15, జులై 2016, శుక్రవారం

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం -3(73 to 108) slokala bhashyam

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం  -3

సర్వేజనా సుఖినోభవంతు


శ్లో. స్తవ్య స్తవప్రియః స్తోత్రమ్ స్తుతిః స్తోతా రణప్రియః !
పూర్ణః పూరయితాః పుణ్యః పుణ్య కీర్తి రనామయః !! 73 !!

 స్తవ్య:= అందరచేతను స్తుతింప బడువాడై ఎవనిని స్తుతింపని వాడు, 
 స్తవప్రియః =ఇందువలననే స్తన ప్రియుడు,
స్తోత్రమ్:= తన స్తోత్రం తానే పూర్తికావించు కొనువాడు,
స్తుతిః=స్తోత్రము చేయుకు స్తుతి రూపుడు,
స్తోతా:= తానే స్తోత్రము చేయువాడు,
రణప్రియః = యుద్ధము ప్రీతి వాడు,
పూర్ణః =సమస్త అభీష్ఠములతోను సమస్త శక్తులతోను నిండుకొని యుండువాడు,

పూరయితాః= కేవలము తాను పూర్ణుడై ఉండుటయే కాక అందారను గూడ సంపదలతో నిండుకొని యుండు నట్లు చేయువాడు,
 పుణ్యః=స్మరించిన మాత్రమున పాపములను నసింప జేయువాడు,
పుణ్య కీర్తి= పరిశుద్ధమగు కీర్తి గలవాడు,
ఆనామయః =  వ్యాధిని తొలగించువాడు,

భాష్యం: అందరచేతను స్తుతింప బడువాడై ఎవనిని స్తుతింపని వాడు, 
ఇందువలననే స్తన ప్రియుడు, తన స్తోత్రం తానే పూర్తికావించు కొనువాడు, స్తోత్రము చేయుకు స్తుతి రూపుడు, తానే స్తోత్రము చేయువాడు,  యుద్ధము ప్రీతి వాడు,సమస్త అభీష్ఠములతోను సమస్త శక్తులతోను నిండుకొని యుండువాడు,కేవలము తాను పూర్ణుడై ఉండుటయే కాక అందారను గూడ సంపదలతో నిండుకొని యుండు నట్లు చేయువాడు, స్మరించిన మాత్రమున పాపములను నసింప జేయువాడు, పరిశుద్ధమగు కీర్తి గలవాడు,  వ్యాధిని తొలగించువాడు,
అగు పరమాత్మునకు ప్రణామములు.


శ్లో.మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః !
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !! 74 !!

మనోజవ:=సంసారమును వ్యాధిని తన భక్తులకు తొలగించుటలో మనసుకన్నా వేగము కలవాడు,
తీర్థకర:= పదునాల్గు విద్యలను, వేద విరుద్ధములైన విద్యలకు సంబందించిన సిద్ధాంతములను రచించిన వాడు,
వసురేతా:=తేజస్సు తన అవతారామునకు కారణముగా కలిగినవాడు, 
వసుప్రదః=ధనమును పుష్కలముగా ఇచ్చు నట్టివాఁడు,
వసుప్రద:= దేవకీ వసుదేవులకు తనకి తల్లిదండ్రులుగా నుండుటకు త గినంత తేజస్సును ఇచ్చినవాడు,
వాసుదేవ:= వాసుదేవుని కుమారుడు వాసుదేవుడు,
వసు:= నాయందు సకల భూతములను సమస్త  భూతముల యందు తానును నివ సించుటకు గలవాడు,
వసుమనా:=సమస్త విషయముల యందును సమానముగా ఉండునట్టి మనస్సు గలవాడు,
హవిః =బ్రహ్మమే హవిస్సు అనేది స్మృతి వాక్యమును ననుసరించిన వాడు,
భాష్యం : సంసారమును వ్యాధిని తన భక్తులకు తొలగించుటలో మనసుకన్నా వేగము కలవాడు,పదునాల్గు విద్యలను, వేద విరుద్ధములైన విద్యలకు సంబందించిన సిద్ధాంతములను రచించిన వాడు, తేజస్సు తన అవతారామునకు కారణముగా కలిగినవాడు, ధనమును పుష్కలముగా ఇచ్చు నట్టివాఁడు,దేవకీ వసుదేవులకు తనకి తల్లిదండ్రులుగా నుండుటకు త గినంత తేజస్సును ఇచ్చినవాడు,
వాసుదేవుని కుమారుడు వాసుదేవుడు, నాయందు సకల భూతములను సమస్త  భూతముల యందు తానును నివ సించుటకు గలవాడు, సమస్త విషయముల యందును సమానముగా ఉండునట్టి మనస్సు గలవాడు,బ్రహ్మమే హవిస్సు అనేది స్మృతి వాక్యమును ననుసరించిన వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 
 
శ్లో. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః !
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః !! 75 !!

సద్గతిః= వసుదేవాది సాధువులకు గతి అయినవాడు,
సత్ కృతిః = సత్కార్యములు కలవాడు,
సత్తా:=సత్తులకు తానే సత్తా అయినవాడు ,
సద్భూతిః=సాధకులకు పుత్ర, మిత్ర, బంధు, దూత, సారధి మెదలగు సమస్తము తానే అయి ఉండువాడు,
 సత్పరాయణః=సాధకులు తనకు పరమగతిగా తలచి ఉండువాడు,
శూరసేన:=యాదవులు పాండవులు సూరులు వంటి సేనలు గలవాడు,

యదుశ్రేష్ఠః=యాదవులలో ప్రధానుడై యున్నవాడు,
సన్నివాసః= సజ్జనులకు ఆశ్రయమై ఉన్నవాడు,
సుయామునః =తాను యమునా నదిలో కావించిన క్రీడలను పుణ్యము గా కలవాడు,
 భాష్యం  :
 వసుదేవాది సాధువులకు గతి అయినవాడు, సత్కార్యములు కలవాడు, సత్తులకు తానే సత్తా అయినవాడు ,సాధకులకు పుత్ర, మిత్ర, బంధు, దూత, సారధి మెదలగు సమస్తము తానే అయి ఉండువాడు,
సాధకులు తనకు పరమగతిగా తలచి ఉండువాడు,యాదవులు పాండవులు సూరులు వంటి సేనలు గలవాడు,యాదవులలో ప్రధానుడై యున్నవాడు, సజ్జనులకు ఆశ్రయమై ఉన్నవాడు,తాను యమునా నదిలో కావించిన క్రీడలను పుణ్యము గా కలవాడు,అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః !
దర్పహా దర్పదా దృప్తో దుర్ధరో థాపరాజితః !! 76 !!

భూతావాస: =సమస్త భూతములకు వానస్థలమైనవాడు,
వాసుదేవః =వ్యూహవాసుదేవినిగా ప్రకాశించువాడు ,
సర్వాసు నిలయ:= అందరి ప్రాణములకు ఆధారముగా నుండువాడు ,
 అ నలః =భక్తుల కార్యములన్ని చేసినా రుపతి చెందనివాడు ,
దర్పహా:=ధర్మ విరుద్ధమైన మార్గమున నుండు వారి మద  మనుచు వాడు,
దర్పద:= ధర్మ మార్గమున ప్రవర్తించు వారికి గర్వము నిచ్చువాడు ,
దృప్త:=నిరంతరము స్వస్వరూపమునకు సంబందించిన అమృత్ రసమును ఆస్వాదించుట వలన మిక్కిలి సంతుష్టుడై ఉండు వాడు ,
దుర్ధర:=తన సంభంధం చేత యాదవులకు గర్వము కలిగించిన వాడు ,
అపరాజితః =లోపలి రాగాది శత్రువులచేతను వెలుపలి దానవాడి శత్రువులచేతను పరాజ్యము నొందనివాడు  ,

భాష్యం:సమస్త భూతములకు వానస్థలమైనవాడు, వ్యూహవాసు దేవినిగా  ప్రకాశించు వాడు,అందరి ప్రాణములకు ఆధారముగా నుండు వాడు ,భక్తుల కార్యములన్ని చేసినా రుపతి చెందనివాడు ,ధర్మ విరుద్ధ మైన మార్గమున నుండు వారి మద  మనుచు వాడు, ధర్మ మార్గమున ప్రవర్తించు వారికి గర్వము నిచ్చువాడు,నిరంతరము స్వస్వరూపము నకు సంబందించిన అమృత్ రసమును ఆస్వాదించుట వలన మిక్కిలి సంతుష్టుడై ఉండు వాడు ,తన సంభంధం చేత యాదవులకు గర్వము కలిగించిన వాడు ,లోపలి రాగాది శత్రువులచేతను వెలుపలి దానవాడి శత్రువులచేతను పరాజ్యము నొందనివాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. విశ్వ మూర్తి ర్మహా మూర్తి ర్దీప్త మూర్తి రమూర్తి మాన్ !
అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః !! 77 !!

విశ్వమూర్తి:= సర్వమునకు ఆత్మగా ఉందువలన విశ్వమే ఆకారముగల వాడు,
మహా మూర్తి:=శేషశయ్యపై ఆపవళించునట్టి వీరిని యాకారము మిక్కిలి గొప్పది కావున మాహామూర్తి అనబడువాడు,
దీప్త మూర్తి:= జ్ఞాన స్వరూపమైన ఆకృతి గలవాడు,
రమూర్తి మాన్ :=కర్మచేత ఏర్పడినట్టి దేహము లేనివాడు,
అనేక మూర్తి:=లోకోపకారము చేయునట్టి పెక్కు రూపములను అవతారముల యందు తన యిష్టానుసారముగా ధరించు వాడు,

అ వ్యక్తః=  తన మహిమ బయలు  పడకుండా దాచి ఉంచిన  వాడు,
శతమూర్తిః=జ్ఞాన స్వరూపుడగు విఇనికి కల్పితముగా ఏర్పడిన రూపములు అనేకములు గలవు, కావున శాతమూర్తి అనబడువాడు,
శతాననః != విస్వాది మూర్తులు గలవాడు,

భాష్యం : సర్వమునకు ఆత్మగా ఉందువలన విశ్వమే ఆకారముగల వాడు, శేషశయ్యపై ఆపవళించునట్టి వీరిని యాకారము మిక్కిలి గొప్పది కావున మాహామూర్తి అనబడువాడు, జ్ఞాన స్వరూపమైన ఆకృతిగల వాడు, కర్మచేత ఏర్పడినట్టి దేహము లేనివాడు, లోకోపకారము చేయు నట్టి పెక్కు రూపములను అవతారముల యందు తన యిష్టాను సారము గా ధరించువాడు, తన మహిమ బయలు  పడకుండా దాచి ఉంచిన  వాడు, జ్ఞాన స్వరూపుడగు విఇనికి కల్పితముగా ఏర్పడిన రూపములు అనేకములు గలవు, కావున శాతమూర్తి అనబడువాడు,
విస్వాది మూర్తులు గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. ఏకో నైకః సవః కః కిమ్ యత్తత్పదమనుత్తమమ్ !
లోక బంధు ర్లోక నాథో మాధవో భక్త వత్సలః !! 78 !!

  ఏక:= ఒక్కడు అద్వితీయుడు,
 నైకః=తనకు విభూతి ఆయి తనచేత నియమింపబడేది, తనకన్నా విజాతీయ మైనది ఆయన అనేక పదార్ధములు గలవాడు ,
న:=  విషయము అందరిచేత నిశ్చయింప చేయువాడు,
వః =సమస్త భువములందును వసించువాడు,
కః =మాలిన పదార్థములందు వసించు చున్నాను ప్రకాశించువాడు,
కిమ్:= సమస్త పురుషార్థ స్వరూపమై ఉన్నందున బ్రహ్మమే విచారణ చేయదగి యున్నది గావున "కిమ్" అనబడు వాడు,
యత్:= భక్తులను రక్షించుటకై పయత్నించువాడు,
తత్  := భక్తులకు జ్ఞానము భక్తి అనువానిని కలిగించు వాడు,
పద మనుత్తమమ్ := ముముక్షవులైనవారిచేత పొందబడునది గాన పాద మనబడును, ఈ ఈబ్రహ్మమున కంటే ఉత్తమ్ మైనది ఏదియు   లేదు గావున ఇది అనుత్తము అనబడును, అందువలన పరమ ప్రాప్యమైన వాడు,
లోక బంధు := సమస్త లోకములు తన జనముగా కలవాడు,
లోక నాథ:= సమస్త లోకములకు నాధుడు,

మాధవ:= మధువని పేరుగల వంశమున పుట్టినవాడు,
భక్త వత్సలః =భక్తులయందు ప్రేమ గలవాడు,

భాష్యము : ఒక్కడు అద్వితీయుడు,తనకు విభూతి ఆయి తనచేత నియమింపబడేది, తనకన్నా విజాతీయ మైనది ఆయన అనేక పదార్ధములు గలవాడు ,  విషయము అందరిచేత నిశ్చయింప చేయు వాడు, సమస్త భువములందును వసించువాడు,మాలిన పదార్థము లందు వసించు చున్నాను ప్రకాశించువాడు, సమస్త పురుషార్థ స్వరూపమై ఉన్నందున బ్రహ్మమే విచారణ చేయదగి యున్నది గావున "కిమ్" అనబడు వాడు,  భక్తులను రక్షించుటకై పయత్నించువాడు,
భక్తులకు జ్ఞానము భక్తి అనువానిని కలిగించు వాడు, ముముక్షవు లైనవారిచేత పొందబడునది గాన పాద మనబడును, ఈబ్రహ్మమున కంటే ఉత్తమ్ మైనది ఏదియు లేదు గావున ఇది అనుత్తము అనబడును, అందువలన పరమ ప్రాప్యమైన వాడు, సమస్త లోకములు తన జనముగా కలవాడు,  సమస్త లోకములకు నాధుడు,  మధువని పేరుగల వంశమున పుట్టినవాడు, భక్తులయందు ప్రేమ గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ !
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః !! 79 !!

సువర్ణ వర్ణ:= బంగారము వంటి ప్రకాశించు వర్ణము గలవాడు,
హేమాంగ:= స్లాఘ్యమైన శరీరము గలవాడు
వరాంగ:= దివ్య మంగళ విగ్రము గలవాడు,
చందనాంగదీ:= ఆహ్లాదకరమైన చందనములతోను బాహుపురులతోను అలంకరింప బడినవాడు,
వీరహా:= ధర్మమును కాపాడుటకై వీరులైన అసుర ముఖ్యులను వధించిన వాడు,
విషమః= దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము చేయు చుండుటచే వైషమ్యము గలవాడు,
శూన్య:= ఎట్టి దోషము లేనివాడు,
ఘృతాశీ:= కోరికలు జారిపోయాయి నట్టి వాడు,
అచల:= స్వరూపము నుండి గాని, సామర్ధ్యమునుండి గాని, జ్ఞానాది గుణముల నుండి గాని చలనము నొందుట లేనివాడు,
చలః= రూపముతో కాలాడాలిక గలవాడు,

భాష్యము : బంగారము వంటి ప్రకాశించు వర్ణము గలవాడు,  స్లాఘ్య మైన శరీరము గలవాడు, దివ్య మంగళ విగ్రము గలవాడు,  ఆహ్లాద కరమైన చందనములతోను బాహుపురులతోను అలంకరింప బడిన వాడు, ధర్మమును కాపాడుటకై వీరులైన అసుర ముఖ్యులను వధించిన వాడు, దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము చేయు చుండుటచే వైషమ్యము గలవాడు, ఎట్టి దోషము లేనివాడు,  కోరికలు జారిపోయాయి నట్టి వాడు,
స్వరూపము నుండి గాని, సామర్ధ్యమునుండి గాని, జ్ఞానాది గుణముల నుండి గాని చలనము నొందుట లేనివాడు,  రూపముతో కాలాడాలిక గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు


శ్లో. అమానీ మాన్యదో మన్యో లోకస్వామీ త్రిలోక ధృక్ !
సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరా ధరః !! 80 !!

అమానీ:= పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడగుటచేత అనాత్మ విషయముల యందు ఆత్మాబంహిమానము లేనివాడు,
మానద:= గౌరవము సంపాదించి ఇచ్చువాడు,
మాన్య:= గౌరవము తలంచు వాడు,
లోకస్వామీ:=సకల లోకాలకు నాయకుడైనవాడు,
త్రిలోక ధృత్ := ముల్లోకములను ధరించువాడు, 
సుమేధా:= మంచి తలంపు గలవాడు,

మేధజ:=యాగ ఫలముగా అవతరించిన వాడు,
ధన్య:=కృతార్థుడైన వాడు,
సత్యమేధా:= సత్యమైన మేధా శక్తిగలవాడు,
ధరా ధరః=! భూమి నాన్నను మోయు శక్తిగలవాడు,  

భాష్యము : పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడగుటచేత అనాత్మ విషయముల యందు ఆత్మాబంహిమానము లేనివాడు, గౌరవము సంపాదించి ఇచ్చు వాడు, గౌరవము తలంచు వాడు, సకల లోకాలకు నాయకుడైనవాడు,
ముల్లోకములను ధరించువాడు,  మంచి తలంపు గలవాడు, ఫలముగా అవతరించిన వాడు,కృతార్థుడైన వాడు, సత్యమైన మేధా శక్తిగలవాడు,
భూమి నాన్నను మోయు శక్తిగలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. తేజో వృషో ద్యుతి ధరః సర్వ శస్త్ర భృతాం వరః !
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః !! 81 !!
 

తేజో వృష:= సదాసూర్యుని రూపముతో నున్నవాడై ఉదకములను వర్షించువాడు,
ద్యుతి ధరః=సరికిరా కాంతిని ధరించి యుండువాడు,
సర్వ శస్త్ర భృతాం వరః = శ స్త్రములను ధరించిన అందరిలో శ్రేష్ఠుడు,
ప్రగ్రహ:= భక్తులకు తన వచనానుసారం స్వాధీనం గావించు కొనువాడు,

నిగ్రహ:=తన సారధ్య విశేషముచేతనే శ త్రువులను నిర సించువాడు,
వ్యగ్ర:=అంతము లేనివాడు,
నైక శృంగ:= అనేక విధములుగా శత్రువులను బాధించు సామర్ధ్యము కలవాడు,
గదాగ్రజః =మంత్రముద్వారా ఎదుట ఆవిర్భావం నొందువాడు,


భాష్యం : సదాసూర్యుని రూపముతో నున్నవాడై ఉదకములను వర్షించు వాడు, సరికిరా కాంతిని ధరించి యుండువాడు, శ స్త్రములను ధరించిన అందరిలో శ్రేష్ఠుడు,  భక్తులకు తన వచనానుసారం స్వాధీనం గావించు కొనువాడు, తన సారధ్య విశేషముచేతనే శ త్రువులను నిర సించువాడు,అంతము లేనివాడు, అనేక విధములుగా శత్రువులను బాధించు సామర్ధ్యము కలవాడు, మంత్రముద్వారా ఎదుట ఆవిర్భావం నొందువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః !
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్ !! 82 !!


చతుర్మూర్తి:=విరాట్, సూత్రాత్మ, అవ్యాకృత, తురీయాత్మకములైన నాలుగు రూపములు కలవాడు, అధవా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణములైన నాలుగు ఆకారములు కలవాడు 
చతుర్బాహు:=నాలుగుబాహువులు కలవాడు 
చతుర్వ్యూహ:= శరీర రూపుడైనపురుషుడు, ఛందో రూపుడైన పురుషుడు, వేదరూపుడైన పురుషుడు, మహాదరూపుడైన పురుషుడు, అగు నలుగురు పురుషులు వ్యూహములుగా గలవాడు, 
 శ్చతుర్గతిః = ఇంద్రపదము, బ్రహ్మపదము, కైవళ్యము, మోక్షము అను  నాలుగు విధములగు గతులలు ఉపాసకులు తారతమ్యము నను సరించి ఇచ్చువాడు,
చతురాత్మా:= జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురికియావస్థ అని ఐనాలిగింటిలో నాలుగురూపములలో ప్రకాశించేవాడు,

చతుర్భావ:=ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనేది నాలుగు పురుషార్ధములు విని నుండే ఏర్పడుచున్నవి కావున చతుర్బావుడు,
శ్చతుర్వేద:=నాలు వేదముల అర్ధములు యదార్ధముగా ఎరిగినవాడు,
ఏకపాత్ := ఈ జగత్తునంతటిని నేను నాయొక్క ఒక్క అంశముచేతనే వ్యాపించి ఉన్న ఒక్క పాదముగాకలవాడు, 

భాష్యం:విరాట్, సూత్రాత్మ, అవ్యాకృత, తురీయాత్మకములైన నాలుగు రూపములు కలవాడు, అధవా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణములైన నాలుగు ఆకారములు కలవాడు,నాలుగుబాహువులు కలవాడు, శరీరరూపుడైనపురుషుడు, ఛందో రూపుడైన పురుషుడు, వేదరూపుడైన పురుషుడు, మహాదరూపుడైన పురుషుడు, అగు నలుగురు పురుషులు వ్యూహములుగా గలవాడు,ఇంద్రపదము, బ్రహ్మపదము, కైవళ్యము, మోక్షము అను  నాలుగు విధములగు గతులలు ఉపాసకులు తారతమ్యము నను సరించి ఇచ్చువాడు, జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురికియావస్థ అని ఐనాలిగింటిలో నాలుగురూపములలో ప్రకాశించేవాడు, ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనేది నాలుగు పురుషార్ధములు విని నుండే ఏర్పడుచున్నవి కావున చతుర్బావుడు,నాలు వేదముల అర్ధములు యదార్ధముగా ఎరిగినవాడు, ఈ జగత్తునంతటిని నేను నాయొక్క ఒక్క అంశముచేతనే వ్యాపించి ఉన్న ఒక్క పాదముగాకలవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 
  
శ్లో. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః !
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా....!! 83 !!

సమావర్త:=సంసార చక్రమును చక్కగా త్రిప్పునట్టివాఁడు,
అ నివృత్తాత్మా:= అంతటను ఉంది యున్నవాడు, తొలగిపోనట్టి  స్వరూపము గలవాడు,
దుర్జయ:= జాయింప శక్యముగాని వాడు,
దురతిక్రమః =ఏటివారి చేతనైన అతిక్రమింప శక్యము కానివాడు,
దుర్లభ:=దుర్లభమైన భక్తిచేత మాత్రమే లభించు వాడు,

దుర్గమ:=అతి కష్టముగా లభించు నట్టివాఁడు,
దుర్గ:=అనేక విఘ్నములచేత కొట్టబడిన వారికి మాత్రమే కష్టముగా లభించు నట్టివాఁడు,
దురావాస:=సమాధియందు యోగులచేత అతి కష్టముగా విత్తమున నిలుపు కొన బడునట్టివాఁడు,
దురారిహా:=దానవులు మొదలైన దుర్మార్గులను వదించువాడు,


భాష్యం :సమావర్త:=సంసార చక్రమును చక్కగా త్రిప్పునట్టివాఁడు,
అంతటను ఉంది యున్నవాడు, తొలగిపోనట్టి  స్వరూపము గలవాడు,
జాయింప శక్యముగాని వాడు, ఎట్టి వారి చేతనైన అతిక్రమింప శక్యము కానివాడు, దుర్లభమైన భక్తిచేత మాత్రమే లభించు వాడు,అతి కష్టముగా లభించు నట్టివాఁడు,అనేక విఘ్నములచేత కొట్టబడిన వారికి మాత్రమే కష్టముగా లభించు నట్టివాఁడు,సమాధియందు యోగులచేత అతి కష్టముగా విత్తమున నిలుపు కొన బడునట్టివాఁడు,దానవులు మొదలైన దుర్మార్గులను వదించువాడు,అగు పరమాత్మునకు ప్రణామములు . 


శ్లో. శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతు వర్ధనః !
ఇంద్ర కర్మా మహా కర్మా కృత కర్మా కృతాగమః !! 84 !!

శుభాంగ:= దివ్యములైన అవయవములలో ధ్యానింప దగినవాడు,
లోకసారంగః= లోక సారములను భోగ,మోక్ష మృగముల నుపదేశించి మోహింపచేయువాడు,
సుతంతు=విస్తారమునొందిన ప్రపంచ మనెడి సుందరమైన తంతువు గలవాడు,
తంతువర్ధనః= అసురులకు పాపము మీద రుచి కలిగించి, దానిచే సంసారమనుఅంటువును వృద్దిచేసినవాడు,
ఇంద్ర కర్మా:=ఇంద్రుని కర్మ వంటి కర్మ కలవాడు, ఈశ్వరత్వము కలవాడు, 

మహా కర్మా:= ఆకాశము మొదలైన మహాభూతములు అనకార్యములుగా ఉన్నట్టివాడు, దుష్టశిక్షణార్థము, శిష్ట రక్షణార్ధము మహా న్యాయ కార్మ కలవాడు,
కృత కర్మా:=కృతార్థుడై యున్నందున చేయవలసిన దాని నంతయును చేస్తూ, ధర్మ రూపమైన కర్మను చేయువాడు,
కృతాగమః =వేదరూపమైన శాస్త్రములను రచించినవాడు,

భాష్యం : దివ్యములైన అవయవములలో ధ్యానింప దగినవాడు,  లోక సారములను భోగ,మోక్ష మృగముల నుపదేశించి మోహింపచేయువాడు,
విస్తారమునొందిన ప్రపంచ మనెడి సుందరమైన తంతువు గలవాడు,
అసురులకు పాపము మీద రుచి కలిగించి, దానిచే సంసారమను తంతు వును వృద్దిచేసినవాడు, ఇంద్రుని కర్మ వంటి కర్మ కలవాడు, ఈశ్వరత్వము కలవాడు, ఆకాశము మొదలైన మహాభూతములు అనకార్యములుగా ఉన్నట్టివాడు, దుష్టశిక్షణార్థము, శిష్ట రక్షణార్ధము మహా న్యాయ కార్మ కలవాడు,కృతార్థుడై యున్నందున చేయవలసిన దాని నంతయును చేస్తూ, ధర్మ రూపమైన కర్మను చేయువాడు,వేద రూపమైన శాస్త్రములను రచించినవాడు,అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !
ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !!


ఉద్భవః =తన  ఇష్టానుసారము ఉత్తమమైన జన్మను పొందు వాడు,
సుందరః =సమస్తమును మించిన సౌభాగ్యము కలవాడు,
సుంద:= బాగుగా చల్ల బడునట్లు చేయువాడు,
రత్ననాభః=రత్నము వలె సుందరమైన నాభి కలవాడు,
సులోచనః=చక్కని నేత్రములు కలవాడు,
ఆర్క:=మిక్కిలి పూజ్యులైన బ్రహ్మాదులచేత గుడా పూజింప దాగి యున్న వాడు,

వాజనసః = యాచకులకు అన్న దానము చేయువాడు,
శృంగీ:= ప్రళయ జలమున శృంగములు గల ఒకానొక రూపము గలవాడు,
జయంతః= శత్రువులను లెస్సగా జయించువాఁడు
సర్వ విజ్జయీ:= సమస్తము గోచరింప జేసికొని నట్టి జ్ఞానము గలవాడు,



భాష్యం : తన  ఇష్టానుసారము ఉత్తమమైన జన్మను పొందు వాడు,
సమస్తమును మించిన సౌభాగ్యము కలవాడు,బాగుగా చల్ల బడునట్లు చేయువాడు, రత్నము వలె సుందరమైన నాభి కలవాడు,చక్కని నేత్రములు కలవాడు, మిక్కిలి పూజ్యులైన బ్రహ్మాదులచేత గుడా పూజింప దాగి యున్న వాడు,యాచకులకు అన్న దానము చేయు వాడు,  ప్రళయ జలమున శృంగములు గల ఒకానొక రూపము గల వాడు,  శత్రువులను లెస్సగా జయించువాఁడు,  సమస్తము గోచరింప జేసికొని నట్టి జ్ఞానము గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 



శ్లో . సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:
మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!!

సువర్ణ బిందు:= సువర్ణము బోలిన అవయవములు గలవాడు,
అక్షోభ్య:= రాగద్వేషాదులచేతను, శబ్దాది విషయముల చేతను, దేవ విరోధుల చేతను క్షోభ పెట్టబడని వాడు,
సర్వ నాగీశ్వరేశ్వర:= వాక్కునకు అధిపతి అయిన బ్రహ్మాదుల కందఱకును ప్రభువుగా ఉన్నవాడు,
మహాహ్రాద:=మడుగు వలె ఉండువాడు,
మహాగర్త:=పెద్దగోతిలో పడవేయువాడు,
మహాభూత:=మూడు కాలములచేతను పరిచ్చేదనము పొందని వాడు,
మహానిధి:=సమస్త భూతములు, మహనీయులు తనసోత్తుగా గల వాడు  

భాష్యాము :: సువర్ణము బోలిన అవయవములు గలవాడు,రాగ ద్వేషాదుల చేతను, శబ్దాది విషయముల చేతను, దేవ విరోధుల చేతను క్షోభ పెట్టబడని వాడు, వాక్కునకు అధిపతి అయిన బ్రహ్మాదుల కందఱకును ప్రభువుగా ఉన్నవాడు, మడుగు వలె ఉండువాడు,పెద్ద గోతిలో పడ వేయు వాడు,మూడు కాలములచేతను పరిచ్చేదనము పొందని వాడు,సమస్త భూతములు, మహనీయులు తనసోత్తుగా గల వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు.   


శ్లో. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!!

కుముదః=భారమును దించుచు భూదేవిని సంతోష పెట్టువాడు,
కుందరః= సుద్దములైన ఫలములను ఇచ్చువాడు,
కుంద: = శుద్ధమైన స్ఫటికము వలె స్వఛ్ఛమై ఉండువాడు,
పర్జన్యః=జ్ఞానుల తాపత్రయమును హరించువాడు,
పావన:=స్మరణ మాత్రమున పవిత్రము చేయువాడు,
అ నిలః = భక్తుల ననుగ్రహించు విషయమున ప్రేరకులులేనివాడు,
అమృతాశ:= స్వస్వరూపముతో అమృతమును  అవించు వాడు,

మృతవపుః=అమృతము వలె కోరదగిన దేహముకలవాడు,
 సర్వజ్ఞః= సమస్తము తెలిసికొనువాడు,
సర్వతో ముఖః= అన్నీ వైపుల నేత్రములు శిరస్సులు,ముఖములు గలవాడు,

  భాష్యం :భారమును దించుచు భూదేవిని సంతోష పెట్టువాడు, సుద్దములైన ఫలములను ఇచ్చువాడు,  శుద్ధమైన స్ఫటికము వలె స్వఛ్ఛమై ఉండువాడు, జ్ఞానుల తాపత్రయమును హరించు వాడు, స్మరణ మాత్రమున పవిత్రము చేయువాడు, భక్తుల ననుగ్రహించు విషయమున ప్రేరకులులేనివాడు,  స్వస్వరూపముతో అమృతమును  అవించు వాడు, అమృతము వలె కోరదగిన దేహముకలవాడు, సమస్తము తెలిసికొనువాడు,అన్నీ వైపుల నేత్రములు శిరస్సులు, ముఖములు గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !
న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !!


సులభః= సుఖముగా వెల లేకయే పొంద దగినవాడు,
సువ్రతః =సుందరమైన వ్రతమును చేయువాడు,
సిద్ధః = ఇతరముపై ఆధారపడని సిద్ధిగలవాడు,
శత్రు జిత్ := దేవతల శత్రువులే తన శత్రువులు, అట్టి వారిని జయించిన వాడు,
శత్రు తాపనః = దేవతులకు విరోధులైన వారిని తపింప చేయువాడు,
న్యగ్రోధ:= చేతులెత్తి నమస్కరించిన వారిచేత అడ్డగింప గలవాడు,

దుంబర:= వారికి ఇవ్వడానికి తగిన పరమ పాదముకలవాడు,
అ శ్వత్థ:= ఇవాలన్నది రేపు ఉండక పోవచ్చు, అంతర్యామిగా నుండి ప్రవర్తింప చేయువాడు,
శ్చాణూరాంధ్ర నిషూదనః= చానూరుడనే ప్రేగుల ఆంధ్రుని సంహరించిన వాడు,


భాష్యం : సుఖముగా వెల లేకయే పొంద దగినవాడు, సుందరమైన వ్రతమును చేయువాడు, ఇతరముపై ఆధారపడని సిద్ధిగలవాడు, దేవతల శత్రువులే తన శత్రువులు, అట్టి వారిని జయించిన వాడు, దేవతు లకు విరోధులైన వారిని తపింప చేయువాడు, చేతులెత్తి నమస్కరించిన వారిచేత అడ్డగింప గలవాడు, వారికి ఇవ్వడానికి తగిన పరమ పాదముకలవాడు, ఇవాలన్నది రేపు ఉండక పోవచ్చు, అంతర్యామిగా నుండి ప్రవర్తింప చేయువాడు,చానూరుడనే ప్రేగుల ఆంధ్రుని సంహరించిన వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !!




సహస్రార్చిః=  సూర్యునకు సహస్ర కిరణములు ఇచ్చినవాడు
సప్త జిహ్వః =ఏడు జ్వాలలలోతో నుండు అగ్ని యందు అణు ప్రవేశించిన వాడు,
సప్తైధాః = ఏడు దీప్తులు గలవాడు, 
సప్త వాహనః =ఏడు గుఱ్ఱములు వాహనములుండగా కలవాడు,
అమూర్తి:= ప్రాకృతిమైన మూర్తి కాక అప్రాకృత దివ్య మంగళ విగ్రహము కల వాడు,
అనఘ:= ఒక్క దోషము కూడా లేని వాడు,
అ చింత్య:= ముక్త పురుషులకు సముడుగా కూడా చింతింపజాలని వాడు,
భయకృత్ := భయమును కలిగించు వాడు,
భయనాశనః= భయమును తొలగించు వాడు,

భాష్యం : సూర్యునకు సహస్ర కిరణములు ఇచ్చినవాడు, ఏడు జ్వాల లతో నుండు అగ్ని యందు అణు ప్రవేశించిన వాడు, ఏడు దీప్తులు గలవాడు, ఏడు గుఱ్ఱములు వాహనములుండగా కలవాడు,ప్రాకృతి మైన మూర్తి కాక అప్రాకృత దివ్య మంగళ విగ్రహము కల వాడు, ఒక్క దోషము కూడా లేని వాడు, ముక్త పురుషులకు సముడుగా కూడా చింతింపజాలని వాడు, భయమును కలిగించు వాడు,భయమును తొలగించు వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !!

అణు:= మిమిక్కిలి సూక్ష్మ స్వరూపుడు,
బృహత్ :=అతి విస్తారమైన పరమాకాశమును కూడా తనయందుంచు కొనువాడు,
కృశః= దూది వాయువుల కన్నా తేలిక లైనవాడు కనుక అంతట  ఆంటంకం లేనట్లు చరించ తగినట్లు సన్నబడి యుండు వాడు,
స్థూల:=ఒక చోటనే ఉండి సమస్తమును స్పృసించగలవాడు,
గుణ భృత్ := సంకల్ప మాత్రముచే సమస్తమును ధరించగల ఈ సత్వము గలవాడు,
నిర్గుణ:= గుణములు లేనివాడు,
మహాన్:=ఉత్కృష్టుడు కనుక అవాప్త సమస్త కాముడు కనుక ప్రాకామ్యము అనుసిద్ధి కలవాడు,
అధృతః= ఎవరి చేయను కట్టబడకఉండువాడు,

స్వధృతః =ఒక సాధన వాలన లభించినవి కాక స్వాభావికంగా నున్న
ఐశ్వర్యములు కలవాడు,
స్వాస్యః= ఎల్లప్పుడూ ఆవిర్భవించి యుండు ఐశ్వర్యము కలవాడు,
ప్రాగ్వంశ:=అనాది అయిన నిత్య సూరులకు కూడా ఉత్పత్తి స్థానమైన వాడు,
వంశ వర్ధనః =నిత్యా సూరుల వంశమునువృద్ధి చేయువాడు,

భాష్యం : మిమిక్కిలి సూక్ష్మ స్వరూపుడు, అతి విస్తారమైన పరమా కాశమును కూడా తనయందుంచు కొనువాడు,దూది వాయువుల కన్నా తేలిక లైనవాడు కనుక అంతట  ఆంటంకం లేనట్లు చరించ తగినట్లు సన్నబడి యుండు వాడు, ఒక చోటనే ఉండి సమస్తమును స్పృసించగలవాడు, సంకల్ప మాత్రముచే సమస్తమును ధరించగల ఈ సత్వము గలవాడు, గుణములు లేనివాడు, ఉత్కృష్టుడు కనుక అవాప్త సమస్త కాముడు కనుక ప్రాకామ్యము అనుసిద్ధి కలవాడు,  ఎవరి చేయను కట్టబడకఉండువాడు, ఒక సాధన వాలన లభించినవి కాక స్వాభావికంగా నున్నఐశ్వర్యములు కలవాడు, ఎల్లప్పుడూ ఆవిర్భవించి యుండు ఐశ్వర్యము కలవాడు, అనాది అయిన నిత్య సూరులకు కూడా ఉత్పత్తి స్థానమైన వాడు,నిత్యా సూరుల వంశమునువృద్ధి చేయువాడు,
అగు పరమాత్మునకు ప్రణామములు


శ్లో. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః !
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః !! 91 !!

భారభృత్ :=   ముక్తుల భారమును వహించువాడు,
కథిత:=పసిద్ధి నొందింప బడిన వాడు,
 యోగీ:=అఘటిత  కలవాడు ,
యోగీశః=యోగులని పరసిద్ధి నొందిన వారందరికీ యోగమును కలుగ చేయువాడు,
సర్వకామదః =యోగా బ్రష్టులైన వారికి కూడా వారు కోరిన సమస్త లోక  ఇచ్చు వాడు,
ఆశ్రమః=సంసార మనేది అరణ్యమున తిరుగులాడేడి వారి కందఱకును ఆశ్రయము వలననే విశ్రమ స్థానముగా ఉన్నవాడు,

శ్రమణః=వివేకా రహితులెల్లరను శ్రమ పెట్టువాడు,
క్షామః =సమస్త దుష్ట ప్రజలను క్షి నింప చేయువాడు,
సుపర్ణః=యోగమంలోకి సమాధి వరకు చేరినవారు ఈ తమస్సు అవతలి హద్దును చేరునట్లు చేయువాడు,
వాయువాహనః= ఏదైనా కారణము చేత పతితులైనచో గరుత్మంతుని ద్వారా తిరిగి సద్గతి నొంద జేయువాడు,

భాష్యం :  ముక్తుల భారమును వహించువాడు,పసిద్ధి నొందింప బడిన వాడు, అఘటిత  కలవాడు, యోగులని పరసిద్ధి నొందిన వారందరికీ యోగమును కలుగ చేయువాడు,యోగా బ్రష్టులైన వారికి కూడా వారు కోరిన సమస్త లోక  ఇచ్చు వాడు, సంసార మనేది అరణ్యమున తిరుగులాడేడి వారి కందఱకును ఆశ్రయము వలననే విశ్రమ స్థానముగా ఉన్నవాడు,వివేకా రహితులెల్లరను శ్రమ పెట్టువాడు,సమస్త దుష్ట ప్రజలను క్షి నింప చేయువాడు,యోగమంలోకి సమాధి వరకు చేరినవారు ఈ తమస్సు అవతలి హద్దును చేరునట్లు చేయువాడు,
 ఏదైనా కారణము చేత పతితులైనచో గరుత్మంతుని ద్వారా తిరిగి సద్గతి నొంద జేయువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 



శ్లో. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః !! 92 !!

 ధనుర్ధర:= ఉపాసనా విరోధులను నిరసించుటకై ధనస్సును ధరించి ఉండువాడు,
 ధనుర్వేద:=ధనుర్వేదము తెలిసినవాడు,
 దండ:=దండ నీతిచే రాజుల ద్వారా దుష్టులను దండించువాడు,
 దమయితా:=తాను సాక్షాత్తుగా దండించినవాడు,
అదమః=తనను దండించువాడు లేకుండుటచే నిరంకుశుడుగా ఉండువాడు,
అపరాజితః = ఏ ప్రదేశమునందును ఎవరి చేతను అడ్డగింప బడనివాడు,

సర్వసహ:=సర్వ కార్యములలోను సమర్దుడు,
నియంతా:=ఇళ్ల్లరును తమ తమ కార్యములందు నియోగించువాడు,
నియమ:= సమస్తము నియమించువాడు,
 యమః= యమాదులనుకూడా స్వామిగా రక్షించువాడు,

 భాష్యం :ఉపాసనా విరోధులను నిరసించుటకై ధనస్సును ధరించి ఉండువాడు,ధనుర్వేదము తెలిసినవాడు,దండ నీతిచే రాజుల ద్వారా దుష్టులను దండించువాడు,తాను సాక్షాత్తుగా దండించినవాడు,తనను దండించువాడు లేకుండుటచే నిరంకుశుడుగా ఉండువాడు, ఏ ప్రదేశమునందును ఎవరి చేతను అడ్డగింప బడనివాడు,సర్వ కార్యముల లోను సమర్దుడు,ఇళ్ల్లరును తమ తమ కార్యములందు నియోగించు వాడు, సమస్తము నియమించువాడు,  యమాదులను కూడా స్వామిగా రక్షించువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 
 
శ్లో. సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతి వర్ధనః !! 93 !!

సత్త్వవాన్:= సుద్ద సత్య గుణము కలవాడు,
సాత్వికః =సత్వ గుణ ఫలమును ఇచ్చువాడు,
సత్యః=సజ్జనుల విషయమున సాదువుగా ఉండువాడు,
 సత్య ధర్మపరాయణః=సత్యము నందును విధిరూపమైన ధర్మము నందును నియమము గలవాడు,
అభిప్రాయః=సత్య ధర్మమున నిష్ఠగల మహానియులచే పరమ  ప్రయోజనము గా కోరబడువాడు,
ప్రియార్హ:= జ్ఞానులను అనుగ్రహిచువాడు,
అర్హ:జ్ఞానులకు తగినవాడు,
ప్రియకృత్:=పయోజనాంతర పరులనుకూడా తనకు ప్రియులుగా చేసికొనువాడు,
ప్రీతి వర్ధనః=తన గుణముల యందు వాద్రికి ప్రీతి వర్ధిల్లు నాట్లు చేయువాడు,

బాహ్యం :
సుద్ద సత్య గుణము కలవాడు, సత్వ గుణ ఫలమును ఇచ్చువాడు,
సజ్జనుల విషయమున సాదువుగా ఉండువాడు,సత్యము నందును విధిరూపమైన ధర్మము నందును నియమము గలవాడు,సత్య ధర్మమున నిష్ఠగల మహానియులచే పరమ  ప్రయోజనము గా కోరబడువాడు,జ్ఞానులను అనుగ్రహిచువాడు,జ్ఞానులకు తగినవాడు,
ప్రయోజనాంతర పరులనుకూడా తనకు ప్రియులుగా చేసికొనువాడు,
తన గుణముల యందు వాద్రికి ప్రీతి వర్ధిల్లు నాట్లు చేయువాడు,

 శ్లో. విహాయ సగతి ర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః !
రవి విరోచః సూర్యః సవితా రవిలోచనః !! 94 !!

 విహాయ సగతి:= భక్తి పరమావధి నొందిన మహానియులకు పరమ పదము నిచ్చువాడు,
జ్యోతిః= తనంతట ప్రకాశించు నట్టి వాడు,
సురుచి:= సుందరమైన ప్రకాశమును ఇచ్చువాడు,
హుతభుక్ := సమస్త హోమ ద్రవ్యములను భుజించువాడు
 విభుః = అనతనువుండు నట్టి వాడు,
రవి:= రవి అనగా ఉత్తరాయణము దానికి అభిమానిగా ఉండు వాడు,
విరోచన =అనేక విధములుగా ప్రకాశించువాడు,
 సూర్యః=శోభను కలిగించునట్టి సూర్యుడు,
 సవితా:=సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు,
 రవిలోచనః =సూర్యుడునేరముగా కలవాడు,

భాష్యం : భక్తి పరమావధి నొందిన మహానియులకు పరమ పదము నిచ్చువాడు, తనంతట ప్రకాశించు నట్టి వాడు,సుందరమైన ప్రకాశమును ఇచ్చువాడు, సమస్త హోమ ద్రవ్యములను భుజించువాడు, అనంతముఆవరించునట్టి వాడు, రవి అనగా ఉత్తరాయణము దానికి అభిమానిగా ఉండు వాడు, అనేక విధములుగా ప్రకాశించువాడు,శోభను కలిగించునట్టి సూర్యుడు,సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు,సూర్యుడునేరముగా కలవాడు, అగు  ప్రణామములు. 

 . అనంతో హుతభుక్భోక్తా సుఖదో నైకజోగ్రజః !
అనిర్వణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః !! 95 !!

అనంత:= నిత్యుడును సర్వ వ్యాపియు నైనవాడు,
హుతభుక్ := హవిస్సును భుజించువాడు,
భోక్తా:= భోగ్యము, జడము నైనా ప్రకృతిని అనుభవించువాడు,
సుఖద:=భక్తులైన వారికి మోక్షము మనేది సుఖమును ఇచ్చువాడు,
నైకజ:= ధర్మమును కాపాడులకై పలుసార్లు అవతారము దాల్చు చుండువాడు,
అ గ్రజః=అందరి కంటే ముందుగా జన్మించినవాడు,
అనిర్వణ్ణః =లభింపకుండుటకు హేతువు లేనందున సమస్త  కామములు సిద్దించిన వాడగుట చేత ఖేదము లేనివాడు,

సదామర్షీ:=సజ్జనులను అనుకూల భావముతో క్షమించువాడు,
లోకాధిష్ఠానమ్ :=ఉత్తమ లోకము లొసంగుటకు అధారభూతుడు
అద్భుతః=అప్పటిఒకప్పుడు నూతనముగా ఉందులచే ఆశ్చర్య భూతుడు,

భాష్యం : నిత్యుడును సర్వ వ్యాపియు నైనవాడు,  హవిస్సును భుజించువాడు, భోగ్యము, జడము నైనా ప్రకృతిని అనుభవించువాడు,
భక్తులైన వారికి మోక్షము మనేది సుఖమును ఇచ్చువాడు,ధర్మమును కాపాడులకై పలుసార్లు అవతారము దాల్చు చుండువాడు, అందరి కంటే ముందుగా జన్మించినవాడు, లభింపకుండుటకు హేతువు లేనందున సమస్త  కామములు సిద్దించిన వాడగుట చేత ఖేదము లేనివాడు, సజ్జనులను అనుకూల భావముతో క్షమించువాడు,ఉత్తమ లోకము లొసంగుటకు అధారభూతుడు, అప్పటి కప్పుడు నూతనముగా ఉండుటచే ఆశ్చర్య భూతుడు,అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. సనాత్సనాతనతమః కపిలః కపి రవ్యయః
స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః !! 96 !!


సనాత్ := ముక్తులందరూ పంచుకొనిమరియు అనుభవింప తగిన వాడు,
సనాతనతమః=ప్రాచీనుడైనఆప్పుడే జనించు నాట్లు భోగ్యముగా నుండువాడు,
 కపిలః=కల మేఘము వంటి వర్ణము కలవాడు,
 కపి రవ్యయః=అక్షయమగు ఆనందమును అనుభవించు చు సుఖముండు  వాడు
స్వస్తిదః =మహా మంగళమునిచ్చు వాడు,

స్వస్తి  కృత్:= కళ్యాణ గుణములచే తన భోగమునకు క్షేమమమును గావించు కొనువాడు,
 స్వస్తిః=అనే మహా మంగళ మూర్తిగా నుండు వాడు,
 స్వస్తి భుక్=మంగళాదులన్నింటిని పాలించు వాడు 
 స్వస్తి దక్షిణః=తన దివ్య సరికిరాదుల కైంకర్యమును భక్తుల కిచ్చువాడు,


భాష్యం:ముక్తులందరూ పంచుకొనిమరియు అనుభవింప తగిన వాడు,
ప్రాచీనుడైనఆప్పుడే జనించు నాట్లు భోగ్యముగా నుండువాడు, కాల మేఘము వంటి వర్ణము కలవాడు,అక్షయమగు ఆనందమును అనుభవించు చు సుఖముండు  వాడు, మహా మంగళమునిచ్చు వాడు,
కళ్యాణ గుణములచే తన భోగమునకు క్షేమమమును గావించు కొనువాడు, తనే మహా మంగళ మూర్తిగా నుండు వాడు, మంగళాదులన్నింటిని పాలించు వాడు,  తన దివ్య సరికిరాదుల కైంకర్యమును భక్తుల కిచ్చువాడు,అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః !
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః !! 97 !!



అరౌద్రః= గొప్ప ఐశ్వర్యమున్న కళ్యాణగుణములచేత మిక్కిలి సౌమ్యుడు,  
కుండలీ=కుండలములను మరియు దివ్యాభరణములను ధరించిన వాడు,
 చక్రీ:=సమస్త లోక రక్షణకై సుదర్శనమనే చక్రమును ధరించిన వాడు,
విక్రమీ :=గాంభీర్యమునకు తగిన మిక్కిలి చేష్టితములు గలవాడు 
యూర్జిత శాసనః=బ్రహ్మేంద్రాదులచే మీరజాలని దివ్యాజ్ఞలను జారీచేయువాడు,
శబ్దాతిగః =శబ్దము ప్రవర్తించుటకు హేతువులైన జాతి లేనివాడు,

శబ్దసహః =శబ్దమును మహాభారముతో మోయువాడు,
శిశిరః=అతి వేగముగా వచ్చిన వాడు,
శర్వరీ కరః=భక్తులను శత్రువుల నుండి రక్షించుటకు ఆయుధములను పట్టియుండు వాడు,


భాష్యం:గొప్పఐశ్వర్యమున్న కళ్యాణగుణములచేత మిక్కిలి సౌమ్యుడు,  కుండలములను మరియు దివ్యాభరణములను ధరించిన వాడు,సమస్త లోకరక్షణకై సుదర్శనమనే చక్రమును ధరించిన వాడు,గాంభీర్యమునకు తగిన మిక్కిలి చేష్టితములు గలవాడు, బ్రహ్మేంద్రాదులచే మీరజాలని దివ్యాజ్ఞలను జారీచేయువాడు, శబ్దము ప్రవర్తించుటకు హేతువులైన జాతి లేనివాడు, శబ్దమును మహాభారముతో మోయువాడు,అతి వేగముగా వచ్చిన వాడు,భక్తులను శత్రువుల నుండి రక్షించుటకు ఆయుధములను పట్టియుండు వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః !
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః !! 98 !!

అక్రూరః =ఆగ్రహము లేక అభిలాషతోకూడినవాడు, కామమూలేనందున క్రోధములేనివాడు, క్రోధము లేనందున క్రౌర్యము లేనివాడు,
పేశల:=కర్మ చేత మనస్సు చేత  వాక్కు చేత  శరీరముచేతను రమణీయముగా నుండు వాడు,
దక్ష:= అతి శీఘ్రముగా వచ్చిఆదుకొనువాడు
దక్షిణః =ప్రీతిని చూపిన వాడు,
క్షమిణాం వరః=ఓరిమి వహించిన వారిలోశ్రేష్ఠుడు,
విద్వత్తమ:=ఏ  గాయమునకు ఏ మందు వేయాలో చక్కగా తె లిసినవాడు,

వీతభయః=సంసార లక్షణమైన భయములేనివాడు, 
 పుణ్య శ్రవణ  కీర్తనః=భక్తి భావముతో పుణ్యముచేసినను ,కీర్తణలను వినినను, తొలగించువాడు,


భాష్యం : ఆగ్రహము లేక అభిలాషతోకూడినవాడు, కామమూలేనందున క్రోధములేనివాడు, క్రోధము లేనందున క్రౌర్యము లేనివాడు,కర్మ చేత మనస్సు చేత  వాక్కు చేత  శరీరముచేతను రమణీయముగా నుండు వాడు, అతి శీఘ్రముగా వచ్చిఆదుకొనువాడు, ప్రీతిని చూపిన వాడు,
ఓరిమి వహించిన వారిలోశ్రేష్ఠుడు, ఏ  గాయమునకు ఏ మందు వేయాలో చక్కగా తె లిసినవాడు, సంసార లక్షణమైన భయము లేనివాడు, భక్తి భావముతో పుణ్యముచేసినను ,కీర్తణలను వినినను, తొలగించువాడు, అగు  ప్రణామములు . 

శ్లో. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుః స్వప్న నాశనః !
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః !! 99 !!


ఉత్తారణ:= సంసార సముద్రమునుండి దాటించు వాడు,
 దుష్కృతిహా:= పాపము లనబడు దుష్కర్మలను నశింప జేయువాడు, అథవా పాపకార్యముల నాచరించు వారిని వధించువాడు,
 పుణ్య:= కీర్తిచే అస్మదాదులను కూడా పాపములనుండి తొలగించు సుద్దులుగా చేయువాడు,
దుః స్వప్న నాశనః= చెడు స్వప్నములను తొలగించు వాడు,
వీరహా:= ముక్తినిచ్చుఅద్వారా సంసారుల యొక్క అనేక విధములైన దుర్గతులను తొలగించువాడు,

 రక్షణః=సత్వగుణమును ఆశ్రయించి ముల్లోకములను రక్షించు చుండు వాడు,
సంత:= ఆశ్రీతులను వృద్ధి చేయించువాడు,
జీవనః=సమస్త ప్రజలను ప్రాణము రూపముతో జీవింప చేయువాడు,
పర్యవస్థితః=ప్రపంచమున అన్ని వైపులా వ్యాపించి ఉన్నవాడు,


భాష్యం :   సంసార సముద్రమునుండి దాటించు వాడు,   పాపము లనబడు దుష్కర్మలను నశింప జేయువాడు, అథవా పాపకార్యముల నాచరించు వారిని వధించువాడు,   కీర్తిచే అస్మదాదులను కూడా పాపముల నుండి తొలగించు సుద్దులుగా చేయువాడు, చెడు స్వప్నములను తొలగించు వాడు,  ముక్తినిచ్చుఅద్వారా సంసారుల యొక్క అనేక విధములైన దుర్గతులను తొలగించువాడు,  సత్వగుణమును ఆశ్రయించి ముల్లోకములను రక్షించు చుండు వాడు,
ఆశ్రీతులను వృద్ధి చేయించువాడు, సమస్త ప్రజలను ప్రాణము రూపముతో జీవింప చేయువాడు,ప్రపంచమున అన్ని వైపులా వ్యాపించి ఉన్నవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. అనంత రూపోనంత శ్రీర్జితమన్యు ర్భయాపహః !
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100 !!


 అనంత రూపోనంత:=సమస్త ప్రపంచ రూపముతో ఉన్న విని రూపములు అనంతములు కావున అనంత రూపముగలవాడు, 
 అనంత శ్రీ:= ఆశ్రీతులకు ఇవ్వదగిన అనంతైశ్వర్యములు కలవాడు,
జితమన్యు:= క్రోధమును జయించిన వాడు,
 భయాపహః = జీవుల సంసార భయమును పోగొట్టువాడు,
చతురశ్ర:= జీవుల కర్మలకు తగిన ఫలమును న్యాయముగా ఇచ్చువాడు,

గభీరాత్మా:= పరిమాణమును నిర్ణయించుటకు అలవిగాక గంబీరమై యున్న స్వరూపము గలవాడు,
 విదిశ:= అధికారు లైనవారికి అనేక విధములగు ఫలములను విశేషముగా ఇచ్చువాడు,
వ్యాదిశ:= ఇంద్రుడు మొదలైనవాటిని అనేక విధముల ఆజ్ఞాపించువాడు,
 దిశః =సమస్త కర్మలకు గల ఫలములను వేదముద్వారా తెలియ జేయువాడు,

భాష్యం :   సమస్త ప్రపంచ రూపముతో ఉన్న విని రూపములు అనంత ములు కావున అనంత రూపముగలవాడు, ఆశ్రీతులకు ఇవ్వదగిన అనంతైశ్వర్యములు కలవాడు,  క్రోధమును జయించిన వాడు, జీవుల సంసార భయమును పోగొట్టువాడు, జీవుల కర్మలకు తగిన ఫలమును న్యాయముగా ఇచ్చువాడు, పరిమాణమును నిర్ణయించుటకు అలవిగాక గంబీరమై యున్న స్వరూపము గలవాడు, అధికారు లైనవారికి అనేక విధములగు ఫలములను విశేషముగా ఇచ్చువాడు,ఇంద్రుడు మొదలైనవాటిని అనేక విధముల ఆజ్ఞాపించువాడు, సమస్త కర్మలకు గల ఫలములను వేదముద్వారా తెలియ జేయువాడు,అగు పరమాత్మునకు ప్రణామములు. 

  శ్లో. అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః !
జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః !! 101 !!


  అనాది:=సమస్తమునకు కారణమై యున్నవాడు గావున తనకు పైన కారణము లేనివాడు,
భూర్భువ:=సమస్త భూతములకు ఆధారమైన భూమికి ఆధారమైన వాడు,
లక్ష్మీః= ఆత్మలాభము కోరిన భక్తులకు తనే సమస్త సంపదలుగా నుండువాడు,
 సువీర:=భక్తుల ఆపదలను పరిహరించుటకు తగిన గొప్ప శక్తి గలవాడు,
 రుచిరాంగదః=మంగళ కరములైన బాహు పురులు కలవాడు,
జనన:=ప్రాణులను ఉత్పత్తి చేయు వాడు,

జనజన్మాది:= జన్మించు స్వభావము గలవాని జన్మకు మూల కారణమై ఉన్నవాడు,
భీమ:=భయకారణమై ఉన్నవాడు,
భీమపరాక్రమః = లోకములను హింసించు హిరణ్య కశిపుడు మెదలగువారి విషయమున భయంకరమైన పరాక్రమము కలవాడు,

భాష్యం : సమస్తమునకు కారణమై యున్నవాడు గావున తనకు పైన కారణము లేనివాడు,సమస్త భూతములకు ఆధారమైన భూమికి ఆధారమైన వాడు, ఆత్మలాభము కోరిన భక్తులకు తనే సమస్త సంపదలుగా నుండువాడు, భక్తుల ఆపదలను పరిహరించుటకు తగిన గొప్ప శక్తి గలవాడు, రుచిరాంగదః=మంగళ కరములైన బాహు పురులు కలవాడు, ప్రాణులను ఉత్పత్తి చేయు వాడు, జన్మించు స్వభావము గలవాని జన్మకు మూల కారణమై ఉన్నవాడు, భయకారణమై ఉన్నవాడు, లోకములను హింసించు హిరణ్య కశిపుడు మెదలగువారి విషయమున భయంకరమైన పరాక్రమము కలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 
శ్లో. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః !
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102 !!


ఆధార నిలయ:= ఆధారముజేలైన భూమి మొదలగు పంచ  భూత ములకు ఆధారమై ఉన్నవాడు,
ధాత:= ధర్మానుష్టాణమునకై ఆచార్య పదమును తాను కూడ   నిర్వహించు వాడు,
పుష్పహాసః=మొగ్గలాగా ఉన్న పూలకు విచ్చుకొనే లక్షణమును కల్పించి పుష్పహాస: అనబడువాడు,
ప్రజాగరః=నిత్యజ్ఞాన స్వరూపముడై చక్కగా మేల్కొని యుండు వాడు,
ఊర్ధ్వగః=అందరకు, అన్నింటికి పైన ఉండు వాడు,

సత్పథాచారః= సజ్జనులు ఆచరించు నట్టి కర్మలను ఆచరించువాడు,
ప్రాణదః=మృతములైన పరీక్షితులు మున్నగు వారిని బ్రతికించిన వాడు,
ప్రణవః =ప్రణవ మనగా పరమాత్ముయొక్క నామమగు ఓంకారము, అట్టి  ప్రణవమునకు,వీనికిని ఔపచారికముగా అభేదముగలదు గావున ప్రణవ:అనబడువాడు,
పణః = వ్యవహారము సలుపు వాడు,


భాష్యం : ఆధారముజేలైన భూమి మొదలగు పంచ  భూత ములకు ఆధారమై ఉన్నవాడు, ధర్మానుష్టాణమునకై ఆచార్య పదమును తాను కూడ   నిర్వహించు వాడు, మొగ్గలాగా ఉన్న పూలకు విచ్చుకొనే లక్షణమును కల్పించి పుష్పహాస: అనబడువాడు,నిత్యజ్ఞాన స్వరూపముడై చక్కగా మేల్కొని యుండు వాడు, అందరకు, అన్నింటికి పైన ఉండు వాడు, సజ్జనులు ఆచరించు నట్టి కర్మలను ఆచరించువాడు,
మృతములైన పరీక్షితులు మున్నగు వారిని బ్రతికించిన వాడు,ప్రణవ మనగా పరమాత్ముయొక్క నామమగు ఓంకారము, అట్టి  ప్రణవమునకు,వీనికిని ఔపచారికముగా అభేదముగలదు గావున ప్రణవ:అనబడువాడు, వ్యవహారము సలుపు వాడు, అగు పరమాత్ము నకు ప్రణామములు . 


శ్లో . ప్రమాణం ప్రాణవిలయ: ప్రాణబృత్ప్రాణజీవన:
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగ:!!103!!


ప్రమాణమ్  := రహస్యమైన పరమార్ధమున విశ్వాసము కలిగించు వాడు,
ప్రాణవిలయ:=ప్రాణుల ఆత్మలు తనయందే ఉంచుకొని ప్రాణ నిలయు డైనాడు 
ప్రాణబృత్ := ప్రాణములను అన్నము రూపంతో పోషించువాడు,
ప్రాణజీవన:= అన్న పానాదుల వలె ఆ జీవులను జీవన హేతువుగా నుండి జీవింప చేయువాడు,
తత్త్వం;= పారమార్ధిక సత్యమైన బ్రహ్మముయొక్క వాచకములను నియమించు వాడు
తత్త్వవిత్ :=తన తత్వమును తానే ఎరింగిన వాడు,
ఏ కాత్మా=చేతనా చేతనములన్నింటికీ తానొక్కడే శేషిగా నుండు వాడు,
జన్మమృత్యుజరాతిగ:= పుట్టుట, ఉండుట,,పెరుగుట,మార్పునొందుట,  కృశించుట, నశించుట,  షడ్వికారములకు అతీతమైనవాడు


భాష్యం :రహస్యమైన పరమార్ధమున విశ్వాసము కలిగించు వాడు,
ప్రాణుల ఆత్మలు తనయందే ఉంచుకొని ప్రాణ నిలయు డైనాడు ప్రాణము లను అన్నము రూపంతో పోషించువాడు,అన్న పానాదుల వలె ఆ జీవులను జీవన హేతువుగా నుండి జీవింప చేయువాడు, పారమార్ధిక సత్యమైన బ్రహ్మముయొక్క వాచకములను నియమించు వాడు తన తత్వమును తానే ఎరింగిన వాడు, చేతనా చేతనము లన్నింటికీ తానొక్కడే శేషిగా నుండు వాడు, పుట్టుట, ఉండుట, పెరుగుట,మార్పునొందుట,  కృశించుట, నశించుట,  షడ్వికారములకు అతీతమైనవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో . భూర్భువస్సుస్తరుస్తార: సవితా ప్రపితా మహా:
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాజ్ఞాంగో యజ్నవాహన:!!104!!


 భూర్భువస్సుస్తరు:=సువర్లోకములందు వసించు ప్రాణికోటులకు పారిజాత వృక్షమువలె ఆశ్రయముగా నుండువాడు,
తార:= వారాలను సంసారమును సముద్రము నుండి ఉత్తరింప చేయు వాడు,
 సవితా= సమస్తమును తానే ససృజించువాడు,
 ప్రపితా మహా:= పితామహుడని ప్రసిద్ధిపొందిన బ్రహ్మదేవునికి కూడా తండ్రి అయినవాడు,
యజ్ఞ:= తానే యఙ్ఞమై ఉండెడివాడు,
యజ్ఞపతి= యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు,
యజ్వా:= యజ్ఞమును అనుసహింప శక్తి లేని వారలాకుతనే యాగముచేయు వాడు,
 యజ్ఞాoగా =యజ్ఞములే  అవయములుగా కలవాడు,
 యజ్నవాహన:=ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా గలవాడు,
భాష్యం :
సువర్లోకములందు వసించు ప్రాణికోటులకు పారిజాత వృక్షమువలె ఆశ్రయముగా నుండువాడు,వారాలను సంసారమును సముద్రము నుండి ఉత్తరింప చేయు వాడు,సమస్తమును తానే ససృజించువాడు,
పితామహుడని ప్రసిద్ధిపొందిన బ్రహ్మదేవునికి కూడా తండ్రి అయిన వాడు, తానే యఙ్ఞమై ఉండెడివాడు, యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు,
యజ్ఞమును అనుసహింప శక్తి లేని వారలాకుతనే యాగముచేయు వాడు, యజ్ఞములే  అవయములుగా కలవాడు,ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో . యజ్ఞబృద్యజ్ఞ కృద్యజ్ఞీ యజ్ఞ భుగ్యజ్ఞసాధన:
యజ్ఞాంత కృద్యజ్న గుహ్యమన్నమన్నాద ఏవచ. !!105!!


యజ్ఞబృత్ = యజ్ఞమును భరించువాడు,
ద్యజ్ఞకృత్ = సృష్టి ఆరంభముననుచివరనుయజ్ఞము చేయువాడు,
యజ్ఞీ:= తన ఆరాధనారూపములైన యజ్ఞములకు శేషియైనవాడు,
యజ్ఞభుక్  = యజ్ఞమును రక్షించువాడు,
యజ్ఞ సాధన:= యజ్ఞమును సంప్రాప్తి సాధనముగ కలవాడు, 
యజ్ఞాంతకృత్=  యజ్ఞము నొనర్చుట తన తత్వమును తెలుపుటకు అణు సిద్ధాంతముచేసినవాడు ,
యఙ్ఞగుహ్యం: = యజ్ఞ విద్య నెరిగినవారికి తప్ప ఇతరులకు తానే యజ్ఞ రహస్యమును విషయమునునెఱిఁగింపఁ చేయనివాడు .
 అన్నం :=అన్నమువలె  అనుభవింప బడువాడు,
అ న్నాద:=తనను అనుభవించువారిని అనుభోగ్యముగా అనుభవించువాడు,
 ఏవచ.:=ఐగుణములన్ని పరమాత్మునకు ఉన్నాయి , మరి ఎవ్వరికి లేవు అని భీష్మపితామహుడు తె లియపరిచాడు , అటువంటి పరమాత్మునకు ప్రణామములు . 


శ్లో . ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయన: 
దేవకీ నందన స్ప్రష్టా క్షితీశ: పాపనాశన: !!106!!


ఆత్మయోని:= పాలతో చెక్కెరను చేర్చినట్లు తన్ననుభవించు వారలను తనతో చేర్చుకొనువాడు,
స్వ యంజాత:= తన సంకల్పము చేతనే అవతరించువాడు,
వైఖాన= భక్తుల యొక్క సంసార డు:ఖమును చీల్చి తొలగించువాడు,
సామగాయన:= భగవంతుడను మధువును ఆస్వాదించి హావు, హావు హావు అని  సామగానము చేయు ముక్తులు కలవాడు,
దేవకీ నందన:= మహా వైభవము కలవాడు,
స్ప్రష్టా =సమస్త లోకములను సృజించు వాడు,
క్షితీశ:=భూమికి ప్రభువైనవాడు గావున దశరథపుత్రుడైన శ్రీ రాముడు 'క్షితీశ:' అన బడినాడు 
 పాపనాశన:=తన దివ్య చేష్టితముల ననుభవించువారి పాపమును నాశనము చేయువాడు,
భాష్యం :

పాలతో చెక్కెరను చేర్చినట్లు తన్ననుభవించు వారలను తనతో చేర్చు కొనువాడు, తన సంకల్పము చేతనే అవతరించువాడు, భక్తుల యొక్క సంసార దు:ఖమును చీల్చి తొలగించువాడు, భగవంతుడను మధువును ఆస్వాదించి హావు, హావు హావు అని  సామగానము చేయు ముక్తులు కలవాడు,మహా వైభవము కలవాడు, సమస్త లోకములను సృజించు వాడు,భూమికి ప్రభువైనవాడు గావున దశరథపుత్రుడైన శ్రీ రాముడు 'క్షితీశ:' అన బడినాడు, తన దివ్య చేష్టితముల ననుభవించువారి పాపమును నాశనము చేయువాడు, అగు అపరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. శంఖబృనందకీ చక్రీ సారంగాధన్వా గదాధర:
రదాంగ పాణి రక్షోభ్య: సర్వ ప్రహరణాయుధ: !!107!!


శంఖబృత్ :=  పంచ భూతములకు కాది ఆయన అహంకారాత్మకమగు 'పాంచజన్య ' మనెడి శంఖమును ధరించినవాడు    
నందకీ:=విద్యా స్వరూపమైన నందక మను పేరుగల ఖడ్గము గలవాడు,
 చక్రీ:=మనస్తత్వాత్మకమైన సుదర్శన మనేడి చక్రము గలవాడు, అథవా సంసారచక్రమును తన ఆజ్ఞ చేత తిరుగునట్లు చేయువాడు,
 సారంగాధన్వా:=శార్ఙ్గమను ధనస్సును సదా ధరించువాడు,
 గదాధర:=కౌమోదకి అను గదను ధరించి ఉండువాడు,
రదాంగ పాణి:=స్వ స్వామి భావ సంబంధము వలన సుదర్శన చక్రము ఎల్లప్పుడూ అన శ్రీ హస్త మందు కలవాడు,
 అ క్షోభ్య:= జాయింప శక్యము కానివాడు,
 సర్వ  ప్రహరణాయుధ: తనని రక్షకమని ఆశ్రయించినవారి ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తగిన విధముగా సకల ఆయుధములను ధరించి ఉండెడివాడు,

భాష్యం :
పంచ భూతములకు కాది ఆయన అహం కారాత్మక మగు 'పాంచజన్య ' మనెడి శంఖమును ధరించినవాడు, విద్యా స్వరూపమైన నందక మను పేరుగల ఖడ్గము గలవాడు,మనస్తత్వాత్మకమైన సుదర్శన మనేడి చక్రము గలవాడు, అథవా సంసారచక్రమును తన ఆజ్ఞ చేత తిరుగునట్లు చేయువాడు,శార్ఙ్గమను ధనస్సును సదా ధరించువాడు,కౌమోదకి అను గదను ధరించి ఉండువాడు,స్వ స్వామి భావ సంబంధము వలన సుదర్శన చక్రము ఎల్లప్పుడూ అన శ్రీ హస్త మందు కలవాడు,జాయింప శక్యము కానివాడు, తనని రక్షకమని ఆశ్రయించినవారి ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తగిన విధముగా సకల ఆయుధములను ధరించి ఉండెడివాడు, అగు పరమాత్మునకు ప్రణామములు .




శ్లో . శ్రీ సర్వప్రహనాయుధ ఒన్నమైతి!!
వనమాలీగదీ శార్గీ శమ్ఖీ చక్రీ చ నందకీ,
శ్రీ మన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు !!108!!
"శ్రీ వాసుదేవోభిరక్షత్వొంనమ ఇతి ""
                                                                                                                                       
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి