28, మార్చి 2020, శనివారం



ప్రాంజలి ప్రభ 
తత్వసారము  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

దుర్గుణమ్ముల జోలికి పోగూడదన్నా    
అభ్యాసముతో ఇంద్రియాలను గెలుచోకోరన్నా
నియమనిష్టలతో సంసారము సలుపు చుండన్నా   
జపతపాదులతో చిత్తమంతయు శుద్ధియగునన్నా 

బ్రహ్మసత్యం జగన్మిధ్యా శాస్వితంబన్నా 
నశ్వరంబగు దేహజాలము శాస్వితం కాదన్నా 
పుణ్యకార్యములు ఆచరించి బ్రతుకునేర్చుకోరన్నా 
హృదయమందున్నా దేవుణ్ణి గాంచి ముక్తిపొందురోరన్నా 

జన్మ జన్మ సుఖ పాపములు వెంటవుండురోనన్నా 
బహు కాలమందు జీవితంబులు అంతమగునన్నా 
ప్రపంచ ఆకార్షణకు లొంగి భ్రమణం చెందకోరన్నా 
తన్ను తాను తెలుసు కొనక ప్రవర్తించుట వ్యర్ధమన్నా 

--((**))--











----
నేటి కవిత్వము  - "తరళము.. (8 )
 రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

దశరధ తనయడు పరిణయము కొరకు మిధుల నగరం 
విడిదిన కుల గురువుతొ  కలసి హృదయ కమలములనే
తనువు తపనల తడి పొడిన వయసు ఉరకలు తెలిపే  
రఘు కులజుని హృదయపు కళ అవని మనసు కలిపే  
       
రఘు కులజుని వినయ తలపు అవని మదిలొ అలలు గా 
పెరిగె కలల మలుపున చిరు నగపులతొ చిలికి నదే  
హృదయ తపనలు వనితలకు తెలిపి రఘుకుల పలుకే 
ఒకరి కొకరు కలసి మెలసి నగవులు కనులు కలిసే 

హనుమ కలసి రఘు కులజుని తొ వినయ పలుకు పలికే 
తరుణ కరుణ తెలిపి మదిలొ భవ భవములు కలియుటే 
కలసి మెలసి వన పతి కలసి చెలిమి తొ ఒక రొకరై      
ఒడు దుడుకులు తెలిపి కరములు గలిపి అవని కొరకై 

జయము శ్రియము కలుగు మనకు జనకజపతిఁ గొలువగా..
రయమున మిథిల దుహిత పతిఁ రఘుకులజుని మనమునన్..
భయముఁ దొలఁగు కలుఁగు సుఖము భరతవరదుని సతమున్..
నయఁపు భజన విధముఁ దెలిసి నరవరునిఁ గొలిచెఁదనే!!!"
      
--(())--




మ   శ  జ  గ  yati -6
UUU  IIU  IUI  U   
నేటి కవిత్వం - శుద్ద విరాటి    -7
సంసారాన్ని శు సంతసమ్ము తో
ధర్మార్దాన్ని సకామా చర్యగా
ఉద్యోగాన్ని సుధర్మ చర్యగా
ఆరోగ్యా న్కి సహాయ సేవలే   

శ్రీ మాతా తమ జన్మ కర్తతో 
శ్రీ వేదం తమ విద్య  వంతుగా 
శ్రీ యోగం తమ కర్మ తంతుగా 
శ్రీ కారం ఇక దైవ పూజలే 

సాహి త్యం పస సామ రస్యమే  
ప్రావిన్యం ఉప మాన సేవలే 
మాధుర్యం సమ మోజు తత్వమే 
సాధుత్వం  ధర్మ విద్య బోధయే 

కారుణ్యం ఒక పర్య భావమే 
సౌలభ్యం సుఖ సేవ లక్ష్యమే 
సమ్మోహం రస లజ్జ లోకమె 
విన్యాసం కవి కావ్య గౌరవం 

ఏం చెయ్యాలి మనస్సు  మారదే 
ఏ మాటా భయ మే  తలంపుగా  
ఏ మాయా మము కమ్మి ఉన్నదో 
ఈ కాలం మది తత్వమే కదా 

మనస్సును నిగ్రహించుకొని 
కరోనాను తరిమేద్దాం - 
ఆరోగ్యంగా జీవిద్దాం  
--(())--
నేటి చిత్ర0 పద్యాల వర్ణన   ...6 20--11--2020
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
Beautiful Pencil Drawings Of Kerala Radha Krishna Mural Pencil - Kerala Mural Painting Sketches

నేటి కవిత్వం -. మనోహరి (6) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మందారం లా విరబూసే నీ  తనువూ  
సిందూరం లా తనువంతా ఓ మెరుపూ
నీ చూపే  నా మనసంతా ఓ కుదుపే 
సిగ్గాయే  నా కలలో నీ స్పర్శ లతా    

సింగారం లా మరుగొల్పే నీ మనసే   
నాంచారీ లా ఉసిగొల్పే నీ సొగసే 
బంగారీ  లా మెరుపుల్తో  నీ తనువే 
వయ్యారి లా నడకల్తో  నీ నడుమే 

ఉద్వేగం చెందుట శృంగారం వలనా 
రాద్ధాంతం చేయుట ప్రేమావల్లె కదా 
సందేహం తీర్చుట సంతోషం వలనా 
 ఉద్దేశ్యం  మంచిది చెల్మి వల్లె కదా

ఊహల్లో ఊపుల వయ్యారం చెసే   
రాగాలు పువ్వుల ముద్దూలే చెసే 
అద్దంలా నవ్వితె నవ్వుల్తో  చెసే  
ఈజన్మే మాధవు సొంతంలా చెసే

శృంగారం చిందులు వేయుటే అబ్బో 
అంగాంగం అందాలు చూపటం అబ్బో 
వాగ్వాదం ఉల్లాస ఉత్సవం అబ్బో 
వాగ్గేయం ఉత్త్సాహ వైభవం అబ్బో 

 తెల్లని వెన్నెల విరియుచు విశ్వమంత
ఇసుక తిన్నెలు పిరుదులు కదులు చుండె
 జడల లోని మల్లెల పరిమళము వీచి
 సరస విన్యాస వాంఛకు పిలుచు చుండె

 కోరమీసము తిప్పుట కాదు కామ్య
 భావ ముతొ ఉండి సరసము తీర్చి సొగసు
 సొమ్ము రొమ్ముల సొంపుల ఆరగించి
 మగసిరి విలువ చూపితేను చాలు వీర

రాధ నేనేను నువు కౌగిలింత పొందు 
భాధ వలదులే సౌందర్య మంత నీకె 
గాధ అనుకోకు బోధగా తెల్పు చున్న 
వ్యధ వదులుము సుఖమును పొందు మిపుడు  

--(())--


UIUII UIU  UI  UI  

నేటి కవిత్వము -  హాయి
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ  

నిన్ను నిన్నుగ చూడగా నేను లేను
నేను నేనని తల్యంగా  నీవు లేవు
నీవు నేనను దృష్టి యే  నిల్చి పోవ
నన్ను నీవని చెప్పంగ శక్య మౌన 

కాల మాయకు అందరూ చిక్కి నట్టె
వాన నీటికి అందరూ తడ్సి నట్టె  
ఎండ గాలికి అందరూ మాడి నట్టె 
అగ్ని వాడక ఎవ్వ రూ బత్క నట్టె 
    
రాజ కీయపు రంగులే  నీకు వద్దు 
కాయ కష్టము నమ్మియే  ఆశ తీర్చు 
మారు పల్కక చెప్పెదే దేదొ చేయి
కారు చీకటి  మారునే వెలుగు వచ్చె

పాలు నిచ్చు గొ సంతతీ బాధ చూడు 
ఊలు నిచ్చిన గొర్రెల బాధ చూడు 
మేలు చేసెడి పెద్దలా  బాధ చూడు 
వేలు ఖర్చులు మంచికే చేసి చూడు 
    
రోజు లన్నియు ఒక్క మాదిరే చూడు 
దేని గూర్చియు ఆశ పెట్టు కోకుండు
సేవ చేసియు కోర్క తీర్చియు చూడు      
మంచి చేసిన వాడికే హాయి గుండు 

--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి