22, జూన్ 2016, బుధవారం

Interne Telugu Magazine for themonth of 6/2016/


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  

ప్రాంజలి ప్రభ - కవిత్వ వార పత్రిక (6/2016)/

సర్వేజనా సుఖినోభవంతు
రచయత మల్లాప్రగడ రామకృష్ణ


*కన్నయ్యా .... ఓ కన్నయ్యా

కలవపూల కళ్ళు గల కన్నయ్యా
కోమలమైన చూపుతో ఉన్నావు గదయ్యా
కమ్మనైన పత్రపాన్పు గదయ్యా
మమ్ము కమ్ముకున్న చీకట్లు తొలగించవయ్యా  

అమృత ధార కాదయ్యా 
కోమలమైన వామ పాదం  వదలవయ్యా   
కమ్మని పాలుతాగవయ్యా
నమ్ము నీ నవ్వే స్వర్గాన్ని చూపునయ్యా

కన్నయ్యా నిను కనలేని కనులెందు కయ్యా
లోపల రాగంతో వెలుపల దానంతో ఉన్నావుగదయ్యా
హద్దు లేనిసక్తి, సంపదను, ఇచ్చావుగదయ్యా
రాగా ద్వేషాలకు అతీతుడు వయ్యా

యమున యందు విహరిస్తున్నావయ్యా
వ్యామోహాలనుండి మమ్ము రక్షించవయ్యా
సమ్మోహనాస్త్రం ఉండు నట్లు చేయవయ్యా 
రామ కృష్ణామృతాన్ని  ధన్యం చేయవయ్యా
--((*))--

image not displayed 


*వర్షమా మాపై కురువుమా
 
వర్షమా ఆకాశాన్ని వదిలి
వచ్చి మా దాహాన్ని తీర్చుమా
ఆకాశానికి నీవు అతిధివి
అల్లుడుగా ఎన్నాల్లు దిగుమా

ఆడంబరాలలో మునిగినా
కర్తవ్యము మరువక కురువుమా 
బేష జాలకు పోక అలుక మాని
చిరుజల్లులా  కురువుమా 

ఉరుములు, మెరుపులు, సుడి 
గాలిని వెంట పెట్టుకొని రాకుమా 
ఎంతో ప్రేమతో  ఎదురుచూస్తున్నా
మాపై కరుణతో వర్షంగా కురువుమా 

పృద్వి తనువెల్ల కళ్ళు చేసుకొని
బీటలు బారిన మనస్సును ఓదార్చుమా
చెరువులు, వాగులు, సెలయేర్లు,
నిన్ను అహ్వానిస్తున్నాయి నేస్తమా  

ధరణి తలాన్ని పులకరింప
చేయుటకు పన్నీటి జల్లు కురిపించుమా
నీకొసమ్ అలమటిస్తూ, విలపిస్తూ    
ఉన్న ప్రజలపై దయా వర్షము కురువుమా

ఆకలి తీర్చి ఆదుకునే వాడవునీవే
సమస్త ప్రాణులకు దిక్కు  నీవే
సమస్త  జగతికి ఆధారుడవు నీవే
పుడమిని చల్లబరుచుకు కురువుమా         

మా ప్రార్ధన విని వచ్చినందుకు
శతకోటి దండాలు అర్పిస్తున్నాము వర్షమా
చుట్టపు చూపుగా రాక, ఒక స్నేహితుడుగా
పృద్విపై మీకు ఎప్పుడు ఆహ్వానమే వర్షమా     

--((*))--  



image not displayed * ( ప్రేమ తత్వం)

తొలి జాము పరవశం తో
మనసుకు నచ్చే పనితో
మత్తుని దించే మాటతో
హత్తుకొనే చేతులు కదులు   

చెత్తను తుడిచే పోకడతో
మత్తుని వదిలించే నడకతో
గుణాన్ని బట్టి గౌరవంతో
శుబ్రం చేసే పాదాలు కదులు   

కలుషితాన్ని తొలగించేందుకు
కుతంత్రాన్నితిప్పి కొట్టేందుకు
కుత్సితాన్ని కడిగేసేందుకు  
మత్సరాన్ని మాపేందుకు కదులు

రగిలే వారిని చల్ల బరుస్తూ
తగిలే వారిని శాంత పరస్తూ  
ఆకలి గొన్న వారి ఆకలి తీరుస్తూ
ఆశలు రేపకుండా ముందుకు కదులు

అవ లక్షణాలను సరిచేస్తూ
హితాన్ని, సన్నిహితాన్ని కల్పిస్తూ   
ప్రస్తుత ధర్మాన్ని వివరిస్తూ
గతాన్నిమరచి ముందుకు కదులు  

చూసింది చూసినట్లుగా అనుకరిస్తూ
చెప్పేది విని చెప్పినట్లుగా చేస్తూ 
వంశగౌరవం నిలుచు నట్లు చేస్తూ
పెద్దలముందు నిలిచి ముందుకు కదులు

అందరిలో ఒకరిగా కలసి పొతూ
బిడ్డలమధ్య ఎకత్వముగా కలిపేదిగా చెస్తూ 
నదీ ప్రవాహంలా కదులుతూ చలిస్తూ
సూర్య కిరణంలా వెలుగుని పంచుతూకదులు 

పడిపోయిన వాళ్లను నిలబెట్టుతూ
చెడిపోయిన వాళ్లను సరి చేస్తూ
బ్రతక లేని వారిని బ్రతికిస్తూ
బ్రతికుండే అధర్మాన్ని ఎదిరిస్తూ కదులు

తెలివితో సమస్యలను పరిష్కరిస్తూ
విజ్ఞానంతో అజ్ఞానులకు వివరిస్తూ
వృక్షంలా అందరికి సహకరిస్తూ
మేలిమి బంగారమని అనిపించుకొని కదులు  

శబ్దం రాకుండా నిశ్శబ్దం పనులు చేస్తూ
నిరవిద్యా వంతురాలైన అన్నీ వివరిస్తూ 
సత్వరము తత్వాన్ని తెలియపరుస్తూ
మనసును మెచ్చే గుణంతో అందరిని ప్రేమించు
--((*)0-- 



* (మల్లెపువ్వు) 

మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా

పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా  

కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా

కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి  తరుణ మైతే   
ప్రేమతో సుఖాన్ని పంచవా 

కొంచం తెలుసుకోండి
--((*))--


*గరిక పువ్వు

నేనొక గరిక పువ్వు
వర్ణాల వెలిగే పువ్వు
వాసన  లేని పువ్వు
రాగము లేని పువ్వు

ఋతువులతో పనిలేని పువ్వు
ఎ తావి దరిచేరనీయని పువ్వు
మనస్సును హత్తుకొని పువ్వు
శల్య మై రెప రెప లాడే పువ్వు  
-(*)-


* నవ్వే నువ్వు -నువ్వే నవ్వు

పక పక నవ్వే విరబూసిన పువ్వు
పసితనపు ముత్యాలువిరిసిన నవ్వు
ఉషోదయ వెలుగులకు చిక్కే లవ్వు
మనసు మనసు కలిపే నవ్వే నువ్వు

ఉ ఊల చిలుక పలుకల చిరునవ్వు
ఉంగ ఉంగ యంటూ ఊయల నవ్వు
మనసారా పిల్లల ఏడుపు లో నవ్వు
జోలపాటలో సంగీతాలలో చిరు నవ్వు

రాలి పడే పువ్వు గుభాలిమ్పుల నవ్వు
నటుల హాస్య, రోదన సంభాషణల నవ్వు     
సొగసు ఆవిరై మృదుత్వం లోవచ్చే నవ్వు
రాగ మాలికల ప్రతిధ్వనులచే వచ్చే నవ్వు

ఉక్రోషంతో వయసు వికటాట్టహాసం చేసే నవ్వు
మంత్ర ముగ్దులగా మనసును మార్చే నవ్వు
ఎదగటానికి ఎందు కంత తొందర ప్రశ్నే నవ్వు
పెద్దవాళ్ళ బోసి నవ్వుల మాటలే కొంత నవ్వు

కష్ట ఫలితాల నుండి వచ్చే సంతోషాల నవ్వు
బాల్య చేష్టలు గుర్తు చేసుకొని తెలిపే   నవ్వు
వింతలూ, నిరంతరం తాజాదనంతో వచ్చేనవ్వు
కలయకలో వినరాని మాటల తో  వచ్చే నవ్వు
--((*))-- 

Photo

*జీవితాన్ని దిద్దుకో
 

వయసుని బట్టి ఆలోచనతో
మనసుని బట్టి పురోగమనంతో
ప్రపంచాన్ని బట్టి భావాలతో
జీవన సత్యాన్ని తెలుసుకో

తోటి వారి సహాయముతో
పెద్దలు నేర్పిన  విద్యతో
వంశానికి ఉన్న కళాభి వృద్దితో
జీవితాన్ని ఉన్నతంగా మలుచుకో

స్త్రీ సంకల్ప బలముతో
యువ శక్తి సహకారముతో
గురువుల వేద వాక్కులతో
అనితరసాధ్యాన్ని సాధ్యంగా మలుచుకో

స్వశక్తి నమ్మక బలముతో
వివేక మనే నడవడికతో
శూన్యమ్ లో వెలుగులతో
లక్ష్య సాధనకు మనసును పంచుకో

ప్రకృతి నేర్పే సంతోషాలతో
మనసు నేర్పే ఆశయాలతో
అనుభవం నేర్పే గుణపాఠంతో
తప్పు చేయక ఒప్పే ధ్యేయంగా నడుచుకో

శాంతి సౌభాగ్యాలతో
మనో వాంఛలతో
కష్ట సుఖాలతో
ధైర్యమే ఊపిరిగా నడక మార్చుకో

ఓర్పు వహిస్తే సర్వం సుఖం
నేర్పు పరకటిస్తే దేశ క్షేమం
తీర్పు సిరసావహిస్తే బ్రతుకే ధర్మం
బాధలను ఓర్చుకొని మౌనాన్ని నేర్చుకో

రోషము లేని సమబుద్దితో
శోకము లేని స్నేహముతో
ప్రియ అప్రియలను త్వజనముతో
అంటి అంటని వాడుగా జీవితం మార్చుకో   
      --((*))--




*పొదరిల్లు

మనసుల్ని ఉద్దరించడం మన సంస్కృతి
స్నేహితుల్ని ఆదరించడం మన సంస్కృతి
ప్రేమకు విలువనిచ్చి బ్రతికించడం మన సంస్కృతి
మమతాను రాగాలు అందించడం మన సంస్కృతి

రెక్కలు వచ్చిన పక్షిలా నిరంతరం సంచారకులం
పాలునీరు కలిసినట్లు ఒకరికి ఒకరమై ఉండే జీవులం
రైలు ప్రయాణంలా మంచి చెడు గమనించే వాళ్ళం
అబద్దపు రెక్కలు హద్దులు చేరకముందే గమనిస్తాం

సంపాదనకు తగ్గ ఖర్చు చేసు కుంటాం
శాంతితో క్రాంతిని అందిచి జీవిస్తాం
మాతృ భూమికి, దేశ రక్షనకు శ్రమిస్తాం
కలహాలు లేని కాపురంలా విశ్రమిస్తాం

దారులు ఎన్ని ఉన్న గమ్యం ఒక్కటే
ప్రేమలు ఎన్ని ఉన్న హృదయమొక్కటే
ఆశలు ఎన్ని ఉన్న ఆశయం ఒక్కటే
ఆలోచనలు ఎన్నిఉన్నా ఆచరణ ఒక్కటే

హృదయాల సంగమం అనంత కోటి ఆనందం
ఆత్మ సౌందర్యం ఆహ్లాదానికి, ఆదర్స్యానికి,
సాక్షీ భూతంగా విస్తరించిన పరిమళం
మాయల హరివిల్లు అదే మన పొదరిల్లు  
  --((*))-- 


*ఎటు చూసిన అటు

ఎటు  చూసిన  అటు
కన బడుతా వెందుకు
అటు ఇటు ఎందుకు
వచ్చేయి రూట్ కరక్టు

బెస్ట్ చీపెస్ట్ లవ్ గేమ్
డోమ్ ట్ వెస్ట్   టైం 
ఈ టైం మనకు పెర్ ఫెక్ట్   
వచ్చేయి రూట్ కరక్టు

ఐ ఆమ్ సారీ ఐ నాట్ ఇంట్రెస్ట్
యు ఫస్ట్ డిస్కస్ పేరెంట్స్
జస్ట్ ఐ  లోన్లీ పర్సన్ 
వచ్చేయి రూట్ కరక్టు

జస్టు థింక్ ఫస్ట్
నెక్స్ట్ డిస్కస్ వెస్ట్
మై లవ్  పర్ఫెక్ట్  
వచ్చేయి రూట్ కరక్టు

ఎటు  చూసిన  అటు
కన బడుతా వెందుకు
అటు ఇటు ఎందుకు
వచ్చేయి రూట్ కరక్టు

నీకు నేను చెప్పలేను
నాకు నీవు చెప్పవద్దు
మన ప్రేమ మధురం
మనకు మనమే వరం
--((*))--


* నాన్న గారు
నాన్న నీవే మాకు పెన్నిధి
నాన్న నివే మాకు సన్నిధి
నాన్న నివే మాకు నిధి
నాన్న గారికి పాదాభి వందనం


పరిస్థితులను గమనించి
మనోధైర్యాన్ని పెంచింది నాన్న
తన తీపి జ్ఞాపకాలను పంచి
కాలంతో బ్రతుకు నేర్పింది నాన్న

జీవితంలో స్పూర్తిని పంచి
కష్టాలను ఎదుర్కొనే శక్తే నాన్న
ప్రభావాలను గమనించి
అభిమానాన్ని పంచేది నాన్న

భంధం విలువను పంచి
ప్రేమనుపంచి ఆదుకొనేది నాన్న
ప్రపంచాన్ని గూర్చి వివరించి
నమ్మక మార్గం చూపేది నాన్న

ఆత్మవిశ్వాసం కలిగించి
భయం లేకుండా చేసింది నాన్న
అందరి అవసరాలు అందించి
వయసుమీరినా సహాకరించేది నాన్న

నష్టాలకు ఓర్పును పెంచి
లాభాల బాటను చూపించింది నాన్న
విజయాలకు సహకరించి
ఆరాధ్య దైవమే మా అందరికి నాన్నే

--((*))--

*బృహతీ చ్చందము
(ఛందస్సు )

నడక  తెలిపె  శ్రీనాధా  
వయసు పెరిగె  అంభోజా
మనసు కలిగె  ఓ కృష్ణా
తనువు తరిగె  శ్రీ మాతా 

హలముఖి
మాధవా  నలుసు వలసా
రాగమా  రజని మనసా
కాలమా  వయసు తెలుసా
రోగమా  మనసు ఎరుకా 

 ఉత్సుక

కేశవ  అర్చన రమ్యమా   
రాఘవ దీవెన పుణ్యమా
శ్రీముఖ వల్లన ప్రాణమా
ప్రేమతొ తల్లికి  వందనా
ఇది నేను వ్రాసిన పద్యాల భావము అనుకుంటున్నాను 

1. తండ్రిలాగా నడక నేర్పావు, యవ్వనం వచ్చిందని గుర్తు చేసావు, మనసు చెదిరే ఓ కృష్ణా, తనువు తరిగి పోతుంది తల్లి నాకు పెళ్ళిచేయి.
     ,
2. నలుసు లాంటి పిల్ల వలసి రాదా, రాగముతో నా మనసు రంజిమ్పదా, కాలము ఇంకా రాలేదనుకుందునా, నాలో ఉన్నరోగము నాకు తెలుస్తున్నది, తల్లి నాకు పె
ళ్ళి చేయి
  
3. ఓ శివా నీకు అర్చన చేస్తే కుదురుతుందా, రామచంద్రుని దీవెనెల నాకు ఉండవా,, శ్రీ ముఖముగా నా ప్రాణంతో ప్రేమిస్తాను, అమ్మ ప్రేమతో వందనాలు అర్పిస్తున్నాను నాకు పె
ళ్ళి చేయి. 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి