31, జులై 2014, గురువారం

166. Criminal Story 70 ( Siksha evariki. ? )

                                ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
                                                                            
శిక్ష ఎవరికీ -?

అమ్మ అంటూ ఇంటిలోకి అడుగు పెట్టాడు కొడుకు శాంతి శ్వరూప్, వెంటనే తల్లి నీకు ఎన్నో సార్లు చెప్పాను  షూస్ విప్పి కాల్లుకడుక్కొని లోపలకు రమ్మనమని అది ఎట్లా మర్చి పొతే ఎలా బాబు, నీవు బయట ధర్మాన్ని రక్ష్మిచే  పొలీస్ ఆఫిసర్వి అయి  ఉండ్డొచ్చు నాకు నా ముద్దుల కృష్ణుడవు అన్నది తల్లి.

అమ్మ నన్నుదీవివించు అని తల్లి పాదాలకు  నమస్కారము చేసాడు. నీ  వృత్తిని ధర్మంగా భావించి బ్రతుకు బాబు అని దీవిమ్చిమ్ది తల్లి.

అంతలో డ్రైవర్ ఎవరికో ఫోన్ లో చెపుతున్నాడు తల్లి వింటుంది.

అయ్యగారు విరోధులకు చండ శాసనుడు, వృత్తి అంటే ఏంతో  గౌరవము, ఎక్కడ అన్యాయము జరిగిన అక్కడకు వచ్చి పరిష్కార మార్గము చూపెవాడు, దుర్మార్గులను, దుండగులను, దొంగలను తన తెలివితో పట్టుకొని కోర్టులో హాజరు పరిచి వారికీ తగిన శిక్ష విదిమ్చుటకు సహకరిమ్చేవాడు, ప్రతిఒక్కరు పిలవగానే వచ్చే ఆఫీసర్ అని,  న్యాయానికి అన్యాయము జరుగ కుండా కాపాడే వాడని అందరి నమ్మకము,  ప్రజల నమ్మకము వమ్ము చేయకుండా ప్రవర్తించేవాడు మా ఆఫీసర్  అని అన్నాడు.

చూడు " శాంతి శ్వరూప్ "  బయట  నీ గురిమ్చి  గొప్పగా  ఎవరికో  చెపుతున్నాడు  మీ డ్రైవర్ మన గురించి వేరొకరు చెప్పాలి కాని మనవారు చెప్పకూడదు అన్నది తల్లి.  అమ్మ చెప్పిన మాటలు విన్నావుగా నీవె ఎప్పుడు ఇట్లా మాట్లాడకు అని అన్నాడు శాంతి శ్వరూప్, అట్లాగే సార్  మరెప్పుడు మాట్లాడను అంటూ సాల్యుటు చేసాడు డ్రైవర్.

చూడు  బాబు ఎంత నిజాయితీగా పనిచేసిన కొన్ని సమయాల్లో మీరు నిర్దోషులను, దోషులుగా,  చిత్రీకరిస్తున్నారు  మనం చేసే ప్రతి పని అందరు మెచ్చు కుంటారని అనుకోకు , కొందరు తిట్టు కుంటారు అని గమనించు . అవేశమునకు పోకుండా ఆలోచనతో     
వృత్తికి న్యాయం చేయు బాబు .

అమ్మ ఈరొజె ఒక  కేసు వచ్చింది. అది  ఒక పేరున్న డాక్టర్ అనుకోకుండా చనిపొయాడు, వారిని హత్య   చేసారని కొందరి అనుమానము, కాని ఎటువంటి ఆధారాలు దొరకలేదు అన్నాడు.

తల్లి ఆ డాక్టర్ వృత్తి ధర్మాన్ని వదిలి డబ్బు కోసం కొందరిని తెలిసి హత్య   చేసి ఉంటాడు, ఎవరో కడుపు మండి  అతన్ని చంపి ఉండొచ్చు కదా అన్నది.

ఆ డాక్టర్ చాలా మంచివాడమ్మ కొడుకు చనిపోయిన కర్మ కాండ చేస్తూ కూడా ఆపి,  అర్జంటు గా ఒక ఆపరేషన్  వచ్చిచేసాడు, కన్న కొడుకుని బ్రతికిమ్చుకోలేక పోయిన ఆపరేషన్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడ గలిగాడమ్మా అన్నాడు.

డబ్బు అనేది ఎంత పనైనా చేస్తుంది. ఒక ప్రాణం తీయవ చ్చు, ఒక ప్రాణాన్ని బ్రతికించా వచ్చు ఆ డబ్బును ఉపయోగించు కొనే వానిని బట్టి ఉంటుంది.

అవునమ్మ నీవుచెప్పినది నూటికినూరు పాళ్ళు ఖచ్చితం.

మన ప్రబుత్వం వారు కూడ చావుకు, చావుకు మద్య వ్యత్యాసము చూపిస్తున్నారు. కుటుంబానికి ఉద్యోగమూ ఇస్తామని ఒకచోట చెపుతున్నారు కాని ఏదిచ్చిన పోయిన ప్రాణాన్ని కాపాడ లేక పోతున్నారు. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు ఒక్క సారి ఉలిక్కి  పడి కారణాలు వెతుకుతున్నారు చనిపోయిన ప్రాణాలు బ్రతిమ్చ లేని మనుష్యులు. అవునమ్మ అది నిజమే అన్నడు శాంతి శ్వరూప్. 

తల్లి అన్నది అసలు ప్రాణానికి డబ్బుతో విలువ కట్టడమే తప్పు... అందులోనూ సందర్భానికి ఒకలా.. ఒక్కొక్కరికీ ఒక్కోలా వెల కడితే .. అది మరీ తప్పు. చాన్నాళ్ళుగా దేశంలో, రాష్ట్రంలో అదే జరుగుతోంది. అతి దగ్గరి ఉదాహరణలు తీసుకుంటే., ఒరిస్సా బార్డర్ర్లో పొలీసులు యెన్కౌంటర్ లో చనిపోతే వారి కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చారు,  పోయిన ప్రాణాలను తేలేక  పోయారు . "కులు" దగ్గర నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులకి అయిదు లక్షలు... తూర్పు గోదావరి జిల్లా నగరంలో గ్యాస్ మంటలకి ఆహుతి అయిన వాళ్ళకి సుమారు పాతిక లక్షలు, మొన్న మూసాయి పేట లో బలైపోయిన చిన్నారి ప్రాణాలకి  ఐదు  లక్షల వంతున ప్రభుత్వాలు వెల కట్టి పరిహారం ప్రకటించాయి. ఇక్కడ నేను చెప్పిన అంకెల్లో ఏవైనా తేడాలు ఉండొచ్చు గానీ ఆయా సందర్భాల్లో ప్రకటించిన పరిహారాల మధ్య వ్యత్యాసం మాత్రం సత్యం. గతంలో జరిగిన అనేక ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల మరణాల్లో కూడా ఇలాంటి తేడాలు అనేకం జరిగాయి. ఎందుకీ తేడాలు? ఏ ప్రమాదంలో, ఏ ఉత్పాతం లేదా వైపరీత్యంలో మరణించినా ప్రభుత్వం ఒక్కటే పరిహారాన్ని ప్రకటించాలి. ఒక్కో చావుకి ఒక్కో అంకె ప్రకటించడం దారుణం. బతుకులో ఎలాగో సమానత్వం లేదు.. కనీసం చావులోనైనా దానిని చూపే ప్రయత్నం జరగాలి. ఎర్ర బస్సు ప్రమాదంలో చనిపోయినా, ఎయిర్ బస్సు ప్రమాదంలో పోయినా ఒకే పరిహారం ఎందుకు ఇవ్వలేము?

చూడు బాబు బ్రతికున్నవారు చనిపోయిన వారి తీపి గుర్తులు అని ఎవరో కవి వ్రాసారుట అందుకే నేను అంటున్నాను చనిపోయిన వారి కుటుంబాలకు తగిన సహాయము వెంటనే చేయక పొతే చేయటానికి నీ వంతు ప్రయత్నం చేయు బాబు అన్నది.    

చాలా మంది నన్నుడబ్బుతో  లొంగ తీయటానికి   ప్రయత్నిమ్చారు.  వారి మాటలకు  డబ్బుకు లొంగ కుండా జాగర్త పడ్డాను అన్నాడు.

ప్రతి ఒక్కరి మనసులో పట్టు విడుపులు ఉంటాయి . దానిని  బట్టి పోయవారు దేశంలో బ్రతక కలుగుతారు. మూర్ఖమ్గా పొతే కన్నబిడ్డలకు, కుటుంబానికి హాని చేసిన వారవుతారు, అది మాత్రం గమనించి ప్రతి ఒక్కరు బ్రతకటానికి ప్రయత్నించాలి అన్నది తల్లి                     

అమ్మ నీ మాటలు అన్యాయాన్ని ఎదిరించ వద్దన్నట్లు ఉన్నాయి, అన్యాయాన్ని ఎదిరించాలి, తగిన ఆధారాలు దొరికినపుడే జైల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. మీరు చేసే ఇన్వ ష్టు గేషన్ ఎవ్వరికి తెలియకుండా జాగర్త పడాలి. మనలో ఉన్న మన మనుషులే   వేరొకరికి సహకరించి నిన్ను ఇరకాటంలో పెట్ట వచ్చు అందుకనే  జాగర్త పడాలన్నా అంతె.

అంతలో ఫోన్ వచ్చింది పోలిస్ స్టేషన్ నుండి

అమ్మ నేను ఇప్పుడే వేల్లోస్తాను డాక్టర్  గారి కేసు వివరాలు కొత్తవి దొరికాయట, వాటిని బట్టి నేరస్తు డెవరో తెలుసుకుంటాను అని చెప్పిబయటకు  నడిచాడు శాంతి శ్వరూప్.

తల్లి అను కుంటుంది, ఎం ఉద్యోగమో ఏమో,. వేలకు తిండి లేదు, నిద్ర లేదు, అంటూ ఇంట్లోకి నడిచింది తల్లి.

మూస పేట వద్ద చిన్న పిల్లలు చనిపోయిన సందర్బముగా శాంతి యాత్ర చేస్తున్నారు చిన్న పిల్లలు ఇప్పటికైనా మా ప్రాణాలతో ఆడు కోకండి అన్నరు చిన్న పిల్లలు, "నిర్లక్షంగా త్రాగి, ఫోన్ తో  నడుపుతూ నడిపే డ్రైవర్లను శిక్షిమ్చండి "." రైల్వే లైన్ గేటులు లేనిచోట్ల గేటులు, అవసర మైతే బ్రిడ్జులు ఏర్పాటు చేయండి" అని స్లోగన్ బోర్డుసుతో మౌనంగా నడుస్తున్నారు.

శాంతి శ్వరూప్ ఎటువంటి గొడవలు జరగ కుండ ఎక్కడ కక్కడ పొలీసులు బందోబస్తు ఎర్పాటు చేసారు.

హైకోర్టు జడ్జి గారి కారు యదావిధిగా కోర్టుకు బయలు దేరింది, ముందొక పొలీస్ వ్యాన్, వేనుకోక పోలీసు వ్యాన్ బయలు దేరాయి

కోర్టు ఆవరణలో అనేక మందిలాయర్లు నల్లకోటు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నారు కొందరు, మరి కొందరు కోర్టులో హాజరు పరిచే కాగితాల గురించి అడుగుతున్నారు. అప్పుడే జడ్జి కారు కోర్టు అవరణ లోకి వచ్చి ఆగిమ్దొలేదో ఒక్క సారిగా పెద్ద శబ్దమ వచ్చింది. జడ్జి గారు ఎక్కిన కారు అద్దాలు పగిలి పోయినాయి కాని ఎవ్వరికి ఎటువంటి గాయాలు తగలలేదు. జడ్జిగారు పొలీస్ బందోబస్తులో నెమ్మదిగా కారు తలుపులు తీసి రక్షణతో లోపలకు పంపించారు.

లోపలకు వెళ్లి ఈ రోజు కెసులన్నివాయిదా వేస్తున్నా అని  లిఖించి, కొన్ని రోజులు సెలవు తీసుకొని,  వెంటనే వెనుతిరిగారు జడ్జి గారు.

ఆవరణలో ఉన్న ఒక కారులో ఎవరో బాంబు  పెట్టారు దాని వళ్ళ కోర్టు ఆవరణలో బయాన్దోలనకు గురిచెందారు, అక్కడ ఉన్న అందరు. ఎవ్వరికి ఎటువంటి హనిజరుగలేదు.

బాంబులు ఎందుకు పెట్టారు, ఎవ్వరిని ఉద్దెసిమ్చి పెట్టారు, తెలుసుకొనే పని పొలీసు వ్యవస్తపై పడింది. వారి అన్ని విదాల పరిసిలిస్తున్నారు. నేరస్స్తులను త్వరలోనే పట్టుకొని మేము కోర్టులో హాజరు పరుస్తామని పత్రికా విలేకరులకు చెప్పారు.

ముందు జాగర్తగా 144 సెక్షన్ ఏర్పాటు చేసారు,

అప్పుడే టివి. అన్ చేసింది శాంత శ్వరూప్ తల్లి శాంతమ్మ. ప్రముఖ  డాక్టర్ రావ్ గారి మరణము స్వచ్చంద మరణముగా డాక్టర్లు నిర్ధారించారు,  ఇది ఎటువంటి హత్య కాదు. డాక్టర్ కు సహజమైన బలహీనత త్రాగుడు ఆరోజు రాత్రి మోతాదు  మించి త్రాగటం వళ్ళ ఆయన హార్ట్ బీట్ పెరిగిందని, షుగర్ ఎక్కువగా ఉన్నదని, బి. పి పెరుగుట వాళ్ళ చని పోయినట్లు నిర్ధారించారు.

మరో ముఖ్య మైన విషయము కోర్టులో బాంబు ప్రేలడం కలవరం ఏర్పడింది.  కారులో పెట్టింది బాంబులు కాదని కేవలము డైనమిక్ తాడు బాంబులు కొన్ని కలిపి ఎవరో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎవరు ఏర్పాటు చేసారో త్వరలో తెలుసు కుంటామని పొలీసు వారు తెలియ పరిచారు.  ఎంక్వయిరీలొ దీపావళి సామాను ఒక బురఖా వేసుకున్న స్త్రీకి అమ్మినట్లు చెప్పారు.  త్వరలో ఆస్త్రి ఎవరో తెలుసు కుంటామని చెప్పారు పొలీసువారు.

గవర్నర్  పిలుపు మేర పోలిస్  ఆఫీసర్ శాంతి శ్వరూపు కలిసారు. అతని చేతికి ఒక ఆకాశ రామన్న ఉత్తరం ఇచ్చారు. దానిలో డాక్టర్ చావుకు, కోర్టులో బాంబు పెట్టడం గురించి నాకు తెలుసు మీరు అనుమతిస్తే నేను కోర్టులో అన్ని వివరాలు తెలియ పరుచగలను. ఇది నా సెల్ నెంబరు దీనిని బట్టి తెలుసుకొని నిజం చెప్పేందుకు  నాకు అవకాసము ఇవ్వాలని కోరుతున్నాను. అవివరాలు తప్ప ఏమి లేవు దానిలో.

వెంటనే ఆ ఉత్తరము సంబందించిన కొన్ని  వివరాలు త్వరలో తెలుసుకొని మరల మిమ్మల్ని కలుస్తాను, ఈ విషయము సీక్రేటుగా వివరాలు సేకరించండి మీకు ప్రత్యేకముగా చెప్ప నవసరము లేదు కదా అని అన్నారు. నమస్కారము పెట్టి బయటకు వచ్చాడు.

ఆ ఉత్తరములో ఉన్న ఫోన్ నెం. తన దగ్గర ఉన్న సీక్రేట్ నెంబరు.

ఎవరో ఈ నెంబరు వ్రాసి నన్ను దోషిగా నిరూపిమ్చాలని ప్రయత్నిమ్చి  ఉంటారు.

ఈ నెంబరు మా అమ్మకు తప్ప వేరేవరకు తెలియదు, ఈ ఉత్తరం వ్రాసింది  అమ్మ కాదుకదా అని అలో చిస్తున్నాడు శాన్తిశ్వరూప్.

వెంటనే ఇంటికి వెళ్ళాడు అమ్మ నీ ఆరోగ్యము ఎలా ఉన్నది, నేను ఉద్యోగ ధర్మగా నేను ఆలస్యముగా రావటం ఎంతోకొంత  తినడం  జరుగు తున్నది. అసలు ఇంట్లో అన్నివస్తువులు ఉన్నాయో లేవో అడిగే సమయము లేదునాకు. అమ్మ మన ఇంట్లోకి  కావలసినవి నవి వెంటనే తెస్తాను. ఒక కేసు నిమిత్తము ఒక వారము దాక ఇంటికి రాలేను అన్నాడు.

ఎందుకూరా  బాబు ఇంటినిండా వర్కర్లు ఉన్నారు వారే తెస్తున్నారు, నీకు అంత  శ్రమ అక్కరలేదు అన్నది.

సరే నీ ఇష్టం అంటూ లోపల గదిలోకి పోయాడు శాంతి శ్వరూప్.

ఇల్లు మొత్తం వెతికాడు శాంతి శ్వరూప్ , ఎక్కడ ఏమి ఆధారాలు దొరకలేదుమరి అమ్మ నా నెంబరు ఇవ్వలేదు వేరేవారు ఇచ్చి ఉంటారు అనుకోని బయటకు నడవ లనుకుంటూ కిటికి దగ్గరకు వచ్చాడు. అక్కడ వెంకటరమణ క్యాలండర్ మీద కొన్ని అక్షరాలూ గమనించాడు. డాక్టర్ రావు అని ఉన్నాయి. కనుక ఉత్తరం వ్రాసింది అమ్మ అని నిర్ధారణ చేసుకున్నాడు కొడుకు.

తల్లి  నడగ కుండా నేరుగా గవర్నర్ వద్దకు పోయి,  నేరుగా కోర్టులో హాజరు పరచడానికి అనుమతి కోరాడు

అమ్మ నీవు కోర్టుకు రావాలి, డాక్టర్ హత్య, జడ్జిపై హత్య ప్రయత్నం నేరాల క్రింద ఒక వ్యక్తి లొంగి పోయాడు. నీవు కూడా  చూస్తె బాగుంటందని వెలదామన్నాను.

నీ పొలీసు బుద్ధి పోనిచ్చావు కాదు, అమ్మ నీమీద అనుమానం ఉన్నది కోర్టుకు హాజరు అవ్వమంటే  నేను రానా బాబు, ఈ తల్లి హృదయం ఎప్పుడో పాషాణంగా మారింది.

నీకు అనుమానం వద్దు  అన్ని వివరాలు కోర్టులో నేను నిజమే చెపుతానని అబద్దమాడను  భగవత్ గీత  మీద ప్రమాణము చేసి నీకు ముందు చెపుతున్నాను అన్నది.

అవునమ్మ తప్పు చేయనివారు శిక్ష  పడ కూడదని చెప్పిన నీమాటలు, నాకు  గుర్తు కొస్తున్నాయి .

నేను తప్పు చేయలేదని నీవు ఎట్లా చెప్పగలవు. కోర్టులో అన్ని వివరాలు తెలుస్తాయి  కదా నేను తప్పు  చేసానో లేదో తెలుసుకోగలవు అన్నది.   

కోర్టులో తల్లిని హాజరు పరిచాడు కొడుకు

తల్లిని పిలవగా కోర్టు బోనులో నిలబడి ప్రమాణము చేసినది.

లాయర్ : అమ్మ మీరు సంమ్పూ ర్ణ ఆరోగ్యముగా ఉన్నారా అని  

               అడిగాడు.

తల్లి:     : డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్  మరియు నా ఆరోగ్యము కొరకు నేను 

             వాడే మందులు ఇందు పొందు  పరిచాను మీకు
             అనుమానము ఉంటె చూడన్డి  అన్నాది.            

లాయర్ : డాక్టర్ గారికి మీకు సంభందం  ఏమిటి అన్నాడు.

తల్లి      : అది పదిహేను సంవస్చరాల సంభందం

లాయర్ : మీ భర్త చనిపోయిన తర్వాత సెకండ్ సెటప్ గా ఉన్నారా.     

తల్లి      : లాయర్ గారు మీరు వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం 

             నేర్చుకోండి, ఒక భారత స్త్రీని ఆవిధముగా ప్రస్నిమ్చటం  
             ఎంతవరకు    సమంజసం అలో చించండి.

లాయర్ : క్షమిమ్చండమ్మ మిమ్మల్ని అలా అడగటం తప్పే, డాక్టర్  

               చావుకు మీకు తెలిసిన విషయం చేపుతానన్నారు
              అవిషయాలు   తెలియపరచండి చాలు అన్నడు.

తల్లి      :  డాక్టర్ గారు వట్టి త్రాగుబోతు, ఆయన ఎంతోమంది ప్రాణాలు 

              తీసాడు, అయన  బ్రతికుంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు
              పోతాయోనని నేనే చనిపోయే మార్గం చూసి నేను చంపటానికి 

               ప్రయతించాను, చనిపోతానికి డాక్టర్ కారకుడు అన్నాది.

లాయర్ : మీరు చెప్పేది  వివరంగా చెప్పండి అన్నాడు.

తల్లి      : డాక్టర్ దగ్గర పనిచేసే ఒక నర్సు నాకు బాగా తెలుసు, ఆ 

             నర్సుకు డాక్టర్ పై విపరీతమైన కోపము అమె కూతురుని
             కడుపు నెప్పిగా ఉన్నదని ఆపరేషన్ చేయమని డాక్టర్  కాళ్ళ 

             వేల పడింది ముందు డబ్బులు కడితెగాని నేను చేయనని
             మొండి కేసి త్రాగటం మొదలు పెట్టాడు హాస్పటల్లో. ఆమె  

             కూతురు గిలగిల కొట్టుకొని ప్రాణాలు విడిచింది.
             డాక్టర్ చనిపోయేముందు ఆమెను కలిసాను. డాక్టర్ షుగర్ 

             పేషంటు రోజు తానె ఇన్సులేన్   ఇంజక్షన్ చేసుకుంటాడు.
             ఆ చిన్న దారినిబట్టి నేను ఆమె ఇచ్చిన మత్తును పెంచే 

             ఇంజక్షన్ ఆయన చేసుకొనే వాటిలో పెట్టాను అతి కష్టం
             మీద అదే ఇంజక్షన్ చేసుకోవటం చనిపోవటం జరిగింది.

లాయర్   : ఈమె చెప్పినవన్నీ రికార్డుచేసుకోండి, అన్నాడు.

లాయర్   : అమ్మా మీరు జడ్జిని చంపుటకు  కారణమేమి అని 

               అడిగాడు                   

తల్లి        : మీరు " చంపుటకు " అనే పదము వాడుట  మంచిది కాదు  

               అన్నది.

లాయర్  : క్షమిమ్చంమ్మా, మీకు తెలిసినవి చెప్పండి కోర్టుకు

తల్లి       : జడ్జిగారు భయ పడేందుకు ముందు కారులో దీపావళి 

              టపాసులు పెట్టించాను, అవి పెలాయి అన్నది.

లాయర్  : ఈమె  చెప్పిన మాటలు అన్ని విన్నారు, ఈమె శిక్షార్పురాలు  

                అనినేను నమ్ముతున్నాను అన్నాడు.

జడ్జి       : వీరిద్దరిని మాత్రమె  శిక్షిమ్చుటకు బలమైన కారణము ఏదో  

               ఉన్నది, ఆ కారణం కోర్టు వారికి తెలుపగలరు అని తల్లిని
              కోరాడు.

               కోర్టుకు టైం అవటం వళ్ళ రేపటికి వాయిదా వేసారు.

              పత్రికా విలేఖరులు అందరు కోర్టులో చెప్పిన వణ్ణి  వ్రాసుకొని పతాక   శీర్షికలొ వేసారు.


ఇక్కడ ఉన్న ప్రతిఒక్కరికి నా నమస్కారములు, నేను చెప్పేది జరిగిపోయిన కధ, ఈ కధ ఒకనాడు కోర్టుకు వచ్చి వాదోపవాదులు జరిగి ఫైల్ ఎమూలకు పోయిందొ  మాత్రము నాకు తెలీదు.   
నేను మావారు పురుషోత్తం గారు గుంటూరు నుండి ఇక్కడకు వచ్చి బ్రతుకు తెరువుకోరకు కొటీశ్వరుడైన  కోటేశ్వర రావు అనే వ్యాపారి వద్ద  మావారు డ్రైవర్ గా, నేను పనిమనిషిగా చేరాము, కోటేశ్వర రావుగారు రెండో పెళ్ళిచేసుకున్నారు పెద్ద వయసులో.
ఒకరోజు తెల్లవారుజామున కోటేశ్వర రావుగారు పెద్దగా అరవటం విన్నారు పురుషోత్తం గారు. వెంటనే లోపల చూడగ కొడుకు మరొకరితో కలసి దస్తా వెజ మీద సంతకము పెట్టమని బలవంతము చేస్తున్నారు.  అప్పుడే తలుపు కొట్టారు మావారు. బలవంతం మీద తండ్రి  కొడుకు గుంజు కోవటంలో కొడుకు చేతిలో ఉన్న క త్తి గుండెలో దిగి   కోటేశ్వర రావు గిలగిల కొట్టుకుంటూ క్రింద పడ్డారు. వాళ్ళు తలుపు  తీసుకొని బయటకు పరుగెత్తారు అప్పుడే మావారు కొటేశ్వరరవును బ్రతికించాలని  వెంటనే బుజాన వేసుకొని దగ్గర ఉన్న హాస్పటల్లో చేరిపిమ్చారు.
కొడుకే స్వయాన మనాన్నగారిని డ్రైవర్ చంపేసాడు అని కేసు పెట్టాడు. అప్పుడే నేను హాస్పటల్కు చేరాను, మావారిని పొలీసులు పట్టుకేల్లారు, అయ్యగారు ఎలావున్నరో చూడాలని లోపలకు వెళ్లాను అప్పుడే డాక్టర్  కు ఫోన్ వచ్చింది మీ వాట  మీకు వస్తుంది , పేషంటు  బ్రతక కూడదు అని.
పేషంటు ఎవరా అని చూస్తె కోటేశ్వర రావుగారు ఆక్సిజన్ సిలెండర్ ఎక్కిస్తున్నారు, నేను అద్దాలనుండి  చూస్తునే  ఉన్నాను ఆక్సిజన్ వేగం పెంచి బయటకు వచ్చి నర్సు పేషంటు పరిస్తితి సీరియస్ ఉన్నది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నాడు.
నర్సు లోపలకు పోయి పేషంటు చనిపోయారండి అని చెప్పింది.
డబ్బుకోసం కక్కుర్తి పడి  నిండు ప్రాణాలు తీసిన ఆడాక్ట రే ఈ డాక్టర్ రావు గారు. ఇంకా ఎన్నో ప్రాణాలు తీసినట్లు తెలుసుకున్నా అందుకే చనిపోవటానికి మార్గం చూసాను.
నేను జడ్జిగారిని భయ పెట్టడానికి ఒక కారణము ఉన్నది.  ఇప్పుడున్న జడ్జినే ఆనాడు లాయర్ కోటేశ్వర రావు కొడుకు దగ్గర లంచం తీసుకొని మా వారికి  ఉరిశిక్ష వెసే విధముగా వాదోపవాదాలుచేసాడు.
నేను చంపలేదని నెత్తి నోరు మొత్తుకున్నా ఎవ్వరు పతిమ్చుకోలేదు, అప్పుడున్న జడ్జి వాదోపవాదాలు విన్న తర్వాత ఈ హత్య పురుషోత్తమ రావే చేసినట్లు నేను నమ్మవలసి వస్తున్నది ఒక మనిషి హత్య చేసినందుకు 302 సెక్షన్ ప్రకారముగా ఉరి శిక్ష  అని చెప్పాడు జడ్జి
ఆమాటలు వింటూనే  మావారు బొనులొనె ప్రాణాలువదిలారు.   ఒక భయముతో చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఆలాయర్ వాళ్ళ ఈ చావు జరిగిందని భయం కలిగిమ్చాలనినేను అనుకున్నాను.
ఒక నేరము చేసిన, నేరస్తునికి  సహకరించిన ఈ లోకంలో  బ్రతకటం కష్టం, అందుకనే నేను ఈ లోకలో బ్రతకాలని అనుకోవటంలేదు అంటూ నోటిలో విషం కుమ్మరిమ్చుకోన్నది. ఆ బాటిల్ నేలపై  పడింది,   నెలకు వరిగి పోయింది.
అమ్మా అమ్మా అంటూ శాంతి శ్వరూప్ వేగంగా తల్లి దగ్గరకు చేరాడు
బాబు ధర్మాన్ని రక్షించు అధర్మాన్ని ఎదురిమ్చు ,  మృత్యు దేవత వాకిట ముందే ఉన్నది నన్ను పిలుస్తున్నది అని కన్ను మూసింది   ఆ బంగారు తల్లి
జడ్జితో  సహా అందరు నుమ్చొని  అమెకునివాళ్ళుఅర్పించారు.                      

                                 

1 కామెంట్‌: