23, నవంబర్ 2014, ఆదివారం

195.Family love story 98-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-5

 ఓం రామ్                                           ఓం రామ్                                         ఓం రామ్
                                                         
      

అన్నయగారు యక్ష ప్రశ్నలు గురించి నాకు తెలుపగలరా? అని అడిగింది సుభద్ర , కొత్తగా వచ్చిన స్నేహితుడైన రామకృష్ణతో నాకు గుర్తున్నవి తెలిసినవి తెలియపరుస్తాను 

ఇదిగో వాడిని నీవు యక్ష ప్రశ్నలు వేసి వేదిమ్చకు 
నేను ఎందుకు వేదిస్తానండి , ఆయన కవి కదా ఏదో కొంత తెలుసు కదా అందుకనే అడిగాను 
జ్యోతిర్లింగాలను  తలచుకొని మీరడి గిన ప్రశ్నకు ఆ శివ స్వరూపము నాలో పలికించిన పదాలను అక్షరూపంలో ఇందు  ఉదహరిస్తాను
సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
 

ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..


వ్యక్తిగతంగా ఎదగటానికి 10 సూత్రములుఅందరు గమనించండి
1.అందరినీ మనసుతో స్వీకరించండి
2.నిరాశావాదులకు,మోసకారులకు దూరంగా ఉండండి
3.మీపై మీరూ నమ్మకంతో ఉండండి
4.'అవును/కాదు' అని చెప్పేందుకు భయపడకూడదు
5.మీ కలను సాధించేంతవరకు వదలకూడదు
6.మీ గురించి మీరూ తక్కువ చేసుకోకండి
7.ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి
8.ఏదైనా మీ మనసుకు తప్పు అనిపిస్తే అది చెయ్యకండి
9.మీ మనసును గట్టిగా నమ్మండి
10.నలుగురిలో మిమ్మల్ని మీరూ తక్కువ చేసుకోకండి
 

యక్ష ప్రశ్నలు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.
నాకు దొరకినవి తెలిసినవి ఇందు పొందు పరిచాను
   
1.సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
   బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
   దేవతలు

3.సూర్యుని అస్తమింపచేయునది ఏది?
   ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
   సత్యం

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
     వేదం

6. దేనివలన మహత్తును పొందును?
   తపస్సు

7. మానవునికి సహయపడునది ఏది?
    ధైర్యం

8.మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
  పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
    అధ్యయనము వలన

10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
     తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
      మౄత్యు భయమువలన

12. జీవన్మౄతుడెవరు?
     దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమికంటె భారమైనది ఏది?
      జనని

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
      తండ్రి

15 గాలికంటె వేగమైనది ఏది?
     మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
      ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ
      మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది

17. తౄణం కంటె దట్టమైనది ఏది?
      చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
      చేప

19.రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
     అస్త్రవిద్యచే

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
      యజ్ణ్జం చేయుటవలన

21. జన్మించియు ప్రాణంలేనిది
      గుడ్డు

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
      రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
      శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన

24.ఎల్లప్పుడూ వేగం గలదేది?
     నది

25. రైతుకు ఏది ముఖ్యం?
     వాన

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
      సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

   
27. ధర్మానికి ఆధారమేది?
      దయ దాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది?
      దానం

29. దేవలోకానికి దారి ఏది?
      సత్యం

30. సుఖానికి ఆధారం ఏది?
      శీలం

31. మనిషికి దైవిక బంధువులెవరు?
      భార్య/భర్త

32.మనిషికి ఆత్మ ఎవరు?
     కూమారుడు

33. మానవునకు జీవనాధారమేది?
      మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును?
    దానం

35. లాభాల్లో గొప్పది ఏది?
      ఆరోగ్యం
 యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు తెలియ పరచగా  యక్షుడు ధర్మరాజుతో చనిపోయిన నీతమ్ములలొ ఎవరిని బ్రతికించ మంటావు అని అడిగాడు, పినతల్లి మాద్రి కొడుకైన నకులిడి  ప్రాణాలు కొరుకున్నాడు. నీ ధర్మ నిరతిని మెచ్చుకొని అందరిని నేను బ్రతికిస్తున్నాను, నీకు ఒక వరము కుడా ఇస్తున్నాను అజ్ఞాత వాసములో మిమ్ములను ఎవ్వరు గుర్తు పట్టకుండా మీకు వరమిస్తున్నాను అని అన్నాడు యక్షుడు. 
ధర్మ రాజు ధర్మం గురించి తెలియా పరిచాడు 
"మమ  ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యా0, వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ!
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి!!"  

ప్రతిజ్ఞ సత్య మైనదని  తెలుసుకో! అమృతం కంటే, జీవితం కంటే  ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను.   రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, నం గాని సత్యంలో పదహారోవంతుకు కూడా  సరితూగవని స్పష్టం చెశాడు.అందుకే  ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు  

                                ఇంకా ఉంది  

194.Family love story 97-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-4

ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్                       ఓం శ్రీ రామ్
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-4
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.
రాత్రికి ఇంటికి చేరారు ఇద్దరు స్నేహితులు, మాటలతో ఒకరికొకరు అర్ధం చేసుకున్నారు
అన్నయ గారు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానము చెపుతారా, నాకు తలుస్తే చెపుతాను అన్నడు రామకృష్ణ
    
1.ఈ మద్య  కాలంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకో చెప్పగలరా  కవితా దృష్టితో?

మనుష్యులు (రైతులు ) చనిపోవటానికి ఒక కారణమని చెప్పటం కష్టం,  అనేక కారణాలు ఉండవచ్చు
ప్రభుత్వము  వారు పొలమునకు అప్పు ఇస్తున్నారు కదా అని డబ్బు తీసుకుంటున్నారు, తీర్చగలమని నమ్మకముతో తీసుకుంటున్నారు, ఒక సంవస్చరం పంట పండక పోయిన, మరల దున్ని కొండంత ఆశతో పంట పండుతుందని పంట వేస్తాడు, వర్షములు పడక పోయిన, కరంటు లేక పోయిన, మన అదృష్టం లేక పోయిన రైతులలో నిరుస్చాహము కలుగు  తున్నది. తన కష్టాలు వేరొకరి చెప్పుకుంటే కష్టాలు తీర్చెవారా ఆర్చేవారా అని భావించి కుటుంబ సమేతముగా పురుగులు మందు త్రాగి మరణిస్తున్నారు,
దయ చేసి రైతులారా మీరు ఎవరు చావకండి, కష్టాలు వచ్చి నన్తమాత్రమునా చావే కారణమని భావించకండి, ఆదికవి వ్రాసిన సుందరా కాండలో తెలియ పరిచారు కష్టాలు వచ్చినంత మాత్రమున చావకూడదు, ఓపిక వహించి ఉన్నట్లయితే ఖచ్చితముగా కష్టాలు తొలగి పోతాయని తెలియ పరిచారు, కొత్త ప్రభుత్వమును ఎన్నుకుంటే బాకీలు మాఫీ చేస్తారని నమ్ము కోవటం కూడా తప్పే, మన మనసును నమ్ముకోవాలి, కొండంత అండగా ఉన్న కుటుంబాన్ని నమ్ముకోవాలి , ప్రక్క వాడి పంట పండినదని, నా పంట పండలేదని అని భాద మనసుకు రాకూడదు .
దయచేసి ఎవ్వరు ఆత్మ చేసుకోకండి, జీవించటానికి ప్రయత్నించండి, అప్పులు తీర్చలేదని భాద పడకండి, పంటను మారుస్తూ, సరిఐన సమయానా  ఎరువులు వాడుతూ , నీరు అన్దిస్తూ,  కలుపు మొక్కలు పీకుతు జీవితమ్ గడప గలరని ఇందు మూలముగా ఒక వక్తిగా, రచయతగా  తెలియ పరుస్తున్నాను.. 
                                                                                                
అందరు గుర్తుంచుకోవాలి

మహోన్నత వ్యక్తిత్వానికి  కారణం వినయమే
మానసిక  అభ్యుదయానికి  కారణం   మనసే
సహచరులు సహకారానికి కారణం   వినమ్రతే
అందరు సమాన మవటానికి కారణం మానవత్వమే

కర్షకులారా నిగ్రహిమ్చుకోండి, బ్రతికి బ్రతికించటానికి ప్రయత్నించండి


లక్ష్యం  కోసం ఎప్పుడు   తాపత్రయ  పడతా వోయి
మండు టెండలో పొలంలో చమట చిమ్ముతావోయి
ఎవరే మన్నా నీవు పొలం పని చేసే  తాపసి వోయి
నలుగురి కోసం పొలంలో  కష్ట పడే  కర్షకుడ వోయి

భూమాతను ప్రార్ధింమ్చి దున్నే రైతువోయి
పొలంలో ఉంటె  పనికి  బానిస   వోయి
బయట ఉంటె అందరికి రక్షకుడ వోయి
కంటికి, చేతికి, వంటికి విశ్రాంతి లేదోయి

విత్తనాలు నాటి వరుని దేవునికోసం వేచి ఉంటా వోయి
చిన్న గాయానికి మట్టి కప్పి మట్టిలో బ్రతుకుతా వోయి
పంట పండేదాక కుటుంబానికి కంటి నిండా నిద్రలేదోయి
పవిత్ర హృదయాన్ని పొలానికి అంకిత పరుస్తా  వోయి

ఎ జంతువు రాకుండా పొలానికి కాపలాగా ఉంటా వోయి
పొలానికి పురుగు పట్టకుండా మందులు కొడతా   వోయి
మంచపై  ఉండి అరుస్తూ పక్షులను తరుముతా    వోయి
పంట ఇంటికి చేరితే ఆనందానికి  అవధులు లే      వోయి

బ్యాంకు అప్పు తీర   లేదని  భాద పడ కోయి
పంట పండలేదని ఆత్మహత్య చేసుకో  కోయి
భార్యపిల్లల బ్రతుకుకోసం నీవు బ్రతకాలోయి
అందరికి ఆకలి తీర్చె అన్నదాతవు నీవెనొయి

కన్నీరు కల కాలం  కల్లల్లో ఉండ లేవోయి
కనికరం చూపెవారు లేరను అను కోకోయి
ఈ కలి యుగంలో మానవత్వం ఉన్నదోయి
ఆశకు పోయి నమ్మి అభాసుపాలు కాకోయి

"
నీ జాతివారాలు రాజులై యుండియు కనజాలరైరి నీకష్టమెల్ల
నీ కొలమందు జన్మించిన యా జమిందారులు గనరు నీ తపమెల్ల
నీ శాఖలో ధన నిలయులౌ కొందరు పరికింప లేరు నీ భాధలెల్ల
నీ తెగలో విద్య నేర్చిన బియ్యేలు లిఖించరైరి నీ లెములెల్ల

గీ !! న్యాయ వాదులు నీవార లడుగ రైరి
      న్యాయ మూర్తులు నీవార లరయరైరి
      ఇంక పెరవారి ముచ్చట లెందుకయ్య
      కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవారు ?

రైతు కులానికి చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు                రైతాంగం ఇబ్బందుల్ని వారు సరిగణనలోకి తీసుకోని వారైనారు
రైతాంగం లో ధనికులైన వారున్నారు, సాటి రైతుని ఆదుకో లెకున్నారు
రైతుకుటుంబములో బాగుగా చదువుకున్న వారున్నారు,పట్టించుకోరు

నీ వారైన న్యాయవాదులు అడుగరు
నీ వారైన న్యాయ మూర్తులు తెలుసు కోరు
ఆయినవాల్లె ఇలా ఉంటె పరాయి వాల్లెల ఉంటారు
మరి రైతు కష్టం పట్టిమ్చుకొనేవారెవరు " ప్రభుత్వమా ప్రజలా"


అలనాటి "గోలకొండ కవుల సంచిక" లో కర్షకా అన్న శీర్షికన ప్రచురితమైన పద్యాన్ని గుర్తుకు వచ్చి ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని రచించినది గంగుల సాయి రెడ్డి, జీడి కల్లు గ్రామం, నల్గొండ జిల్లా.
మానవజాతి మనుగడకు జీవమ్ పోసే రైతు అకాల మరణాలు ఎ ప్రమాణాల తొనూ క్షంతవ్యం కాదు, కర్షకుని చెమట బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఎ జాతికి శ్రేయస్కరం కాదు "

మీరు రైతుల చాలా చెప్పారు చివరగా మీ సందేసమేమిటి అని అడిగింది ప్రకాశరావు గారి భార్య సుభద్ర
ఏమిటో మీరు అడిగినదానికి నాకు తెలిసినవి తెలియ పరుచు తున్నాను.


ప్రకృతి ననుసరించి కష్టాన్ని నమ్ముకొని రైతుగా జీవించడం
రైతు పొలంకు మందు కొట్టి, కలుపు మెక్కలు ఏరివేయటం
రైతు విధిగా దున్ని నీరు పెట్టి,కాపు కాస్తే పంట పండటం ఖాయం
రైతుకు అప్పులుతీరి, కష్టాలుపోయి సుఖాలురావటం ఖాయం

 2. కుదరనివి ఏవి ?

పట్టు పరుపులున్న , ఆకలి  తీరక పొతే ఎప్పటికి నిద్ర  రాదు
ఎన్ని పుస్తకాలున్న, మనసు  పెట్టి  చదవకపోతే జ్ఞానం రాదు
ఎన్నినగలున్న, అవసరానికి ఉపయోగించకపోతే విలువలేదు
ఎన్ని మందులున్న, మనసుతో మందువాడకపోతే రోగం తగ్గదు

ఆహార పదార్ధాలు ఉన్న, ఎప్పటికి ఆకలిని కొనటం కుదరదు
సుఖాలు ఎన్ని ఉన్న , మనిషికి శాంతిని కల్పించటం కుదరదు
సౌకర్యాలు ఎన్ని ఉన్న, ఆనందాన్ని కల్పించటం కుదరదు
ధనం ఎంత ఉన్న, అడవిలో, ఎడారిలో, దానికి విలువలేదు

చెడులో మంచిని చూడక పొతే, మనిషిగా బ్రతకటం కుదరదు
విషాదంలో సంతోషాన్ని చూదక పొతే,  మనుగడ కుదరదు
నష్టంలో లాభం  చూడక పొతే, వ్యాపార  మనేది కుదరదు
హ్రుదయం లో ప్రేమ లేక పోతే, సుఖ సంసారము సాగదు

3.  తేడా అంటే ఒక్క వాక్యము లో చెప్పండి ?
     నాలుగుపంతులలో చెపుతాను

మనిషి  మనిషికి మద్య  ఉన్న తేడ  శ్రద్దలో వ్యత్యాసమే
పెద్దలకు, పిల్లలకు  మద్య  ఉన్న తేడ   ఆత్మ విశ్వాసమే
భార్య భర్తల మద్య  ఉన్న తేడ  సంసార సుఖం లోపించుటయే  
గురు శిష్యుల మద్య ఉన్న తేడ నమ్మకం వమ్ము  చేయడమే  

నన్ను స్పందింప జేసిన, నాలో ఆలోచనలను రేకెత్తించిన , నన్ను ప్రభావితం  చేసి కొన్ని ముఖ్యమైన అంశాలను పదిమందికి అందించటం ఒక మంచి పనిగా భావించి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒకనాటి లెక్కల అద్యాపకుడిగా నేను నేర్చుకున్న విషయాలు, తల్లితండ్రులు గురువులు, స్నేహితులు , ఎందరో మహానుభావులు చెప్పిన విషయాలను
ఇందు పొందు పరుస్తున్నాను, చదివి మీ అభిప్రాయాలు కామెంట్స్ వ్రాయటం ద్వారా షేర్ చేయటం ద్వారా తెలుపగలరు .
                                                                  ఇంకాఉంది                                                                                             


21, నవంబర్ 2014, శుక్రవారం

193.Family love story 96-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-3

ఓం శ్రీ రామ్                                     ఓం శ్రీ రామ్                                  ఓం శ్రీ రామ్
                                                                         
     

ప్రేమ ఎవరిపై ఉండాలి ?-2
ఏమిటండి ప్రొద్దున్నే బయలు దేరారు
చూడు సుభద్ర నీకు చెప్పటం మరిచాను, ఈరోజు నాకు తెలిసిన కధకుడు ఇక్కడకు వస్తానన్నాడు,  తీసుకు రావటా నికి వెళుతున్నాను.
నన్ను కుడా రమ్మన మంటారా ఇద్దరం కలసి వెళదాం.
నీవు కూడా వస్తానంటే,  ప్రశ్న ఉంటుందా
ఇప్పుడే పది నిముషాలల్లో చీర మార్చుకొని వస్తాను
ఏమండి ఇంతకీ ఆయన ఎవరండి.

చిన్నపుడు నేను అతను కలసి చదువుకున్నాముట, నాకు మాత్రం గుర్తులేదు, అతనే గుర్తు పట్టి ఫోన్ చేసి చెప్పాడు
నీకన్న పెద్ద
నాకేం  తెలుసు  అడిగితె నేనేమని చెప్పను,  ప్రశ్నలన్ని ఆ వచ్చిన అతన్ని అడుగు అన్ని సమాధానాలు చెప్పుతాడు
వేళాకోళం వద్దండి ఉండ పట్టలేక అడిగా, నీవు అడగవచ్చు నేను సమాధానము చెప్పవచ్చు
ఎం చదివాడండి , లోకం, జనం,  చదివాడు
ఏమ్చేస్తున్నాడండి,  పొట్ట కూటి కోసం, సంసారం కోసం,  ఉద్యోగం చేస్తున్నాడు
పెల్లైన్దా , ఏమిటే ఆ పిచ్చి ప్రశ్న

అయితే ఒక షరతు, నేను వచ్చిన వారిని నాకు తెలిసిన ప్రశ్నలు అడుగుతాను మీరు మాత్రం ఎమీ అనవద్దు
నీ  మాట ఎప్పుడైనా కాదన్నానే, అన్తోద్దు ఏదో ఉండ పట్ట లేక అడిగాను
వచ్చిన వాడు  వెంటనే నీ ప్రశ్నలకు పారి పోయే వాడిగా మాత్రం చేయకు
ఎమి టండి నాకు మాత్రం తెలియదా, నేను కుడా ఏదో  చదువు కున్నాను గా

అదిగో అతనే అనుకుంటా ఆ స్టేషన్ దగ్గర ఆగి ఉన్నారు
మీరె కదా నాకు ఫోన్ చేసింది "రామకృష్ణ గారు కదా "
ఏమిటి మీరు , గారు, అంటున్నావు మరచి పొతే ఎట్లా నీ పాత స్నేహితున్ని నవ్వుతూ చెయ్ తీసుకొని అరచేతిలో గిల్లాడు ఆ గుర్తొచ్చింది నీవు గుంటూర్ శర్మగారు కదూ అని కౌగలించుకున్నాడు, అన్నయ్య్యగారు ఇక్కడ మేమున్నాము అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాశరావు

ఏమిటండి పగటి కళలు కంటున్నారు కూర్చిలొ కూర్చొని అన్న పిలుపుకు ఒక్కసారి లేచాడు
ఎప్పుడొచ్చారు అప్పుడే మీరు వచ్చారా, మీరు ఫోన్ చేస్తే  నేను వచ్చే వాడిని కదా,  సుభద్రా, సుభద్రా,  అంటూ కేక వేసాడు, ఆ వస్తున్నానండి నాస్నేహితుడు వాడి భార్య వచ్చారు,  నీకు  చెప్పటం మరచి పోయా
నమస్కారం అన్నయ్య గారు లోపలకు రండి, లోపలాలి రారా మొహమాట మేమ్దుకు, ఇది నీ ఇల్లే అనుకో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం  చేతులు కడుక్కో అని నీరు అందించాడు స్నేహితుడు ప్రకాశరావు
నీవు ఏమి మారలేదురా అప్పుడెట్లాగున్నావు ఇప్పుడు అట్లాగెఉన్నావు , ఎదో కోద్దిగా బొజ్జ వచ్చింది  తప్పా

అన్నయ్య గారు లుంగీ కట్టు కుంటారా , టిఫిన్  తీసుకొస్తాను అన్నది.
అందరు కలసి మాట్లాడుకుంటూ టిఫిన్  తింటున్నారు,
ప్రకాశరావు నేను చిన్న కవితలు రాస్తున్నాను, వాటిని ప్రింటింగ్ చేయించాను, వాటిని నీ పుస్తక షాపులో అమ్మితే అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయిరా
అది నాకు తెలుసు నీ పుస్తకాలు ఎన్నిఉన్నాయ్యొ అన్ని తీసుకొచ్చి ఇవ్వు, అందుకు అడ్వాన్సు గా ఈ చెక్కు నీ దగ్గర ఉంచు అని చేతిలో పెట్టాడు.

అన్నయ్య గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలని అనుకున్నాను ఒక్కరవు చెపుతారా అని అడిగిన్ది.

నాకు తెలిసినవన్ని నీకు చేపుతానమ్మ అని అన్నాడు   

శ్రేష్టులైనవారెవరు ?

