12, జులై 2016, మంగళవారం

సీతాపతి చెప్పినది ?

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - జీవిత కధ 

purple glass lovebirds.
సర్వేజనా సుఖినోభవంతు

సీతాపతి   చెప్పినది ?

ఏమిటండి  అలా  దిగులుగా ఉన్నారు,
నా దిగులు ఒకరి చెప్పుకోలేను, నేను సాల్వు చేసుకోలేను, నీకు చెప్పి మరీభాద పెట్టుట నాకు ఇష్టం లేదు,  భూదేవికి ఉన్న ఓర్పు నాలో ఉన్నది, కర్మబంధంలో చిక్కి స్వయంగా బాధపడే అజ్ఞానుల వలన కలిగే భాధలన్నిటిని భరిస్తూనే వారికి వీలైనంతగా మేలు చేస్తుంది పుడమి తల్లి, అట్లే నీవు కూడా ఎంతో ప్రేమతో పిల్లలను పెంచావు, నీతో నేను కూడా సహకరించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాము, వారు వయసు కొచ్చాక వయసు కోరికలు వెంబడి పోవుట సహజము, నేను వారిని తప్పు పట్టుట లేదు, ఏదో పిల్లలుకు  చెప్పలేక కొంత బాధ  మనసులో ప్రవేశించింది, ఆబాధను తొలగించుకొని భూమాత వలే వీలైనంత మేలు చేయాలని అనుకుంటున్నాను.  

నేను మాత్రం మీ మాటకు ఏప్పుడు ఎదురు చెప్పానండి, మీ బాధలు నావి కావా, ఇన్నేళ్ల సంసారంలో మీరు తెలుసుకున్నది ఇదేనా, మీరే నాకు ముఖ్యం,  మనం సుగంధ దుర్గంధాల్ని మోస్తూనే వాటికి అంటకుండా ఉండే వాయువు లాగా, సుఖ దు:ఖాల మధ్య ఉంటూనే వాటికి చిక్క కుండా ఉండడం నేర్చుకుందాము, ఏదైనా కష్టము వచ్చిన ఈ రోజు కష్టము రేపటి సుఖమునకు నాంది అని భావించి ఉందాము.
నిజమేనే గాలిలాగా కనబడకుండా ఉండలేము కదా మనం, ఆ గాలి ఆధారంగా జీవిస్తాము, కొందరి మాటలను పట్టించు కోకుండా ఉండటం నేర్చుకుందాము. 

ఓ సీతా ఒక్క సారి పైకి చూడు దేనితోనూ సంభందం లేకుండా ఆకాశం ఎలా స్థిరంగా ఉన్నదో అలాగే ఈ శరీరాలను మోస్తూనే ఎప్పుడు స్వచ్ఛ మైన పాల లాగా ఉందాము.
అలాగేనండి ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్య చంద్రులు తిరుగు చున్నట్లు మనము కూడా ఆంటీ అంటకుండా, ఉండి ఉండకుండా, చేసి చేయకుండా, కనిపించి కనబడకుండా ఆకాశంలో ఉండే అంతర్జాలం లా సేవలు అందిద్దామండి. 

అవును ఇప్పటికి నా ఆలోచనలు నీవు తాళం వేస్తున్నావు నాకు సంతోషముగా ఉన్నది, ఇక నీ మాటలే ఒక మందుగా పనిచేస్తున్నాయి.  ఆ తరంగిణి తనలో చేరిన నీటిని శుద్ధి చేసి, వచ్చిన వారందరికీ అంటే తనలో స్నానం చేసినవారందరికి పవిత్రతను, మంచిని పంచి, దైవ సాన్నిధ్యానికి సహకరించి నట్లు నీవు నా పూజ కార్యక్ర మాలకు, అన్నీ  నిత్యా కృత్యాలకు సహకరిస్తూ ఉన్నావు, నాకు ఎటువంటి భాద కలుగ కుండా చూస్తున్నావు, మరి మన పిల్లల వల్ల మనం భాద పడుట అవసరమా?, నీరు దొరకని ప్రాంతములో నీటిని పంచి కొన్ని ప్రాణాలనైనా బ్రతికించాలని అనిపిస్తున్నది ఈ  వయసులో.

అవునండి మీరు చెప్పినది అక్షరాలా నిజం, అసలే ఇది ఎండాకాలం, మనం ఉండే ప్రాంతంలో చలివేంద్రాలు పెట్టి సహకరిద్దాము.
చూడు నీతో మాట్లాడుతుంటే నాకు ఎంత సమయ మైనదో కూడా తెలియుట లేదు.
అవునండి ఎందుకు తెలుస్తుంది, మీరు మాటలతో మభ్యపెడతారు, అది నాకు చేతకాదు, కడుపులో ఎలికలు పరిగెడు తున్నాయి, కాస్త కాఫీ తీసుకొని వస్తా, అట్లాగే తీసుకొద్దానివి ఒక్క మాట విను " అగ్ని తనలో ఏది వేసిన దానిని ఆహుతి చేసుకుంటుంది, ఈ కడుపులో ఉన్న అగ్ని నీవు ఏది తెచ్చినా త్రాగ మంటున్నది, ఈ ఉదర పోషణార్ధం ఎవరు ఏది పెట్టిన దానిని ప్రసాదంగా స్వీకరిస్తాను.
ఏవి టండి ఆమాటలు అంటూ నవ్వు కున్నది భార్య, అవునే ఇప్పుడు మన ఉన్నది పిల్లల ఇంటిలో అది గుర్తుంచుకో వారు ఏదన్నా అన్నారనుకో మరలా భాద పడాలి అందుకే అన్నా
మీరు చాలా ముందు జాగర్తగా మాట్లాడుతారు అంటూ వెళ్లి రెండు కప్పులు కాఫీ పట్టుకొని వచ్చి అందించింది,
త్రాగుతూ ఇంట్లో పిల్లలు లేరా, ఉంటే మాత్రము నేను కాఫీ త్రాగుతానంటే అడ్డు పడతారా ఏమిటి, నిజమే అడ్డు పడరు, పాలు పిళ్లి  త్రాగ్గిందా అమ్మా అని అడిగారనుకో అప్పుడు ఏమి సమాధానము చెపుతావు,
ఎందుకండీ నన్ను ఏడి పిస్తారు, పిల్లలు వచ్చినా రావచ్చు వాళ్లకు సమాధానము చెప్పటానికి ఏదో ఒక అబద్దం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది, అలా ఆబద్దాలు ఆడకు, నాన్న నేను కాఫీ త్రాగము, పాలు అయి పోయినాయి అని చెప్పు, కోపం వస్తే రాని మనముండేది ఇక్కడ కొన్ని రోజులేగా అంటూ ఖాళీ కాఫీ కప్పు చేతికిస్తూ నేను అలా తిరిగొస్తాను, కాస్త ప్రకృతి గాలి ఆస్వాదించి వస్తాను అంటూ పార్కుకు బయలు దేరాడు సీతాపతి

అలా కళ్లజోడు సర్దుకుంటూ, తెగిన చెప్పులతో నెమ్మదిగా నడుచు కుంటూ పార్కు గేటు వద్దకు చేరాడు సీతాపతి, జన సమూహము చాలా మంది మూగారు, ఏమిటా అని తొంగి చూసాడు, అక్కడ ఒక మనిషి పడి ఉన్నాడు, ఎవ్వరూ పట్టించు కోకుండా వింతగా చూస్తున్నారు, అప్పడు గబా గబా ప్రక్కన ఉన్న పంపులో నీటిని దోసిటతో తెచ్చి మొఖం మీద  చల్లాడు, వెంటనే గుర్తు పట్టి హలో శ్రీధర్, హలో శ్రీధర్ , నేను నీ చిన్న నాటి స్నేహితుణ్ని, ఏమిటి ఇలా పడి ఉన్నావు, ఏమి లేదురా ఏదో ఆలోచిస్తూ,  ఫరాకై తుళ్ళి పడ్డాను అంతే, అసలు విషయం ఏమిటి, ఏమి లేదురా, ఋణం తిరందే నామనసు ఊరుకోదు, నీ కోసమే ఇక్కడ కూర్చొని, ఇక నీవు రావని వెళ్ళ బోయాను, కాళ్లకు బంగారు తీగ తగిలినట్లు, క్రింద పడ్డాను అంతే,  నీ బాకీ తీర్చుటకు అవకాశము దొరికింది చాలా సంతోషము అన్నాడు శ్రీధర్.
  ఇప్పుడు ఎవరడిగారు అది ఎప్పటి బాఖీణో నాకే గుర్తులేదు, మా బాబు చదువు నిమిత్తం డబ్బు ఇచ్చావు, మావాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నాన్న బాకీ ఇచ్చి తిరిగి రమ్మన్నాడు నా కుమారుడు, ఈ వయసులో కొడుకు దగ్గర ఎట్లా ఉంటున్నవురా ఏముంది మూడు గదులు హాలు ఉన్న ఇల్లు తీసుకున్నాడు, పని వాళ్లను పెట్టాడు, నేను నా శ్రీమతి ఇంట్లో కూర్చొని పేపరు చదువుకుంటు, పురాణాలు చదువుతూ, ఇలా వాకింగ్ కు వస్తాము  ఈ రోజు ప్రత్యేకంగా నీకోసమే వచ్చాను, ఈ డబ్బు తీసుకో అని చేతిలో పెట్టాడు శ్రీధర్.
శ్రీధర్ నీవు అచ్చం సూర్యుడివిరా  " సూర్యుడు సముద్రం  నుంచి నీటిని గ్రహించి వర్షం రూపంలో తిరిగిచ్చి నట్లు, పొందిన  ఉపకారాన్ని తగిన సమయంలో తగిన విధముగా తిరిగి ఇవ్వటంలో నీ గొప్పతనం ఉందిరా, మన స్నేహం ఇలానే సాగాలిరా .

నేనయితే మాత్రం ఎటువంటి శ్రమ పడని విధముగా అయా చితముగా వచ్చిన ఆహారాన్ని తినే కొండచిలువలా తయారయ్యాను, ఆత్మ చింతనలో మునిగి పోవ  నేర్చు కున్నాను అన్నాడు శ్రీధర్.
శ్రీధర్ నేను మాత్రం నదులన్నీ కలసి వచ్చిన, అనంత గంభీర్యాన్ని వదలని సముద్రంలా ఉండుటకు ప్రయత్నిస్తున్నాను, కోరికల వెంట  పరుగులు తీయక స్థిరంగా ఉండటం నేర్చుకున్నాను.
అవును ఈ వయసులో జరిగే ముచ్చట్లు ఆవయసులో జరిగి పోయాయి, ఇక ఈ సంసారం లో ఇరుక్కోవటం  ఎందుకు అని భావించింది నాకు, అందుకే నేను కాశీలో కొన్ని రోజులు ఉండి వద్దామను కుంటున్నాను, ఇదినా నిర్ణయం మాత్రమే, నా శ్రీమతి మాత్రం కొడుకు పిల్లులు, కూతురు పిల్లలు అంటూ నెత్తి కెక్కించు కుంటున్నది, ఆ ప్రేమ బంధం నుండి రాలే నంటున్నది, ఆ ఈశ్వరుడే మా సంకల్పము నెరవేరుస్తారని అను కుంటున్నాను.
అనుకోని విధంగా నీ సహాయము నన్ను ఆధ్యాత్మికంలోకి మారుస్తుంది, నేను నాభార్య కలసి కాశీ యాత్ర చేస్తాము, మేము వెళ్ళేటపుడు మీ ఇద్దరకు కూడా రెండు టిక్కెట్లు బుక్ చేస్తాను, అక్కడ ఖర్చులన్నీ నావే, నీ  భార్యను విప్పించి తీసుకు రావటం మాత్రం నీవంతు అంటూ నవ్వు కున్నారు, అక్కడ ఉన్న జనం వీరి సంభాషణలు  వింటూ చాటుగా నవ్వుకున్నారు.
సీతాపతి తెగిన చెప్పులు పారేసి కొత్త చెప్పులు కొనుక్కొని భార్యను కలుసుకొని స్నేహితుని కధ అంతా చెప్పాడు, అయతే మనం కాశీ చూసొద్దాం, అదేగా నేనుచెప్పేది, అవును అదే నేను చెప్పేది.
"భగవంతునికై వ్యాకుల చిత్తంతో విలపించండి. ఆ కన్నీరు, సూదిని ఆవరించిన మట్టిని తొలగిస్తుంది. పరిశుద్ధం అయ్యాక సూదిని, అయస్కాంతం ఆకర్షిస్తుంది. అప్పుడు యోగం సిద్ధిస్తుంది 
భగవంతునికి విలపిస్తే ఆయన దర్శనం కలుగుతుంది, సమాధిస్థితి ఏర్పడుతుంది. యోగంలో సిద్ది పొందితేనే   సమాధిస్థితి కలుగు తుంది విలపిస్తే  కుంభకం అప్రయత్నం గా  ఏర్పడుతుంది ఆ అర్వాత సమాధి". శ్రీ రామకృష్ణులు అన్నమాటలు నీకు గుర్తుచేస్తున్నాను దేవి. 
నిజమేనండి దేవుని ప్రార్ధించు తున్నప్పుడు నామనసు ఎంతో సంతోషముగా ఉంటున్నది. అందుకే దైవ సాన్నిధ్యంలో  కొన్ని రోజులు గడిపి వద్దాము. 
నాన్న మీరు చెప్పినట్లు మీకు కాశీకి విమానం లో టికెట్లు బుక్ చేసాను ప్రసాంతము గా వెళ్ళిరండి, 
బాబు నా స్నేహితుడుకూడా వస్తానన్నాడు మేమమందరం రైలులో వెళ్లగలము ఒకరికి  ఒకరు తోడు ఉండాలి అదే నేను చెప్పేది. 
ధన్యవాదములు నాన్న గారు, అమ్మగారు, మీ మాటే మాకు వేదవాక్కు   

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం – తుంగనాథ్‌

హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం.


హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు! రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంది.

ఈ తుంగనాథ్‌ క్షేత్రం ‘పంచ కేదార’ ఆలయాలలో ఒకటి. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా! ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతోకొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాడట. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు! దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు. మరి పరమేశ్వరుడేమీ తక్కువవాడు కాదు కదా! వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభరూపంలోని శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు.

పంచకేదార క్షేత్రాలలో వృషభరూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది. అవడానికి ఇంత ఎత్తున ఉన్నా, మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం తేలికే! 58వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చాలు, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఒకపక్కన మందాకినీ నది, మరో పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. శీతకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది. అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడి తుంగనాథుని ఉత్సవవిగ్రహాన్ని మోకుమఠ్‌ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్యపూజలను నిర్వహిస్తారు. అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు శీతకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెబుతారు.