ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
అమ్మ అందరికి అమ్మే
అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టాడు రామకృష్ణ, నెమ్మదిగా భార్య శ్రీదేవికి చేతిలో, ఉన్న బ్యాగును, అందిస్తూ జానకమ్మ గారు టిఫిన్ తిన్నారా అని అడిగాడు, ఆ తిన్నది అంటూ చెట్టంత పెళ్ళాన్ని తిన్నావా అని అడగ కుండా ఆమె తిన్నదా అని అడిగే మొగుడ్ని నేనే చూస్తున్నాను, అంటూ గొనుక్కుంటున్న భార్య తో నీ గొణుగుడు అవతలపెట్టు, నేను అడిగిన దానికి సమాధానము ఇవతల పెట్టు అన్న మాటలకు ఆ కుర్చీలొ దర్జాగా కూర్చొని జపమాల తిప్పుకుంటూ "శివ నామం " చెస్తున్నది, .అన్నది గట్టిగా . .
సరే, సరే, నేను కాళ్ళు కడుక్కొని వస్తాను, నాకు టిఫిన్ పెట్టు, ఇప్పుడే వస్తాను.
బాత్ రూం నుండి లోపలకు అడుగుపెడుతున్న రామకృష్ణ మోకాళ్ళు వంక చూస్తు, "జానకమ్మగారు " మడమ తడవ కుండా కాళ్ళు కడుక్కోవటం మంచిది కాదు, మన పురాణాలలో నలమహరాజుకు కాళ్ళు కడుక్కోనేటప్పుడు తొందరపాటుగా మడమ తడవకుండా కడుక్కోవడంవల్ల "శని" ప్రవేసించి సర్వం హరించాడు, ఏదో తొందర పడి వచ్చాను మరలా కడుక్కొని వస్తాను, అని లోపలకు వెళ్లి, కడుక్కొని వచ్చాడు రామకృష్ణ. జానకమ్మ రుద్రాక్షమాల త్రిప్పుతూ " నమ: శివాయ " అంటూ వరండాలోకి వెళ్ళింది.
అవునండి ఆ జానకమ్మగారు మిమ్మల్ని గట్టిగా అంటుంటే నాకు ఎదోలాగున్నది, అంత పెద్దావిడ చేత మీరు మాట పడటం సబబుగా ఉన్నదా,తప్పేమన్నది, మంచి చెప్పింది, చేయమన్నది అది తప్పేట్లావుతుంది, పెద్దవాళ్ళు చెప్పే మాటలు మంచి మాటలు, వాళ్ళ అనుభవాలు పిల్లలకు చెపుతారు, మనం మూర్ఖులుగా ప్రవర్తిమ్చాకుండా గౌర వించి, ఆచరించి, ఆదుకోవాలి, అదే మన ఇద్దరి కర్తవ్యం కూడ, అమ్మ ఎమన్నా, తప్పుచేసిన, ఓపికతో ఉండు, పొరపాటున నోరు జారకు, అని పలుకుతు, టిఫిన్ తిని చేతులు కడుకున్నాడు. అయ్యో రామ ఆమెను నేను ఒక్క మాటను కూడా అనను, ఆమెను మా అమ్మతో సమానముగా చూసు కుంటున్నాను. మీకు నిజం చెబుతున్నాను, మీ మీద ఒట్టు అన్నది శ్రీమతి.
జానకమ్మ గారికి కోడుకులున్నప్పుడు, మన దగ్గర ఉంచుకొని "పోషణ భాద్యతలు " స్వీకరించటం సబబా అని అడు గుదామనుకుంటున్నాను, అమ్మ పరిస్తితులు అంతంత మాత్రమె, ఏదన్న రోగం వస్తే ఎవరు భాద్యులు. మీరు నేనే కదా ఒక్క సారి ఆలోచించండి, జానకమ్మను బయటకు పంపమని చెప్పను, బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను ఆమెకు సేవలు చేస్తాను, అత్తగారిగా భావించి సేవలు చేస్తాను అన్నది శ్రీమతి శ్రీదేవి
నీవు ఒక అత్తగారిగా, ఒక తల్లిగా గౌరవించటం మాత్రం మరువకు, ఆమ్మ కధ నీకు చెప్పక పోవటం నాదే తప్పు, నీవు అడిగావు కాబట్టి అని నేను చెప్పుటలేదు, చెప్పుట నా భాద్యత.
మాది చాలా బీద కుటుంబము, మానాన్న గారు వీధి వీధి తిరిగి, చిలకద్వారా ప్రశ్నలు చెప్పించి ఆ వచ్చే పైకముతో నన్ను, నా చెల్లిని చదివించారు. మా నాన్న గారి స్నేహితుడు కైలాసం గారు ఈ జానకమ్మ గారి భర్త, ఎంత మంచివాడో అంత త్రాగు బోతు. నేను డిగ్రి చదువుకొనుటకు నగరానికి రావలసి వచ్చింది, నేను వారి ఇంట ఉన్న పంచ గదిలో ఉండి చదువుకొని ఇంతవాడి నయ్యాను. వెళ ప్రకారము వాళ్ళ ఇద్దరు పిల్లలతో సమానముగా నన్ను కుడా చూస్తు ఉండేది, భోజనము, టిఫిన్ పెట్టేది. ఎందుకండీ మీరు శ్రమ పడుతున్నారు అన్న వినిపించుకోదు, ఎప్పుడు అనేది కష్ట పడి చదువు తున్నావు, నీకునేను చేసే సహాయము ఎమీ లేదు, నాకోడుకులతో పాటు, నీకు అన్నం పెడుతున్నాను, ఆశ్రయం కల్పించాను అంతే కదా అనేది.
అప్పుడు నాకు అనిపించింది, ఆమె ఓపికతో గుంటను త్రవ్వి, అందులో రెండు చేతులతో మొక్కను నాటి నీరు పోసి రోజు చుట్టూ ప్రక్కల సుబ్రం చెస్తూ ఉండేది.
ఆ మొక్కను ఏవిధముగా పెంచేదో, ఆవిధముగా నాకు కష్టమనేది తెలియకుండా, అమ్మ ఇంటిలో చదువును పూర్తి చేసాను, నాగార్జున యూనివర్సిటి మాధమెటిక్సు గ్రూపులొ మంచి మార్కులు సమ్పాఇంచాను..
ఉద్యోగము కొరకు వీధి వీధి తిరిగాను, కాల చక్రము తిరిగింది తప్ప, .ఆ కాలములో నేను ఎదన్న చిన్న ఉద్యోగము చేస్తానన్న వప్పుకోనేది కాదు, ఒకటే మాట అనేది శక్తి వంచన లేకుండా కష్టపడి పోటి పరిక్షలకు చదువు, ఇంటర్వు ఖర్చులు, అప్లికేషన్ ఖర్చులు మొహమాటము లేకుండా అడుగు అన్ని నేను సర్దుతాను అని నన్ను కదలనిచ్చేది కాదు, చిన్న పనులు (పాలు తేవటం, కూరలు తేవటం అన్న వప్పుకోనేది కాదు) ఈ అమ్మ. నాకు రెండు సంవస్చరాలకు గవర్నమెంట్ కలెజీలొ లెక్చరర్ ఉద్యోగము వచ్చింది
మరి మీ నాన్న గారు ఏమి పైకము పంపలేదా, మీ కుటుంబ విషయాలు ఎమీ చెప్పలేదు. అంత తొందరెందుకు నీకు నిద్ర వస్తే నిద్ర పో రేపు మిగతా కధ రేపు చెపుతానులే అన్న మాటలకు లేదండి కధ ఇంట్రష్టుగా ఉన్నది చెప్పండి.
అమ్మ నిద్ర పోయిందో లేదో ఒక్క సారి చూసి వస్తాను, ఎందుకండీ అంత భాధ పడతారు, అమ్మ చేసిన సహాయమును గుర్తు కొస్తే నాకు ఏడు పొ స్తుంది, ఆ కన్నీరు తుడుచు కొండి, చిన్న పిల్ల వాడిలా, అమ్మకు నేను చిన్న పిల్ల వాడినే కదే, పదండి నేను వస్తాను అని ఇద్దరు అమ్మ గదిలోకి వెళ్ళారు, నిద్ర పోతున్న తల్లికి ప్రక్కన ఉన్న దుప్పటి కప్పి, పాదాలకు నమస్కరించి వేనక్కు తిరిగారు. ఇంతకీ మన ముగ్గురమ్మాయిలు నిద్ర పోయారా అని అడిగాడు భార్యను.
లేదండి వారు ఆ గదిలో చదువు కుంటున్నారు, మనం పదండి అన్న మాటలకు కదిలారు బెడ్ రూం లోకి.
నాకు ఉద్యోగము రాని కాలములో, మా ఇంటి పరిస్తితి తలక్రిందలు అయింది, మా నాన్న గారు, అమ్మ గారు వాకింగ్ చేస్తున్నప్పుడు వెనుకనుండి వేగముగా ఒక లారి అదుపు తప్పి మా తల్లితండ్రుల ప్రాణాలను హరించి వేసింది. నేను నా చెల్లి భాదతో ఎదుస్తున్నాప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు, తల్లి తండ్రుల శవాలను చూస్తు భాదపడు తున్నప్పుడు, ఈ అమ్మ దగ్గరకు తీసుకొని, నాకు, నా చెల్లికి ధైర్యము చెప్పి, దహన కార్యక్రమాలు, పిండ ప్రదానాలు దగ్గరుండి చేయించిన మహా తల్లి ఈమె.
నా చెల్లికి చదువుకొన్న వాడిని, మంచి ఉద్యోగస్తుడిని చూసి పెళ్ళిచేసి కాపురానికి [పంపించింది. ఖర్చులన్నీ అమ్మే పెట్టుకున్నది.
అమ్మ త్రాగుబోతు భర్త తో సంసారము చేస్తూ, కష్టాలు, భాదలు, భరిస్తూ, మరోవైపు టిచరుగా చెస్తూ, తన ఇద్దరి పిల్లలకు చదువు చెప్పించింది. పెద్ద కొడుకు ను ఇంజనీర్ను చేసింది, చిన్న కొడుకుని డాక్టర్ను చేసింది. పిల్లలు వృద్ధిలోకి వచ్చారుకడా ఆదుకుంటారని ఆశించింది పిచ్చి తల్లి. పై చదువులు చదివేందుకు అమెరికాకు వెళ్ళారు ఉన్న ఆస్తి అంతా చదువుల క్రింద ఖర్చుఅయి పోయింది.
అమెరికాలోనే మన భారతదేశానికి చెందిన ఇంజనీర్ని ఇంజనీర్ , డాక్టర్ని డాక్టర్ పెళ్లి చేసు కున్నారు. తండ్రి త్రాగుబోతు అని చెప్పు కోవటం వారికి నామర్దా అయింది, తండ్రి టాక్సీ నడిపి మనల్ని చది విన్చాడని ఇంకితజ్ఞానం కూడా వాళ్లకు లేదు.
ఒక సారి కొడుకులకు నా చేత ఉత్తరం వ్రాయించింది, నాన్న గారి పరిస్తితి బాగోలేదు, మీరు వెంటనే వచ్చి చూసి పోగలరు.
దానికి సమాధానముగా తమ్ముడు కాని తమ్ముడుకు మన ఆస్తినంత ఖర్చు పెట్టావు, ఇప్పుడు మాకు మిగల్చకుండా చేసావు, అక్కడ ఏముందని మేము రావాలి, నాన్న ఆరోగ్యమును తమ్ముడు నీవు ఎలాగో చూస్తున్నారు, నేను నా భార్య పనిచేస్తే గాని ఇక్కడ సరి పోవుటలేదు, నాన్నకు మంచి మందులు వాడమని తమ్ముడు కాని తమ్ముడుకు చెప్పు, మేము త్వరలో అక్కడకు రాగలము అని మాత్రమె ఉత్తరం వ్రాసారు.
నాకు అమ్మ మనస్తత్వం తెలుసు గనక, నాన్నకు మంచి మందు ఇప్పించి, ఇక్కడకు, అమ్మ నాన్నను తెచ్చాను, తర్వాత మన పెళ్లి అయింది, తర్వాత విషయాలు అన్ని నీకు తెలుసు కదా అన్నాడు రామ కృష్ణ.
ఏమండి నేను అడిగానని అనుకోవద్దు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని తిరుగుతుంది, ఇంతవరకు కనిపించలేదు, భర్త అసలు ఉన్నారా, పోయాడా ? కలియుగం కదా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నడను కున్నాను అన్నది.
తొందర పాటుతో ఒక మనిషిని అనకూడదని నీకు ఎన్నో సార్లు చెప్పను అయన నీవు అడుగుతున్నావు, భర్త ఉన్నాడు అయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు .
అదేగా నేను అడిగింది అంతకన్నా ఎమన్నా తప్పు మాట్లాడినా, తప్పు మాట్లాడితే క్షమించండి అన్నది భార్య శ్రీదేవి.
నీకోసారి గుర్తుందా నేను క్యాంపుకు పోయాను, పరీక్ష పాపర్లు దిద్దటాని వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఆ గుర్తుకొచ్చింది, మీరు హడావిడిగా వెళ్లి పోయారు నాకు అదే గుర్తు. అమ్మ పుణ్య కేత్రాలకు కదా పోయింది, అప్పుడు అమ్మే మాత్రమె తిరిగి వచ్చింది. నీకు అంత వరకే తెలసు. అదేకదా నేనన్నది.
అప్పుడేమి జరిగిందో చెపుతా విను అన్నాడు రామ కృష్ణ
నాన్న ఆరోగ్యము బాగుండకపోతే నీకు చెప్పకుండా ఆసుపత్రిలో చేర్పించాము, నాన్నకు త్రాగటం వాళ్ళ లివర్, కిడ్ని చెడిపోయినాయి చేయుట లేదు అని డాక్టర్లు చెప్పారు, అమ్మ ఒకటే కన్నీరు పెట్టు కుంటూ నా దగ్గరకు వచ్చింది
నీవె నాకోడుకువి, మీనాన్నను రక్షించు కోవాలి, ఇదిగో ఈ నగలు అమ్మి డబ్బు తెచ్చి ఆసు పత్రిలో డబ్బు కట్టు అన్నది . అమ్మ నేను డబ్బు కడతాను నా దగ్గరున్నవి, నీవెందుకు భాద పడతావు అన్నాను. ఈ నగలన్నీ నా పుట్టింటివారు పెట్టినవి, కొన్ని మీ నాన్న కొన్నవి, ఏనాడు త్రాగటానికి నా నగలు తాకట్టు పెట్టని మహానుభావుడు మీనాన్న, నాకు వళ్ళంత నెప్పులు ఉన్నాయి, దానిని తగ్గించుకొనుటకు తాగుడు అలవాటు అయింది దానిని మానుకోలేక పోతున్నాను నీకు అన్యాయం చేస్తున్నానా అనేవాడు.
ఆ మాటలకు నాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి, ముందు అన్నయ్యలకు చెప్పుదాం అన్నాను, మీ అన్నయ్య ల విషయం నీకన్నా నాకే బాగా తెలుసు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు వారిని భాద పెట్టుట ఎందుకు అన్నది.
ఆయినప్పటికీ అమ్మకు తెలియకుండా నేనే అన్నలకు కబురు పంపినాను, నాన్న పరిస్తితి వివివరించాను.
ఆ అప్పుడు కొడుకులు వచ్చారా అని అడిగింది శ్రీమతి శ్రీదేవి
అమ్మను నాన్నను జాగర్తగా చూసుకొ, మేము కొంత పైకము పంపగలము, ఇప్పుడు మేము వచ్చే విధముగా లేదు వీసా కూడా దొరక లేదు , ఇక్కడ మాకే కష్టం గా ఉన్నది, మాకే నాన్న కాదు నీవుకూడా మానస పుత్రుడువు కదా అన్న మాటలకూ ఫోన్ కట్ చేశాను.
మొత్తం ఖర్చులు నేనే పెట్టుటకు సిద్ద పడ్డాను, అమ్మ మాత్రము వప్పుకోలేదు, నగలు అమ్మి ఆ డబ్బును ఆసుపత్రిలో డబ్బుకట్టమన్నది కట్టాను, నాన్నకు ఆపరేషన్ చేసారు, కాని బలంగా బయటకు తిరుగుటకు చాలా కష్టం కలిగింది, అమ్మే దగ్గరుండి అన్ని చేసింది, వేలకు తిండి, బట్ట కట్టు కొనుటకు, అమ్మే సహకరించింది. డాక్టర్ లేని సమయాన, నాన్న భాదను తట్టుకోలేక, ఎవ్వరుకు చెప్పకుండా రాత్రికి రాత్రి ఎటో వెళ్లి పోయారు, ఎంత వెతికినా కనిపించలేదు.
మరి మీ అమ్మ ఉన్నదికదా చూడ లేదా
తెల్లవారుజామున నిద్ర పట్టుట వల్ల గమనించ లేక పోయింది.
ఈవిషయము కొడుకులకు కబురు పంపమన్నది అమ్మ
కొడుకులు ఏమన్నారు
నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాము మేము బయలుదేరి వద్దామని చెప్పారు, రమ్మనమని చెప్పాను
వారేమన్నారు అడిగింది శ్రీమతి
ఏముంది అమ్మను నీదగ్గరె ఉంచుకో, నాన్న దొరికేదాకా వెతుకు అన్నారు, మేము ఇండియా కు వచ్చినతర్వాత నిన్ను కలుస్తాము అన్నారు
ఆ ఆమాటలు అమ్మతో చెప్పాను లోకం తీరు బాబు, ఇది ఎవరిని తప్పు పట్టే విషయం కాదు, ఋణం తీర్చుకొని కొందరు దూరమవుతారు, దూరముగా ఉండి ఋణం తీర్చుకొలదని భాదపడుతారు.
నేనోకటే నీకు అక్షర సత్యం చెప్పాలను కుంటున్నాను అన్నది
ఆ ఏమి చెప్పింది మీ అమ్మగారు
ఒక కవిత ఇలా చెప్పింది
అక్షరాలు నేర్చుకో - అదృష్టాన్ని నమ్మకు
ఆలోచించు - ఆవేశపడకు
ఇవ్వడం అలవర్చుకో - ఇచ్చింది పెట్టకు
ఈ తరం నీదె - ఈర్ష్యను త్వజించు
ఉన్నతంగా జీవించు - ఉనికిని కోల్పోకు
ఊహించు - ఊసరవెల్లివి కాకు
ఋషివికా - ఋగ్మతలను జయించు
ఎదుగు - ఎవ్వరిని వంచిమ్చకు
ఏదోఒక లక్షం పెట్టుకో - ఎడుస్తూ కూర్చోకు
ఐకమత్యంగా ఉండు - లొంగకు
ఒద్దికగా ఉండు - ఒకరితో పోల్చుకోకు
ఓర్పును పాటించు - ఓటమికి చింతించకు
ఔపోసన పట్టు - ఔనత్యాన్ని వీడకు
అందరితోకలువు - అంధకారాన్ని వీడు
అ:హర్నిశం శ్రమించు - అ:న్ని జయించు
అవునండి మీరు ఎట్లా చెపితే, అట్లా, నా ప్రవర్తణను మార్చుకుంటాను, నాకు మీరు అత్తయగారు రెండు కళ్ళు.
మరి పిల్లలు మూడో కన్నుగా మీరున్నరుగా అన్నమాటలకు నవ్వుకున్నారు ఇద్దరు.
బాబు అంటూ పిలుస్తున్నది జానకమ్మ, అత్తయ్య నేనోస్తున్నాను, మీకు ఏపని చేయమన్న నేనుచేసి పెడతాను.
ఎమీ లేదు అంటూ వేనకు వెల్ల బోయింది.
ఎందుకమ్మ భాధపడతావు వేరాకరికి చెప్పుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుందని నేవే చెప్పావుగా
అవును చెప్పాను, ఈరోజుకు నాన్నగారు వెళ్లి పోయి సంవస్చరము అయింది, శివాలయములొ అభిషేకము చేయించి అన్నదానము చేయి ద్దామని అనుకుంటున్నాను, ఎం బాబు నీకు ఇష్టమేనా
ఇదుగోనమ్మ నేను ముందే కన్టేశ్వరాలయము పైకము కట్టా , నీకు చెపుదామనుకున్నా చెప్పలేక పోయాను అంతే, అందరం గుడికి వెళ్లి తీర్ధ ప్రసాదాలు తీసుకున్దాము
మరి నా మనవరాల్లను పిలువు గుడికి వస్తారోలేదో, కలియుగం కదా
అందరు శివదర్సనం చేసుకున్నారు, అక్కడే అమ్మ మాత్రము రుద్రాక్షమాలతో నమ:శివాయ అంటూ జపం చేస్తూ కూర్చున్నది.
ఈ కధ నచ్చితే షేర్ చేయగలరు, ఎమన్నా కాకామెంట్సు వ్రాయగలరు
. .
.