సమస్త  భూతములలొ  ప్రాణులే   శ్రేష్ఠులు
ప్రాణులలో బుద్ధితో   కూడిన  వారే  శ్రేష్ఠులు
మానవుల అందరిలో బ్రాహ్మణులె  శ్రేష్ఠులు
బ్రాహ్మణులలో  విద్యఉన్న విద్వాంసులే శ్రేష్ఠులు

విద్వాంసులలో కృత బుద్దులైనవారే శ్రేష్ఠులు
కృత బుద్దులలో  ఆచరణ  శీలురే     శ్రేష్ఠులు
ఆచరన శీలలో    బ్రహ్మ    వేక్తలు    శ్రేష్ఠులు
తల్లి తండ్రులకు పాద పూజ చేసినవారు శ్రేష్ఠులు

అనాధ శవానికి ప్రేత కర్మలు చేసినవారు శ్రేష్ఠులు
ఎ పరిస్తితులలో అభద్దము ఆడని వారే  శ్రేష్ఠులు
ఈనుతున్నా గోమాతకు ప్రదక్షణం చేసినవారు శ్రేష్ఠులు
వృద్ధులను, గురువులను, తల్లితండ్రులను ఆదుకున్నవారు శ్రేష్ఠులు  

భయమంటే ఏమిటి ?

బలమునకు      - బలవంతుడంటే భయం
గుణములకు     - దుష్టుడంటే భయం
రూపమునకు    - రోగమంటే  భయం
భోగమునకు      - ముసలి తనమంటే భయం

బంగారమునకు  - రాజు అంటే   భయం
శరీరమునకు     - య్యముడంటే భయం
శాస్త్రమునకు     - ప్రతి వాదంటే భయం
మానమునకు   - నీచమంటే  భయం

మనుష్యుల పై ఏవిధముగా ప్రవర్తిమ్చాలి  ?

సేవకులయందు     -   దయయును
తమవారియందు    -   అనుకూలమును
కుత్యుతులయందు -  కపటత్వమును
మంచివారియందు  -   దాసక్తియును

గురువులయందు   -   క్షేమమును
పండితులయందు   -  గౌరవమును
రాజు యందు         -  న్యా యమును
శత్రువులయందు    -  పరాక్రమమును
స్త్రిల యందు       -     సామద్యమును     
  
పిల్లలపై తల్లి తండ్రుల ప్రేమ ఎలా  ఉండాలి ?
పిల్లల పై 
సూర్య  బింబంలా అనుక్షణం సత్యం వెలుగుతూ ఉండాలి
కడిగిన ముత్యం లా  ఎప్పుడు  నీతి    ప్రకాశిస్తూ ఉండాలి
చీకటి  రాత్రిలో మెరిసే వజ్రంలా న్యాయం మెరుస్తు ఉండాలి
తల్లితండ్రులు పిల్లలందర్ని సమానంగా ప్రేమతో పోషించాలి  

దంపతులు ఎలా ఉండాలి ?
దంపతుల మద్య
దంపతుల మద్య పూల తీగ అల్లుకొన్న మానులా ఉండాలి వలపు
ఆత్మీయులతొ,  అనురాగమ్తో, అందరితో ఎప్పుడు ఉండాలి  తలపు
సాఫీగా జరిగిపోతున్న  జీవితంలో ఇది ఒక తెలిసి  కోలేని మలుపు 
నిగ్రహించుకొని పరిష్కారంచేసుకోపోతే కుటుంబలోవస్తుంది కుదుపు

ఓటమి  లో తన వారెవరో  పరాయ  వారెవరొ తెలుసు  కోవచ్చు
కొడుకుల  వద్ద  జీవితంలో నీతులు వినాల్సిన పరిస్తితి  రావచ్చు
పిల్లల ఇంష్టం అనుసరించి ఉంటె జీవితంలో సుఖాలు చూడవచ్చు
కన్నీరు తుడిచేవారు ఎవరో తెలుసుకుంటే  కన్నీరే లేకుండా బ్రతకవచ్చు 

అపజయాల ఆవల తీరంలో  విజయ బాటలు ఉండవచ్చు
అందరు నిశ్శ బ్ధంల్లొనె గెలుపు ఓటమిలు గమనించవచ్చు
కలియుగ కాలసత్యంలో మనుష్యులు గుర్తుకు రాకపోవచ్చు
తపించే వారు లేక ఆదు కొనేవారు లేక  అంధుడై పోవచ్చు    

కొడుకుకు హితభోద ఎట్లా చేయాలి ?

కష్టాలు,  కన్నీళ్ళు,   కలకాలం వుండవురా
కన్నవాళ్ళలో  ఎప్పుడు  కాంతిని  నింపాలిరా
క్రమ శిక్షణ, కృషి,  దీక్ష, వదలక   ఉండాలిరా
ప్రకృతి, సమాజాన్ని అనుసరించ జీవించాలిరా

నీ విధి,  విద్యు త్ ధర్మాలే,  నీకు  అండరా        
నియమధర్మాలుపాటిస్తే నీకు నిండుదనమురా
నిష్కపటము, నిర్మలత్వము నీకు సుఖమురా
నీ శాస్త్రం, నీనిజాయతీ, నీ విద్య నీకు అస్త్రమురా

ఆధునిక పరిజ్ఞానముతో ఆదమరచి అజ్నానివి కాకురా
తొందర పెట్టక, ఆలస్యము చేయక జీవితము గడపాలిరా
అర్ధం కోసం,ఆరోగ్యానికి హాని కలిగే విధముగా ఉండకురా
ఆశయంతో ఎప్పుడు అలుపెరగని మనిషిలా జీవించాలిరా

మీరు కవితలు చక్కగా చెప్పారు, ఇంకా నాకు అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి వాటిని తర్వాత అడిగి తెలుసుకుంటాను, ఇప్పుడు అన్నయ్య గారు షాపుకు వెళ్తారు, మీరు ఇక్కడ రెష్టు తీసు కొండి, అన్నయ్య రాత్రికి వస్తారు.
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.

   ramakrishnamallapragada101

                                                                                            ఇంకా ఉంది

18, నవంబర్ 2014, మంగళవారం

192. Family comedy story -95 (ప్రేమ ఎవరిపై ఉండాలి ?-2)

                ఓం శ్రీ రాం                              ఓం శ్రీ రాం                   ఓం శ్రీ రాం  
                                                                         
       

17, నవంబర్ 2014, సోమవారం

191. Family love story -94 (ప్రేమ ఎవరిపై ఉండాలి ?-1)

ప్రేమ ఎవరిపై ఉండాలి ? (1)
ప్రాంజలి ప్రభ - రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
ఏమిటమ్మా  అలా ఆలోచిస్తున్నావు, దిగులుగా ఉన్నావు, నాగురించా అన్నాడు కన్న కొడుకు కరుణాకర్, నీ గురించి ఆలోచించ టానికి ఏముంది, మరి నాన్న గురించా అట్లా వున్నావు,    నీవు పరద్యానముగా ఉంటె నాకు సంతోషముగా ఉండదమ్మ, నీవు ఆరోగ్యముగా ఉంటే కుటుంబ మంతా  ఆరోగ్యముగా ఉంటుందని ఎక్కడో చదివానమ్మ, నీవు చెల్లెళ్ళ గురించి కాని, నాగురించి కాని, నాన్న గురించికాని ఆలోచించ ఆవసరము  లేదు. కాలమే మన ఆర్ధిక పరిస్తితులను సక్రమముగా మారుస్తుంది.

నేను విడిగా కాపురము పెట్టి ఇంట్లోనుంచి వేల్లానని  అనుకోకమ్మ, నా మనసులో నీవు ఎప్పుడూ ఉంటావమ్మ , ఎటొచ్చి నా భార్య పట్టుదలవల్ల, నా ఆఫీసుకు ఇల్లు దగ్గరవటము వల్ల నేను ఇల్లరికము పోయానమ్మ అంతె, మీ మీద కొపము లేదు, నేను ఎప్పుడు నీ పుత్రున్నేనమ్మ, నాన్న నన్ను పట్టిన్చుకోవటములేదు అందుకే భాధగా ఉన్నది.

అదికాదమ్మ చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా నేను ప్రేమించి  పెళ్లి చేసుకున్నాను, అదే కదమ్మ నేను చేసిన తప్పు, నాప్రేమ నన్ను ఇల్లరికపు అల్లుడుగా మార్చింది. నా భార్య ఉద్యోగము చేస్తుందని భావించా, పెళ్ళికి ముందు చాలా వాగ్దానాలు చేసింది, పెల్లయిన తర్వాత ఉద్యోగము చేయనంది, నాకు బాబు కుడా పుట్టాడు నీకు తెలుసుకదమ్మ, నాకు ఖర్చులు పెరిగాయమ్మ, మావగారు అత్తగారు ఇంట్లోనే ఉంటారు, ఏదో కొద్దిగా ఆస్తి ఉన్నది, నాభార్య ఒక్కతె  కూతురు అందుకే వప్పుకున్నాను, మీకు ఏమి సహాయము చేయలేక పొయ్యాను, కుడితిలో పడ్డ ఎలికలా ఉన్నది అక్కడ నా పరిస్తితి.

చూడు బాబు పిల్లల సంపాదనపై ఎప్పుడు  ఆధార పడలేదు మేము.  ఇప్పుడు నీవు భాద పడ నవసరము లేదు, మీ నాన్నగారు ఇంకా కష్ట పడుతున్నారు మీ నాన్న గారి ఆరోగ్యం గురించే కొంచము భాధగా ఉన్నది. నాన్న గారికి ఎమయినదమ్మ   షుగర్ పెరిగింది, బి.పి. తగ్గింది డాక్టర్ మందులు వాడమన్నారు అవి కొనుక్కొని వస్తానని వెళ్ళారు అందకే ఎదురు చూస్తున్నాను.

ఒక్క నిమిషము ఉండు కాఫీ తీసుకొస్తాను, అని లోపలకు వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, అమ్మ నీవు కాఫీ త్రాగవా అని  అడిగాడు కొడుకు,  నాన్న వచ్చాక త్రాగుదామని ఆగాను, నీవు త్రాగు

అమ్మ చెల్లెలు వచ్చిందని విన్నాను, పలకరించి వెళతాను, అదేమిట్రా నాన్న వచ్చేదాకా ఉండు పలకరిస్తే నాన్న సంతోష పడతారు  కదా అని అన్నది తల్లి సుభద్ర.

ఇంతకీ బావకి ఇవ్వ వలసిన డబ్బు నాన్న ఏర్పాటు చేసారా, నా చదువుకు చేసిన అప్పు  ఆయి పోయిందా, చిన్న చెల్లాయి పెళ్ళికి డబ్బు ఏర్పాటు చేసారా,  ఏమిట్రా ఇన్ని అడుగుతున్నావు, నీ వేమన్న డబ్బులు ఇచ్చెవాడివా, తీర్చే  వాడివా ఎందుకురా ఈ వ్యర్ధపు మాటలు, ఎందుకంటే నాన్న డబ్బులు కోసం తాతగారి ఈ పాత యిల్లు అమ్మితే

మేమేట్లాగమ్మ బ్రతికేది, అయినా నాన్న ఇల్లు  అమ్మాలనుకుంటే నాకు తెలిసినవారు కొంటామన్నారు డబ్బులు ఇప్పుడే ఇస్తారు, బావ అప్పు తీర్చవచ్చు, చెల్లాయి పెళ్లి చేయవచ్చు కదా .

ఎమన్నా మిగిలితే నీకొద్దురా, నేనేమన్నా వద్దన్నాన నీవు ఇస్తానంటే, అసలే నన్ను నాన్న గవర్ణమెంటు  స్కూల్లో చదివించారు,  ఇప్పుడు నా కొడుకును ఇంటర్ నేషనల్ స్కూల్లో చేర్చాలని ఒక్కటే గొడవే పెడుతున్నది మీ కోడలు, స్కూల్ ఫిజు లక్ష  రూపాయలు అవుతాయని అనుకున్నా.

ఏమిటిరా నీవు డబ్బు కోసం వచ్చావా , లేదా మమ్మల్ని చూసి వెలదామను కున్నావా.

ఏదైనా నా ఉద్దేశ్యము చెప్పాను తరువాత నీ ఇష్టం.

నీకు తెలుసుకదా మీ నాన్న బుక్ స్టాల్లో పనిచేస్తున్నాడు, ఆ వచ్చే జీతము తో ఇంట్లో గడవటమే కష్టముగా ఉన్నది. నీ చదువుకోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు. 
                    ప్రేమ ఎవరిపై ఉండాలి ? (2)

నా ఉద్దేశ్యము చెప్పాను మీరు ఆలోచించండి, నేను వెళ్ళొస్తా మరి చెల్లాయిలను  చూడవా,   నాన్న వచ్చేదాకా   ఉండవా.

అది కాదమ్మ నేను ఆఫీసులో చెప్పి  వచ్చాను, వెళ్ళాలమ్మ మల్లి వచ్చి కలుస్తానమ్మ  అంటూ  తండ్రి వస్తున్నా పట్టించు కోకుండా తలవంచుకొని బయటకు నడిచాడు

లోపలకు అడుగు పెడుతూనె ప్రకాశరావు  కుమారరత్నాన్ని లోపలకు ఎందుకు  రానిచ్చావు,  వాడు చేసిన పనికి నేను తల ఎత్తి తిరుగలేక పోతున్నాను,  ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయి ఎమొఖం పెట్టుకొని వచ్చాడే, చిన్నప్పుడు గుండెలమీద తన్నితే ఏంతో  హాయిగా ఉండేది, ఇప్పుడు గుండే నేప్పి తెప్పిస్తున్నాడు, నేను అబ్బాయిని బీ. టెక్, ఎం.  బి.  యె. చదివించాను,  దూరంగా ఉంటె ఎ భాద ఉండేదికాదు, దగ్గరగా ఉంటె  ఎక్కిరించినట్లు ఉన్నది.      

సరేలే మనవాడి గోల ఎప్పుడుండేది, ప్రత్చేకముగా చెప్ప నవసరము లేదు, వాడు మారాడు, వాడి అలవాట్లు మారవు వాడి బుద్ధి మారదు  ఆ దేవుడే మార్చాలి.

 సుమిత్రను పిలివు ముందు  అన్నాడు  ప్రకాశరావు,

అమ్మాయిని   పిలుస్తాను కాఫీ తీసుకొనివస్తాను కాస్త నడుం  వాల్చండి ఆ పడక కుర్చీలొ అని చెప్పి లోపలకు వెళ్ళింది.
     .
నాన్న పిలిచారా అంటూ వచ్చింది,  ఈ రోజే కదా మీ ఆయన వస్తానన్నది అవును నాన్న.

చూడమ్మ భర్త దైవంగా భావించాలి, కష్టమైనా నష్టామైన గుండె నిబ్బరం చేసుకొని కాపురం నెట్టుకు రావాలి, తల్లి తండ్రుల పరిస్తితిని కూడా గమనించాలి, ఏ తండ్రి  కైన కూతురి పరిస్తితిని చూసి భాద మరోవైపు సంతోషము ఉంటుందమ్మ, పిల్లనందరిని సమానంగా పెంచుతారమ్మ.

నీ బట్టలు అన్ని సర్దుకో, ఈరోజే మీ వారు వచ్చాక ఇవ్వ వలసిన పైకము మొత్తము ఇచ్చేస్తాను, ఇక నీవు దిగులు పడే పరిస్తితి ఉండదు సంతోషముగా కాపురము చేసుకో, పండగకు పిలిస్తే తప్ప కుండారా, మమ్మల్ని పిలిస్తే మేము వస్తాము, నీ భర్తను దారిలో పెట్టు కొనే తెలివి నీకు ఉన్నదను కుంటాను,  అదే కావలసినది ఏ  స్త్రీ కైనా. 

ఏమిటి కూర్చోబెట్టుకొని హితభోధ చేస్తున్నారు, ఇదిగో కాఫి త్రాగండి, హితభోదేనా అమ్మాయిని కాపురం పంపించే దేమన్న ఉన్నదా,  పెళ్లి మాత్రం చేసారు అని నవ్వుతూ అన్నది.

 ఎమీ లేదే మనమ్మాయితో  చదువు చదివిన్చ గలము,  పెళ్లి చెయ్యగలము ఆతర్వాత  కాపురము నిలబెట్టు కోవటం మీ చేతుల్లోనే ఉన్నది అని చెపుతున్నాను,  ఇవ్వ వలసిన పైకము అంతా తీసుకొచ్చాను ఈ రోజే ఇచ్చేస్తాను అన్న మాటలకు ఒక్కసారి కూల బడింది.
                                                                                    ఇంకా ఉంది 
                                                                      

ప్రేమ ఎవరిపై ఉండాలి ? (2)

నా ఉద్దేశ్యము చెప్పాను మీరు ఆలోచించండి, నేను వెళ్ళొస్తా మరి చెల్లాయిలను  చూడవా,   నాన్న వచ్చేదాకా   ఉండవా.

అది కాదమ్మ నేను ఆఫీసులో చెప్పి  వచ్చాను, వెళ్ళాలమ్మ మల్లి వచ్చి కలుస్తానమ్మ  అంటూ  తండ్రి వస్తున్నా పట్టించు కోకుండా తలవంచుకొని బయటకు నడిచాడు

లోపలకు అడుగు పెడుతూనె ప్రకాశరావు  కుమారరత్నాన్ని లోపలకు ఎందుకు  రానిచ్చావు,  వాడు చేసిన పనికి నేను తల ఎత్తి తిరుగలేక పోతున్నాను,  ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయి ఎమొఖం పెట్టుకొని వచ్చాడే, చిన్నప్పుడు గుండెలమీద తన్నితే ఏంతో  హాయిగా ఉండేది, ఇప్పుడు గుండే నేప్పి తెప్పిస్తున్నాడు, నేను అబ్బాయిని బీ. టెక్, ఎం.  బి.  యె. చదివించాను,  దూరంగా ఉంటె ఎ భాద ఉండేదికాదు, దగ్గరగా ఉంటె  ఎక్కిరించినట్లు ఉన్నది.      

సరేలే మనవాడి గోల ఎప్పుడుండేది, ప్రత్చేకముగా చెప్ప నవసరము లేదు, వాడు మారాడు, వాడి అలవాట్లు మారవు వాడి బుద్ధి మారదు  ఆ దేవుడే మార్చాలి.

 సుమిత్రను పిలివు ముందు  అన్నాడు  ప్రకాశరావు,

అమ్మాయిని   పిలుస్తాను కాఫీ తీసుకొనివస్తాను కాస్త నడుం  వాల్చండి ఆ పడక కుర్చీలొ అని చెప్పి లోపలకు వెళ్ళింది.
     .
నాన్న పిలిచారా అంటూ వచ్చింది,  ఈ రోజే కదా మీ ఆయన వస్తానన్నది అవును నాన్న.

చూడమ్మ భర్త దైవంగా భావించాలి, కష్టమైనా నష్టామైన గుండె నిబ్బరం చేసుకొని కాపురం నెట్టుకు రావాలి, తల్లి తండ్రుల పరిస్తితిని కూడా గమనించాలి, ఏ తండ్రి  కైన కూతురి పరిస్తితిని చూసి భాద మరోవైపు సంతోషము ఉంటుందమ్మ, పిల్లనందరిని సమానంగా పెంచుతారమ్మ.

నీ బట్టలు అన్ని సర్దుకో, ఈరోజే మీ వారు వచ్చాక ఇవ్వ వలసిన పైకము మొత్తము ఇచ్చేస్తాను, ఇక నీవు దిగులు పడే పరిస్తితి ఉండదు సంతోషముగా కాపురము చేసుకో, పండగకు పిలిస్తే తప్ప కుండారా, మమ్మల్ని పిలిస్తే మేము వస్తాము, నీ భర్తను దారిలో పెట్టు కొనే తెలివి నీకు ఉన్నదను కుంటాను,  అదే కావలసినది ఏ  స్త్రీ కైనా. 

ఏమిటి కూర్చోబెట్టుకొని హితభోధ చేస్తున్నారు, ఇదిగో కాఫి త్రాగండి, హితభోదేనా అమ్మాయిని కాపురం పంపించే దేమన్న ఉన్నదా,  పెళ్లి మాత్రం చేసారు అని నవ్వుతూ అన్నది.

 ఎమీ లేదే మనమ్మాయితో  చదువు చదివిన్చ గలము,  పెళ్లి చెయ్యగలము ఆతర్వాత  కాపురము నిలబెట్టు కోవటం మీ చేతుల్లోనే ఉన్నది అని చెపుతున్నాను,  ఇవ్వ వలసిన పైకము అంతా తీసుకొచ్చాను ఈ రోజే ఇచ్చేస్తాను అన్న మాటలకు ఒక్కసారి కూల బడింది.
                                                                                    ఇంకా ఉంది 
ప్రేమ ఎవరిపై ఉండాలి ? (3)

అమ్మ ఏ మయినదమ్మా అంటూ  నీల్లు చల్లి లేపింది కూతురు సుమిత్ర, ఎమీ లేదమ్మా ఒక్కసారి నీకు ఇవ్వ వలసిన డబ్బు మొత్తం ఇస్తామనే టప్పటి కల్ల సంతోషము పట్టలేక క్రింద పడ్డాను అంతే నాకేమి కాలేదు అంటూ లేచింది.

సుభద్ర ఈ రోజు రాత్రికి ఇంట్లో వంట వండొద్దు,  హోటల్కు వెళ్లి భోంచేసి అలా ఒక సినమా చూసి వచ్చెద్దాము, అప్పుడే రెండో కూతురు కమల లోపలకు వస్తూ నాన్న హోటల్ అంటున్నాడు ఏమిటమ్మ, ఏవేవో మాట్లాడుతున్నారు, నన్ను ఆట పట్టించటానికి అట్లా అంటున్నారు, పెళ్ళైన ఈ ఇరవై ఎనిమిదేళ్ళకు, ఒక్క సినమా, మంచి హోటల్కు తీసికెల్లిన పాపానికి పోలేదు మీ నాన్న .   ఎప్పుడన్నా పోదామంటే  పిల్లల చదువు, పిల్లలు సంతోషము ఉంటె మనము సంతోషముగా ఉన్నట్లే కదా అని నన్ను ఊరడించే వారు.

అవునమ్మా ఎప్పుడు భాదలు ఉండవమ్మా కాలంతో మారి మనం కూడా ముందుకు పోవాలమ్మ అన్న మాటలకు, నవ్వుతూ ప్రకాశరావు పిల్లలు కూడా మనల్ని అనేవారే నే , అదికాదు నాన్న

అవునమ్మా అక్షరాలా నీవు చెప్పింది నిజమే, ఏ వయస్సులో చేయాలస్సినవి ఆ వయస్సులో తల్లి తండ్రులు పిల్లలకు చేయకపోతే పిల్లలపై  ఆధార పడ వలసి వస్తుంది.

చూడు కమల ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి నాకు తెలిసిన  స్నేహితుని కొడుకు, మంచి గవర్నమెంటు ఉద్య్యోగము మొన్ననే వచ్చింది, ఆతను డిగ్రి చదివాడు, నీ లాగ ఇంజనీర్ చదవలేదు అంతే,   నీకు ఇష్టమైతే పెళ్లి  చూపులకు రమ్మనమని చెప్పుతాను.           

ఏమిటండి అమ్మాయికి విడమర్చి చెపుతున్నారు, మీకు నచ్చితే అమ్మాయికి నచ్చి నట్లేకదా అన్నది సుభద్ర.

అవునే పెద్దమ్మాయిని ఒక్క మాట అడగ కుండా పెళ్లి చేసాము,  ఆ తప్పు ఇక్కడ జరుగ కూడదని చెపుతున్నాను

ఇదిగో కమలా ఫోటో వెనుకాల అడ్రస్ ఫోన్ నంబరు ఉన్నాయి.

ఫోటో తీసుకుంటూ నాన్న మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, మీ మాటను ఎప్పుడు జవదాటను అంటూ లోపలకు వెళ్ళింది.

ఏమండి మిమ్మల్ని అడుగుతున్నందుకు కోపం తెచ్చుకోకండి డబ్బులు ఎక్కడ నుండి తెస్తున్నారండి, ఇల్లు అమ్మేస్తున్నారా  అని ఉండ పట్టా లేక అడిగింది సుభద్ర.

ఎందుకే  అంత  పెద్ద ఆలోచన వచ్చింది నీకు,  ఎందు కంటే .... ఎందు కంటే ......   అట్లా నసక్కు అసలు జరిగిందేమిటో  చెప్పు

మనబ్బాయి ఇల్లు అమ్మెట్లయితె వాటా కావాలని గట్టిగా చెప్పి వెళ్ళాడు,  మన అమ్మాయి పెళ్ళిలో గొడవ  చేస్తాడని ముందుగా చెపుతున్నాను

నీవేమి భయపడనవసరము లేదు, మనం నమ్మిన ఆ హనుమంతుడే మనకు ఒక దారి చూపుతాడు, నీవు మనసులో పెట్టుకొని భాద పడకు అన్ని సక్రమముగా జరిగి పొతాయి అన్నాడు భర్త ప్రకాశరావు సుభద్రతో

ఇక నీవు ఎవరి విషయంలో భాద పడ నవసరము లేదు. మున్దోచ్చే రోజులు అన్ని మంచివేనని అనుకుంటూ జీవించాలి అని నీవె గదా అనేదానివి.

అవును హోటల్ గురించి ఎవరూ ముందుకు రాలేదు.

ఎందుకండీ అసలే ఖర్చులో ఉన్నాము, హోటల్కు, సినమాకు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా.

సరే అయితే ఇంటికి కావలసినవన్నీ సామానులు తెచ్చుకోండి, మన కాత షాప్ లో ఉన్న బాకీ మొత్తం తీర్చాను, మీకు కావలసినవన్నీ తెచ్చుకోండి, ఇదిగో ఈ పైకము తీసుకొని అమ్మాయి లిద్దరికి అల్లుడికి, నీకు, బట్టలు కొనుక్కొని రావడానికి మరి షాపుకు కనీసమ్ వస్తారా అని అడిగాడు నవ్వుతూ .

వస్తాము నాన్న ఒక్క పది నిముషాలు కూర్చోండి ఇప్పుడే వస్తాము అని లోపలకు వెళ్ళారు.

అందరు కలసి వెళ్లి మంచి  కొనుక్కొని వచ్చారు.

నాన్న మీకు పట్టు బట్టలు తీసుకొచ్చాము అని చెప్పరు.

మంచిదమ్మా మీరు తెచ్చిన బట్టలన్నీ దేవుడి దగ్గర పెట్టి కుంకము పెట్టి ఎవరకి వారు తీసుకోండి అన్నాడు ప్రకాశరావు.   

 ఏమండి ఈ రోజు నాకు చాలా సంతోషముగా ఉన్నది తెలియపరిచింది సుభద్ర. 

అను  కున్న ప్రకారము అల్లుడు  రావడము అందరు సంతోషముగా ఉండటం, పెళ్ళికి ఇస్తానన్న ఎమౌంట్ మొత్తం

తామ్బూలమ్లొ పెట్టి మరీ ఇచ్చాడు ప్రకాశ రావు.

పెద్దకూతురు అల్లుడు సంతోషముగా కాపురమునకు వెళ్ళారు.

ఇదిగో సుభద్ర మనింటికి మన అబ్బాయి రెండు రోజుల్లో వస్తున్నాడు అందుకని ఇల్లంతా  సుబ్రం చేసి సున్నం వేయించి, తలుపులు రంగు వేయిద్దామని అనున్నాను అన్నాడు.
                                                                                    ఇంకా ఉంది 
ప్రేమ ఎవరిపై ఉండాలి ? (4)

 కావాలి కదా అన్నది సుభద్ర,  ఆలోచించవద్దు, అంత ఆ దేముడే చూసు కుంటాడు, మనం నిమిత్త మాత్రులం. 

ఏమిటో మీ మాట నాకు ఒక్కటి అర్ధం కాలేదు , మంచి పని చేస్తున్నప్పుడు  ప్రశ్న వేయ కూడదని మా అమ్మ చెప్పిన.

ఈ మట్టి బుర్ర అడగక మానదు అంటూ తలను చేతితో కొట్టు కున్నది

ఇదిగో చూడు సుభద్ర తలకొట్టు కోవటం కాదు ఇంట్లో పని చేయించు వచ్చే పని వాళ్ళతో.

అట్లాగేనండి, అమ్మ అన్నయ్య వస్తాడని నాన్న అంటున్నాడు  కమల, అవునమ్మ మీ నాన్న  ఇప్పుడే చెప్పాడు నాతొ

వేస్తున్నప్పుడు  కరుణాకర్ వచ్చి అమ్మ నాన్న డబ్బులు ఎక్కడ తెచ్చాడు, చెల్లాయిని కాపురమునకు పంపాడని తెలిసింది, చెల్లాయి పెళ్లి సంభంధం కుదిరిందా అని అడిగాడు.

అవున్రా బాబు మొన్ననే ఒఅ సంభందం వచ్చింది, వాళ్ళు అమ్మాయి నచ్చిందని చెప్పారు పెళ్లి రెండు నెలల్లో చేయాలన్నారు వారు

కట్నం డబ్బులు ఎక్కడనుండి తెస్తున్నారు నాన్న గారు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా నన్నారుట, నాకేం అర్ధం కావటం లా అంటా అయ్యోమయంగా ఉన్నది.

నీవు నాన్నతో ఇంటికి వస్తానన్నావుట నాతొ చెప్పారు నాకు, నీవు ఎప్పుడు   వస్తున్నావురా అని అడిగింది సుభద్ర కొడుకుతో. 

నే నెట్లా రాగలనమ్మ మా ఆవిడా మిమ్మల్ని చూడటానికి వస్తున్నట్లు  తెలిసిందనుకో నాకు ఆరోజు పస్తేనమ్మ, నా భార్య అదో టైపు.

అమ్మ వీలు చూసుకొని చెల్లాయి దగ్గరకు వెళ్లి వస్తాను,  నా మనసులో అందరు కలసి ఉండాలని ఉన్నది, ఆ చెల్లాయి కమల ఉన్నదా, ఇప్పుడే దగ్గర షాపుకు వెళ్ళింది కూర్చొ వస్తుంది.

అమ్మ నాకు  టైం లేదమ్మా మల్లోచ్చినప్పుడు కలుస్తానులే, మరి నాన్నను కలవవురా, నాన్నను కలవాలని    ఉన్నదమ్మ ఏదన్న అంటాడని భయముగా ఉన్నదమ్మ .

అవునురా మీ నాన్న ఎమన్నా అంటే ఓపికతో ఉండాలి, తండ్రిని గౌరవించాలి,  ఎప్పుడు మీ నాన్న ఊరకనె తిట్ట లేదు కదా, సిగరెట్టూ త్రాగినప్పుడు,. మందు త్రాగినప్పుడు, పిచ్చిగా సినమాలు చూసినప్పుడు తిట్టాడు. నీవు ప్రేమించి పెళ్ళిచేసుకొని వెళ్లి పోతాన్నపుడు ఒక్క మాట కుడా అన్లేదు కదా  అన్నది తల్లి సుభద్రా.

 అప్పులు ఎక్కువచేసానమ్మ , మొదట మా మావగారు తీర్చారు ఇప్పుడు నావల్ల కాదంటున్నారు, నాన్నను కొంత  డబ్బు సహాయము చేయమని నీవు చెప్పమ్మా ఆ విషయమే చెప్పాలని నీదగ్గరకు వచ్చాను అన్నాడు  కరుణాకర్ .

గోనుకుంటూ ఆయనేమో డబ్బు ఎక్కడనుమ్డి తెస్తాడో చెప్పాడు, వీడేమొ డబ్బులు కావాలని అడుగుతాడు తండ్రి కొడుకుల మద్య నలిగిపోతున్న  అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నాబ్రతుకు అని అనుకుంటున్నది, అప్పుడే లోపలకు ప్రవేశించింది కమల.

 చూడు కమల నీ పెళ్ళికి సంభందించినవి చాలా కొనాలి మీ నాన్నేమో అన్నిజరిగిపొతాయి దిగులెందుకు అంటారు. 

అవును కదమ్మా అప్పుడే ఇంటికి రంగులు వేయటం, రూముల్లో ఎ.సి. పెట్టడం, ఫాన్లు కోత్తవి బిగించడం అంతా  కొత్తగా  ఉన్నదమ్మ నాకుకూడా, అమ్మ అన్నయ్య  ఎప్పుడోస్తున్నాడు అని అడిగింది, ఇప్పుడే మీ అన్నయ్య వచ్చివెళ్ళాడు.

వాడు రావటము లేదు, మరి నాన్న అట్లా చెప్పడు కదా అదే నా కర్ధం కావటములేదు.

సరేలే గదిలోకి పొయి  డ్రస్సు మార్చుకో, కాఫీ తెచ్చి ఇస్తాను, ఈరొజు నేను కాఫీ పెడతానమ్మ నీవు కూర్చొ అని కుర్చీలొ కూర్చో పెట్టి లోపలకు వెల్లింది.

అప్పుడే ప్రకాశరావు ఒక కారులో దిగి కారు డ్రైవర్ తో  మీఅయ్యగారిని  అమ్మగారిని  ఇక్కడకు తీసుకురా ఇదే మా ఇల్లు   అని చెప్పి  వేగముగా ఇంట్లోకి నడుచు కుంటూ వచ్చాడు.

సుభద్రా సుభద్రా   పుత్ర  రత్నం  వస్తున్నాడు, త్వరగా ఇల్లు సర్దు, కమల ఉన్నదా లోపల ఉన్నదండి . వెంటనే కమలను మంచి చీర కట్టు కోమను, నీవు కుడా మంచి చీర కట్టుకో వచ్చేది మనబ్బాయే కదా,  ఇవణ్ణి  ఇప్పుడు అవసరమా అన్నది సుభద్ర,   "ఇప్పుడన్నా చెప్పిన  మాట చేయవే" అన్నమాటలకు నోరత్తకుండా ఉన్నది.
                                                                                         
కారు హారన్ మ్రోగింది కారులోనుంది అందమైన 6 అడుగుల అందగాడు దిగాడు లోపలకు వచ్చి సుభద్ర ప్రకాశరావు కు పాదాబి వందనము చేసాడు,  కుశల ప్రశ్నలు వేశాడు, మరల  పెళ్ళికి వస్తానని చెప్పి వెళ్ళాడు.

అమ్మాయి పెళ్లి  ఎప్పుడండి, చెపుతా కూర్చొ, కమల నీకూడ కూర్చొ  ఈనెల 15వ తారీఖున లగ్నం నిర్ణయింమ్చారుబ్రాహ్మణులు, 5  వతారీఖు ఎంగేజ్మేంట్ తాజ్ మహల్ హోటల్లో ఏర్పాటు చేసాను, మనము ఏమి కష్ట పడ నక్కర లేదు ప్లేట్ పద్దతిలో అన్ని మాట్లాడినాను, కొద్దిగా బంగారము బట్టలు కొనుక్కోవటం మీ పని అట్లాగేనండి అన్నది సుభద్ర, అట్లాగేనాన్న అన్నది కమల.

అనుకున్న ప్రకారముగా అమ్మాయి ఎంగేజ్మెంటు, తరువాత పెళ్లి వేగముగా జరిగి పోయాయి,

కమల కుడా అత్తారింటికి కాపురానికి వెళ్ళింది, చివరికి ఇంట్లో సుభద్ర ప్రకాశరావు మిగిలారు

ఏమండి, ఇప్పుడైనా చెప్పండి డబ్బులు ఎక్కడనుంచి తెచ్చారు, మొన్న వచ్చిన అతను, అమ్మాయి పెళ్ళికి వచ్చిన ఆతను మనబ్బాయి  అని చెప్పారు అదేట్లాగండి.

ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్ని వివరాలు త్వరలో చేపుతానులే.

                                                                               ఇంకా ఉంది