20, జూన్ 2016, సోమవారం

"సీతా పతి " సలహా (కధ )

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - "సీతా పతి " సలహా  (కధ )
 Photo: Good Morning

Happy weekend 🌹
సర్వేజనా సుఖినోభవంతు

"సీతా పతి " సలహా  (కధ )(రచయత : మల్లాప్రగడ రామకృష్ణ)

ఏమిటే నాకు ఎమీ కనబడుట లేదు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడకు పోయిన కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళమని చెప్పాను, ఆ చెప్పావు గుర్తుంది, దానికోసం మే వెతుకు తున్నాను, కళ్ళు కనిపించటంలేదు, నీవు ఒక్కరవ చూసి చెప్పు,  అని అరవగా "సీత" భర్త దగ్గరకు పప్పు  గరిటను పట్టుకొని వచ్చి మీ తలమీదే ఉంది, జాగర్తగా వెళ్లి స్నానం, అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రండి టిఫిన్ రడీ చేస్తా, ఆ వచ్చేస్తా రడీ చెయ్ అంటూ బక్కెట్ తన్నాడు, ఏమిటండి ఆశబ్దం ఏమైంది మీకు " ఎమీలేదే బక్కెట్ తన్నా అంతే అన్నాడు సీతాపతి " ఏమిటో మీమాటలు చేష్టలు అసలు అర్ధం కావు అంటూ వచ్చి భర్తను చూసి మరీ వెళ్ళింది సీత.  
సీతా సీతా పంపులో నీల్లు రావటం లేదు, బుస్సు బుస్సు మంటూ బొట్టుపడుతున్నది, అయ్యో మర్చిపోయానండి ఈరోజు మనకు నీరు రావు కదండీ, క్రిందటి రాత్రి ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు ఆయి పోయిన సంగతి మీకు చెబుదామనుకున్నా మర్చి పోయాను. 
ఇప్పటి నా పరిస్తిని చూసి, జాలిపడితే నీరు దొరుకుతాయ, దొరకవు కదా, ఒక గంట ఓపిక పట్టండి బోర్ మోటార్ వేస్తారు అప్పుడు స్నానం చేయవచ్చు అన్నది. 
ఈ నీటి కొరత ఎలా వస్తుందో నీకు తెలుసా తెలియదు కాఫీతీసుకొని రా తాగుతూ కధ  చెపుతా, అట్లాగే అంటూ లోపాలు వెళ్లి కాఫీ తెచ్చి ఇచ్చింది సీత. త్రాగుతూ చెప్పటం మోదల పెట్టాడు సీతపతి.. 
"అడవులు నరికేయడంవల్ల, వర్షాలు కురవక, భూగర్భజలాలు ఇంకి పోయాయి, అడుగంటి పోయాయి, అందుకే అడవుల్లో పెరిగే మృగాలు నీరు కోసం గ్రామాలపై పడుతున్నాయి " తెలిసిందా నీకు,   నాకు ఎప్పుడో తెలుసు పరిష్కారం ఏమిటో చెప్పండి. "వృక్షో రక్షిత, రక్షిత:" అని ఏనాడో చెప్పారు కదా .        
మంచిది మనం ఒక పని చేద్దాం మన ఇంటి చుట్టూ ఒక వంద చెట్లు పాతుదాం, దానికోసం ఒక బోరింగ్ వేద్దాం, అన్ని చెట్లు పెంచుదాం . 
ఎన్నాళ్ళకు నామాట అర్దం చేసుకున్నావు, ఎప్పుడూ నీ మాటను జవదాటను, నన్నే మీరు సరిగా అర్ధం చేసుకోరు, చిన్న మాటకు కోపం తెచ్చుకుంటారు, అదికాదు సీతా, మంచి విషయాలునీవు చెప్పిన నేను  ఆచరణలో పెడుతాను, ముందు తరాలకు మార్గాదర్సకుల మనమే   కదా, అవనవును బోర్ వచ్చింది, స్నానం చేసి రండి అంటూ  లోపలకు వెళ్ళింది సీత . స్నానం చేసి వచ్చి "సీతాపతి" నవ్వుకుంటూ కూర్చున్నాడు. 
సెల్ ముందు పెట్టుకొని ఒకటే నవ్వు, ఆజోకునాకు చెప్పవచ్చుగా నేను నవ్వుతా, " ఆ ఏమియు లేదే ట్యాక్ బండు మీదనుంచి ఒక అమ్మాయి దూకబోతున్నది, దారిన పోయే ఒకడు స్కూటర్ ఆపి చావద్దు చావద్దు ఆగు అన్నాడు, సరేనని ఆగింది, నీవు చచ్చేముందు నేను ఒకటి  అడుగుతా అది తీర్చి మరీచ్చావు అన్నాడు " పక్కనే భార్య ఆ అబ్బాయి ఏమికోరాడు,  ముద్దు కోరాడు అన్నాడు భర్త, అవును మొగవాళ్ళ బుద్దిని పోనిచ్చారు కాదు, ముద్దిచ్చి చావమన్నాడు కదూ అన్నది భార్య, అక్షరాలా అదే అడిగాడు, సరే నీ మాటకు నేను అడ్డు చెప్పను ముద్దు తీసుకో అన్నది, వెంటనే భార్య అన్నది ఎంతకు తెగించింది ఆడది ఇది కలియుగం కదండీ, ఉండవే మొత్తం చెప్పనీవే, ఇక చెప్పేదేముంది తెలిసి పోయిందికదా అన్నది, సరే చెప్పండి, ఆ వచ్చిన అబ్బాయి ముద్దు తీసుకొని ఎందుకు చస్తున్నావు అని అడిగాడు, ఆ "ఏముంది చీరకట్టుకొని ఆడదానిలా తిరగాలని ఆశగా ఉన్నది, ఇంట్లోవారు వప్పుకోలేదు అందుకని చద్దామనుకున్నా" ఆ  ఆ అంటూ నవ్వటం మెదలు   పెట్టాడు, వచ్చినవాడు పిచ్చివాడుగా మారి పరిగెత్తాడు,  అందుకనే నాకునవ్వొచ్చింది అన్నాడు. నవ్వుకుంటూ భార్య లోపలకు వెళ్ళింది.   

అప్పుడే కాలింగ్ బెల్ మోగటం జరిగింది, మీరు తీస్తున్నారా నేను వచ్చి తీయాల లోపలనుండి భర్యసీత. నేను తీస్తున్నను లేవే అంటూ తలుపు తీసాడు.
భాగున్నారా అంటూ పలకరించాడు చిన్న నాటి స్నేహితుడు శ్రీధర్, అవును నా విషయం అట్లా ఉంచు మీ పాపకు పెల్లిచేసావా అని అడిగాడు సీతాపతి.
అప్పుడే అన్నయ్యగారు బాగునారా అంటూ మంచి నీరు అందించింది. గబా గబా త్రాగి ఇంకో గ్లాసు ఇవ్వమ్మా అంటూ పలకరించాడు శ్రీధర్.
నీరు త్రాగుతూ తియ్యటి నీరు ఎన్ని త్రాగినా ఇంకా త్రాగాలని పిస్తుంది అనుకుంటూ "నీటి దాత సుఖీభవ "
సీతాపతిగారు మీ కేం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసారు, నాకూతురురుకుపెల్లి చెయ్యాలంటే ఎంత ఆలోచించిన ముడి పడుట లేదు ఏంచేయాలో తోచుటలేదు, ఏదన్న సలహా ఇస్తారని మీదగ్గరకు వచ్చాను ఏదన్న సలహా ఇచ్చి ఆడపిల్ల పెళ్ళికి సహకరించండి.
అసలు విషయం చెప్పు  "నేను మా అమ్మాయిని డిగ్రీ దాకా చదివించాను, నా భార్యతరుఫున ఒకరు మాఅమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామన్నారు, అబ్బాయి అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగం, ఆస్తిబాగాఉన్నదని చెప్పారు,  మా అమ్మాయిని అడిగాను చేసుకుంటావా అని,  నాన్న మీ ఇష్టం ఎవరిని  చేసుకోమంటే వారిని చేసు కుంటాను అన్నది సీతాపతి, ఇంకేం పెళ్లి చేయవచ్చు కదా?

నేను మా ఆవిడా ఒక నిర్ణయానికి వచ్చాము ఒక సంపన్న కుటుంబం లోకి పంపాలన్నదే మా ఉద్దేశ్యము. అప్పుడే ముందుగా చూసినవారు మేము మియు అమ్మాయిని చేసుకుంటామని వాచ్చారు, అప్పుడే సమస్య మొదలైనది. 
ఆ వచ్చినవారు  నా స్నేహితుడు బ్రహ్మానందం వాళ్ళ ఊరిలొ ఒక చక్కటి కుటుంబమునాకు చెందినవారు, వారికి ఒక్కడే కొడుకు  పి.జి వరకూ చదివాడు, .రాజకీయులతో తిరుగుతాడు, వాళ్ళ ఊరిలో ఎ చిన్న పనికైనా తనే ముందు ఉంటాడు, అందులో ఒక గ్రూపు తయారు చేసినాడు, గ్రామాన్ని ఆదర్శగ్రామంగా దిద్దాలి అని తిరుగుతాడు, అన్నిటికన్నా  ముఖ్యం గా  వారికి జలసంపద ఎక్కువగా ఉన్నది. శాస్త్రీయ పద్దతిప్రకారముగా ఇంకుడుగుంతలు రక్షిమ్చుకోవటమువలన వారి పొలం లో ఉన్న బావియందు, ఇంటి యందు  ఉన్న బావి యందు సమృద్ధిగా నీరు ఉన్నది, ఆఊరి ప్రజలను ఆ బావి నీరే  కాపాడుతున్నది.
ఇక నేను చెప్పేదేమి టంటే ఈ అబ్బాయి కూడా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, వీరు కూడా కట్నం వద్దు, మీ అమ్మాయికే మేము నగలు పెడతామని మరీ చెపుతున్నారు.                           
       
నీఉద్దేశ్యము చెపితే నా ప్రయత్నం నేను చేసుకుంటా సీతాపతి.
అప్పుడే లోపలనుంచి కాఫీ తెస్తూ అన్నయ్యగారు మీ శ్రీమతిగారికి ఫోన్ కలిపి నాకివ్వండి, ముందు  మాట్లాడుతాను  అన్నది సీత. అట్లాగే అని నెంబరు  కలిపి ఇచ్చాడు స్నేహితుడు శ్రీధర్,
పది నిముషాలుకూతురితో భార్యతో మాట్లాడింది సీత. అన్నయ్యగారు మీ  ప్రాబ్లమ్ సాల్వయిపోయింది. అంటూ సెల్ చేతి కందించింది. వెంటనే ఇంటి నుండి ఫోన్ మీరు వెంటనే రండి అని భార్య మాట విని,  మీరు నాకుసెలవు ఇవ్వండి, మరలా శుభవార్తతో నిదగ్గరకు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ . 
ఇంతకీ వాళ్లతో నీవు ఏమిచెప్పావు అని అడిగాడు సీతాపతి  భార్యతో,
ఏముందండి పెళ్లి చేసుకొనే పిల్లతో గ్రామంలో ఉన్న చదువుకున్న వాణ్ణిచేసుకుంటే, ముందు మండలాధ్యక్షుడువుతాడు, తర్వాత ఎం ఎల్ ఏ అవుతాడు, తర్వాత మంత్రి అవుతాడు, తరువాత ముఖ్యమంత్రి అయినా అవ్వవచ్చు, అప్పుడు నీవు మంత్రిగారి భార్యవు ప్రజలు 
న్నీరాజనాలు పడతారు, అటువంటి భర్త కావాలా, పొద్దున్నే  ఎనిమిదింటికి పోయి రాత్రి పదింటి దాకా రాని భర్త కావాలా ఆలోచించుకో, నీకు కావల్సినది డబ్బు కాదు, సుఖం అది గమనించు అన్నాను, వెంటనే గ్రామంలో ఉన్న అబ్బాయినే చేసుకుంటాను, అమ్మా నాన్నకుకూడా మీరుచెప్పండి, అని తల్లికి ఫోన్ ఇచ్చిది అనిచెప్పి చెప్పటం అపింది  సీత. 
ఆమెకు ఏమి చెప్పావో అదికూడా చెప్పు అన్నాడు సీతాపతి 
ఏముంది "" మీరు మంత్రిగారికి అత్తగారు అవుతారు, ఆ చాన్సు మీ కేరావాలి, గ్రామంలో ఉన్న అబ్బాయి కిచ్చి ఘనంగా పెళ్ళిచేయండి అని చెప్పా''' 
అట్లా చెప్పుట తప్పు కాదే వాళ్ళల్లో ఆశలు రేపినదానవౌతావు, నూరు అభద్దాలు ఆడినా ఒక పెళ్ళిచేయమన్నారు, నేను కలియుగ నీతి చెప్పి   పెళ్లి చేసుకోమన్నా అంతేకదా 
ఆ ఆ అంతే
మళ్ళీ తలుపు ఎవరో కొడుతున్నారు తియ్యనా, తియ్యండి ఎవరు వచ్చిన ఈ సారి సలహా మాత్రం నేను చెపుతా, నీవు తలదూర్చకూ ... 
అట్లాగే అసలు వచ్చిన దెవరో చూడండి ముందు 
సీతాపతిగారు అంటూ ఒక ఆడమనిషి లోపలకు అడుగు పెడుతూ నా  ప్రశ్నలకు సమాధానము కొరకు మీ దగ్గరకు వచ్చాను. " నా భర్త దగ్గర లేని సమయాన నా కొడుకు నా కూతురు నా దగ్గర ఉండు నా దగ్గర ఉండు గట్టిగా అడుగుతున్నారు, నేను ఎవరి దగ్గర ఉండాలి ? చెప్పండి ?

ఇదిగోనండీ ముందు మీరు కాఫీ త్రాగండి, మీ కధ విన్నాక మీకు తగిన సలహా ఇస్తాము అన్నారు "సీతా - పతి "

                                                         వచ్చేవారం మరో కధ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి