ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -33
ప్రాంజలి
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి : ఓం శాంతి :ఓం శాంతి:
ఒక రెప్పపాటు కాలం మనకు కలిగిన అనుభూతిని సాధన చేస్తే
జీవితంలో ప్రతిక్షణం మనం ఆనందంలో తెలియాడ గలమని యోగామృతం తెలుపుతుంది
నేనొక ఆశా జీవిని - గాలిని, నీతిని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని నమ్మిన వాడిని
నే నొక ధర్మ పక్షపాతిని - నలుగురు కోసం బ్రతికేవాడిని
కట్టుకున్న వస్త్రానికి, పాదాలకు వేసుకున్న చెప్పులకు, కంటి చూపుకు సహకరిస్తున్న సులోచనాలకు, నన్ను నిలబడి నడుచుటకు సహకరిస్తున్న చేతి కర్రకు, ఎండకు వానకు సహకరిస్తున్న ఛత్రమునకు, నన్ను నమ్మి నాతో కాపురము చేస్తున్న నా శ్రీ మతికి, నా పిల్లలకు ఋణపడిన వాడిని,
జీవత సమరము లోని మంచి అనుభవాల్ని
అందరికి పంచె జీవిని, ఇది కలియుగం
ఎత్తుకు పై ఎత్తు నాది
మూడడుగులు ఎగిరే తత్వము నాది
తెలుగు ప్రజల అందరి రక్షణ నాది
నేను చేసేపనిని దేవుడు చూస్తున్నాడు
నాకొచ్చిన అదృష్టం తో నా కుటుంబానికి స్వర్గం చూపిస్తున్నా
నా బందు మిత్రులకు దోచుకొని తినమని అవకాసమిస్తున్నా
ఇంతకన్నా ఎ రాజకీయవాది చేయగలడో మీరె చెప్పండి
మరి ప్రజలు విషయం పట్టించు కోరెం
ఎవరి ఆలోచనలు వారివి, ఇప్పుడు డబ్బుకు కొదవలేదు
ప్రజలు మనల్ని పదవి నుంచి దించారనుకో హాయిగా
పెన్షన్ తీసుకొని బ్రతుకుదాం, ఎట్లా గంటావా చదరంగంలో
కాసాపు తెల్లపావులును కదిపి గెలువు నీవు తరువాత
నల్ల పావులను కదిపి గెలుస్తా నేను
గురుశిష్యుల సమరం - తెలుగువారికి అయోమయం
ఇది కదా కలియుగం
అసలే నేను రాజకీయంలో ఉండి నేను సతమత మవుతున్నా
ఆ ఫోన్లు అవతల పెట్టు టాప్ చేసి నన్ను ఇరకాటంలో ఉంచేస్తున్నారు
అవును నాన్న పిల్లి పాలు త్రాగుతుంటే ఎవ్వరు చూడ లేదను కుంటుంది నిజమే కదా నాన్న - ఏమిటి ఆ సూక్తి ఇప్పుడు అవసరమా
అసలే నన్ను నమ్ము కున్నవారు ఇరకాటం లో పడితే
అంతా ఆ పై దేవుడు చూసు కుంటాడు
హాయిగా ధైర్యం తో కదులు నాన్న, ఇది అర్జంటుట
ఇది కలియుగం ఎట్లామాట్లాడినా చెల్లుతుందని అనుకోవటం తప్పు నాన్న
ఎందుకురా ఆ దిగులు - నీ కష్టం తగ్గ ఫలితం పొందుతావు
చెపుతారు మీరు సలహాలు - అనుభవించినవాడికి తెలుస్తుంది విలువ
కోర్టులో లక్షలున్నాయి కేసులు - అందుకే కదా అవి ప్రక్కన బెట్టి నాయకుల కేసు పట్టం
అవున్లే ఇది కలియుగం ఇష్టం కాని వాడిని జైల్లో పట్టించవచ్చు - ఇష్టమైన వాడ్ని ఎన్ని కేసులున్న వదిలేయవచ్చు
ఎం మాట్లాడుతున్నారు మీరు ధర్మదేవత కళ్ళకు నల్ల వస్త్రము కట్టిన
నల్లకోటు న్యాయవాది తీర్పు చెపుతాడు తెలుసుకోండి
నిజమేన తీర్పు వస్తుంది ఇది కలియుగం
దూరాన నారాజు ఎలా ఉండే నో
ఈరోజు నారాత ఎలా మారునో సీమ సిటుకు మానగానేమో సెదిరిపోతది మనసు కాకమ్మ సేతైన కబురంపడా నా రాజు దూరాన నారాజు ఎలా ఉండే నో... కళ్ల కేటో మబ్బు కమ్మే నో నిదరలో తెలియకుంది నా మనసు దూరాన నారాజు సుఖపాడు తుండె నో... గుండెల్లొ వుండుండి గుబులు గుబులౌతుందో మనసులో నా బొమ్మ మసక మసకేసిందో దూరాన నారాజు కోసం ఉంది నా మనసు .. ఇది కలియుగం
కలియుగ స్వర్గ ద్వారం ఇది కదా
మేధావుల ప్రతిభ ఇది కదా
ఆనందానికి ఇది నిలయం కదా
సుఖ ప్రయాణానికి మార్గమే కదా
ఇది కలియుగం | |
కొంటె సమాధానాలు ! మీ పుట్టిన రోజు? * నన్ను గుర్తించన రోజు ఏ సంవత్సరం? * గాలికి తిరిగే వానికి లెక్క తెలుస్తేగా ఎందుకు పుట్టారు? * భూమతకు బరువవటానికి ఏం చదివారు? * లోకాన్ని మీకెలాంటి కధలంటె ఇష్టం? * నవ్వించి ఏడిపించేవి . మీ కిస్టమైన పండు? * మేడి పండు మగాడికి పెళ్ళి అవసరమా? * జిహ్వాచాపల్యానికి ...అవసరం మగాడికి డబ్బు అవసరమా? * కుయుక్తికి ..అనవసరం ఈ ప్రపంచంలో అందమైనది? * మా అమ్మ... మీరు ఒక్క రోజు సి.యం. అయితే? * ఖజానా ఖాలిచేసి, బీదలకు పంచుతా యూత్ కి మీరెచ్చే సలహా? * తల్లితండ్రులను ప్రేమించడం అవసరం . చివరగా ఏమైనా రెండు ముక్కలు చెప్పండి? * నిన్నటి గురించి ఆలోచించకు - నేటి గురించి చర్చించకు - రేపటి గురించి విచారించకు .. |
అద్దంలో బాబు మొఖం చూసుకుంటూ కనిపించదేమ్మ
కళ్ళు మూసుకుంటే నీకు ఎం కనబడుతుంది కన్నా
కళ్ళు మూసుకుంటే నామోఖం నీకెలా కని పించిన్దమ్మ
కళ్ళు మూసుకుంటే నీకె కనిపించదు నాకు కనిపించదు కన్నా
ఇది కలియుగం
నా నీడను కుడా చూడలేని - నేనొక హుందా తనాన్ని పెంచేదాన్ని
ప్రశాంత మైదానంలో- అందరిలో ఒక్కరి నై ప్రశాంత పరిచేదాన్ని
పండు వెన్నెలలో - మనసును ఉల్లాస పరిచేదాన్ని
నేను ఖాలీగా ఉన్న సింహాసనాన్ని- రాజకీయుల ఆశాదీపాన్ని
నను ఎక్కుటకు అందరూ ప్రయత్నిస్తారు - నాలుగు కాళ్ళను బట్టి లాగుతుంటారు
ఇది కలియుగం
వేడిగా ఉంటె మోఖం మీదకు ఊదాలా
ప్రక్కన చెట్టంత మనిషి ఉన్న కాన రాలా
నీఊదుడుకు నామొహం అంటుకుంది ఎలా
తుడుస్తా ఎంతైనా భరించేది నేనేగా సుమోలా
బయట తిరిగే ఆడవారికి మొగుడు పిల్లలు కనబడరు
క్లబ్బులు తిరిగితే కొన్ని అలవాట్లకు బానిసలవుతారు
తప్పు కప్పిపుచ్చుకోవటానికి ఎగిరెగిరి పడతారు
మొగుడు పిల్లలు సర్దుకు పోవటంతప్ప ఏమి చేయలేరు
ఇది కలియుగం కాలంతో తప్పక మారుతారు ఆడవారు
మొగవారు ఆడవార్ని ఆడిస్తున్నందుకు
అమాయకులు చేసి ఎడిపిస్తున్నందుకు
ఆడవాలు భాదపడు తుంటే నోరెత్తనందుకు
ఆడవారి బొమ్మను వేసి నందుకు కోపమెందుకు
మబ్బులే మబ్బులు మబ్బులొచ్చినై
తబ్బిబ్బయ్యె నా మనసు దోచినై
తళుక్కుమన్నది నీ సొగసు
ఉరుములురిమి నను తరిమికొట్టినై
మెరుపుతీగ కొరడా జళిపిస్తే
మందవీడిన జింక పిల్ల విలపిస్తే
మనసు ఊరక పడుతుంటే
మబ్బులు.నన్ను వెక్కిరిస్తున్నట్టున్నాయి
కొండలోయలో చిక్కని నీడలు
గుంపులు గుంపులు నడుస్తు వుంటే,
గుండె లోతులో నల్లనివరవడి
గుట్టుచప్పుడు మదన పరుస్తున్నాయి
చిటపట మంటూ ఎండుటాకుల్లో
చినుకొక్కటి పడి చిటికాలు వేస్తుంటే
కోరికలే గుచ్చుకొని వెంబడిస్తూ ఉంటే
గాలి సవ్వడికి కదిలి హృదయవేదనను
తొలగించే మబ్బులే మబ్బులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి