10, జులై 2016, ఆదివారం

మల్లాప్రగడ మౌణ నీతి

ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్

సర్వేజనా సుఖినోభవంతు

మల్లాప్రగడ మౌణ  నీతి -1

*తల్లి తండ్రులను ఆదరించుము
గురువుల మాట బట్టి నడువుము
యువతీయువకా నీతిని బతికించుము
మల్లాప్రగడ మౌణ నీతి వినుము

*బాల్య మనేది ఒక అమూల్యము
ఆటలతో ఆనందించే సమయము
విద్య నేర్చు కుంటే సుఖమయము
చెడు స్నేహము చేయక ఉండుము

*బూటకపు వర్తనము గని వీడుము
జాటరి మాటలు నమ్మక వీడుము
పోకిరి మాటల్లోనిజం తెలిసుకొనుము
ఒంటరివాడవైన సత్యాన్నివిడువకుము


*మనసుతో  చేయకు కాని కార్యము 
అనుమానంతో పలుకకు పెళ్లి కార్యము
శత్రువులతో చేయకు విందు భోజనము 
ప్రాణులతో నొప్పించేమాట మాట్లాడుకుము   

*పెద్దలతో పిన్నలు చూపాలి గౌరవము
మంచివారితో పిన్నలు చేయాలి స్నేహము 
అందరితో కలసి ఆలోచించి నడువుము
మనసుతో పెద్దలకు ప్రేమను పంచుము

*మానవ  జన్మ  వచ్చుటయే అదృష్టము
పురుష జన్మసార్ధకం చేయుట అదృష్టము
స్త్రీ జన్మ పండించు కోవుటే పర మార్ధము
జన్మ సాఫల్యతతో దేశసేవే పరమ ధర్మము

*సిరి ఇచ్చు సుఖ సంతోష బలము
సిరి చేర్చు బంధువులతో భావము 
సిరి గూర్చు గుణవంతులతో స్నేహము
సిరి ఖర్చు ప్రకృతిలో అతి సహజము

*ధనవంతు డే గుణవంతు డందుము
ధనవంతు డే కులవంతు డందుము
ధనవంతు డే బలవంతు  డందుము
ధనవంతు డే మనసున్న వాడందుము

*విత్తంబుతో విద్య కొనే కులము
వంశమునకు అది ఒక గర్వము
గౌరవ నీయులకు అది జ్ఞానము        
విత్తంఉంటే వచ్చే త్రిగుణాత్మకము

మల్లాప్రగడ మౌణ  నీతి -2
శరణు కోరిన వారిని ఆదుకొనుము
శతృవుకైన సహాయముచేయుము 
ప్రేమతో పలకరించి భాద తొలగించుము
పండితుల దృష్టిలో చులకన కాకుము

సూర్యోదయమునకు ముందే మేల్కొనుము
సూర్యాసనాలు, వ్యాయామము చేయుము  
తల్లి తండ్రులకు, పృథ్వికి నమస్కరించుము  
సూర్యుడు ఉదయంచకముందే ప్రార్ధించుము

యజమానిని విమర్శించక గౌరవించుము
విమర్శించినా సేవకునికి కష్టము అధ్యము
జాగరూకతో పనిలో  తెలివి ప్రదర్శించుము  
చెప్పిన పనిని శ్రద్ధతో చక్కగా  చేయుము

గురువు, యజమాని,మాటలు దిక్కరించకుము
కాలాన్ని వ్యర్థం చేయక స్దద్వినియోగము చేయుము
పేరు ప్రఖ్యాతలను ఆశించి ఎప్పుడు పనిచేయకుము
ఓర్పే కష్టములను గట్టెక్కించునని గమనించుము     
  
*పెద్దల మాట సత్య మని గమనించుము
పంతమునకు పోయి బ్రష్టులు కాకుము
ఆశతో తెలియనిదానిలో చేయికలపకము
మర్మము తెలుసుకొని భూమిపై మెలుగుము

*లోకము నందు తెలుసుకో కులాచారము
కీర్తి, ప్రతిష్టలు, సంపద పెంచేదే ఆచారము
ఆయుష్యు, ఇహపర సౌఖ్యములే సదాచారము
స్త్రీ సౌఖ్యము, ధర్మసూక్ష్మము తెలిపేదే ఆచారము    

*సహాయము కొరకు మొనము పాటించుము
మనస్సు ప్రశాంతతకు వ్రతములు చేయుము
ఇతరులకు మేలు చేయుటకు కష్ట పడుము
మనో నిష్ఠతో చేసేపని గొప్పదని తెలుసుకొనుము

*సజ్జన సాంగత్యము ధర్మ సమ్మతము
దుష్టుల సాంగత్యము ధర్మ విరుద్ధము
స్త్రీల సాంగత్యము ప్రకృతికి విరోధము  
సతి పతుల సంగమము అనురాగము  
   
 * చేడు భావన ఆరోగ్యానికి, సంతోషానికి, నష్టము
మంచిగా నడిస్తే తధాస్తు దేవతలు అనుట తధ్యము 
చెట్లు చెడకుండా చూసినట్లు, మనసును చూడుము
కలుపు మొక్కలు తీసినట్లు, పిచ్చి ఆలోచన మానుము

మల్లాప్రగడ మౌణ  నీతి -3
*ప్రపంచ భాషలన్నీ నేర్చుకొనుకు ప్రయత్నిమ్చుము
మాతృ భూమి భాషను, అమ్మభాషను మరువకుము  
భావము, శబ్దము, కలసిన భాషను మాట్లాడుము
మృదుత్వ, మ్నాధుర్యముతో మనస్సునొప్పింపకుము

*లౌకిక అలౌకిక దృశ్యాలను వర్ణించుము
సమాజ హితాన్ని, న్యాయాన్నినిలబెట్టుము
విశ్వకళ్ల్యాణానికి నీవంతు కృషి చేయుము
బుద్ధి కుశలతతో ధర్మ మార్గాన నడువుము

*అనుకరణ దోషముకాదు, అందానుకరుణ దోషము
యుక్తా యుక్త విచక్షణను గమనించి అనుకరించుము
సమాజాన్ని నడిపినందుకు, నేర్పు ఓర్పు,వహించుము
మహాత్ముల ఆదర్శముగా తీసుకొని జీవితం గడుపుము

*స్త్రీ ని గౌర వించిన చోట దొరుకును చక్కటి భోజనము
స్త్రీ ప్రేమను పొందినచోట దొరుకును చక్కటి సుఖము
స్త్రీ శక్తిని గమనించిన చోట దొరుకును చక్కటి భాష్యము
స్త్రీ నికష్టపెడితే నరకం, సుఖం కల్పిస్తే అందరికి సుఖము

*నీటితో కలిపిన బియ్యాన్ని గాలితో వేడిచేస్తే ఉడుకును అన్నము
అన్నముతో వండిన పప్పు, కూరలు, పచ్చడి, కలిపితింటే భోజనము
అన్నమొక్కపూట ఆరోగ్య హేతువు, పండ్లు,పాలు పూట భోజనము
ప్రకృతిలో లభించే పండ్లను, ఫలాల రసాలను నిత్యం సేవించుము

*ఉచితా నుచితంబులు తెలుసుకొని నడువుము
తెలుసుకున్న సత్యమును నిర్భయముగా తెలుపుము 
చూచినది చూడనట్లుగా తెలుపుట ఒక దుర్మార్గము
వయసును బట్టి, ప్రకృతిని బట్టి మాట్లాడుము

*మనసును నొప్పించే మాటలు మాట్లాడకుము
సామాన్యులతో పోట్లాటలా మాటలు మానుము 
ప్రజల దృష్టిలో నీవు అవివేకిగా ప్రశ్నగా మారకము
గ్రాహక శక్తితో, మంచి చెడు గ్రహించి కదులుము

*సంపద పోయిన ఏ పరిస్థితిలో విచారించకము
ధైర్యముతోఉండి నిబ్బర శక్తిని పెంచుకొనుము
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని సేవించుము
హనుమంతుని ఆరాధించి మోక్షాన్ని పొందుము
   
*విత్తనములు మంచివైతే ప్రయోజనము
కాకపోతే భూమిపై శ్రమ నిష్ప్రయోజము
మనిషి పనిపై ఉండు దేవుని ఆశయము
నిగ్రహశక్తితో సత్య మార్గాన్ని నడువుము
మల్లాప్రగడ మౌణ  నీతి -4
*అయోగ్యులైన ప్రజలకు  చేయు దానము
కుక్కకు నేతి బిస్కెట్లు పెట్టు విధానము
చేయుము యోగ్యాతలను బట్టి దానము     
ప్రయోజ- అప్రయోజనమా గమనించుము

*అందరి సుఖముకొరకు రక్షణ అవసరము
రక్షించకలిగి ఉండి రక్షించక పోతే పాపము
అన్నిసదుపాయాలు సమకూర్చు కాలము
నిరుత్సాహముతో కాలాన్ని దూషించకము 

*అమ్మను తల్చి, దమ్ముతో పని ప్రారంభించుము   
నమ్మకంతో, ఓర్పుతో, శ్రమించటం నేర్చుకొనుము
కమ్ముకున్న చీకట్లు నిన్నువదలిపోవుట ఖాయము
నమ్ముకున్న కళనే సాధనే చేస్తూ సహకరించుము   

*అబద్ధమాడవచ్చు ప్రాణంరక్షించే సమయము
అబద్ధమాడవచ్చు వివాహం చేసే సమయము
అబద్ధమాడవచ్చు స్త్రీనిసంగమించే సమయము
అబద్ధమాడవచ్చు ప్రజాకార్యనెరవేర్చే సమయము

*తనయునికి తండ్రి పంచిన ఋణము
తల్లి చెడు నడత బిడ్డలపై ప్రభావము
అందమైన భార్య, విద్యలేని పుత్రరత్నము
పై నలుగురి ప్రభావంవల్ల చెడునులోకము   

*అగ్ని వృద్ధి చెందాలంటే వాయువు అవసరము
మంచి పనులు చేయాలంటే ధనం అవసరము
లోకంలో ఓర్పుతో సత్యమార్గమున అనుసరించుము
మంచిగా పని  చేయుటే మనస్సుకు ఆనందము

*కోపము ఉన్న వారివద్ద మౌనమే ఆయుధము
కోపానికి కోపమే  శ త్రువుఅని తెలిసి కొనుము
కోపము నిగ్రహించును శాంత సమా ధానము  
వితండ వాదులతో వాదించుట అనర్ధము

*సంపద ఉన్నప్పుడు ధర్మ కార్యములు చేయుము
సంపదలు  పోయిన ఆ ధర్మమే మీకు రక్షణము
ఇచ్చిన దానా ధర్మాలను ఎప్పుడు లెక్కించకము
మనము చేసిన ధర్మయే మనకుదిక్కని మరువకుము

*అయోగ్యులకు దానము చేసినా  అది నిష్ప్రయోజనము
వయసున్న స్త్రీని నపుంసకునికి ఇచ్చిపెళ్లిచేసిన వ్యర్ధము
పొలమునకు కట్ట సరిగా లేకపోయినా  నీరు వ్యర్ధము
ఒకరి కొకరు కలసి కాపురము చేయపోయినా వ్యర్ధము

గురుపౌర్ణమి సందర్భముగా గురువులకు పాదాభి వందనం చేస్తున్నాను. ప్రతిఒక్కరు గురుదేవుని ఆశీస్సులు పొందాలని ఆశయంతో   
శ్రీ గురుచరిత్ర వీనుటకు వీలుగా రికార్డు చేసి ఫిష్ బుక్లో పెడుతున్నాను విని మీ అభి ప్రాయాలు తెలుపగలరు.   









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి