21, ఆగస్టు 2014, గురువారం

171. Children Comedy 75 {"తరణి " (Small baby story )}


                                                                          


Children  Comedy  75  {"తరణి " (Small baby story )} 

తిరుపతి నుండి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కాకచిగూడ స్టేషన్ కు వస్తున్నది అని అనౌన్సుమెంటు వినబడుతున్నది. అతి నెమ్మదిగా 4వ ప్లాట్ ఫోరంను చేరింది. దానిలో నుండి  ప్రయాణీకులు వకరి  తర్వాత ఒకరు చొప్పున దిగుతున్నారు. అప్పుడే స్టేషన్ నుండు 5 సంవస్చరాల పాప    నాన్న నాన్న అంటూ ఎడుస్తూ ముందుకు వస్తున్నది,  అక్కడ ఉన్న ప్రయాణీకు లందరు పాప వంకే చూస్తున్నారు,   పాప ముద్దోస్తున్నది,     అంటుండగానే 6 అడుగులు పొడుగు ఉన్న అందమైన   రూపమ్   ఉన్న  లాల్చీ   ఫిజమా ధరించి వెళుతున్న  వ్యక్తిని  పాప  నాన్న  అంటూ   కాళ్ళను  చుట్టు కున్నది,  ఎవరిని చూసి ఎవరను  కున్నావు   పాప   అంటూ,   గట్టిగా   కాలును  విదిలించాడు. కాని పాప కాలుని వదలలేదు.

అక్కడే ఉన్న కొందరు ప్రయాణీకులు,    ఇది కలికాలం  కన్న   కూతురిని  కూతురని  చెప్పుకుంటే సిగ్గెందుకు, వీడు పుట్టింది   ఒక అమ్మకు కదా,   ఆ అమ్మకూడా ఒక తల్లికి కూతురు కదా అన్నారు.

పాపను కోపంతో గట్టిగా చేత్తో పట్టుకొని ఒక్క తోపు తోసాడు, అప్పుడే అటుగా వస్తున్నా సరుకులు ట్రాలీ తగిలి  క్రింద పడింది, నాన్న నాన్న అని కలవరిస్తున్నది.
అయిన దులుపుకుంటూ బయలు దేరాడు,  అక్కడే  ఉన్న  కొందరు  ఆడవాళ్ళు, నీకు మానవత్వ   మనేది  లేదా, చిన్న పిల్లని చూడ  కుండ  అట్లా  తోసారు,   చూడ టానికి  బుద్ధి  మంతుడు లాగున్నారు  అని పాపను లేవతీసారు. నాన్న దగ్గరికి  నేను  వెల్లతాను  అని పాపా ఏడుస్తున్నది,   ఎందుకయ్యా   పాపా  అంటే ఇంత  కర్కసం,   ముక్కు పచ్చలారని  చిన్నపాప  చూస్తె  జాలి  వేస్తుంది  కాని నీలాంటి   మూర్ఖున్ని మేము  ఎక్కడ  చూడ  లేదు అన్నారు.
ఆమాటలకు తలవంచి పాపను ఎత్తుకోని చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ను తలకు చుట్టి గబా గబా స్టేషన్ బయటకు నడిచాడు "లోకేష "

లోకేష రైల్వే  పోలీస్ స్టేషన్ కు పోయి, ఈ పాపెవరో నాకు తెలియదు, నన్ను నాన్న నాన్న అంటున్నది, ఈ పాప ఎవరో కనుక్కొని వారి తల్లి తండ్రులకు అప్పచెప్పండి అన్నాడు. సరే అట్లాగే అప్పచేపుతాము, మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, అన్ని వ్రాయండి ముందు అన్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్.
పాప నీ పేరు ఏమిటి అని అడిగారు, నా పేర  "తరణి " మానాన్న పేరు లోకేష్ మా ఆమ్మ పేరు "శిరీష" మాది హైదరాబాద్ అని చెప్పింది. నాన్న నన్ను ఇక్కడ వదిలేయద్దు,  నా పొట్ట చాల చిన్నది, పాలతో  సరిపెట్టు కుంటా, నిన్ను అమ్మను  ఏడిపించను అన్నది.       
ఆమాటలకు స్టేషన్ లో ఉన్న వారందరికి   కళ్ళంబడి  నీరు కారాయి ఆ చిన్నారి మాటలకు.
ఈ పాప నీ పాప కాదు,  కన్న బిడ్డను కాదన్న వాడిని మేము మొట్ట  మొదట సారి చూస్తున్నాము. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అందరు అంటారు,  పిల్లలు లేని వారు పిల్లను తెచ్చుకొని పెంచుకుంటారు, నీవేమొ నా బిడ్డ కాదంటావు, నిన్నే నాన్న అని పాప అంటుంది.
ఈ పాప నీదగ్గరె ఉంటుంది, ఈ పాపను వదిలించుకోవాలని అనుకున్నవో నీమీద కేసు బుక్ చేస్తాను, నీవు హోదా గల ఉద్యోగమూ చేస్తున్నావు, నీ ఉద్యోగమునకు కుడా అవాంతరం కలగవచ్చు,   పాపను జాగర్తగా  నీదగ్గరె ఉంచు, మేము ఎప్పుడు   ఫోన్ చేసినా పాపను చూపాలి అని హెచ్చరించారు ఇన్ స్పెక్టర్.
గత్యంతరం లేక సరే అన్ని పాపను బయటకు ఎత్తుకొని వచ్చి, బయట ఉన్న కారు పై కూర్చొపెట్టి,  ఆటో పిలుస్తానని అటో పిలిచి ఎక్కి కూర్చున్నాడు, పాప ఏడుస్తున్న పట్టించు కోకుండా.

అప్పుడే బయటకు వచ్చిన ఇన్ స్పెక్టర్   పాపను చూసి బైక్ మీద  ఎక్కించుకొని లోకేష ఇచ్చిన అడ్రస్  ప్రకారం వెల్లి  తలుపు  బెల్లు  కొట్టాడు ఇన్ స్పెక్టర్. లోపలనుంచి తలుపు తీస్తు,  ఎవరు కావాలండి అన్నది  "శిరీష".,  చూడమ్మ మీవారికి తిక్క ఏమిటి,  పాపను స్టేషన్ లో కావాలని వదిలి వచ్చాడు, అసలు మనిషేనా కన్నకూతురిని అట్లా వదలి వస్తాడా, ఇటు వంటి మనిషితో ఎట్లా కాపురము చేస్తున్నావమ్మ అన్నడు ఇన్ స్పెక్టర్.

అమ్మ అంటూ తల్లిని చేరింది. ఆ మాటలకు ఒక్క సారి మూర్చ పోయింది "శిరీష "
పాప ఇన్ స్పెక్టర్ గారు మీరు వెళ్ళండి, మా అమ్మకు నేను సేవచేస్తాను అంటూ గ్లాసుతో నీళ్ళు తెచ్చి మొఖం మీద చల్లింది. అమ్మ అమ్మ అని అరుస్తున్నది, అప్పుడే లోకేష్ లోపలకు వచ్చాడు, నాన్న అమ్మ పడిపోయింది అని పాప చెప్పింది.
"లోకేష్ గారు పాపను జగర్తాగా చూడండి అని చెప్పి ఇన్ స్పెక్టర్ వెళ్లి పోయాడు.
"శిరీష " నీకు ఏమైంది, మన కాపురంలోనికి ఈ పాప ఎక్కడనుంచి  వచ్చింది,  నాకు అర్ధం  కావటం  లేదు,  నన్ను నాన్న నాన్న అని పిలుస్తున్నది తప్పించుకొని వచ్చిన మరల మన ఇంటికి వచ్చింది.
ఏమోనండి ఈ మొగవారిని ఎప్పుడు నమ్మ కూడదు, చేసేదొకటి, చెప్పేదొకటి, ఎదన్న అడిగితె కాళ్ళ బారానికి వస్తారు, మిమ్మల్ని చూస్తుంటే  నాకు కోపం వస్తున్నది, ఈ పాప తల్లి తండ్రులు ఎవరో  తేలే దాకా నా దగ్గరికి  రావద్దు, నన్ను తాకవద్దు, ఇదే నీకు  నేను వేసే  శిక్ష  అంటూ  పాపను   చేయి    పట్టుకొని లోపల   గదిలోకి   వెళ్ళింది   లోకేష్ భార్య.             .             
  
 లోకేష్ కోపంతో కూర్చీలొ కూర్చొని సిగరెట్టు కాల్చుదామని తీసాడు,    అమ్మా  నాన్న   సిగరెట్టు  త్రాగు తున్నాడు, తాగొద్దని చెప్పి నీదగ్గరకు  వస్తాను అన్నది.   పాపా మాటలకూ శిరీష ఆశ్చర్య   పోయింది, నేను ఎన్ని సార్లు చెప్పిన ఆపని నా మొగుడు ఈ పాప పుణ్యమా అని  సిగరెట్టు మానేస్తే మంచిది అనికున్నది.
నాన్న సిగరెట్టు త్రాగకూడదు అంటూ నోటిలో ఉన్న సిగరెట్టు లాగేసింది, పాప ను ఏమనలేక సిగరెట్టు పెట్టెను అవతల పారేసి, నేను ఆఫీసు వెళ్లి వస్తాను అన్నాడు, పాప జాగర్తా అని బయటకు నడిచాడు లోకేష్. మరల వెనుకకు వచ్చి పాప మీ నాన్న పేరు ఏమిటి అని అడిగాడు "లోకేష్ " అని చెప్పి  ఏమిటి  నాన్న  నీపెరే నీవు మల్లి   అడుగు తావు అన్నది. అయితే మీ అమ్మ ఎవరు అన్నాడు, అదిగో ఆ అమ్మ మా అమ్మ అని శిరీష ను చూపిన్ది పాప. ఇద్దరికీ తల తిరిగి పోయింది. పెళ్లి అయి  మూడు సంవచ్చరాలు  కుడా కాలేదు, 5 సంవస్చరాల  పాప ఎలా వచ్చింది అనుకున్నారు.
అప్పుడే ఫోన్ మోగింది. పాప మీ దగ్గర ఉన్నదా అని అడిగారు, ఇంత కీ మీ రెవరు ఆ విషయాలు తరువాత చెపు తాను పాప జాగర్త అని ఫోన్ పెట్టేసాడు.
వెంటనే ఫోన్ ఎక్కడనుండి వచ్చిందో కనుక్కున్నాడు, శిరీష  నీను పాప వివరాలు కనుక్కొని వస్తాను అంటూ ఫోన్ చేసిన చోటుకు వెళ్ళాడు,   అది పుబ్లిక్ ఫోన్  ఎందరిని  అడిగిన  ఎవరు  చేసారో  ఎవ్వరు  చె ప్ప లేక  పోయారు.
ఆలోచనలతో తిరుగుతున్నాడు లోకేష్ .
ఇంటినుండి ఫోన్ వచ్చింది ఇందాక ఏదో  కోపంతో అనరాని  మాటలు అన్నాను, మనసులో పెట్టుకో కుండా ఇంటికి రండి, పాప విషయము ఇద్దరం కలసి ఆలోచించి తల్లి తండ్రుల వద్దకు చేర్చుదాం వెనక్కి రండి అన్నాది శిరీష. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అన్నాడు.
రావటం రావటం నామీద కోపం లేదుకదా, అస్సలు లేదండి అన్నది శిరీష
అయితే నా మామూలు ఇచ్చెయి అన్నాడు.
ఇక్కడ పాప ఉన్నది  అలా లోపలకు పోదాం పదండి అన్నది. ఆధరాల రాసాన్ని జుర్రుకున్నాడు లోకేష్,
ఏమండి పాప గురించి మనం తగాదా పడ కూడదు అంటూ తగ్గరకు మరలా లాక్కొని ఆలింగనంతో ఘాటైన  కీస్ ఇచ్చింది.
అంతలో పాప చప్ప ట్లు కోడుతూ అమ్మ న్నాన్న కలిసారు అన్నది. నా ముద్దుల పాప అంటూ దగ్గరకు తీసుకున్నాది శిరీష.

ఏమండి న్నన్ను అమ్మ అని, మిమ్మల్ని నాన్న అని అంటున్నది,
ఇందులో ఎదొ  రహస్యము దాగి ఉన్నది, మిరే కనుక్కోవాలి, అందులో మీరు పనిచేసేది C.I.D.  కదండీ అన్నది.
అవునే పాప అంత  గట్టిగా చెపు తుంటే  నామతి  పోతున్నది.
అది నేను కనుక్కుంటా నీవేమి గాబరా పడకు , నన్ను గాబరా  పెట్టకు అని చెప్పాడు.
నాకు కఫీ ఎమన్నా ఇస్తావా అని అడిగాడు, ఇప్పుడే కదండీ మీరు పుచ్చుకున్నది అదేవేరు ఇది వేరు అని నవ్వు కున్నారు, ఇప్పు డే వేడి వెళ్ళి  కాఫితెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది శిరీష.           

ఫోన్ మ్రోగుతున్నది కాని శిరీష  తీయుటలేదు, నీరసముగ ఉండుటవల్ల కాసేపు  పడుకున్నది, పడుకోగానే నిద్ర పట్టింది. అప్పుడే ఫోన్ పాప తీసి ఎవరు మాట్లాడేది అన్నది, నేను ఇన్స్పెక్టర్ న్ని పాప ఇంట్లో ఉన్నదా అని అడిగాడు , నేనే ఆ పాపను అన్నది.
పాప నీ  ఫోటో పట్టు కొని ఒక ముసలావిడ స్టేషన్ లో పడి పోయింది,  ఆమె అన్నం తినక నీరసముగా ఉన్నదని తెలిసింది. ఆమెను  అక్కడకు పంపు తున్నాము అన్నడు ఫోన్ పెట్టేసాడు.
ఎవరు పాప ఫోన్ అని అడిగింది శిరీష, ఇన్ స్పెక్టర్ నుండి  అమ్మ .
ఎందుకు ఎవరో ముసలావిడట మన ఇంటికి పంపుతున్నాడుట, పాప కోసం టా అన్నది
ఎవరన్న వస్తే  బయటకు రాకు,  నేను మాట్లాడి బయటకు పంపుతాను, వారునిన్ను తీసుకెల్లటాని వచ్చి ఉంటారు అన్నది.
అప్పుడే కాలిగ్ బెల్ మ్రోగింది. పాపా నీవు లోపలకు పో అన్నాది.
తలుపు తీయగా ఒక ముసలావిడ వస్తూనె ప్రత్యూ ష  నీవు బ్రతికే ఉన్నావా అంటూ పెద్దగా అరిచి క్రింద పడి పోయింది. ఆమాటకు పాప కుడా బయటకు వచ్చి అమ్మొమ్మ అంటూ దగ్గర  చేరింది, అమ్మొమ్మ నికేమైంది అని పాప కూడా  ఏడవటం మొదలుపెట్టింది.
శిరీష కు ఏమి అర్ధం  కాలేదు, వెంటనే భర్తకు ఫోన్ చేసి వెంటనే రమ్మనమని చెపింది. మన ఇంటికి క్రొత్త వ్యక్తి వచ్చారు వెంటనే రావాలి అన్నది.
ప్రత్యూష నీ పాప నీదగ్గర ఉన్నదా అని అన్నది. అమ్మోమ్మా నేను ఇక్కడే ఉన్నాను అమ్మ దగ్గరే ఉన్నాను అన్నది.
ఇంకా నా  ప్రా ణాలు పోయినా పరవాలేదు,  తల్లి కూతురుని కలిపిన సంతోషంతో ప్రాణాలు విడుస్తాను అన్నాది .  
ఆమాటలు విన్న వెంటనే భర్తకు ఫోన్ చేసి మీరు వచ్చేటపుడు డాక్టర్ ను వెంట బెట్టుకొని తీసుకొని రండి అని ఫోన్ చేసింది.
          తల నెప్పిగా  ఉన్నదా ఇప్పుడే వ్రాస్తాను  అని అమృతాంజనం  తెచ్చింది, అమ్మోమ్మా వ్రాయ మంటావ అన్నది.
పాప ను ముద్దు పెట్టు  కుంటూ పాప నాకు ఏమి కాలేదు అని  అన్నది.

డాక్టర్ తీసుకొని లోకేష్ వచ్చాడు, ఆమెను పరిశీలించి ఈమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చండి, ఇమెకు వెంటనే సేలేన్ బాటిల్ ఎక్కించాలి అన్నడు. వెంటనే కాబ్ తెప్పించి హాస్పెటల్ లో చేర్చాడు. డాక్టర్ ను కలసిమంచి మందులు వాడండి, ఇమెకు ఆయ్యె ఖర్చు  అంతా  మేము చేల్లిస్తాము అని చెప్పి దగ్గర నర్సును చూడమని చెప్పి వెనుకకు వచ్చి పాపకు,  చూపించి తిరిగి తీసుకొని వచ్చాడు.

అసలు ఏమిజరిగింది అని శిరీషను అడిగాడు. రావటం రావటం నన్ను చూసి ప్రత్యూషా  అని పిలిచి క్రింద పడి  పోయింది, పాపేమో అమ్మొమ్మఅని అపిలిచింది. నాకేమి అర్ధం కావటము లేదు.

వెంటనే లోకేష్ నీలాగ ఎవరైనా  ఉన్నారా అని అడిగాడు, నేను ఒక్కదానినే ,  అక్క గాని చెల్లి గాని లేరు అన్నది
ఎందుకయినా  మీ అమ్మ నాన్నలను పిలుద్దాం, అట్లాగే వెంటనే పిలవండి, ఈ పాప విషయము ఆముసలాఅవిడ  విషయము తెలుసుకొగలము, ఆవిడను చూస్తుంటే నామనసు గరిగి పొతున్నది.నేను దగ్గరుండి ఆమెకు సేవ చేస్తాను అన్నది శిరీష.

సరే పాప నాదగ్గర ఉంచుకుంటా ఈరొజు నేను అఫీసుకు సెలవు పెడుతున్నాను, నీవు ఆమె దగ్గరే ఉండు ఆక్కడ  అవసర మైతే ఫోన్ చెయ్ అన్నాడు లోకేష్ అట్లాగే నండి.
శిరీష తల్లి తండ్రులు వచ్చారు, రావటమే ఈ పాప ఎవరు అని అడిగారు వారు, ఈ పాప నాకూతురు అని చెప్పాడు లోకేష్.
బాబు అమ్మాయి ఏది అని అడిగారు,  హాస్పటల్ లో ఉన్నాది. తెలిసినవారు ఉన్నారు అక్కడ, మీకు ఆమె ఎమన్నా తెలుసేమో అని పిలిచాము అన్నాడు.
సరే అందరం  పోదాం పదండి హాస్పటల్ కు .
హాస్పటల్లో చూసిన ఆమెను గుర్తించలేక పొయ్యారు వారు.
డాక్టర్ ను కలువగా ఈమెను రెండురోజుల్లో పంపించుతాము,  వాడితే సరిపోతుంది అని చెప్పారు          
లోకేష్ పరద్యానం తొ కారు నడుపుకుంటు వస్తున్నాడు, అప్పుడే అనుకోకుండా ఒక ముసలి వ్యక్తి  కారు క్రింద  పడ  బొయి నాడు ,  అప్పుడే షడన్  బ్రేక్ వేయటం వళ్ళ, అ ముసలివాడు, కారుకు  గ్రుద్దుకొని క్రింద  పడ్డాడు, అక్కడ  కొందరు వ్యక్తులు ఉండి ఇది యాక్సిడెంట్ అని గట్టిగా అరిచారు, లోకేష్ వెంటనే అతనిని కారులో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న హాస్పటల్ చేర్పించాడు, వెంటనే ఇంటికి ఫోన్ చేసాడు,  ఆమాటలు విన్న శిరీషకు ఎందుకండీ హాస్పెటల్లో రమ్మన మంటున్నారు, ఏం జరిగింది , ఏమి జరగలేదు నీవు గాబరా పడకు, వెంటనే పాపను తీసుకొని యశోద హాస్పెటల్కు వచ్చేసెయి. మరి ముసలావిడ వద్ద ఎవరు ఉంటారు  అని అడిగింది, మీ అమ్మ నాన్నను అక్కడ ఉండమని చెప్పి ఇక్కడకు రా అని అన్నాడు, ఫోన్ కట్ చేసాడు. 
వెంటనే "తరణి " తో  బయలుదేరింది  శిరీష.
ఇలా కూర్చొ నేను వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జ్జరిగింది, ఒక వ్యక్తి నా కారు క్రింద పడ్డాడు, అతన్ని ఇక్కడ చేర్పించాను.
మీరెమ్ గాబరా పడ కండి అతని కేం కాదు అన్నది శిరీష.
పాపేది అన్నాడు, ఇక్కడే ఉన్నది కదండి,  అంటూ వెతకటం మెదలు పెట్టారు ఇద్దరు.
పాప వినాయకును ముందు ఉంది గుంజ్జిల్లు తీస్తున్నది.
నాన్న ఆదేవుడికి  మ్రోక్కు కుంటే ప్రాణాపాయము అనేది ఉండదు అని అన్నది.
ఆ మాటలకు ఇద్దరుకి  కల్లమ్బడి నీరు తిరిగినాయి. మనం తొందరలో దేవున్నే గమనిమ్చలేక పోయాం అంటూ పాపను ఎత్తుకున్నాడు.
అప్పుడే నర్సు వచ్చి పిలుస్స్తున్నది యమర్జేన్సీ  వార్డులో ఉన్న పేషంటు పిలుస్తున్నారు చేర్చినవార్ని పిలవమన్నారు డాక్టర్  అన్నది.
ఏమిటి అలా  ఆలోచిస్తున్నారు, మీరె కదండి  ఎవరినో చేర్చారన్నరు కదా  వారే మిమ్మల్ని పిలుస్తున్నరుట  పోయి రండి అన్నాది.
అవునువేల్లోస్తా పాప అమ్మదగ్గరే ఉండు అని  చెప్పి వెళ్ళాడు.
అప్పుడే వచ్చిన పొలీసులకు ఇనస్పెక్టర్ కు  ఇస్తున్నాడుపెషంట్,   లోకేష్ తప్పేమీ లేదు, నేనీ చావాలని అతని కారుక్రిండ పడటానికి ప్రయ త్నిమ్చా, కాని నన్ను చావు కూడా దగ్గర చేరటానికి భయ పడుతున్నది అన్నా డు, ఎందుకంటే నాకు కాన్సర్ భాదను తట్టుకోలేక అట్లా చనిపోదామనుకున్నాను అని పొలీసులకు చెప్పాడు.
పొలీసులు డాక్టర్ నుకలసి పేషంట్ దగ్గర రిపోర్టు తీసుకుకున్నాము, ఇది యాక్సి డెంటు కాదని  మేమునిర్దారిమ్చాము, ఇ తన్ని మీరు స్రాయ శక్తులా  బ్రతికించండి అనిచెప్పి వెళ్లి పోయారు.             

బాబు లోకేష్ నీతొ పాటు శిరీష రాలేదా అని అడిగాడు,  ఉన్నది, మేము మీకు తెలుసా అని అడిగాడు.
నీ దగ్గర ఒక పాప ఉండాలి ఉన్నదా అని అడిగాడు. ఉన్నది అన్నాడు లోకేష్ , అప్పుడు నేనే స్తేశాన్నో మీదగ్గరకు పంపినానాను పాపను, నీది శిరీష డి కలసిఉన్న పెళ్లి ఫోటోను చూపి మీ నాన్న అమ్మ అని చెప్పాను మిమ్ము ఎమన్నా ఇబ్బంది పెడితే నన్ను క్షమించు  అన్నాడు. అసలు మీరెవరు అని అడిగాడు.
ముందు పాపను, శిరీషను పిలవండి నెనుఎక్కువకాలము బ్రతకను బాబు, మీకు ఒక రహస్యము చెప్పాలి అన్నాడు.
వెంటనే పాపను , శిరీషను తెచ్చాడు,  పాప రావటమే తాతా బాగున్నావా, ఏమిటి ఇలా చిక్కి పోయావు, అన్నది.
మీ అమ్మానాన్నలు ఎడి పించుట లేదు కదా  అని అడిగాడు. తాత నీమీద ఒట్టు నేను ఎవ్వరిని ఎడి పించుట లేదు,
పాప నీ చేయి ఇటు ఇవ్వు అని, శిరీష చేతిని,. లోకేష్ చేతిని  తీసుకొని ముగ్గురు చేతులనుకలిపి ఈ పాప మీ పాప, మీ దగ్గర ఉన్న ముసలావిడ మీ అత్తగారు, అనగా నాభార్య., శిరీష తల్లి గారు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తించు అని చూపాడు లోకేషకు. ఈ ఫోటో మా అన్నయ్యది, అమెరికాలో డాక్టర్గా చేస్తున్నప్పుడు, మరో డాక్టర్  ను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు నాకు తెలిసింది, వారికి  ఒక పాప పుట్టిందని తెలిసింది, తర్వాత యాక్సిడెంటులో అందరు చనిపోయినట్లు నాకు మెసేజ్ వచ్చింది అనే చెప్పాడు.      
అంతవరకే నీకు తెలుసు ఆ తర్వాత జరిగినవన్నీ వివరముగా నీకు ఈ కవరులో వివరించాను, నేను చని పోయిన  తర్వత  మీకు అన్నివివరాలుతెలుస్తాయి, దయచేసి ముందు మాత్రం విప్పకండి, మీ అత్తగారిని కూడా  పిలవండి అని తెలియపరిచాడు మావ శంకర రావుగారు . 
అప్పుడే డాక్టర్ రావటం పేషంటుకు గాలి రానివ్వండి, అని దూరంగా పోమ్మనడం, వచ్చి చూసి ఒక ఇంజక్షన్ చేయటం నిముషాల్ల్లో జరిగింది.
  శంకర్ రావుగారి పరిస్తితి చూసి పార్వతమ్మ గుండెలు బాదుకున్నది. ఇట్లా  ఉంటారనినేను అనుకోలేదు, మీరు మారిపోయారు, నేను మన పాప ప్రత్యూ ష ను చూసాను, మనవరాలు తరణి ని చూసాను. చక్కగా ఉన్నారు,
మీరు భయపడనవసరము లేదు నేను వారి దగ్గరే ఉంటాను,  ఆరొగ్యముకూడా  బాగున్నది,  పాప చావలేదు  మిమ్మల్ని నన్ను భయ పెట్టారు అన్నది. నీకు అన్యాయము చేసి వెళుతున్నాను నన్ను క్షమించు నీవు పాపను మనవరాలును చూసుకున్తు జీవితము గడుపు  అని అన్నాడు.  మన అల్లుడు ఇతను కాదేమో అని పిస్తున్నది. మన అమ్మాయి కదా ఉన్నది నీవు భయ పడకు, పెద్ద దానివయ్యావు కళ్ళు కనబడుట లేదు కదా అన్నాడు . అవును నాకు కళ్ళు కూడా  సరిగా కనబడుటలేదు అన్నాది.            
సరే డాక్టర్  గారువస్తారు నీవు కాస్త బయట ఉండు అన్నాడు.  సరే నండి  అట్లాగే అన్నాది.
 అప్పుడే శిరీష ను పెంచిన తండ్రి సుబ్బారావు గారు లోపలకు వచ్చారు. మీకు నమస్కారము అన్నాడు మీకు  పరిస్తితి బాగుండక మాపాప మీకు ఇచ్చాను,  నా భార్యకు కూడా  తెలియదు, ఆనాడు కమల పిల్లలు నాకు పుట్టారు, మీదగ్గర పెరిగిన పాపకు మీరు శిరీష అని  పేరు పెట్టారు, నాదగ్గర పెరిగిన పాపకు ప్రత్యూ ష అని పెట్టాను.
ప్రత్యూ ష  భర్తతో కలసి కారు ప్రమాదములో చనిపొఐనారు. మీ దగ్గర పెరిగిన శిరీష లో ప్రత్యూషను చూసు కుంటు న్నది నాభార్య పార్వతి. అది తప్పుగా భావించకండి మిమ్మల్ని ప్రాదేయపడుతున్నాను అన్నాడు శంకర్ రావుగారు.
అందరి సముఖములో శంకరరావు గారి ప్రాణం అనంత వాయువులలోకలసి పోయి నిది.
దహన  సంస్కారాలు పూర్తి చేసాడు లోకేష్. అందరి సమక్షములో సీల్డు కవరువిప్పి చదివాడు లోకేష్
    
నేనుసంపా దించిన ఆస్తిని, రెండు భాగాలు చేసి ఒకభాగము నా భార్య ఐన పార్వతికి, మిగిలిన భాగము నా రెండో కూతురు అగు శిరీషకు చెండునాట్లుగా, మరియు నా భార్య తదనంతరం ఆస్తి పూర్తిగా నా మనవరాలు అగు "తరణి " చెందు నట్లుగా రిజిస్టర్ చెయట మైనది. నా పెద్ద కూతురు పత్యూ ష , భర్త మహేష్ కలసి సంపాయించిన ఆస్తిని, కూతురు తరణి పెళ్లి చేసిన తర్వాత మిగిలినది అల్లుడు కు చెప్పి తరణి పేరుతొ ఉంచవలెను, అప్పటి దాకా ఐ ఆస్తులమీద  యజమాయిషిగా నేను "లోకేష్ ను " కర్తగా రిజిస్టర్ చెసియున్నాను.
 ఇక పాప తల్లి తండ్రులు "శిరీష - లోకేష్ "
అందరు సంతోషముగా ఉండగలరని నేను ఆసిస్తున్నను. ఇక సెలవు

అందరు విన్నారు.
అప్పుడే సుబ్బారావు గారు వచ్చి తరణి మా పాప అన్నారు, శిరీష లోకేష్ మావగారు ఈ పాప నా పాప, నా బంగారు పాప , ఏమిటి నా మనవరాలును పట్టుకొని మీరందరు  నా పాప అంటున్నారు అసలు పత్యూ ష్  మహేష్ పాప
అంటూ  ప్రత్యూ ష మహేష్ ఫోటోకి  దండ వేసి, మరియు శంకర్ రావు గారి ఫోటో కు దండ వేసి  ఈ మనవరాలు మీరన్దరి పాప కాదు నాపాప అన్నాది పార్వతమ్మా
అవును ......  అవును.......... అవును......