15, జులై 2016, శుక్రవారం

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం -2,

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం  -2,

సర్వేజనా సుఖినోభవంతు

శ్లో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః !
వీరః శక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమః !!43!!

రామ:= రమింప చేయువాడు,
విరామ:= తనయందే సకల జీవులను విరామము నొందుట గలవాడు,
విరజ:= విషయములను సేవించుట యందలి ఆసక్తి నశించి నట్టివాడు,
మార్గ:= నిర్దోషమైన మార్గముములు చూపువాడు, 
నేయ:= నియ మింప దగినవాడు,తనవారికి అణిగి ఉండువాడు,
నయ:=ఆకర్షిమ్పబడి ఆశ్ర యించు వాడు, 
అనయః = మృదుత్వం లేనివాడు,
వీరః=శత్రువులను పారిపోవునట్లుచేయువాడు,

శక్తిమతాం శ్రేష్ఠ: =దేవడులచే మిక్కిలి కొని యాడబడువాడు,

ధర్మ:=  ధర్మములు చేత ఆరాధింప బడువాడు,
ధర్మవిదుత్తమః =ప్రతిఒక్కరికి ధర్మముల గురించి విశదీకరించువాడు,  

భాష్యం  :రమింప చేయువాడు,తనయందే సకల జీవులను విరామము నొందుట గలవాడు,విషయములను సేవించుట యందలి ఆసక్తి నశించి నట్టివాడు,నిర్దోషమైన మార్గముములు చూపువాడు,నియ మింప దగినవాడు, తన వారికి అణిగి ఉండువాడు,ఆకర్షిమ్పబడి ఆశ్ర యించు వాడు,మృదుత్వం లేనివాడు, శత్రువులను పారిపోవునట్లుచేయువాడు, దేవతలచే మిక్కిలి కొని యాడబడువాడు,ధర్మములు చేత ఆరాధింప బడువాడు,ప్రతి ఒక్కరికి ధర్మముల గురించి విశదీకరించువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు.   

శ్లో.వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః !
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః !!44!!

వైకుంఠః = సమస్తము ఒకదానితో ఒకటి సంభందము కలుగు నట్లుగా చేయువాడు,
పురుషః = సమస్తమును పాలించువాడు ,
ప్రాణః=అందరును జీవించు నట్లుచేయువాడు,
ప్రాణదః= ప్రాణములను ఇచ్చువాడు,
ప్రణవః =ప్రణవ నాదం "ఓంకారం "సృష్టించినవాడు,
పృథుః =ప్రపంచ రూపమును విస్తరించువాడు,
హిరణ్యగర్భః=  ధ్యానించే వారి హృదయములు బంగారములు, వాటి యందు ప్రకాశించు వాడు,

శత్రుఘ్న:= దేవతలా శత్రువులను సంహరించువాడు,
వ్యాప్త:= కార్యములైన వాణి నన్నింటిని కారణ స్వరూపముతో వ్యాపించి యుండువాడు,
వాయు:= గంధమును కలుగ చేయవాడు
అధోక్షజః = అందరిచేతను అనుభవించ బడుతున్నను కొంచెము కూడ  తగ్గనివాడు,


భాష్యం  :సమస్తము ఒకదానితో ఒకటి సంభందము కలుగు నట్లుగా చేయువాడు,సమస్తమును పాలించువాడు , అందరును జీవించు నట్లుచేయువాడు,ప్రాణములను ఇచ్చువాడు, ప్రణవ నాదం "ఓంకారం "సృష్టించినవాడు,ప్రపంచ రూపమును విస్తరించువాడు, ధ్యానించే వారి హృదయములు బంగారములు, వాటి యందు ప్రకాశించు వాడు, దేవతలా శత్రువులను సంహరించువాడు, కార్యములైన వాణి నన్నింటిని కారణ స్వరూపముతో వ్యాపించి యుండువాడు, గంధమును కలుగ చేయవాడు,అందరిచేతను అనుభవించ బడుతున్నను కొంచెము కూడ  తగ్గనివాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 

 శ్లో. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః !
ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వ దక్షిణః !!45!!

ఋతుః = అందరకు ఉల్లాసకరములైన గుణములతో కూడినవాడు,
సుదర్శనః = తనగుణము లెరుగని వారికి తనదర్శనమే శుభముగా కలవాడు,
కాలః=సమస్త చరాచర గణనచేయు (లెక్కపెట్టు ) వాడు,
పరమేష్ఠీ= హ్రుదయాకాశములోపల ఉత్కుష్టమైన తన మహిమ యందే  ఉండునట్టి స్వభావముగలవాడు,
 పరిగ్రహః = సర్వవ్యాపి కావున తనను శరణు చోచ్చినవారికి అంతటను లభించువాడు,  భక్తులిచ్చునట్టి తులసీదలము పుష్పము మొదలైన వానిని చక్కగా గ్రహించువాడు,
ఉగ్రః= సూర్యుడు మొదలైన వారికిగూడ భయహేతువుగా ఉన్నవాడు,

సంవత్సర:= సకల భూతములు తనయందే నివసించుట గలవాడు,
దక్ష:=జగద్రూపమున వృద్ది నొందువాడు, అధవా సమస్త కర్మలను సీఘ్రముగా చేయునట్టివాడు,
విశ్రామ:= పాప ఫలము లనభవించి అలసిన వారు విశ్రాన్తి నొందు  స్థలముగా నున్నవాడు, 
విశ్వ దక్షిణః=అందరికంటే మిక్కిలి గొప్ప శక్తి గలవాడు,


భాష్యం  :అందరకు ఉల్లాసకరములైన గుణములతో కూడినవాడు, తనగుణము లెరుగని వారికి తనదర్శనమే శుభముగా కలవాడు, సమస్త చరాచరగణనచేయు(లెక్కపెట్టు ) వాడు, హ్రుదయాకాశము లోపల ఉత్కుష్టమైన తన మహిమ యందే  ఉండునట్టి స్వభావము గలవాడు, సర్వవ్యాపి కావున తనను శరణు చోచ్చినవారికి అంతటను లభించువాడు, భక్తులిచ్చునట్టి తులసీదలము పుష్పము మొదలైన వానిని చక్కగా గ్రహించువాడు, సూర్యుడు మొదలైన వారికిగూడ భయహేతువుగా ఉన్నవాడు, సకల భూతములు తనయందే నివసించుట గలవాడు,జగద్రూపమున వృద్ది నొందువాడు, అధవా సమస్త కర్మలను సీఘ్రముగా చేయునట్టివాడు,పాప ఫలము లనభవించి అలసిన వారు విశ్రాన్తి నొందు  స్థలముగా నున్నవాడు,అందరికంటే మిక్కిలి గొప్ప శక్తి గలవాడు,అగు పరమాత్మునికి ప్రణామములు . 

శ్లో. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం !
అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!46!!
  
విస్తారః =  సమస్త లోకములు తనయందే విసరించుట గలవాడు,
స్థావర స్థాణుః = ధర్మమును స్థాపించి తరువాత శాంతిచువాడు,
ప్రమాణం =జ్ఞాన స్వరూపుడు ,
బీజమవ్యయం = ఎట్టి మార్పులు లేని యట్టి కేవలసత్తా స్వరూపుడును జగత్తునకు కారణమును ఐనవాడు,
అర్థ:= సుఖస్వరూపుడగుట వలన అందరరచేతను కోరబడు నట్టివాడు,

అనర్థ:= పూర్ణ కాముడు గావున తనకేదియు అవసరము లేనివాడు,
మహా కోశ:= అన్నమయాది మహాకోశములు ఆవరణములుగా గలవాడు,
మహా భోగ:=  సుఖ స్వరూపమైన భోగముకలవాడు,
మహాధనః = భోగ సాధన రూపమైన గొప్ప ధనము గలవాడు,

భాష్యం  : సమస్త లోకములు తనయందే విసరించుట గలవాడు, ధర్మమును స్థాపించి తరువాత శాంతిచువాడు, జ్ఞాన స్వరూపుడు ,ఎట్టి మార్పులు లేని యట్టి కేవలసత్తా స్వరూపుడును జగత్తునకు కారణమును ఐన వాడు, సుఖస్వరూపుడగుట వలన అందరరచేతను కోరబడు నట్టివాడు,పూర్ణ కాముడు గావున తనకేదియు అవసరము లేనివాడు,అన్న మయాది మహాకోశములు ఆవరణములుగా గలవాడు, సుఖ స్వరూప మైన భోగముకలవాడు, భోగ సాధన రూపమైన గొప్ప ధనము గలవాడు,రమాత్మునికి ప్రణామములు

శ్లో. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః !
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః !!47!!

అనిర్విణ్ణ:= సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము లేకుండువాడు,
స్థవిష్ఠో:= విరాడ్రూపముతో నున్నవాడు,
అభూ:= ద్రువునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు,
ధర్మయూప:= ధర్మమును తత్వమును శిరసుగా చేర్చుకొనువాడు,
మహామఖః = ధర్మ శరీరుడు కనుక  యజ్ఞమును అవయవముగా కలవాడు,
నక్షత్రనేమి : = జ్యొతిశ్చక్రమును ప్రవర్తింప చేయువాడు,

నక్షత్రీ:=నక్షత్ర రూపమును ధరించువాడు,  
క్షమః =సమస్త భూ భారమును అనాయాసముగా వహించువాడు,
క్షామః = సమస్త వికారములను శాసించి స్వస్వరూపమును నుండునట్టి జీవుడు,
సమీహనః =సృష్ట్యాదుల నిమిత్తము చక్కగా ప్రయత్నిమ్చువాడు,

భాష్యం  :సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము లేకుండువాడు, విరాడ్రూపముతో నున్నవాడు,దృవునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు, ధర్మమును తత్వమును శిరసుగా చేర్చు కొనువాడు, ధర్మ శరీరుడు కనుక  యజ్ఞమును అవయవము గా కలవాడు, జ్యోతిశ్చక్రమును ప్రవర్తింప చేయువాడు, నక్షత్ర రూపమును ధరించువాడు,  సమస్త భూ భారమును అనాయాసముగా వహించు వాడు,సమస్త వికారములను శాసించి స్వస్వరూపమును నుండునట్టి జీవుడు, సృష్ట్యాదుల నిమిత్తము చక్కగా ప్రయత్నిమ్చువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః !
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ !!48!!

యజ్ఞ:= సమస్త యజ్ఞ స్వరూపుడు, దేవతలనుసంతోశము పెట్టువాడు, ఇజ్య:= కామ్యఫలములను కోరువారలకు ఇంద్రాదుల ద్వారా ఆరాధింప బడువాడు, 
మహేజ్యశ్చ:= మోక్షమనేది మహాఫలము నిచ్చువడగుటచేత దేవత లందరలోను లెస్సగా పూజింప దాగి యున్నవాడు,. 
క్రతుః =యూపస్తంభముతో గూడిన యజ్నముగా నున్నవాడు,
సత్రం:=బహుకాలము చేయువలసిన సత్ర యాగాదులచే ఎల్లపుడు ఆరాధింప బడువాడు,
సతాంగ:= సజ్జనులకు యితడు దప్పమరొక గతిలేదు కావున ఆదు కొనేవాడు,
సర్వదర్శీ:= సమస్త ప్రాణులను ఎమేమిచేయునది,  చేయునది అంత యును స్వాభావికమైన జ్ఞానము చేత చూచు చుండువాడు,

విముక్తాత్మా:= స్వాభావికముగానే ముక్తి నొంది యున్న స్వరూపము గలవాడు,
సర్వజ్ఞ:= సర్వప్రకారముల చేత తన్నెరిగినవాడు,
జ్ఞాన ముత్తమమ్:=ఉతమములగు వైష్ణవ ధర్మములన్నియు ఎరిగిన వాడు 

భాష్యం  :సమస్త యజ్ఞ స్వరూపుడు, దేవతలనుసంతోశము పెట్టువాడు,  కామ్య ఫలములను కోరువారలకు ఇంద్రాదుల ద్వారా ఆరాధింప బడువాడు,మోక్షమనేది మహాఫలము నిచ్చువడగుటచేత దేవత లందరలోను లెస్సగా పూజింప దాగి యున్నవాడు, యూప స్తంభముతో గూడిన యజ్నముగా నున్నవాడు, బహుకాలము చేయు వలసిన సత్ర యాగాదులచే ఎల్లపుడు ఆరాధింప బడువాడు, సజ్జనులకు యితడు దప్పమరొక గతిలేదు కావున ఆదు కొనేవాడు,  సమస్త ప్రాణులను ఎమేమిచేయునది,  చేయునది అంత యును స్వాభావికమైన జ్ఞానము చేత చూచు చుండువాడు,  స్వాభావికముగానే ముక్తి నొంది యున్న స్వరూపము గలవాడు,  సర్వప్రకారముల చేత తన్నెరిగినవాడు,ఉత్తమములగు వైష్ణవ ధర్మములన్నియు ఎరిగిన వాడు  అగు పరమాత్ము నికి ప్రణామములు. 


శ్లో. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ః !
మనోహరో జిత క్రోధో వీరబాహు ర్విదారణః !!49!!

సువ్రతః=  మంచి నియమము గలవాడు, 
సుముఖః =వికారములేని అందమైన ముఖము కలవాడు,
సూక్ష్మః= శబ్దము మొదలైన స్థూలకరణములు లేనివాడు, 
సుఘోషః=సుందరమైన వేదరూపమగు ధ్వని గలవాడు,
సుఖదః = సత్ప్రవర్తన గలవారికి సుఖము పంచువాడు,
సుహృత్ః = ప్రత్యుపకరమును కోరకయే ఉపకారము చేయువాడు,
మనోహర:=అపకరించు వారి మనస్సును కూడా హరించువాడు,

జితక్రోధ:= క్రోధమును జయించువాడు,
వీరబాహు:= వేదమర్యాదాలను నిలబెట్టుటకై వీర బాహు రూపంతో  అసురలను సంహరించువాడు,
విదారణః= ధర్మము లేని వారిని చీల్చి వేయువాడు,

భాష్యం  :మంచి నియమము గలవాడు,  వికారములేని అందమైన ముఖము కలవాడు,శబ్దము మొదలైన స్థూలకరణములు లేనివాడు, సుందర మైన వేదరూపమగు ధ్వని గలవాడు,సత్ప్రవర్తన గలవారికి సుఖము పంచువాడు, ప్రత్యుపకరమును కోరకయే ఉపకారము చేయువాడు, అపకరించు వారి మనస్సును కూడా హరించువాడు, క్రోధమును జయించువాడు, వేదమర్యాదాలను నిలబెట్టుటకై వీర బాహు రూపంతో  అసురలను సంహరించువాడు, ధర్మము లేని వారిని చీల్చి వేయువాడు,అగు పరమాత్మునకు ప్రణామములు

శ్లో. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్ !
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !!50!!

స్వాపనః = ప్రాణులను మాయచేత ఆత్మ జ్ఞాన రహితులునుగా చేయుచు నిద్ర  పుచ్చు నటివాడు,
స్వవశ:= జగత్తు యోక్క సృష్టి స్తితి లయములకు హేతువై స్వతంత్రుడు గా నుండువాడు,
వ్యాపీ:=అకాశమువలె సర్వము వ్యాప్తిచెందు యుండువాడు ,
నైకాత్మా:=జగత్తుయోక్క సృష్ట్యాదుల విషయమై వ్యక్తమగు నట్టి నిమిత్త  శక్తులగు విభూతులతో అనేక విధములుగా ఉండు వాడు,  
నైక కర్మ కృత్:= జగత్తును ఉత్పన్నము చేయుట వృద్ది నొందించు, ఆపదల నొందించుట మున్నగుకార్యముల్ను జేయువాడు,
వత్సర:= అనయుతనయందే నివసించుట గలవాడు,

వత్సల:= భక్తులైన వారియందు పరమ గలవాడు,
వత్సీ:= కోడెదూడలను కాపాడేవాడు,
రత్నగర్భ:= రత్నములే గర్భముగా గలిగియున్నవాడడగుటచేత రత్నగర్భుడైనాడు, 
ధనేశ్వరః= ధనములకు ప్రభువుగా ఉన్నవాడు, 

భాష్యం  :ప్రాణులను మాయచేత ఆత్మ జ్ఞాన రహితులునుగా చేయుచు నిద్ర  పుచ్చు నటివాడు,జగత్తు యోక్క సృష్టి స్తితి లయములకు హేతువై స్వతంత్రుడు గా నుండువాడు,అకాశమువలె సర్వము వ్యాప్తిచెందు యుండువాడు ,జగత్తుయోక్క సృష్ట్యాదుల విషయమై వ్యక్తమగు నట్టి నిమిత్త  శక్తులగు విభూతులతో అనేక విధములుగా ఉండు వాడు,  
జగత్తును ఉత్పన్నము చేయుట వృద్ది నొందించు, ఆపదల నొందించుట మున్నగుకార్యముల్ను జేయువాడు, అనయుతనయందే నివసించుట గలవాడు, భక్తులైన వారియందు పరమ గలవాడు,కోడెదూడలను కాపాడేవాడు, రత్నములే గర్భముగా గలిగియున్నవాడడగుటచేత రత్నగర్భుడైనాడు, ధనములకు ప్రభువుగా ఉన్నవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు.   

శ్లో. ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్ క్షరమ క్షరమ్ !
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః !!51!!

ధర్మగుప్ := తానిచ్చిన ధర్మకామములు దుర్విషయమున పోకుండా కాచి ధర్మమును రక్షించువాడు,
 ధర్మకృత్ := తానూ అనుగ్రహించుటకు కారణమైన ధర్మమును చేతనులకు తానె లభింప చేయుటచే అనగా ధర్మమును చేయువాడు,
ధ్ర్మీ:=ధర్మము తప్పనివాడు
సత్ := ఎల్లపుడు ఉండువాడు,
అక్షరం := వికారము లేకుండు వాడు,
అసత్ := అసత్ గా ఉండు వాడు,
క్షరమ = వికారము గలవాడు
అవిజ్ఞాతా:= అనభాక్తులు అపకారములు చేసినా వానిని ఎరుంగక ఉండ ని వాడు,

 సహస్రాంశు:= అపరిమితము గలవాడు,లోకములో అపరాధి అయిన నాదృష్టిలో నాభాక్తుడైతే నిరపరాధి కలవాడు,
విధాతా:= సమస్త భూతములను ధరించునట్టి శేషుడు, దిగ్గజములు, పర్వతములు అను వీనిని సైతము విశేషించి ధరించు నట్టివాడు,
 కృతలక్షణః = నిత్య సిద్దమై యున్న చైతన్యమే స్వరూపముగా గలిగి యున్నవాడు ,


భాష్యం  :తానిచ్చిన ధర్మకామములు దుర్విషయమున పోకుండా కాచి ధర్మము ను రక్షించువాడు,  తానూ అనుగ్రహించుటకు కారణమైన ధర్మమును చేతనులకు తానె లభింప చేయుటచే అనగా ధర్మమును చేయువాడు,ధర్మము తప్పనివాడు ,  ఎల్లపుడు ఉండువాడు, వికారము లేకుండు వాడు,  అసత్ గా ఉండు వాడు, వికారము గలవాడు  అనభాక్తులు అపకారములు చేసినా వానిని ఎరుంగక ఉండ ని వాడు,   అపరిమితము గలవాడు,లోకములో అపరాధి అయిన నాదృష్టిలో నాభాక్తుడైతే నిరపరాధి కలవాడు,  సమస్త భూతములను ధరించునట్టి శేషుడు, దిగ్గజములు, పర్వతములు అను వీనిని సైతము విశేషించి ధరించు నట్టివాడు,   నిత్య సిద్దమై యున్న చైతన్యమే స్వరూపముగా గలిగి యున్నవాడు ,అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. గభస్తినేమి సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః !
ఆది దేవో మహా దేవో దేవేశో దేవ భృద్గురుః !!52!!

గభస్తినేమి :=నడుమ సూర్యుని రూపముతో ఉండు వాడు ,
సత్త్వస్థః=సత్వగుణ ములచే ప్రధానముగా అధిష్టించి యుండువాడు ,
 సింహ:= సింహమువలే పరాక్రమ శాలియై ఉన్నవాడు,
భూతమహేశ్వరః =భూతములకుమహా ప్రభువియా ఉన్నవాడు ,
ఆది దేవ:=సమస్త భూతములకు ఆఅది దేవుడు ,

 మహా దేవ:=బ్రహాడులనుబంతుల వాలే ఆడువాడు,
 దేవేశ:=ముఖ్యముగా దేవతలకుప్రభువైన వాడు ,
 దేవ భృత్ =యదేచ్చగా వియోగించుచు భరించువాడు,
గురుః =వేదవాక్యములుతెలియపరుస్తూ గురువైనవాడు ,

భాష్యం  :నడుమ సూర్యుని రూపముతో ఉండు వాడు ,సత్వగుణ ములచే ప్రధానముగా అధిష్టించి యుండువాడు , సింహమువలే పరాక్రమ శాలియై ఉన్నవాడు,భూతములకుమహా ప్రభువియా ఉన్నవాడు, సమస్త భూతములకు ఆఅది దేవుడు ,బ్రహాడులనుబంతుల వాలే ఆడువాడు,ముఖ్యముగా దేవతలకుప్రభువైన వాడు ,యదేచ్చగా వియోగించుచు భరించువాడు,వేదవాక్యములుతెలియపరుస్తూ గురువైనవాడు ,అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞాన గమ్య పురాతనః !
శరీర భూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః !!53!!

ఉత్తర := దేవతులకు అసురులచే గల్గు ఆపదలను తప్పించు వాడు, 
గోపతి:=గోవునకు, భూదేవికి, పాటి అయినవాడు,  
గుప్తా:= సమస్త భూతములను పోషించుచు జగద్రక్షుడై ఉండువాడు,
జ్ఞాన గమ్య:= కర్మచే గాని, జ్ఞానము మరియు కర్మ యనెడి యీ రెండింటిచే గాని లభింపక కేవల జ్ఞానముచేతనే లభించు నట్టివాడు,
పురాతనః =పూర్వమె యుండి ఉన్నవాడు,
శరీరభూత భృత్ := ప్రాణ  రూపమునుధరించిన వాడై శరీరము ఉత్పన్నము చేయు భూతములను పోషించు నాట్టివాడు ,

భోక్తా:= పాలన చేయునట్టివాడు
కపీంద్ర:= వానరరూపమైన మారువేషమును ధరించిన దేవతలకు ప్రభువైనవాడు,
 భూరి దక్షిణః = లోకులకు తెలియుటకై అశ్వ్మెధది యాగాములను తానూ చేసి, బ్రాహ్మణులకు విశేష దక్షినలు నిచ్చినవాడు,

భాష్యం  :దేవతులకు అసురులచే గల్గు ఆపదలను తప్పించు వాడు, గోవునకు, భూదేవికి, పాటి అయినవాడు,  సమస్త భూతములను పోషించుచు జగద్రక్షుడై ఉండువాడు,  కర్మచే గాని, జ్ఞానము మరియు కర్మ యనెడి యీ రెండింటిచే గాని లభింపక కేవల జ్ఞానముచేతనే లభించు నట్టివాడు,పూర్వమె యుండి ఉన్నవాడు, ప్రాణ  రూపమును ధరించిన వాడై శరీరము ఉత్పన్నము చేయు భూతములను పోషించు నాట్టివాడు ,పాలన చేయునట్టివాడు,  వానరరూపమైన మారు వేషమును ధరించిన దేవతలకు ప్రభువైనవాడు,  లోకులకు తెలియుటకై అఅశ్వమెధాది యాగాములను తానూ చేసి, బ్రాహ్మణులకు విశేష దక్షినలు ఇచ్చిన వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు .


శ్లో. సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః !
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః !!54!!

సోమప := సోమ పానము చేసినవాడు,
అమృతపః = అమృతమును పానము చేసినవాడు,
సోమః =అమృతముగా ఉండు వాడు,
పురుజిత్ := పలువురను జయించినవాడు,
పురుసత్తమః = మహనీయుల యందుడు వాడు,
వినయ:= మారీచాదులను తన వీర్యముచే అణచినవాడు,
 జయః = సకల భూతములను జయించినవాడు,

సత్యసంధ:= సత్యమైన సంకల్పము గలవాడు,
 దాశార్హః =దానమునకు అర్హుడైనవాడు,
సాత్వతాం పతి :=పరమ సాత్వికులకు రక్షకుడు,

భాష్యం  :సోమ పానము చేసినవాడు, అమృతమును పానము చేసినవాడు,అమృతముగా ఉండు వాడు, పలువురను జయించిన వాడు, మహ నీయుల యందుడు వాడు, మారీచాదులను తన వీర్యము చే అణచిన వాడు,  సకల భూతములను జయించినవాడు,  సత్యమైన సంకల్పము గలవాడు,  దానమునకు అర్హుడైనవాడు,పరమ సాత్వికు లకు రక్షకుడు, అగు పరమాత్మునకు ప్రణామములు . 

 శ్లో. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !
అంభోనిథి రనంతాత్మా మహోదధి శయోన్తకః !!55!!


 జీవ := భాగావతోత్తములకు తన కైంకర్యము నిచ్చి జీవింప  చేయు వాడు,
 వినయితా:= భక్తులనుబుజ్జగించి రక్షించు వాడు,
 సాక్షీ:= భక్తులక్రుత్యములను వారినిసన్మాఅర్గవరనులుగ్గ చేయుటకు నేరుగా చూచు చుండెడివాడు,
 ముకుంద:=మోక్షము నిచ్చువాడు,
 అమిత విక్రమః = ఆధారశక్తి యను అపరిమిత బలమును ధరించిన వాడు,
అంభోనిథి := సముద్ర జలమున నుండు వాడు,

అనంతాత్మా:= ఆది కూర్మము పైన ఉండి సమస్త జగత్తును వహించు ఆది శేషువుకు అంతరాత్మగా నుండువాడు,
 మహోదధియ :=ప్రలయకాలంలున అ అనంతుపై సముద్రమున శయ నించు వాడు,
 అంతకః= భూతములకు అంతము కలుగ చేయువాడు,

భాష్యం  :భాగావతోత్తములకు తన కైంకర్యము నిచ్చి జీవింప  చేయు వాడు,భక్తులనుబుజ్జగించి రక్షించు వాడు,   భక్తులక్రుత్యములను వారిని సన్మాఅర్గవరనులుగ్గ చేయుటకు నేరుగా చూచు చుండెడివాడు, మోక్షము నిచ్చువాడు, ఆధారశక్తి యను అపరిమిత బలమును ధరించిన వాడు,  సముద్ర జలమున నుండు వాడు,ఆది కూర్మము పైన ఉండి సమస్త జగత్తును వహించు ఆది శేషువుకు అంతరాత్మగా నుండువాడు,  ప్రలయకాలంలున అ అనంతుపై సముద్రమున శయ నించు వాడు,   భూతములకు అంతము కలుగ చేయువాడు,  

శ్లో . అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర: ప్రమోదన:!
ఆనందో వందనో నంద:సత్యధర్మా త్రివిక్రమ: !!56!!

అజ:="అ " కారమునకు అర్ధమైన వాడు,
మహార్హ:= ఆకారము నుండి పుట్టి నందున ఓం కారముచే పూజిమ్ప దగినవాడు,
స్వాభావ్య:= నిత్యసిద్దమే యై ఉన్న  స్వభావముగనే భావింప బడనివాడు,
జితామిత్ర:= భక్తులయొక్క అహంకార మమకారాడులను తొలగించు వాడు,
ప్రమోదన:= తనను అనుసంధించిన క్షణములోనే ఆనందిప చేయువాడు,   
ఆనంద:= ఆనందమే తన రూపము గలవాడు,
వందన:=ఆనందమును ముక్తి దశలో చేతనులకిచ్చి ఆనందింప చేయు వాడు,
నంద:= ఆనందము కలుగ చేయువాడు,
సత్యధర్మా:= సత్యమైన వ్యాపారము గలవాడు,
త్రివిక్రమ:= మూదు వేదముల యందు ఉండి త్రివిక్రముడై నవాడు,  

భాష్యం  :"అ " కారమునకు అర్ధమైన వాడు, ఆకారము నుండి పుట్టి నందున ఓం కారముచే పూజిమ్ప దగినవాడు,  నిత్యసిద్దమే యై ఉన్న  స్వభావము గనే భావింప బడనివాడు,  భక్తులయొక్క అహంకార మమకారాడులను తొలగించు వాడు,  తనను అనుసంధించిన క్షణములో నే ఆనందిప చేయువాడు,  ఆనందమే తన రూపము గలవాడు, ఆనందమును ముక్తి దశలో చేతనులకిచ్చి ఆనందింప చేయు వాడు, ఆనందము కలుగ చేయువాడు,  సత్యమైన వ్యాపారము గల వాడు,  మూదు వేదముల యందు ఉండి త్రివిక్రముడై నవాడు,  అగు పరమాత్మునికి ప్రమాణములు. 

శ్లో . మహర్షి: కపిలాచార్య: కృతజ్ఞో మేది నీపతి:!
త్రిపద త్రి దశా ధ్యక్షో మహశ్రుంగ: క్రుతాంతకృత్ !!57!!


మహర్షి:= మూడు వేదములను  ప్రత్యక్షముగా దర్శించువాడు,
కపిలాచార్య:=కపిల వర్ణము గలవాడు,
కృతజ్ఞ:= కార్య రూపమైన జగత్తు, జగత్తుయందు కృతజ్నుడుగా ఉండువాడు,
మేది నీపతి:=భూదేవికి భర్త అయిన వాడు,
త్రిపద:= మూడు అడుగులు కలవాడు,
 త్రిదశా ధ్యక్ష:=వరాహరూపమున ప్రలయాపాడలో బ్రహ్మాదులకు అధ్యక్షుడుగా నుండువాడు,
మహశ్రుంగ:= సాటిలేని పెద్ద కోరలుగలవాడు,
క్రుతాంతకృత్ :=యముని వంటి హిరణ్యాక్షుడిని సంహరించినవాడు 

భాష్యం  :మూడు వేదములను  ప్రత్యక్షముగా దర్శించువాడు,కపిల వర్ణము గలవాడు, కార్య రూపమైన జగత్తు, జగత్తుయందు కృతజ్నుడుగా ఉండువాడు,భూదేవికి భర్త అయిన వాడు, మూడు అడుగులు కలవాడు, వరాహరూపమున ప్రలయాపాడలో బ్రహ్మాదులకు అధ్యక్షుడుగా నుండువాడు, సాటిలేని పెద్ద కోరలుగలవాడు, యముని వంటి హిరణ్యాక్షుడిని సంహరించినవాడు  అగు పరమాత్మునకు ప్రణామములు .

శ్లో. మహా వరాహో గోవిందః సుషేణః కనకాంగదీ !
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః !! 58 !!
 


మహా వరాహ:= మహాత్తుగల వాడును వరాహరూపియు నైనవాడు,
గోవిందః = వేద వాక్కు లచేత పొంద బడువాడు,
సుషేణః=పార్ష ద గణ రూపమైన చక్కని సేన గలవాడు,
కనకాంగదీ:= సువర్ణ మయము లైన  దివ్యాభరణ ములను ధరించిన వాడు,  
గుహ్య:= రహస్యములైన ఉపనిషత్తులచేత  తెలిసి కొనదగి యున్న వాడు 

గభీర:= జ్ఞానము, ఐశ్వర్యము, బలము వీర్యము మొదలైన వానిచేత గమ్భీరముగా ఉండువాడు,
గహన:= మిక్కిలి కష్టముగా ప్రవేశింప బడువాడు,
గుప్త:= మనోవక్కులకు అగోచర మైనవాడు,
చక్ర గదాధరః =  చక్రము, గద మొదలగు దివ్యాయుధములను ధరించిన వాడు,

భాష్యం  :మహాత్తుగల వాడును వరాహరూపియు నైనవాడు, వేద వాక్కు లచేత పొంద బడువాడు, పార్ష ద గణ రూపమైన చక్కని సేన గలవాడు,సువర్ణ మయము లైన  దివ్యాభరణ ములను ధరించిన వాడు, రహస్యములైన ఉపనిషత్తులచేత  తెలిసి కొనదగి యున్న వాడు 
జ్ఞానము, ఐశ్వర్యము, బలము వీర్యము మొదలైన వానిచేత గమ్భీరము గా ఉండువాడు, మిక్కిలి కష్టముగా ప్రవేశింప బడువాడు,
మనోవక్కులకు అగోచర మైనవాడు,  చక్రము, గద మొదలగు దివ్యా యుధములను ధరించిన వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో. వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః !
వరుణో వారణో వృక్షః పుష్కరాక్షో మహామనః !! 59!!

వేధాః =సృష్టి చేయువాడు,
స్వాంగ:=కార్యసాధనుమున తనకుతానే సహాయముగా గలవాడు,
అ జితః = అవతారములయన్దు ఎవనిచేత గూద అపజయమును పొందనివాడు,
కృష్ణ::=నల్లని శరీరము గలవాడు,
దృఢః= తనస్వరూపము, సామర్ద్యము మెదలైన వానినుండి జారుట  యనునది లేనివాడు,
సంకర్షణ:= ప్రళయకాలమున ప్రజల నందరను ఒక్కమారు తనలోనికి ఆకర్షించు కొనువాడు,
అ చ్యుతః = పరములో వలే ప్యూహమున కుడా తనస్తానము నుండి జారనివాడు,
వరుణ:=సమస్తమును ఆవరించి ఉండువాడు,

వారణ:= తనని వరించు వారలు కలవాడు,
వృక్షః= వృక్షమువలే చలన రహితుడై ఉండువాడు,
పుష్కరాక్ష:=హృదయ కమలమును వ్యాపొంచి యుండువాడు, కృపను వర్షించు నేత్రములు కలవాడు,
మహామనః =సృష్టి స్తిలల్యము లనేది కార్యములను మనస్సు తోనే చేయువాడు,

భాష్యం  :సృష్టి చేయువాడు,కార్యసాధనుమున తనకుతానే సహాయము గా గలవాడు, అవతారములయన్దు ఎవనిచేత గూద అపజయమును పొందనివాడు, నల్లని శరీరము గలవాడు, తనస్వరూపము, సామర్ద్యము మెదలైన వానినుండి జారుట  యనునది లేనివాడు,  ప్రళయకాలమున ప్రజల నందరను ఒక్కమారు తనలోనికి ఆకర్షించు కొనువాడు,  పరములో వలే ప్యూహమున కుడా తనస్తానము నుండి జారనివాడు, సమస్తమును ఆవరించి ఉండువాడు, తనని వరించు వారలు కలవాడు,వృక్షమువలే చలన రహితుడై ఉండువాడు, హృదయ కమలమును వ్యాపొంచి యుండువాడు, కృపను వర్షించు నేత్రములు కలవాడు,సృష్టి స్తిలల్యము లనేది కార్యములను మనస్సు తోనే చేయువాడు,అగు పరమాత్మునకు ప్రణామములు

శ్లో. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః!
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః !! 60 !!

భగవాన్:= పరమ పూజ్యుడు, సమస్త కళ్యాణ గుణ స్వరూపుడు, సమస్త దోష రహితుడు,  
భగహా : సంహార కాలమున ఐశ్వర్యము మున్నగు వానిని కొట్టి వేయు వాడు,
ఆ నందీ:= సుఖస్వరూపుదిఅ ఉండువాడు, సంపదలతో సమృద్దిగా ఉండువాడు,
వనమాలీ:= పంచ తన్మాత్ర  రూపమైన వైజయంతి యను పేరుగల వనమాలను ధరించువాడు,
హలాయుధః=నాగలి ఆయుధముగా కలిగినవాడు,
ఆదిత్య:= కశ్యప మహర్షికి అదితియందు వామన రూపమున అవతరించి నట్టివాడు,

జ్యోతిరాదిత్యః=సూర్య మండలాంతర్గతమైన జ్యోతి యందు ఉండువాడు,
సహిష్ణు;=శీతోష్ణాది ద్వంద్వములను సహించు కొనువాడు,
గతిసత్తమః = ఎల్లరకును గతియును సర్వ శ్రేష్టుడును ఐ యున్నవాడు,

భాష్యం  :పరమ పూజ్యుడు, సమస్త కళ్యాణ గుణ స్వరూపుడు, సమస్త దోష రహితుడు,  సంహార కాలమున ఐశ్వర్యము మున్నగు వానిని కొట్టి వేయు వాడు, సుఖస్వరూపుదిఅ ఉండువాడు, సంపదలతో సమృద్దిగా ఉండువాడు, పంచ తన్మాత్ర  రూపమైన వైజయంతి యను పేరుగల వనమాలను ధరించువాడు, నాగలి ఆయుధముగా కలిగినవాడు,
కశ్యప మహర్షికి అదితియందు వామన రూపమున అవతరించి నట్టి వాడు, సూర్య మండలాంతర్గతమైన జ్యోతి యందు ఉండువాడు,
శీతోష్ణాది ద్వంద్వములను సహించు కొనువాడు, ఎల్లరకును గతియును సర్వ శ్రేష్టుడును ఐ యున్నవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. సుధన్వా ఖండ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః !
దివః స్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61 !!

సుధన్వా:= అసుర సంహరార్ధము మంచి ధనుస్సును  ధరించిన వాడు,
ఖండ పరశు: = ,రుద్ర సంబంధమైన యుద్దంలో ఖండిమ్చాడని భారతంలోనికథ, గండ్ర ద్ర  గొడ్డలిని ఖండించిన వాడు, 
దారుణ:= భాహ్య అంతర శత్రువులను ఖండించుటచే భయంకరుడు,
ద్రవిణ ప్రదః = ధనము వంటి సమస్త శాస్త్రములను జనములకిచ్చిన వాడు,
దివ స్పృక్= పరమార్ధము నేరింగినవాడు,

సర్వ దృక్ = సమస్తమును చూచువాదు,
వ్యాస:= వేదములను విభజించినవాడు,
వాచస్పతి:= మాతృ గర్భమున జన్మింపని వాడు,
అయోనిజః = భగవంతుని వాక్కు నుండి జనించినవాడు,

భాష్యం : అసుర సంహరార్ధము మంచి ధనుస్సును  ధరించిన వాడు, రుద్ర సంబంధమైన యుద్దంలో ఖండిమ్చాడని భారతంలోనికథ, గండ్ర ద్ర  గొడ్డలిని ఖండించిన వాడు, భాహ్య అంతర శత్రువులను ఖండించు టచే భయంకరుడు, ధనము వంటి సమస్త శాస్త్రములను జనముల కిచ్చిన వాడు, పరమార్ధము నేరింగినవాడు, సమస్తమును చూచువాదు,
వేదములను విభజించినవాడు, మాతృ గర్భమున జన్మింపని వాడు,
భగవంతుని వాక్కు నుండి జనించినవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు .

శ్లో. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ !
సన్న్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !! 62 !!


త్రిసామా:= దేవ వ్రతము లనేడి మూడు సామములచేత  సామ గాయకుల ద్వారా స్తోత్రము చేబడినవాడు,
సామగః=సామగానము చేయువాడు,
సామ = తన్ను గానము చేయువారల పాపమును నాశము చేయువాడు,
నిర్వాణం= పాపము తొలగిన వారి పరగతికి కారణమైన వాడు,
భేషజం=సంసారమనే వ్యాధికి పరమౌషధమైన వాడు, 
భిషక్ = సంసారమును రోగమునకు చికిత్స చేయువాడు,
సన్న్యాసకృ త్ = విషయముల యందు  వైరాగ్యము కలిగించువాడు

శమ := కోపాదులను అనుచుటకు తగిన ఉపాయము నుపదేశించు వాడు
శాంత:= కొంచమైన అహంకారము లేక శాంతుడై ఉండువాడు,
నిష్ఠా:= ప్రళయమున సమస్త భూతములకు నివాస మైనవాడు,
శాంతిః =ఉపాసకులు గొప్ప సమాధి యందుండి తనను తలచునపుడు తాముండు స్థితిని వారు మరచునట్లు చేయువాడు , 
పరాయణమ్ = అట్టి సమాధి స్థితికి చేరిన వారికి పరమభక్తిని అను గ్రహించు వాడు 

భాష్యం  దేవ వ్రతము లనేడి మూడు సామములచేత  సామ గాయకుల ద్వారా స్తోత్రము చేబడినవాడు,సామగానము చేయువాడు, తన్ను గానము చేయువారల పాపమును నాశము చేయువాడు,  పాపము తొలగిన వారి పరగతికి కారణమైన వాడు, సంసారమనే వ్యాధికి పరమౌషధమైన వాడు,  సంసారమును రోగమునకు చికిత్స చేయు వాడు,  విషయముల యందు  వైరాగ్యము కలిగించువాడు  కోపాదుల ను అనుచుటకు తగిన ఉపాయము నుపదేశించు వాడు  కొంచమైన అహంకారము లేక శాంతుడై ఉండువాడు,  ప్రళయమున సమస్తభూత ములకు నివాస మైనవాడు, ఉపాసకులు గొప్ప సమాధి యందుండి తనను తలచునపుడు తాముండు స్థితిని వారు మరచునట్లు చేయు వాడు ,అట్టి సమాధి స్థితికి చేరిన వారికి పరమభక్తిని అను గ్రహించు వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః !
 
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృష ప్రియః !! 63 !! 


శుభాంగః = తనయందు భక్తి చేయుటకు అనువగు అష్టాంగాములను 

ఇచ్చువాడు,

శాంతిదః = తన సాయుజ్యమనే శాంతిని ఇచ్చువాడు,

స్రష్టా: = సృష్ట్యాదిని సమస్త భూతములను సృజించినవాడు,

కుముదః = భూమియన్దు ఆనందిచు వాడు,

కువలేశయః = కోరిక ప్రకారమే ఉండునట్లు చేసేవాడు కువలేశయుడు, 
 

గోహిత:= ప్రక్రుతిననాను వ్యవస్తాపించిన వాడు,

గోపతి := భొగభూమి అయిన స్వర్గానికి కుడా నాధుడు,

 గోప్తా := కర్మ ఫలమైన సంసార చక్రమును రక్షించు వాడు,

వృషభాక్ష:= సమస్తమైన అభీశములను వరించు నత్తి నేత్రములు 

గలవాడు,

వృష ప్రియః = ప్రవర్తక, నివర్తక  రూపములైన ధర్మములను 

ప్రియముగా కలవాడు,


భాష్యం  : తనయందు భక్తి చేయుటకు అనువగు అష్టాంగాములను 

ఇచ్చు వాడు,తన సాయుజ్యమనే శాంతిని ఇచ్చువాడు, సృష్ట్యాదిని 

సమస్తభూతములను సృజించినవాడు, భూమియన్దు ఆనందిచు 

వాడు, కోరిక ప్రకారమే ఉండునట్లు చేసేవాడు కువలేశయుడు, ప్రకృ 

తిన నాను వ్యవస్తాపించిన వాడు, భొగభూమి అయిన స్వర్గానికి కుడా 

నాధుడు,కర్మ ఫలమైన సంసార చక్రమును రక్షించు వాడు,  సమస్త 

మైన అభీష్టములను వరించు నత్తి నేత్రములు గలవాడు, ప్రవర్తక, 

నివర్తక రూపములైన ధర్మములను ప్రియముగా కలవాడు, అగు 

పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా కేమ కృచ్ఛివః !
 
శ్రీవత్స వక్షః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః !! 64 !! 



అనివర్తీ : = ధర్మ ప్రియుడు గావున ధర్మమునుండి తప్పిపోని వాడు,

నివృత్తాత్మా:= స్వభావముగనే విషయముల నుండిమరలిన ఘనస్సు 

గలవాడు,

సంక్షేప్తా:= విస్తారము నొంది యున్నజగత్తును సంహార కాలమున 

సూక్ష్మము గావించు వాడు,

క్షేమకృత్ := లభించి యున్న పదార్ధమును కాపాడు వాడు,

శివః = తన నామమును స్మరించిన మాత్రమున పావనము చేయు 

నట్టివాడు,
 
శ్రీవత్స వక్షః = శ్రీ వత్సమనెడి చిహ్నము వక్షస్థలమున గలవాడు,

శ్రీవాసః = తన వక్షస్థలమున ఎడబాటు లేక లక్ష్మీ దేవి నివసించు 

చుండునట్టి వాడు,

శ్రీపతిః =లక్ష్మి దేవికి తగిన నాయకుడు,

శ్రీమతాంవరః = శ్రీ మహాలక్ష్మి బ్రహ్మ మెదలు కాగా గల సమస్త

జీవులపై ఎప్పుడో ఒకింత తన అనుగ్రహ దృష్టిని ప్రసరింప చేసినవాడు,




భాష్యం  :ధర్మ ప్రియుడు గావున ధర్మమునుండి తప్పిపోని వాడు,  

స్వభావముగనే విషయముల నుండిమరలిన ఘనస్సు గలవాడు, 

విస్తారము నొందియున్నజగత్తును సంహార కాలమున సూక్ష్మము 

గావించు వాడు,లభించి యున్న పదార్ధమును కాపాడు వాడు, తన 

నామమునుస్మరించిన మాత్రమున పావనము చేయు నట్టివాడు, శ్రీ 

వత్సమనెడిచిహ్నము వక్షస్థలమున గలవాడు, తన వక్షస్థలమున 

ఎడబాటు లేకలక్ష్మీ దేవి నివసించు చుండునట్టి వాడు,లక్ష్మి దేవికి 

తగిన నాయకుడు,శ్రీ మహాలక్ష్మి బ్రహ్మ మెదలు కాగా గల 

సమస్తజీవులపై ఎప్పుడో ఒకింతతన అనుగ్రహ దృష్టిని ప్రసరింప 

చేసినవాడు, 


శ్లో. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీ విభావనః !
 
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయః !! 65 !!


శ్రీదః =భక్తులకు సిరిని అనుగ్రహించు వాడు,

శ్రీశః= శ్రీదేవికి భర్త అయినవాడు,

శ్రీనివాసః= సిరిగల వారి యందు ఎల్లప్పుడూ ఉండువాడు,

శ్రీనిధిః = సర్వశక్తి సంపన్నుడై సమస్తమైన సిరులకు విధిగా 

ఉన్నవాడు,

శ్రీ విభావనః = సకల భూతములకు వాని వానికర్మల ననుసరించి 

అనేక  విధములైన సిరులనుకలుగ్ జేయువాడు. 
 

శ్రీధరః = సమస్త భూతములకు తల్లియగు శ్రీదేవిని వక్షస్థలమున 

నిలుపుకొనినవాడు. 

శ్రీకరః = స్మరణ చేయువారు, స్తోత్రము చేయువారు, పూజ చేయువారు 

నగు భక్తులకు సిరిని కలుగ జేయువాడు. 

శ్రేయః= నిత్య నిరతశయ సుఖప్రాప్తి రూపమైన శ్రేయస్సు గలవాడు,

శ్రీమాన్ = సిరులను గలవాడు,

లోక త్రయాశ్రయః =  ముల్లోకములకు ఆశ్రయ మైనవాడు,



భాష్యం : భక్తులకు సిరిని అనుగ్రహించు వాడు,శ్రీదేవికి భర్త 

అయినవాడు, సిరిగల వారి యందు ఎల్లప్పుడూ ఉండువాడు, సర్వశక్తి 

పన్నుడైసమస్తమైన సిరులకు విధిగాఉన్నవాడు, సకల భూతములకు 

వానివానికర్మలననుసరించి  అనేక  విధములైన సిరులను కలుగ 

జేయువాడు.సమస్త భూతములకు తల్లియగు శ్రీదేవిని వక్షస్థలమున  

నిలుపు కొనినవాడు. స్మరణ చేయువారు, స్తోత్రముచేయువారు,పూజ 

చేయు వారు నగు భక్తులకు సిరిని కలుగ జేయువాడు.నిత్య 

నిరతశయ  సుఖప్రాప్తి పమైన శ్రేయస్సు గలవాడు,సిరులను గలవాడు,

 ముల్లోకము లకు ఆశ్రయ  మైనవాడు,అగుపరమాత్మునకు 

ప్రణామములు. 

శ్లో. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః !

విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః !! 66 !!



స్వక్షః = పద్మములవంటి చక్కనైన కన్నులు కలవాడు,

స్వంగః = దివ్యములైన అవయవములు కలవాడు,

శతానంద:= నూరు విధములుగా పరమానందమును కల్పించువాడు,

నంది:= పరమానంద స్వరూపుడు, 

జ్యోతి ర్గణేశ్వరః = జ్యోతిర్గములకు ప్రభువైనవాడు,
 

విజితాత్మా= మనస్సును జయించిన వాడు,

విధేయాత్మా = ఎవరినిచేత కూడా విభజింప బడని స్వరూపము 

గలవాడు,

సత్కీర్తి = సాయమైన కీర్తిగలవాడు, 

ఛిన్నసంశయః = కరతమామలకముగా సమాసమును ప్రత్యక్షముగా 

చూచు చుండువాడు, 

భావము :పద్మములవంటి చక్కనైన కన్నులు కలవాడు,దివ్యములైన 

అవయవములు కలవాడు, నూరు విధములుగా పరమానందమును 

కల్పించువాడు, పరమానంద స్వరూపుడు, జ్యోతిర్గములకు 

ప్రభువైన వాడు,  మనస్సును జయించిన వాడు, ఎవరినిచేత కూడా 

విభజింప బడని స్వరూపము గలవాడు, సాయమైన కీర్తిగలవాడు, 

కరతలామలకముగా సమాసమును ప్రత్యక్షముగా  చూచు 

చుండువాడు, అగు పరమాత్మునకు ప్రణామములు 


శ్లో. ఉదీర్ణః సర్వత శ్చక్షు రనీశః శాశ్వత స్థిరః !
 
భూశయో భూషణో భూతి ర్విశోకః శోక నాశనః !! 67 !! 


ఉదీర్ణః = సమస్త భూతముల కంటెను అధికుడు,

సర్వత శ్చక్షు = అణా చైఅన్యముచెఅ అన్నివైపుల నుండి 

అంతయును  తెలిసికోనువాడు,

అనీశః = తన కెవ్వాడును నియామకుడు లేనివాడు,

శాశ్వత స్థిరః = ఎల్లప్పుడు అవతరించు చుండియు ఎన్నాడును వికా   

రము నొందని వాడు,
 

భూశయ= సముద్ర తీరమున భూమి పైన శయనిమ్చు వాడు,

భూషణ:= తన ఇష్టము వచ్చిన పెక్కుఅవతారములతో భూమిని 

అలంక రించు వాడు,

భూతి := సమస్త విభూతములకును కారణమై ఉండువాడు,

విశోకః = నిరతిశయమైన ఆనందమే ముఖ్య స్వరూపముగా  

గలిగియున్నందున దు:ఖమనునది ఎరుగనివాడు,

శోక నాశనః = స్మరణ మాత్రమున భక్తుల దు:ఖమును నశిమ్ప 

చేయువాడు 



భాష్యం  :సమస్త భూతముల కంటెను అధికుడు, అణా చైఅన్యముచే  

అన్నివైపుల నుండి అంతయును  తెలిసికోనువాడు,తన కెవ్వాడును 

నియామకుడు లేనివాడు, ఎల్లప్పుడు అవతరించు చుండియు 

ఎన్నాడును వికారము నొందని వాడు,సముద్ర తీరమున భూమి పైన 

శయనిమ్చువాడు   తన ఇష్టము వచ్చిన పెక్కుఅవతారములతో  

భూమిని అలంక రించు వాడు,  సమస్త విభూతములకును కారణమై 

ఉండువాడు,  నిరతిశయమైన ఆనందమే ముఖ్య స్వరూపముగా  

గలిగి యున్నందున దు:ఖమనునది ఎరుగనివాడు,స్మరణ 

మాత్రమున  భక్తుల దు:ఖమును నశిమ్ప చేయువాడు అగు 

పరమాత్మునకు ప్రణామములు.   


 శ్లో. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః !
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మిత విక్రమః !! 68 !!

అర్చిష్మా= తన తెజస్సుచేతనే సూర్య చంద్రాదులు తేజో వంతులై ఉన్నారు గావున తానే ముఖ్యముగా తేజస్వరూపుడు,
అర్చితః =   సమస్త లోకముల చేతను పూజిమ్ప బడునట్టి బ్రహ్మాదు లచేత గూడ పూజిమ్ప బడునట్టివాడు,
కుంభ: = ఘటములో వలే తనయందే సమస్తము ఉండునట్టి వాడు,
విశుద్ధాత్మా= మూదు గుణములను దాటి పోయి ఉన్నందున పరిసుద్ద మైన ఆత్మా గలవాడు,
విశోధనః = ఈ స్మరించిన మాత్రముననే పాపములను నసింప చేయు వాడు,
అనిరుద్ధ := ప్యూహముల నాల్గింటిలో నాల్గవ ప్యూహముగా ఉన్నవాడు,

అ ప్రతిరథః = ప్రతి పక్షము లేనివాడు,
ప్రద్యుమ్నో:= మిక్కిలి గిప్పదియగు ధనము గలవాడు,
మిత విక్రమః = సాటిలేని పరాక్రమము గలవాడు,


భాష్యం  : తన తెజస్సుచేతనే సూర్య చంద్రాదులు తేజో వంతులై ఉన్నారు గావున తానే ముఖ్యముగా తేజస్వరూపుడు,  సమస్త లోకముల చేతను పూజిమ్ప బడునట్టి బ్రహ్మాదు లచేత గూడ పూజిమ్ప బడునట్టివాడు, ఘటములో వలే తనయందే సమస్తము ఉండునట్టి వాడు, మూడు గుణములను దాటి పోయి ఉన్నందున పరిసుద్ద మైన ఆత్మా గలవాడు, ఈ స్మరించిన మాత్రముననే పాపములను నసింప చేయు వాడు,  ప్యూహముల నాల్గింటిలో నాల్గవ ప్యూహముగా ఉన్నవాడు,  ప్రతి పక్షము లేనివాడు,  మిక్కిలి గిప్పదియగు ధనము గలవాడు,  సాటిలేని పరాక్రమము గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 
  
శ్లో. కాలనేమినిహా వీరః శౌరిః శూర జనేశ్వరః !
త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః !! 69 !!

కాలనేమి నిహా := కాలనేమి యనెడి అసురుని వధించిన వాడు,
వీరః= శూరుడు,
శౌరిః =శూరుడను వాని వంశమున బుట్టినవాడు,
శూర జనేశ్వరః = శూరాత్వము యొక్క అధిక్యముచేత శూరులైనా ఇంద్రాదులను గూడ శాసించువాడు, 
త్రిలోకాత్మా=ముల్లోకములకు అంతర్యామి స్వరూపుపమున ఆత్మగా ఉన్నవాడు,

త్రిలోకేశ = ముల్లోకములునుతనచేత ఆజ్ఞాపించ బడియె తమ తమ కార్యముల యందు మేలగునట్లు చేయువాడు,
కేశవః =మధురలోను కశీలోను వేంచేసి ఉండు వాడు,
కేశిహా:= కేశి యనెడి రాక్షసుని వధించిన వాడు,
హరిః =సమూలముగ జనన మరరణ రూపమగు సంసారమును   హరించు వాడు,

భాష్యం
: కాలనేమి యనెడి అసురుని వధించిన వాడు, శూరుడు,
శూరుడను వాని వంశమున బుట్టినవాడు, శూరాత్వము యొక్క అధిక్యముచేత శూరులైనా ఇంద్రాదులను గూడ శాసించువాడు, 
ముల్లోకములకు అంతర్యామి స్వరూపుపమున ఆత్మగా ఉన్నవాడు,
ముల్లోకములునుతనచేత ఆజ్ఞాపించ బడియె తమ తమ కార్యముల యందు మేలగునట్లు చేయువాడు, మధురలోను కశీలోను వేంచేసి ఉండు వాడు,కేశి యనెడి రాక్షసుని వధించిన వాడు, సమూలముగ జనన మరరణ రూపమగు సంసారమును   హరించు వాడు,అగు పరమాత్మునకు ప్రణామములు . 

శ్లో. కామ దేవః కామపాలః కామీ కాంత కృతాగమః !
అనిర్దేశ్యవపు ర్విష్ణుః ర్వీరోనంతో ధనంజయః !! 70 !!

కామ దేవః = ధర్మమూ మొదలైన పురుషార్ధములను నాల్గింటిని కోరునట్టి వారిచేత కోరబడెడి దేవుడు,
కామపాలః= కోరికలు గలవారి కోరికలను ఈ డేర్చువాడు,
 కామీ= అందరిచే కోరబడువాడు,
 కాంత=మిక్కిలి రమనీయమైన దేహమును ధరించినవాడు,
 కృతాగమః =మంరవిద్యలన్నింటిని రచించినవాడు,
అనిర్దేశ్యవపు= ఆయా యగాములకు తగిన శరీరములతో    నవారించుతచే ఇట్టిదనిచేప్పజాలని శరీరము కలవాడు,

విష్ణుః= తన సక్తిచే లోకమున వ్యాపించిన వాడు,
వీర :=  హింసిన్చువారిని నిరసించేవాడు,
అ నంత: = దేశ పరంగా కాని వస్తు పరంగా కాని అవధి లేనివాడు,
ధనంజయః = దిగ్విజయము చేసి నపుడు గొప్ప ధనమును జయించిన వాడు,

భాష్యం
 :  ధర్మమూ మొదలైన పురుషార్ధములను నాల్గింటిని కోరునట్టి వారిచేత కోరబడెడి దేవుడు, కోరికలు గలవారి కోరికలను ఈ డేర్చువాడు,  అందరిచే కోరబడువాడు,  మిక్కిలి రమనీయమైన దేహమును ధరించినవాడు,మంరవిద్యలన్నింటిని రచించినవాడు,
ఆయా యగాములకు తగిన శరీరములతో    నవారించుతచే ఇట్టిదని చేప్పజాలని శరీరము కలవాడు,  తన శక్తిచే లోకమున వ్యాపించిన వాడు,   హింసిన్చువారిని నిరసించేవాడు,  దేశ పరంగా కాని వస్తు పరంగా కాని అవధి లేనివాడు,  దిగ్విజయము చేసి నపుడు గొప్ప ధనమును జయించిన వాడు,అగు పరమాత్మునకు ప్రణామములు . 
శ్లో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ వివర్ధనః !
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71 !!

 బ్రహ్మణ్య:=ప్రకృతికి, ఆత్మకు కుడా హితమైనవాడు,
బ్రహ్మకృత్ బ్రహ్మా= చతుర్ముఖ బ్రహ్మకున్ను నియామకుడు,
బ్రహ్మ వివర్ధనః =బ్రహ్మ అంటే  తపస్సు, దానిని వృద్ధి చేయువాడు,
బ్రహ్మవిత్  := బ్రహ్మ అంటే వేదము దానిని తెలిసిన వాడు,
బ్రాహ్మణ:= వేదమును పఠించిన వాడు,
బ్రహ్మీ :=సమస్త పదార్ధములు తనదిగా కలవాడు,
బ్రహ్మజ్ఞ:=వేదమును అర్ధ్యపర్యంతము తెలిసినవాడు,
బ్రాహ్మణప్రియః=వేదమును అధికరించిన వారి యందు ప్రీతి గలవాడు,

భాష్యం :ప్రకృతికి, ఆత్మకు కుడా హితమైనవాడు,చతుర్ముఖ బ్రహ్మకున్ను నియామకుడు, బ్రహ్మ అంటే  తపస్సు, దానిని వృద్ధి చేయువాడు, బ్రహ్మ అంటే వేదము దానిని తెలిసిన వాడు, వేదమును పఠించిన వాడు, సమస్త పదార్ధములు తనదిగా కలవాడు,వేదమును అర్ధ్యపర్యంతము తెలిసినవాడు,వేదమును అధికరించిన వారి యందు ప్రీతి గలవాడు,అగు పరమాత్మునకు ప్రణామములు .  

శ్లో. మహాక్రమో మహా కర్మా మహా తేజా మహోరగః !
మహా క్రతు ర్మహా యజ్వా మహా యజ్ఞో మహా హవిః !! 72 !!

మహాక్రమ:= మిక్కిలి గొప్పవైన అడుగులు కలవాడు,
మహా కర్మా:= ప్రాణులను కుడా ఉచ్చ స్థితికి తేగల గొప్ప పనులు గలవాడు,
మహా తేజా:=తమసులు అజ్ఞానమును కుడా తొలగించగల గొప్ప తేజస్సు గలవాడు,
మహోరగః=మహాసర్ప స్వరూపుడు,
మహా క్రతు:= మహా కృతు స్వరూపుడు, 

మహా యజ్వా:=లోక సంగ్రహము కొరకు యజ్ఞములు చేయునట్టి  మహనీయుడు.   
మహా యజ్ఞ:= మహా యజ్ఞ స్వరూపుడు, 
మహా హవిః = గొప్ప హవిస్సు గలవాడు,

భాష్యం  : మిక్కిలి గొప్పవైన అడుగులు కలవాడు, ప్రాణులను కుడా ఉచ్చ స్థితికి తేగల గొప్ప పనులు గలవాడు, తమసులు అజ్ఞానమును కుడా తొలగించగల గొప్ప తేజస్సు గలవాడు,మహాసర్ప స్వరూపుడు,
మహా క్రతు:= మహా కృతు స్వరూపుడు,  లోక సంగ్రహము కొరకు యజ్ఞములు చేయునట్టి  మహనీయుడు.    మహా యజ్ఞ స్వరూపుడు, 

గొప్ప హవిస్సు గలవాడు, అగు పామాత్మునకు ప్రణామములు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి