20, జూన్ 2015, శనివారం

Self confidence -31 (YOGA DAY) 21-06-2016

ఓం శ్రీ రామ్                    ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -31పూర్వకాలములో ప్రత్యక వ్యాయామశాలలు ఉండేవి, అక్కడ ప్రతి ఒక్కరు విద్యతో పాటు యోగ  గురించి చెప్పేవారు. ఈనాడు  యోగ గురించి ప్రపంచ మంతా వ్యాపించింది. దానికి కారణం ఆరోగ్య సూత్రాలన్ని యోగాలో ఉన్నాయని అందరు భావించు తున్నారు. యోగాను అభ్యసించు చున్నారు.  వివిధ ఆసనములు వేస్తూ ఉన్నారు. 
దీనవలన మానసిక ప్రశాంతి కలుగు తుంది. మనసు ప్రశాంతముగా ఉంటె ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యము బాగుంటే కుటుంబము బాగుంటుంది. సూర్య భగవానుని ప్రార్ధించుతూ సూర్య నమస్కారులు చేసేవారు ఉన్నారు, ఇప్పటికీ  చెస్తూనే ఉన్నారు.  వీతికి వయసుతో పనిలేదు స్త్రీ పురష భేదములేదు ప్రతిఒక్కరు చేయవచ్చు.

పూర్వకాలము విద్యార్ధులు గురుకులాలలో గురువుకు శుస్రూషతో  ఎలా అహంకార రాహిత్యాన్ని పొంది ఏకాగ్రతను సాదిమ్చేవారో అదేవిధమైన అవధాన్నాన్ని నేటి విద్యార్దులు సాధిస్తే ప్రయోజనము కలుగుతుంది.

యోగ అంటే ఒక నైపుణ్యాన్ని సమ్పాదించుకొవడమో, ఒక పట్టాను పొందటమో, లేదా కొద్దిపాటి సమాచారాని బుర్రలోదట్టించు కోవడమో అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరు తెల్లవారు జామున అమృత ఘడియ లలో లేచి యోగాసనాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, బుర్ర చురకుగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు యోగ మార్గం ద్వారా ఏకాగ్రతను, హృదయ విశాలతను పెంపొందించుకొని, నిజమైన సాధికారతను సాధించాలి. అలా ప్రతిఒక్కరు సమర్ధ వ్యక్తిగా, సామాజిక భాద్యతగల పౌరుడిగా ఎదిగిన నాడు సమాజ రుగ్మతలను ఎదిరించగల సమర్ధులు గా మారుతారు. దర్మాన్ని నిలబెట్టే మహాత్ములుగా మారుతారు   

  

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది ‘యోగ’. ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది.
 పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం..

ఇంతకీ యోగలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా?.. ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం.. మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం.. మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది.

యోగలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగ పూర్తి గ్యారంటి ఇస్తుంది..
యోగ ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు?
అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం......


మనస్సు నిర్మలమైన కొద్ది దాన్నినిగ్రహించడం సులభమవుతుంది. మనోనిగ్రహం వళ్ళ ఏకాగ్రత సాద్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్ధంగా కార్యాన్ని నిర్వహించవచ్చు. 
                                                స్వామి వివేకానంద