25, మార్చి 2020, బుధవారం






ప్రాంజలి ప్రభ

నాకిలా నచ్చదు
కాళ్ళు ముడుచుకుని కూచోవడం
కానీ తప్పదు కదా

నాకిలా నచ్చదు
చేతకానివాడిలా ఇంట్లో ఉండటం
కానీ తప్పదు కదా

నాకిలా నచ్చదు
అసలే టీవి చూడను కాలక్షేపం కోసం చూసా
కానీ తప్పదు కదా

నాకిలా నచ్చదు
అందరం కలసి ఆడుకొని నవ్వు కుంటున్నాం
కాని తప్పదు కదా

ఎక్కడికో ఒక‌ దగ్గరికి తిరగకపోతే
కలిసి మాటాడక పోతే
ఊపిరాడక విలవిలలాడినట్లుంటది
కానీ తప్పదు కదా

రకరకాలుగా మనుషుల్ని మనుషుల నుండి
దూరం చేసే యత్నాలు ఇన్నాళ్ళు రాజ్యం చేసింది
ఇప్పుడీ కరోనా వస్తున్నదని ఇంట్లో ఉండాల్సిన స్తితి
కానీ తప్పదు కదా

ఎవరి ముక్కు ఎవరి నోరూ ఎవరి చేతులూ
భద్రం కావని తనమీద తనకే అపనమ్మకం ఏర్పడేలా
దూరం పెంచుతూ దాడి చేస్తోంది భయం
కరోనా వస్తుందేమోనని అనుమానం
ఇళ్లు పరిసరాలు చేతులు సుభ్రం
కాని తప్పదు కదా

మనిషిని మనిషి శతృవులా చూసే
భయానక సమయం కాని ఇప్పుడు
మనిషి మనిషి కి దగ్గరకు ఉండేందుకు
భయానక సమయం కారణం కరోనా
కాని తప్పదు కదా

ప్రాణ భయం వెంటాడుతూ
కలుగులో దాక్కుంటున్న కాలం
కలుగులో ఉండే ఎలుకలు ఎంత రక్షణో
ఎవరింట్లో వారు ఉండి కరోనా న్ని
తరిమి కొడదాం
కాని ఇది తప్పదు ప్రతి ఒక్కరికి

ప్రకృతిని ధ్వంసం చేసిన నేరానికి మూల్యం
నీ నా ఊపిరి కావడం కాదు రాజకీయము
ఎలాఉన్నా ఆత్మ రక్షణ
తప్పదు ప్రతి ఒక్కరికి

ప్రేమించిన వారినే
గట్టిగా కావలించుకో లేని
భయంతో చేతులు చాచలేని వేళ మారుతుంది
మంచిరోజులు వస్తాయి అవి మన చర్యల బట్టి
ప్రవర్తన బట్టి కరోనా దరి చేరదు
కాని శుబ్రత తప్పదు ప్రతి ఒక్కరికి

ఆసుపత్రులే దేవాలయాలుగా
మారి మూఢత్వాన్ని రూపుమాపుతున్న
కాలానికి వేన వేల జేజేలు!!
అందిస్తున్న ప్రభుత్వ సహకారానికి జేజేలు
అందరిని ఆదుకుంటున్న వైద్యులకు జేజేలు
ఒకరికి ఒకరు ప్రేమను పంచుకుంటూ
ఉన్న దాంట్లో సర్దుకొని తింటూ
మనసు మనసు పంచుకుంటూ
ఉన్న అందరికి జేజేలు
--(())--


Dinanath Dalal - Rag Vasant @ Mumbai: Nexus of the Gods | StoryLTD


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి