ప్రాంజలి ప్రభ
సర్వే సుఖినోభవంతు
సీతారామ కల్యాణం (వాల్మీకి విరచి రామాయణం)(మల్లాప్రగడ రామకృష్ణ అంత్య ప్రాస భావ సీతారామ కల్యాణం)
ప్రతి ఒక్కరు అర్ధం చేసుకొనుటకు తేట తెలుగులో అంత్య ప్రాస పదాలు గల వ్యాక్యాలు వ్రాయటము జరిగినది. దీనికి మూలమ్ ఆదికవివాల్మికి వ్రాసిన రామాయణము ఆధారముగా వ్రాయటము జరిగినది. ఈ రామాయణము కేవలము నా ఊహల్లొ, నామదిలో మెదిలిన ఆలోచనలు ఆధారముగా వ్రాయట మైనది ఇందులో తప్పులున్న క్షమించ గలరు , ఎందఱో మహానుభావులు, రచయతులు , కవులు భారత మాట ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున నా వందనములు.
రావణుని శక్తి ఋషులపై పడింది, నారాయణ జపం చేయకుండా ప్రజలను హింసించడం మొదలైనది.
1. దేవతలు ఋషులు రావణ చేష్టలకు అనుభవించారు నరకం
విష్ణుమూర్తి వద్దకు వెళ్లి దేవతలు,ఋషులు కోరారు పరిష్కారం
రావణునకు పుణ్యం తగ్గి పాపం పెరిగేదాక ఉండాలి సహనం
అందరూ రామాయణం చదవడం మనశ్శామ్తికి శ్రేయస్కరం
.
2.నారదుడు సంచారము చేస్తూ వాల్మీకిని కలిసాడు అరణ్యం
వాల్మీకి నారదుడిని కోరే తెలపండి శ్రేష్టుడి కధా వివరం
లోకంలో ధర్మజ్నుడు, కృతజ్ఞుడు గురించి తెలిపెద సత్యం
నారద మహాముని వాల్మీకికి తెలిపే రామాయణ మహత్యం
3.సరయూ నది సమీపమున ఉన్నది కోసలమను పెద్ద దేశం
. అందులో సమృద్ధి వనరులు గల అయోధ్యా పట్టణం
మను మహారాజు దానిని స్వయముగా చేసే నిర్మాణం
నారద మహాముని వివరించే అయోధ్యా పట్టన విషయం
4,దశరధ మహారాజు అయోధ్యా నగరాధీశo
సమస్త ఉపయోగకర వస్తువుల సంగ్రహం
తేజోవంతమైన పాలన పురప్రముఖలకు ప్రియం
దశరధునిపరిపాలన ప్రజలు అంటారు అమోఘం
5.నాస్తికుడనే వాడు కనిపించడు, నగర మంతా భక్తి మయం
కాముకులు, క్రూరులు, లేని ప్రాంతంగా ప్రజలు సుఖమయం
దరిద్రుడు, విద్యలేనివాడు, కనిపించని పరిపాలనా మయం
దశరధమహారాజు పరిపాలన ప్రజలకు సుఖసంతోషమయం
6. భ్రాహ్మాణులు పతిరోజు వేదాద్యయన పారాయణం
క్షత్రియులు ధైర్య సాహసాలతో చేస్తారు వీర ధర్మం
వైశ్శులు ధర్మమార్గమున చేస్తున్నారు ధనసంపాదనం
శూద్రులు భ్రాహ్మాణ, వైశ్య, క్షేత్రియులకు సేవాతత్పరం
7.అల్లుడుగా విచండ మహర్షి యొక్క కుమారం
ఋష్య సృమ్గుడు వదిలెను బ్రహ్మ చర్యం
స్త్రీలపై బ్రమలు పెట్టుకొని చేరే అయోద్యానగరం
దశరధుడుకుమార్తెశాంతను ఇచ్చిచేసే వివాహం
8. కామ, క్రోద, లోభ, మద, మాచ్చర్యములపై ఉండాలి నిగ్రహం
ఆశ్రమధర్మమ్ భంగం కలుగనీయకుండ నెరవేర్చుకోవాలి అభీష్టం
సత్కర్మలు చేసినందు వల్ల అరిషడ్వర్గాలను జయించగలం
సేవకులపై, స్త్రీలపై, దురహంకారం చేసితే కలుగును అగౌరవం
.
9.రాజ్యంలో ప్రజ లందరూ సుఖ శాంతుల మయం
శివ భక్తులు వారి నిత్యపారాయణం పంత్యాక్షరి మంత్రం
విష్ణు భక్తులు నిత్య పారాయణం నారాయణ మంత్రం
రాజవంశంలోఅందరు పుత్రులుకొరకు చేస్తున్నారు యజ్ఞం
. .
10పుత్రుల కొరకు దశరధ మహారాజు చేసే అశ్వమేధ యాగం
సంవత్చర కాలంలో అన్ని రాజ్యాలు తిరిగి వచ్చే యజ్ఞాస్వం
సామంత రాజులు పండితులు చేరిరి యజ్ఞ శాలం
దేవతలకు ఆవిర్భాహం కోసం చేసారు యజ్ఞ హోమగుండం
. .
దశరధ మహారాజు భార్యా (కౌసల్య) సమేతంగా చేసే యజ్ఞం
జాగరణతో, నిష్టతో, మొదటి రోజు చేసే జంతు హోమం
రెండవరోజు నుక్త్వమ, మూడవ రోజు ననిరాత్రి చేసే హోమం
అశ్వ మేధ యాగం ఋషులు పండితులు చేసే సమ్పూ ర్ణం
.
11. పుత్రులకొరకు దశరధుడు ప్రారంభిమ్చే పుత్రకామేష్టి యాగం
యధర్వన, వేద మంత్రాలతో చేసే బ్రహ్మాండ మైన హోమం
దేవత లందరు వచ్చి గ్రహించారు యజ్ఞ హవిర్భాగం
దేవతలు, ఋషులు, పుత్రసంతానం కలగాలని ఆశీర్వాదం
. .
12. రాక్షసులు చేసే ఘోరాలకు ప్రజలందరిలో కలిగే భయానకం
దేవతలు, ఋషులు, కోరే నారాయణుని పాహిమాం పాహిమాం
శేష శయ్యపై చిరు నవ్వుతో నారాయణుడు లక్ష్మీ సమేతం
నారాయణ స్వరూపమ్ విశ్వ మంతా ఆవిర్భావం
.
13. సమస్త ప్రాణుల స్థితి జ్ఞాన వైరాగ్యమునకు హేతుం
రూప ద్వందములు లేని సమస్తమునకు పరమేకం
మీరందరూ ఆత్మజ్ఞాన హృదయంతో ప్రార్ధించుట భావ్యం
సంయమనం పాటించండి నేను చేస్తాను రాక్ష సంహారం
14. సమస్త సమస్య భందన ఛేదం
హృదయాన మొహభందన నిరోధం
సర్వ భంధ విముక్తితో కలిగే మోక్షం
లోకమంతా శివ నారాయణ తత్త్వం
. .
15. భావ, అభావాలు లేని యోగ మయం
నిత్యమూ యోగులచే ధ్యానించే వందేరామం
విశ్వమంతా వాంఛించే భక్తితో ప్రార్ధణామయం
శివ నారాయణలను ఆరాధించెను భూలోకం
16/ హే భగవాన్, ఓ పరమాత్మా గుర్తిమ్చ వేమి మా కష్టం
ఎమీఎరుగని స్త్రీలపై, అమాయకులపై రాక్షసుల అఘాఇత్య0
రాక్షస చర్యలకు మేమందరం మూకమ్మడిగా ఆత్మ త్యాగం
ఈ ధరనిపై కష్టాలు మేము భరంచ లేమని ప్రజల ఆర్తనాదం
17. పృధ్విపై పెరిగే వటవృక్షంలా నాటుకు పోయిన రాక్షసుల కృరత్వ0
దరహాసం అనేది ప్రజలు నోచు కో లేని భయానక జీవిత0
రాక్షస మాయతొ, కామందులు, మూర్ఖులు విలయ తాండవం
శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ మునులుదీక్షతొ చేస్తున్నారుయజ్ఞం
18. శ్వేతాంబరదారి పాహిమాం పాహిమాం
పీతామ్బరదారి రక్షమాం రక్షమాం
దిగంబరదారి ప్రణామం ప్రణామం
రాక్షసులచేతిలోచిక్కి అవుతున్నాంనిర్జీవ0
. 19. ప్రార్ధనలతో చెప్పుకుంటున్నారు బ్రతకలేము ఈ దర్భర జీవితం
పరమాత్మ వచ్చి రక్షిస్తాడని ప్రజలందరి ఆత్మా విశ్వాసం
దేశం సర్వతోముఖముగా ఉండాలని చేస్తున్నారు హోమం
మమ్ము సృష్టించిన పరమాత్మునిపై పెడుతున్నాము భారం
20. సమస్త శాస్త్ర సమ్మిళిత మైన వేదాంత మయం
సకలప్రాణుల రక్షణకు విష్ణువు కోసల్యా గర్బం చేరే సంకల్పం
సమస్త ప్రాణుల హ్రుదయానందం లో ఆనంద మయం
దేవతలు, ఋషులు, మునులు, అనుభవించారు ఆనందం
యజ్ఞగుండం నుండి విశాల దేహుడు ఆవిర్భావం
హస్తములందు తేజరిల్లు పూర్ణ కుంభ పాయసం
భార్యలతో త్రాగిమ్చుము కలుగును పుత్రసంతానం
యజ్నపురుషుడు అందిచే దశరధునికి పూర్ణకుంభం
పూర్ణకుంభం నుండి కౌసల్యకు పంచే పాయసం అర్ధ భాగం
సుమిత్రకు ఒసమ్గె పాయసం అర్ధ భాగంలో అర్ధ భాగం
మిగిలిన అర్ధ భాగంలో కైకకు పంచే పాయసం అర్ధ భాగం
మరల పంచే సుమిత్రకు మిగిలిన మొత్తం పాయసం
శ్రీ రాముని జననం
దశరధుని వాంచా ఫలసిద్దికోరకు విష్ణువు ప్రవేసించే కౌసల్యా గర్భ0
దేవతా స్త్రీల యందు దేవతల అంశలు ప్రవేసిమ్చుటకు సిద్దం
కొందరు భల్లూకములుగా, మరి కొందరు వానరులుగా జననం
ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు జననం
కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు ఉండే పునర్వసు నక్షత్రం
కర్కాటక లగ్నమునందు గ్రహములన్నియు ఉండే ఉచ్చస్తానం
దివ్య మంగళ విగ్రహుడైన, సుందరుడైన కుమారుడు జననం
కైకకు పుత్ర జననం మరియు సుమిత్రకు పుత్రులు జననం
. సర్వ దేవతలు కురిపించిరి పుష్ప వర్షం
గందర్వులు చేసారు అద్భుత గానం
అప్సరసలు చే సా రు అద్భుత నృత్యం
ఋషులు లేక్కకట్టారు కుమారుల జాతకం
పుత్రులకు చేసే బ్రహ్మ ఋషులు నామకరణం
కౌసల్యా సుతుడైన జేష్టునకు శ్రీ రామం
కైకేయ గారాల సుతునకు భరతం
సుమిత్రా పుత్రులకు లక్ష్మణం, శత్రుఘ్నం
హనుమంతుని జననం
అంజనా గర్భమునందు శివ తేజస్సుతో పుత్ర జననం
వానర రాజు ముద్దుగా పిలుచు కొనెను ఆంజనేయం
వాయుపుత్రుడు సూర్యుని పండుఅని తినుటకుచేరే గగనం
ఇంద్రుని వజ్రాయుధం తగిలి భూమిపై పడె సజీవ శరీరం
వాయు దేవుడు స్తంభిమ్చే పవనం
ఋషులు దేవత లందరు ప్రత్యక్షం
త్రిమూర్తులు బ్రతికించే వాయునందనం
అనేకవరాలతో ఇచ్చే అందరు ఆశీర్వాదం
లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువు శ్రీరాముడుగా అవతారం
ధర్మ భోధ శాస్త్రములలో రామాయణం కావ్యం అగ్రగణ్యం
వేదములతొ సమానమైన రామాయణం ప్రజలకు మర్గదర్శ0
నారదుని ఉప దేశాను సారం రామాయణం వాల్మీకి కృతం
.
రాజ కుమారులను అల్లారు ముద్దుగా పెంపకం
శ్రీరాముడనగా ప్రతి ఒక్కరికి అమిత ప్రేమ మయం
అన్నదమ్ములు కలసి ఆడుకుంటే అందరికి ఆనందం
దశరధ మహారాజుకు శ్రీ రాముడంటే ప్రాణానికి ప్రాణం
రాజ కుమారులు ప్రతి దినం వేదముల యొక్క స్వాద్యనం
తల్లి తండ్రులపై ప్రేమ, అందరి హృదయాలలో సుస్తిరస్థానం
కుమారులు ప్రతిరోజూ విలువిద్య, సకల శాస్త్రముల అభ్యాసం
పది సంవస్చరములలొ సకల విద్యలలో పొందే నైపుణ్యం
..
అయోధ్యలో ప్రతిఒక్కరు పాటలుగా పాడుచున్నారు రామనామం
ఉన్న నామములో కెల్ల ఉన్నత మైనది రామనామం
వరుస ఎవ్వరు విన్న వాడి చెడని నామం రామనామం
ఏజాతివారికైనా ఎమ్గిలిలేని ఎదలో నిల్చిఉన్న నామం రామనామం
కలియుగంలో కన్నవారికి కనువిందు చేసే కమనీయ నామం రామనామం
వానకు తడవని, ఎండకు కరగని, చలికి చలించని నామం రామ నామం
ఎపుట్ట చూసిన ఎగట్టు చూసిన చెదలు పట్టని నామం రామనామం
ఇహము పరము సర్వ సుఖములు ఇచ్చు నామం రామనామం
నమ్మిన వారికి కొంగు బంగారమై ఉన్న నామం రామ నామం
కోరినవారికి కోరికలు తీర్చి సంతోషము పంచే నామం రామనామం
రామ భక్తులకు మోక్షము ప్రసాదించే జపనామం రామనామం
గాలిలో తేలి గగనము నందు మారుమ్రోగే నామం రామనామం
అక్షర జ్ఞానము లేని ఆది మానవులను ఆదుకొన్ననామం రామనామం
చిందులు వేసే చిలకపలుకుల నామం రామ నామం
చింతలు తీర్చి చిరునవ్వులనవ్విమ్చే నామం రామనామం
నిగ్రహశక్తి, ధైర్యమును ప్రజలకు కల్పించే నామం రామనామం
రామభక్త హనుమంతుని నిత్యము పలికే నామం రామనామం
వసిష్ఠ మహర్షి దశరధ కుమారులకు కొన్ని సూక్తులు తెలియపరిచారు
1. శిష్యుడు : భూమిని సృష్టించుటకు పూర్వము ఎవరున్నారు ?
గరువు : పంచ భూతములు ఈశ్వరుడు.
2. శిష్యుడు : భూమిని జీవ రాసిని ఎవరు సృష్టించారు ?
గరువు : ఈశ్వరుడు.
3. శిష్యుడు : సృష్టిని ఎవ్వరు వృద్ది పరుస్తారు ?
గరువు : బ్రహ్మ దేవుడు.
4. శిష్యుడు : బ్రహ్మ దేవుడు ఎవరు ?
గరువు : ఆది పరా శక్తి
5. శిష్యుడు : సృష్టిని పాలిమ్చేదెవరు ?
గరువు : శ్రీ మహా విష్ణువు
6. శిష్యుడు : విష్ణువు ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి
7. శిష్యుడు : సృష్టిని లయము, ధ్వంసం చేసేదెవరు ?
గరువు : ఈశ్వర శక్తి
8. శిష్యుడు : బ్రహ్మిణి ఎవరు ?
గరువు : బ్రహ్మదేవుని శక్తి
9. శిష్యుడు : లక్ష్మీ దేవి ఎవరు ?
గరువు : విష్ణువు యొక్క శక్తి
10.శిష్యుడు : పార్వతి ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి
11. శిష్యుడు: సంసార సాగరాన్ని తరిమ్పచేసేదెవరు?
గురువు: ఈశ్వరుదు
12. శిష్యుడు: భంధం అంటే ఏమిటి ?
గురువు: విషయాను రక్తి .
13. శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి ?
గురువు: విషయం వళ్ళ విరక్తి చెంది ఈశ్వరునిలో లీనము కావడం.
14. శిష్యుడు: ఘోరమైన నరకము ఏది ?
గురువు: మానవ శరీరమ్ .
15. శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది ?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమె స్వర్గం.
16. శిష్యుడు: సంసార భంధం ఎట్లా తొలగి పోతుంది ?
గురువు: ఆత్మ జ్ఞానము వలన.
17. శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది ?
గురువు: తత్వజ్ఞానము వలన .
18. శిష్యుడు: నరకమునకు కారణమేది ?
గురువు: ఆశ, తృప్తి లేక పోవడం.
19. శిష్యుడు: స్వర్గ ప్ర్రాప్తికి కారణ మేమి ?
గురువు: అహింస, దాన గుణం, గౌరవించే లక్షణం.
20. శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు ?
గురువు: అతని ఇంద్రియాలు
21. శిష్యుడు: మనిషికి మిత్రు డెవరు ?
గురువు: వశీక్రుతములైన ఇంద్రియాలు
22. శిష్యుడు: దరిద్రు డెవరు ?
గురువు: పరమ లోభి ఐనవాడు
23. శిష్యుడు: ఇశ్వర్య వంతు డెవడు ?
గురువు: ఎప్పుదూ సంతృప్తిగా ఉండేవాడు
24. శిష్యుడు: జీవన్ మృత్యు డెవడు ?
గురువు: ప్రయత్నమే చేయని పురుషుడు.
25. శిష్యుడు: మాయ అంటే ఏమిటి ?
గురువు: అతి ప్రేమ
26. శిష్యుడు: మహా అందు డెవడు ?
గురువు: కామాతురుడు.
27. శిష్యుడు: మ్రుత్యు వంటే ఏమిటి ?
గురువు: అపకీర్తి.
28. శిష్యుడు: చిరకాలము ఉండే రోగం ?
గురువు: సంసారం .
29. శిష్యుడు:రోగమునకు మందేమిటి ?
గురువు: నిర్లపుడై ఉండటం, దయానం చేయడం
30. శిష్యుడు:ప్రధాన తీర్ధమేది ?
గురువు: పవిత్రమైన మనస్సు
31. శిష్యుడు: త్యాజ్య మేది?
గురువు: అర్ధము- దురాశ
32. శిష్యుడు: వినదగినదేది ?
గురువు: గురు సంనిధిలో వేదాంత భోధ
33. శిష్యుడు: బ్రహ్మ ప్రాప్తికి ఉపాయమేమి ?
గురువు: సత్ సాంగత్యం, స్త్రీ సహకారం
34. శిష్యుడు: సాధువు ఎవడు ?
గురువు: మోహము, అనురాగము లేనివాడు
35. శిష్యుడు: జీవునికి జ్వరమేది ?
గురువు: చింత, అనుమానం
36. శిష్యుడు: మూర్ఖు డనేవాడేవడు ?
గురువు: అవివేకి, ఆశావాది
37. శిష్యుడు: నాస్తికుడనె వాడేవడు ?
గురువు: ఈశ్వరుని సకితి తెలియనివాడు
38. శిష్యుడు: నిగ్రహ శక్తి నిచ్చేవాడు ?
గురువు: ఈశ్వరామ్శ గలవాడు
39. శిష్యుడు: పండితు డనే వాడేవడు?
గురువు: మహా జ్ఞాని
40. శిష్యుడు: ధార్మికుడు డనే వాడేవడు?
గురువు:యదార్ధ పండితుడు
41. శిష్యుడు: ఎవరి సాంగత్యం చెయకూడదు ?
గురువు: మూర్ఖునితో, పాపితో, దుర్మార్గుడితో, వేశ్యతో
42. శిష్యుడు: ఎవరు పశువు ?
గురువు: పాపి
43. శిష్యుడు: లోకులకు తెలియనిది ఏది?
గురువు: స్త్రీ వయస్సు, స్త్రీ చరిత్ర
44. శిష్యుడు: సంకెల, భంధం ఏది?
గురువు: స్త్రీ ప్రేమ
45. శిష్యుడు: భుద్ధిమంతుడెవడు?
గురువు: స్త్రీ కి వశము కానివాడు
46. శిష్యుడు: ఉత్తమ వ్రతమేది ?
గురువు: సత్పాత్ర దానం
47. శిష్యుడు: ధన్యుడైనవాడెవడుు?
గురువు: పరోపకారి
48. శిష్యుడు: కర్తవ్యం ఏమిటి ?
గురువు: మొహం లేదా పాపం
49. శిష్యుడు: పూజనీయుడైనవాడెవడు?
గురువు: తత్వజ్ఞానిఐన వ్యక్తి
50. శిష్యుడు: సుఖవంటి వాడెవడు ?
గురువు: చిమ్తలేనివాడు
51. శిష్యుడు: దుఖితిడెవడు ?
గురువు: వియానురక్తి కలవాడు
52. శిష్యుడు: జద్విజేత ఎవరు ?
గురువు: మనస్సును జఇమ్చినవాడు
53. శిష్యుడు: లాభమంటేఏమిటి ? గురువు: బ్రహ్మజ్ఞాన ప్రాప్తి
54. శిష్యుడు: విద్య అంటే ఏమిటి ? గురువు: బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది
55. శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు: భగవంతుని పట్ల భక్తీ
56. శిష్యుడు: కనిష్టుడు ఎవరు ?
గురువు: యాచిమ్చువాడు
57. శిష్యుడు: జైష్టుడు ఎవరు ?
గురువు: ఎవ్వరిని యాచిమ్చనివాడు
58. శిష్యుడు: జన్మించిన వారెవరు?
గురువు: మరలా జన్మలేనివారు
59. శిష్యుడు: చని పొఇనవారెవరు ?
గురువు: తిరిగి చనిపోవలసిన అవసరం
60. శిష్యుడు: విశ్వాసము కలవారెవరు?
గురువు: తత్వజ్ఞాని
61. శిష్యుడు: అసలైన మిత్రుడు ఎవరు ?
గురువు: ఆపత్కాలములో సహాయము చేసినవాడు
62. శిష్యుడు: దేనివలన భయ పడాలి?
గురువు: లోక అపవాదు వలన
63. శిష్యుడు: చిరస్తాఇ ఏది ?
గురువు: కాలం
64. శిష్యుడు: దినదినము కరిగి పోఎదిఎది ?
గురువు: వయస్సు
65. శిష్యుడు: దానం చేసినకొద్ది పెరిగేది ఏది?
గురువు: పుణ్యం
66. శిష్యుడు: భయము వచ్చినప్పుడేమి చేయాలి ?
గురువు: ఈశ్వరుడిని ప్రార్ధించాలి
67. శిష్యుడు: ఏది దాన యోగ్యమైనది ?
గురువు: అభయ ప్రదానము
68. శిష్యుడు: మనో వినాశనము అంటే ఏమిటి ?
గురువు: మోక్షము
69. శిష్యుడు: ద:ఖమునకు మూలమేది ?
గురువు: మాయ
70. శిష్యుడు: ఏమిచేస్తే దు:ఖము కలుగదు ?
గురువు: ధర్మమము ఉపాసన
71. శిష్యుడు: విశ్వసిమ్ప దగిన వారెవరు?
గురువు: స్త్రీ (భార్య)
72. శిష్యుడు: తల్లి తండ్రు లెవరు ?
గురువు: పెంచి పోషించేవారు
73. శిష్యుడు: భార్య ఎవరు ?
గురువు: సుఖ పెట్టి సుఖపడెది
74. శిష్యుడు: చంచలమైనది ఏది ?
గురువు: మనస్సు, యవ్వనము, ఆయువు, ధనము
75. శిష్యుడు: ఎ పని మంచిది ?
గురువు: దేవుని ప్రార్ధిమ్చటమ్
76. శిష్యుడు: చేయ్యకూడని కార్యమేది ?
గురువు: పాప కార్యము
77. శిష్యుడు: దేనికోసం ప్రయత్నం చెయకూడదు ?
గురువు: సంసారం
78. శిష్యుడు: దేనిని ప్రేమించాలి ?
గురువు: ప్రకృతిని
79. శిష్యుడు: మిత్రులు-శత్రువులు ఐనవారెవరు
గురువు: పుత్రులు, పుత్రికలు
80. శిష్యుడు: దేనివడ్డ కలతలు వస్తాయి ?
గురువు: దానం వద్ద
81 వినయం ఎట్లా ఏర్పడుతుంది?
గురువులను విద్య వంతులను, సేవిమ్చాడంవల్ల వినయం అలవడుతుంది
82 ఆత్మ సంపాదనం అంటే ఏమిటి?
పెద్దల సహవాసం చేసి సంపాదించుకొన్న విజ్ఞానంచేత తనను సంపాదించుకోవాలి. వినయం,
విజ్ఞానం ఈ రెండూ లేనివాడు తనను తానూ కోల్ఫోఇనట్లే. ఈరెండూ ఉన్నవాడు తనను తానూ చక్క
బరచుకొన్న వాడవుతాడు, ఆత్మ సంపాదనం అంటే ఇదే.
83 రాజ్యపాలనకు అవసరమైనవి ఏవి?
అమాత్యులు, మిత్రులు,ధనాగారం,రాష్ట్రం,దుర్గం, సైన్యం ఈ ఆరింటిని వక్రుతులని పేరు. రాజ్యపాలను కావలసినవి ఇవే.
84 మంత్రులంటే ఎవరు?
ఏది చేయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకో గలికిన వాళ్ళే నిజమైన మంత్రులు.
85 మంత్రిగా ఎవరిని తీసుకొవాలి?
శాస్త్రజ్ఞానం ఉన్న, ఎ ప్రలోభానికీ లొమ్గనివాణ్ణి మంత్రిగా చేసుకోవాలి, ధనం, స్త్రీ మెదలైనవాటిని ఎరచూపి రహస్యముగా పరీక్షిమ్చడమ్ అలాంటి పరిక్షలలో పరిసుద్ధుడుగా తెలినవాడు "ఉపధాశుద్ధుడు"
86 రహస్యం ఎట్లా బయటబడుతుమ్ది?
ముగ్గురు కలిస్తే వాళ్ళు ఒకేమాట మీద ఉంటారనేదె నమ్మజాలని విషయం. ఆలాంటప్పుడు ఇద్దరుచేసిన మంతనాలు మూదొవాడికి తెలిస్తే దాగుతాయా?
87 రాజ్య తంత్రం అంటే ఏమిటి?
లేనిదాన్ని సంపాదించడం, సంపాదిమ్చినదాన్ని రక్షించుకోవడం దాన్ని వృద్ధి పోమ్దిమ్చుకోవడం, తగిన రీతిలొ వినియోగించడం. ఈ నాలుగే రాజ్యతంత్రం (రాజ్య వ్యవహారం) అంటారు.
88 అన్ని పనులకు మూలమ్ ఏమిటి?
అన్ని పనులకీ మూలమ్ మంత్రం (మంచి ఆలోచన)
90 ఎవరితో విరోధం పెట్టుకో కూడదు ?
బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్న వాడితో విరోధం పెట్టు కోవాలి, తనకంటే ఎక్కువ బలం ఉన్న వాడితో గాని, సమునితొ గాని విరోధం పెట్టుకోకూడదు.
91 ఆత్మ రక్షణ అంటే ఏమిటి?
శత్రువులతో విరోధం వల్ల అనగా శత్రువులు విరోధం చూపు తున్నప్పుడు ఆత్మ రక్షణ చేసికోవాలి లేదా శత్రువులతో విరోధంకంటే ఆత్మ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
92 శక్తి లేనివాడు ఏమిచేయాలి?
బలవంతుని ఆశ్ర ఇమ్చాలి, దుర్బలున్ని ఆశ్రయిస్తే కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లే.
93 ఇంద్రియాలకు లోమ్గినవాడెమవుతాడు?
ఇంద్రియాలకు లొంగి పోఇనవాడు చతురంగబలం ఉన్న నశిస్తాడు. గజ-తురగ-రాధా-పదాతు లానే చతురంగాబలం ఆనాడు,
వాయుసేనా, జలసేనా, యుద్ధసకట, సైనికులనేవి ఈనాడు చతురంగబలం.
94 శిష్యుడు:దండ నీతి అంటే ఏమిటి?
దండం అనగా అపరాదుల్ని శిక్షిమ్చడమ్, రాజ్య్యాన్ని పాలించాడం. శత్రువు దండ నీతికిలోమ్గుతాడు. దండంలో పరుషంగా ఉంటే అమ్దరికీ ద్వేష పాత్రుడు అవుతాడు.
95 శిష్యుడు:పురుష ప్రయత్నం అంటే ఏమిటి?
దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. అనగా పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా దానంతట అదే తోడ్పడుతుంది.
96 అనుకున్నవి జరుగక పోవడం కారణం?
దైవదోషం చేతా, మానవ దోషంచేతా పనులు జరుగవు.
97 లోకం ఎవరిని గౌరవించదు?
గురువు: ఎంత చదువు వడైనా శక్తి లేని వాణ్ణి లోకం గౌరవించదు.
98 అర్ధం - అనర్ధం అంటే ఏమిటే?
స్త్రీ రిద్వారా వచ్చిన అర్ధం (ధనం) దానికి విపరీతమ్గా 'అనర్ధం' (అపకార హేతువు) అవుతుంది.
99 ఎవరిని నమ్మ కూడదు ?
చడీలు చెప్పే వారిని నమ్మకూడదు. చాడీలు చెప్పే వారిని భార్య పుత్రులు కుడా విడిచి పెడతారు.
100 ముసలి తనం అంటే ఏమిటి ?
పురుషుడికి మైధునం ముసలితనం (దౌర్బల్య హేతువు), స్త్రీకి మైధునం లేకపోవడం ముసలితనం.
101. సంతోషం ఎట్లా వస్తుంది?.
అసంతుష్టుడైన వ్యక్తీ ఎవరినీ సంతుష్టుని చెయ్యలేడు. సంతుష్టుడైన వ్యక్తీ అందరిని సంతోషపరుచగలడు
102. అనర్ధాలకు మూలమేది ?
అన్ని అనర్ధాలకు మూలము ఆలస్యమే అందువలన ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా ఆలస్యాన్ని పరిత్యజిమ్చాలి.
103. పరీక్ష అనగానేమి?
ఈ ప్రపంచమునందు ధర్మాధర్మములకు పరీక్షాస్థలము. అందువలన సావధాన చిత్తులై, ధర్మాధర్మ పరీక్ష చేసి పనులను చేయాలి.
104. సహవాసమంటే (స్నేహం) ఏమిటి?
. సజ్జన స్నేహం స్వర్గం, దుర్జన స్నేహం నరకం.
105. హింస అంటే ఏమిటి?
ఎవరినీ ఎప్పుడూ హింసించకూడదు. మంచి ఉద్దేస్యమితొ కాని చెడు ఉద్దేస్యముతో కాని ఎ ప్రాణిని ఎ సమయములో హింసించ కూడదు.
106. మొక్షమునకు మార్గాము లేవి?
ఆత్మజ్ఞానము, సత్పాత్రదానం,సంతోషముగా ఉండటమే మొక్షమునకు మార్గాము
107. చింతన అంటే ఏమిటి?
చింతన శీలము (ఆత్మవిమర్శన) అమరత్వము పొందడానికి మార్గం.అధర్మ చింతనయే మృత్యువుకు మార్గం
108. శత్రువు ఎవరు?
చేడుమార్గాములో నడిచే మనస్సు.
109. విద్య సముపార్జన అంటే ఏమిటి ?
తేనటీగ పూల సౌందర్యము సుగంధములు చెడకుండా తేనెను మాత్రం ఎట్లా గ్రహిసుమ్దో, అట్లాగే నీవు కూడా పాపములు అంటకుండా విద్య సముపార్జన చేయాలి.
110. జయమంటే ఏమిటి ?
యుద్ధములో లక్షమందిని జఇమ్చిన వాడు నిజమైన విజేత కాడు,తనను తానూ జ ఇమ్చిన వాడె నిజమైన విజేత, అదే నిజమైన జయం.
నిస్పృహ చెందవలసిన పనిలేదు శక్తిని పెంచుకోండి
అంతర్గత శక్తిని గ్రహించి ధైర్యముతో పైకి లేవండి
సంకల్పానికి నడుంకట్టి సాధించడానికి సంకల్పిమ్చండి
భాద్యత మొత్తాన్ని సృష్టి కర్తవల్ల జరిగిందని మరువకండి
.
వ్యక్తిత్వ వికాసం ప్రతిఒక్కరు పెంచుకోండి
లైమ్గిక కోరిక మనసు లోకి రానీయకండి
భయం వదలి నిర్భయముగా బ్రతకండి
అహంకారం అణువంతకుడా రానీయకండి
బుద్ధిని వికసిమ్ప చేసే విద్య నభ్య సిమ్చండి
మానసిక శక్తిని పెంచే యోగాసనాలు చేయండి
భవిషత్ గురించి ఎటువంటి ఆశలు పెట్టుకోకండి
జగతిలో మిమ్మల్ని గుర్తించే వారిగా ఎదగండి
.
యువకులార గురువు వద్ద విద్యలు నేర్చు కొండి
మీ భుజ బలంతో పాటు భుద్ది బలం కూడ పెంచు కోండి
వేదాంత సారాన్ని అర్ధం చేసు కోవ టానికి ప్రయత్నించండి
దినచర్యలో పెద్దలను,గురువులను గౌరవించటం మరువకండి
వల్లమాలిన మంచితనం ప్రవర్తిమ్చ్ కండి
ఎప్పుడూ కష్టాలను ధైర్య ముగా ఎదుర్కొండి
ప్రతి పనిని నమ్మకంతో చేయగలనని చెప్పండి
రాజవంశానికి చెందిన ఆచారాలను మరువకండి
మచ్చలేని పవిత్రమైన రాజ్యముగా పాలించండి
అజ్ఞానులకు వెలుగును చూపి జ్ఞానులుగా మార్చండి
అసమర్ధత, సోమరితనం నిజమైన పిరికితనమండి
ప్రజల అవసరాలు తెలుసుకొని సహకరించండి
బ్రహ్మ చర్యమును నిర్లక్షము చేయ కండి
. ప్రేమ, కారుణ్యం,శాంతి, సంతోషములు పంచండి
. ప్రజలకు నిజాఇతి చిత్త సుద్ధి కల్పిం చండి
. ఆత్మ విశ్వాసంతో ధర్మ పరిపాలన చేయండి
. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చె యాగ రక్షణకు
యాగ రక్షణకు శ్రీ రాముని కోరి దశరధుడు పంపెను వర్తమానం
మహ తెజో వంతుడు విశ్వామిత్రుడు అయోధ్యకు ఆగమనం
పరమ ఉదార స్వభావుడు దశరధుడు విశ్వామిత్రునకు సన్మానం
. రాజర్షులు మమ్ము అనుగ్రహించండి, తెలపండి మీ మనోరధం
నా మనస్సు వెధిస్తూ ఉన్నది కోరిక తీరుస్తారా లేదా అని సంశయం
మహారాజ నేను సిద్ధినికోరి ప్రారంభించాను మహాయజ్ఞం
రాక్షసులు యజ్ఞమునకు కలిగిస్తున్నారు ఆటంకం
వారిని ఎదుర్కొని కోప తాపలతో చేసే యజ్ఞం వ్యర్ధం
. వారిని చంపే తపశక్తి ఉన్న చేయను వారితో యుద్ధం
రాజ యాగ రక్షణకు శ్రీ రామూడ్ని పంపి చేయండి సహాయం
విశ్వామిత్ర కోరిక విన్న దశరధ మహారాజు చెందే విస్మయం
యాగ రక్షణకు నేనే స్వయముగా వస్తానని విన్నపం
దశరధ మాటలయందు తొనికిసలాడుతుంది పుత్రవాత్సల్యం
విశ్వామిత్రుడు కోపముతో రఘు వంశీయులకు తగదు ప్రతిజ్ఞాభంగం
వసిష్ఠ మహర్షి దశరధుని పిలిచి శాంతింప చేయండి విశ్వామిత్ర కోపం
ధైర్యవంతులు కుమారుని విశ్వామిత్రుడుతో పంపుట అనేది మీ ధర్మం
భార్యలను పిల్లలను సంప్రదించి విశ్వామిత్ర కోరిక తీర్చుట శ్రేయస్కరం
.
సర్వసాస్త్రములు తెలిసిన వారితో కుమారుని పంపుట కెందుకు భయం
గురువర్య వయస్సులో చిన్నవాడు రాముడ్నిపంపటమా అనేదే సందేహం
విశ్వామిత్రుని శక్తి నాకు తెలుసు రాజగురువుగా చేస్తున్నాను హితోపదేశం
శ్రీ రామునితో లక్ష్మణుని కుడా పంపుటకు దశరధుడు అంగీ కారం
తల్లి తండ్రుల మాటప్రకారం రాజర్శితో వెళ్ళుట సిద్ధం
రామ లక్ష్మనులు గురువులకు పెద్దలకు చేసే వందనం
తల్లులకు ప్రజలకు తెలిపే చేయగలం కార్యస్సఫలం
మీ అందరి దీవెనలు కావాలి మాకు ఈ సమయం
గోభ్రాహ్మణుల హితము కొరకు మేము సిద్ధం
దేశ రక్షణకు ఎంతటి త్యాగాన కైన వెనుకాడం
మహాత్ముల ఆదేశం పాటిమ్చటమెమా కర్తవ్యం
గురువర్యులు చెప్పిన విదముగా నడుచుకుంటాం
ప్రభాత సమయమున రామ లక్ష్మణులు ప్రయాణం
ప్రయాణంలో భోధించే రాజకుమారులకు ఆత్మప్రభోధం
రామ నీ జన్మ వళ్ళ అజ్ఞానులకు కలుగును జ్ఞానోదయం
. సర్వులకు ఆదర్సప్రాయులుగా జీవిమ్చుటే మానవధర్మం
తెల్లవారుజామున దైవకార్యములు నెరవేర్చుట ధర్మం
మన: సంకల్పంతో ఎంతటి పనిఐనచేసి పొందాలి జయం
నిత్య పారాయణం వళ్ళ కలుగును మనస్సు శాంతి మయం
నిగ్రహ శక్తితో ప్రతిఒక్కరు నిత్యమూ చేయాలి వేదాద్యయనం
ప్రయత్నం వళ్ళ జరుగుతుంది మానవ జన్మ సౌఖ్యం
అప్రయత్నం వళ్ళ సుఖ సౌలభయ్యం జీవితమ్ దుర్లభం
సుఖ దు:ఖాలు మానవులకు ఏర్పడుట దైవ సంకల్పం
పాపరహితుడుగా ప్రక్రుతి అనుసరించి చేసే జీవనమ్ ముఖ్యం
స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ శక్తి అమోఘం
అర్ధం పర్ధం లేని మాటలతో కాలంగడపడం వ్యర్ధం
స్త్రీని అర్ధం చేసుకొని మాట్లాడటం చాల కష్టం
స్త్రీ పురుషులు ఎక మవటం దేవుని సంకల్పం
.
మనుష్యుల మద్య ఆత్మీయతా భంధాలను విస్తరించడం
మనుష్యుల్లొఉన్న పశుప్రవ్రుత్తి లేకుండా చేయాలి ప్రభావితం
ఐస్వర్యాన్ని చూసి మనసు అసూయ పడకుండా చూడటం
సత్పురుషులను సేవించి శాంతిని పొందే జ్ఞానం పొందడం
రామలక్ష్మణులకు బల అతిబల అనే మంత్రములు ఉపదేశం
ఎంత పని చేసిన శ్రమ, రోగము ఉండదు ఈ మంత్ర ప్రభావం
అడిగినదానికి వెంటనే స్పురణకు వచ్చి చెప్పగలరు సమాధానం
సౌభాగ్యం, దాక్షిణ్యం, తెలివితో కూడిన బుద్ధి నిర్ణయం
సత్య, సౌహార్ద్ర, దయ, క్షమ, మృదుత్వం
ధీరత్వ, వీరత్వ,. ఘం భీర్య, శాస్త్రవిజ్ఞానం
పరాక్రమ, నిర్భయత్వ, శాంతి, తితిక్ష, వినయం
ఉపరతి సంయమనం, నీతిజ్ఞత, త్యాగం
తెజో ప్రీతి, మర్యాద, రక్షణ, ఏకపత్నీ వ్రతం
ప్రజారంజకత్వ, బ్రాహ్మణ భక్తి, మైత్రిభావం
మాత్రు పితృభక్తి, గురుభక్తి, సరణాగత వత్చలం
భ్రాత్రుప్రేమ, సరళత్వం, వ్యావహారిక కుశలత్వం
.
ప్రతిజ్ఞాపాలనం, పవిత్రత, సాదు రక్షణం
దుష్టదళనత్వం, నిర్వైరత్వం, ధర్మజ్నుత్వం
లోకప్రియత్వం, బహూజ్ఞత్వమ్,ధర్మపరాయణత్వం
పరదోషాన్వేషణ రాహిత్యం, సకల సద్గుణాలు రామం
పుణ్య ఫలము కావాలని ఆశిమ్తురు
పుణ్యకార్యములు చేయుటకు పూనుకోరు
పాప ఫలము నాకు అక్కర లేదందురు
పాప కార్యములు చేయుటకు పూనుకొందురు
.
అజ్ఞానము అవి వేకముతో
అవివేకము అభి మానముతో
అభిమానము క్రోధముతో
క్రోధము కర్మతో కర్మ జన్మతో
. జన్మ ద:ఖముతో కూడుకున్నవి.
వేదముల యందు ఓంకారం
సూర్య చంద్రులయందు ప్రకాశం
భూమి యందలి సుఘంధం
అగ్ని యందలి ఉష్ణం
ఆకాశము నందలి శబ్ధగుణం
జలము నందలి తీయదనం
నరుల యందలి అహంకారం
సర్వభూతముల యందలి ప్రాణం
స్త్రీ పురుషుల యందు కామం
సద్వినియోగం ఐతే స్వర్గం
దుర్వినియోగం ఐతే నరకం
ప్రకృతిలో సమస్యలు పరిష్కారం
రామచంద్రా తాటకి గురించి ముందుగా నీకు తెలిపెద ఒక రాక్షసి , స్త్రీలలలొ కూడా దుర్మర్గులుంటారు, వారి మీద జాలి ఉంచి ఉపెక్షించ కూడదు , వారి వలన దేశం నాశనమై పోతుంది, కనుక స్త్రీల మీద కుడా అవసరాను బట్టిఅస్త్రాలుఉపయోగించాలి.
నా యజ్ఞ వాటికను నాశనము చేస్తున్నది
ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు మలద - కురాళ ప్రాంతం
సుకేతుడనె యక్షుడు పాలిస్తున్నాడు ఈ విశాల రాజ్యం
బ్రహ్మను గూర్చి బ్రహ్మాండమైన తపస్సు చేసి పొమ్దె వరం
వర ప్రభావముతో వేయి ఏనుగుల బలముగల పుత్రిక జననం
తాటకి అను పేరు పెట్టి సుమ్దనకు ఇచ్చి చేసే వివాహం
వారికి మారీచ సుబాహులు కలిగే పుత్ర సంతానం
పుత్రులతోకలసి మునులపై చేస్తున్నారు అఘాఇత్య0
చిక్కిన జీవులను చంపి తినడం వీరి నిత్య కృత్యం
ఒకనాడు అగస్య మహాముని ఆశ్రములొ చేరి చేసే తాండవం
అగస్య మహామునిని చంపుటకు చేసే రాక్షస కుతంత్రం
అగస్యుడు తాటకి పై కోపించి విక్రుతముగామారమని పెట్టె శాపం
తాటకి కురూపిగా మనుష్యుల మాంసం తింటూ కలిగించే భయం
రాక్షసి భయంతో ప్రజలందరు వెడలి పోయిరి దూరదేశం
తాటకి ఋషులు యజ్ఞం చేయకుండా కలిగిస్తుంది ఆటంకం
ప్రజలను పీడిమ్చెవారు స్త్రీ ఐన సంహరించడం ప్రభువు ధర్మం
గురువాక్కు బ్రహ్మ వాక్కుగా రాజ ధర్మంతో చేసే యుద్ధం
విశ్వామిత్రుడు శాస్రొక్తముగ ప్రారంభించే యజ్ఞం
రాముడు ఒక్క భాణము తో చేసే తాటక సంహారం
మారిచునిపై వాయువాస్త్రం వేసి చేసే భహిష్కారం
ఆగ్నేయాస్త్రం వేసి సుభాహుని చంపి ఉండే యజ్ఞక్షేత్రం
రామ గురువుగా ఉండి నాకు తెలిసిన విద్యలు నేర్పడం
మీ తండ్రిగారు చెప్పినట్లుగా అయోధ్యకు చేర్చడం
మీలో ఉన్న ధర్మ సందేహాలకు సమాధానాలివ్వడం
పంచ భూతాల సాక్షిగా ధర్మం తప్పవని చేసే వాగ్దానం
రామ వాయువుని నిగ్రహిమ్చుట కొంతవరకు సాద్యం
శరీరమునకు ఇంద్రియములను క్షోభపరుచుట సాద్యం
ఎవ్వరికైనా మనస్సును నిగ్రహించుట చాలా అసాద్యం
చంచల మనస్సుగలవానికి జ్ఞాన భోధ చేయుట అసాద్యం
విచారముతో చేసేపని జయిమ్చుట నశక్యం
. అన్యమనస్సుతో ఉన్నవానికి నిజం చెప్పుట నశక్యం
సూర్య చంద్రుల కాల గమనం మార్చుట నశక్యం
అగ్నిని గుప్పేట, ప్రళయం సృష్టిమ్చుట నశక్యం
అగ్ని యొక్క రూపమ్ రక్తమయం
తేజస్సు యొక్క రూపమ్ క్షీర మయం
జలము యొక్క రూపమ్ కలుషిత మయం
మంచు యొక్క రూపమ్ పుష్ప మయం
మససాక్షిని బట్టి నడుచు కోవడం మానవ ధర్మం
గురువులు పెద్దలుచేప్పినది పాటించడం కుల ధర్మం
చేతన్యముతో తెలుసుకొనేది ప్రక్రుతి నిజమైన ధర్మం
ఎదుటివారి మనసు ఎరిగి మాట్లాడుట కుటుంబ ధర్మం
రామ చంద్రా నీ మూలముగా ఈ సిద్ధాశ్రమం పావనం
నీసహాయముతో యాగం నిర్విఘ్నముగా సమ్పూర్ణ0
రామలక్ష్మణుల పరాక్రమును చూసి మునులకు ఆనందం
నీకు వెన్నతో పెట్టిన విద్య వినయ విధేయతలు చూపఠం
కుశిక రాజ్య చరిత్ర గురిచి రాముడుతో విశ్వామిత్రుడు తెలిపే
బ్రహ్మ దేవునికి మానసిక పుత్రుడు జన్మించే కుశిక చేసే నామదేయం
దృడవ్రతుడు, ధర్మజ్ఞుడు, సౌర్య సంపన్నుడు, పరిపాలించే ఈ దేశం
శోభయా మానముగా, శస్య స్యామలముగా పాలించిన ప్రాంతం
మహారాజు మహకులీన ఐన విదర్భ రాజపుత్రిని చేసుకొనే వివాహం
చతుర్విధ పురుషార్ధముల యందు నీమముతోచేసే సంసారం
రాజదంపతులకు కలిగిరి నలుగురు పుత్ర సంతానం
సకల విద్యలు నేర్చుకొని పాటించిరి ఆశ్రమ ధర్మం
ధార్మికులై, సత్య సంధులై పాటించిరి క్షత్రియ ధర్మం
రాజ్యమును నాలుగు భాగములు చేసి కుమారులకు చేసేసొంతం
పరిపాలన ధర్మ దీక్షతతొ, ప్రజలకు కలిగించాలి సంతోషం
కుసాంబుడు కౌశిమ్బి, కుశనాభుదు మహోదయం అనే నగరం
అదుర్తరజకుడు ధర్మారణ్యం, వసువు గిరి వజ్రం అనే నగరం
ఇదు కొండల నడుమ మాగదీ నది అద్బుత ప్రవాహం
నలుదిక్కులా విస్తరించెను ప్రాసామ్తత కల్పించే సౌదర్యం
రాజకుమారులు అమ్దిమ్చిరి ప్రజలకు ఆనందమైన జీవితం
కుమారులు సద్గుణ సంపన్నులై పాలిమ్చిరి రాజ్యం
కుశనాభునకు నూరుగురు పుత్రికా సంతానం
తండ్రి పుత్రికలకు చేసే హిత భోధ కహమే దానం
క్షమే యజ్ఞం, క్షమే యశస్సు, క్షమే సత్యం
పుత్రికలు తెలుసుకొనే క్షమే సమస్త ధర్మాలకు మూల0
నూరుగురు కన్యలు చేసిరి వన విహారం
వాయుదేవుడు వారిని చేసి మోహ పరవశం
మిమ్మల్నందరిని నేను చేసుకుంటాను వివాహం
మాన వత్వం పోయి కలుగుతుంది దైవత్వం
వాయుదేవ మా అందరిలో నివు అమ్తర్లీనం
మా హృదయాన్ని అనుకరించి చేసేది ధర్మం
మా తల్లి తండ్రులకు గారాల ముద్దు బిడ్డలం
మాతండ్రి ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారితోనే వివాహం
.
వాయు దేవా మేము కన్యలం లేదు మాకు స్వాతంత్ర్యం
మాకు సుఖములు పెంచే తల్లితండ్రులు మాకు దైవం
తండ్రి ఆజ్ఞను మీరి మేము మీతొ వచ్చుట కాదు న్యాయం
వంశ ధర్మాన్ని అనుస రించి ప్రవర్తించుట మా కర్తవ్యం
నీటి చుక్క రాలితే పట్టుకోవటం కష్టం
నోటిమాట దాటితే తీసుకోవడం కష్టం
. ప్రకృతిని వ్యతరేకిచి బ్రతకటం కష్టం
తల్లితండ్రులను ధిక్కరించి జీవించుట దుర్లబం
వాయు దేవా మా తండ్రిని సంప్రదించి చేసుకోండి వివాహం
దేవతాముర్తులని మీ మీద మాకు ఇంకా ఉంది గౌరవం
ఓర్మి గలవారికి ఎప్పుడు కలుగును సుఖ సౌఖ్యం
వాయు దేవుడు కన్యలకు కురూపిగా మారాలని పెట్టె శాపం
శాప కారణం గా కన్యలు పొందే వికృతాకారం
తల్లి తండ్రులకు తెలిసే వాయు దేవుని అహం
నిరుత్చాహ పడుతున్న పుత్రికలకు పెంచే ఉత్చాహం
మేము చేసిన ఏనాటి పాపమే, కాలంతో మారును మీరూప0
జాలియను మహర్షికి సోమదయ అను ఆమె పరిచర్యలుచేసే కొంతకాలం
పరిచర్యలును మెచ్చి పుత్ర సంతానము కల్గునని ఇచ్చే వరం
పుత్రుదు కలిగే వానికి బ్రహ్మ దత్తుడు అనిపెట్టె నామ దేయం
నూరుగురు కన్యలను వీరికి ఇచ్చి శాపం విషయం చెప్పి చేసేవివాహం
బ్రహ్మ దత్తుడు వమ్శోద్ధారకుని కొరకు చేసే పుత్ర కామేష్టి యాగం
పుత్రికజననం, సత్యవతి భర్తతో సశరీరమ్తొ పొందే స్వర్గం
పుత్రుడు జననం 'గాధి ' అనేవారు నాతండ్రిగారు నాది కుశవంశం
రామ దేహసంభంధమైన వంశ విషయం చెప్పితిని నాది బ్రహ్మవంశం
అహల్య గౌతముల కధ తెలిపేద రామ
.
బ్రహ్మ భార్యను మెప్పించడానికి " స్త్రీ " ని సృష్టిమ్చే బ్రహ్మ లోకం
నవ యవ్వనంతో అందమైన పువ్వులా కనిపించే ఆ క్షణం
బ్రహ్మ సరస్వతి కలసి ఆమెకు అహల్య అను పేరు నిర్దారణం
బ్రహ్మ దేవునికి పుత్రికను చూసి మతి బ్రమిమ్చే ఆ సమయం
బ్రహ్మ లోకమంతా సంతోషాల నిలయం
ఋషులు వేదాంత గోష్టి చర్చ సంకల్పం
సంగీత సాహిత్య0 వేల్లువిరిసే వైభవం
రమణీయ ప్రక్రుతితో వెలసిల్లె సుందర సౌధం
అకాశము నందు చందురుని అచ్చపు తెల్లని కాంతి విస్తారం
మల్లియల సువాసన గాలితో కలసి మనస్సుకు ప్రశాంతం
సరస్వతి దేవి బ్రహ్మను కోరే అమ్మాఇకి చేయాలి పరిణయ0
మృదు మధుర సంభాషణలకు ఏర్పాటు చేద్దాం స్వయం వరం
ఎదిగిన కూతురు తల్లి తండ్రుల మాటలకు పొందే పరవశం
అమర లోకాధీసుని మనస్సున గ్రహించి పొందే సంతోషం
చిత్తమునందు కించిత్తు స్వర్గాధి పతి ఊహ కలిగే ఉత్చాహం
ఋషులు దేవతలు వివాహము చేసుకోవాలని ఆగమనం
దేవతలు ఋషులు స్త్రీ సౌందర్యము చూసి ముగ్దు లయ్యారు
తెల్లని చంద్రుని వలే దివ్య ముఖం
సుస్వర శంఖం సుద్ధ కంఠం
కమల పత్రాలాంటి నయనం
దానిమ్మ గింజల దంతం
ఆమె శృంగార ముగ్ద మొహన రూపం
ఎవరికైనా చూసిన వెంటనే ఏర్పడు కామం
అందరి హృదయాలలో ఉండే ప్రేమ మయం
ఈమెనె వివాహం చేసుకోవాలని తాపత్రయం
.
సుందర వధువు చూపు సురపతే ఖాయం
సురపతి మనసంతా అహల్యా రూపం
ఊహా మనస్సులో జరిగే వారికి కల్యాణం
సతి పతులుగా మారి పొందే సంతసం
బ్రహ్మ దేవుడు సంకల్పించే స్వయంవరం
రాజ కుమారులు, తాపసులు ఆగమనం
అందరిని సాదరంగా అఫ్యానిమ్చే బ్రహ్మ లోకం
ముందుగా భూప్రదక్షణం చేసిన వారికే స్త్రీ వశం
గౌతమ మహాముని చేరి వివాహ సమయం
మాతా గోమాత నీకు ఇదే నా వందనం
ఈనుచూన్న గోమాతచుట్టూ చేసే ప్రదక్షణం
గౌతముడు గెలిఛి అహల్యను పొందే పరిణయం
తలచిన వలపు నీరు కారే ఆ క్షణం
ప్రేమ గెలవక పోవటం పూర్వ కర్మ ఫలితం
సురపతి ఓటమి మనసుకు భాధాకరం
ముదుసలి గోతమునితో చేసే సంసారం
గోతముడు దివ్యాశ్రమం నిర్మించి అందు చేసే యజ్ఞం
శిష్యులకు నిత్యం భోదిమ్చు వీదాంత విషయం
అతిదులుగా వచ్చిన వారికి చేసే ఉపచారం
అహల్య కొదువనిమ్త రానీక గోతమునకు పంచే సుఖం
ప్రేమను విభుమ్డునకు పంచే నిత్యం
మన్మధ రూపంతో కలిగించే సంతోషం
గౌతముడు అందించే యవ్వన సుఖం
గౌతమునకు ఏర్పడే పుత్రికా జననం
గౌతముడు బ్రహ్మ దేవుని గూర్చె చేసే జపం
. దేవేమ్ద్రునకు తన పదవి పోవునేమోననే భయం
గౌతముని తపస్సు భగ్నం చేయాలని నిర్ణయం
అహల్యను పాతివత్యం భగ్నం చేయాలని కుతంత్రం
గౌతమ మహర్షి లేనిసమయం అహల్య ఒంటరిగాఉన్న సమయం
గౌతమముని వేషమున ఇంద్రుడు వచ్చి అహల్యను కోరే సంగమం
వచ్చినవాడు దేవెంద్రుడని గ్రహించి అహల్య మక్కువతో అమ్గీకార0
ఇంద్రుని కోరిక తిరే, అహల్యకు చిరకాల వామ్త్చతో కలిగే సంతోషం
యగ్నిహొత్రమువలె ఉన్నగౌతమమహర్షినిచూసిఇంద్రునకుకలిగే భయం
ఇమ్ద్రుడు చేసిన దుష్క్రుత్యం దివ్య శక్తితో గ్రహించి వచ్చే తెలియని కోపం
చేయరాని పని చేసినావు నీవు విఫలుడవుకమ్ము అని పెట్ట శాపం
ఒసీ దుష్టురాల వాయు భక్షనంతో నేలపై బూడిదైఉండే అనిపెట్టె శాపం
శ్రీరాముని స్పర్స తో యధారూపమ్ రాగలదని శాప ఉపాశమనం
మహర్షి తపస్సు వ్యర్ధమైనదనితెలిసి మరలా పస్సు చేయాలని నిర్ణయం
దేవేంద్రుడు సిగ్గుతో ఉండగా మెషణము వృషణాలు అమెర్చేదేవ తాగణం
ఇమ్ద్రునివల్ల గోతముని తప్పస్సు భగ్నంకాగసఫలం పొందే దేవతాకార్యం
ఆనాడు సర్వ సుఖలతో వెలసిల్లిన గోతముని ఆశ్రమ ప్రాంతం
అదిగో ఆశిల ఆనటి నుండి ఈనాటివరకు చేస్తుంది రామ జపం
చేసిన తప్పు తెలుసుకొని భాద పడుతున్నది పశ్చాతాపం
రామ నీపాద స్పర్సకోరకు తపిస్తూ, విలపిస్తూ జపిస్తుంది నీ నామం
రామచంద్రుని పాద స్పర్సతో అహల్యకు కలిగే శాప విమోచనం
రామ దర్శన భాగ్యం వళ్ళ ఆశ్రమ ప్రాంతమంత వచ్చే పూర్వ వైభవం
రామచంద్రుడు అహల్యా గోతములకు చేసే పాదాభి వందనం
అమ్దరియందు వినయ విదేయత కలిగి ఉమ్డుటే పరమధర్మం
రామ అహల్య కధ గురించి నా భిప్రాయం
నూనెలొ మలినం ఉండవచ్చు వెలుగులో ఉండదు మలినం
ఆశ్రమలొ ఉండవచ్చుమలినం విద్యకు ఉండ కూడదు మలినం
చెంద్రుడిలో మచ్చలు ఉండవచ్చు వెన్నెలలో ఉండ కూడదు మలినం
సూర్యకిరాణాలు వేడిగా ఉండవచ్చు నీడకు ఉండదు మలినం
ఘనుడుగాని, భుపతిగాని తప్పించుకోలేరు కాల నిర్ణయం
శివ కెశవులుగాని, కాలయముడుగని తప్పిమ్చలేరు విధి చక్రం
యవ్వన కోరికలు సహజం నిగ్రహసక్తితో పోమ్దాలి నిత్యం
తెలిసి చేసిన తెలియక చేసిన నేరానికి శిక్ష పోమ్దేదారు యమలోకం
రక్త మాంసములతొ నిండిన ఈ శరీరముపై ఎందుకు మమకారం
కర్మ ఫలాన్ని అనుభ వించ కుండ ఎందుకు దైవ ధూ ష ణం
ధర్మాన్ని విస్మరించి స్వదర్మ నిర్వాహనములో అమ్దరూ ఉండటం
అజ్ఞానంతో విచక్షణ జ్ఞానాన్ని మరచి కొందరు దైవాన్ని నిందించడం
రామ లక్ష్మణులతో విశ్వామిత్ర చేరే మిదులానగరం
జనక మహారాజు స్వయముగా వచ్చి ఇచ్చే ఆతిద్యం
ఓ కౌసికా నీ గుణాలు,నీ తపస్సు , నప్రమేయం
ధన్యుడనైతిని రామ లక్ష్మణులతో ఇక్కడకు రావడం
సూర్యాస్తమయమ్ అవుతున్నది సాయం సంధ్యాది కర్మలు ప్రారంభం
జనక మహారాజు విన్నవించే మీకు సకల సదుపాయాలూ చేయగలం
ఈభవణమ్నందు విశ్రాంతి తీసుకొండి మాకు సెలవిచ్చిన మరలా వచ్చేదం
మహారాజు మర్యాదలు చూసి విశ్వామిత్రునకు రామ లక్ష్మణులకు సంతోషం
రాజకుమారులారా రాత్రి కలుగ లేదుకదా నిద్రా భంగం
స్నాన మాచారిమ్చ్ పూర్తి చేసిరి సంధ్య వందనం
బ్రాహ్మణులు వేదాలు వుత్చరణ, మంగళ వాద్య శబ్దం
రామ లక్ష్మణులు తీసుకోనిరి పానీయమ్ పలహారం
జనక మహారాజు పురోహిత సమేతుడై ఆగమనం
మ్రోగిమ్చిరి శంఖ నినాదములు, నవధ్వనుల శబ్దం
గందాక్షతులతో సతానందుడితో వచ్చిరి పరివార్యం
జనకుడు మహాముని తమకు నిరంతరం స్వాగతం
మునివార్య తమ ఆజ్ఞ ఏమిటో సెలవిస్తే చేస్తాము సిద్ధం
స్వామీ వినాలని ఉంది మీ ఆశ్రమ సంభాషణల భాగ్యం
రామ లక్ష్మణులు మీకు సహాయము చేసిన ఘనకార్యం
తెలిపే కధఅంతా యాగ రక్షణకు చేసిన రాక్షస సంహారం
పిల్లల శక్తి సామర్ద్యములు తెలుసుకొని పొందే సంతోషం
గమనించే పిల్లల ముఖపద్మములపై బ్రహ్మతేజస్సు ప్రభావం
అహల్య శాప విమోచన మాట విని పొందే అత్యంత ఉత్చాహం
విశ్వామిత్రుడు పలికే జనకా ముందు సాగించు కార్యం
ఋషివరణ్య నేను పుత్రసంతానం కోసం చేసే ఒక యజ్ఞం
యజ్ఞారంభమున భూమి దున్నగా లభించే శిశు పవిత్రం
పృథ్వి లో పుట్టుట వలన" సీత "అని చేసే నామకరణం
సీత యుక్త వయస్సుతో మాకు కల్పించే సంతోషం
జనకా మీ ఇంట ఉన్న శివ ధనుస్సు చూడాలని వచ్చాం
దాని మహత్యం తెలుసుకోవాలని రాజపుత్రులను తెచ్చాం
సీత కళ్యాణం అని ఇక్కడకు వచ్చినతర్వాత తెలుసుకున్నాం
అన్నారు శివ దనుర్భంగం చేసిన వారికే " సీత "' లభ్యం
అరి ఆరని తాటాకులతో చలువ పమ్దిళ్ళతో నిండిన నగరం
లేత ఆకుపచ్చ రెమ్మలతో కళకళ లాడే తోరణాల మయం
మల్లెపూలు,చెమతిపూలు, విరజాజి పూలు మాలల మయం
తాటాకు విసినికర్రలు, చిన్న పెద్ద అమ్దరూ ఆనంద మయం
జనక మహారాజు విశ్వామిత్రునితో, రామలక్ష్మనులతో చేసే ప్రసంగం
పెద్ద పెట్టెలో ఉమ్చిన శివ ధనుస్సు నాతొ రండి మీకు చూపెడదాం
ముక్కు పచ్చలారని సీత ఈ ధనస్సును వేలితో కదిపిచూపె ప్రతాపం
ఈ ధనస్సును ఎవరు ఎక్కు పెడితే వారికి " సీతతొ " పరిణయం
నిమిచేక్రవర్తికి పరమేశ్వరుడు ఈ ధనుస్సు ఇచ్చి హెచ్చరించే తగు భద్రం
పూర్వము దక్ష యజ్ఞ ధ్వంససమయమున కలిగే ఈ ధనుస్సు అవసరం
ఈ ధనుస్సు మా వమ్శీయుల వద్ద ఉండి పోమ్దుతుమ్ది నిత్య నైవేద్యం
శివ ధనుర్బంగం చేసిన వారికి సీత నిచ్చి పెళ్లి చేయాలని దైవ సంకల్పం.
పెళ్లి అని సీతారామల మనసులోకి ప్రవేశిస్తే వారి ఆలోచనలు ఊహలు ఎలా ఉంటాయో సీతా రామ కళ్యాణ సందర్బముగా
ఇందు ఉదహరిస్తున్నాను.(ఇవి నా ఆత్య ప్రాస భావాలు మాత్రమె
నా జీవితములో కల నిజ సౌందర్య మైనది
ఎన్నాళ్ళ కైనా, ఎన్నేల్లకైన మనసే మారనిది
తొలిచూపులొ మనసు ప్రభవించి కలవ మన్నది
ముందు హుద్యాల కళా కండ అందించాలని ఉంది
మంచుకంటే చల్లగా ఉన్న హృదయం వేడెక్కింది
తలవని తలంపుగా ఒక్క లలితగీతమ్ వినబడింది
బ్రతుకులో జోడు ముడిపడే సమయం ఐనది
కలగా మేనుకు చందన పూత పరిమళ మైనది
తప: ఫలముతో పున్నమిలో పంచుకొనే పంట
వద్దు కావాలి కావాలి అని మురిపిమ్చు కొనే ఆట
పండువెన్నెలలో కోరికలను పంచుకొనే తొలి పంట
మధురాతి మధురస్మృతులను పంచుకొనే పెళ్ళంట
నిన్ను చూసిన తొలి క్షణం అంకురించే ప్రణయ భావం
ఒకరి నొకరు చూసుకొన్న క్షణం ఆత్మాను సందానం
మనస్సులో ఎన్నో ఊహలు అపోహలు వచ్చుట నిజం
కలసి మెలసి తిరిగితే ఏర్పడును అనుభూతి తరంగం
నీ వదనం లో చివురించిన లజ్జ దరహాసం
నీవు విరిసిన తెల్లటి నందివర్ధన కుసుమం
నీవు సిగ్గుతెరలతో వాలు చూపుల వదనం
నీ ముగ్దత్వం వళ్ళ హృదయములో పరవశం
నన్ను ఉద్ధరించుటకు దివినుండి భువికి వచ్చావు
నీవు జన్మ జన్మల భంధముగా సక్షాత్కారిమ్చావు
నా హృదయం క్షీరసాగరమ్ అవటానికి కారణం నీవు
నా గుండెలో పొంగు పంచుకోటానికి కారకుడవు నీవు
మనసులో చెలరేగు అపురూప భావాలను పంచుకుందాం
హ్రుదయసీమలతొ హత్తుకొని పరవశంతో ఆనందిమ్చుదాం
తోడు నీడగా, ప్రాణాతి ప్రాణం గా కలసిమెలసి జీవిద్దా0
గారాబంతో అను రాగంతో ఆడుతూ పాడుతూ ఉందాం
నీటి తరగలన్న, మంచు పొగలన్న, ఎంతో ఇష్టం
అరవింద నయనాలలో నా రూపమ్ ఉంటే ఇష్టం
కనురెప్పలు ఎత్తిచూసి చూడనట్లు ఉంటే ఇష్టం
ఆలింగన బలం లో చిక్కి బ్రతకాలని మరీ ఇష్టం
నిన్ను కాసేపు ముద్దిచ్చి నవ్వించాలని ఉంది
మట్టెల సన్నని మోతతో ఉడికించాలని ఉంది
గాజులతో సమ్గీతస్వరము వినిపించాలని ఉంది
వదలకుండా మత్తుగా శయనించాలని ఉంది
ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం
అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మెరుపందం
చెమ్పల మీద కెంపు రంగొచ్చి ముద్ద మందారం
సిరోజాలలో ఉన్న మల్లెపూల సౌరభానికి ఆహ్లాదం
కంటికింపుగా కనువిందు చేసిన వేళ
తరలి వచ్చి తపము పండించిన వేళ
కమ్ముకున్న మబ్బు తెర తొలగించిన వేళ
తరుణి దయతో కరుణించి తరించిన వేళ
నును సిగ్గు దొమ్తరుల దొరసానివి నీవు
ఓరకంట చూపుతో మనసు దోచినావు
అభ్యంతరాల ముసుగులో దాగివున్నావు
తనివి తీరగ చూసిన మరవ లేకున్నాను
లేత రెమ్మల మాటున మొగ్గావు నీవు
కళ్ళు తెరచి చూసి పరిమలిస్తున్నావు
రెమ్మ నుండి వీడి ఎరుగనిదేశం చేరావు
నాకొరకు విరహముతొ విధిగా ఉన్నావు
నాకళ్ళను చూస్తె నీ వంటికి చలువపూత చల్లదనం
నా మేనును చూస్తె చందన సుగంధ పరిమళం
నా వయస్సు చూస్తె నీకు మరువలేని సుఘమ్ధం
నా రూపు దివ్యలోక సుఖాలనమిమ్చే యవ్వనఘమ్ధం
సాహిత్య రత్న రాశిని తెచ్చిన మల్లికవు
జన్మసమ్స్కారముతొ ఓర్పుగల దానవు
మాటలలోను, నడకలలోను స్వర్ణరేఖవు
నవరత్నాల మేళవింపు కాంతి గలదానావు
నీ రూపమును నా మదిలో ఉంచిన సృష్టి కర్తకు వందనం
నిద్రాహారాలు మాని నీ గురించి కలిగిన తన్మయత్వం
నేనొక్కదానినే పుత్తడి బొమ్మ అని బ్రామ్తికలిగిమ్చే సౌరభం
నీవు నా అంతరంగం దోచి అందుకో మధుర అధరామృతం
నీకు నామీద నవ నవోన్మెష రక్తి
చెప్పకనే తెలుస్తుంది నీలొ యుక్తి
నిన్ను కలవాలని నాలో కలిగిన ఆశక్తి
నీ వదనం వెలుగులు చిమ్ముతుంటే రక్తి
నిన్ను చూస్తె ఒళ్లంతా స్వేదంతో నిండి పోతుంది
దాహం తీరక నా నాలుక పిడచ కట్టుకు పోతుంది
సిరోజాలువేడెక్కి తపన తగ్గే మార్గం చెప్పమంటుంది
అదేమి చిత్రమో,అదేమి ఆరాధనొ తెలియ నంటుంది
నా అనురాగాల ముద్దుల శాంతి దేవత
పారి జాతమ్ము ప్రేమ జీవన విభాత
భవ్య లోక సుఖా లందిమ్చే దివ్యలత
నా సుఖ సౌక్యాలందిమ్చే ప్రదాత
పువ్వుల మేఘమా నా భాద తెలుపు
నా కన్నీల్లను తుడిచి పొమ్మని తెలుపు
తన్మయత్వంతో ఉన్నాను రమ్మని తెలుపు
తపన తగ్గించి దప్పిక తీర్చుకొని పొమ్మని తెలుపు
ప్రచండ గ్రీష్మ తాపాన్ని ఉపశమిమ్ప చెస్తావు
కరుణతో పుడమి తల్లిని పులరింప చేస్తావు
మెరుపువల్లె మెరిసి నామనసు రంజిల్లపరుస్తావు
గుండెలో ఉన్న దడను తగ్గించి సంతోశాపరుస్తావు
రాత్రి నిద్రపట్టక చంద్రునితో నీ గురించి ముచ్చటిస్తా
నవమి నాటి వెన్నెలను ముందుగా నీకు పంపిస్తా
మాన నీయమైన గుణం అర్ధం చేసుకొని ప్రవర్తిస్తా
కన్నుల్లొఉండే కారుణ్య రేఖతో పులకితున్ని చేస్తా
నా సృష్టి దైవ నిర్ణయం
నా జీవిత కరుణా మయం
నా ప్రేమ అనురాగ మయం
నా హృదయ్యం చైతన్య భరితం
సంవత్చరానికి ఒక్కసారి వచ్చే వసంతానివి కావు
ఒక్క రోజు సువాసన అందించే గులాబివి కావు
ఒక్క క్షణం నింగిలో మెరిసే మెరుపువు కావు
నా ఊహలు సఫలం చేసే సౌమ్దర్యవు నీవు
నెల కొకసారి వచ్చే పున్నమి జాబిల్లివి కావు
వెలుగును కమ్మే నల్లని మేఘానివి కావు
శబ్దాలు చెస్తూ సమయాన్ని తెలియపరచవు
రంజిమ్పచేసి రసడోలికలో ముంచేదానావు నీవు
తెరలు తెరలుగా పైరు గాలి వీచినట్లు రమ్మనకు
సొగసుచూడమని పరదాలు తొలగించి రమ్మనకు
ప్రకృతిలో అందచందాలతో ఆటలకు నన్నురమ్మనకు
రమ్మని పిలిచి ఆనవ్వు దొమ్తరలతో నన్ను వేదిమ్చకు
తొలి మబ్బు తెరచాటు చెమ్దమామవు
గగన పధ విహార విహంగ పతుడవు
చీకటినితరిమే వెలుగును చూసి తప్పుకుంటావు
అందరికి చల్లదనము వెన్నెలను పంచుతావు
.
రాజులందరు ఉన్నారు ఉచితాసనం, స్వయం వర సభ ప్రారంభం
జనకుడు వినయంగా సభలో ఉన్న రాజులతో చేయండి ప్రయత్నం
ఈశివధనస్సును ఎక్కుపెట్టిన వారికి మా పుత్రికతో వివాహం
కొందరు రాజులు ధనుస్సుకుడా ఎట్టా లేక పొందారు విఫలం
రాముడు కండలు తిరిగిన ఆజానుబాహుడు
యవ్వన ప్రారంభములో ఉన్న యువకుడు
విశ్వామిత్రుని అడుగుజాడలో ఉన్న సిద్ధుడు
అందర్నీ ఆకర్షిమ్చుతున్న మేఘశ్యాముడు
రాముడు అందములో అశ్వనీ దేవతగా ఉన్నాడు
రాముడు పరా క్రమంలో సింహములా ఉన్నాడు
రాముడు సూర్యుని మించిన కాంతి కలిగినవాడు
రాముడు శివధనుస్సు ఎక్కు పెట్టాలనుకున్నవాడు
కదలకు భూమాత రాముడు చేయ బోతున్నాడు శివ ధనుర్భంగం
ఆది శేషా భూమిని కదలకుండా పట్టుకో రామునికి కలుగునుజయం
కూర్మావతారమా భూమిని, ఆదిశేషుని కదలకుండా చేయు భందనం
వరాహమా, ఇరావతమా కదలక ఉండండి రాముని నెరవేరును మనోఫలకం
అంటున్నారు మీసాలు కుడా రాణి వాడు ఏమి చేస్తాడు ప్రయత్నం
ఇంతవరకు ఎవ్వరూ, లంకేశ్వరుడు ఎత్తలేనిది ఇతనికి ఎలా సాద్యం
కొందరు లెతమొగ్గ తుమ్చడం అనుకుంటున్నాడు శివ ధనుర్భంగం
జనకమహారాజుకి, సీతాదేవికి రాముడు శివ ధనుర్భంగం నమ్మకం
విశ్వామిత్రునికి వందనం చేసి ధనస్సును ఒక చేతితో పట్టి ఆసమయం
రాజులు విశ్వామిత్రుడు, జనకమహారాజు, సీతా దేవి పొందే విస్మయం
రాముడు నారి సంద్ధిమ్చుటకు, ధనుస్సు వంచుటకు చేసే ప్రయత్నం
ధనుస్సు మధ్యకు విరిగి పెద్ద పిడుగు పడ్డదన్నట్టు కలిగే శబ్దం
ఘాల్లు ఘల్లు మని విల్లు విరిగింది
సీత గుండె గగుర్పాటు తొలగింది
వచ్చినమహారాజుల మనస్సు చెదిరింది
జనక మహారాజు చిరకాల కోరిక తీరింది
విశ్వామిత్రుని సాధన సంకల్పం నెరవేరింది
మిదులానగర పుడమి పరవశం చెందింది
గంగా జల ప్రవాహం పరవళ్ళు త్రొక్కింది
అగ్ని పర్వతంలో జావా పెల్లుబికింది
క్రౌంచ పక్షులు శ్రవనా నంద గానం చేసినవి
నెమల్లు ఆనందంతో పురివిప్పి ఆడినవి
కోఇలలు మధురశ్వరముతొ పాటలు పాడినవి
వికసించిన పూలపై తుమ్మెదలు ముద్దాడుతున్నవి
కరతలములు మ్రోగే, కురిసే కనక వర్షం
దేవతలు సంతోషంతో కురిపించే పుష్పవర్షం
సీతా దేవికి కలిగే మనసంతా పులికిమ్తల హర్షం
జనక మహారాజుకు కలిగే ఎనలేని సంతోషం
శ్రీ రాముని పరాక్రమము ప్రత్యక్షమైనది యత్యద్భుతం
పుష్పహారము చేత ధరించి శ్రీరాముని మేడలో వేసెను ఆక్షణం
పండితులు శ్రీ సీతా రాములను దీవిమ్చె కలగాలి శుభం
ప్రాణ సమానురాలైన సీతను రామునిక్కిచి చేస్తాను వివాహం
రాజభవనం అంతా వ్యాపించే ప్రచండ మారుతం
కాలిమువ్వలతో, చేతిగాజులతో చేసే జుమ్కారం
తపేట, భాజా భజమ్త్రీల సన్నాయి నాదం
కరతలములతో సంతోషములతో ఆనమ్ద దాయకం
విశ్వామిత్రుడు తెలిపే కన్యాదాత జనక మహారాజ
దశరధ మహారాజుకుదూతల ద్వారా పంపుము సందేశం
కల్యాణం జరిగే ముందు గురుశిష్యుల మద్య ఉండే సంభంధం
రామ లక్ష్మణులకు, జనక మహారాజుకు తెలిపే
.
జనక మహారాజు దశరధ మహారాజుకు సీతా రాముల వివాహము జరుపుటకు నిశ్చ ఇమ్చినామని లగ్న పత్రిక తెలియ పరుస్తూ దూత ద్వారా తెలియ పరిచాడు.
రామ నామం చేయండి
ఆస్వాదించండి
ఆస్వాదించి ఆనందించండి
ఆనందించి తరించండి
కన్యా దాత జనక మహారాజు దూతల ద్వారా దశరధునికి పంపే సందేశం
ఓ మహారాజ మీ రాజ్యము యోక్కయునగ్ని హోత్ర సహేతంగా అడిగే కుశలం
నా కుమార్తెను వీర్య శుల్కముగా ప్రకటించగా శ్రీ రాముడి పొందే విజయం
విశ్వామిత్ర వెంట వచ్చిన రాముడు నే పెట్టిన పరీక్షలొ పొందే విజయం
నా కుమార్తెను నీ కుమారునికి ఇచ్చి వివాహము చేయుటకు అనుమతికి ఆహ్వానం
నీకుమారునిఆనందం కోసం పురోహితాది సకలపరివారముతో వచ్చి జరిపించాలి శుభకార్యం
విశ్వామిత్రుని యనుజ్ఞ గైకొని, శతానందుని యనుజ్ఞ గైకొని మీ రాక కొరకు నిరీక్షన
వసిష్ఠ, వామ, దేవాది ఋషులు తో కలసి దశరధ మహారాజ చేయుదము కుశల సంభాషణం
సకల పరివారముతో ఒక క్రమ పద్ధతిలో చేరే మిదులా నగరం
దశరధ్ మహారాజు పరివారాన్ని చేర్చ విడిది గృహం
కౌసల్యా, సుమిత్ర, కైకెఇ కి రామున్ని చూసి కలిగే ఆనందం
వశిష్ట మహర్షి సంప్రదించి తేలి శుభ ముహూర్తం
ఓ జనక మహారాజా మీరు దానంచేయుమహాత్ములు మీ గౌరవమే మా గౌరవం
మేము ప్రతిగ్రహీతులమ్ దాతల హృదయం ఆనందింప చేయుటయే మా ధర్మం
కన్యాదాత మనస్సును కిమ్చుకైన భాధకల్గిమ్చక మగపెళ్లివారు ఉంటారుసహనం
దశరధ మహారాజు యొక్క మాటలు విని జనకమహారాజుకు కలిగే ఆశ్చర్యం
దానము లలో కెల్లా ఉత్తమ మైనది కన్య దానం
దాతకును ప్రతి గ్రహీతకును కల్గించును పుణ్యం
పురుషార్ధ సిద్ధిని కల్గిమ్చ్ వివాహము స్వధర్మం
కన్యా దానం వళ్ళ ఉభయులకు కల్గు శ్రేయస్కరం
ఎవరి కొరకు వేచి యుండనవసరం లేదు ఇది మా గృహం
మీ కు కావలసినవి తెలియ పరిస్తే క్షణంలో చేస్తాం
స్నానానికి సుగంధ పరిమళాళ తో ఉన్న జలం ఏర్పాటు చేస్తాం
సత్కరించి ఇష్టాన్న భోజనం ఏర్పాటు చేసి ఇచ్చే తామ్బూల0
ఏర్పాటు చేసారుకళ్యాణ మండపం
బంగారు ఆసనములు, పూర్ణకుమ్భాలతో
పుత్తడి పళ్ళెములుమ్చిరి దూతగణం
మూకుళ్ళు, సమిధలు, ఆవు నెయ్యి మెదలైన
వాటితో అగ్నిహోత్రమునకుచేసారు సిద్ధం
సుఘంధ ద్రవ్యాలు, పేలాలు, నక్షతలు, ఉండిన
బంగారుపాత్రలు ఉంచారు కళ్యాణ మండపం
ప్రజల ఆనందానికి అవధులు లేవు
ప్రతి హృదయంలో పరమాత్మ స్తిర నివాసం
ప్రతి ఒక్కరి హృదయం ఒక ఆనంద నిలయం
ప్రతి ఒక్కరిలొ ఉండే పరమాత్మ పేరు సచ్చిదానందం
ప్రతి పనిలో సంతృప్తి పడితే పొందేది జీవితానందం
బ్రతికినంతకాలం ఇతరులకు సహాయముచేసి పొందాలి ఆనందం
చంకలో బిడ్డను ఉంచుకొని వెతికే అమాయకపు తల్లి ఆనందం
ఇంద్రియాల సుఖం, మనస్సుకు సంతోషం కలిగే ప్రక్రుతి ఆనందం
గాడాందకారంలో పండు వెన్నెలను కురిపించే చెంద్రుని ఆనందం
నువ్వు నేను మనం అనుకుంటేనే ఆనందం
నాకు నేనే నాది కష్టార్జితం అంటే లేదు ఆనందం
ధనం కూడపెడితెరాదు పంచితే వస్తుంది ఆనందం
అమ్దరూ సహపంతిభోజనం చేస్తే ఉంటుంది ఆనందం
ప్రత్యాషకిరణాలతొ తుషార బిందువుల ఆనందం
పున్నమి వెన్నెల జల్లు హృదయానికి ఆనందం
చలికివణుకుతున్న వానికి అగ్నిని చూస్తె ఆనందం
వర్షం పడుతున్నప్పుడు క్షత్రంతో తిరుగుట ఆనందం
వయస్సుకు తగ్గ వారితో ఆడే ఆటలో ఉంటుంది ఆనందం
మనస్సుకు సంతోషం కలిగిన మాటలు వింటే ఆనందం
పిల్లలు అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తుంటే ఆనందం
దాహం వెసినప్పుడు అమృతం త్రాగితే మరి ఎంతో ఆనందం
మనో మాలిన్య్యం తొలగి బుద్ధి ప్రకాశవమ్తమైతే ఆనందం
ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో చేసే పనిలో ఉంటుంది ఆనందం
గమ్యం లేనివానికి గమ్యం చూపితె అంతులేని ఆనందం
ఎక్కడోకాదు దేవుడు నీలొ నాలో ఉన్నాడు అంటే ఆనందం
తల్లి, తండ్రి, గురువు గ్రహిమ్చుము ప్రత్యక్ష దైవం
వేదాద్యయము నందు ఇవ్వాలి ముందు ప్రాధాన్యం
పితృదేవతలకు చేయు కర్మలకు ఇవ్వాలి ప్రాదాన్యం
అభ్యుదయ మార్గములో నడుస్తూ చేయాలి సంసారం
వివాహమనేది గ్రుహస్తాశ్రమమునకు అమ్కురార్పణం
వివాహ ప్రక్రియతో ఏర్పడుతుంది దాపత్య భంధం
జీవసృష్టి వృద్ధిపొందటానికి దాంపత్య భందమే మార్గం
జగతిలో జన్మ లన్నిటిలో మానవ జన్మ ఉత్తమం
వివాహ ప్రక్రియలు
సమావర్తనము, కన్యావరణము, కన్యాదానం
వివాహ హోమం, అగ్నిప్రిచర్య, పాణిగ్రహణం
లాజ హోమం, సప్త పది , నక్షత్ర దర్సనం
అప్పగింతలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం
మణి కంకణములు, పమ్చలచాఅపు, గొడుగు
చెప్పుల జత ఉత్తరీయమ్, దండం
నలుగుపిమ్ది, అంజనం, అనులేపనం టపాగా
దీక్షావస్త్రాలు, పట్టు వస్త్రాలు, పావుకోళ్ళు
భాషా భ్యాసం నేర్పేది అమ్మతత్వం
మాద్యమం పిత్రార్జితం
బ్రాత్రు విత్తంచ అధమం
స్త్రీ విత్తం అధమాధమం
కనులు మిరమిట్లు గొలుపు బంగారు చాయా రూపం
సర్వావయవ సౌందర్య రాశి ఐన అపరంజి భావం
ధర్మ మార్గమున సర్వదా నీడవలె ఉండే కిరణం
రూప యవ్వన సుగుణాల రాశి అని చెప్పుట ఉత్తమం
రాజ గృహిణి కోరికల కన్నా ప్రజల సుఖాలే ముఖ్యం
రాజ్యం సంరక్షిమ్చుటకు నేతల త్యాగం ముఖ్యం
ప్రజల సంస్కృతిని నేతల గౌరవం కాపాడుట ముఖ్యం
క్రమశిక్షణతో, ధర్మ రక్షణతో పాలించుట అతి ముఖ్యం
వివాహవేడుకలు ఆచారప్రకరముగా జరుపుట అవసరం
రెండు కుటుంబాలు భందువులతో కలసి చేసే సంబరం
బ్రాహ్మణులు, గురువులు, పెద్దలు దీవెనలు పోమ్దేవరం
సన్నాఇమెళాళలొ "తాళి కట్టి " ఏర్పడే మూడుముళ్ళ భంధం
కన్నతల్లి మోసేది కొంతకాలం, గురువు విద్యనేర్పేది కొంతకాలం
సూర్య చంద్ర గమనాన్ని బట్టి ప్రకృతిలో జీవిమ్చాలి కలకాలం
భార్తననుసరిమ్చి పెద్దలకు సెవచెస్తూ సుఖంగాఉండు జీవిత కాలం
భూమికి భారం కాకుండా, బాకి లేకుండ ఉండాలి అంతిమ కాలం
సీతతో పానిగ్రహ మోనరిమ్చుట నీకు శుభం
భార్యయే నీ కీర్తి ప్రతిష్టలకు మూల కారణం
భార్య పాతివ్రత్యమే భర్తకు ఆయురారోగ్య భాగ్యం
శ్రీరాముడు ధరాపూర్వకముగా సీతకన్యకను పొందే దానం
శ్రీ రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిలను చేసే పాణిగ్రహం
భరతునకు మామ్దవీను, సత్రుఘ్ననునకు శుతకీరితి చేసే పాణిగ్రహం
నూతన వధూవరులు అగ్నిహోత్రమునకు చేసే ప్రదక్షణం
లాంచన ప్రాయముగా వెడుకొలు చేసి ప్రతిఒక్కరు సంతోషం
జీలకర్ర బెల్లముతో కలిపిన ముద్దను ఒకరిరి తలపై
ఒకరు చేతితో అదిమి పేటి ఉంచడం
వేదకల్పము తెలిసిన పెద్దలు పరస్పర జీవ శక్తులు
ఆకర్షణకు స్ప్రుసిమ్చటం
పుత్తడి పల్లెములలో ఉన్న ముత్యములు,తలబ్రాలు
మంత్రాలతో సిరస్సులపై పోసుకోవడం
గుప్పెడుతో అక్షతలు తీసుకోని నూతన వధూవరులను
ఋషులు,పెద్దలు అందరు అశీర్వదించటం
దేవదుందుభులు మారుమోగే మాంగల్యం కట్టే సమయం
అప్సరసలు నాట్యమాడిరి గంధర్వులు గానము చేసిరి ఆసమయం
పుస్పవర్షము కరతలముల ధ్వనుల మద్య కురిసే ఆ సమయం
ప్రతిఒక్కరు అక్షతలు చల్లి సీతారాములను దీవిమ్చారు ఆసమయం
భార్గవుడు కోపముతో చేత ఒక ధనుస్సు ధరించి చేరే రాజ భవనం
భార్గావుని సామ్తపరుచుటకు జనక మహారాజు చేసే ప్రయత్నం
దశరధమహారాజుకూడా ప్రాధేయ పూర్వ కముగా చేసే వచనం
విశ్వామిత్రుడు, వసిష్టుడు, భార్గావునికి తెలిపే ఉండాలి శాంతం
రామ ఈ వైష్ణవధనస్సును సంధించు తెలుస్తుంది నీ ప్రతాపం
విశ్వామిత్ర సలహాప్రకారముగా అందుకొని చేసే ప్రయోగం
తనశక్తిని తెలుసుకొని పరశురాముడు వహించే మౌనం
రామునికి అందరికి నమస్కరించి చేరే మహేంద్రగిరి పర్వతం
ఓం శాంతి: శాంతి: శాంతి:
సర్వం శ్రీ సీత రామార్పనమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి