1, ఆగస్టు 2014, శుక్రవారం

167. Devotional Story 71 ( Om Srinivasayanama:)

శ్రీ రాం .. ఓం శ్రీ రాం ... ఓం శ్రీ.రాం                                                  ప్రాంజలి ప్రభ 

ఎందఱో మహానుభావులు శ్రీ శ్రీనివాసుని ప్రార్ధించి ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది, దేవుని కృపకు పాత్రులు అయినట్లు మనకు తెలుస్తున్నది, నాలో మెదిలిన భావాలను అక్షర రూపములొ స్వామివారిని కీర్తిస్తు ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని చదివినవారు ప్రతి ఒక్కరు ఆ స్వామివారి కృపకు పాత్రులగుదురు,  ఆస్వామివారు నా మనసున ప్రవేసించి తెలుపగా నేను వ్రాయుట జరిగింది. మీరు చదివి ఇతరులను చదవమని ప్రోచహిమ్చిన మనస్సాంతి,  ఆరోగ్యము బాగుండగలదని, ఐశ్వర్యము పొందగలరని, ఆ స్వామివారి పై  నమ్మకముతో నేను చెప్పు చున్నాను.  మొక్కులను తీసుకొని మనకు ఆనందం పంచే శ్రీ శ్రీనివాసుడు ( శ్రీ వేంకటేశ్వరస్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా )
  
నా ప్ర్రార్ధనలు ఆలకించు శ్రీ శ్రీనివాస

1. జయవిజయలను తప్పించుకొని నిన్ను చేరాలను కున్నాను
    నిన్ను, అమ్మని,  ప్రార్ధించి మీ పాదాలు పట్టాలను కున్నాను
    వైఖున్టంలో ఉండి నిను ప్రార్దిమ్చుతూ ఉండాలను కున్నాను
    అందరికి తండ్రివి నీవు, నాకు మాత్రం నీవు శ్రీ శ్రీనివాసుడవు   

2. నా  అంతరంగం నవనీతానికి ప్రతి రూపంగా   నీపై  ఉంటుంది
    నామనసు పుణ్య భావాల మందిరమై అలరారుతూ ఉంటుంది
    నాకు ఆపదలలోఉన్న వారిని ఆదుకోవాలని తపన  ఉంటుంది
    కర్మభంధములను నుండి శ్రీ శ్రీనివాస నీగుడి లొ ఉండాలని ఉంది3. బృగు  మహర్షి  పాదాలను  పట్టి  గర్వము అనిచావు
 లక్ష్మిదేవికోసంలక్ష్మీలక్ష్మీఅనివిలపించావు                                                                                              
    అలసిపోయి వల్మీకంలో ఉండి ఆవుపాలు త్రాగినావు
    నేను నిత్య నైవేద్యములతో కొలిచే శ్రీ శ్రీనివాసుడవునీవు
                                                                                  
 4. నాకు సమయస్పూర్తి  లేక  కొందరికి బందీ  నయనాను
    కాలచక్రం తెలుసు కోలేక కొందరి చేతులో నలిగి పోయాను       
    నా మనసు సూర్య- చంద్రులుగా  తిరిగి నలిగి పోయాను
    అయినా శ్రీ శ్రీనివాస  నీ  మీద భక్తిని వదల లేకున్నాను

5. నా కను పాపలో ఉన్నావు, నిన్ను నే చూడ లేకున్నాను
    కొండలపైన ఉన్న సీమలో ఉన్నావు నే నెక్క లేకున్నాను
    నారాతను నిన్ను సే వించెవిధముగా మార్చమంటున్నాను
    మేఘంలా వచ్చిశ్రీ శ్రీనివాసా నిన్ను సుబ్రపరచాలనుకున్నాను  

6. భూమి ఆకాశం మధ్య నేనునలిగి పోయే మనిషిని నేను
    సముద్రపు వడ్డున పడి  గిల గిల లాడిన చాపను నేను
    చీకటి వెలుగులలో నీ రూపాన్ని చూడాలను కున్నాను
    నా మనసు అర్ధం చేసుకో శ్రీ శ్రీనివాస నే మ్రోక్కుచున్నాను  

7. కళ్ళు మూసి తెరిచే లోపు మాయను తొలగించు
    నాలుకపై లలాజల ముండే వరకు నన్ను రక్షించు
    పాదాలతో భూమిని తట్టుచున్నాను నన్నుక్షమించు
    నా శిరస్సుతో నీ పాదాలకు మ్రోక్కుచున్నాను శ్రీ శ్రీనివాస

8. ప్రతి రేయి  కలలు  కంటాను,  నీ ఏడు కొండలు ఎక్కి రావాలని
    ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను, నిలబడి దీవిస్తున్నావని
    ప్రతి నిమిషం నిన్నే తలుస్తున్నాను,  కష్టాలు  కడ  తెరుస్తావని  
    ప్రతి రాత్రి  తపిస్తున్నాను శ్రీనివాస,  నీ పాదాలను పూజిమ్చాలని

9. జ్ఞానమనే నలుసంత కాటుక పెట్టి అజ్ణానాన్ని తొలగిమ్చు వాడవు
    ప్రతి హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడవు 
    హృదయ క్షేత్రములో ఆద్యాత్మిక బీజాలను దృడ పరిచిన వాడవు
    జీవితరధాన్ని దైవమార్గంలో నడిపించి మోక్షాన్ని అందించే శ్రీ శ్రీనివాసుడవు
                                                                  
10. అర్ధిస్తూ, అలమిటిస్తూ,  జ్ఞాణ బిక్షను  కోరుతున్నా
     విలపిస్తూ, అన్వేషిస్తూ, ధర్మ   భిక్షను కోరుతున్నా
     భవ భందాలను వదల  లేక నిన్నే వేడుకుంటున్నా
     సతీ సమేతముగా నిష్టతో కీర్తిస్తున్నాము శ్రీ శ్రీనివాస

11. లోక మొక రంగస్థలి,  మేము నిన్ను తలచి చలించే దాసులం
     మనసు ఒక చక్రస్థలి, మేము  భగవంతుని కృపకు పాత్రులం
     మమతలుగల లోగిలి, మేము పాదాలను పూజిమ్చె పుష్పాలం
     నిన్ను మోసేది బాహుబలి, శ్రీశ్రీనివాస నీ దర్శనమే మాకు మోక్షం

12. భగవత్ సంకల్పమునకు అనుకూలముగా జీవించడం
     భగవంతునికి  ప్రతికూల  మైన  దానిని  విసర్జిమ్చడం
     సంసారంలో సుఖశామ్తులు దేవుని కల్పనఅని భావించడం 
    మంచి-చెడుల మద్య నలిగి పోతున్నాము  శ్రీ  శ్రీనివాస

13. ప్రతి చినుకు తేనే, ప్రతిరోజూ పండుగ  నిన్ను ప్రార్దిమ్చుతుంటే
      ప్రతి మాట సత్యం, ప్రతి పనిలో నిన్నే సహాయమ కోరు తుంటే
      ప్రతి పుష్పం నీ పాదాలకు, ప్రశాంతత నీ పాద ధూలి పెట్టుకుంటే
      నిన్నుప్రార్ధించే శక్తి మాకుకల్పించమని శ్రీ శ్రీనివాస వేడుకుంటున్నా

14. శీతోష్ట్నములు,   జయాపజయాలు  అనుభవిస్తున్నాను
      సుఖ దు:ఖాలు మానవులకు సహజమని భావిస్తున్నాను   
      కర్మాను  సారముగా  వచ్చే ఫలితాను అనుభవిస్తున్నాను
      ఇంద్రియ నిగ్రహము కొరకు శ్రీ శ్రీనివాస నిన్ను కోలుస్తున్నాను

15. త్యాగము ద్వారా అమృత తత్త్వం లభించును
      అహంకారం వదులట వళ్ళ ప్రేమ తత్త్వం లభించును
      భగవంతుని  తత్వాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు తున్నాను
      జన్మ జన్మల భందముగా  ప్రార్దిమ్చుతున్నాను శ్రీ శ్రీనివాస

16. భాహ్య విషయాలకు మేము చింతించుట లేదు
      అంతర్యములోని విషయాలను పట్టిమ్చుకోనుటలేదు
      సమస్త చింతను తొలగించే దైవ ప్రార్ధన మాకుమారదు
      చిన్మత్ర స్వరూపు డైన శ్రీ శ్రీనివాస నీమీద భక్తి మారదు

17. చిత్తముతో చింతించు వాడు ముక్తిని పొందు తాడు
      మనసుతో  ప్రార్దిమ్చువాడు మోక్షమును పొందుతాడు
      దాన ధర్మములు చేయువాడు స్వర్గమును చేరుతాడు
      మరణసయ్యపై  శ్రీ శ్రీనివాస అన్నా మరుజన్మలేకుండు వాడు

18. జ్ఞాణమనే అగ్ని,  అజ్ఞాన మాలిన్యమును  దగ్ధము చేయును
      జ్ఞాణ జ్యోతి  అజ్నానాన్ధకారమును పటా  పంచలు చేయును
      జ్ఞానాన్ని   పెంచే నీ నామ స్మరణ మనస్సాంతి  కలిగించును
      ఆత్మజ్ఞానం కోసం నిన్నె ప్రార్దిమ్చుతున్నాను శ్రీ శ్రీనివాస

19. భగవన్నామంతో  దివ్యాను భూతి  పొందవచ్చు
      భక్తి అనే ఆయుధముతో పరమాత్మను చేరవచ్చు
      నావ లేకుండా సంసార సముద్రాన్ని దాటవచ్చు
      భక్తి అనే బీజం వృక్షమై సుఘంధం వేదజల్లవచ్చు
                                       
20.  కన్న బిడ్డ వెనుక కన్న తల్లి నడవ కుండునా
       భార్య ప్రేమ వెనుక భర్త ప్రేమ ఉండ కుండునా
       భక్తుడి వెనుక పరమాత్ముడుండ  కుండునా
       శ్రీ శ్రీనివాస నిన్నే ప్రార్దిమ్చుతున్నా  భక్తుడుగా 

21. గాంచితి కనక సుంద రాంగున్ని గాంచితి
      స్వప్నా ను  భూతి తెలుపుతూ   వ్రాసితి
      కల వాని కన్న కళ గల వానిని  గాంచితి
      విశ్వ రంగమున శ్రీ శ్రీనివాసుని దర్సిమ్చితి

22. పాములా    పర  ఇంట   నిద్రించ  లేకున్నాను
      చాపలా   ఆకలి  లేకున్నా  ఆశకు  పోకున్నాను
      తేనటీగల  ద్రవ్యాన్ని  సేకరించి పంచు తున్నాను
      శ్రీ  శ్రీనివాస మమ్ము కాపాడమని వేడుకుంటున్నాను


 

23. నీ కొండలు నడిచి నీ రూపం చూడాలని ఉన్నది
      నీ కధలు వింటుంటే మనసు శాంతమవుతుంది
      నీ దృశ్యం నా మనసుని నిర్దేహమయం చేస్తుంది
      శ్రీ శ్రీనివాస నీ రూపం  నా మాయను  తొలగిస్తుంది

24. హృదయ భవనమున  పరమాత్మ భావనయే
      సంసార సుఖ శామ్తులు  దేవుని   కల్పనయే
      దంపతులకు సంతానం  కర్మ పరి పక్వతయే
      శ్రీ శ్రీనివాస నాతప్పులు రక్షించి మన్నించు వాడవే

25. గోవిందా, గోవిందా ప్రార్ధన నా  నామస్మరణ
      వరదా, దయావరా, మా మీద చూపు కరుణ
      ప్రాణులను రక్షించు  అవతారం  నారాయణ
      శ్రీ శ్రీనివాస నీ పాదాలను పూజించుటయే శరణ్యం

26. ఏలిక నీవయ్య,   మా కూడిక నీ  తొనయ్యా
      మాతో పలుక వేమయ్య, ప్రార్ధనను ఆలకిన్చవయ్యా
     మమ్మేలు కోవయ్య, మా తప్పులు మన్నిమ్చవయ్యా
     శ్రీ శ్రీనివాస మా మీద కరుణ చూపె భాస్కరుడవయ్యా

27. అఖిల దేహాలలో అంతర్యామి వై వున్నావు
      బాహ్యాభ్యంతరము వెలుగును విరజిమ్మినావు
      భూదేవి మొరవిని భూభారమును ధ్వంసము చేసినావు
    శ్రీ శ్రీనివాస నీయందే మనసులగ్నానికి మాకు సహకరించావు

 28. చిరునవ్వుతో వికసిత  పద్మసౌన్దర్యము మోము గలవాడవు
      సమస్త దేవతా మూర్తులచే ,  మహర్షులచే వందనీయుడవు
      పరాత్పరుడవు,  వరదుడవు,  లక్ష్మి- పద్మావతీ వల్లభుడవు
      శ్రీ శ్రీనివస అని ప్రార్దిమ్చితే కరుణ చూపె కరుణా మయుడవు

29. మేము సంసార  సాగరమున  మగ్న  మైన వారము
      ద్వన్దములనే  వాయువుచే చెదరగొట్ట బడినవారము
      భార్యా, బిడ్డలనే భందమును  తెన్చు కోలేని వారము
      శ్రీ  శ్రీనివాస నీవె  దిక్కని  వేడు కుంటున్న  వారము

30. అనన్య భక్తితో నీయందె మనస్సును కలిగి ఉన్నవారము
      అనన్య భావముతో యోగమునందు నిమగ్న మైన వారము
      సర్వ ప్రాణులకు ఆత్మ స్వరూపమని నిన్నే ప్రార్ధించు వారము
      విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానము అర్ధిస్తున్నాము శ్రీ శ్రీనివాస

31. జగత్తు నందు   ప్రాణులను   పుట్టించు   వాడవు   నీవె
      జగత్తునందు ప్రాణులను నాశనము చేయు వాడవునీవె
      సమస్థ  ప్రాణులకు జీవశక్తి, భక్తి కలిగించు వాడవు నీవె
      ప్రతి వస్తువు నీలొఉన్నది, నే  ప్రార్దిమ్చుతున్నా శ్రీ శ్రీనివస

32. తేజో వంతులలో తేజస్సు అందిమ్చిన వాడవు
      ప్రజ్ఞా వంతులలలో ప్రజ్ఞను  పెంచిన    వాడవు
      సమస్త   భూతములకు   అధి   నాయకుడవు
      ప్రకృతిని అనుకరించి నడిపించేవాడవు శ్రీ శ్రీనివస

 


33. త్రిగుణాలకు   నీవు    అతీతుడవు
      సర్వెంద్రియాలు నీమెద పనిచేయవు
      భక్తికి లొంగి సహయము చేసేవాడవు
      శ్రీ శ్రీనివాస బుద్ధిలేని వారిని మార్చేవాడవు

34. ఆకాశమున మేఘాన్ని, శబ్దాన్ని కల్పిమ్చే వాడవు
      స్త్రీలకు, పురుషులకు,   పౌరుషము  పెంచే వాడవు
      సమస్త గ్రహాలను, భూతాలను అదుపులొఉంచెవాడవు
      శ్రీ శ్రీనివాస తాపసులలో తపస్సును ప్రోశ్చహిమ్చేవాడవు

35. శుభ కర్మలను ఆచరిస్తూ సుఖ సంపదను కోరుతున్నాను
      శారీరక  మానసిక  సన్తాపములకు  గురి  అవుతున్నాను
      ఐహిక సుఖాలపై ఆశక్తి వీడి  జ్ఞానము పొందు ఇచ్చగలవాడను
      అజ్నానులము మేము శ్రీ శ్రీనివాస జ్ఞానాన్ని కోరుతున్నాము 

36. మోహమనే  కెరటాలకు  చిక్కి ఉన్నాము
      సతి అనేడి సుడిలో పడి లేవలేకున్నాము
      బిడ్డలు,  ప్రేమను  వదలలేక  ఉన్నాము
      శ్రీ శ్రీనివాస మాయ నుండి  తప్పించుము
                                                                       
37. గాలి  తీవ్రముగా  ఉన్నప్పుడు కళ్ళు  తెరచి   చూడ   లేకున్నాను
     కోరికలు హోరుగాలిలా తగిలనపుడు మనసు నిలుపలేకున్నాను 
     మూడు  ముడులు  వేసిన నేరానికి సుడి  గాలికి చిక్కు కున్నాను
     శ్రీ శ్రీనివాస గాలి ద్వారా  భక్తి  అనే  నావను  నడిపి  ప్రార్ధిస్తున్నాను

38. నీ  యందు  భక్తి  లేని వారిని  నేను  రక్షించ లేను
     మనస్సుతో  త్రునీకరించిన   వారిని నేను తలవను
     నీ కధలు  లేని  గ్రంధములను  నేను  చదువలేను
     హేలోకనాధ, శ్రీ శ్రీనివాస  నీ సేవకు నేను పాత్రుడను

39. నాలుకతో శ్రీ శ్రీనివాస నామమమును కీర్తిస్తాను
      చిత్తముతో ఏడుకొండలు ఎక్కి  వేడు కుంటాను
      హస్తములతో నిత్యము నీకు  అర్చనలు చేస్తాను
      నీలాలు అర్పించి, శ్రీ శ్రీనివాస మొక్కు తీరుస్తాను

40. చెవులతో  శ్రీ శ్రీనివస  భక్తి గీతాలు  ఆలకిస్తాను
     నేత్రాలతో నీ దివ్యమంగళ  రూపాన్ని తిలకిస్తాను
     మోకాళ్ళతో ఆలయముచేరి నీ పాదాలకు పూజిస్తాను
     నా తలరాతను మార్చి నీమీదద్యాస ఉంచు శ్రీ శ్రీనివాస      

41. నీ వైభవము ముందు  భూమి ఒక రేణువో
     నీ వెలుగు ముందు అగ్ని ఒక మిణుగురు పురుగో
     నీ శ్వాస ముందు వాయువు సన్నని నిట్టుర్పు వంటిదో
     శ్రీ శ్రీనివాస మేము దాసాను దాసులం అవుతున్నాము

42. నేత్రముల యందు  ఆనంద  భాస్పాలు  రాలు తున్నవి నాకు
     శిరము వంచి, అంజలి ఘటిస్తూ, స్వరము మూగ ఐనది నాకు
     ధ్యానమనే సుధా రసమును పానము  చేయు  చుంటిని నేను
     శ్రీ శ్రీనివాస నీ పాదములు కొలుచుకు మాకు అనుగ్ర హింపుము

43. ఏడూ కొండల వాడ వేంకట రమణ, కరుణ సముద్రా,
     శ్రీ పతీ, కంసారీ,  గజేంద్రుని బ్రోచిన  దేవా,  మాధవా,
     హే జగత్రయ గురో, హే పుండరీకాక్షా,  హే గొపీ నాధా,
     శ్రీ శ్రీనివాస నన్ను రక్షించుము, నిన్ను తప్ప అన్య మెరుగను

44. మనస్సును హృదయము నందే స్తిరముగా నిలిపితిని
      సర్వేద్రియములను నిగ్రహించు కొని ప్రార్దిమ్చితిని
     ఏకాగ్రతతో నిన్నే కీర్తిస్తూ నీ  చెంతకు  చేరితిని
     శ్రీ శ్రీనివాస ద్యానమార్గమున ఆరాధించు చుంటిని

45. సర్వజ్ఞుడవు, సనాతనుడవు, అందర్నీ శాసించు వాడవు
      అణువుకంటే సూక్షమైన వాడవు, అందర్నీ పోషించు వాడవు
      అచింత్య రూపుడవు, సూర్యునివలె నిత్యము ప్రకాశించు వాడవు
      అజ్నానామ్ధకారమును పారద్రోలమని వేడుకొంటిని  శ్రీ శ్రీనివాస
                                                                              
46 మాలో  ఉన్న  అసుర  ప్రకృతిని   తగ్గించి,   దైవ  శక్తిని  పెంచే వాడవు
    ఆశ్చర్య కరమైన, నీలమైనటువంటి,ఆకర్షించే  కేశములు కలవాడవు
    ఉంగరములవలె వంకరులు తిరిగిన కేశములతొ మేహాన్నిపెంచేవాడవు
    స్త్రీలు, పురుషులు కురులు తీసుకొని, అందర్నీ  కాపాడే శ్రీశ్రీనివాసుడవు

47.   పురుషులకన్న ఉత్తముడవు, శబ్ధ, జ్ఞాన, సంపన్నుడవు
       అశుభాలను తొలగించి అందరికి శుభాలు కల్పించే వాడవు
       ఆపేక్ష కలవారికి మంగళాన్ని కలిగించే కలియుగ దేవుడవు
       ప్రతి ప్రాణిని  సక్రమ మార్గమున నడిపించే శ్రీ శ్రీనివాసుడవు

48.  అవసరానికి   ఉపాయము  నందించే  నేతగా ఉండే వాడవు
       ప్రకృతి  విపత్తు  నుండి   జీవులను  రక్షించే   పురుషుడవు
       భక్తుడైన ప్రహ్లాదుడి భయమును తొలగించిన నరశింహుడవు
       అస్థిరమైన మనస్సుగల ప్రాణులను కాపాడే శ్రీ శ్రీనివాసుడవు

49.  విద్య, వాసన, కర్మ, రుచి, అనేవి తెలియన వానికి నీవే రక్షః                
      మాయ మాటలకు చిక్కి, మనసు చలించిన వానికినీవే రక్షః
      ముక్తులను ఆనంద పరిచి, వారిని కటాక్షిమ్చుటకు నీవే రక్షః
      మా గుణములను క్రమంలో ఉంచుటకు శ్రీ శ్రీనివాస నీవే రక్షః      

50. కలియుగంలో ధర్మమునకు హాని కలిగుతున్నది, రక్షణకు నీవే రక్షః
     దుష్టులను,దుర్మార్గులను, మోసకార్లను, రూపుమాపుటకు నీవే రక్షః
    సత్పురుషులను, పతివ్రతలను, భక్తులను పరిరక్షించుటకు నీవే రక్షః
    తిరుమలపై అవతరించి మాతప్పులను మన్నించే శ్రీ శ్రీనివాస నీవే రక్షః

51.    ఆది అంతములు లేని నిత్య యవ్వన వంతుడవు
        గర్భాన్ని ఆవిర్భావింప తల్లి బిడ్డను కాపాడే వాడవు
       బ్రహ్మచే సృజిమ్పపడిన ప్రజాపతులకన్న ఉత్క్రుష్టుడవు
       బ్రహ్మా రుద్రాదులతో సేవించ బడు శ్రీ శ్రీనివాసుడవు

52.    తనకు తానుగా అవతారము ఎత్తిన వాడవు
        సౌశీల్యాది గుణములను ప్రకటిమ్చినవాడవు
        సర్వమండలం మద్య నివసించే పరాత్పరుడవు
        మమ్ము కాపాడే హస్తములుగల శ్రీ శ్రీనివాసుడవు

 

 53. ఎదిగే ఎదమీద ఆచ్చాదనలేక దిక్కులేని వారిని కాపాడావు
       ఎంగిలి మేతుకులులకు కుక్కల్లాగా పోట్లాడేవారిని కాపాడావు
    పసికందులతో, చలిలోఇల్లులేక చెట్టు క్రింద చేరినవారిని కాపాడావు  
    అందరి హృదయాలకు అర్ధం చేసుకొని శ్రీ శ్రీనివాసా కాపాడే వాడవు

54.  భూలోకంలో  పాపపుణ్యాల భారాన్ని మోస్తున్న వాడవు
      కాలాన్ని నిరంతరం కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు
     సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాలని సాక్షిగా నిలిచినా వాడవు
     ఆశ నిరాశల మద్య ఊగిసలాడుతున్నా కాపాడే  శ్రీ శ్రీనివాసుడవు
 
                                                                           
55. కోకిల గొంతుల్లో మధుర స్వరాలు వినిపుస్తున్నాయి
     తులసీ దళాలు పరిమళాలు విరజిమ్ము  తున్నాయి
     మకరందాలు గ్రోలు బ్రమరాలు నాదాలు చెస్తున్నాయి   
     ఆనంద డోలికలో ఉన్నా శ్రీ శ్రీనివాస మమ్ము రక్షిమ్చుతున్నావు

56. ప్రకృతి అలంకార శోభితుడవై శ్రీ శ్రీనివాసుని ఊరెగిమ్చువేళ
     శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రజలకు దర్శన మిచ్చు వేళ
     నీనామంతో భక్తులు పారవశ్యంతో జడి వానలో నాట్య మాడిన వేళ
   దూర ప్రాంతమునుండి వచ్చాము శ్రీ శ్రీనివాస మామీద దయచూపు వేళ

57. సర్వ శోభిత తెల్గునాడు అందరికి  ప్రశాంత చిత్తము కల్పిమ్చుము
    సర్వదా సుఖశాన్తులిచ్చి, మా మనస్సు ప్రశాంతముగా ఉంచుము 
    సర్వ మంగళ రూపుడవై, సర్వ లోకాలను నీ ఆజ్ఞచే  పాలించుము
    సర్వ కళలచె బ్రతికే  వారము శ్రీ శ్రీనివాస మమ్ము  కాపాడము

58. అనుగ్రహ విషయములో దృడముగా ఉండే వాడవు
     సమస్త  ప్రాణుల చేత గ్రహిమ్చః పడుచున్న వాడవు
     ఎందరు అనుభవించిన తగ్గని ధనము కల వాడవు
     కోరిన వారిని ఉద్దరించడానికి ఉన్న శ్రీ శ్రీనివాసుడవు

59. అనిష్ట  నివారణ  ద్వారా  సాధువులను   ఉజ్జీవింప  చేసే  వాడవు
    కర్మ సంభంధం లేకుండా జన్మను శ్వీకరించి ప్రజలను కాపాడే వాడవు
    ప్రతి జన్మలోను ప్రతి ఒక్కరికి భోగ, మోక్ష,  ఫలము నిచ్చు వాడవు
    మా కష్టాలను కడ తేర్చే సమర్దుడవు, ఆదుకొనే శ్రీ  శ్రీనివాసుడవు

60. మెదడుంటే  సరిపోదు శరీరానికి హృదయం ఉండాలన్నావు
    వర్ణాలుంటే సరిపోదు పూలకు పరిమళాలు ఉండా లన్నావు
    పరిమాణం ఉంటె సరిపోదు పండ్లకు మాధుర్యం ఉండా లన్నావు
    నీకొండకు వస్తే సరిపోదు శ్రీ శ్రీనివాస నీమీద భక్తి ఉండా లన్నావు

61. ధర్మార్ధ కామములందు నాకు కోరిక లేదు
    కర్మాను సారము జీవితమును నడుపుట తప్పదు
    పురుషార్ధములద్వార దేహమును రక్షిమ్చుకొనటలేదు
    చింతలను త్యజించా శీ శ్రీనివాస నీ నామోచ్చారణ మారదు

 

62. ఉపనిషద్వాక్యములచే పూజిమ్పబడు  మంత్రము
    సంసారము  నుండి తరింప చేయు మంత్రము
    అజ్ఞాన సంచితమును అంతమొందించు మంత్రము
    జన్మను కడతేర్చు మాత్రమును అగు శ్రీ శ్రీనివాస మంత్రము

63. భక్తుల యొక్క ఆపదలనే సర్పాలను తప్పిమ్చువాడవు
    త్రిలోకములకు రక్షణ నొసంగు మణి  వంటి వాడవు
    సౌందర్యమును, శక్తిని అందించు శరణాగత వత్చలుడవు
    శరణాగతుడైన గజేంద్రుని కాపాడటానికి వచ్చిన శ్రీ శ్రీనివాసుడవు   
                                                                  
64. కేవలము  సంకల్పము చేతనే కోరిన  పనులు  చేసే వాడవు
    ఈలోకంలో ఎవరివల్ల గ్రహింప శక్యము కాని వేంకటేశ్వరుడవు
    నిత్య సూరులకు ఎల్లప్పుడు కావలసిన శక్తిని  ఇచ్చువాడవు
    సువర్ణమువలె ప్రకాశిస్తూ మమ్ము కాపాడే శ్రీ  శ్రీనివాసుడవు

65. బ్రహ్మాదులకు వారాలు కోరిన ఫలములు నిచ్చు వాడవు
    అభయము నిచ్చి వారలను ఆధీనములొ ఉంచుకొన్న వాడవు
    నిధి పై ఎంత ప్రీతొ అంతే  ప్రీతితో అన్దరినీ  కాపాడే  వాడవు
    హెచ్చుతగ్గులు లేకుండా సమానముగా చూసె శ్రీశ్రీనివాసుడవు

66. పృధ్విపై సమస్త కార్య వర్గమును సృష్టించి లభించు వాడవు
    వేదాలు మెదడులో ఉంచుకొని ఆజ్ఞలు జారీ చేయువాడవు
    శ్రీ ఆంజనేయస్వామికి చతుర్బుజుడుగా దర్శన మిమ్చినవాడవు
    ఉపాసకులకు కడుపు నింపే అమృతమునుపంచే శ్రీశ్రీనివాసుడవు

67. శారీరక రోగం పోవటానికి ఔషధం అన్నావు
    భవరోగం పోవటానికి మంత్రోపదేశం అన్నావు   
    సకలపాపాలు పోవటానికి నామజపం అన్నావు
    ఏకాగ్రతతో ప్రార్దిస్తే శ్రీ శ్రీనివసుడుగా దర్సనమిస్తానన్నావు

68. తిరుమలలో నా మనసంతా మధు మాసంలా వికసించింది
    నా తనువు అనువనువు నిన్నే స్మరిస్తూ నీదర్శనమ్ కోరుతుంది
    నాకురులు, కానుకలు సమర్పించి నా కోరికలు తెలపాలున్నది
    శ్రీ శ్రీనివాస నీ చూపులు నాపై నిరంతరం ఉంచమని కోరాలున్నది

69. ఆకలి పెను భూతమై పేదవాడ్ని భాద పెట్టిన, ఆకలి తీరుస్తావు
    కసాయిగా, కర్కసముగా అమాయకులను హింసిస్తున్న ఊరుకోవు
    కురులు, కానుకలు అర్పిమ్చినవారిని ధనాది ధనికులను చేస్తున్నావు
   మనసు పరిశుద్ధమై ఏకాగ్రతతో ప్రార్దిస్తే  శ్రీ  శ్రీనివాసుడుగా కనిపిస్తావు

70. కోరి ఎలునట్టి   మా కులదైవమా
   మా పాపాలను తొలగించే పురుషోత్తమా
   మాకు నిశ్చల భక్తి కలిగించే  బ్రహ్మతత్వమా
   శ్రీ శ్రీనివాస మా ఆశ అనే ఆకలిని తొల గించుమా

71. హరివాసం చేసే వరకు ఉపవాసం చేస్తా
    సంగీత సాధనతో కీర్తిస్తూ నీ కొండకు చేరుతా
    పదివేల శేషుల పడగల తిరుమలకు వస్తా
    శ్రీ శ్రీనివస ఆనంద నిలయాన్ని దర్సనం చేస్తా

72. ప్రియ  లాభామునకు పొంగి పోయే వాడను కాను
    అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోయే వాడను కాను   
    స్త్రిరమైన బుద్ధితో,  మొహ వివసు డైన వాడను
    భోగముల నుండి కాపాడే శ్రీ శ్రీనివాసుడవని ప్రార్ధిస్తున్నాను

 73. సంశయము, బ్రమ లేకుండా  సర్వము  జ్ఞానము  కలవాడవు
     ఇతర సహాయమును ఆపేక్షక గొప్ప తేజస్సుతో నుండువాడవు
     దివ్య  శరీరమునకు  తగిన దివ్యాభరణ సంపదలు  కలవాడవు
     అతి మనోహరమైన, గంభీర స్వభావము  గల శ్రీ శ్రీనివాసుడవు

74. విరోదులచే ఎంత మాత్రము సహింప జాలిని వాడవు
     సమస్త దుర్జనులను ఈదేహముతో శాసించు వాడవు
     గురువులకు గురువు, విద్యలకు  పరమాచార్యుడవు
    శ్రీ శ్రీనివాస సజ్జనులందరికి సత్య వ్రతుడవై ఉన్నావు

75. విరోధము లేక  సమస్తము  అను  కూలముగా   ఇచ్చు వాడవు
     సంసారము నుండి విముక్తి  కలిగించే ఔషధము  నిచ్చు  వాడవు
    పరవిద్యను లభించిన వారికీ తేనెవలె మిక్కిలి ఇష్టంగా ఉండే  వాడవు 
    జ్ఞాన,బల,ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు కల్పించే శ్రీ శ్రీనివాసుడవు

76. గమ్యం ఎరుగని, గాలికి తిరిగే గాలి పటాన్ని నేను
     నీవు నా కళ్ళ ముందు ఉన్నా చూడేలేనివాన్ని నేను
    నీటి పలకపై భక్తి  కీర్తనలు గోటితో వ్రాసిన కవిని నేను
    ఒదార్పులేక, భాధలు తెలుపలేక, వేడుకుంటున్నాను శ్రీ శ్రీనివస

77. గొంగలి పురుగును సీతాకొక చులుకగా మారుస్తున్నావు
    సున్నపు  రాయిని పాల  రాయిగా  మారుస్తున్నావు
    భూమిలొ బొగ్గును, రాయిని, వజ్రంగా మారుస్తున్నావు
    శ్రీ శ్రీనివాస నీవె మానవుల భుద్ధిని మారుస్తున్నవాడవు

78. తల్లివై బిడ్డల అందరి వృద్దిని కోరిన వాడవు
    జయ శీలమైన వాక్కును ఎప్పుడు పలికేవాడవు  
    ఎమీ కోరని వారికి తనే ధనముగా ఉండే వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె పలు మార్లు మాకు సహాయపడినవాడవు

79. సంసారములో తనుకూడ మునిగి భక్తులకు రక్షకుడవు
     జ్ఞాన శక్తి లచే విశ్వమంతా వ్యాపించి ఉన్న వాడవు
    గుణదోషములు చూడక విశ్వమంతను సృజిమ్చినవడవు
    శ్రీ శ్రీనివాస భక్తులు కోరు దూత కృత్యములను చేయువాడవు

80 . యోగి తాపసులకంటే శ్రేష్టుడవు
       సకామ కర్మలు ఆదరించు వారి కంటే శ్రేష్టుడవు
      సిద్ధిని సాధకులకు ఇచ్చు వాడవు
      శ్రీ శ్రీనివాస యోగ సాధకులను రక్షిమ్చువాడవు

81. బిడ్డ ఆకలి తల్లికి కనిపించదు, మనసుకు తెలుస్తుంది
    పద్మావతి తల్లుల భాదను తెలుసుకొని ఆదుకుంటుంది
    పద్మావతిని వేడుకుంటే మనసు  ప్రశాంత మవుతుంది
    శ్రీ శ్రీనివాస నీవె సతిని చేరి మాభాదలను తొలగిస్తావని ఆశ  ఉన్నది

82. భక్తుల   మీద   ప్రీతి    తగ్గ  కుండు    వాడవు
     సమస్త లోకములను ఉదరము నందు కలవాడవు
     మాయచే జీవులను భందించి  క్రీడించే  వాడవు
    శ్రీశ్రీనివాస నీవె లక్ష్మిని క్రీడించి ఆనందపరిచేవాడవు

83. తన మాటను జవ దాటని వారిని సృష్టించే వాడవు
     హద్దు మీరిన వానిని భయంకరముగా శిక్షిమ్చెవాడవు
    యాగమున హవిర్భాగాములను  స్వీకరిమ్చె  వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె సమస్త విఘ్నములను తొలగిమ్చేవాడవు

84. శోకము, మోహము, ఆకలి  నుండి  రక్షించే  వాడవు
     వాయువును సక్రమముగా విచునట్లు చేయు వాడవు
    అసు రాదులను త్వర త్వరగా శోషింప చేయువాడవు
    శ్రీ శ్రీనివాస నీవె మా వ్యాదులనుండి రక్షించే వాడవు

85. ఈ లోకంలో    ధర్మాన్ని   రక్షించే   వాడవు
     తేజస్సు గల   శిఖరము    ఉన్న    వాడవు
    తాపము తీరునట్లు కాంతిని వర్షించు వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె భూభారమును భరించు వాడవు

86. సమస్త లోకాలకు జలమును అందించు వాడవు
      భోగమును, మోక్షమును కోరునట్లు చేయు వాడవు
     సమస్త ప్రాణుల హృదయాలను దోచుకొను సమర్దుడవు
     శ్రీ శ్రీనివాస నీవె యుగాంతము నుండి  కాపాడే వాడవు

87. వేదజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికం అన్నావు
     సమస్త గోప్య  విషయాలకును   శిరోభూషణము  అని అన్నావు
    సాదన  చేయుటకు  మిక్కిలి సుగము,  శాశ్వితము,  అన్నావు
    శ్రీ  శ్రీనివాస నీవె  ప్రత్యక్ష   ఫలదాయకము  అందించే   వాడవు

88. ధర్మమార్గామునందు  విశ్వాసము లేని వారు నిన్ను చేరలేరన్నావు
     మృత్యు  రూపమున సంసార చక్రమున  పరిబ్రమ చెందుతారన్నావు
     జగతంత్తయును  జలముతో మంచు  వలె పరిపూర్ణ  మైనదన్నావు
     శ్రీ శ్రీనివాస నీవె భూతములను సృష్టించి ఒక  ఆట ఆడించే వాడవు           

89. వ్యర్ధము లైన ఆశలను ప్రాణులకు కల్పించి ఆడిస్తున్నావు
     విపరీతమైన జ్ఞానమిచ్చి, అజ్నానులుగా మారుస్తున్నావు
     వయసులో ఉన్న వారికి మొహవేశంలోకి  పడే స్తున్నావు
    శ్రీ శ్రీనివాస నిన్నే నిశ్చలమైన మనస్సుతో భజింతురన్నావు

90. సమస్థ జగత్తును హృదయంలో ధరించు వాడవు   
     అందరికి కర్మ ఫలమును ఇచ్చువాడవు 
     ఋక్సానం యజుర్వేదములను అందించు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె ఓంకారం ను సృష్టిమ్చినవాడవు

 

91. అందరివి  శుభా  శుభములను గమనించు వాడవు
      పరమ గతి  ఐన  పరం   ధాముడవు,  పవిత్రుడవు
      ప్రత్యుపకారము    పొందక  హిత మోనర్చు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె ఉత్పత్తి ప్రళయములు కల్పించువాడవు 

92. దేవతలను  పూజించె  వారు దేవ లోకమును  చేరుతారన్నావు
      పితరులను సేవించేవారు  పితృ   లోకమును  వెల్లుదురన్నావు
      భూత,ప్రేతాలను అర్చిమ్చేవారు అదే రూపాలు పొందుదురన్నావు
      శ్రీ శ్రీనివాస నిన్నే ఆరాధించువారికి పునర్జన్మ అనేది ఉండదన్నావు

 

93. సకల  భూతాల   యందు  సమభావం  కల్పించే  వాడవు
      నీకు ప్రియుడు  లేదా అప్రియుడు అనేవారుఉండరన్నావు
      భక్తితో భజిమ్చే వారి హృదయంలో స్తిరంగా ఉంటానన్నావు
      శ్రీ శ్రీనివాస నీ హృదయంలో భక్తులకు చోటు కల్పిస్తున్నావు

94. బ్రాహ్మణులు నిన్ను శరణు  పొందితే పరమపదమును చేరుతరన్నావు
      స్త్రీలు, వైశ్యలు ,శూద్రులు , అందరు శరణు పొందితే  మోక్షమిస్తాన్నావు
      సుఖ రహితము, క్షణభంగురమైన ఈ శరీరముకొరకు భాద  వద్దన్నావు
      శ్రీ శ్రీనివాస నీయందే మనస్సులగ్నము చేసేవారిని భక్తులన్నావు        

95. నిర్దోష   మైన  మార్గమును   ప్రదర్శించు   వాడవు
      భక్తులుఉండే చోటుకే పోయి సేవలు చేయు వాడవు
      అపకారులను కూడా  క్షమించే గుణము కలవాడవు  
      శ్రీ శ్రీనివాస నీవె అమితమైన ధనము ఇచ్చే వాడవు

96. జ్ఞానుల యొక్క  తత్వ  జ్ఞానమును పెంచే వాడవు
      గోప్య విషయ రక్షణమున మౌనము అందించు వాడవు
      శిక్షించు వారిలో దమన శక్తిని అందించు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె మాలో భక్తి,ద్వేషం కల్పించి నడిపిస్తావు

97. ఉత్తమములగు వైష్ణవ ధర్మము లన్నియు ఎరిగిన వాడవు
      తనకు తనే సూక్ష్మ స్వరూపముగా సాక్షాత్కరిమ్చు వాడవు
      అపక రించు  వారి మనస్సు కూడా హరించు వాడవు
     శ్రీ శ్రీనివాస నీవె మొహినీ రూపములొ అమృతం పంచినవాడవు

98. భక్తుల అహంకారము, మమకారములను తొలగించు వాడవు
     కపిల వర్ణములో తత్వ ప్రవచనము చేయు ఆచార్యుడవు
     చత్ర, చామ రాది, సక లాంగములతో విరాజిల్లు వాడవు
     శ్రీ శ్రీనివాస నీవె మాపై దయను వర్షించు నేత్రములు కలవాడవు

99. కొంచమైన అహంకారము లేక శాంతముగా ఉండు వాడవు
     తనయందు భక్తిని ఉంచిన వారికి అష్టామ్గములు ఇచ్చువాడవు
     మహాలక్ష్మిని యదేచ్చగా విహరించు వక్ష స్థలము కలవాడవు
     శ్రీ శ్రీనివాస నీవె అందరి ఆత్మలను తనవిగా కలవాడవు  

100. ప్రకృతికి,  ఆత్మకు,పంచభూతాలకు హితమైన వాడవు
        స్తోత్రము చేయువారి మనోరధమును పూరించువాడవు
        మిత్ర, బంధు, దూత, సారధి సమస్తము తానైన వాడవు
        శ్రీ శ్రీనివాస అందరి కన్నాపరిశుద్ధ మగు కీర్తి గలవాడవు

101. భక్తులకు అనేక  రూపాల్లొ  దర్శన మిచ్చు వాడవు
        తారతమ్య  చూడని పరిశుద్ధ స్వభావం కలవాడవు
        నీవిచ్చిన పురుషార్ధములను నీవె రక్షించు వాడవు
        శ్రీ శ్రీనివాస నీవె మంత్ర విద్యలను రచించిన వాడవు

102. బ్రహ్మాదుల అపరాధములను క్షమించు వాడవు
        భోగ, మోక్ష, అపేక్ష కలవారికి  మంగళ కరుడవు
        ప్రేమసంపదను అలివేలుమంగకు ఇచ్చిన వాడవు
        శ్రీ శ్రీనివాస ఎరూపంలోఉన్నా లక్ష్మిని భార్యగా పొందావు

 

103. భక్తులను బుజ్జగించి, ఏడిపించి రక్షించే వాడవు
        అపరిమితమైన  బలమును  ధరించిన  వాడవు
        లోకములను నాశనము చేయు శక్తి కలవాడవు
        శ్రీ శ్రీనివాస నీవే సత్యమైన వ్యాపారము కలవాడవు       

104. అందరి యందు దాక్షిన్యము కలవాడవు
        జ్యోతి చక్రము ప్రవర్తింప చేయు  వాడవు
        ప్రవృత్తి,నివృత్తి, ధర్మములకు అద్యక్షుడవు
        శ్రీ శ్రీనివాస నీవె నక్షత్ర రూపము ధరించు వాడవు  

105. దురభి మానమును, మోహమును మేము త్వజిమ్చినాము
       ఆసక్తి అనుదోషమును జయించి  శక్తితో ప్రార్ధించుతున్నాము
       ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలి వేడుకుంటున్నాము
       శ్రీ శ్రీనివాస శాశ్వితమైన మోక్షము కొరకు వేడుకుంటున్నాము 

106. వాయువు వాసన ఒక చోట నుండి మరియొక చోటునకు చేరినట్లు
        జీవాత్మ ఒక శరీరమును త్వజిమ్చి మరొక  శరీరమును  చేరినట్లు
       సూర్య- చంద్రులు, అగ్ని, తేజస్సుతో  మానవులను సృష్టిచి  నట్లు
       శ్రీ శ్రీనివాస నీవె సర్వ ప్రాణుల ఆహారమును జీర్ణము చేసి రక్షించినట్లు

107. తత్వజ్ఞాన ప్రాప్తికై ద్యాన యోగాము నందు ద్రుడ స్తితిలో ఉన్నాము
        అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణముతో కీర్తనాలు పాడుతున్నాము
        స్వ ధర్మా  చరణము నందలి కష్టములను ఓర్చు కొను  చున్నాము
        శ్రీ శ్రీనివాస నీవె నిత్యమూ శాంతి సౌభాగ్యాలు ఇస్తావని నమ్మకము

108. మేము మనో వాక్కాయములద్వార ఎవ్వరికికష్టములు కల్గిమ్చము
        ప్రతి ఒక్కరిని యదార్ధమైన,  ప్రియమైన మాటలతో తృప్తి పరిచేదము
        మాకు అపకారముచేయువారికి మేము ఉపకారములు చేస్తున్నాము
        కార్యచరణము నందు  కర్తుత్వభిమానమును  త్వజించు  చున్నాము
        చిత్తచాంచల్యములేకుండ కుటుంబ సమేతముగా వేడుకుంటున్నాము
        అన్య ప్రాణులఎడ కృప చూపుతూ,  ఎవ్వరిని నిందింపకసేవిస్తున్నాము
        ఇంద్రియ విషయ సంయోగములొ ఉన్నాము, కానిఆసక్తి లేకున్నాము
        శ్రీ శ్రీనివస నిన్నే కాలము, ననుసరించి, అతి నిష్టతో ప్రార్ధించుతున్నాము
                       


ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తండ్రి ఐన  వేంకటేశ్వరుని , తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు

పైన ఉదహరించిన  మొత్తము జిరాక్స్ తీసి 3,5,7,11,21,108   భక్తులకు పంచిన ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కరుణించి కటాక్షిమ్చునని నా నమ్మకము లేదా మొత్తము ఒక్క పేజి తీసి మీ అత్యంత సన్నిహితునకు  ఇచ్చి  రోజు  చదవమని చెప్పగలరు   ఆ దేవుని ఆశిస్సులు అందరు పొందగలరు.

     
                ఓం శాంతి:  శాంతి: శాంతి:
                       సర్వం శ్రీ శ్రీనివాసార్పనమస్తు