29, మార్చి 2020, ఆదివారం




నేటి ప్రాంజలిప్రభ కవిత్వం
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

చూడ నీలోన నాలోన జ్యోతి ఒకటే
ప్రేమ చూపించు దేవమ్మ జ్యోతి ఒకటే
కాల మాయల్ని తొల్గించు జ్యోతి ఒకటే
మానవత్వాన్ని రక్షించు జ్యోతి ఒకటే

లోకం లో ధర్మ ప్రవర్తన కు జ్యోతి ఒకటే
కాలం లో సత్య పల్కందిచుట జ్యోతి ఒకటి
స్నేహం లో న్యాయ పోరాటముకు జ్యోతి ఒకటే
విశ్వం లో వేద బోధాంమృతపు జ్యోతి ఒకటే
సంసారం లో దక్షత కర్తవ్య జ్యోతి ఒకటే
సంగీతం లో రక్షిత కారుణ్య జ్యోతి ఒకటే
సమ్మోహం లో అర్పిత భావత్వ జ్యోతి ఒకటే
సల్లాపం లో సంతతి ధారుడ్య జ్యోతి ఒకటే
పత్తీ పత్తి కల్పిన వచ్చే పత్తి జ్యోతి ఒకటే
పతి పత్ని కల్శిన వచ్చే బిడ్డ జ్యోతి ఒకటే
మంచు అగ్గి కల్శిన వచ్చే ద్రవ జ్యోతి ఒకటే
నింగి నేల కల్శిన. వచ్చే బ్రహ్మ జ్యోతి ఒకటే
అంతర్జాతీయ స్థాయిలో వెలిగే జ్యోతి ఒకటే
ఆత్మతత్వపు బోధ లో వెలిగే జ్యోతి ఒకటే
ప్రేమ తత్వపు స్త్రీ లలో వెలిగే జ్యోతి ఒకటే
హృద్యతత్వపు ప్రేమలో వెలిగే జ్యోతి ఒకటే
అంధకారాన్ని తరిమే జ్యోతి ఒకటే
కళ్ళు కళ్ళు కల్శొచ్చె జ్యోతి ఒకటే
--(()) - -
III  UIU IUI U     
నేటి  కవిత్వం - మనోరమ -     యతి - ౬

ఒకటి చెప్పగా మరోకటే
తెలిపె రెండుగా మనస్సు నే
కలిపి మూడుగా వినాళిలే 
అనియు తెల్పుటే నిజాలులే

పటిమ చూపుట వయస్సులో 
కలసి వచ్చుటే  సరాగ రా 
గేములు పల్కుటే  విశాల వా 
హినిగ బత్కుటే నిజాలుగా 

కలువ మార్పులే సువాసనే 
సుమధురం మనోమయం త రిం 
చుటకు ఆశ సౌధమే సదా 
మమతా చూపుటే సుఖాలయం 

చెలిమి శాంతి కోసమే కదా 
కలలు తెల్పుతూ విశాల హృ 
ధ్యమును పంచుటే సకాల మూ 
కలసి ఉండుటే సుఖాలయం

యువత కొరికే నిరంతరం 
కళలు పెంచుట వికాస సా
హసము పెర్గుటే శుభోదయం 
చెలిమి సేవలే సుఖాలయం 

--(())--
         




ర     స      స         గ
UIU  IIU  IIU  U 
నేటి కవిత్వం - మణి రంగ - 15,   యతి -6
రచాయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ       

దైవమా మము చూడుము నీవే  
ఇంటిలో  సతి బిడ్డల మధ్యే 
కాలమే మము ఉంచెను కాదా  
లోకమే మము భాదలో ఉంచే 

దైవమా మము శక్తి  కరోనా 
వెంటాడే  తమ యుక్తి ఇదేనా
ఏంచెయ్యా లని నా న వ భక్తీ 
మార్గమ్మే మము రక్షణ చూపే 

కార్య శక్తి మనో మణిరత్నం 
దివ్య శక్తి తపో యువ జాడ్యం 
కర్మ ముక్తి కళా గురు చర్యం 
ధర్మ సాక్షి సదా సమ భోజ్యం 

దైవమా ఇక మా తల రాతా
మార్చాలీ మది లో భయాన్నీ 
తీయా లీ  విధి ఆ డె  ఆటే 
మారాలీ ఇక  వేళ్ళు  కరోనా    

సేవాభా వము  మాకు మ మేకం   
ప్రాణాల్నీ ఇక రక్షణ మార్గం 
దేహాన్నీ ఇక పోషణ లక్ష్యం 
 దైవాన్నీ ఇక నమ్ముట ధ్యేయం 

 --(())--




నేటి కవిత్వం - వణవ .... యతి -5 
UUU  - III - IUU - U      

ఏమండోయ్ వయసు ని పంచాగా 
కోపమ్మే  మరచి యు  నీ వెంటే
ఉంటూనే వలపు ను అందిస్తూ 
శృంగారం తొ తనువు అర్పిస్తా 

శ్రీవారూ చక చక కానివ్వం      
డీ ఆలస్య ము అమృ తం కూడా
చేదేలే కనుక నె తొందర్తో 
కళ్ళల్లో  నె కరుణ చూపిస్తా  

నేర్పూ ఓర్పు కలిగె చేష్టల్నే 
మంచీ చెడ్డ  మలుపు వెంటాడే 
తీర్పే చెప్పి మనసు మార్చావే 
సౌందర్యం  సమముగ పొందాలే  

న్యాయంగూర్చి పలుకు చెప్పొచ్చా 
నీ వేషం తిరుగు డు ఎండేశా
నా నాకష్ట మును  మరచీ ఉండే 
నీ ధైర్యం  కళలను తీర్చిందే 

కాలాన్నే వలపు తొ పండించీ
వేగాన్నే  మనసు తొ జోడించీ
మోనాన్నే వయసు తొ భేదించీ 
సంతోషాన్ని సమము చేసేద్దాం 
          

--(())--



న    త   త    గ  
 III  UUI  UUI  U     
నేటి కవిత్వము - కౌముది - 13   యతి -5
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పరుగు తీసేటి కాలాన్ని ఆ
పుటయు ఏ దైవ ధర్మాని కీ 
లెదుగ  నా శక్తి  నీ ప్రేమకీ
కళలు తీర్చేటి నీ భక్తి యే 
     
సెగలు కమ్మాయి నా వెంటనే 
పొగలు చుట్టాయి నీ చుట్టూనే
కధలు మారాయి నా బత్కుకే 
మడత కాజాను  ఆసించుటే 

పనులు కల్పించు కుంటూ కదా 
కళలు పండించు  కుంటూ అదే 
క్రమము కల్పించు సేవా సదా 
తనువు చైతన్య పర్చే శక్తే 

మనసు పండించు ఆరాటమే 
వయసు పొంగించుఁ పోరాటమే 
సొగసు కోరేటి మత్తేది  యో 
నిజము చెప్పేందు కే ప్రేమయే 

ఇది నిజం ప్రేమ మాధుర్యమే 
 కలసి సంతృప్తి పొందేందుకే 
సహన ఓదార్య మే సామర 
స్య కళ ఉద్దేశ్య రేతస్సు పంచే 
  
--(())--



నేటి కవిత్వం - మానిని యతి 12  
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

1. స్త్రీలకు మానము ప్రాణము, లాలస  శీలము సౌఖ్యము సిద్ధము గా 
     నేర్చిన విద్యలు ఎప్పుడు చెప్పిన  కప్పుడు పంచుట తధ్యము గా 
     చూపును సఖ్యత భావము, కోరుచు  శాంతము ఓర్పుతొ ఉండును గా  
    ప్రేమను పంచుట మంచితొ తత్వపు పల్కులు స్త్రీలకు సొంతము యే 

2. తల్లియు తండ్రియు  అత్తయు ఆశతొ మామను చూడక తప్పదు గా 
    మల్లెలు మొల్లలు జాజులు నిత్యము  కొల్లలు పూజకు తప్పదు గా 
    కమ్మని తెమ్మెర గుమ్మని  మంచికె వాసన పీల్చక తప్పదు గా 
   పెద్దలు చిన్నలు అందరి పాపపు పుట్టుట మెట్టుట తప్పదు లే 

3. అట్టలు వేసిన, తట్టలు  బుట్టల మోసిన,మట్టిని తవ్విన నే 
     గుంతలు పూడ్చిన, మొక్కను నేరుగ నాటిన, గుట్టలు కట్టిన నే 
     కష్టము తప్పదు, లాభము  పొందక గిట్టదు, తిండికి కష్టమె గా 
     పేదల భాదలు, ఎవ్వరు తీర్చరె చూడరె , లోకము తీరుఇదే 

--(())--

నేటి కవిత్వం

రాత్రి కురిసింది చిరు జల్లుల వాన
ధాత్రి తడిసింది మరి మల్లెల బాట
మైత్రి కలిపింది జల బిందువు ఆట
అత్రి విరిసింది మది పొంగుల వాట

దుమ్ము దులిపింది గిరి కాంతుల వాన

సొమ్ము చెదిరింది విరి బంతుల బాట
చిమ్ము కొననుంది వరి కంకుల ఆట
నమ్ము కొనిఉంది మది హంగుల మాట

వచ్చె నిదురంది వల వాంతుల వాన

నచ్చె తలపంది కల జాజుల బాట
విచ్చె వలపంది అల గెంతుల ఆట
తచ్చె సొగసంది మది తీగల మాట

దివ్యె వెలిగింది ఒక రవ్వల వాన

భవ్య సడలింది ఒక పువ్వుల బాట
నవ్య నడిచింది ఒక నవ్వుల ఆట
సవ్య పలికింది ఒక మనస్సు మాట

స్వాతి చినుకంది ధన ముత్యపు వాన 

ఖ్యాతి పెరిగింది నవ సత్యపు బాట
జ్యోతి పెరిగింది భవ బంధపు ఆట 
శృతి అనిగింది మది తత్వపు మాట

--((**))--
   
ప్రత్త్యుష శ్రీకాంతులకు శుభాకాంక్షలు
పుత్రోత్సాహానికి మాదీవెనలు

చూడజక్కగా చుడజక్కగ వన్నె వెల్గులు
సుందరమ్మగు పూల మాలలు
మేళ తాళమే మ్రోగుచుండగ మెల్ల మెల్లగ
చిరునవ్వులే పలు దీవెన పల్కు వెల్గులు

అన్నపూర్ణా కనకసుందరంగారి మనవుడు
ప్రత్యూష శ్రీకాంతుని ముద్దులతనయుని
బారసాల మహోత్సవ బ్రాహణ దీవెనలతో
దైవజ్ఞుల శుభముహుర్తమునందు
నామధేయ సంబర సంతోషముతో పిలుపు 

పాల రంగుల బృందము
తీరు తెన్నుల ఆహ్లాదము
ప్రేమ పల్కుల ఉల్లసము
అందర్లోనూ  ఉత్సాహము

మల్లాప్రగడ వారి పుత్రిక పౌత్రుడు
గోటేటి వారి వంశోద్ధారకుడు
గుడిపాటి వారి మేనల్లుడు
ఊటుకూరి, చుండి వారి షడ్డకును కుమారునిని

అమ్మలక్కలు వచ్చి గాంచెద
అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు
పెద్దలు గురువులు దీవెనలతో
పసిమి నవ్వుల మంగళారతి

--((***))--



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి