23, మార్చి 2020, సోమవారం

chanaddassu



ప్రాంజలి ప్రభ

సర్వేషాం శర్వరీ నామ నూతన సంవత్సరారంభావసరే ఉగాది శుభాశయాః.

"శార్వరి శుభములు నొసఁగును..
శర్వాణి కృపాకటాక్ష సంపద చేఁతన్!
పర్వఁపుసుశాంతి కలుఁగున్..
ఖర్వమగు మదాతిశయము కాపురుషులకున్!!!"

శర్వరీ శం చ వో దద్యాత్
నీరోగాచ్చ శుభాశయాత్|
కృత్వా విఘ్నాని నిఘ్నాని
కార్యలాభం ప్రదాస్యతు||

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

శర్వుని రాణి పేరుగల శార్వరి నిండగ సస్యసంపదలీ
యుర్విని రాగదే సుఖము లొప్పనికన్ కరోనకున్
గర్వము భంగమౌనటుల కామిత మీయగ నీదు రాకకై
సర్వులు వేచినారిటను శక్తివి నీవని పిల్వనెంచుచున్

శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మత్తకోకిల శాంతి దూతగ కూత కూసెను శార్వరీ
మత్తు పెంచును హాయి గొల్పును సృష్టి నేస్తము శార్వరీ
చిత్ర మాలిక చింత తీర్చును బుధ్ధి పెర్గును శార్వరీ
స్థితి మారి ఉగాది శోభలు నిత్య సత్యము శార్వరీ

--(())--



శార్వరి వచ్చి కరోనా ను తరిమి కొట్టాలని ఆశిస్తున్నాను ! అందరికి ఉగాది శుభాకాంక్షలు.

ప్రాంజలి ప్రభ - karona

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నేటి పద్యము - కరోనా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పంది చంపియు పందె రమ్ముగ మెక్కి ఉండుట రోగమే
పందె రాయలు గొప్ప లన్నియు  చెప్పి మింగుట రోగమే
కంద కాకర తెలు పాములు  వంద మించియు తిండియే 
సందు దొర్కిన విందు చేసి కరోనా పలు విస్తరే                

చెర్చ లేదిక మందు వాడుట ప్రాణ పోకడ ఒక్కటే      
మూర్ఛ రోగికి మందు ఉందియు శుభ్ర మన్నది లేదులే 
మార్చి చెప్పిన మూర్ఖ వానికి బుద్ధి కెక్కదు ఎందుకో
చేరి ఉండిన చెత్త నంతయు తీసి మాటుగ ఉండిపో    

చెప్పు మాటలు నేను నమ్మను అన్న వానిగ ఉండకూ  
వప్పు ఏదియు తప్పు  ఏదియు తెల్సి ఉండియు ఆడకూ
మెప్పు కోసము  అంటు రోగము  ఎక్కి రించిన పాపమే
చిప్ప కూడును తిండి  ఉన్నను రోగ మొచ్చిన తగ్గదూ


మట్టి కుండయు తాత మాటయు అమ్మ పల్కుయు నమ్ముట            
వట్టి వాగుడ నేమనస్సును మాయ చేయుట ఎందుకో
ఇంట గెల్చియు రచ్చ గెల్చుము పంత మెందుకు మానుకో         
లొట్ట పిట్టల కూత లన్నను మంచి కోరుము ముందుగా     



నేటి కవిత్వం - రథము
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి 
--(())--

ప్రాంజలి ప్రభ 
రామకృష్ణ మల్లాప్రగడ 

పవళింపగ రారా ముద్దు కృష్ణా
మనసిచ్చెద రారా బాల కృష్ణా
కరుణించగ రారా గోల కృష్ణా
వినిపించెద రారా వేద కృష్ణా

కంటి కాటుక చెదర నీకురా
కాళ్ల గజ్జలు కదల నీకురా
కళ్ళు మాత్రము ముదర నీకురా
గంధ పూతలు కదల నీకురా

రంగ రంగ శ్రీ రంగ రారా
కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ. రారా

నీ మనస్సే మనోవేగం 
నీ వయస్సే మనోకాలం 
నీ ఉషస్సే  మనోత్తేజం 
నీ యసస్సే మనో భావం 

పుట్టినా రోజు ఆనందం 
అందరూ కల్సె సంతోషం  
చిందులే వేసె సందర్భం 
చిన్నాపెద్దా సమానాట్యం 

పుట్టినా రోజు పండుగే 
నవ్వులా పువ్వు విచ్చెనే
బంధువుల్ స్నేహితుల్ శుభా- 
కాంక్షలూ తెల్పె వేలగా

మబ్బులూ కమ్మినా వేళా -
వర్షమూ కుర్సినా వేళా
కోర్కలూ వెల్లువై వేళా -
శోభలే చిందులై వేళా 

రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్
జిమ్మ పీయూషముల్ సొంపై
సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-
మమ్ముతో నుండఁగా ధాత్రిన్

నీల మేఘమ్ము లీరాత్రిన్
నేల యాకాశమున్ జేరెన్
చాలు నీయాట మాయావీ
పుట్టినా రోజు  రావేలా

దివ్య సందేశ కొల్వులే -
త్రాగి నాట్యమూ చేయుటే
 సామ రస్యాను సేవలే - 
శోభ కల్పించే వెల్గులే

కంటి కాటుక చెదర నీకురా
కాళ్ల గజ్జలు కదల నీకురా
కళ్ళు మాత్రము ముదర నీకురా
గంధ పూతలు కదల నీకురా

రంగ రంగ శ్రీ రంగ రారా
కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ. రారా



 --((*))--  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి