30, మార్చి 2020, సోమవారం


రామా ప్రస్తుతం కరోనా మహమ్మారి తాండవిస్తున్నది మా ప్రవర్తన ఈ విధముగా ఉన్నది నీవే రక్షా " మందాక్రాంతః--- ప్రేమత్వం వళ్ళ మనసుకు మాయా కల్లోలంబు అయ్యే స్నేహత్వం వళ్ళ వయసుకు మాయ పరాధీన మయ్యే సామరస్యం వళ్ళ తనువుకు మయా విలోలమ్ము అయ్యే కారుణ్యం వళ్ళ వారుసుకు మాయా చెలో అంటు వెళ్లే ఏంచెయ్యాలో తెలియక వినోదం విషాదాన్ని వింటూ కాలాన్ని మార్చుట ఎవరికీ రాదు ధర్మాన్ని నమ్మా ఈమాయా ఎవ్వరిని వదలదే కాని సత్యాన్ని నమ్మా సందర్భంలో వినయ సహనం చూపి జీవించు చున్నా ----- "రామా " నీట ముంచిన పాల ముంచిన నీవేదిక్కు భద్రాద్రీశో మిథిలజ పతిశ్శైవ సంబంధి భేదీ, కాకుస్త్థోऽయం కపివర వరేణాంజనేయేన సేవ్యః! సౌమిత్ర్యగ్ర్యో భరత వర రాజ్యాభిషిక్త స్స (:) రామః , ఐక్ష్వాకోऽయం సుపరి విశదఃపాలకో రక్షతాన్నః ( రక్షతాత్+ నః )!!! --(())--






Comments





IIUU UIII -  IIUI UIII - IIUU UIII -  IIUI UU    
*స్త్రీ పురుష తత్త్వం

కనుపాప చూపులకు - కమనీయ సౌరభము  
చిరునవ్వు చిందులకు - కమనీయ శోభా  
విరజాజి పువ్వులతొ - కనువిందు చేయుటకు
సువిశాల వెన్నెలలు - కురిపించే రావా

మనసార మంగళము - మమతాను రాగమును  
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
మదిలోన మాటలను - మధురాతి వాసనతొ  
మకరంద మాలికతొ   -  సుఖమివ్వ  రావే

సిరులెల్ల వచ్చుటకు  - సిరివాణి మాటలతొ
సరసాలు పంచుటకు - మధురంగ  మారే
మనసున్న చిన్నదియు - మనసంత మౌనముగ
మదిలోని  ఊహలను -  కురులుప్పి చెప్పే
       
విరిదండ దాల్చుకొని - చరణాల నందియల -
సరసాల నందముగ - దరిరమ్ము దేవీ
వరవీణ మీటుచును - స్వరమాల నల్లుచును -
హరుసమ్ము జల్లుచును - వరమిమ్ము దేవీ

సిరివాణి హృల్లయల - సిరులెల్లఁ జిందిడుచు -
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
తరుణేందు బింబ నవ - కిరణాల సోయగపు -
చిఱునవ్వు వెన్నెలల - కురిపించ రావా

వలపొక్క యాటయగు - వలపొక్క పాటయగు -
వలపొక్క బాటయగు - నిల జీవమందున్
వలపొక్క భావమగు - వలపొక్క రావమగు -
వలపొక్క నావయగు - నిల జీవమందున్

వలపొక్క యాసయగు - వలపొక్క లాసమగు -
వలపొక్క రాసమగు - నిల జీవమందున్
వలపొక్క పుష్పమగు - వలపొక్క ఖష్పమగు -
వలపొక్క బాష్పమగు - నిల జీవమందున్
(ఖష్పము=కోపము)

అనుమాన మయ్యదియు - పెనుభూతమౌను గద -
విను నీకు సందియము - మనమందు వద్దే
కనుముందు నుండునది - కనుపించుచున్నదియు -
ననిశమ్ము నిక్క మవ - దని చెప్పుచుంటిన్

నిను దప్ప నేనెవరిఁ - గనలేదు నా సకియ -
విను మొట్టు నీపయినఁ - గనకాంగి యుంతున్
మునువోలె నిర్వురము - మనుచుంద మిఁకమీఁద -
నని చెప్ప నా ప్రియుఁడు - విని యామె నవ్వెన్
--((*))--




నేటి కవిత్వం - ప్రేమే 

రచయత- మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 ప్రేమే సత్యం  ప్రేమే  నిత్యం - ప్రేమే  దైవం  ప్రేమే మౌనం 
ప్రేమే సృష్టి   ప్రేమే దృష్టి  - ప్రేమే నిజం  ప్రేమే భుజం  

ప్రేమే కల ప్రేమే  వల - ప్రేమే జత ప్రేమే కథ

ప్రేమే మతి ప్రేమే గతి - ప్రేమే నీతి ప్రేమే జాతి   

ప్రేమే ధృతి ప్రేమే శృతి - ప్రేమే ఇఛ్ఛ ప్రేమే స్వఛ్ఛ

ప్రేమే భ్రమ  ప్రేమే బ్రాంతి - ప్రేమే మట్టి  ప్రేమే మిట్టు 

ప్రేమే మడ్డి ప్రేమే మబ్బు  - ప్రేమే మాలె ప్రేమే మిత్తి 

ప్రేమే మర ప్రేమే మల  - ప్రేమే మస్తి ప్రేమే మారి 
   
ప్రేమే ముద్దు  ప్రేమే ముత్త - ప్రేమే మూట ప్రేమే నోరు 
ప్రేమే మేర ప్రేమే మైదు - ప్రేమే మైల ప్రేమే మొక్క 

ప్రేమే మోము ప్రేమే మోక్ష - ప్రేమే మ్రింగు ప్రేమే మ్రుచ్చు 

ప్రేమే బొర ప్రేమే బ్రద్ద  - ప్రేమే మాట ప్రేమే మాయ 

ప్రేమే రంగు పెమే రంతు - ప్రేమే రతి ప్రేమే రంధి 

ప్రేమే రవ్వ ప్రేమే రాణ - ప్రేమే రభ ప్రేమే రచ్చ 

ప్రేమే రేయి ప్రేమే రసి - ప్రేమే రేసు ప్రేమే రొద 

ప్రేమే రంకు ప్రేమే రజ్జ - ప్రేమే లచ్చి ప్రేమే లజ్జ 

ప్రేమే లాలి ప్రేమే లివ - ప్రేమే వచ ప్రేమే వజ

ప్రేమే వెడ ప్రేమే వెన్న - ప్రేమే వేగ ప్రేమే వేట   


ఆశ అనేది కోరిక - పాశం అనేది బంధం 

కోరిక అనేది జీవనం - బంధం అనేది కలయిక 
కలయిక రావాలంటే జీవనం ఉండాలి 
అదే శృంగార సమ్మోహం దీన్నే ఆశాపాశం 
ఇదే కుటుంబ ఇదే నాశనం  



--(())--

నేటి కవిత: ప్రేమ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కాలంతో కరగదు ప్రేమ
మోనంతో విడువదు ప్రేమ
మోసంతో కలవదు ప్రేమ
స్నేహాన్నీ మరువదు ప్రేమ


హృదయం కదిలించేది ప్రేమ
తరుణం కుదిపించేది ప్రేమ
వినయం తలపించేది ప్రేమ
తపనం తొలగించేది ప్రేమ


వేదంలా బోధించేది ప్రేమ
నాదంలా శోధించేది ప్రేమ
తాపంలా శోషించేది ప్రేమ
గానంలా పాడించేది ప్రేమ


కావ్యాలలో కన్పించేది ప్రేమ
సాహిత్యమే కల్పించేది ప్రేమ
చాతుర్యమే విన్పించేది ప్రేమ
భాష్యాన్ని యే పల్కించేది ప్రేమ


కోపంలో కోపంతో ప్రేమ
తాపంలో తపంతో ప్రేమ
వేషంలో వేషంతో ప్రేమ
మోసంలో మోసంతో ప్రేమ


గుణంలో సద్గుణమే ప్రేమ
జపంలో జాడ్యముయే ప్రేమ
గళంలో గానముయే ప్రేమ
ఋణంలో తీర్చుటయే ప్రేమ


కన్నతల్లి అందించేది ప్రేమ
కన్నతండ్రి వాదించేదీ ప్రేమ
కన్నబిడ్డ చూపించేది ప్రేమ
సాధ్వి స్త్రీ యె కామించేదీ ప్రేమ


ఉచ్చెశ్రవంబు బగదించే ప్రేమ
స్వచ్ఛధవళకాంతులీను ప్రేమ
అచ్ఛంపుపుష్పగుచ్ఛము ప్రేమ
ఉచ్ఛవిరాణ్మూర్తి హసిత ప్రేమ


భక్తాళి కమ్యార్ధ సుగమ్య ప్రేమ
ముక్తిప్రదాతరమభీష్ట ప్రేమ
ఐశ్వర్య సందాయక కల్ప ప్రేమ
వేదాంత వారాశి కలచప ప్రేమ


వేదాంత సారదాయీ ప్రేమ
తాదాత్మజ్ణానదాత ప్రేమ
వేదోపవేదగమ్య ప్రేమ
వేదాత్మ విశ్వాస ప్రేమ


కమలదళవికసిత ప్రేమ
అమలచరితగుణ ప్రేమ
కమలాప్త కుశల ప్రేమ
కామ్యప్రదాత చూపే ప్రేమ


త్రివిధ గుణరూప ప్రేమ
త్రివిధపు శక్తి స్వరూప ప్రేమ
త్రివిధపుటవస్థ కల్ప ప్రేమ
త్రివిధపుతాపాంతరంపు ప్రేమ


--(())--

నేటి కవిత్వం - నంది - యతి -5 

 UII  uUI  IUI  U  

కాలము నీ వెంట పడేను లే

ఎందుకొ నీ ప్రేమ మనస్సు లో 
వేదన  పెర్గేను లె కాంతి యే
లేకయు ఉండెను లె ఇప్పుడే 

కాదులె నావెంట నె నీవు వు 

న్నావుగ బాధంత ని కోసమే 
నీ దరి చేరేందుకు శోకమే  
అందుకె  దేహాన్ని ని కోసమే 

భక్తికి యోగానికి కాలమే 

శక్తికి కారుణ్యత భాధ్యతే 
యుక్తికి ధర్మానికి మార్గమే
ముక్తికి మోక్షానికి వేదమే 
  
కోపము తో చెప్పుట ఎందుకే 
తాపము తో పల్కులు మానుకో
లోపము తో వెద్కుట  ఎందుకే 
పాపము  తో పంచుట మానుకో 

ఏమని చెప్పేది ని మాయకే

చిక్కితి తప్పించుట లేకయే 
ప్రేమను పంచాను మనస్సునే
పంచుట ఆనందము యే కదా 

కర్తకు కాపాడుట శక్తియే 

కర్మకి కోపానికి ఓర్పుయే 
శాంతికి మోనానికి దారియే  
కాంతికి చీకట్లను ఛేదనే 

--(())--

  
    
నేటి కవిత - దారి 
రచయత: : మల్లప్రగఢ శ్రీదేవి రామకృష్ణ 

మెతుకు కొరకు వెలుగు దారి...

బతుకు పరుగు కలుగు దారి
కళకు విలువ తరుగు దారి
పలుకు విలువ మెరుగు దారి  

పడుతున్నది బతుకు బండి గోదారి 

అలుపన్నది  కనక వింతలో దారి
చెమటన్నది పడక  దిక్కు లే దారి 
చినుకన్నది  కనక రోగమే దారి     

విదేశాల వలస వెనక దారి 

వినోదాల  కునుకు పడక దారి 
అశోకాల నిలువ నడక దారి 
చమత్కార చిరుత పరుగు దారి 

దిక్కులేని నేలతల్లి. దారి 

చిక్కు లేని వేశ్యభోగ దారి
పక్క లేని  పేద తల్లి దారి
కక్క లేని బత్కు తల్లి దారి 

అంతులేని ఆశముందు దారి

పొంత లేని భోధయందు దారి  
చింత లేని కాటి యందు  దారి  
కాంతి లేని వేద మందు దారి 
   
బంధ మన్నది ఏర్పడని దారి
కాల మన్నది తోడ్పడని దారి
ప్రేమ అన్నది కన్పడని దారి
ఆశ అన్నది  బైల్పడని దారి 

కొన ఊపిరి తాటిపైన.దారి 

జప మన్నది  నీటిపైన దారి
పలు కన్నది గాలి పైన దారి
బతు కన్నది నిప్పు పైన దారి 

దేవా వినే తీరిక లేని మాదారి 

దేవా కనే  ఓపిక లేని మాదారి  
దేవా చెసే వీలును లేని మాదారి
దేవా పనే  దొర్కుట లేని మాదారి

సముద్రపు దారిలో చిక్కా౦ 

కరోనా దెబ్బకు దారి లేక ఉన్నాం 
నీవే రక్షా అని వేడు కుంటున్నాం 
దేవా మాదారి నీ దారిగా మార్చుకో

నీట ముంచిన పాల ముంచిన నీదె భారం 
ఏడుకొండల దారి కూడా ఆపావా దేవా 
నిను చేరే మార్గం నీవే చెప్పాలి దేవా 
కాలధర్మాన్ని బట్టి నడిపే దారి నీదె కదా 

--(())--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి