23, మార్చి 2020, సోమవారం

555


        


గణములు- జ,త,జ,గగ 
యతి - 6 

-- I U I  U U I I U I U U 
వినోద భావా విమలా గళత్రామ్
సమాన హోదా సమతా పవిత్రామ్
విశాల సేవా విన తా జపత్రామ్
సకాలం నేతా సరితా కళత్రామ్

 ప్రభాత కాంతే  ప్రగతీ సుమిత్రామ్
ప్రబోధ విధ్యే  ప్రతిభా సునేత్రమ్ 
 అనేక రూపం మమతా నురాగమ్ 
గుణాలరూపం కరుణా లనేకమ్ 

సరోజ నేత్రమ్ సుమతీ సుమి త్రన్ 
మరాళ యానమ్ మధు మం దహాసమ్ 
విరాజ మానమ్ విబుధాది వంద్యామ్  
వరప్రదాం తమ్ ప్రణమామి దేవీమ్ 

అనేక రూపా మనురా గపూర్నమ్  
గణాధిపాలమ్ కరుణాలవాలమ్ 
వనేజ వాసమ్ భవరోగనాశమ్  
ప్రణౌమి భక్త్యా బహుళార్థ దాత్రిమ్ 

విధాతృ పత్నీమ్ విమలైక మూర్తిమ్  
సదా పవిత్రామ్ స్మరణేన తుష్టమ్ 
సుధీ ప్రకాశామ్ సుమనోహరాంగిమ్  
సదావలాంబామ్ స్తవనమ్ కరోమిమ్  

అనాది విద్యా మవిచింత్యమానామ్  
మునీంద్ర స్తుత్యామ్ ముదితాంతరంగామ్ 
సునాదమోదాం సువిశాల దృష్టీమ్  
అనారతం తాం అనుచింతయామ్  
       
--(())--
  




నేటి కవిత్వం - కరోనా 

వల్లవీవిలాసము - ర/య/య/గగ UIU IUU - IUU UU
11 త్రిష్టుప్పు 75

కాలమే  సరాగం - సమానం కాదా   
సేవయే నినాదం - సుసీలం కాదా
ప్రేమయే సకాలం - సుతారం కదా 
పాపమే వికాసం - నిదానం కాదా  

అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదా
చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా  
పందెమే మనమ్మున్ - కుదించెన్ గాదా 
ఎందుకో సుఖమ్మున్ - ఖరీదున్ గదా 

రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్
కాల మాయ చూపెన్ - మనమ్ముల్  జిందన్ 
యోగవేళ వచ్చెన్ -  యుగాదిన్ నాడే 
శాంతి దూత చెప్పెన్ -  సుమమ్ముల్ విచ్చున్ 

పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా
నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా
మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్
వల్లవీ విలాసం - బవంగా రావా

విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్
సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్
పల్కులన్ మదించున్ - మనోసమ్మతిన్
చినుకులన్ చలించెన్ - సహాయమ్మునన్

నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్
రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్
శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే
రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే

--(())--


Radhakrishna Love 1, Painting by Sanjay Tandekar | Figurative artwork on Acrylic On Canvas | BestCollegeArt
మాత్రా బద్దము (1)
IIU IIUII UI
నేటి కవిత - లోకంలో పోట్లు -పాట్లు

మనిషీ అనురాగము జోలు
 - మతిలేకయు చిక్కిన పట్లు
కలమాయను రోగము జోలు
- గతిలేకయు చిక్కిన పట్లు

కుల మంతయు గోలను చేసి
- కను మాయకు చిక్కుట కెట్లు
విధి బోధయు అంతయు తెల్పి
 - తనువంతయు చిక్కుట కెట్లు

మది మాయను వేలము వేసి
 -  మది తప్పియు  శీలముతూట్లు
విధి లేకయు  గాలము వేసి
-   కల కాలము రోగము పోట్లు

చిరు దీపము చీకటి చీల్చె
 - చిరు నవ్వులు మాయకు తూట్లు
శిఖ పింఛము అందము పెంచె
- శిఖ పట్టులు తన్నుల పోట్లు


గురు సేవయు చేసిన మంచి
 - గురు పాదము పట్టిన పాట్లు 
గురు పత్నిని కోరిన తప్పు
 -  గురు పత్నిని తిట్టిన పోట్లు 

సమభావము పెంచిన మంచి
- సమ యోచన తెల్పినపట్లు
సమరాగము  పల్కిన మంచి
 -   సమ సేవలు చేసిన పట్లు

గిరిగీచుక కూర్చొనఁ బోకు
- సరి లేరని నాకెవరెట్లు
మరి యాదగ నుండుట మేలు
-  ధరనెచ్చట నున్నను పాట్లు

--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి