30, జులై 2016, శనివారం

Internet Telugu Magazine for the month of 8/2016/29


ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 


 సర్వేజనాస్సుఖినోభవంతు


సదాశివ
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని 
తప్పు  చేసినట్లు విన్నవించు చున్న 
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ 

గొప్పల కోసం చేయ కూడనివి చేసాను
 ప్రభుత్వానికి తెలపక కళ్లుకప్పి తిరిగితిని
తప్పు సరిదిద్దు కోలేక ఒంటరిగా ఉన్నా
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ 

ఎప్పటికప్పుడు చేసిన తప్పు విన్నవిస్తూఉన్నా
చెప్పిన మాటలు చెప్పకుండా చెపుతున్నా
వప్పుకుంటున్నాను చేసిన తప్పులన్నీ 
తప్పు  క్షమించి,  నన్ను కాపాడు సదాశివ 

మొప్పలతో కదిలే చేపలాగా ఈదలేక
చిప్పల్లా తెరిచిన చేప కల్లల నిద్రపోలేక
ఉప్పునీరు త్రాగే చేపల బ్రతుకుతున్నాను
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ 

తప్పెట మీద సంగీత స్వరాలు వినిపిస్తున్నా
కుప్పి గంతులు  వేస్తూ నిన్ను ప్రార్ధిస్తూ ఉన్నా
అప్పడంలా తేలుతూ సమీరగాణం వినిపిస్తున్నా
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ 

అప్పటి మేఘంలో నీ  మెరుపు చూసా
అప్పటినుండి ధర్మమార్గాన్న నడుస్తున్నా
ఎప్పటికప్పుడు ధర్మ  బోధచేస్తూన్నా 
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ 
--((*))--


దేవుళ్ళు పూజించిన శివలింగాలు..
శివ పరమాత్మను పూజించేందుకు సకల దేవతలు శివలింగాలను పొందారు. అవి:
విష్ణువు – ఇంద్ర లింగం
బ్రహ్మ – స్వర్ణలింగం
లక్ష్మి – నెయ్యితో చేయబడిన లింగం
సరస్వతి – స్వర్ణలింగం
ఇంద్రుడు – పద్మరాగ లింగం
యమధర్మరాజు – గోమేధక లింగం
వాయుదేవుడు – ఇత్తడి లింగం
చంద్రుడు – ముత్యపు లింగం
కుబేరుడు – స్వర్ణలింగం
నాగులు – పగడపు లింగం
అశ్వినీదేవతలు – మట్టితో చేయబడిన లింగాలు
--((*))--

శ్రీ కృష్ణ శతకము (12 పద్యాలు వినండి )

--((*))--



* వయసొచ్చాక 

రస మయమైన మదిలో
గుస గుసలే హాస్య పదాలుగా
లేత వయసైనా సొగసులో
మరి మరి చూపులు ఇష్టాలుగా

మనసెరిగిన వయసులో
కోరి కోరి కోర చూపులే మాయగా
తడి పొడి తనువు తపనలలో
మడి మడి అంటూ తడబడగా

పలు రకాల కోరికలలో
ఇది అది అని చెప్పలేక ఉండగా
మనసుకు నచ్చే మాటలలో
మధురభావ స్మృతులు చూడగా

కను రెప్పల కదలికలలో
వేడి వేడి సెగలు వెంబ డించగా
కోరికలుతీర్చుకొనే సమయములో
నిశ్శబ్ద కర్ఫి వచ్చి విడదీయగా 

వయసొచ్చిన యువతికి యువకులలో
ఏదో తెలుసుకోవాలని కోరికలువెంబడించగా
పువ్వుల సుగంధ పరిమళాలలో  
నవ్వుల మనస్సుకి చిక్కి విలవిల్లాడగా

కోరికలకు బానిస కావద్దు 
పెద్దల మాటలువినాలి ముందు
విద్యను ఏ పరిస్థితిలో వదలొద్దు
జివితానికి మలుపు విద్య అని మరవద్దు
ఆవిద్యే ఇరువురిని ఏకం చేస్తుంది  
మనస్సు ని ప్రశాంత పరుస్తుంది
మనోబుద్ధిని వికసింప చేస్తుంది 
భవిషత్తు బంగారు బాటగా మారుస్తుంది    
   --((*))--

 
*క్షణికావేశం 

మనలో  ఉన్నది మానవత్వం
మనస్సును మర్దన చేసే రాజకీయం వద్దు
మనం చేసే పనిలో ఉండాలి పటుత్వం
ఎవరు ఎమన్నా వ్యాపారము చేయవద్దు

మన కుంటుంది సమస్యల వలయం
నిగ్రహశక్తితో సాదించాలి కాని, చెప్పవద్దు
మన శక్తిని చూపుట ఎప్పుడు అనవసరం
పరోక్షంగా వత్తిడి మనకు అసలు వద్దు

ఇప్పుడు ఉంది అందుబాటులో అంతర్జాలం
స్వతంత్రంగా శోధించు, ఇతరులను నమ్మవద్దు
వయసుకు తగ్గ ఆలోచనలు అవసరం
నిగ్రహశక్తి కోల్పోయి అఘాయిత్సం చేయవద్దు

వయసు వత్తిడికి నిగ్రహించు కోవటం అవసరం
తల్లి తండ్రుల కష్టం గమనించు, రుద్రుడవ్వద్దు
ప్రేమ ప్రేమ అని క్షణికావేశానికి ఎందుకు దిగడం
నిన్ను నీవుగమనించు, స్త్రీలను వేదించనే వద్దు         

--((*))--

*ఇంద్రధనస్సు

ఆకాశంలో ఇంద్రధనస్సుకు రంగులు
పుడమిలో ఉద్భవించెను ఎన్నో వింతలు
ప్రకృతిలో గుర్తింపు లేని మార్పులు
మానవునిలో అందు కోలేని ఆశలు

ఇంద్రధనస్సు చల్లని వాత్తావరణాన్ని
సృష్టించి నేనున్నానని గుర్తు చేస్తుంది
వసుంధర ఖనిజ సంపదతో సంతోషాన్ని
ప్రకటించి నేనున్నాని గుర్తు చేస్తుంది 

ప్రకృతి సర్వం తానై మనసుకు మాదుర్యాన్ని
అందించి నేనున్నానని గుర్తు చేస్తుంది
మానవులు ఆహ్వానిస్తున్నారు కోరికల్ని
తీర్చుకుంటూ తృప్తి జీవితం అనలేకున్నారు

ఇంద్రధనస్సులో ఉన్న సప్తవర్ణాలు
ప్రతినిత్యం మానవుల్ని ప్రేరేపించే నేత్రాలు
భూమిలో ఉన్న సమస్త సంపదలు
ప్రతినిత్యం మానవుల్ని బ్రతికించే వనరులు 

ప్రకృతిలో ఉన్న అన్నీ ఋతువులు
ప్రతినిత్యం మానవుల్ని అందించే స్పందనలు
మానవునీలో ఉన్న అన్నీ గుణాలు
దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని తపనలు       
--((*))--

*జీవుడే దేవుడు
దేహమే ఒక దేవాలయం
దేవుడే అంతర నివాసం
దేహం మార్పు నిరంతరం

బుద్దితో దేహానికి ప్రాముఖ్యం
దేహానికి ఉండు ప్రేమ భంధం
జీవనానికి పెంచును సంభందం
దేహం పాంచ భౌధికం

దేహంతో జీవయాత్ర అవసరం
సర్వాంగ క్షేమం ముఖ్యం
దేహానికి ధర్మాచరణ అతి ముఖ్యం
ఓం శ్రీ రాం జపం ముఖ్యం

మనస్సాంతే జీవులకు ముఖ్యం
ధర్మం తప్పిన జీవి బ్రతుకు వ్యర్ధం
స్వార్ధపు జీవికి బ్రతుకే నరకం
ప్రాణంతో ఉంటేనే జీవికి ప్రాదాణ్యం
ప్రాణం పొతే అంతా సూణ్యం
--((*))--




రజనీ కాంత్

సినిమా మూన్నాళ్ళ
హృదయాలలో ఉంటారు కొందరు ఎన్నో ఏళ్ళు
మట్టి- రాయి- బంగారం ఒకటే అనేవాళ్ళు
ఒక్కరే ఆ మహనీయుడు ఇతడే

జ్ఞాన -విజ్ఞానం అంటూ బోధ కొన్నాళ్ళు
సమస్త ప్రజా ప్రశాంతత కొరకు సేవ చేసేవాళ్ళు
మనో నిగ్రహ శక్తితో ఉండేవాళ్ళు
కొందరిలో ఒక మహానీయుడు ఇతడే

నిశ్చలంగా ఉండిన ప్రకృతి కళ్ళు
ప్రపంచ ప్రజలలో తెస్తాయి పరవళ్లు
ఆకర్షణ- వికర్షణ వయస్సు ఉన్న నాళ్ళు
నిర్మల హృదయ మహనీయుడు ఇతడే

ఈ క్షణంలో ఇంద్రియాలకు లొంగని వాళ్ళు
జ్ఞాన విజ్ఞానముతో తృప్తి చెందిన వాళ్ళు
ప్రజాకర్షకతో నిలబడిన నటుల్లో ఒకనాడు
ఎన్టీఆర్ - నేడు రజనీ కాంత్

నూతనంగా వచ్చే సినిమాకి నా కవిత్వ
సందేశం  .    
నటులు ఎందరు ఉన్నా - మనుషుల హృదయాల్లో
జీవించే వారు ఒక్కరే  


--((*))-- 


చిత్రమ్ పై నా కవిత
కనిపించుటలేదు- మానవత్వం

 థరించే దుస్తులలో... కనిపించదు
గుండెలో ఉన్న మనోధైర్యం
వరించే పదవులలో..... కనిపించదు
ప్రజాసేవలో ఉన్న దృఢత్వం
అనుభవించే ఆస్తులలో.... కనిపించదు
బీదల సేవలో ఉన్న దృఢ సంకల్పం
తరించే కుల కాంతులలో..... కనిపించదు
ధర్మ సేవలో ఉన్న సంప్రదాయం
జపించే మత మంత్రాలలో...... కనిపించదు
మనుష్యులలో ఉన్న మూఢ నమ్మకం

నువ్వు చూడలేని వైవిధ్యం... కనిపించదు
ఆశల  వలయంలో  చిక్కిన  మానవత్వం
వేద మంత్రాలు వర్ణించలేని అభిమానతత్వం..
మనుషుల్లో ఉన్న నమ్మకమనే బలహీనత్వం

అతనిని అనుసరించే దైవత్వం..... కనిపించదు
ఆదుకునే వారులేక అలసత్వం పొందటం తప్ప
ఇది కలియుగం - ఆదరణ కరువుకు నిలయం
కళ్ళు తెరవండి కనికరం చూపటం నేర్చుకోండి

--((*))--

మెడికల్ ఎక్సమ్.లీక్ పై నా కవితా

తప్పెవరిది అయిన విద్యార్థులకు కష్టం
జ్ఞాపకాల పుటలు విప్పాలంటే కష్టం
పరీక్షలు మల్లీ వ్రాయటం మరీ కష్టం
తల్లి తండ్రులకు ఇది మరొక కష్టం

అధికారులు ముందుగా కనుక్కోకపోవడం
(పాపర్ లీక్) మన నాయకుల దౌర్భాగ్యం
పెద్దల నిట్టూర్పులు, విద్యారులకు మారో పరీక్ష
కాలాన్ని వ్యర్థం చేసి విద్యార్థులను పరీక్షించకండి

తల్లి తండ్రుల ఆవేదనను గమనించండి
అనుమానం ఉన్న పరీక్షా కేంద్రాలు మాత్రం
రద్దు చేయండి, విద్యార్థుల భాదను గమనించండి
చీకటిముడి విప్పండి, ద్రోషులను శిక్షించండి

విద్యార్థులకు సంతోషం కల్పించే విషయం
తెలపండి, కాబోయే వైద్యులను గమనించిండి
కాలయాపన చేయకండి, త్వరగా పరిష్కరించడి
స్పష్టముగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి

--((*))--

*అబ్దుల్ కలాం తత్వ మాటలు

ఆలోచనలకు తావివ్వికు
ఆకాంక్షలకు ఆశపడకు
ఉన్న జ్ఞానాన్ని మరువకు
అజ్ఞానిని అని అనిపించుకోకు

జ్ఞాన తేజాన్ని నలుగురికి పంచు
ధర్మ మార్గాన్న గమ్యాన్ని ఎంచు
జరిగే సంఘటణలను గమనించు
నిరంతర అభ్యాసమును వహించు

తనచుట్టూ ఉన్న వారి పని గ్రహించు
వ్యతరేకులను మార్చుటకు ప్రయత్నించు
ఆప్రమత్తముగా న్యాయ కత్వాన్ని ఉంచు
బృందాన్ని సమర్దవంతముగా నడిపించు

అనుకూల ప్రతికూలాలుకు భయపడకు
సహజత్వంలోఉన్న ఆనందాన్నివదలకు
వ్యతరేక శక్తులపై బలాన్ని వ్యక్త పరచకు
యువశక్తులను ఉత్తెజపరుచుట మరువకు

స్వేచ్చ ఇచ్చి పుచ్చుకునేది కాదు
గుణ గణాలను అర్ధం చేసుకొని సాగు
నీకున్న శక్తి సామర్ద్యాలతో జీవించు
దేశం కోసం శక్తినంతా ఉపయోగించు
--((*))--


నేటి సమాజం - మారేదెప్పుడు

ఉన్నప్పుడు నిప్పులు
పోయ్యడంలో ఉంటుంది మోజు
చచ్చాక శిలావిగ్రహం
స్తాపించుటే రివాజు


బ్రతికే టప్పుడు అప్పులు
చెయ్యటంలో ఉంటుంది మోజు
తిర్చేటప్పుడు నిగ్రహం
కోల్పోవటం రివాజు


ప్రేమించే టప్పుడు తిప్పలు
పడటంలో ఉంటుంది మోజు
పెళ్లి వచ్చేటప్పటికి
పెద్దల నిరాకరణ రివాజు


రహస్యం వినే టప్పుడు చెవులు
పని చేయుటలో మోజు
ధర్మాన్ని నిలబెట్టే టప్పుడు
చెవులు పనిచేయక పోవుట రివాజు


సంసారంలో సహకరించే స్త్రీలు
ప్రేమించటంలో ఉంటుంది మోజు
కష్టాలు వేమ్బడిస్తున్నప్పుడు
భయపడి భయపెట్టుట రివాజు


సమాజానికి ఉద్దరించే కవులు
సాహిత్యం వ్రాయుటలో మోజు
బ్రతుకు కు సాహిత్యం వళ్ళ
ఉపయోగం లేకపోవుట రివాజు
--((*))--


*" కంప్యూtaర్ "
(హిందూ దేవుళ్ల స్నేహ సహకార బాండాగారం) !

సకల సృష్టికి మూలం ' బ్రహ్మగారు '
బ్రహ్మ 'కంప్యూటర్ ఇన్ స్టాలర్'
సృష్టిని భద్ర పరిచారు 'బ్రహ్మగారు'

నడిపే వారిలో ముఖ్యులు 'విష్ణుగారు '
విష్ణు 'కంప్యూటర్ ఆపరేటర్'
మంచి చెడు మలిచారు 'విష్ణు గారు'

కధలు, చిత్రాలు సేకరించు వారు 'శివగారు'
శివ 'కంప్యూటర్ ప్రోగ్రామర్ '
సకల భాషలలో కుదించారు 'శివ గారు'

ఒక చోటనుండి మరోచోటకు పంపేవారు
నారద మూర్తి గారు, విరే
'కంప్యూటర్ డేటా ట్రాన్స్ మీటర్ '
పర్యవేక్షలుగా ఉన్నవారు 'నారద గారు'

అనవసరాన్ని తొలగించువారు 'యమ గారు '
యమ గారు 'కంప్యూటర్ డేటా డిలెటర్'
ప్రాణాల్ని తోడేసి పట్టుకెల్లెవారు 'యమ గారు'

మనసుతో చలగాటం చేసేవారు 'అప్సరసలు
వీరు 'కంప్యూటర్ డేటాకు వైరస్ ' గా '
వీరికి దూరంగా ఉంటేనే మెమరి కదులు

అజ్నానులను జ్ఞానులుగా మార్చే వారు 'గణేష్'
వీరు జ్ఞానానికి పట్టిన వైరస్ తొలగించేవారు
'అంటి వైరస్ ' గా పనిచేసి ప్రోగ్రామ్ కదిలిస్తారు

ప్రపంచ ప్రజలను ఏకం చేసే, స్నేహానికి
బాసట వేసే 'ఇ' మెయిల్ గా ' మారుతి గారు '
సద్భావాలను కల్పించి శాంతి నిచ్చువారు

సమస్త కదలికలు కంప్యూటర్ లో చూచువారు
అనగా' హార్డ్ డిస్క్' గా ఉండే వారు 'చిత్రగుప్త గారు'
ఎప్పుడు ఏది పని చేయును అది తెలుపు వారు

బ్రహ్మాండ లోకానికి విద్యా భాషా పరిజ్ఞానాన్ని
అందించువారు " సరస్వతిగారు " వీరే గూగుల్
అంతర్జాల సమస్త భోధనా భాండాగార వాసులు

ప్రపంచానికి తల్లి గారు 'పార్వతి మాతగారు' వీరే
కంప్యూటర్ లో మదర్ బోర్డ్ లాంటి వారు, వీరి
ఆజ్ఞ లేనిదే కంప్యూటర్ విస మైన కదలదు

కుటుంబానికి భార్య ఎంత ముఖ్యమో, 'లక్ష్మిదేవి'
అందరికి అంతముఖ్యం, కంప్యూటర్ నేర్చుకోవాలన్న
జివితసాఫల్యానికి, వ్యాపారానికి కంప్యూటర్
లక్ష్మి లాంటిది, కాదు లక్ష్మిని చేకూర్చెది కంప్యూటర్
--((*))--

25, జులై 2016, సోమవారం

Internet Tellugu magazine for the month of 7/2016/28

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - కవితల ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు

* స్వరకల్ప రాహిత్యము

సంప్రదాయ సంగీతం వింటుంటే
తనువు పరవళ్లు తొక్కుతూ పులక రిస్తుంది
విద్వాన్సుల, రసజ్ఞుల మాటలు పాటలు వింటుంటే
మనసు అలలుగా ఎగిరెగిరి పడుతుంది 

సప్తవర్ణ శోభితమైన నాదం వింటుంటే
జీవితంల్లోని వెలితిని పూడుస్తుంది
సుస్వర రాగమాలికలు వింటుంటే
ఉడుకు నెత్తురు చల్లగా మారుతుంది

భావుక పట్టభద్రులై రసజ్ఞులై ఉండి ఉంటే
జ్ఞాన-రసజ్ఞల సంగమంగా మారుతుంది
జ్ఞాన రసజ్ఞతలో  లోటు ఎక్కడ ఉంటే
రససిద్ధికి తప్పక అక్కడ భంగం కలుగుతుంది     

బహువిధ అలంకార పర్యాప్తి వైకిరి ఉంటే
గుండెను తాకి తట్టుకోలేని మాధుర్యాన్ని అందిస్తుంది 
మూలాధారజ నాదబ్రహ్మ హనుమ ఉంటే
ఆగృహము నిత్యకల్యాణం పచ్చతోరణం అవుతుంది      

సంగీత, కళా,  జ్ఞానం అనురక్తిగా ఉంటేనే
ఎక్కువ ఆరోగ్యంగా ఉండ గలుగుతారు 
ముక్తి మార్గము మదిని తోచగానే 
మనస్సు ఆనంద పారవశ్యంగా మారుతుంది

ఏకాంతమున పరమాత్మను ధ్యానించుటను 
యోగ్యతాస్థితులను, వర్ణాశ్రమధర్మాలను ఆచరించుటను 
యోగరూఢ స్థితి ప్రాప్తికి హేతువగుటకును 
శమ: అనగా మనస్సును వశపరుచుకొని 
శాంతింపచేయుటయే సంకల్ప రాహిత్యము 
స్వరకల్ప రాహిత్యము సముచితమని యర్ధమును 
 చెప్పుటయే సముచితము        


--((*))--

*నిస్సహాయుడు

నేనొక  నిస్సహాయ జీవిని -
నాకు ఉద్యోగము లేదు
నా చదువుకు విలువ లేదు
వెన్నెల చిమ్మిన అడవిలో
 చీకటిలా నా బ్రతుకు 

నల్లెరులా సాగాలనుకున్నా
పల్లేటికాయలమీద నడుస్తున్నా
దారి తెన్నులేక తిరుగు తున్నా
నన్ను గుర్తించేవారు సున్నా

కంట నీరు రాదు, కడుపుకుతిండిలేదు
కట్ట మంచి బట్టలేదు, కంటికినిద్రరానేరాదు
వన్నెలు చూపే అడవి మృగాలలో
ఒక మృగములా నా బ్రతుకు

నామత మేదో నాకు తెలీదు
నా బ్రతుకే అర్ధం కావుట లేదు
వెన్నెలలో విహరించే పావురాళ్ళలో
ఒక పావురంలా నా బ్రతుకు

నమ్మకము అనేది ఏమిటో తెలీదు
పట్టుదల మాత్రం నాలో మారదు  
వెన్నెలలో మెరిసే ఏడారి ఇసుకలో
ఎడారిలో రాయిలా నా బ్రతుకు

నన్నుచూసే వారురానే లేదు
నవ్వేటివారు నవ్వటం మార్చలేదు
వెన్నెల సముద్రములో
వర్షములా నా బ్రతుకు

ఈ నిస్సహయుణ్ణి ఆదుకొనే వారులేరా
నాకున్న అక్షరజ్ఞాన్నాన్ని గుర్తించేవారులేరా
నేనుగా బ్రతుకుటకు సహాయ పడేవారులేరా
ఈ నిస్సహాయుణ్ణి పట్టించుకో కండి
ఆ దేవుడు రక్షిన్చుతాడని నమ్మకున్నది 
కాని చదువుకున్న వాడిని ఆధరించండి
మేధావులను గుర్తించి దేశాన్ని రక్షించండి            
--((*))-- 

image not displayed 

*దాన మొక్కటే ?

అన్న దానం గొప్పదన వచ్చు
పూటలో నరగి పోవచ్చు
వస్త్ర దానం భావ్య మన వచ్చు
ఏడాదిలో చిరిగి పోవచ్చు

గృహదానం ఉత్కృష్టస్తానం అనవచ్చు
కొన్ని ఏళ్లకు అది కూలి పోవచ్చు   
భూమిదానం మహాపుణ్య మనవచ్చు
భూమి అన్యులను చేరి పోవచ్చు

గోదానము మహా పుణ్య  మనవచ్చు      
సరి అయినా తిండి లేక చిక్కి పోవచ్చు
కన్యా  దానము శుభ కరమనవచ్చు
కన్యత్వం తో ఉండక  కన్య గుణం మారవచ్చు 

తిల దానం మంచి దన వచ్చు
నిల్వ ఉంచిన పురుగులు పట్టవచ్చు
జలదానం చాలా మంచి దనవచ్చు
కలుషితం తో కలసి చెడి పోవచ్చు
    
నరిగి పోక, చిరిగిపోక
కూలి పోక, చేరి పోక
చిక్కి పోక, కన్యగా ఉండక 
పురుగు పట్టక, చెడి పోక
ఉండేది విద్యా దాన మోక్కటే

నిత్యమై, సత్యమై, మస్తిష్కమై
భావమై, కావ్యమై, నిర్మలమై

నిశ్చలమైన మనస్సులో ఉండి 
ఆపదలో  ఆదు కొనుచుండి 
జీవి తానికి తోడుగా  ఉండి  
ఆశలను తీర్చేదిగా ఉండి
            సంసార సాగరానికి ఆధారమై ఉండి            
ఆదుకునేది విద్యా దానమొక్కటే

తరగని సంపద
గుర్తింపు తెచ్చె సంపద
జగతికి సంపద
విద్యా దాన మొక్కటే
--((*))--

image not displayed

*ఉచిత సలహా
ఇబ్బందులు వచ్చినప్పుడు
మానవుల మనస్సు వికసించు
మన నిబ్బర శక్తి ఆరాట పడు
మది తలపులు పంచుకొను
ఆలోచనలకు బలం పెరుగు
బలమైన శక్తి యుక్తులతో
ఇబ్బందులను ఎదుర్కోని తగ్గించుకో 

సమస్యలు వచ్చినప్పుడు
భయము రానీక సానుకూల
పరిస్థితి వచ్చేదాకా ఓర్పు వహించు
తెలివితో సంప్రదింపులతో సాధనతో
శులభంగా సమస్యలను పరిష్కరించు 

ప్రమాదాలు వచ్చినపుడు
నిగ్రహశక్తి తో వ్యవహరించాలి
ప్రామాదానికి మూలం ఏదో
గమనించి రాకుండా జాగర్పడాలి
పౌరుషాలకు పోకుండా పరిష్కారం
పొంది సంతృప్తి పడాలి 

సంపాదన పొందాలనుకున్నప్పుడు
సమయం వ్యర్థం చేయక జీవించు
చేసేపనిలో స్వార్ధంలేకుండా జాగర్తపడు
మెదడును ఉపయోగించి పనిచేయి
ప్రేమతో పలకరించి ప్రేమను సంపాదించు
సంపద నీవెంటే ఉండు, దానధర్మాలు
చేస్తూ జీవితమును సాగించు
--((*))--

Photo: सन्नाटा छा गया बटवारे के किस्से में...
.........,,..
"जब माँ बाप ने पूछा मै हूँ किसके हिस्से में.".!!

#धीरेन✍
*జ్ఞాపకాల చరిత్ర

చీకటి లేనిదే పగలు ఉండదు
విధిరాత లేనిదే జీవితమే ఉండదు
భూమి లేనిదే ఆకాశ ముండదు
కోర్కలు లేనిదే జీవితము సాగదు

అలలు లేనిదే సముద్ర ముండదు
సఖ్యత కుదరందే జివిత ముండదు
చెట్టుకు తగ్గ గాలి వచ్చుట మారదు
మేఘానికి తగ్గ వర్షంకురవక తప్పదు

జ్ఞాపకాల చరిత్ర విన బడదు కనబడదు
ఆశ-మాయ జీవితాలలో సుఖమే ఉండదు
ఋణము లేకుండా జీవితము ఉండదు .
ప్రేమ,దుఃఖం లేకుండా సంసారమే ఉండదు

ఆశయాలకు అవకాశ మనేది కనబడదు
పంచభూతాలు లేనిదే జీవిత మనేది లేదు .
వాణి సహకారము లేనిదే చదువు రాదు
తల్లితండ్రుల శక్తి మనలో ఉండక తప్పుదు
--((*))--

* ప్రేరణ

అణువణువు ఆలోచన వద్దు
ప్రణయపు మాటలు రానీయద్దు
రణపు ఆలోచనాలు ఆసలే వద్దు
ప్రాణం ప్రతి ఒక్కరికి హద్దు లేని ముద్దు

తృణప్రాయం అని పనిని గురించి అనద్దు
మణువు చెప్పిన నీతిని మరువద్దు
అణచుట ధ్యేయంగా పెట్టు కొనవద్దు
అనృ తంగా మాట్లాడి ఆవేశ పడవద్దు

వణక వద్దు ఏ పనికి బెదర వద్దు
అణా పైసా కోసం యాచించ వద్దు
అణాది ఆచారం అస్సల మరువద్దు
నిణా  భేధంగా ఆలోచించనే వద్దు

తాణా అంటే తందాణా అనవద్దు
రాణా అంటే రమ్మనుటే హద్దు
పోణా అంటే ప్రత్సహించ వద్దు
జణ గణ మణ గీతం మరువద్దు

కరుణ చూపుతూ జీవితం సాగించు
తరుణం వచ్చేదాకా ఓర్పు వహించు
వ్యసణాలను వదలి ప్రేమను పంచు
ప్రేరణకు లొంగక జీవితం సాగించు 
 --((*))--

*ఒంటరితనం

మమత,  రాగద్వేషములు కలిగి ఉండి
ఎవ్వరికి చెప్పుకోలేని ఒంటరితనం
మనసు చీకటిమయము లేకుండా ఉండి
భావ రాహిత్యము ఉన్న ఒంటరితనం

పగటి కళ్లకు వెలుగు సూన్యమై ఉంటే
రేయి కళ్లకు వెలుగవసరంలేని ఒంటరితనం 
గుండెల్లో నిర్వాకార, నిశ్శబ్దం ఉంటే
ప్రపంచ హోరు ఎంత  విన్నా ఒంటరితనం         

ఆలోచనలు సుడిగుండంలా మారుతుంటే
ఎటూ చెప్ప లేని మనసు ఒంటరితనం
అందరూ ఉన్న గుర్తింపు, విలువ  లేకుంటే
అన్నీఉన్నా  అనుభవించలేని ఒంటరితనం 

పరమాత్మకు  తోడు ఉందామనుకుంటే
జ్ఞానమనే గురుబోధ లేని ఒంటరితనం 
ఏకాంతమున ధ్యానము చేద్దామనుకుంటే
చెవుల్లో వినబడుతున్న హోరుతో ఒంటరితనం

ఒంటరి తనం అనుకోకు బీదల ఆకలిని గమనించు
అనారోగ్యులను రక్షించు, శబ్దకాలుష్యాన్ని తగ్గించు
ఇప్పుడు మానవ సేవే మాధవ సేవని గమనించు
మనసుకు  ఒంటరితనం ఉండదు అంతా  మనం
మనం మనం  అనుకుంటే ఉండదు ఒంటరితనం  
 --((*))--

కలల రాణి 

మనసుకు అడ్డుగోడ  ప్రేమికులకులకు ఉండదు రాణి
నీ దరహాసము నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది రాణి
నిన్ను వదలి ఒక్క క్షణమైనా ఉండలేకున్నాను రాణి
నీ యద పొంగులు నాకు నిద్దురరాకుండా చేస్తున్నవి రాణి

వెన్నలు కురుపించి నా మత్తుని వదిలించు రాణి
చిరుజల్లులకు తనువూ తనువూ తడవక తప్పదు రాణి
మనది జన్మ జన్మల భంధం మరవలేకున్నాను రాణి
ప్రతిక్షణం మన ప్రేమను పండించుకోవాలి యుగల రాణి

మనం నివసించే ప్రాంతము మనిసౌధములుగా భావించు రాణి
మనం త్రాగే మధువు షడ్ర ససాజ్యసుభోజ్యమట్లనిపించు రాణి
ఎవ్వరిని పోల్చవద్దు మనదే ప్రణయ సామ్రాజ్యము కదా రాణి
మనం సంసార సుఖములలో ఆడి పాడి తేలి పోదామా రాణి
 

ఈ కొండలాంటి మనసున్న వానిని మంచులా కరిగించు రాణి
ఈగండుతుమ్మెదకు మకరందదారాలు కృమ్మరించువేమి  రాణి
ప్రేమ అనే ప్రణయ సుఖాలతో కలలు పండించి కుందాం రాణి
ప్రేమ జీవులమై ఒకరికొకరం ఏకమై అనుభవిన్చుదాం రాణి   

--(*))--


15, జులై 2016, శుక్రవారం

Internet Telugu Magazine for the month of 7/2016/27

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - కవిత్వ ప్రభ 

MERCI MON AMIE ROBERT ET ANGEL ET 111 FANFAN
సర్వేజనా సుఖినోభవంతు



* "స్త్రీ "- " ప్రకృతి "

తన్ను తనే మర్చి పోతుంది
ప్రకృతి సౌందర్యానికి పరవశించి
మాటలతో మతి పోగొడుతుంది

అలలపై తేలుతున్న పడవల్లా  
నీటిపై తేలుతున్న పువ్వుల్లా
దండ పెరిగి రాలుతున్న ముత్యాల్లా
గల గల మాట్లాడుతుంది

మొహమాట పడలేదెప్పుడు
మనస్పూర్తిగా మాట్లాడుతుంది
మమతానురాగాలు కోరుకుంటుందెప్పుడు
గలగలా నవ్వుతూ పని చేస్తుంది    

వీరందరు నావారు అనుకుంటుంది
వీరికి సేవచేయుటయే ఈ జన్మకు సార్ధకం
తనమనసులోకి ఎప్పుడు రానీయదు స్వార్ధం
అనుకుంటుంది దేవుడిచ్చిన సుఖమే పరమార్ధం

ఎవరు ఎన్ని అనుకున్నా
తను చేయాలనుకున్నది చేస్తుంది
ఎవ్వరినీ నొప్పించక, భాధ పడక
ఆత్మ సౌందర్యముతో వెలిగి పోతుంది

సానపెట్టే వారు ఉంటే వజ్రములా మెరుస్తుంది
నస పెట్టె వారు ఉంటే  భద్రకాళిని గుర్తు చేస్తుంది
నవ్వుతూ పలకరిస్తే మనసును శాంతపరుస్తుంది
అందుకే "స్త్రీ - ప్రకృతి " ఒకరికి మించిన వారొకరు
అందుకే ప్రతి ఇంటా ఆరాధ్య దేవతలవుతారు
      



తల్లి ప్రేమ

పిల్లల మనసు మధురాతి మధురం
కల్లాకపటం ఎరుగని చిలక పలుకులు పలుకున్
ఎల్లలు లేని గారాబంతో పెరుగు చుండున్
జల్లు చూసి సంతోషముతో గంతులు వేయున్

తల్లి తన్మయత్వం చెంది తపించి
తల్లడిల్లీ పిల్లలను దగ్గిర తీసుకొని హత్తుకొనున్
వళ్లంతా నిమిరి తడి తుడిచి సగటు
కలలు కంటూ తల్లి పిల్లలపై కారుణ్యము చూపున్

అల్లన దూరాన పిల్లలకు గాయం తగిలితే
కల్లోల మనస్సుతో తల్లి హృదయం తల్లడిళ్లున్
చల్లగాలిలో తిరగకుండా జాగర్త చూపి
జోలపాడి సంతోషముగా నిద్రపుచ్చు చుండున్

గల్లీల్లో కుక్కలున్నాయి పిల్లలు
కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తే మీ జోలికి రావు
వళ్ళు దగ్గరపెట్టుకొని ఆడుకోండి
కళ్ళు తెరచి కుళ్లును తొలగించండి

తల్లికి పిల్లపై ఉండు హద్దులు లేని ప్రేమ
తుళ్లిపడక సహాయసహకారం అందించేది ప్రేమ
మళ్ళీ మళ్ళీ పిల్లలకు సహాయ పడేది అమ్మప్రేమ
తల్లి ప్రేమను మించినది మారే ప్రేమలేదు ఈ జగతిలో

--((*))--

Photo: ✻↬:❥💟 #मेरी 😎 #आँखों👀में "#छुपी_उदासी"😔 #को_महसूस☺तो कर..!#हम वह😍हैं ...जो #सब_को_हंसा😄कर #रात_भर_रोते है..😔💟🎏↫:?


*పండ్లు అమ్మే పాప  కధ

తట్టలో పండ్లు  తెచ్చి ఆమ్మే పాప
మట్టముగా మతిపోయేటట్లు నడుస్తున్న పాప
వాటంగా వాలుచూపు విసీరుతున్న పాప
ఎటో చూస్తున్నట్లు నటిస్తూ అమ్ముతున్న పాప

దట్టమైన ఎదపొంగులు గల పాప
అట్లా కదిలిస్తూ వయసును చూపిస్తున్నపాప
కట్టలు తెంచుకున్న నదిలా పాప
ఎట్లాగైనా త్వరగా పండ్లు అమ్మాలనుకుంది పాప

తట్టబరువు తగ్గించుకోదలచిన పాప
తట్టి తలుపు తట్టి తల్లులకు పండ్లు అమ్మే పాప
తట్ట పండ్లు అమ్మిన సంతోషంతో పాప
నాట్యమాడుతూ,,పాటపాడుతూ వెళ్లిన పాప

మట్టిని నమ్ముకున్న వయ్యారి పాప
కట్టిన తాళి పదిలంగా భర్తను రక్షించుకున్న పాప
గట్టి రోగానికి మందిప్పించిన పాప 
గుండెధైర్యముతో భర్తను రక్షించుకుంటూన్న పాప

పట్టుదలే బ్రతుకుని నడిపిస్తుంది
శ్రమ శక్తే ఎంతటి రోగానైనా హారిస్తుంది
ధర్మంతప్పక ప్రవర్తిస్తే సుఖమవుతుంది
కాన్సర్ రోగిని బ్రతికించాలన్న పాప కధ ఇది
--((*))--

Photo: उन्होंने देखा और ​हमारे ​आंसू गि​​र पड़े​;
​ ​​​​भारी बरसात में जैसे फूल बिखर पड़े​;
​ दुःख यह नहीं कि उन्होंने हमें अलविदा कहा​;
​ दुःख तो ये है कि उसके बाद वो खुद रो पड़े​।
*మూగ ప్రేమలు

ఒక్క క్షణం ఆగుదాం
నిరీక్షణలో ఉన్నది ప్రేమ
ప్రేమ లేఖలు రాసుకుందాం
లేఖల అర్ధం లోనే ఉంది ప్రేమ

ఫేసుబుక్కులో కలుద్దాం
అంతర్జాలంలో ఉంది ప్రేమ
కార్యాచరణ స్పర్శలు చేద్దాం
స్పర్శల్లో ఉండేది ప్రేమ

పెదాలు పెనవేతలు చూద్దాం
ఆధరామృతములో ఉంది ప్రేమ
దూరంగా ఉండి జీవిద్దాం
గతం గుర్తుకు తెచ్చేది ప్రేమ

గాలి స్పర్శతో సంతోష పడదాం 
గాలి తాకి తన్మయపరిచే ప్రేమ
విశ్వములో దొరకనిదేదో వెదుకుదాం
అదే పొందలేని నిజమైన ప్రేమ

మనో స్థలనాలతో బ్రతుకుదాం
హృదయస్పందనల్తో జయించే ప్రేమ
సంతోషాన్ని వెతుకుందాం
సేవాదృక్పదంతో పంచుదాం ప్రేమ

ప్రకృతిని ప్రేమిద్దాం
ప్రకృతి వనరులను పంచుదాం
జీవరాసులు ప్రేమిద్దాం
ప్రేమను పంచి ప్రేమతో జీవిద్దాం  
--((*))--
 
*కోలాటాలు

గడసు నడక సాగా
మనసు తలపు రాగా
సొగసు వలపు పాగా
జెలసి  పెరిగె  బాగా

చల్లని భయము వద్దే
వెచ్చని కౌగిలి హద్దే
మక్కువ కలిగే ముద్దే
మాయకు వయసు సర్దే

కలసి మెలసి తేలే
అలుపు అలక ఆరే
ఆమె అతనిని చేరే
అతని కోరిక తీరే
  
సరస నగవు పంచే
మడత మాటలు తుంచే
నటన నడకలు మానే
మాటలు ఎసరు ఆగే 

మనసుల కలయిక
మమతల వలయిక
తనువుల తపనిక
కోలాటాలు ఆటయిక  
--((*))-- 

Photo: #बहुत कोशिश की आज 'सिर्फ' बारिश पर शायरी लिखु.

_पर हर बौछार 'सिर्फ ' तुम्हारी याद बरसा रही थी ...
*నలుపు - తెలుపు

నలుపు వికృతి -తెలుపు ప్రకృతి
నలుపు ప్రశ్నలు - తెలుపు జవాబులు
నలుపు రూపాలు -తెలుపు అద్దాలు

నలుపు సృష్టి - తెలుపు ప్రతిసృష్టి
నలుపు విద్యుత్తు - తెలుపు వెలుగు
నలుపు భర్త - తెలుపు భార్య
నలుపు నీళ్ళు - తెలుపు పాలు

నలుపు నటనలో కానరాదు
తెలుపు తెల్లమొఖం వేసుకుంటూ కనబడు
నలుపు తొలివలపు కుసుమం
తెలుపు మది తళపుల మర్మం

నలుపు తలపుల వలపు
తెలుపు హృదయాల స్పందన
నలుపు ప్రతిబింబాలు మాయ
తెలుపు కిరణాలతో మనో మాయ

నలుపు ఉశ్చాస, నిస్వాశాల మయం
తెలుపు ఆశా పాశాల మాయం
నలుపు ఆకలి ఆరాటాలు మయం
తెలుపు వాంఛల వెంపర్లాటల మయం
నలుపు దయ కరుణ త్యాగాల మయం
తెలుపు దుర్గన్ధమ్ దుర్మాగాల మయం

నలుపు స్వాభిమానం -తెలుపు దురహంకారం
నలుపు మౌనానికి మార్గం -తెలుపు అధికారానికి దర్పం

నలుపు తెలుపు పావుల ఆట చదరంగం
భార్య భర్తల బంధం యుగ ధర్మం
మంచి చేడు కలయికే కలియుగ జీవితం
నలుపు తెలుపు గళ్ళల్లో ఆట చదరంగం
పావుల కదలిక అర్ధం మాయ మర్మం
స్త్రీ, పురుషుల (తెలుపు నలుపు) కలయిక
కలియుగంలో సంసార చదరంగం
--((*))--

 ఎవరు రాశారో తెలీదు, కానీ చాలా బాగుంది.
ఒక్కసారి చదవండి - రచయితని గుర్తించండి 


👉మంత్రికి తెలివుండాలి,
బంటుకి భక్తుండాలి...
గుర్రానికి వేగముండాలి
ఏనుగుకి బలముండాలి...

సేనాధిపతికి వ్యూహముండాలి,
సైనికుడికి తెగింపుండాలి...
యుద్ధం నెగ్గాలంటే,వీళ్ళందరి వెనుక
కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు...
కానీ మనమే, రాజులా ఆలోచించడం
ఎప్పుడో ఆపేశాం!

👉"మన కసి - అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు.
అయినా, భయానికి బానిసయ్యాం.
ఓటమికి తలొంచేసాం !

👉చరిత్రలో, చాలా మంది రాజులు...

🌺ఓడిపోయారు,
🌺 పారిపోయారు,
🌺 దాక్కున్నారు,
🌺 దాసోహమయ్యారు.

కానీ కొందరే, అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు.
'రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి' అని
నిరూపించారు.

👉డబ్బొచ్చినా పోయినా వ్యక్తిత్వం కోల్పోకు...
రాజ్యాలున్నా చేజారినా రాజసం కోల్పోకు...

👉రాజంటే కిరీటం ,కోట ,పరివారం కాదు,
రాజంటే ధైర్యం...
రాజంటే  ధర్మం...
రాజంటే  యుద్ధం...!


👉ఒకరోజు  విందుభోజనం చేస్తావు,
ఇంకోరోజు అడుక్కుతింటావు
- పాండవుల్లా...!

👉ఒక రాత్రి బంగారు దుప్పటి
కప్పుకుంటావు,
మరో రాత్రి చలికి వణికిపోతావు
- శ్రీరాముడిలా...!

👉ఎత్తు నుండి నేర్చుకో,   లోతు నుండి నేర్చుకో...
రెండింటి నుండి  ఎంతో కొంత తీసుకో...!

👉రాజంటే స్టానం కాదు
రాజంటే స్థాయి...

👉స్థానం - భౌతికం,
కళ్ళకు కనపడుతుంది.
స్థాయి - మానసికం,
మనసుకు తెలుస్తుంది...!

మనందరిలో ఒక రాజుంటాడు...
బ్రతికిస్తావో, చంపేసుకుంటావో నీ ఇష్టం!
--((*))--



*జంతికలు 

పోయే జీవికి తెలివి ఎక్కువ
ఆరే  దీపానికి వెలు గెక్కువ
చదువు లేనివాడికి
మిడిసి పాటు ఎక్కువ
నాయకులకు  రహస్యాలఫై మక్కువ

పొద్దునిల బడితే పనికి చేరు
పొద్దుపొడిస్తే కూటికి చేరు
పొద్దు వాలితే గూటికి చేరు
పొద్దే కాలమానం చెప్పే తీరు

చుక్క పడనిదే మొలకెత్తదు మొక్క
మొక్క ఎదగందే రైతుకు ఆడదు రెక్క
రెక్క ఆడందే  నిండదు డొక్క
డొక్కాడుటకు తిండి పెట్టు అక్క

స్వార్ధం అవినీతికి కొమ్ము
సాయం మానవతకు దమ్ము
స్నేహం విడువకుండా నమ్ము
కష్ట పడితే వచ్చెది సొమ్ము

రాజకీయం చినుగుల బొంత
రాబడి తాను దోచుకున్నంత
ముచ్చట్లలో ఆడవారి సంత
మొగవారుచూస్తే అదొక వింత

మనసు చేష్టలను ఆపలేరు
చేతి వాటాన్ని ఆపలేరు
గాలిలో విమానం ఆపలేరు
వితండ వాదులకు చెప్పలేరు

కూటికోసం చేస్తారు అప్పులు
కోట్ల కోసం చూస్తారు తిప్పలు
పరీక్ష కోసం ఇస్తారు స్లిప్పులు
ఓట్ల కోసం ఇస్తారు కప్పులు

భార్యకు కడతాడు భర్త తాళి
భర్త చేస్తాడు భార్యను ఎగతాళి
భార్య చూపిస్తుంది వైకుంఠపాళి
భార్య భర్తల మద్య ఉండదు ఖాళి

కడుపు లో పిల్లలపై దిగులు
గుండె లో పిల్లలపై   గుబులు
వంటి లో ఆరని ఆరాటాలు
కంటి లో కనబడిని జలాలు

ఉన్మాది ఎప్పుడు వేదిస్తాడు
వివేకి ఎప్పుడు సాధిస్తాడు
సన్యాసి ఎప్పుడు ప్రార్థిసాడు
వ్యాపారి ఎప్పుడు లెక్కేస్తాడు

పిల్ల నచ్చితే ప్రేమిస్తాడు
పువ్వు నచ్చితే తెంపేస్తాడు
లాభం వచ్చితే  గంతేస్తాడు
కోపం వచ్చితే నాట్యమాడుతాడు    
    --((*))--

*సర్వేజనా సుఖోనోభవంతు

నేనొక పరిచితుడ్ని
నేను అందరికి ఉపయోగ పడాలని ఆశించిన వాడ్ని
ఏ భాగము కావాలన్నా నన్నుకలవండి
నాపేరే డొనేట్ బ్యాంక్
ఆత్మ సంతృప్తి - ఉండు ఈ అవయవ దానంలో

ఇప్పుడు నేను రక్తదానం చేస్తున్నాను
వేరొకరి నుదుటి సింధూరమ్ రక్షించిన వాడను
నాలో ఉన్న ఉడుకు రక్తం వేరొకరికి
అరుణ కిరణాలుగా శరీరంలో కలసి
నటువంటి త్రుప్తినేను మరువలేకున్నాను

నేను ఇప్పుడు కళ్ళు దానం చేయాలనుకున్నాను
ఈ కళ్ళతో ప్రకృతి సౌందర్యాలను చూసి
వెరొకరికి ఆనంద బాష్పాలను పంచాలనుకున్నాను
కళ్ళులేని వారికికళ్ళు ఇచ్చి వారిగుండే
ఆనందాల సవ్వడి గా మారుతుందనుకున్నాను

నేను ఇప్పుడు కిడ్నిలు దానం చేయాలనుకున్నాను
మ్రుత్యువుతోపోరాడుతున్న వానికి మూత్ర పిండాలను
దానం చేసి ఆరోగ్యవంతుడుగా మార్చలను కున్నాను

నేను ఇప్పుడు గుండెనే దానం చేయాలనుకున్నాను
ఈగుండె వేరొకరి శరీరంలో ఉస్చాస నిస్చాసలను
అందిస్తూ ప్రాణాన్ని బ్రతికిన్చాలని ఓర్పుతో ఉన్నాను.

ఒక టేమిటి నా శరీర భాగాలన్నీ అణువణువును
ప్రతి ఒక్కరికి ధార పోయగలనని బ్రతికుండగానే
ప్రమాణ పత్రమును మీకు అందిస్తున్నాను

ఎవ్వరు నా ప్రయాణాన్ని ఆపకండి, సహాయమే
నాగుణం, ధర్మమే నామతం, బలమే నా ధైర్యం
నేను ఎప్పుడు అరోగ్యంగా ఉండి అందరికి
ఆదర్శంగా జీవించాలని అనుకుంటున్నాను
శవంగా మారనప్పుడు, కొన ఊపిరిలో లొ
ఉన్నప్పుడు శరీర భాగాలను అందించాలని
కోరుతూ నేను అందరినీ ప్రార్దిన్చుతున్నాను.
సర్వేజనా సుఖోనోభవంతు :
--((*))--

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం -1(1 to 42)


ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం  -1
సర్వేజన సుఖినోభవంతు

ఎందరో మహానుభావులు అందరికి వందనములు (1)
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంను వ్రాసి ఇందు పొందు పరుస్తున్నాను . 
ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
  
హరి: ఓం
విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!



ఓం = అనునీయక్షరమె బ్రహ్మము: ఇది సర్వ శ్రేష్టము, స్మరనచేసినచో  దేనిని కోరిన  అది,సిద్ధించును,    

విశ్వం = చరాచర జగత్తు నందు వ్యాపించు యున్నవాడు,
విష్ణుః = సర్వ వ్యాపకం గలవాడు,
వషట్కారః =వశము నందుంచు కున్నవాడు,
భూత భవ్య భవత్ప్రభుః = భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగా ఉన్నవాడు,
భూతకృత్ = సకల భూతాలను సృజించిన వాడు,
భూత భృత్ =. భూతాలను భరించేవాడు ,
భావః=సమతా భావం కలిగిన వాడు,
 భూతాత్మా= భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు,
భూత భావన=భూతాలకు శుభము కల్పించు వాడు.

భాష్యం : ప్రపంచమంతా :"ఓం " కార నాదం తో పరిప్రబ్రమిస్తుంది, దీనిని విన్నా,  స్మరణ చేసినా మనస్సు ఏకాగ్ర చిత్తముగా మారుతుంది, దేనిని కోరిన అది సిద్ది స్తుంది. ఆనాడు హనుమంతుడు " ఓం శ్రీరాం " ఏకాగ్రచిత్తంతో జపం చేసి రామచంద్రుని మన్నన  పొందాడు .  ఈ నాడు యోగాభ్యాసంతో అనేకమంది చరిత్రసృష్టించినాట్లు తెలుస్తున్నది.   
అట్లాగే శ్రీ మహావిష్ణువు చరాచర జగత్తు నందు వ్యాపించి, సర్వ వ్యాపకం కలిగి, భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగా ఉండి, సర్వము వశము చేసుకొని, సకల భూతాలను సృజించి, భూతాలను భరించి, సమతా భావం కలిగి ఉన్నవాడు. సకలప్రాణుల యందు, భుతాలన్నిటియందు, ఆత్మగా ప్రకాశిస్తూ సకల శుభములు కల్గించే పరమాత్మునికి ప్రణామములు.        
  
--((**))--





భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్న వాడు, భూతాలకు శుభము కల్పించు వాడు.అగు పరమాత్మునికి ప్రణామములు. 
     --((*))--

             పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి:
అవ్యయ: పురుష: సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!2!!

పూతాత్మ =పూత - పవిత్రమైన, ఆత్మ- స్వరూపముగలవాడు,
పరమాత్మ = నిత్య శుద్ధ బుద్ధ  ముక్త స్వాభావుడు,
ముక్తానాం పరమాంగతి:=ముక్తులగు వారికి సర్వోత్తముడు, పరమాంగతి= పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, 
అవ్యయ:=వినాశము గాని, వికారము గాని, లేనివాడు,
పురుష:=శరీరమనెడి పురమున సయనించు వాడు, గొప్పవి యగు ఫలములను ఇచ్చువాడు, 
సాక్షి =సాక్షాత్తుగా తన స్వరూపమే యైన జ్ఞానము చేత సమస్తమును చూయు వాడు, 
క్షేత్రజ్న: = శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మలను తెలిసి కొను చున్నవాడు,
అక్షర =తరుగులేనివాడు, నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు

భాష్యం : పవిత్రమైన, ఆత్మ- స్వరూపముగలవాడు,  నిత్యశుద్ద బుద్ద ముక్త స్వాభావుడు, ముక్తులగువారికి సర్వోత్తముడు, పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, వినాశముగాని వికారముగాని లేనివాడు, శరీర మనెడి పురమున సయనించు వాడు, గొప్పవియగు ఫలములను ఇచ్చు  వాడు, సాక్షాత్తుగా తన స్వరూపమేయైన జ్ఞానము చేత సమస్త మును చూయు వాడు,  శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మ లను తెలిసికొను చున్నవాడు, తరుగులేనివాడు,   గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు అగు పరమాత్మునికి ప్రణామములు.  

                          
                      యోగో యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వర:
నారసింహవపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:!!3!!

యోగ:= ఉపాయమైన వాడు 
యోగవిదాంనేతా= జ్ఞానుల యోగ క్షేమాదులను వహించేడి వాడు,
ప్రధాన పురుషేశ్వర:= ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు   
నారసింహవపు:= నరుని బోలిన సింహమును బోలిన అవయవములు గల శరీరము గలవాడు,
శ్రీమాన్ = అత్యంత మనో హరుడు, తన వక్ష స్థలమున శ్రీదేవి సదా నివసించు చుండు నట్టి వాడు 
కేశవ: = మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు,  
పురుషోత్తమ:= పురుషులలో ఉత్తముడు,. 

భాష్యం :   ఉపాయమైన వాడు , జ్ఞానుల యోగాక్షేమాదులను వహించేడి వాడు,  ,  ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియ మించే వాడు,  నరుని బోలిన సింహమును బోలిన అవయవములు గల శరీరము గలవాడు,  అత్యంత మనోహరుడు, తన వక్షస్థలమున శ్రీదేవి సదా నివసించు చుండు నట్టి వాడు,  మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు ,  పురుషులలో ఉత్తముడు., అగు పరమాత్మునికి ప్రణామములు.  
                                                                    ......




సర్వశ్శర్వ: శ్శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ:
సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర: !!4!!

సర్వ: = సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండుట వలనను, సదా సర్వము తెలిసివనాడు, 
శ్శర్వ:= అసుభాలను పోగొట్టేవాడు,
 శివ: = సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగ చేయువాడు,
స్థాణు:=స్థాణువు స్తిరమైనవాడు,
భూతాది =  సమస్త ప్రాణుల చేత గ్రహిం బడుచున్నాడు,
నిధిరవ్యయ:= నాశములేని నిధిని దాచి వాడు,
సంభవ: = అంతట అవతరించేవాడు,
భావన= సమస్త భోక్తలకు ఫలములను గలిగిన్చు వాడు,
 భర్త: = అధిష్టానముగా ఉంది ప్రపంచమును భరించు వాడు,
 ప్రభవ: = మహాభూతములు వీని నుండియే ఉద్భవించు చున్నవి, అందువలన ఉత్కృష్టమైన జన్మగలవాడు,
ప్రభు: = సమస్త కార్యములలో మహా సామర్ధ్యము గలవాడు,
ఈశ్వర: =నిరుపాదిక మైన ఐశ్వర్యము గలవాడు,

భాష్యం :   
సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండుట వలనను, సదా సర్వము తెలిసివనాడు, అసుభాలను పోగొట్టేవాడు,  సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగ చేయువాడు, స్థాణువు స్తిరమైనవాడు,  సమస్త ప్రాణులచేత గ్రహిం బడుచున్నవాడు, నాశములేని నిధిని దాచిన వాడు,  అంతట అవతరించేవాడు,  సమస్త భోక్తలకు ఫలములను గలిగించు చున్నవాడు,  అధిష్టానముగా ఉండి  ప్రపంచమును భరించు వాడు,   మహాభూతములు వీనినుండియే ఉద్భవించు చున్నవి, అందువలన ఉత్కృష్టమైన జన్మగలవాడు,  సమస్త కార్యములలో మహా సామర్ధ్యము గలవాడు,  నిరుపాదికమైన ఐశ్వర్యము గలవాడు. అగు పరమాత్మునికి ప్రణామములు.  
                          

స్వయం భూ శ్శమ్బూరాదిత్య: పుష్కరాక్షో మహాస్వన:
 అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమ : !!5!!

స్వయం భూ: = ఇచ్ఛ చేతనే తనకే అసాధా మైనటు వంటి విదంగా అవతరించు వాడు,
శంభు := భక్తులకు సుఖమును కలిగించు వాడు,
ఆదిత్య: = ఆదిత్య మండలాంతర్గతుడైన హిరన్మయ పురుషుడు, 
పుష్కరాక్ష: = కమలముల వంటి కళ్ళు గలవాడు,
మహాస్వన:=గోప్పదియగు వేదరూపమైన శబ్దము గలవాడు,
అనాదినిధన:= జన్మము, వినాశము లేనివాడు,
ధాతా:= ప్రకృతి యందు బ్రహ్మాను గర్భము ధరించు వాడు,
విధాతా:=  గర్భాన్ని ఆవిర్భవింప చేసేవాడు,
ధాతు రుత్తమ :=కార్యా కారణ రూపమైన సమస్త ప్రపంచమును ధరించుట వలన చైతన్యము పరుచువాడు,
భాష్యం : చ్ఛ చేతనే తనకే అసాధరమణమై నటువంటి విదంగా అవతరించు వాడు , భక్తులకు సుఖమును కలిగించు వాడు,  ఆదిత్య మండలాంతర్గతుడైన హిరన్మయ పురుషుడు,  కమలముల వంటి కళ్ళు గలవాడు, గొప్పదియగు వేదరూపమైన శబ్దము గలవాడు, జన్మము, వినాశము లేనివాడు,  ప్రకృతి యందు బ్రహ్మాను గర్భము ధరించు వాడు,  గర్భాన్ని ఆవిర్భవింప చేసేవాడు, కార్యా కారణ రూపమైన సమస్త ప్రపంచమును ధరించుట వలన చైతన్యము పరుచువాడు,  అగు పరమాత్మునికి ప్రణామములు.  

అప్రమేయో హ్రుషీ కేశ: పద్మనాభో అమరప్రభు:
విశ్వకర్మా మనుస్త్వస్థా స్థనిష్ట : స్థవిరో ధ్రువ: !!6!!

అప్రమేయ=శబ్దాది గుణములు లేనివాడు, గావున ప్రత్యక్ష ప్రమాణము నకు గోచరింపడు, అనుమాన విషయము గాడు, ఏలన ఇయ్యది వ్యాపింప దగిన లింగమితని యందు లేదు, ఉపమాన ప్రమాణముచేతను సిద్ధించువాడు కాడు,  ఏమన ఒక భాగము అను నదే  వీనియందు లేదు , అందువలన సాదృశ్యమే కుదరదు, కనుక  బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాద్యము కానివాడు,
హ్రుషీ కేశ:= ఇంద్రియములకు క్షేత్రజ్ఞ రూపమున ప్రభువుగా ఉన్న వాడు,
పద్మనాభ = బ్రహ్మాదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మమునాభి యందు కలవాడు,
అమరప్రభు:= దేవతలందరికీ ప్రభువైన వాడు,
విశ్వకర్మ;= విశ్వము కర్మగా గలవాడు, విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు,
మను= మననము సేయువాడు, సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు,
తృష్టా = సంహార కాలమున సమస్త భూతములను కృసింప జేయు వాడు,
స్థనిష్ట = మిక్కిలి స్థూలమైన వాడు,
స్థవిర = స్థావిరుడు అనగా పురాణ పురుషుడు,
ధ్రువ:= స్థిరత్వము గలవాడు  
భాష్యం : శబ్దాది గుణములు లేనివాడు, గావున ప్రత్యక్ష ప్రమాణము నకు గోచరింపడు, అనుమాన విషయము గాడు, ఏలన ఇయ్యది వ్యాపింప దగిన లింగమితని యందు లేదు, ఉపమాన ప్రమాణము చేతను సిద్ధించువాడు కాడు,  ఏమన ఒక భాగము అనునదే  వీని యందు లేదు ,అందువలన సాదృశ్యమే కుదరదు, కనుక  బ్రహ్మ రుద్రాదుల కరణము లతో తెలుసుకొన సాద్యము కానివాడు, ఇంద్రియములకు క్షేత్రజ్ఞ రూపమున ప్రభువుగా ఉన్నవాడు, బ్రహ్మాదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మము నాభి యందు కలవాడు,  దేవతలందరికీ ప్రభువైన వాడు,  విశ్వము కర్మగా గలవాడు, విశ్వకర్మతో సాదృశ్యముగలవాడు, మననము సేయువాడు, సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు,  సంహార కాలమున సమస్త భూతములను కృసింప జేయువాడు,   మిక్కిలి స్థూలమైన వాడు,స్థావిరుడు అనగా పురాణ పురుషుడు,  స్థిరత్వము గలవాడు,  అగు పరమాత్మునికి ప్రణామములు .

 
శ్లో. అగ్రాహ్య:  శాశ్వతః  కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్.!17!!

అగ్రాహ్య: = కర్మేన్ద్రియముల చేత గ్రహింప బడనివాడు,
శాశ్వతః = సర్వ కాలముల యందు యుండు వాడు,
కృష్ణ : = నీలి వర్ణము శరీరము గలవాడు,
లోహితాక్షః= ఎర్రని నేత్రములు కలవాడు,
ప్రతర్దనః =ప్రళయమున భూతముల హింసించువాడు,
ప్రభూత:= జ్ఞానైస్వర్యాది గుణ సంపన్నుడు,
త్రికకుబ్ధామ= అధో మద్య భేదము చేత  మూడు దిశలకును స్థానముగా  నున్నవాడు,
పవిత్రం= సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,
మంగళం పరమ్.= స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,
భాష్యం :  కర్మేన్ద్రియములచేత గ్రహింప బడనివాడు,  సర్వకాలముల యందు యుండు వాడు,  నీలి వర్ణము శరీరము గలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, ప్రళయమున భూతముల హింసించువాడు,  జ్ఞానైస్వర్యాది గుణ సంపన్నుడు,  అధో మద్య భేదము చేత  మూడు దిశలకును స్థానముగా  నున్నవాడు, సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,  స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,  అగు పరమాత్మునికి ప్రణామములు . 

శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః!!8!!

ఈశాన: =  భూతములను శాసించే వాడు,
ప్రాణదః = ప్రాణదానము చేయువాడు,
ప్రాణ: = ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు,
జ్యేష్ఠ:= అత్యంత వృద్ధుడు,
 శ్రేష్ఠ: = అత్యంత ప్రశంసా పాత్రుడు
ప్రజాపతిః = సమస్త ప్రజలకు అధిపతియై  ఉన్నవాడు 
హిరణ్య గర్భ: = హిరణ్మయమైన అండము లోపల నుండు వాడు

భూగర్భ: = భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు
మాధవ := మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భరత యైన వాడు 
మధు సూదనః = మధు వనేడి అసురుని సంహరించిన వాడు 
భాష్యం:=  భూతములను శాసించే వాడు, ప్రాణదానము చేయువాడు, 

ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు, అత్యంత వృద్ధుడు, అత్యంత ప్రశంసా పాత్రుడు  సమస్త ప్రజలకు అధిపతియై  ఉన్నవాడు,  హిరణ్మ యమైన అండము లోపల నుండు వాడు, భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు, మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భరత యైన వాడు, మధువనేడి అసురుని సంహరించినవాడు   అగు పరమాత్మునికి ప్రణామములు. 


శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!9!!

ఈశ్వర:= సర్వ శక్తి సంపన్నుడు,
విక్రమీ: = శౌర్యము గలవాడు,
ధన్వీ: = ధనుస్సు ధరించినవాడు,
మేధావీ: = మేధబహుగ్రంధదారణ సామర్ద్యము గలవాడు,
విక్రమ:= జగత్తుని దాటి పోయినవాడు,
క్రమః= గమనము సేయు వాడు,
అనుత్తమ: = తనకంటే ఉత్తముడు లేనట్టివాడు,

దురాధర్షః = ఎవరి చేతను చలింప జాలని వాడు  
కృతజ్ఞః = ప్రాణులు చేసిన పుణ్య పాప రూపమైన కర్మను తెలిసి కొను వాడు,
కృతి: = పురుష  ప్రయత్నము నకు, సర్వాత్మకుడు అగుట వలన ఇట్టి కృ తికి ఆధారముగా నుండి కృతి శబ్దముచేత లక్షితు డగుచున్న వాడు,
ఆత్మవాన్ : = తన మహిమ యందే ప్రతిష్టితుడై ఉండు వాడు
భాష్యం :
సర్వ శక్తి సంపన్నుడు, శౌర్యము గలవాడు, ధనుస్సు ధరించినవాడు, మేధబహుగ్రంధదారణ సామర్ద్యము గలవాడు, జగత్తుని దాటి పోయినవాడు, గమనము సేయు వాడు, తనకంటే ఉత్తముడు లేనట్టివాడు, ఎవరి చేతను చలింప జాలని వాడు ప్రాణులు చేసిన పుణ్య పాప రూపమైన కర్మను తెలిసి కొను వాడు,  పురుష  ప్రయత్నము నకు, సర్వాత్మకుడగుట వలన ఇట్టి కృ తికి ఆధారముగా నుండి కృతి శబ్దముచేత లక్షితుడగుచున్నవాడు,  తన మహిమ యందే ప్రతిష్టితుడై ఉండు వాడు,   అగు పరమాత్మునికి ప్రణామములు .
  


శ్లో. సురేశః శరణం శర్మ విస్వరేతా ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!10!!

సురేశః = బ్రహ్మాదులకు కోరిన ఫలములు ఇచ్చువాడు,
శరణం = సమస్త ప్రాణులకును నిరుపాధికమగు ఉపాయమైన వాడు ,
శర్మ: = పరమ సుఖరూపుడు, 
విస్వరేతా: = విశ్వమునకు కారణమైనవాడు,
ప్రజాభవః అహః= సమాస ప్రజలు తన నుండి కలుగునట్టివాడు,
సంవత్సర:= కాలస్వరూపముతో నున్నట్టివాడు గావున యితడు సంవత్సర: అనబడినవాడు,    
వ్యాళః =అభయము నిచ్చి వారలను అణా ఆధీనము గావించు కొనువాడు,
ప్రత్యయః = వారాలకు తన యందు విశ్వాసము కలిగించు వాడు,
సర్వదర్శనః= అంతట కన్నులు గలవాడు, అంతటను ఇంద్రియములు గలవాడు, తన మహిమలన్నీ చూపు వాడు,
భాష్యం  బ్రహ్మాదులకు కోరిన ఫలములు ఇచ్చువాడు,  సమస్త ప్రాణులకును నిరుపాధికమగు ఉపాయమైన వాడు ,  పరమ సుఖరూపుడు,  విశ్వము నకు కారణమైనవాడు,  సమాస ప్రజలు తన నుండి కలుగునట్టివాడు,  కాలస్వరూపముతో నున్నట్టివాడు గావున యితడు సంవత్సర: అన బడినవాడు, అభయము నిచ్చి వారలను అణా ఆధీనము గావించు కొనువాడు, వారాలకు తన యందు విశ్వాసము కలిగించు వాడు, అంతట కన్నులు గలవాడు, అంతటను ఇంద్రి  యములు  గలవాడు, తన మహిమలన్నీ చూపు వాడు, అగు పరమాత్మునికి  ప్రణామములు

  శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతఃవృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః!!11!!

అజః = తనను పొంద కుండా చేయు విరోధులను తొలగించు వాడు,
సర్వేశ్వర:= ఈశ్వరు లందరి పైన ఈశ్వరు డు,  
స్సిద్దః=సిద్దముగా నుండు వాడు,
 సిద్ధిః = సిద్దులను సాధించు వారికి సహాయపడువాడు,
సర్వాది:= సమస్త భూతములకు మూలకారణమైనవాడు, 
అచ్యుతః = శరను పొందిన వారిని విడవని వాడు,
వృషాకపి:= వృషా అనగా ధర్మమము, కపి అనగా వరాహమూర్తి, మరియు వానరశ్రేష్టుడు అందు వలన ధర్మ వరాహుడు అని పిలువబడినవాడు,

అమేయాత్మా:= పరిమితి నొందింప శక్యముగాని స్వరూపము గలవాడు,
సర్వయోగ వినిస్మృతః= సకల శాస్త్రములు వచించిన యోగము వలన బయల్పడెడివాడు,

భాష్యం :
తనను పొందకుండా చేయు విరోధులను తొలగించు వాడు,ఈశ్వరు లందరి పైన ఈశ్వరు డు, సిద్దముగా నుండు వాడు, సిద్దులను సాధించు వారికి సహాయకుడు, సమస్త భూతములకు మూలకారణమైన వాడు,  శరణు పొందిన వారిని విడవని వాడు, వృషా అనగా ధర్మమము, కపి అనగా వరాహమూర్తి, మరియు వానరశ్రేష్టుడు అందు వలన ధర్మ వరాహుడు, పరిమితి నొందింప శక్యముగాని స్వరూపము గలవాడు,
సకల శాస్త్రములు వచించిన యోగము వలన బయల్పడెడివాడు, అగు పరమాత్మునికి ప్రణామములు .


 శ్లో. వసుర్వస్సుమనా స్సత్య: సమాత్మా సంమితస్సమ: 
అమోఘ: పుండరీ కాక్షో వృష కర్మావృషాకృతి:!!12!!

 వసు: = సమస్త భూతముల యందు వసించు చున్నవాడు,
వసుమనా:ప్రశస్తమైన (రాగద్వేషము లేని) మనస్సు గలవాడు,
సత్య:= సజ్జనుల పట్ల సాధువై ప్రవర్తించు వాడు,
సమాత్మా:= రాగ ద్వేషాది దూషితముగాని మనస్సు గలవాడు,
సంమిత:= సమస్తమైన  పదార్ధముల చేతను పరిచ్చిన్నుడుగా దోచువాడు,
సమ:= అన్ని కాలం లలో ఉండి ఎట్టి వికారము లేనివాడు ,
అమోఘ:= పూజించినను, స్తుతించినను, స్మరించినను సమస్త ఫలములను నొసంగు చున్నవాడు,
పుండరీ కాక్ష:= పుండరీక (పద్మము )మును బోలిన కన్నులు గలవాడు,  
వృష కర్మా:= ధర్మరూపమైన కర్మ గలవాడు,
వృషాకృతి:= ధర్మము కొరకై ఆక్రుతి (శరీరము) దాల్చునట్టివాడు, ధర్మస్థాపనకోసము యుగ యుగమున అవతరించు చున్నవాడు,

భాష్యము:
సమస్త భూతముల యందు వసించు చున్నవాడు, ప్రశస్త మైన (రాగద్వేషము లేని) మనస్సు గలవాడు, సజ్జనుల పట్ల సాధువై ప్రవర్తించు వాడు,  రాగ ద్వేషాది దూషితముగాని మనస్సు గలవాడు,
సమస్తమైన  పదార్ధముల చేతను పరిచ్చిన్నుడుగా దోచువాడు,  అన్ని కాలం ల యందు ఎట్టి వికారము లేనివాడు , పూజించినను, స్తుతించి నను, స్మరించినను సమస్త ఫలములను నొసంగు చున్నవాడు, పుండరీక (పద్మము )మును బోలిన కన్నులు గలవాడు, ధర్మ రూపమైన కర్మ గలవాడు, ధర్మము కొరకై ఆక్రుతి (శరీరము) దాల్చునట్టివాడు, ధర్మస్థాపనకోసము యుగ యుగమున అవతరించు చున్నవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు .

 శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః
అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః!!13!!

రుద్ర:=సంహార కాలమున సంహరించుచు ప్రజలకు రోదనము గలుగ జేయువాడు,
బహుశిర:= పెక్కు సిరస్సులు గలవాడు,
బభ్రుః= లోకములను భరించువాడు,
విశ్వ యోని:= విశ్వమునకు కారణమైన వాడు,
శ్శుచి శ్రవః= పవిత్రములైన శ్రవణము సేయుట దగియున్న నామములు గలవాడు,
అమృత:= మరణము లేని వాడు,

శ్శాశ్వత స్థాణం:= శాశ్వతుడును స్థాణువు వైన వాడు,
వరారోహ:= శ్రేష్టమైన అంకము (వడి ) గలవాడు,
మహా తపాః= సృష్టి విషయక మైన తపస్సు గలవాడు, 

భాష్యము: 
సంహార కాలమున సంహరించుచు, ప్రజలకు రోదనము గలుగ జేయువాడు,  పెక్కు సిరస్సులు గలవాడు, లోకములను భరించువాడు,  విశ్వమునకు కారణమైన వాడు, పవిత్రము లైన శ్రవణము సేయుట దగియున్న నామములు గలవాడు,  మరణము లేని వాడు,  శాశ్వతుడును స్థాణువు వైనవాడు,  శ్రేష్టమైన అంకము (వడి ) గలవాడు,  సృష్టివిషయకమైన తపస్సు గలవాడు,  అగు పరమాత్మునికి ప్రణామములు .  
శ్లో. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవిః!!14!!

సర్వగః = కారణ రూపేణ  అంతటా వ్యాపించి ఉన్నవాడు,
 సర్వ: = సర్వమూ తెలిసిన వాడు,
విద్భానుః = సమస్త జగత్తును ప్రకాశింప చేయువాడు,
విష్వక్సేన:= నాలుగు దిక్కులా సేనలు గలవాడు,
జనార్దనః = అభ్యుదయము గూర్చియు, మోక్షము గూర్చియు జనులచేత యాచింప బడువాడు,
వేద: = వేద రూపుడు, 
వేదవిత్  = వేదమును,  వేదార్ధమును ఉన్నది ఉన్నట్లు తెలుసు కోన్నవాడు ,
వేదాంగ:= వేదములు అంగములుగా ఉన్నవాడు, 
వేదవిత్ := వేదములను విచారించువాడు,
కవిః= సర్వద్రష్ట తెలిసినవాడు,
భాష్యం : 
అంతటా వ్యాపించి ఉన్నవాడు,  సర్వమూ తెలిసిన వాడు,సమస్త జగత్తును ప్రకాశింప చేయువాడు, నాలుగు దిక్కులా సేనలు గలవాడు, అభ్యుదయము గూర్చియు, మోక్షము గూర్చియు జనుల చేత యాచింప బడువాడు, వేదరూపుడు, వేదమును,  వేదార్ధమును ఉన్నది ఉన్నట్లు తెలుసుకొన్నవాడు ,  వేదములు అంగములుగా ఉన్నవాడు,  వేదములను విచారించువాడు, సర్వద్రష్ట తెలిసినవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 

శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః
చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః!!15!!

లోకాధ్యక్ష: = లోకములను నియ మించువాడు ,
సురాధ్యక్ష:= లోక పాలరులపై అధ్యక్షుడైన వాడు, 
ధర్మాధ్యక్ష : = తగిన ఫలము నొసగుటకై ధర్మా ధర్మమును సాక్షాత్తుగా చూచు నట్టివాడు, 
కృతా కృతః = కార్యరూపమున సృజింప బడినవాడు,
చతురాత్మా := సృష్ట్యాది కార్యముల యందు వేర్వేరుగా ఉన్న నాలుగు విభూతులు గలవాడు, 

 చతుర్వ్యూహ: = మనల్ని అనుగ్రహించుటకు నాలుగు విధముల వ్యూ హము గలవాడు,
 చతుర్దంష్ట్ర:=నాలుగు కోరల పండ్లు గలవాడు,
 చతుర్భుజః= నాలుగు చేతులు గల వాడు,

భాష్యం : లోకములను నియమించువాడు , లోకపాలరులపై అధ్యక్షుడైన వాడు, తగిన ఫలము నొసగుటకై ధర్మా ధర్మమును సాక్షాత్తుగా చూచునట్టివాడు,  కార్యరూపమున సృజింప బడినవాడు,
 సృష్ట్యాదికార్యములయండు వేర్వేరుగా ఉన్న నాలుగు విభూతులు గలవాడు,   మనల్ని అనుగ్రహించుటకు నాలుగు విధముల వ్యూ హము గలవాడు,  నాలుగు కోరల  పండ్లు గలవాడు, నాలుగు చేతులు గలవాడు, 
అగు పరమాత్మునికి ప్రణామములు . 
శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తాః సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః!!16!!

భ్రాజిష్ణు:= ఏక రసమైన (అభిన్నస్వభావముగల) ప్రకాశ స్వరూపుడు, 
భోజనం:=భోజ్య రూపమైన దగుట చేత పకృతి (మాయ) "భోజనం" అనబడు చున్నవాడు, 
భోక్తాః = పురుష రూపముతో  దాని ననుభ వించువాడు,
సహిష్ణు:= అమితములైన సకల అపరాదములను సహించు వాడు,  
జగదాదిజః=జగత్తుకు మొదటి వారుగానుండు బ్రహ్మ విష్ణు మహెశ్వరులలో ఒకడుగా అవతరించినవాడు.,
అనఘ: =,  పాప రహితుడు,

విజయ: = జ్ఞానము, వైరాగ్యము, ఐస్వర్యము మొదలైన గుణములచేత సమస్తమును జయించి వాడు, 
జేతా:=సమస్త భూతములను మీరి పోయిన వాడు 
విశ్వయోనిః = బ్రహ్మాది మూలముగా నుండు కార్య ప్రపంచ మగు విశ్వమునకు కారణభూతుడు, 
పునర్వసుః =క్షేత్రజ్ఞాని (జీవుని) రూపమున మరల మరల శరీరముల యందు వసించు వాడు. 

బాష్యం :
 ఏకరసమైన (అభిన్నస్వభావముగల) ప్రకాశ స్వరూపుడు, భోజ్య రూపమైన దగుటచేత పకృతి (మాయ) "భోజనం" అనబడు చున్న వాడు, పురుష రూపముతో దాని ననుభ వించువాడు, అమితములైన సకల అపరాదములను సహించు వాడు, జగత్తుకు మొదటి వారుగానుండు బ్రహ్మ విష్ణు మహెశ్వరులలో ఒకడుగా అవతరించిన వాడు.,  పాప రహితుడు,  జ్ఞానము, వైరాగ్యము, ఐస్వర్యము మొదలైన గుణములచేత సమస్తమును జయించి వాడు, సమస్త భూతములను మీరి పోయినవాడు   బ్రహ్మాది మూలముగా నుండు కార్య ప్రపంచ మగు విశ్వమునకు కారణభూతుడు, క్షేత్రజ్ఞాని (జీవుని) రూపమున మరల మరల శరీరములయందు వసించు వాడు. అగు పరమాత్మునికి ప్రణామములు . 
               శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః!!17!!
  
ఉపేంద్ర:= ఇంద్రునకు తమ్ముడుగా ప్రాప్తిమ్చినవాడు,
వామనః =ఇంద్ర రక్షనార్ధమై మహాబలి యాగమున తన దివ్య శరీర కాంతి చే చూపరులకు సుఖము నిచ్చువాడు,  
ప్రాంశు:= బలి చక్రవర్తి మూడడుగుల భూమిని ధారాదత్తము చేయ మన గానే ప్రభువగు వామనుడు చాలా పెద్దవాడై సర్వదేవ మయ మైన తన రూపమును కన బరచెను, అప్పుడు వానికి భూమి పాదములు గాను, ఆకాశము శిరస్సు గాను విశ్వరూపమును కనబరచినవాడు,
అమోఘః = అమోఘమైన (వ్యర్ధముకాని) పనులు గలవాడు
శుచి: =స్మరించినను, స్తుతిమ్చినను, పూజించినను పవిత్రము చేయు వాడు,
ఊర్జితః = శత్రువులను నిరసించుటకు తగిన బలము గలవాడు
అతీంద్రః = స్వాభావికములే యైన జ్ఞానైస్వర్యాదులచేత ఇంద్రుని మీరియున్నవాడు,

సంగ్రహః = ప్రళయకాలమును సమస్తమును ఒక్క చోటికి జేర్చువాడు,
సర్గ: =సృష్టి రూపుడు, సృష్టికి కారణమైనవాడు,  
ధృతాత్మా:=పుట్టుక మున్నగునవి లేకుండునట్లు ఒక్క రూపముతో  నిలిపి యుంచు కొనిన స్వరూపము గలవాడు,
నియమ: =తమ తమ అధికారములయందు ప్రజలను నిలుపువాడు,. 
యమః = లోపల నుండి నియమించు వాడు ,

బాష్యం :
 ఇంద్రునకు తమ్ముడుగా ప్రాప్తించినవాడు, ఇంద్ర రక్షనార్ధమై మహాబలి యాగమున తన దివ్య శరీర కాంతిచే చూపరులకు సుఖము నిచ్చువాడు,   బలిచక్రవర్తి మూడడుగుల భూమిని ధారాదత్తము చేయమన గానే ప్రభువగు వామనుడు చాలా పెద్దవాడై  సర్వదేవమయమైన తన రూపమును కన బరచెను, అప్పుడు వానికి భూమి పాదములు గాను, ఆకాశము శిరస్సుగాను విశ్వరూపమును కనబరచినవాడు,  అమోఘమైన (వ్యర్ధముకాని) పనులు గలవాడు
స్మరించినను, స్తుతిమ్చినను, పూజించినను పవిత్రము చేయువాడు,
శత్రువులను నిరసించుటకు తగిన బలము గలవాడు, స్వాభావికములే యైన జ్ఞానైస్వర్యాదులచేత ఇంద్రుని మీరియున్నవాడు, ప్రళయ కాలమును సమస్తమును ఒక్క చోటికి జేర్చువాడు, సృష్టి రూపుడు, సృష్టికి కారణమైనవాడు,  పుట్టుక మున్నగునవి లేకుండునట్లు ఒక్క రూపముతో  నిలిపియుంచు కొనిన స్వరూపము గలవాడు,తమ తమ అధికారములయండు ప్రజలను నిలుపువాడు,. లోపలనుండి నియమించు వాడు , అగు పరమాత్మునికి ప్రణామములు.  

 శ్లో. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః!!18!!

వేద్య: = మోక్షమును  తెలిసికొన దగి యున్నవాడు,
వైద్యః =   సమస్త విద్యలు తెలిసిన వాడు,
సదాయోగీ:=నిత్యమూ పత్యక్షమై యుండు స్వరూపము గల వాడు,
వీరహా: = ధర్మరక్షణకై వీరులైన అసురులను వధించు  వాడు,
మాధవ: = బ్రహ్మ విద్యకు అధిపతి యైనవాడు,
మధుః=  తేనే వలే యితడు గోప్పదియగు ప్రీతిని పుట్టించు వాడు,
అతీంద్రియ: = శబ్ద స్పర్సాది గుణములు లేనివాడు,

మహామాయ: =  మాయావి కి కూడ మాయావి అయిన వాడు,
మహోత్సాహ:= జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల జేయ నుద్య మించు వాడు,
మహా బలః= బలవంతు లకు కూడా బలవంతుడు, 

భాష్యం :
 మోక్షమును  తెలిసికోనదగి యున్నవాడు,    సమస్త విద్యలు తెలిసిన వాడు, నిత్యమూ పత్యక్షమై యుండు స్వరూపముగలవాడు, ధర్మరక్షణ కై వీరులైన అసురులను వధించు  వాడు,  బ్రహ్మ విద్యకు అధిపతి యైనవాడు,  తేనే వలే యితడు గోప్పదియగు ప్రీతిని పుట్టించు వాడు,
 శబ్ద స్పర్సాది గుణములు లేనివాడు,  మాయావి కి కూడ మాయావి అయిన వాడు,  జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల జేయ నుద్య మించువాడు, బలవంతు లకు కూడా బలవంతుడు,
అగు పరమాత్మునికి ప్రణామములు .

శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!

మహాబుద్ధి: = భుద్దిమంతులకు కూడా బుద్ధిమంతుడు,
మహా వీర్య: = సృష్టికి కారణమైన ఆ విద్యా స్వరూపమగు గొప్ప వీర్యము గలవాడు, 
మహాశక్తి: = గొప్పది యగు శక్తిగలవాడు,
మహా ద్యుతిః = లోపాలను వెలుపలను గొప్పదియగు ప్రకాశము   గలవాడు,
అనిర్దేశ్యవపుః= ఇతరులకు చెప్ప శక్యముగాని స్వరూపము గల వాడు

 శ్రీమాన్ :=   ఐ స్వర్యమైన సమగ్రమగు సిరి గలవాడు,
అమేయాత్మ: = సమస్త ప్రాణులకు ఊహించని బుద్ద్ధిగలవాడు,
మహాద్రి ధృక్ := గోవులను రక్షించు సమయమున  గోవర్ధన పర్వతమును ధరించినవాడు,
భాష్యం :
భుద్దిమంతులకు కూడా బుద్ధిమంతుడు,  సృష్టికి కారణమైన ఆ విద్యా స్వరూపమగు గొప్ప వీర్యముగలవాడు,  గొప్పది యగు శక్తిగాలవాడు,  లోపాలను వెలుపలను గొప్పదియగు ప్రకాశము   గలవాడు,  ఇతరులకు చెప్ప శక్యముగాని స్వరూపము గల వాడు, ఐ స్వర్యమైన సమగ్రమగుసిరి గలవాడు,సమస్త ప్రాణులకు ఊహించని బుద్ద్ధిగలవాడు,  గోవులను రక్షించు సమయమున  గోవర్ధన పర్వతమును ధరించినవాడు,  అగు పరమాత్మునికి ప్రణామములు .

   
.శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః!!20!!

మహేష్వాస: = గోప్పదియగు ధనుస్సు గలవాడు
మహీ భర్త: = ప్రళయకాల  సముద్రమున మునిగిన భూదేవిని భరించినవాడు, 
శ్రీనివాసః =  వక్షస్థలమున ఎడబాటులేకుండా శ్రీదేవికి నివాసము కల్పించిన శ్రీనివాసుడు,
సతాంగతిః=వేద ధర్మము నను సరించేది సాధువులకు పురుషా ర్ధములను సాధించి పెట్టువాడు,
అనిరుద్ధః=అవతారములలో ఎవని చేత గూడా నిరోధింప బడినవాడు కాడు 

సురానంద: = సురల నానందింప జేయువాడు,
గోవింద: = దేవతల స్తొత్ర రూపము లైన వాక్కులను పొందినవాడు,
గోవిదాం పతిః= విశేషించి వాక్కు నెరిగిన వారికి భర్తతో సమానుడు,

భాష్యం :
 గొప్పదియగు ధనుస్సు గలవాడు, ప్రళయకాల  సముద్రమున మునిగిన భూదేవిని భరించినవాడు, వక్షస్థలమున ఎడబాటులేకుండా శ్రీదేవికి నివాసము కల్పించిన శ్రీనివాసుడు, వేద ధర్మముననుసరించేది సాధువులకు పురుషా ర్ధములను సాధించి పెట్టువాడు, అవతారము లలో ఎవని చేత గూడా నిరోధింప బడినవాడు కాడు  సురల నానందింప జేయువాడు,  దేవతల స్తొత్ర రూపము లైన వాక్కులను పొందినవాడు,
 విశేషించి వాక్కునేరిగిన వారికి భర్తతో సమానుడు, అగు పరమాత్మునికి ప్రణామములు .


   శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమఃహిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః !!21!!

 మరీచి: = మొల్లపూలలా చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు
దమన: = సంసార తాపమును శమింప చేయువాడు,
హంసః= ఆకాశమున సూర్యరూపముతో సంచరించు వాడు,
సుపర్ణ:= సుందరములగు ధర్మా ధర్మ రూపములైన వర్ణములు గలవాడు,
భుజగోత్తమః= భుజగములలో ఉత్తముడు,
హిరణ్య నాభః=బంగారమువలె సుభంకరమైన బొడ్డుగలవాడు,


సుతప: = మంచి జ్ఞానము కలవాడు,
 పద్మనాభః = తామరను నాభిలో గలవాడు,
ప్రజాపతిః= సమస్త ప్రజలకు అధి నాయకుడు, 


భాష్యం :
మొల్లపూలలా చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు,సంసార తాపమును శమింప చేయువాడు, ఆకాశమున సూర్యరూపము తో సంచరించు వాడు,  సుందరములగు ధర్మా ధర్మ రూపములైన వర్ణములు గలవాడు,  భుజగములలో ఉత్తముడు,బంగారమువలె సుభంకరమైన బొడ్డుగలవాడు, మంచి జ్ఞానము కలవాడు, తామరను నాభిలో గలవాడు,  సమస్త ప్రజలకు అధి నాయకుడు,అగు పరమాత్మునికి ప్రణామములు మాలు అర్పిస్తున్నాము.



అమృత్యుః సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా!!22!!


అమృత్యుః=మృత్యువుగాని, మృత్యుకారణముగాని లేనివాడు,
సర్వదృక్ :=స్వాభా వికమైన జ్ఞానముచేత ప్రాణులు చేసినది చేయని అంతయు జూచు చుండువాడు,
సింహ:=  హింసించు వాడు,
సంధాతా :=  జీవులను కర్మఫలములతో సంభందింప జేయువాడు,
సంధిమాన్ :=అట్టి ఫలముల నను భావించువాడు, 
 స్థిర:=సదా ఏక రూపుడు, 
అజ:=గతి గలవాడు,

దుర్మర్షణ:=అసురులు మున్నగు వారికి సహింప శక్యముగాని వాడు,  
శాస్తా : శ్రుతి స్మ్రుత్యాదులచేత అందరకు హితము గరుపు వాడు,
విశ్రుతాత్మ :=విషేశించి శ్రవణము చేయబడిన సత్య జ్ఞానాది లక్షణ లక్షితమైన ఆత్మ గలవాడు,
 సురారిహా :=అసురలను సంహరించువాడు,  

భాష్యము :
మృత్యువుగాని, మృత్యుకారణముగాని లేనివాడు, స్వాభా వికమైన జ్ఞానముచేత ప్రాణులు చేసినది చేయని అంతయు జూచు చుండువాడు,  హింసించు వాడు,  జీవులను కర్మఫలములతో భందింప జేయువాడు, అట్టి ఫలముల నను భావించువాడు, సదా ఏక రూపుడు, గతి గల వాడు, అసురులు మున్నగువారికి సహింప శక్యము గానివాడు,   శ్రుతి స్మ్రుత్యాదులచేత అందరకు హితము గరుపు వాడు,విషేశించి శ్రవణము చేయబడిన సత్య జ్ఞానాది లక్షణ లక్షితమైన ఆత్మ గలవాడు, అసుర లను సంహరించువాడు, అగు  పరమాత్మునికి ప్రణామములు .   
ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రభాష్యం

  శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః
నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః!!23!!

గురు:=  సర్వ విద్యలను ఉపదేసిమ్చు వాడు
గురుతమో:=బ్రహ్మాదులకు గూడ బ్రహ్మవిధ్యాసమ్ప్రదాయకుడైనవాడు,  
దామ:= సమస్త అభీష్టములకు స్థానముగా నున్నవాడు,
సత్యః= సత్య సంభాషణ రూపమైన ధర్మస్వరూపుడు, 
సత్య పరాక్రమః =అమోఘమైన పరాక్రమము గలవాడు,
నిమిష:=యోగ నిద్రారతుడై కన్నులు మూసికొనిన వాడు,

అనిమిషః= ఆత్మ రూపము గావున అనిమిషుడు, సదా మేలుకోనియే యున్న స్వరుపముగాలవాడు,
 స్రగ్వీ:=వైజాయంతి యనెడి పూలమాలను ఎల్లపుడు దాల్చియుండు వాడు,
వాచస్పతి:= సర్వార్ధ విషయిక మగు బుద్దిగలవాడు,
ఉదారధీః= ఘమ్భీరమైన బుద్ధి గలవాడు,

భాష్యం :
 సర్వ విద్యలను ఉపదేసిమ్చు వాడు, బ్రహ్మాదులకు గూడ బ్రహ్మ విధ్యా సమ్ప్రదాయకుడైన వాడు,   సమస్త అభీష్టములకు స్థానముగా నున్న వాడు,  సత్య సంభాషణ రూపమైన ధర్మ స్వరూపుడు,  అమోఘమైన పరాక్రమము గలవాడు, యోగా నిద్రారతుడై కన్నులు మూసికొనిన వాడు,  ఆత్మరూపము గావున అనిమిషుడు, సదా మేలుకోనియే యున్న స్వరుపముగాలవాడు, వైజాయంతి యనెడి పూలమాలను ఎల్లపుడు దాల్చియుండు వాడు, సర్వార్ధ విషయిక మగు బుద్ది గల వాడు,  ఘమ్భీరమైన బుద్ధి గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

  శ్లో. అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్ర పాత్...!!24!!

అగ్రణి:= ముముక్షువులను ఉత్తమ పదవికి దీసికొని పొవువాడు,
 గ్రామణీః = సమస్త భూతములకు నాయకుడు,

శ్రీమాన్:= సర్వోత్క్రుష్ట మైన కాంతి గలవాడు,
న్యాయ:=ప్రమాణములను గ్రహిమ్చున అభేదమును గలిగించెడి  వాడు,
నేతా =జగత్తనెడి యంత్రమును నడి పెడి వాడు,
సమీరణః=ప్రాణ వాయు రూపమున ప్రాణులను కదులు నట్లు చేయవాడు,
సహస్ర:మూర్ధా:= వేల కొలది శిరస్సులు గలవాడు,


విశ్వాత్మా:= విశ్వమునకు ఆత్మగా ఉండువాడు,
సహస్రాక్ష:=వేలకొలది కన్నులు, ఇంద్రియములు గలవాడు,
సహస్ర పాత్=వేలకొలది పాదములు గలవాడు,
భాష్యం :
ముముక్షువులను ఉత్తమ పదవికి దీసికొని పొవువాడు, సమస్త భూతములకు నాయకుడు, సర్వోత్క్రుష్ట మైన కాంతి గల వాడు,
ప్రమాణములను గ్రహిమ్చున అభేదమును గలిగించెడి  వాడు,జగత్తనెడి యంత్రమును నడి పెడి వాడు,ప్రాణ వాయురూపమున ప్రాణులను కదులునట్లు చేయవాడు, వేలకొలది శిరస్సులు గలవాడు, విశ్వమునకు ఆత్మగా ఉండువాడు, వేలకొలది కన్నులు, ఇంద్రియములు గలవాడు,వేలకొలది పాదములు గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

శ్లో .ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః!!25!!

ఆవర్తన:= సంసార చక్రమును త్రిప్పునట్టివాడు,
నివృత్తాత్మా:=సంసార బంధమున దగుల్వడని స్వరూపముగలవాడు,  సంవృతః= ఆచ్చాదించెడి స్వభావముగల అవిద్య చేత కప్పి వేయ బడిన వాడు,  
సంప్రమర్దనః= రుద్రుడు కాలుడు మున్నగు విభూతుల చేత లెస్సగా మర్దిమ్చువాడు,
అహసంవర్తక:= చక్కగా దినముల నడిపెడి సూర్య రూపుడు,

వహ్ని=హవిస్సును మోసెడి అగ్ని లాంటి వాడు,
అనిల=స్థానము లేనివాడు,
ధరణీ ధరః= శేషుడు దిగ్గజములు మున్నగువాని రూపమునను వరాహ రూపమునను భూమిని మోయువాడు,
భాష్యం :
సంసార చక్రమును త్రిప్పునట్టివాడు, సంసార బంధమున దగుల్వడని స్వరూపము గలవాడు,   ఆచ్చాదించెడి స్వభావముగల అవిద్య చేత కప్పి వేయ బడిన వాడు,  రుద్రుడు కాలుడు మున్నగు విభూతుల చేత లెస్సగా మర్దిమ్చువాడు, చక్కగా దినముల నడిపెడి సూర్య రూపుడు,హవిస్సును మోసెడి అగ్ని లాంటి వాడు, స్థానము లేనివాడు,శేషుడు దిగ్గజములు మున్నగువాని రూపమునను వరాహ రూపమునను భూమిని మోయువాడు, అగు పరమాత్మునికి ప్రణామములు.  

శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః
సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః!!26!!

సుప్రసాదః= అనకు అపకారము చేసిన (శిశుపాలుడు) మెదలైన వారికి మోక్షమునోసగినవాడు,
ప్రసన్నాత్మా= రజస్తామో గుణములచే కలుషితముగాని  అంత: కరణము గలవాడు,
 విశ్వ దృక్ := విశ్వరచన సేయు ప్రగల్బ్య ము గలవాడు,
విశ్వభుక్ := విశ్వమును పాలనము చేయువాడు
విభుః= అంతటా వ్యాపించు ఉండు వాడు,
సత్కర్త:=సత్కరించు వాడు,

సత్కృతః = పూజ్యులచెచేత కూడ పూజింప బడువాడు,
సాధు:= న్యాయ ప్రవర్తన గలవాడు,
జహ్ను:= ప్రళయకాలమున జనులను లీనము చేసికొనువాడు,
నారాయణ:= నారములనగా నిత్య వస్తువుల సమూహము వానిని ఆశ్రయముగా గలవాడు,
నరః=నాశములేని చేతనా చేతన విభూతి కలవాడు,
భాష్యం :
అనకు అపకారము చేసిన (శిశుపాలుడు) మెదలైన వారికి మోక్షము నోసగినవాడు,  రజస్తామో గుణములచేగా కలుషితముగాని  అంత: కరణము గలవాడు, విశ్వరచన సేయు ప్రగల్బ్య ము గలవాడు, విశ్వమును పాలనము చేయువాడు, అంతటా వ్యాపించు ఉండు వాడు,
సత్కరించు వాడు, పూజ్యులచెత గూద పూజింప బడువాడు,  న్యాయ  ప్రవర్తన గలవాడు, ప్రళయకాలమున జనులను లీనము చేసికొనువాడు,
నారములనగా నిత్య వస్తువుల సమూహము వానిని ఆశ్రయముగా గలవాడు, నాశములేని చేతనా చేతన విభూతి కలవాడు,  పరమాత్ము నికి  ప్రణామములు . 

  శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః
సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః!!27!!

 అసంఖ్యేయ:= సంఖ్య లేని వాడు,
 అప్రమేయాత్మా:= అప్రమేయమైన స్వరూపముగలవాడు, 
 విశిష్ట = సమస్తమును అతిశాఇంచి పోయినవాడు,
శిష్టకృత్ : =  అనుకూలముగా చేసుకొనువాడు,
శుచి := నింజనుడు,

సిద్ధార్థః = నెరవేరేది సంకల్పములు గలవాడు,
సిద్ది సంకల్ప :=నెరవేరేది సంకల్పములు గలవాడు,
 సిద్ధిద :=వారి వారి యధికారము ననుసరించి కార్తలకు సిద్ధిని ఇచ్చు వాడు,
సిద్ధిసాధన := సిద్ధికి సాధన మైనవాడు
భాష్యం :
సంఖ్య లేని వాడు, అప్రమేయమైన స్వరూపముగలవాడు,  సమస్తము ను అతిశయించి పోయినవాడు,  అనుకూలముగా చేసుకొనువాడు,  నింజనుడు,  నెరవేరేది సంకల్పములు గలవాడు,   వారి వారి యధికారము ననుసరించి కార్తలకు సిద్ధిని ఇచ్చు వాడు,  సిద్ధికి సాధన మైనవాడు, అగు పరామాయమునకు ప్రణామములు. 
  శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శుచి సాగరః!!28!!

వృషాహీ= యజ్ఞములు, వృషాహములు గలవాడు,
వృషభ:= భక్తజనుల కొరకు అభీష్టములను వర్షిమ్చు వాడు,
 విష్ణు: = విక్రమణము కలవాడు
వృష పర్వ:= పరమపదము నారోహించు నభిలాష గలవానికి వృష రూపములైన సర్వములు వక్కణించ గలవాడు,
 వృషోదరః= భక్తులు ఆదరముతో సమర్పించిన దాని నంతనూ విడువక స్వీకరించే వాడు,
వర్ధన:= తల్లి వలే వారి నందరినీ వృద్ధి పొందిమ్చేవాడు,

వర్ధమాన:= ప్రపంచ రూపమున వృద్ధి నొందు వాడు,
 వివిక్తః= ఇట్లు వృద్ధినొందినను విలక్షనముగానే ఉండు వాడు,
 శ్రుతిసాగర := సముద్రమువలేనే శ్రుతులకు విధియై యుండు వాడు,
  భాష్యం ;
 యజ్ఞములు, వృషాహములు గలవాడు,  భక్తజనుల కొరకు అభీష్టము లను వర్షిమ్చు వాడు,  విక్రమణము కలవాడు,  పరమ పదము నారోహించు నభిలాష గలవానికి వృష రూపములైన సర్వములు వక్కణించ గలవాడు,  భక్తులు ఆదరముతో సమర్పించిన దాని నంతనూ విడువక స్వీకరించే వాడు,  తల్లి వలే వారి నందరినీ వృద్ధి పొందించే వాడు,  ప్రపంచ రూపమున వృద్ధి నొందు వాడు,  ఇట్లు వృద్ధినొందినను విలక్షనముగానే ఉండు వాడు,   సముద్రమువలేనే శ్రుతులకు విధియై యుండు వాడు, అగు పరమాత్మునికి ప్రణామములు . 

. శ్లో. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః!!29!!

సుభుజ: = ఆశ్రితుల భారము నోర్వగలిగిన అందమైన భుజములు కలవాడు,
దుర్ధర: = ఒర్వజాలని వేగము కలవాడు,
వాగ్మీ = జయ శీలమైన వాక్కు గలవాడు,
మహేంద్ర: = మహత్తు గల ఇంద్రుడు,
వసుద: = మహిమ గలవాడైనా అల్పమైన ధనాదులు కోరువారికి వానినే ఇచ్చువాడు,
వసుః = క్షీర సముద్రమున వసించు వాడు,
నైకరూప: = ఒకటే రూపము లేనివాడు,

బృహద్రూపః = వరాహము మొదలైన మహారూపములు గలవాడు,
శిపివిష్టః =దిక్కులయందు ఆకాశ మందు కూడా వ్యాపొంచి యుండు వాడు,
 ప్రకాశన:=సమస్తమును ప్రకాసింప జేయు స్వభావముగలవాడు,
భాష్యం
ఆశ్రితుల భారము నోర్వగలిగిన అందమైన భుజములు కలవాడు, ఓర్వజాలని వేగము కలవాడు,జయశీలమైన వాక్కు గలవాడు,మహత్తు గల ఇంద్రుడు, మహిమగలవాడైనా అల్పమైన ధనాదులు కోరువారికి వానినే ఇచ్చువాడు, క్షీర సముద్రమున వసించు వాడు, ఒకటే రూపము లేనివాడు, వరాహము మొదలైన మహా రూపములు గలవాడు, దిక్కులయందు ఆకాశ మందు కూడా వ్యాపొంచి యుండు వాడు, అగు పరమాత్మునికి ప్రణామములు  
 

 శ్లో. ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు భాస్కర ద్యుతిః!!30!!

ఓజస్తేజోద్యుతి ధరః = ఓజస్సు,తేజస్సు, కాంతులను ధరించువాడు, ఓజస్సు అంటే బలము,. తేజస్సు తో శక్తి గలవాడు,
ప్రకాశాత్మా := ప్రకాశస్వరూపమైన ఆత్మ గలవాడు,
ప్రతాపనః =సూర్యదివిభూతుల చేత విశ్వమును లెస్సగా తపింప జేయు వాడు,
ఋద్ధః = ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, మొదలైన వానితో నిండి యుండు వాడు,
స్పష్టాక్షర:= ఉదాత్తమైన ఓంకారరూపమగు అక్షరము గలవాడు,
మంత్ర:=  చింతించు వారలన్లు రక్షించువాడు,
చంద్రాంశు:= చంద్రకిరణముల వంటి కాంతి గలవాడు,
భాస్కరద్యుతిః= సూర్యతేజము సామ్యముగా గలవాడు,
భాష్యం :
ఓజస్సు,తేజస్సు, కాంతులను ధరించువాడు, ఓజస్సు అంటే బలము,. తేజస్సు తో శక్తి గలవాడు, ప్రకాశస్వరూపమైన ఆత్మ గలవాడు,సూర్యది విభూతుల చేత విశ్వమును లెస్సగా తపింప జేయు వాడు,ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, మొదలైనవానితో నిండి యుండు వాడు, ఉదాత్తమైన ఓంకారరూపమగు అక్షరము గలవాడు, చింతించు వారలన్లు రక్షించువాడు, చంద్రకిరణముల వంటి కాంతి గలవాడు,సూర్య తేజము సామ్యముగా గలవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు.  

 శ్లో. అమృతాంశూద్భవో భానుః శశ బిన్దుః సురేశ్వరః
ఔషధం జగతస్సేతుః సత్య ధర్మ పరాక్రమః!!31!!
 

అమృతాంశూద్భవ:= పాలసముద్రమును మధించు చుండగా ఉద్భవించిన చంద్రుని ఉత్పత్తికి కారణమైనవాడు,
భానుః = ప్రకాశిమ్చు వాడు,
శశ బిన్దుః=కుందేటిని బోలిన చిహ్నముగల చంద్రుని వలెనే ప్రజలను పోషించువాడు,
సురేశ్వరః= సురులకు ప్రభువైనవాడు, 
ఔషధం=సంసారం 
నందు మందు  అందించు వాడు,
జగతస్సేతుః=లోకమునకు సేతువు వలే ఉండు వాడు,
సత్య ధర్మ పరాక్రమః= సత్యమైన ధర్మములు, జ్ఞానాది గుణములు పరాక్రమమును గలవాడు,
భాష్యం :
: పాలసముద్రమును మధించు చుండగా ఉద్భవించిన చంద్రుని ఉత్పత్తికి కారణ మైన వాడు, ప్రకాశించు వాడు, కుందేటిని బోలిన చిహ్నముగల చంద్రుని వలెనే ప్రజలను పోషించువాడు, సురులకు ప్రభు వైన వాడు, సంసారం నందు మందు   అందించు వాడు, లోకమునకు సేతువు వలే ఉండు వాడు, సత్యమైన ధర్మములు, జ్ఞానాది గుణములు పరాక్రమమును గలవాడు, అగు  పరమాత్మునకు ప్రణామములు. 

  శ్లో. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామ కృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః!!32!!

భూత:భవ్య:భవన్నాథః = భూత భవిష్యద్ద్వార్తమానము లైన సమస్త భూతములకు నాధుడు,
పవనః =పవిత్రము చేయువాడు,
పావన:= వీచునట్లు చేయువాడు,
అనలః = అనేక విధములుగా నుప కరించియు చాలునని తృప్తి పొందనివాడు,
కామహా= హింసించు వారలయు ముముక్షువు లగు భక్తులయు కోరికలను నశిమ్ప చేయువాడు,.  

కామ కృత్ =సాత్వికు లైనా వారి కోరికలను సిద్దింప జేయువాడు,
కాంత : = మిక్కిలి రూపవంతుడు, 
కామః =  పురుషార్దమును గోరెడి వారిచేత కోరబడువాడు
కామప్రదః= భక్తుల కోరికలను చక్కగా నెరవేర్చువాడు,
 ప్రభుః =సర్వోత్కృష్టముగా ఉండువాడు,
భాష్యం :
 :భూత భవిష్యద్ద్వార్తమానములైన సమస్త భూతములకు నాధుడు, పవిత్రము చేయువాడు, వీచునట్లు చేయువాడు,  అనేక విధములుగా నుపకరించియు చాలునని తృప్తి పొందనివాడు,  హింసించు వారలయు ముముక్షువు లగు భక్తులయు కోరికలను నసింప చేయువాడు, సాత్వికులైనా వారి కోరికలను సిద్దింప జేయువాడు, మిక్కిలి రూపవంతుడు,  పురుషార్దమును గోరెడి వారిచేత కోరబడువాడు,భక్తుల కోరికలను చక్కగా నెర వేర్చువాడు,  సర్వోత్కృష్టము గా ఉండువాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 

 శ్లో. యుగాది కృత్యుగావర్తో నైకమాయో మహాశనః !
అదృశ్యో వ్యక్త రూపశ్చసహస్ర జిదనంత జిత్ !! 33 !!

యుగాది కృత్ : = యుగాది యనెడి కాల విశేషము నకు కర్త, అధవా యుగముల నారంభించువాడు,  
యుగావర్త:= కాలాత్మకుడై క్రుతాది యుగములను మరల మరల తిరుగునట్లు చేయువాడు,
 నైకమాయ:=ఒక్క మాయ గాదు వీనిది పెక్కు మాయల దాల్చువాడు,
 మహాశనః =కల్పాత్మున సర్వము భక్షిమ్చువాడగుటవలన గొప్ప భోజనముగలవాడు,
అదృశ్య:= ఎ జ్ఞానేంద్రియమునకును గోచరము కానివాడు,

వ్యక్త రూపశ్చ:= స్థూల రూపమున వ్యక్తమగు స్వరూపము గలవాడు, 
సహస్ర జిత్ := వేలకొలది అసురులను యుద్దమున జయించువాడు,
ఆనంతజిత్  = ఊహింప సక్యముగాని సామర్ద్యము గలవాడు,

భాష్యం :-
 :యుగాది యనెడి కాలవిశేషమునకు కర్త, అధవా యుగముల నారంభించు వాడు,  కాలాత్మకుడై క్రుతాది యుగములను మరల మరల తిరుగునట్లు చేయువాడు,  ఒక్క మాయ గాదు, వీనిది పెక్కు మాయల దాల్చువాడు, కల్పాత్మున సర్వము భక్షిమ్చు వాడ గుట వలన గొప్ప భోజనము గలవాడు,  ఎ జ్ఞానేంద్రియమునకును గోచరము కానివాడు,
స్థూల రూపమున వ్యక్తమగు స్వరూపముగలవాడు, వేలకొలది అసురులను యుద్దమున జయించువాడు,  ఊహింప సక్యముగాని సామర్ద్యము గలవాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 

  శ్లో. ఇష్టో విశిష్టః శిశ్టేష్టః శిఖండీ నహుషో వృషః !
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34 !!

 ఇష్ట:= పరమ సుఖ రూప డగుట చేత ప్రియమైనవాడు ,
విశిష్టః = అంతటా ఉండు వాడు,
శిశ్టేష్టః =శిష్టులకు ఇష్టమైనవాడు,
 శిఖండీ:= గోపాల వేషధారి ఆయన నెమలి పింఛమును అలంకారముగా ధరించినవాడు,
నహుష:= భూతములను మాయచేత బంధించు వాడు,
వృషః = తన కాంతిని, మాటలను చల్లగా వర్షిమ్చువాడు,
క్రోధహా:=సాధువుల కోపమును నసింప చేయువాడు,

క్రోధకృత్ =   క్షత్రియులందరికి క్రోధము కలిగించు వాడు,
కర్తా:= క్రోధమునకు మూలకారణమైన  కార్తవీర్యార్జునుని నరికినవాడు,
విశ్వబాహు :=సమస్తప్రాణులకు ఆలంబనముగా నుండువాడు,
మహీధరః =పూజను లేదా భూమిని ధరించువాడు,
భాష్యం :
:పరమ సుఖరూప డగుట చేత ప్రియమైనవాడు, అంతటా ఉండు వాడు, శిష్టులకు ఇష్టమైనవాడు,  గోపాల వేషధారి ఆయన నెమలిపింఛమును అలంకారముగా ధరించినవాడు, భూతములను మాయ చేత బంధించువాడు, తన కాంతిని, మాటలనుచల్లగా వర్షిమ్చువాడు, సాధువుల కోపమును నసింప చేయువాడు, క్షత్రియులందరికి క్రోధము కలిగించు వాడు, క్రోధమునకు మూలకారణ మైన  కార్తవీర్యార్జునుని నరికినవాడు, సమస్తప్రాణులకు ఆలంబనముగా నుండువాడు,పూజను లేదా భూమిని ధరించువాడు, అగు పరమాత్మునకు  ప్రణామములు. 

శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః !
అపాం నిథి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః !! 35 !!

అచ్యుతః = తన ఐశ్వర్యము జారకుండా ఉండువాడు,
ప్రథితః = జగత్తునకు సంభందించిన సృష్టి మున్నగు కర్మల చేత ప్ర ఖ్యాతి నొందినవాడు,
ప్రాణః = సూత్రత్మగా ఉంది ప్రజలకు ప్రాణము గలవానిగా జేయువాడు,
ప్రాణద:= దేవతలకు బలము నిచ్చువాడు,
వాసవానుజః =కశ్యపుని వలన అదితి యందు బుట్టి దేవేంద్రునకు తమ్ముడైన వాడు,
అపాంనిథి = ఉదకములకు నిధియైన వాడు,

అధిష్ఠాన:= మధన కాలమున మంధర పర్వమునకు ఆధారమైన వాడు,
అప్రమత్తః = అధికారుల కొరకు కర్మలకు తగిన ఫలమును ఏమరుపాటు నొందక ఇచ్చు చుండు వాడు,
 ప్రతిష్ఠితః = తన మహిమ యందే యుండు వాడు,
భాష్యం :
: తన ఐశ్వర్యము జారకుండా ఉండువాడు, జగత్తునకు సంభందించిన సృష్టి మున్నగు కర్మలచేత ప్రఖ్యాతి నొందినవాడు,  సూత్రత్మగా ఉండి  ప్రజలకు ప్రాణము గలవానిగా జేయువాడు,  దేవతలకు బలము నిచ్చువాడు, కశ్యపునివలన అదితి యందు బుట్టి దేవేంద్రునకు తమ్ముడైన వాడు,  ఉదకము లకు నిధియైన వాడు, మధన కాలమున మంధర పర్వమునకు ఆధారమైన వాడు,  అధికారుల కొరకు కర్మలకు తగిన ఫలమును ఏమరుపాటు నొందక ఇచ్చుచుండువాడు, తన మహిమ యందే యుండు వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. స్కన్ద స్కన్దధరో ధుర్యో వరదో వాయు వాహనః !
వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురన్దరః !! 36 !!

స్కన్ద:= అమృత రూపమును శ్రవించువాడు, 
 స్కన్దధర:= ధర్మ మార్గామును నిలుపువాడు,
ధుర్య := సకల భూతముల ఉత్పత్తి మున్నగు లక్షణములుగల భారమును మోయువాడు,
వరద:= భాక్త జనులకు అభిమతమలైన వరములను ఇచ్చు చుండు వాడు,
వాయు వాహనః = వాయువును కుడా వీచునట్లు చేయువాడు,
వాసుదేవ:= తనకిరణముల చేత ప్రపంచమంతా వ్యాపించి క్రీడించు వాడు, 

 బృహద్భాను= పెద్దవైన కిరణములు గలవాడు,
 ఆదిదేవః= సమస్తమునకు కారణమును, ప్రకాశిమ్చుటకు మున్నగు లక్షనములు గలవాడు,
పురంధర= త్రిపురాసుర సంహారము చేసినవాడు,  
భాష్యం :
 :అమృత రూపమును శ్రవించువాడు,   ధర్మ మార్గామును నిలుపువాడు, సకల భూతముల ఉత్పత్తి మున్నగు లక్షణములుగల భారమును మోయు వాడు,  భక్త జనులకు అభిమతమలైన వరములను ఇచ్చు చుండు వాడు, వాయువును కుడా వీచునట్లు చేయువాడు, తన కిరణముల చేత ప్రపంచమంతా వ్యాపించి క్రీడించు వాడు,  పెద్దవైన కిరణములు గలవాడు,  సమస్తమునకు కారణమును, ప్రకాశిమ్చుటకు మున్నగు లక్షనములు గలవాడు,  త్రిపురాసుర సంహారము చేసిన వాడు,  అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో . అశోకస్తారణరస్తారః శూరః శౌరిర్జనేశ్వరః !
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !!37!!

అశోక:= శోకము, మోహము, ఆకలి మొదలగు వానినుండి రక్షించు వాడు,
తారణ:= శత్రువులు, చోరులు, వ్యాధుల నుండి రక్షించువాడు,
తారః= సంసార భయమునుండి రక్షించు వాడు,
శూరః = జయించు స్వభావము కలవాడు,
శౌరి:= శూరుని పుత్రుడు,
జనేశ్వరః = జనులకు ఈశ్వరుడు, 
అనుకూలః = సకల భూతములకు ఆత్మగా, భక్తులకు అనుకూల మైన వాడు, 

శతావర్తః= ధర్మమును కాపాడుటకై వందలకొలది ప్రొదుర్భావములు జెందు వాడు,
 పద్మీ= చేతి యందు పద్మము కలవాడు,
 పద్మనిభేక్షణః=పద్మములను బోలియుండు నేత్రములు గలవాడు,
భాష్యం

:శోకము, మోహము, ఆకలి మొదలగు వానినుంది రక్షించు వాడు, శత్రువులు, చోరులు, వ్యాధుల నుండి రక్షించువాడు, సంసార భయము నుండి రక్షించు వాడు, జయించు స్వభావము కలవాడు,శూరుని పుత్రుడు, జనులకు ఈశ్వరుడు, సకలభూతములకు ఆత్మగా, భక్తులకు అనుకూల మైన వాడు,  ధర్మమును కాపాడుటకై వందల కొలది ప్రొదుర్భావములు జెందు వాడు, చేతి యందు పద్మము కలవాడు, పద్మములను బోలియుండు నేత్రములు గలవాడు, అగు ప్రమాత్ము నకు ప్రణామములు.
శ్లో. పద్మనాభోరవిందాక్షః పద్మ గర్భః శరీరభృత్ !
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః !!38 !!

పద్మనాభ:= కమలము యోక్క నాభి యందుండు వాడు,
అరవిందాక్షః= తమర రేకుల వంటి కన్నులు గలవాడు,
 పద్మ గర్భః = హృదయకమల మధ్యమున ఉపాశింప దగినవాడు,
శరీరభృత్ =యోగుల ఉపాసనను పోషించు వాడు,
మహర్ధి : = మిగుల గొప్పదియగు విభూతి గలవాడు,

బుద్ధ:= ప్రపంచా కారముతో ఉండు వాడు,
వృద్ధాత్మా:= పురాతన మైన ఆత్మ గలవాడు,
 మహాక్ష:= గోప్పవియగు రెండు లేదా పెక్కు నెత్రముజ్లు గలవాడు,
 గరుడధ్వజః =గరుత్మంతుని చిహ్నముగల ధ్వజము గలవాడు,

భాష్యం :
 :కమలముయోక్క నాభి యందుండు వాడు, తమర రేకులవంటి  కన్నులు గలవాడు,  హృదయకమల మధ్యమున ఉపాసిమ్పదగిన వాడు,యోగుల  ఉపాసనను పోషించు వాడు,  మిగుల గొప్పదియగు విభూతి గలవాడు, ప్రపంచాకారముతో ఉండువాడు,  పురాతన మైన ఆత్మ గలవాడు,  గోప్పవియగు రెండు లేదా పెక్కు నేత్రములు గలవాడు,
 గరుత్మంతుని చిహ్నముగల ధ్వజము గలవాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 

శ్లో. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః !
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !!39!!

అతులః = సాటి లేనివాడు,
శరభ:= తనమాట జవదాటినవారిని శిక్షించు వాడు, 
భీమః = హద్దు మీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు, 
సమయజ్ఞ:= ఎ కాలమున తననుతాను భక్తులకు ఇచ్చు కోవాలో ఎరిగి న వాడు,
హవిర్హరిః= యాగమున హవిర్భాగములను స్వీకరించువాడు, 
సర్వలక్షణ లక్షణ్యో:= సమస్త ప్రమాణముల చేత ఏ జ్ఞానమైతే సిద్ధించు చున్నదో అది సర్వలక్షణము లతో నిండియుండు వాడు,

లక్ష్మీవాన్:= వక్ష:స్థలమున నిరంతరము లక్ష్మీ దేవి నివసించు చుండు వాడు,
సమితింజయః = యుద్దమున గెలుపొందువాడు,
భాష్యం
:సాటి లేనివాడు,  తనమాట జవదాటినవారిని శిక్షించు వాడు, హద్దు మీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు,  ఏ  కాలమున తనను తాను భక్తులకు ఇచ్చు కోవాలో ఎరిగిన వాడు, యాగమున హవిర్భాగములను స్వీకరించువాడు, సమస్త ప్రమాణముల చేత ఎ జ్ఞానమైతే సిద్ధించు చున్నదో అది సర్వలక్షణములతో నిండి యుండు వాడు,  వక్ష:స్థలమున నిరంతరము లక్ష్మీ దేవి నివసించు చుండు వాడు,  యుద్దమున గెలుపొందువాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 


శ్లో. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః !
మహీధరో మహాభాగో వేగవానమితాశనః !! 40 !!

విక్షర:= నాశము లేని వాడు,
రోహిత:= రోహిత అనే మత్యము యొక్క ఆకారమును ధరించువాడు,
మార్గ:= ఉపాసకుల చే వెతుక బడువాడు,
హేతు:= అనతికి నీ ఉపాదాన కరణము, నిమిత్త కరణము నైనవాడు,
దామోదరః= సమస్త లోకములూ ఉదరము నందు కలవాడు,
 సహః = అందరను అతిక్రమించిన వాడు అథవా అంతయు సహించు వాడు,
మహీధరో:= భూమిని ధరించు వాడు,

మహాభాగ:= ఉత్తమోత్తమ కన్యలు ఎరికోరి వరింప దగిన సౌభాగ్యము గలవాడు,
వేగవాన్ := మానవా వతారంలో  మిక్కిలి వేగము కలవాడు,
అమితాశనః=సంహరకాలమున విశ్వమును భక్షిమ్చువాడు,
భాష్యం
:నాశము లేని వాడు, రోహిత అనే మత్యము యొక్క ఆకారమును ధరించువాడు, ఉపాసకులచే వెతుకబడువాడు,  అనతికి నీ  ఉపాదాన కరణము, నిమిత్త కరణమునైన వాడు, సమస్త లోకములూ ఉదరము నందు కలవాడు,   అందరను అతిక్ర మించిన వాడు అథవా అంతయు సహించు వాడు,  భూమిని ధరించు వాడు,  ఉత్త మోత్తమ కన్యలు ఎరికోరి వరింప దగిన సౌభాగ్యము గలవాడు,  మానవావతారం లో  మిక్కిలి వేగము కలవాడు, సంహరకాలమున విశ్వమును భక్షిమ్చువాడు, అగు పరమాత్మునికి ప్రణామములు. 


శ్లో. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః !
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41 !!

ఉద్భవః= ఉత్పత్తికి ఉపాదానకారణ మైనవాడు, 
క్షోభణ:= కలత పెట్టు వాడు
దేవః= మాయ అనే పాశములొ జీవులను బంధించి క్రీడించువాడు,
శ్రీగర్భః =క్రీడలతో లక్ష్మిని సంతసింప చేసి వృద్ది పొందించువాడు,
పరమేశ్వరః =లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్ధకత నొందినవాడు,
కరణం =  సాధనుముగా ఉండు వాడు,

కారణం = ఆయాకిరణములచే ఆయా పనులను చేయించు దేవతగా కూడ నుండు వాడు,
కర్తా = వాశ్చల్యమువలన సుఖ దుఖములను తాను కూడా  అను భవిస్తాడు,
వికర్తా:= జీవుని సుఖ దుఖములను చూచి వికారము పొందు వాడు,
గహన := విచిత్రమైన రీతిలొ బుద్దికి అగోచరముగా నుండు వాడు,
గుహః =లోకమంతాను రక్షించు వాడు,
భాష్యం :
 :ఉత్పత్తికి ఉపాదానకరణ మైనవాడు, కలత పెట్టు వాడు, మాయ అనే పాశములొ జీవులను బంధించి క్రీడించువాడు, క్రీడలతో లక్ష్మిని సంతసింప చేసి వృద్ది పొందించు వాడు, లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్ధకత నొందినవాడు, సాధనుముగా ఉండు వాడు,  ఆయాకిరణములచే ఆయా పనులను చేయించు దేవతగా కూడ నుండు వాడు,  వాశ్చల్యమువలన సుఖ దుఖములను తాను కూడా  అను భవిస్తాడు,  జీవుని కుశదుఖములను చూచి వికారము పొందు వాడు, విచిత్రమైన రీతిలొ బుద్దికి అ గోచరముగా నుండు వాడు, లోక మంతాను రక్షించు వాడు, అగు పరమాత్మునకు ప్రణామములు. 


శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః !
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!

వ్యవసాయ:= నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరముగా కలవాడు,
వ్యవస్థానః = కాలమును తనయందే స్థాపించబడి ఉండువాడు,
సంస్థానః = సమస్తమును తనయందే ముంగించు నట్లుండు వాడు,  
స్థానద:= పరమ స్థానము నిచ్చు వాడు,
ధృవః = నాశములేనివాడు,
పరర్ధిః= సర్వోత్క్రుష్టమైన విభవము గలవాడు,

పరమస్పష్టః= మిక్కిలి గొప్ప ప్రకాశము గలవాడు,
తుష్టః=పరమానందమే ముఖ్యస్వరూపముగా గలవాడు,
పుష్టః=అన్నీ విషయముల యందును పరిపూర్ణుడు,  
శుభేక్షణః = శుభమైన దర్శనము కలవాడు, 
భాష్యం :

 :నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరముగా కలవాడు, కాలమును తన యందే స్థాపించ బడి ఉండువాడు, సమస్తమును తనయందే ముగించు నట్లుండు వాడు, పరమ స్థానము నిచ్చు వాడు, నాశము లేనివాడు, సర్వోత్క్రుష్టమైన విభవము గలవాడు, మిక్కిలి గొప్ప ప్రకాశము గలవాడు, పరమానందమే ముఖ్య స్వరూప ముగా గలవాడు, అన్ని విషయముల యందును పరి పూర్ణుడు, శుభమైన దర్శనము కలవాడు,  అగు పరమాత్మునకు ప్రణామములు

                                                        మిగతా శ్లోకాల భాష్యం  తరువాత భాగములో చూడగలరు