలుకు వల్ల పెరుగు మనస్సాంతులు
శాంతి  లేకపోతె వస్తాయి తిక్క పలుకులు

    


నా భావాలు రాజకీయ ఒక దుర్ఘందం

మాటకు మాటకు పొంతన లేదు
మనసుకు మనసే అర్ధం కాదు
అర్ధం కోసం వెంపర్లాడటం మానదు
అడుగడుగు రాజకీయ దుర్ఘందం

నా కష్టార్జితం నన్నడిగే వారెవరు
నేనుచేసే పనిని తప్పుపట్టే వారెవరు
పార్టి పునాదుల కోసం తపిస్తున్నవారు
విడదీసి పాలించేదే రాజకీయ దుర్ఘందం

మాటొకటి  మనసులో ఒరోకటి
చేసే దొకటి ప్రజలకు చేప్పే దొకటి
ఆదరణ చూపినట్టే ' కళ్ళు 'ముంత ఇచ్చి
మనసును విరిచే రాజకీయ దుర్ఘందం

ఒక వైపు మాటలతో పోరు
మరోవైపు కమీషన్లతో జోరు
అవకాశ వాదుల వత్తిడి  తీరు
పందారాలతో రాజకీయ దుర్ఘందం

చెప్పింది చేయరు - చేసింది చెప్పరు
చేయ లేనిది చేస్తా మని వాగ్దానం చేస్తారు 
 నమ్మిన ప్రజలను మబ్య పెడతారు
నమ్మించి లాభం పొందే రాజకీయ దుర్ఘందం

సత్య వాక్కు అని వాదించేవారు
ఆకాంక్షలు తీర్చెది మేమే అనేవారు  
పార్టి సిద్దాంతాలను నమ్మా మనేవారు
ధనం  కోసం పార్టి మారే రాజకీయ దుర్ఘందం

నన్ను నమ్మినవారికి నిచ్చెనను
హానితలపెట్టిన వారికి కాలనాగును
నేను  మానవత్వాన్ని రక్షించే వాడను  
ప్రజ్వలించే దే మా రాజకీయ దుర్ఘందం

నాయకుల వాదం - ప్రాజక్టుల వివాదం
ఆశ్రిత పక్షపాతం - వారసత్వ రాజకీయం
దూరదృష్టి లోపం - డబ్బు కోసం దుర్మార్ఘం
వికృత పోరాటమే రాజకీయ్య దుర్ఘంధం

 తలచుకుంటే నీళ్ళ ల్లో నిప్పులు
మాటల్లో గొప్పలు, లెక్కల్లో తప్పులు
చిత్తశుద్ధి లోపం లేకుండా పోరాటాలు
పోరాటాల మయమే రాజకీయ దుర్ఘంధం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి