19, జూన్ 2015, శుక్రవారం

Self confidence -30 (Family-comedy-Love- Sanskrit slokaala telugu vachassu))

ఓం శ్రీ రామ్                 ఓం శ్రీ రామ్               ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు - 30

దానం ప్రియ వాక్సహితం 
జ్ఞాన మగర్వం క్షమాన్వితం శౌర్యం
త్యాగాసహితం చ విత్తం 
దుర్లభ మేత చతుష్టయమ్ 
(ఇవి హితోపదేశం లో నారాయనసూరిగారు చెప్పిన మాటలు)

 (ప్రియవాక్కు తో కూడిన దానం,  గర్వంలేని జ్ఞానం, క్షమతో కూడిన శౌర్యం, త్యాగం తో కూడిన దానం లోకంలో ఉండటం అరుదుట )

కవి హృదయం ఎంతో అద్భుతం మానవులు చేయలేరు అని చక్కగా తెలియ పరిచారు అందుకే నా భావ కవితలు చదివి మీ అభిప్రాయాలు తెలియపరుచ గలరు 

ప్రతిఒక్కరు గమనించాల్సిన విషయాలు

దానం
అహంకారం లేని దానం 
ప్రచారాంకి నోచని దానం 
ఆశయంతో చేయని దానం
ప్రదానమైన గుణమే దానం

న్యాయార్జిత ద్రవ్యన్నే దానం
యోగ్యుడైన వక్తికే దానం 
భగవత్ దర్శన బుద్ధీతొ దానం 
పవిత్రతతో సార్ధకత  దానం 

నేనిచ్చానని చెప్పుకొనే దానం
మనసు నొప్పించి తీసుకొనె దానం 
అప్రియవాక్కులతో పంచె దానం
దానం ఇవ్వటం అనర్ధం - తీసుకొవటమ్ వ్యర్ధం

అందుకే కవిగారు ప్రియ వాక్కులతొ కూడిన దానం తీసుకున్నవారికి, పుచ్చుకున్నవారికి మోక్షం

 జ్ఞాణం 
విషయాన్ని విశ్లేషించి సేకరించడం 
విషయత త్వాన్ని దర్శించి అర్ధం చేసుకోవడం
విషయాన్ని పరిపూర్ణంగా జీర్ణిమ్చు కోవడం
విజ్ఞాణం తో పెరిగేదే  నిజమైన జ్ఞాణం 

పశుత్వాన్ని పారద్రోలేదే జ్ఞాణం 
రాక్షసత్వాన్ని రూపు మాపేది జ్ఞాణం 
మానవత్వాన్ని నిలబెట్టేదే జ్ఞాణం 
దివ్యత్వాన్ని వెలిగించేదే జ్ఞాణం 

ధన గర్వితులలో ఉంటుంది జ్ఞాణం
అధికార గర్వితులలో ఉండునది జ్ఞాణం
జ్ఞాణ గర్వితులలో కుడా ఉంటుంది జ్ఞాణం    
వినయభూషితుడిలొ ఉండు వెలుగు పంచె జ్ఞాణం

అందుకే కవిగారు గర్వం లేని జ్ఞాణం ఉండటం దుర్లబం
గర్వంతో కూదిన జ్ఞానం అనర్ధాలకు హేతువు 

శౌర్యం
మనిషి బ్రతకటానికి ఉండాలి శౌర్యం 
ఆత్మరక్షణ కు శత్రు శిక్షణకు అవసరం శౌర్యం
శౌర్యం ఉన్న ఉండాలి క్షమించగల ఔదార్యం
అందుకే శౌర్యంఉన్న శ్రీరాముడు లోకానికి ఆదర్శం 

క్రౌర్యంగా శౌర్యం ఉపయోగ పడకూడదు 
శౌర్యం కసితో కలుషితం అవకూడదు
క్షమాగుణం లేకపోతె శౌర్యం విలువ వుండదు
శౌర్యం ఉందని హింసకు పూనుకో కూడదు 

అందుకే హితో పదేశకర్త క్షమాన్విత  మైన  శౌర్యం దుర్లబం అన్నారు 

ధనం
జీవితాన్ని బ్రతికించేది ధనం 
జీవితాన్ని నాశనం చేసేది ధనం
అనర్ధం అక్రమార్జిత ధనం 
ఆశ తీరదు ఎంతున్నా ధనం 

ఐహిక బందాల కోసం దాచే ధనం 
ఆద్యాత్మికకు అడ్డువచ్చేది  ధనం 
ఆత్మీయులలో కలతలు రేపేది ధనం
ప్రాణాల్ని నిల బెట్టిది ధనం

మానవులు త్యాగ గుణాన్ని పెంచుకుంటే అమృతత్వం లబిస్తుంది ధనలక్ష్మి అందుబాటులో జీవిస్తుంది, మనిషిని సంతృప్తి పరచి ఆనందాన్ని ఇస్తుంది కాని కొన్ని సమయాలలో ఆ ధనమే ప్రాణాల్ని తీయటానికి సహకరిస్తుంది

చివరిస్వాసదాక నాది నా సంపాదన 
ఇబ్బందిలొ ఉన్న ఏమాత్రం ఇవ్వక  వాదన
అందుకే హితొపదెశమ్లొ త్యాగసహిత విత్తం దుర్లబం త్యాగరహిత విత్తం ఆద్యాత్మికోన్నతికి ప్రతిబంధకం 

కరిగిన కాలానికే యవ్వనమే సాక్ష్యం     
కరిగే కాలానికి నమ్మకేమే సాక్ష్యం
కరగబోయే కాలానికి ధర్మ మార్గం ఉండటం సాక్ష్యం
ఎప్పటి కీ తల్లి తండ్రులు గురువే ఆదర్శం