".అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్" . (పోతనామాత్యుడు.) | ||
నేటి పద్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉగాది శుభాకాంక్షలు
శా:: వెల్గించే వెలుగే గృహంలొ మెరుపే ఇల్లాలి సౌశీల్య మే
వెల్గే దీపము లే సమస్త వెత లే తొల్గించు ఆదిత్య హృద్యమ్ము లే
తెల్గూ పద్యము లే మదుత్వ తలపే మేధస్సు మాధుర్య మే
వెల్గుల్ తో మదిలో నిజాన్ని తెలిపే ప్రేమత్వ బాంధవ్య మే
శా :: భావోద్వేగములే మనుష్య తరుణం వ్యర్ధము చెందేందు కే
నవ్యత్వం కళలే పటుఁత్వ వినయం సార్ధక సంతర్పనే
దివ్యత్వం సహనం సమాన చరితం ప్రోత్సాహ సంభావ్యతే
భవ్యత్త్వం భవితం నిరంతర మయం ప్రార్ధన ఆత్మత్వమే
శా:: గాంభీర్యం మన చుట్టు పక్కల సమా ధానమ్ము వర్తించుటే
గాంభీర్యం ఉడికే వయస్సు పరుగే శాంతి కి మార్గమ్ముయే
గాంభీర్యం మనసే ప్రవృత్తి గళమే విశ్వాస సాహిత్యమే
గాంభీర్యం మమతా మదీయ చరితం నిత్యాను సంభావ్యమే
దీక్షాదక్ష శివంకరీ సుమధురా శ్రీ దివ్య సంజీవణీ
అక్షీ క్షీరముఖీ ప్రియా ప్రియకరీ సర్వార్ధ ధర్మార్ధ ప
ద్మాక్షీ సాక్షి పరా మదీయ మమతా మాధుర్య సౌలభ్యమున్
శా :: శ్యామాభా సకలం సమోన్నతి కరీ సర్వోదయా సూత్ర సు
స్సమ్మోహా వినయా లయ స్థిరకరీ సర్వోన్నతా లబ్ది కా
ర్యోన్ము ఖ్యా తిశయా మహోజ్వల సమా రాధిత్య దివ్యాకరీ
ధర్మాధర్మ విచక్షతా సుమధురీ సత్కర్మ నిర్వా సిరీ
శా:: చూపుల్లో చురకా మనస్సు మమతా మాధుర్య మోహమ్ము తోన్
కైపుల్లో బిగువే వయస్సు తెగువే సౌందర్య దేహమ్ము తోన్
ఊపుల్లో సుమ మాలికా భవ భవ్యా జాలి తాపమ్ము. తోన్
లోగిల్లో కళ అందమే బతుకుకే ప్రోత్సాహ సేవమ్ము లున్
శా :: గోపాలా తరుణం మనో మయ సమా రాధిత్య సమ్మోహమే
నీపాపా నను నేను నా మనసునే అర్పించి వేడ్కోలులే
నాప్రశ్నా వినయా సహాయ సమతా మాధుర్య సౌలభ్యమున్
నేపాపాల్నిచెసే తరించు మనసే పుణ్యమ్ము నీప్రేమయే
శా :: శ్రీవారీ చిరు హాస మోన కళలే పండించి దీవించుమా
శ్రీవారీ మది మార్చి మా వయసులో సౌఖ్యాలు కల్పించుమా
శ్రీవారీ విధి నేర్పి మా మనసు లో సద్బుద్ధి ఇప్పించుమా
శ్రీవారీ శుభ శోభ మా కళల లో తృప్తీ యె సంతృప్తి యే
శా :: భావోద్వేగములే మనుష్య తరుణం వ్యర్ధము చెందేందు కే
నవ్యత్వం కళలే పటుఁత్వ వినయం సార్ధక సంతర్పనే
దివ్యత్వం సహనం సమాన చరితం ప్రోత్సాహ సంభావ్యతే
భవ్యత్త్వం భవితం నిరంతర మయం ప్రార్ధన ఆత్మత్వమే
శా :: రాధా కృష్ణుడుగా ప్రభంజన కళో సాకార సామాన్యతా
వేదాధ్యాయునిగా తపించిన మనో ఏకాంత సారూప్యతా
సాధ్యాసాధ్యునిగా మనస్సు మధనం చలించు చాపల్యతా
విధ్యాభోధకుడే సహాయా వినయం అన్యూన్య సంభావ్యతే
శా :: సంఘీభావ ముతో కరోన తరిమీ ధైర్యంతొ ఉందాములే
ఆఘోరం మనదాక రాదునులే కర్మా ను సారమ్ములే
విఘ్నాలే మనలో భయాన్ని తరిమే ఓర్పుతొ ఓదార్చు టే
సంఘంలో సహవాసమే రవి ఉషస్సూ మనో ధైర్యమే
శా:: నేనున్నా ననియే భరోస తెలిపీ ధైర్యంబు కల్పించుటే
మన్నించీ మనిషీ మనస్సు వినయం విద్యుక్త ధర్మంబులే
నిన్నానం ద కళే విశేష కృషి యే మేధస్సు కల్పించుటే
విజ్ణానం సహ మానవత్వ సుమధురం సధ్భుధ్ధి సాఫల్యమే
శా :: ఏమమ్మా పరచింత మాని మనసే అర్పించి ఉన్నాను లే
ప్రేమమ్మూ తెలిపే వికాస విధి లీలా మాయ కష్టాలులే
నామమ్మూ వచియించితే కల కళే కల్లోల కర్తవ్యమే
శా :: శ్రీ మాతే శృతజన్య సుతా వినయం సౌజన్య సౌందర్యమే
శ్రీ చక్రే సమతా స్థితాంత పరమే సద్బుద్ధి సమ్మోహమే
శ్రీ మాయ హృదయా విలోల విదితం బ్రహ్మాండ మేలేనులే
శ్రీ యుక్తే కర మాలికా కనికరం కర్తృత్వ కార్యార్ధిలే
శా :: విశ్వ శ్రేయ సు ధర్మ కాల వినయం పాండిత్య సాహిత్యమే
విశ్వాకార సమో జ్వలాది విదితం మాతృశ్రీ శ్రేయస్సుయే
దృశ్యా దృశ్య కరీ సమ్మోహ తరుణం కారుణ్య సద్భావమే
ప్రాశశ్యా లయమే తరంగిణి కరే సుశ్రావ్య ఆత్మత్వమే
శా :: కాలాంభోదకళాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశాం
ఆవృణ్వాన ముదార మందహసితస్యంద ప్రసన్నానం।
రాజత్కంబు గదారి పంకజధర శ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో! మద్రోగముద్వాసయేత్||
శా :: ఓంకారం స్వరమే మనో ఢమరుకం చాతుర్య శ్రీకారమే
శ్రీ కారం గళమే స్థిరోదయ లయా మాధుర్య హ్రిమ్ కారమే
హ్రిమ్కారం ప్రగతీ మనస్సు మమతా శ్రీ మాత ఘింకారమే
ఘింకారం వినయం వినాయకునినే ప్రార్ధించు మంత్రాక్షతే
శా :: రాధా మాధవుడే మనల్ని అణువంతా రక్ష దీక్షాత్ముడే
బాధల్లోని మనస్సునే మరులుగొల్పే సేవ శిక్షాత్ముడే
సాధ్యాసాద్యములే మదీయ మహిమా ప్రేమస్వ రూపాత్ముడే
విద్యాతత్వ మునే సుదీప్తి సహితా సంభంద భాందవ్యుడే
అమ్మా మా తలరాత ఇంతె అని నే చెప్ప లేకుంటినీ
ఏమ్మా నిన్నె జపించి తపించి మనో వాత్సల్యమే తెల్పితీ
మమ్మానంద పరచే మహా మహిత శక్తీ చూపి సద్బోధయే .....
శా : గోపాలా కృతియే సుమంగళ కరే రాధా మదీ గోచరే
కార్పణ్యం సుకృతం సుధా సుమధురం గోమాత సామీప్యమే
దర్పా దర్పణమూ అనంత కమలం సద్భక్తి కారుణ్య తే
ఉప్పొంగే ప్రేమయే మదీయ మమతా శ్రీ కృష్ణ రాధా మయం
(దర్ప=కస్తూరి)
శా నామమ్మే సకలం సమోన్నతి జయించే సవ్య మార్గమ్ముయే
క్షేమమ్మే వినయం సకాల విదితం ఆరోగ్య కారుణ్య తే
కామమ్మే చిరకాల వాంఛ తరుణం విద్యుత్తు ఉత్పత్తి యే
ప్రేమమ్మే మనిషీ మనోమయసమా సాహిత్య ఆనందమే .......
శా :: ఓం శ్రీ రామ్ అనుటే మనస్సు మయమై సంతోష సద్భుధ్ధియే
ఓం శాంతి అనుటే ఉషస్సు వెలుగుల్లే నిత్య సత్యమ్ము లే
ఓం శ్రీ మా తనుటే సమస్త కళలే నేర్పించు సద్భుధ్ధియే
ఓ శక్తీ అనుటే మహా మణిమయా ధర్మార్ధ వేదాంతమే.............
శా కృష్ణానీ తపనే మనస్సు చరితం చెప్పాలి ఆకాంక్షగా
ఇష్టంగా కథలే తపస్సు ఫలితం కల్పించి ఉన్నావులే
కృష్ణాశక్తిని యుక్తినీ కళలనూ తెల్సున్న రాముడ్ని మా
ఇష్టాల్నే తెలిసే మనో ఫలమునే తీర్చేటి దేవుండివే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి