29, జూన్ 2016, బుధవారం

Inernet Telugu magazine for themonth of 7/2016/1/25

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - కవితల ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు


* వెన్నెల

చీకటి వెనుక దాగి ఉండి
నా కడ్డం తొలుగు అన్నది వెన్నెల 
పరదా చాటుగా  ఉండి
గాలికి తోలగ వేమి అన్నది వెన్నెల 

మనసు లోతును కదిలించి
మనస్సు శాంతిగా మార్చేది వెన్నెల
కన్నీటి కధలను తొలగించి
ఆనంద భాష్పాలుగా మార్చేది వెన్నెల

ప్రకృతి సుఖాలు అందించి
విధి వేసిన చీకటిని తరిమేది వెన్నెల
మౌనంగా గుండెను కదిల్చి
వేడితగ్గించి చల్లదనం ఇచ్చేది వెన్నెల

ఆవేదనలను  తొలగించి
మనసు పడే విధంగా మార్చేది వెన్నెల
సంఘర్షణలు తొలగించి
మౌన వాణిని  విని పించేది వెన్నెల   

ఎకాంతపు సుఖాన్నిచ్చి 
చెలిమిగా నేనున్నానన్నది వెన్నెల
మనసైన వలపు ఇచ్చి   .
మనో ధైర్యాన్ని ఇస్తున్నది వెన్నెల

--((*))--.


*మరి నేనెవర్నో మీరె చెప్పండి ?

నేను అందరికీ గుర్తుగా ఉంటాను
అంతర్గత శక్తి ఇంతని చెప్పలేను
బాహిర్గత శక్తి ఎవ్వరికీ చూపలేను
శిధల మౌతు ఆనందం కల్పిస్తాను

ఆవేశాలను అనగ  త్రొక్కు తాను
ఆలోచనను ఆచరణలో పెడ తాను
ఆలశ్యాన్ని క్షణమైనా ఓర్చు కోను
గాయలెన్ని తగిలిన ఓర్చు కుంటాను

ఆణువణువూ చూపులకు చిక్కిన దానను
అట్టహాస వత్తిడులకు అలవాటు పడ్డదానను
అయినా కొరత తీర్చ లేని దాననై  ఉన్నాను
యుగాలు మరీనా నా ఉనికి మారకున్నాను

గాలిలా ప్రాణానికి ప్రాణంగా ఉంటాను
నీటిలా దాహాన్ని, తాపాన్ని, తగ్గిస్తాను
అగ్నిలా పైకి ఎగసి బూడిదవు తాను
పృద్వి లా ఓర్పు వహించి ఉంటాను  

ఆకాశమే హద్దుగా జీవితం గడుపుతాను
ఘటములోని నీరులా చల్లదనమందిస్తాను  
మనస్సు , బుద్ధి,  ఒకటిగా  ఉంచు తాను 
మొక్ష మో, కపాళ మోక్షమో, ఇవ్వ గలను

మైదానంలో బంతిలా తిరుగుతాను
ఆడేవాడ్ని బట్టి అనుకరిస్తూ ఉంటాను
మెత్తబడ్డా పనికిరావన్న ఎమీ అనను
క్రీడల్లో శల్యమైనా గుర్తింపు  ఉండను

సుందర స్వప్నాల జీవితం గదుపుతాను 
పరిపక్వత చెంది పారవశ్యంలో ముంచేస్తాను
వంశాకురాలను అందించ ఆనంద పరుస్తాను
కలియుగ జీవితపు అంచులు ఇక చూడలేను

కన్నవారికి బరువుగా మారుతున్నాను
కట్టుకున్నవారిని తృప్తి పరచలేకున్నాను
విధివంచనకు చిక్కినవారిలో నేనోక దానను
ఇంతకీ నే నేవర్నో మీకు చెప్ప లేకున్నాను 

మరి నేనెవర్నో మీరె చెప్పండి ?                

 --((*))--


*ఛందస్సు (వృత్తము ద్వారా)
 
తాతలు తప్పదు వరుణ్నాహ్వానిద్దాం
మామలు ఇప్పుడు వరుణ్ణి ప్రార్దిద్దాం
బావలు ఒప్పుడు వరుణ్ణి  అర్ధిద్దాం
మరిది త్వరగా వరుణ్ణి కొలుద్దాం 
 అంటూ వర్షాలకోసం రైతులు ఆలాపన
--((*))--

*ఉషోదయం -శుభోదయం 

ఉషోదయకిరణాలు విస్తరించగా
సముద్రపు నీరు థళ థళ మెరుపులతో
మీనాలు పరవశంతో పల్టీలు కొట్టగా
కెరటాలు ఎగసి పడుతూ ఉండే తపనతో    

వృక్షాలు తన్మయంతో,  ఆకులు కదల్చగా
కొండగాలి, చిరుగాలి, కలిసే స్నేహముతో  
అలారం మ్రోగినట్లు,  తొలికోడి కూయగా
కోకిల తనవంతుగా, బాకా ఊదె ఆలాపనతో

సైనికుల వ్యాయామం మొదలవ్వగా
ఎర్ర నేల ఆణువణువూ ఆవేదన కళ్ళతో
పక్షి పిల్లలు ఎగరాలని తపన పడుతుండగా
అష్ట దిక్కులు కలయ చూసి ఎగరండి నాతో

కొలనులో కమలాలు వికసించగా
పరిమళాలందించి పరవశించే, తుమ్మెదతో
మమతతో చకోర పక్షులు చేరగా
తన్మయత్వం చెందే, వేడి కిరణాల వెచ్చధనంతో

పిలుస్తున్నాము సుప్రబాత సేవలుగా
దినకరా మమ్మేలు కోరే, ఆసీర్వాదములతో
మాలో ఉన్న అంధకారాన్ని తరమగా
రవితేజ శుభోదయాన్ని ఆశించి వేడుకుంటున్నాము

-((*))-


*యశోదను ఆట పట్టించిన కృష్ణుడు

గోపాల కృష్ణ రా రా , నా ముద్దుల కృష్ణ రా రా
నవ్వుల కృష్ణ రా రా, నా రత్నాల కృష్ణ రా రా

తలచి పిలుస్తున్నాను, రా రా కృష్ణ
నలుగు పెట్టి లాలా పోస్తాను., రా రా కృష్ణ
మన్ను తిన్న చేతులు కడగాలి, రా రా కృష్ణ
నవ్వుతూ నన్ను ఏడిపించకు, రారా కృష్ణ 

అన్న వచ్చును త్వరపడి, రా రా కృష్ణ
లాలి పోసి పట్టు వస్త్రాలు కడాతాను, రా  రా కృష్ణ
నీటితో ఆడితే జలుపు చేయును, రా రా కృష్ణ
ఈ తల్లి మాట విని వస్తావు కదా రా  కృష్ణ

బుగ్గను చుక్కను పెట్టనియ్యరా కృష్ణ
కళ్ళకు కాటుక పెట్టనియ్యరా కృష్ణ
ఉగ్గు పెట్టెద నా దగ్గరకు రా రా కృష్ణ 
కాళ్ళకు గజ్జలు కట్టనియ్యరా కృష్ణ

వేళ్ళకు ఉంగరాలు పెట్ట నియరా కృష్ణ 
నుదుట తిలకం దిద్ద నియ్యరా కృష్ణ
కాళ్లకు గోరింటాకు పెట్టనియ్యరా కృష్ణ
దిష్టి తగల కుండా దిష్టి తీయ్యాలి రా కృష్ణ

కురులు దువ్వి, పించెము ఉంచెదను రా కృష్ణ
చందనము పూసి హారములు వేసెదను రా కృష్ణ
మోలతాడు చుట్టు మల్లె దండను చుట్టెద రా కృష్ణ      
నవనీతము పెడతాను రా బుద్దిగా తినిటకు రా రా కృష్ణ

నా గోపాల కృష్ణ రా రా , నా ముద్దుల కృష్ణ రా రా 
నా నవ్వుల కృష్ణ రా రా, నా రత్నాల కృష్ణ రా రా 
--((*))--
 

Photo: ये भीगे भीगे से लम्हें,
ये बारिशों के दिन ।।
ये तेरी यादों का मौसम,
और फ़िर से जीना तेरे बिन
*నీ వెవరు ?
ఆటు పోట్లకు తట్టుకునే మనస్సు నీది
అమృతాన్ని అందుకొనే వయస్సు నీది
ఆకాశంలో చుక్కలను లెక్కించే చూపు నీది
ప్రకృతి అందాలను మించిన తేజస్సు నీది


కమ్ముకున్న చీకట్లు మాయ మవుతాయి
వెంబ డిస్తున్న ఇక్కట్లు తొలగి పోతాయి
తట్టి లేపుతున్న చప్పట్లు దగ్గి రవుతాయి
చుట్టు ముట్టుతున్న కుంపట్లు చల్ల నౌతాయి


చరిత్ర గర్భంలో నీవొక మైలు రాయి
ధరిత్రి పై మరిచి పోలేని గీటు రాయి
కొందరి హృదయాల్లో నీవొక కీచురాయి
కవితా పత్రికలో నీవొక పదమాయి


నీ భావాలు స్వప్న లోకాలు విహరిస్తాయి
నీ అనుభూతులు ఆనందంతో పంచు కుంటాయి
నీ అక్షర స్వరాలు పారవశ్యంతో పాడు తాయి
నీ ఆలాపనలు నిలువలేక నాట్య మాడుతాయి


అందుకే మెదడుకు నిండిన భావవేశం నీది
మనసుకు పంచిన తన్మయత్వం నీది
అలుపెరగని అక్షరకక్షలో ప్రయాణం నీది
మనస్సుకు ప్రశాంతత కల్పించే మనస్సు నీది

" మరి నేనెవరో మీరే చెప్పండి "
" షేర్": చేసి భావాలు పంచు కోండి
--((*))--

Photo: ★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★

Nigaah meri tarasti hai mujhe tum
yaad aate ho,

Mohabbat jab tarapti hai mujhe tum
yaad aate ho,

Sama jata hai aankho main tere
jazbon ka bheega pan,

Kaheen baarish barasti hai mujhe
tum yaad aate ho

★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★

* నన్నువెంబడిస్తున్నాయి ఎన్నో 

నిద్ర లేని రాత్రులెన్నో
నిజం తెలుసుకోలేక మూగవైనాయి
నిషీధ సమయాలెన్నో
నిగురుకప్పిన నిప్పులా మెరుస్తున్నాయి

నిర్ణయాలు మరి ఎన్నో
నీ మనసును బ్రతికంచ లేకున్నాయి
నియమాలు మరి ఎన్నో
నివేదనలు మాత్రమే మిగిలిఉన్నాయి

నిస్వార్దాలు ఎన్నో
నిన్ను తాకినా నిలబడ లెకున్నాయి
నిశ్శబ్ధాలు ఎన్నో
నిరుత్సాహం తో నలిగి పొతున్నాయి 

నిరాశలు ఎన్నో 
నిముషము కుడా తాక లేకున్నాయి
నిమిడాంధకారా లెన్నో
నిరాశం నిసీధంలో పయనిస్తున్నాయి

నిప్పు కణిక లెన్నో
కన్నిరుచుక్కలా మారి వెదిస్తున్నాయి
నిక్కముగా కధలెన్నో
నిద్రను ఒకమాదిరిగా భాదపెడుతున్నాయి

నిస్వార్ధపు నాణాలెన్నో
చీకటిలో సంజాయిషీ చెపుతున్నాయి
నిజమైన కణాలెన్నో
నన్నుఎడిపించాలని ప్రయత్నిస్తున్నాయి

నిష్టలేని క్షణా లెన్నో
స్పష్టముగా కలలు కూడారాకున్నాయి                    
నిద్రలో కళ లెన్నో
వెదిస్తూ బయటకు రాకుండా ఉన్నాయి
--((*)--

*కన్నయ్యా .... ఓ కన్నయ్యా

కలవపూల కళ్ళు గల కన్నయ్యా
కోమలమైన చూపుతో ఉన్నావు గదయ్యా
కమ్మనైన పత్రపాన్పు గదయ్యా
మమ్ము కమ్ముకున్న చీకట్లు తొలగించవయ్యా  

అమృత ధార కాదయ్యా 
కోమలమైన వామ పాదం  వదలవయ్యా   
కమ్మని పాలుతాగవయ్యా
నమ్ము నీ నవ్వే స్వర్గాన్ని చూపునయ్యా

కన్నయ్యా నిను కనలేని కనులెందు కయ్యా
లోపల రాగంతో వెలుపల దానంతో ఉన్నావుగదయ్యా
హద్దు లేనిసక్తి, సంపదను, ఇచ్చావుగదయ్యా
రాగా ద్వేషాలకు అతీతుడు వయ్యా

యమున యందు విహరిస్తున్నావయ్యా
వ్యామోహాలనుండి మమ్ము రక్షించవయ్యా
సమ్మోహనాస్త్రం ఉండు నట్లు చేయవయ్యా 
రామ కృష్ణామృతాన్ని  ధన్యం చేయవయ్యా
--((*))--

*ఉప్పెన
ఉప్పెన చెప్పినప్పుడల్లా
కుప్పి కుప్పి గంతు లేస్తూ రాదు
చెప్పి చెప్పక, ఒప్పి ఒప్పించక,
కప్పలు, చేపలు, కదిలించక రాదు


ఎప్పటి కప్పుడు తప్పించు కోలేక
తప్పు చేయుటకు ముందుకు రాదు
ఉప్పు తెప్పలా తేలి, చిప్ప డిప్పలా
మారి గుట్టు చప్పుడు కాకుండా రాదు

కప్పులు కదిలించటానికి, లప్పం లా
అతుక్కొని వుండటానికి ఎప్పుడూ రాదు
గొప్పలు చెప్పక, అప్పడంలా ఎగురుతూ
ఇళ్లను కుప్ప కూల్చుటకు త్వరపడి రాదు

సముద్ర కెరటపు గాలితో హోరెత్తి
చుట్టు కుంటూ వచ్చి పోయేది ఉప్పెన
ప్రజల రక్షణకు తగు ఏర్పాట్లు హోరెత్తి
కూడు, గూడు, గుడ్డ అందించి ఉప్పెన
నుండి ప్రజలను కాపాడేది ప్రభుత్వం

ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల
ఉప్పెన నుండి ప్రాణులను
రక్షించుటే అందరి కర్తవ్యం
ప్రతిఒక్కరు సహకరించుకుంటూ
ఉప్పెన నుండి ఎదుర్కొనుటే
ప్రధమ ప్రధాన లక్ష్యం
--((*))--