9, జూన్ 2016, గురువారం

Internet Telugu magazine for the month of 6/2016/23


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -వార పత్రిక 
 సర్వేజనా సుఖినోభవంతు 

--((*))--





*దినపత్రిక

ఉషోదయంతో వస్తుంది
మనసు ఉస్చాహ పరుస్తుంది
అక్షర సాహిత్యం తెలుపుతుంది
పాఠాలను పొందు పరిచి మనసును చేరుతుంది

జ్ఞాన జ్యోతుల విశేషాలను తెలుపుతుంది
రాజ్య రాజకీయ తంత్రాన్ని విపులీ కరిస్తుంది
వాగ్దానాలను ఖర్చు చేసే ధనాన్ని తెలుపుతుంది
గతాన్ని తెలియపరుస్తూ నిద్ర లేపుతుంది

ప్రజల కష్టాలు, దోపిడీ వీర కృత్యాలు,
అగాధాలు, ఆనందాలు, సినమాలు,
పగలు , ప్రతీకారాలు, చీకటి వ్యాపారాలు
షేరులు, ఆద్యాత్మిక,ఉపన్యాస వివరాలు

మదిలో నిక్షిప్తమైన భావాలు
ఆలోచనా అక్షరామృత కధలు
వర్తమాన విశేషాలు, లగ్న ఫలితాలు
పురోగతి ప్రణాలికలు, వ్యాపారాలు

చితికిన బ్రతుకుల గాధలు
ఆధునిక ఉపయోగ పరికరములు
ఉద్యోగ ప్రకటనలు, ఉష్నోగ్రతలు
మనసుకునచ్చే హస్యగుళికలు

క్షణం క్షణం మనల్ని మేల్కొల్పి
నిరంతరం చైతన్య వంతులుగా చేసి
ఆవేదనలు దూరమ్ చేసి
ఆశలకు ప్రాణం పోసి
పురోగతికి ప్రణాళిక వేసి  
మస్తాకానికి స్నేహితుడుగా ఉండి         
ఇంటిల్లి పాటి ఆనందాల్లో ముంచి

విద్యారుల ప్రగతిని చూపే అక్షర దీపమ్   
అదే అందరి మాతృభాషా ఆశాజ్యోతి
                ప్రపంచ వార్తా విశేషాలు తెలిపే గీతమాల                   
ఎప్పటికప్పుడు విషయాలు తెలిపేదే దినపత్రిక 
    --((*))-- 


 
*నిద్ర రాదా  ?

ఉద్యోగాల్లోని డెడ్ లైన్ల హెచ్చరికల వళ్ళనేమో
వికసించని గాఢమైన  ప్రేమసాహిత్యాలవల్లనేమో
ఆధునికి జీవిత జాడ్యాల ఆలోచన వల్లనేమో    
కళ్ళు మూసుకున్నా  నిద్ర రావాటం లేదు నిజమా

లక్ష్యాన్ని చేరు కొనేదాక కష్ట పడుట వల్లనేమో
రెప్ప వాల్చకుండా దృశ్యాలను చూడుట వల్లనేమో
రెచ్చకొట్టే పదజాలాన్ని మరువలేకుండుట వల్లనేమో 
కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

సరియైన తిండి తినక, మెత్తని పరుపు లేకుండెనేమో 
విశాలమైన పడక, A.C. సదుపాయాలు లేకుండెనేమో
చెప్పలేని బెరుకు, అర్ధం లేని మానసిక భయం వళ్ళ నెమో   
కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

నిద్ర వచ్చుటకు మత్తు మాత్రలకు బానిసగా మారుట వళ్ళ నేమో 
మత్తు మాత్రలు వళ్ళ  జ్ఞాపకశక్తి, తలనెప్పి వచ్చి భాదవల్ల నెమో 
నరాల బలహీనతతో కలత నిద్రతో భయంగా ఉండుట వల్లనేమో
అయినా కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

ధనం, స్త్రీ సుఖం, అప్పులు మనస్సును వేదించకుండా  ఉంటే
స్నేహం, ప్రేమ, నమ్మకం, ఆత్మీయులు  ద్రోహం చేయకుండా ఉంటే
కులం, మతం, సమాజం, కన్నబిడ్డలు వేధించకుండా ఉన్నప్పుడే      
అప్పుడే నిజంగా కళ్ళు మూసుకున్నా వెంటనే నిద్ర రావాటం సహజం

పగలు కష్ట పడ్డ వారికి రాత్రి నిద్రరావటం సహజం
చీకటి పడగానే ప్రకృతి నిద్రకు గాలివీచుట సహజం
మనస్సు ప్రశాంతంగా వెన్నెలలో నిద్రే ఎంతో సహజం
ఆరోగ్యానికి, దృడశక్తి, సుఖశాంతికి నిద్రవళ్ళ కలుగుట సహజం
--((*))--




*(రైతే ఆధారం పభుత్వానికి)

చినుకులు పండగోస్తుంది గిష్మాలు దాటేస్తూ
కర్షకులు ఓర్పుతో దుక్కి దున్ని దమ్ముచేస్తే
నారు పోసి నాట్లుచేసి నీరు పెట్టి నారు పోస్తే
రేయి పగలు నిద్రాహారాలుమాని కాపు కాస్తే

ఆశతో రైతు ఆకాశం వైపు జలదారకోసం చూస్తే
చేను పురుగు పట్టగా మందులకు  అప్పులుచేస్తే     
నీరులేక ఋణగ్రస్తూన్ని చేసి రైతుని వీధిన పడేస్తే
బ్రతుకుపై ఆశచచ్చిన దిగులు చెందక ఉండు కర్షకా

మెతుకు నిచ్చు నేలను మేడలను నిర్మించాలా
బ్రతుకును పంచె నేలను వట్టిగా ధారా పోయాలా
రైతు కూలీ జనమ్ నోటిలోమట్టి కొట్టి కోట కట్టాలా
కర్షకులు వలస పొతే ప్రభుత్వాలు నిలబడతాయా

రైతువిశ్రాంతి పొందితే, పచ్చని పైరుపండక పోతే
ఆహారము లేక తనువు తపించే తపనలు పొతే 
మనుష్యుల మద్య ఉన్న మనస్సు కలవక పోతే
శాంతి లేక సృష్టి జరుగదు, అందుకే పంట పండించు కర్షకా  

రైతులకు మంచి విత్తనాలు తక్కువ రేటుకు అందించి
అవసరానికి నీరును, పురుగు మందులను అందించి
రైతులకు ఆర్ధిక అవసరాలకు బ్యాంకులు లోను అందించి
ఉండకపొతే రైతులు వలసపొతే, మనప్రగతి కుంటు పడుతుంది             

రైతు ఉత్సాహముతో నుండుట  ఏంతో మేలు
రైతు కష్టపడి పంట పండించుట అందరికీ మేలు
రైతు మృత్యువుకు చిక్కక ఆదుకోవటం అందరికీ మేలు
ప్రభుత్వాలు రైతుపై ఆధారపడి ఉన్నాయని గమనించుట మేలు  

--((*))--
Photo: लगता तो बेखबर सा हूँ पर खबर में हूँ।
तेरी नज़र में हूँ तो सबकी नजर में हूँ। 
 * (మృత్యువు)

ఓ మానవ, నీ మృత్యువుని  నీవే
జాగర్తలు చేసుకోక, పిలుస్తున్నావు

విసృంఖల సౌకర్యాల మత్తులో
స్త్రీ సుఖాల ఖాంక్షల వేటలలో
ధనమదంతో, అనారోగ్య అంచులలో
చిక్కి మృత్యువాత పడుతున్నావు

శబ్ద కాలుష్యంతో
వాయు కాలుష్యంతో
నీటి కాలుష్యంతో    
అనారోగ్యుడవై మృత్యుడౌతున్నావు

వ్యాయామం లేక
ఊపిరి సరిగా లేక
తగు ఔషదము వాడక
హృద్రోగంతో మృత్యుడౌతున్నావు

కుషన్ సీట్లో ఎక్కువ సేపు కూర్చొని     
పిస్టూల్లా, పైల్సు రోగాలు వెంబడించి
ఏసీ రూమ్లొ ఎక్కువసేపు కూర్చొని
డి. విటమిన్ తగ్గగా బలహీనుడౌతున్నావు

పాలరాతి బండలు నేలపై పరిచి
అందం చూసారుకాని జారితే వచ్చే నెప్పిని
బాత్ రూముల్లో కూడా వేయించి
మేక్కాల్ల నెప్పులకు దారిచూపు తున్నావు

సెల్ ఫోన్ లు ఎక్కువగా వాడి
కంప్యూటర్ , టి. వి. అదేపనిగా చూసి
తెలియని రోగాలను ఆవహించి
మనసును భాధకు గురిచేస్తున్నావు

మానవ పౌష్టికాహారము తీసుకొని
మనసు ప్రశాంతముగా మార్చుకొని
కాలాన్ని అనుకరించి జీవితాన్ని
గడిపే వారిని మృత్యువు దరిచేరదు  
 --((*))--  


*(కంప్యూటర్ )

ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తూ,
మనసులో మనసై  ఆ "విరించి"
అఖిలాండ బ్రహ్మాండాన్ని సర్వం
తన్మ యత్వంతో  ఆ "విరించి"

మేధావుల ప్రయత్నాల
పరంపరల మేథా శక్తి వెల్లువలే
సర్వ భాషా భాండా గారాన్ని
నిక్షిప్తంగా వెల్లువరించే ఆ "విరించి"  

గాడాంధకారాన్ని మటుమాయం
చేసే, విజ్ఞాన మానవ శక్తి పరులే
విశ్వజ్యోతి వెలుగులు అందించే
సర్వ విజ్ఞానం తో ఆ "విరించి"

చిత్ర, విచిత్ర, దృశ్య , శబ్ధ,
శృగార, హాస్య మేల వింపులే
వేదంత, సంస్కృత సాహిత్య,
పలుకోటి భాషలతో ఆ "విరించి"

వ్యాయామ, వ్యవసాయ,
అంతరిక్ష వాతావరణ వివరాలే
మానవల మేలుకొనే, సుఖ
సంసార సంభాషణలతో ఆ "విరించి"

తల్లి తండ్రుల పోషణ, దేవతా
మూర్తుల అరాధనా వివరాలే
మన: శాంతికి, మనో నిగ్రహ
శక్తికి, పలు శుభాలతో ఆ "విరించి"

ఆరోగ్య, అనారోగ్య, నిత్య వార్త,
ప్రపంచంలో చేసే సేవా వివరాలే
సంక్షిప్త, నిక్షిప్త, విశ్వ వ్యాపిత
సమమాచార కంప్యూటర్ గా ఆ "విరించి"
(విరించి అర్ధం (త్రిమూర్తులు)           
--((*))--




Photo:

*(సరసాలు)

విధి వీధిలో కొత్త సందడిలే
పున్నమి వెన్నెలలో సరిగమలే
పుడమికి కొంత  పులకరింతలే
తొలకరి జల్లులతో మన  సరదాలు   
 
మొగ్గ పువ్వు కొత్త పలకరింపులే
చిరు బుగ్గలపై తొలకరి సిగ్గులే  
మధువు త్రాగే పెదవుల కదలికలే
గ్రోలు తున్న తుమ్మెదల సరసాలు 

అందాలు విరుస్తున్న పువ్వులే
పచ్చికలో పైరుగాలికి కదిలే తీగలే      
చుట్టుకున్న కోకలు కదలికలే
కోకలో దాగిఉన్న సోకులతో సరసాలు 

ప్రేమ జంటల ఆరాటాల కదలికలే
ఎద పొంగు తడిసి పైట రెపరెపలే
పైట లాగుతుంటే కులుకుల వలపులే
చేయి చేయి కలిపి చేసుకొనే సరసాలు  

కన్ను కన్నుకలసి పెరుగును విరహాలే
విరహానికి ఊగిపొవు కందిరీగ నడుములే
ఎదురుచూపు ఆశలకు ఇది  అవకాశములే 
చిరుజల్లుల సైయ్యాటలే మానవుల సరసాలు
--((*))--


*ఇచ్చేసేయ్

నీ ఆశల వలయాన్ని కాలానికి ఇచ్చేసేయ్
సుఖ మంతా ప్రకృతి మార్గానికి ఇచ్చేసేయ్

నడకకు ముల్లున్నా, వయసు తుల్లుతున్నా
నీ మనసు గమన మార్గానికి ఇచ్చేసేయ్

జీవిత చదరంగంలో యాత్రలు ఎన్ని ఉన్నా
ఎదురయ్యే సమస్యలను కాలానికి ఇచ్చేసేయ్

కళ్ళను మురిపించే నవ వనితలెందరున్నా
వ్యసనాలకు చిక్కక మౌనానికి ఇచ్చేసేయ్

మాటవిలువ ఓపికతో ఎదురుచూస్తూ ఉన్నా
మౌన వేదనతో కన్నీరు కారుస్తూ ఇచ్చేసేయ్

ప్రయత్నంలో ఎన్ని అపజయాలు ఎదురై ఉన్నా
ఓపిక,ఓర్పుతో మనసును సమయానికి ఇచ్చేసేయ్

--((*))--




image not displayed 
అరుస్తూ కదులుతుంది శకటం వీధుల్లో
వేగంలా కదులుతుంది మనసు కలల్లో

సుఖాంతం ఎక్కడో తెలిసి కోలేక ఉంటే
ఆలోచనా సర్వం నిరంతరం ఉండు తలల్లో

మనపై కోర్కల వసంతం వెంబడిస్తూ ఉంటే
ఖర్చులు కనిపిస్తాయి బ్రతకాల్సిన జీవితాల్లో

ఆశయాలుకు చీకట్లు కమ్ముతూ ఉంటే
వెలుగు లేక నిరాశలు ఉండు మనసుల్లో

తనువుల తపనలకు తట్టుకొని ఉండి ఉంటే
మనసులు చిక్కు మగువ వలపుల వలల్లో

కోపం మనిషిని మృగం గా మార్చిన వైనం
కృస్సించిన జీవితమ్ మారుతున్నది వ్యధలో

--((*))--




* (అంచులు )

మనసులోని మమతలు 

తెలుసుకోలేని దూరపు అంచులు
కళలు కార్యములో పెట్టుటకు

 చూడాలి కొన్ని దూరపు అంచులు

పండితులు తమ వాక్చాతుర్యముతో 

ఎదుటి వారి మెప్పు పొందు
మాటల గారడిలో ముంచి మేధావికి

 చూపు కొన్ని దూరపు అంచులు 

శక్తి అదృశ్యంతో ఎప్పుడూ ఉండి 

మానవులమనోధైర్యాన్ని పెంపొందు    
భాషలు ఎన్ని ఉన్నా మానవత్వానికి 

మనుగడ తెలిపే కొన్ని అంచులు 

కల్పనలు వెంబడించిన మనం ఏది 

సత్యం ఏది ధర్మం అదే పొందు 
దేవుని సంకల్పం కోసం కన్నీటి చలములు

 చూడాలి దూరపు అంచులు 

మబ్బులు మేఘాలతో దోబూచులాడి 

జలాన్ని పుడమితల్లి పొందు
వానలు కురిసి పృధ్వి సుక్షేత్రంగా మారి 

ప్రకృతికి సహకరించే అంచులు 


--((*))--

ఉన్నదిలే

ఆలోచన అనంతమై వేదిస్తూ ఉన్నదిలే
నటనలో అభినయం ప్రకటిస్తూ ఉన్నదిలే


శృంగారాన మోహముతో కళలన్నీ చూపునులే
తాపముతో, పౌరుషంతో, పరవశంతో ఉన్నదిలే


మొఖముపై కమ్ముకొనే కురుల గుసగుసలే
కురువిప్పే తమకంతో ఊరిస్తూ ఉన్నదిలే


చీకటిలో తారలా వెన్నెలను కురిపించునులే
తమాయించే విరహంతో తపిస్తూ ఉన్నదిలే


కర్కసమైన హృదయంలో కరుణ ఉందిలే
మౌన సంభాషణలతో భావాలాతో ఉన్నదిలే


మయూరాల ఎదురుచూపులకు పసందులే
ప్రాంతమంతా తళుకు బెలుకులతో ఉన్నదిలే


మమకారం పంచుతూ మనసు అందించునులే
ప్రేమ లహరి తీరానికి చేర్చుటకు వయసు ఉన్నదిలే

--((*))--


* (ఈ లోకం ) 

వేకువ లెన్నో వచ్చును
చీకటి లెన్నో  మారును
వేకువ చీకటి  లోకాన
కష్టసుఖాలు కాక ఏముండును

మాటలు వినిపించును
మాయలు కప్పి వేయును
మాయ మాటలు నమ్మటం
కాక ఈ లోకం లో ఏముండును

సత్యము పలికే వాడును
నిత్యము తిరిగే వాడును    
నిత్య సత్యాలు తెలియుట
కాక ఈ జగతిలో ఏముండును

భావముతో వ్యక్త పరుస్తాను
రాగముతో త్రుప్తి పరుస్తాను
రాగ భావములు మించినవి
ఈ యుగములో ఏముండును

పతు లంతా శ్రమల తోను
సతు లంతా మాటలతోను
సతీ పతులంతా కలియుట కాక
ఈ ప్రేమలోకంలో మరి ఏముండును        

సృష్టి యంత తల్లి దగును
పోషణంతా తండ్రి దగును
తల్లి తండ్రుల సేవ కాక
ఈ ప్రపంచములో ఏముండును  

సృష్టికి మూల ఒకటుండును
లయ కారకుడు వేరొకడుండును
స్థితి ఆధార భూతములే కాక
ఈ కలియుగంలో మరి ఏ ముండును

--((*))-- 


*  (ఈ లోకం -2)

వెన్నెల కురియు చుండును
మల్లెలు విరియు చుండును
ప్రేమలు పెరుగు చుండును
అయిన కల్లోలాలు రాకమానవు

దేహము శ్వాసకు బ్రతుకును
మోహము ప్రేమకు పెరుగును
స్నేహము చరిత్ర  తెలుపును
అయిన దేహానికి రోగాలు రాకమానవు

వేదము ధర్మము తెలుపును
జూదము మనసు చరచును
వాదము మనిషిని మార్చును
మానవులకు వాదాలు రాక మానవు

మృగాలు అడవి యందుండును
రోగాలు ప్రాణులకు వచ్చును
త్యాగాలు మనుష్యులు చేయను
అయినా మానవ మృగాలు రాక మానవు

మనరణం ఎప్పుడూ అనివార్యం
మార్పులు ఎప్పుడూ అనివార్యం
తీర్పులు ఎప్పుడూ శిరోధార్యం   
అయిన ప్రాణుల మారణాలు రాక మానవు

భాధ్యత పెద్దరికం నిలుపు
మద్యము బీదరికం మలుపు
సాద్యము మధ్యరకం మెరుపు
అయిన పెద్దరికాలు మారక మానవు  
 --((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి