4, జులై 2016, సోమవారం

Internet Telugu Msagazine for the month of 7/2016/26

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ-కవిత్వ ప్రభ
Photo: Om:nmo:Shiway
సర్వేజనాసుఖినోభవంతు
 కవితలు రచయత మల్లాప్రగడ రామకృష్ణ గారు 
చిత్రములు సేకరణ (జీ మెయిల్ & ఫేసుబుక్ )
శ్లో : ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్ధన !
నరకే నియతం వాస: భవతీత్యను శుశ్రుమ!! 
(భగవద్గీత - మొదటి అధ్యాయం 44 వ శ్లోకం ) 
తా : జనార్ధన కులధర్మాలు  నశించి పోయినచో మనుష్యులు చాలాకాలం నరకవాసం చేయాల్సి ఉంటుందని విన్నాను
 *అమ్మ ప్రేమ ఎంతని చెప్పెది ?

అవనిలోన అమ్మ ఆరాద్యము
అమ్మే గురువు, అమ్మే దైవము
చను పాలు తాగించిన దైవము
బోసి నవ్వులే అమ్మకి సంతోషము

లాలా పోయు వేల మధుర సంగీతము
బువ్వ పెట్టు వేళ ముద్దుతో గారాబము
నిద్రపోవు వేళ జోలపాటతో ఆనందము
అమ్మ కెవరు సాటి రారు ఈ యుగము

సుఖదుఃఖాలు సహజమే అనేది అమ్మ
పుడమి జనులకెల్ల పూజ్యురాలు అమ్మ
సమంత మమత చూపు సాద్వి అమ్మ
శాంతి సౌభాగ్యాలు అందించేది అమ్మ

తేనె లొలుకు అమ్మ తెలుపు భాష్యము
అమ్మ అమృత పలుకే ఆశీర్వచనము
అమ్మ ప్రేమను పంచు జీవితాంతము
అమ్మను మించిన వారులేరు ఈయుగము

అమ్మ పెంపులోనే అనురాగము
అమ్మ కన్నుల యందు ఆనందము
అమ్మ ఆప్యాయత యందు అమృతము
అమ్మ సౌభాగ్యమే అందరికి ప్రాణము

అమ్మ మనసెరిగి ప్రేమను పంచుము
అమ్మను ఏస్థితిలో కష్టపెట్టుట మానము
మాతృహృదయముబండగా మార్చకుము
తల్లి ఋణము ఎప్పటి కీ తీర్చలేము

పిల్లల గుణము మారిన మారదు తల్లి గుణము
తల్లి పిల్లల మధ్య అంతరాలుచూడని స్వభావము
తల్లి వండిపెట్టు పిల్లకు తేడాలేని సహజ భోజనము
అమ్మ పుత్రులను పుత్రికలను పెంచును సమము

అంద విహీనుడైన, అంగ వికులుడైన జన్మము
గల పిలల్లకు సమముగా పంచును హృదయము
కళ్ళలో వత్తులువేసుకొనిచూడు పిల్లల ఆరోగ్యము
తల్లి తల్లడిల్లి పోక పిల్లలకు పంచు ప్రేమామృతము

అమ్మ ఉన్న నాడే కుటుంబమంతా ప్రేమమయము
అమ్మ ఉన్ననాడే పిల్లలందరికి సంతోష కళ్యాణము
అమ్మ ఉన్ననాడే పిల్లల కష్టసుఖాలుచూసే సామ్యము
అమ్మ లేని బ్రతుకు ఎడారి బ్రతుకు, అడవి రోదనము
--((*))--

 Photo:
*అక్షరాలలో స్త్రీ కి నిర్వచనమిది
-----------------------------------
అ -  అపురూపమైనది
ఆ -  ఆప్యాయత పంచేది
ఇ -  ఇంటికి దీపం వంటిది
ఈ - ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ -  ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ - ఊరటనిచ్చేది
ఋ - ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ - ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ - ఏకాగ్రత కోల్పోకుండా
ఐ - ఐనవారికోసం
ఒ - ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ - ఓరిమితో నేరిమితో
ఔ - ఔదార్యం చూపేది
అం - అందరి అవసరాలూ తీర్చేది
అః - అః అనిపించేదిu
--((*))--(గూగుల్ సేకరణ )

ప్రాంజలి ప్రభ కధలును
వినండి, వినమని చెప్పండి, మనస్సు శాంత పరుచుకోండి
సేకరణ, రచయత, వ్యాఖ్యాత, మల్లాప్రగడ రామకృష్ణ
స్త్రీ గౌరవం ప్రపంచానికే గౌరవం
http://vocaroo.com/i/s10auNyGrETs 



*ఉనికి

కాలానికి,  తన  మన  బేధం ముండదు
జలానికి,  గుట్టలు దాటి కడలి చేరక తప్పదు
మనిషికి, నీది నాది అనే భేదము ముండ కూడదు    
దాహానికి, తపన తగ్గి, ప్రాణం నిలబడక తప్పదు

స్వలాభానికి, మనసు కలత పడక తప్పదు
ఆకర్షణకి,  అణువణువు తపించక  తప్పదు
కడలికి, తరంగణి చేరాక ఉప్పొంగక తప్పదు
మనుష్యులకి, ఆశలు చేరితే భాధ రాక   తప్పదు

చెంద్రునికి, పెరిగి తిరుగునట్లు కనబడక తప్పదు
శరీరానికి, సుఖాలు దెబ్బలు తలగక తప్పదు
ఏనుగులకి, స్పర్శ సుఖానికి చిక్కక తప్పదు
భార్యాభర్తలకి, కామాన్ని  ఆశించక తప్పదు

వేశ్యలకి, విటులకై ఎదురు చూడకు తప్పదు
విటులకి  నటనలే కూడు పెట్టక  తప్పదు
ఆశాపాశానికి చిక్కిన ప్రాణం బందీకాక తప్పదు
భ్రమరానికి చిక్కిన కీటకం బ్రమించక తప్పదు  

సమయానికి  మాటలు మార్చక తప్పదు 
 నాయకులకి ఊసరవెల్లిలా రంగులు మార్చక తప్పదు 
స్త్రీలకి విన్నది చూసినది ఎవరికైనా చెప్పక తప్పదు
 ఉనికి ని బట్టి మానవులు బ్రతుకక తప్పదు   
      
--((*))--


*పరివర్తన(3-07-2016)

తల్లి తండ్రుల ప్రేమతో పెరిగి
స్నేహితులు, భాగస్తులతో తిరిగి
తప్పని కొన్ని, చెడు అలవాట్లు మరిగి 
ఇప్పుడు నేనొక ప్రశ్నగా మిగిలే

పొగ లేనిదే నిప్పు రా దన్నట్లు
మాట మాటకు కోపం ఊరకే రాదన్నట్లు
మనసుకు గాయమైతేనే రక్తం కారదన్నట్లు   
గుర్తింపు లేని జీవితం ప్రశ్నగా మిగిలే

డబ్బు అధికారము ఉన్న హంగుతో
నాలో పెరిగిన అహంకారపు పొంగుతో
వ్యామోహాలకు చిక్కి వ్యసనాల సెగతో
ఉన్నాను, నా కన్నీరు ప్రశ్నగా మిగిలే

ప్రాయంలో చేసిన తప్పు గ్రహించా
కళ్ళు తెరచి నిజ్జాన్ని ఊహించా
ఆశయ సాధనకు నడుం బిగించా
నా ప్రశ్నకు జావాబు నేనే తెలుసుకున్నా

ఎండిన చెట్టు చుక్క నిరు తగిలితే
బతుకగలనని ధీమాగా తల ఎత్తుతుంది
ప్రాణులకు నీడ నిస్తూ, ఉపయోగపడుతుంది
మనిషిగా,  చెట్టులా దేశ సేవ చేద్దా మనుకున్న       

ఉగాది ఉషస్సులు చూడాలని తలంచా
సూర్యుడులా వెనక్కి చూడక ముందుకు నడిచా
కళ్లకు కమ్ముకున్న చీకట్లను తరిమి వెలుగును పంచా
పరి వర్తన చెంది అందరిలో ఒక మనిషిగా గుర్తింపు పొందా    
 --((*))--

Photo: भीगेँगे जो किसी # रोज हम मोहब्बत की ‘बरसात ’ में

. फिर’ कमज़ोर ’से इस दिल को इश्क का ‘ बुखार ’ पक्का है.



ఈ నాటి ఇల్లాలుకు  ఎక్కడుంది విశ్రాంతి ?

సాయంత్రం అలా వస్తుంది
T V ,ఫ్యాన్ ఆపి వేస్తుంది
ఇళ్లను సర్ది సరి చేస్తుంది
పిల్లల బ్యాగ్ సర్ది పాలు ఇస్తుంది

లీలాగా తనలో ఏదో కోపం
తెలియయని అలసట
కొంత అలసటతో  అరుపు  
అసంతృప్తి ఎవరి కోసమో

కొంత విసురుగా నడక
అర్ధం కాని ఏదో ఆవేశం
వ్యక్తం చేయక గుస గుస
కాస్త పొదుపు అంటూ
నూనె దీపం వెలిగిస్తుంది

గూటికి చేరిన గోరింకను చూసి
పొగలు లేచే కాఫీ కప్పు అందించి
ఎంత ఘాటు ప్రేమ అనే చేలోక్తితో
పైట సర్దుకొని అంతా  నిశ్శబ్దం

జడివాన కురిసి వెళ్లినట్లు
ఏదోకొత్త మొహం చూసి నట్లు
చూపులకు అర్ధం తెలియనట్లు
నవ్వుల చూపు రాత్రికదా అన్నట్లు

పిల్లల ఆటల తర్వాత చదివించి
కంచంలో ముద్దలు కలిపి పెట్టి
నిద్ర పోవుటకు పక్కలు సర్ది
నిద్ర పోబోతున్న పిల్లలకు పాలు ఇచ్చి
మంచంలో ఉన్న తాతగారికి మందులిచ్చి
బామ్మ గారికి రామాయణం వినిపించి
ఈ అలసట లేని ప్రయాణం ఆగదా
ఆయనా ఆలస్యము నీదే అన్న పిలుపు

రాత్రి పదికి విశ్రాంతితో స్నానం
చీర సింగారించి మల్లెల కురులతో
సగం తెరిచిన తలుపు మూసి
ధూమ పరిమళాల అందించి
చల్లగా చందమామను చల్లపరిచి
కొత్త నీరు నింపుకొని పొద్దున్నే నిద్రలేపు
ఉద్యోగానికి పోవాలి కదా అంటూ
  కౌగలింతలో కలవరింతలతో  
ఈ నాటి ఇల్లాలుకు  ఎక్కడుంది విశ్రాంతి 
--((*))-- 




Photo:


*మామిడి పండు 
పచ్చని మామిడి పండు  చూడంగా 
జిహ్వ చాపల్యం తో నోరు ఊరంగా
మనసు తినాలని ఉబలాట పడంగా
ధర ఎంతని చూడక ఖరీదు చేసాను   

పెచ్చేక్కేలా చేసిన నన్ను పండు ని నొక్కగా
కసితీరా నోటితో కొరికి తొన పీకి చీకగా
మధుర రాసాన్నిజుర్రు జుర్రు అంటూ నాకగా 
ఆహా  తేనె కన్నా తీపి రుచిని పొందాను   

కండను పిండేసి సరదాగా
టెన్కను అదే పనిగా చీకి చీకి 
అతి క్రూరంగా ప్రవర్తించి 
పండు ను పనికి రాకుండా చేసాను    

అప్పుడు మామిడి పండు
ఓ మనవా  నాకు కోపం రాదా 
నే నున్నది  నీకోసం
నీ ఆకలి కొంత తగ్గించటం కోసం
నీ ఆనందానికి నేనొక ద్వారం
గ్రీష్మంలో మధురం అందించడం
 మిమ్ము ఆనంద పారవశ్యంలో
ఉంచటమే నా ధ్యేయం
అత్యాశకు పోకు అది నీకే అనర్ధం,
 అజీర్ణం,
వానలొస్తున్నాయి తిన్నావా
ఇక ఒకటే విరోచనం
ఇక సెలవు        
అన్న మాటలు విన్నాను 
ఎప్పుడు ఏవిధంగా తినాలో 
ఈకాలంలొ ఏమి తినాలో 
వాటినిముద్దాడి మరి తింటాను 
మామిడి పండు నా ప్రవర్తనకు 
క్షమించు 
--((*))--



* హిమబిందువు

చిగురాకుపై ఉన్న హిమ బిందువా 
వజ్రము వలె వెలిగి పోతున్నావు
గాలితో స్నేహము చేస్తున్నావా
నీవు నేల పాలవుతావు

ఓ హిమ బిందువా గాలిలో వస్తున్నావా
పుడమి తల్లి చేరి సంతోష పడుదువు
పుడమిలోని విత్తులతో స్నేహం చేస్తున్నావా
తనివి తీరా దాహం తీర్చే దానవయినావు

బిందువు ద్వారా విత్తు గర్భం గా మారిందా 
వృక్షముగా మారటానికి మూలకారణమయ్యావు  
స్నేహభావంతో పత్రాలు ఆహ్వానిస్తున్నాయా
ఆ భావంతో హాయిగా ఆకులపై విశ్రమిస్తున్నావు

పరస్పర అనురాగంతో గాలిలో తేలుతూ
ప్రాణుల హృదయాలను చల్ల పరుస్తూ
వేడిని చేరి కరిగి  మాయమవుతూ
కొత్త బిందువుగా వెలుస్తున్న హిమబిందువు  
--((*))--

*నిరుద్యోగి

చదువుకున్నా, విజ్ఞావంతుడుగా మారా
ఫలితం సున్నా, కూటికి మొహం వాచా
అద్దె కున్నా, డబ్బు కట్టలేక వీధిన పడ్డా  
నీ కున్న స్వేశ్చ మాకు లేదు హనుమా

చదువు ఉన్నా , నాకు సంస్కారము లేదా
మనసు ఉన్నా,  మమకారం నాకు లేదా
సభ్యత ఉన్నా , ఉద్యోగం చేసే స్తోమత లేదా
నీ కున్న స్వేశ్చ మాకు లేదు హనుమా

అడ్డదారి దొక్కు దామన్నా, చేత కాలేదు
నెక్సలైటుగా మారుదామన్నా, చేత కాలేదు
ప్రభుత్వం పై ప్రశ్నిద్దామన్నా, చేత కాలేదు    
నీ కున్న స్వేశ్చ మాకు లేదు హనుమా

విద్యకు తగ్గ ఉద్యోగ మన్నా, దొరుతుందని ఉన్నా 
అప్పులు చేయ లేకున్నా,  తిప్పలు పడలేకున్నా      
ప్రాణానికి విలువ లేకున్నా,  కాలంతో ఈదుతున్నా 
నీ కున్న స్వేశ్చ మాకు లేదు హనుమా

ధర్మం తప్పలేకున్నా, నాకు ఉద్యోగం ఇవ్వండి
హర్హత పరీక్షించ మన్నా, నా తెలివికి పరీక్ష పెట్టండి
దేశాన్ని ప్రేమించుతున్నా, రక్షణకు ఉపయోగించుకోండి
ప్రార్ధించా లన్న నీ కున్న స్వేశ్చ మాకు లేదు హనుమా

ప్రధాని సంకల్పం నిరుద్యోగులకు ఉపాధికల్పించటం
విద్యాధినేతకు ఉద్యోగం ఇవ్వలేని ప్రభ్యుత్వం ఉండుట వ్యర్థం
విద్యాధికులు  తిరగబడితే దేశం ప్రగతి చెందటం సూన్యం
విద్యకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలి అన్నారు రాష్ట్రపతి హనుమన్నా   
 
నిరుద్యోగి మనోధైర్యంగా ఉండు -  నీకు చేదోడుగా ఉంటాడు హనుమన్నా 
--((*))--

Photo: You've touched my soul and changed my life along with goals.
Mirza Faizan Iqbal

*ఆశలతో నేను - నాతో అలలు 

ప్రజల తో నేను - నాతో కారుణ్యాలు
పగలు తో నేను - నాతో సమీరాలు
ప్రేమల తో నేను - నాతో నిశ్శబ్దాలు
బ్రమల తో నేను - నాతో బుడగలు

కలల తో నేను - నాతో వసంతాలు
మౌనం తో నేను - నాతో శబ్దాలు
ఒంటరితనం తో నేను - నాతో కోరికలు
నవ్వుల తో నేను - నాతో పువ్వులు

వెలుగుల తో నేను - నాతో నిషిద్దాలు
చూపుల తో నేను - నాతో బంధాలు
నిరీక్షన తో నేను - నాతో జలాలు
సంకల్పం తో నేను - నాతో వికల్పాలు

సందేహాల తో నేను - నాతో వివరణలు
పులకరింపు తో నేను - నాతో పలకరింపులు
వేదంబుల తో నేను  - నాతో వాదంబులు
నాదంబులతో నేను - నాతో హ్లాదంబులు
 --((*))-- 
 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి