13, ఆగస్టు 2014, బుధవారం

169. Romantic Comedy story 72 (Premiste Pellavutunda?)

                                                                            


ప్రేమిస్తే పెళ్లవుతుందా ?

గోపాలం M.B.A. చదివి  బ్యాంక్  ఉద్యోగము సంపాదించాడు.  ఎన్నో మంచి సంభందాలు వచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఒక చిన్న కోరిక ఉన్నది. ఆకోరిక సఫలీక్రుతమ్ చేసుకోవటానకి పడ్డ పాట్లే నా కధకు ఆధారాలు. జరిగిన సంఘటన ఆధారముగా వ్రాయుచున్నాను. గోపాల్ మరి అంత  పోట్టివాడు కాడు,  మరి అంత  పొడుగు వాడు  కాడు,  ఎర్రగా ఆంగ్లేయుడులా  ఉండడు , మరీ నల్లగా నీగ్రొలాగా ఉండడు  మధ్యరకంగా ఉంటాడు,  అంత  లావుగా బీమ సేనుడు లాగా  ఉండడు, మరీ అంత  సన్నగా బకాసురుడులాగా ఉండడు చూసెటప్పటి కల్ల ఆకర్షిమ్చేవాడిలా ఉంటాడు,  ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు, పళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. జీన్సు ప్యాంటు, టి  షర్టు వేసుకొని కల్లజోడు  పెట్టుకొని క్రాఫ్ మద్య పాపిడిగా  దువ్వి కొంత పొడర్ సెంటు కొట్టుకొని పగటి వేషకాడికి తక్కువ యువకుడి కన్నా ఎక్కువ గా మేకప్ కొట్టుకొని రోజు పార్కులవద్ద, ఉమెన్సు కాలేజి గేటువద్ద ఉండి  స్త్రీలను గమనిస్తూ ఉండేవాడు.

గోపాలం కళ్ళకు డిగ్రి చదువుతున్న పద్మిని అందగత్తెగా అనిపించింది. దానికి నవ్వుతు నవ్విస్తూ నలుగురితో చనువుగా ఉంటుంది. అందరు ఆమెను  బ్లాక్ అండ్ వైట్  అని ఏడిపిస్తారు. మొఖం తెల్లగా ఉన్న,కేశములు నల్లన, పద్మాల్లాంటి  కళ్ళు, వయసుకు తగ్గ వళ్ళు, నడకను చూస్తె 60 ఏళ్ళు  దాటిన ముసలోడు కూడా  వెంబడించే విధముగా ఉంటుంది. అందరిని చూసి చూడ నట్లుగా ఒరకంటితో చూస్తు కవ్విస్తుంది.

ఎవరు ఎన్ని జోకులు వేసుకున్న తనకు చదువే ముఖ్యమని భావించి తలవంచుకొని మరీ నెమ్మదిగా ఉంటుంది.
       . 
ఒక రోజు గోపాలం పద్మిని ఇంటికి వెళ్ళే సమయం చూసి  వెనుక వెంబడించి తను వ్రాసుకున్న ప్రేమ లేఖను అందించాడు. దాన్ని  తీసుకొని నింపాదిగా మడిచి రాకెట్ చేసి గాలిలోకి విసిరింది,  అది కాలవలో పడింది, ఒకనవ్వు నవ్వి మల్లా  వెనుతిరిగి చూడ కుండా  గబా గబా ఇంటిలోకి వెళ్ళింది. గోపాలం చేసేది లేక వెనుతిరిగి రూమ్కు చేరాడు. అప్పటికే రూమ్లో సుబ్బారావు తన స్నేహితుడు ఉన్నాడు,  అప్పుడే వచ్చావేమిటిరా నీ ప్రేమ ఎంత దాకా వచ్చింది. అని వెకిలిగా అడిగాడు.

నా అదృష్టం బాగుంది నడిరోడ్డులో నన్ను తిట్ట కుండా, చెప్పు తీసి కొట్ట కుండా ఇచ్చిన లెటర్ను రాకెట్ చేసి విసిరింది, అది ప్రేమిమ్చినట్లా, ప్రేమించ నట్లా,   నేను అర్ధం చేసుకోలేక పోతున్నాను. ఇప్పుడే కదా ప్రేమలో పడింది. నీవు పిలిచెంగానే ఇస్ క్రీమ్ కోసం ఆశ పడుతుందా ఏమిటి. కాస్త ఓపిక పట్టు ముందు ముందు నీకె తెలుసుతుంది ప్రేమలో ఎంత మజా ఉందొ అన్నాడు నవ్వుతూ.

మరైతే ఇప్పుడు ఎంచేద్దామను కున్నావు గోపాలాన్ని అడిగాడు సుబ్బారావు.  ఒక సిగరెట్టు దమ్ము పీల్సిస్తె మంచి అలొచనలు వస్తాయని నీవె చెప్పావుగా ఒక సిగరెట్టు ఇవ్వు అన్నాడు, నీకు అలవాటు లేదు, ఎందుకు అలవాటు చేసుకుంటావు అలవాటు లేనివాడు బ్రాహ్మనార్దానికి  పోయి కింద మీద పడ్డాడుట, నేను ఏదైనా సలహా నిస్తాను కూలుగా ఈ మంచినీరు త్రాగు టి  తెస్తాను అన్నడు సుబ్బారావు. ఈరొజుకు నీమాట వింటానులే కానీ అన్నా గోపాలం

గోపాలం; నేను సీనియర్  నీకు కొన్ని సలహాలు ఇస్తాను,  అవి తుచ తప్పకుండా పాటిస్తే,  నీ ప్రీమను జయిం చటం  నీవంతు అన్నాడు. ఆఇతే  పెళ్లి చేసుకోవడం నా వంతు కాదా నవ్వుతూ అన్నడు, గోపాల  'మహాశయా ' నీ గోప లీలలు నా వద్ద చూపకు, పెళ్లి నీవె చేసుకో నా సలహాలు పాటించమని మాత్రమే చెపుతున్నాను. అని కొన్ని సలహాలు చెప్పాడు సుబ్బారావు గోపాలం కు.

అలవాటు ప్రకారముగా ఉమెన్సు కాలెజీ వదిలే సమయాన చేరాడు గోపాలం, అక్కడే పద్మిని స్నేహితురాలు రాగిణి ఒక అబ్బాయితొ కోపంగా,  ఏమిటిరా నీవు నన్ను ప్రేమించావా, నన్ను పెళ్లి చేసు కుంటావా , ఏముందిరా నీదగ్గర, డబ్బుందా,  చదు వుందా, ఉద్యోగ  ముందా,  దేనిని చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది కోపంగా, నేను మొగవాడ్ని నేను ఘాడంగా నిన్ను ప్రేమిస్తున్నాను అది చాలదా అన్నాడు, అంతలో వెరే విద్యార్ధి వచ్చి ఎం పోరి నీవు మావాడ్ని ప్రేమించావా అంటూ మీదకు వచ్చాడు, అపుడే రాగిణి తన తెలివితో కాలు ఎత్తి మర్మావయవము మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టింది అంతే ఇద్దరు అరుచుకుంటూ వెళ్లి పోయారు.

రాగిణి ఎందుకె అంట్లా రెచ్చి పోయావు, కరాటి ఎప్పుడు నేర్చుకున్నావు, లోపల బ్రా లేకుండా అంత లూజు షర్టు వేసుకొని, టైట్ ప్యాంటు వేసుకుంటే ఎ మొగాడి కన్న పిచ్చెక్కుతుంది, కాస్త డ్రస్ మార్చుకో నీవు చీర కట్టుకొని తిరుగుతున్నావు, ఎవరైన వెంట  పడ్డారా, చూడు  నా చుట్టూ ఎంత మంది  ప్రేమిస్తున్నాము అని వెంబడి పడుతున్నారు అన్నాది. నీ ప్రక్కన తిరగాలంటే నాకు భయ మేస్తున్నది,   భయమెందుకు మనం ధైర్యముగా ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు అన్నాది.

ఏమోనమ్మ నా దారి నేను పోతున్నాను నీ ప్రేమల్లో నన్ను లాగకు అంటూ అటో ఎక్కింది.

ఒక రోజు పద్మిని ఏరంగు చీర కట్టు కుందో, ఎ జాకేటు వేసుకుందో,  అదే రంగు ప్యాంటు, షార్ట్, వేసుకొని ఎదురుగా బయలు దేరాడు గోపాలం,  చేతిలో బోకే పట్టుకొని చేతికి ఇవ్వ  బోతున్నప్పుడు,  తప్పు కొండి  తప్పు కోండి  సైకిలు కు  బ్రేకుల్లేవు అంటూ రెండు కాళ్ళ మద్య సైకీలును గ్రుద్దాడు  అంతే  అమ్మా అంటూ మూలిగాడు , చేతిలో బోకే  ఎగిరి అవతల పడింది, పద్మిని మాత్రం అది  చూసి నవ్వు కుంటూ ముందుకు జరిగింది,  సైకిల్ నడిపిన కుర్రవాడు సారి అంకుల్ అంటూ చెప్పి మరీ వెల్లాడు,  ఎవ్వరిని ఏమనలేక క్రింద భాదతో నెమ్మదిగా  రూమ్కి చేరాడు.

మరొక రోజు పద్మిని బస్ స్టాపులో ఉండటం చూసి బైక్  మీద కూర్చొమని సైగలు చేసాడు, చూడనట్లుగా నుంచొని   ఉన్నది, ప్రక్కనే ఉన్న మరో చిలక ఎక్కి ఎక్కమన్నవుగా పొనీ అన్నది, బస్సు రావటం బస్సులో పద్మిని ఎక్కి వెళ్ళటం బస్సుతో పాటు బైకు నడపటం మొదలపెట్టాడు గోపాల్, కిటికిలోనుండి గోపాల్ అవస్త అంతా  చూస్తు నవ్వుతున్నది, వెనుక నున్న అమ్మాయి ఎం పోనిచ్చటం స్పీడ్ పొనీయ్ నా బాయ్ ఫ్రెండ్  వెళ్ళిపోతాడు అంటూ పిర్రను గిల్లిమ్ది.కెవ్వుమని కాక పెట్టాడు, ఆ అరుపు చూసి పద్మిని బస్సు  నుండి ఒక నవ్వు నవ్వింది, అంతే  ఆ నవ్వుతో బై క్ బాలెన్సు తప్పి  ప్రక్కనే ఉన్న ఒక స్తంభానికి కొట్టి, ధబీమని పడ్డారు  ఇద్దరు, యిద్దరికి  చేతులకు, కాళ్ళకు దెబ్బలు బాగా తగిలాయి, క్రింద పడ్డ అమ్మాయి ఆడపిల్లను ప్రక్కన పెట్టుకొని నడపటం చేతకాని వాడివి ఎం మొగాడివయ్యా అంటూ దులుపుకుంటూ ముందుకు నడిచింది, బైక్ ను రిపేర్ కు ఇచ్చి రూమ్కు  దెబ్బలతో చేరాడు గోపాల్.

గోపాల్ అవస్తను చూసి సుబ్బారావుకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు, పొనీ ఆమ్మాయిని మరచిపో,  వేరే  అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పా లంటే మనసోప్పుట లేదు, ఎందు కంటే ప్రేమ విషయాలు నేర్పాడు, రెండు రోజులు కష్ట పడ్డావు మూడో  రోజు కూడా  నీ ప్రయత్నం చేయ్ అన్నాడు.

నా ప్రేమను జయించే  దాక ఈ గోపాలం వీడడు,  ఏది ఒక సిగరెట్టు ఇవ్వు ఒక దమ్ము లాగితే మంచి ఆలోచన వస్తుంది, నేను సిగరెట్టు నీకు ఇస్తే నాకు లేకుండా అంతా నివే తాగుతావు , ఉండు నీకు నిమ్మకాయ రసం తెస్తా అదే నీకు మంచి మందు, నీకున్నా పైత్యము తగ్గి అంతా మనస్సు ప్రశాంతముగా ఉంటుంది, అ దెబ్బలకు మందులు వ్రాసుకొని హాయిగా పడుకో అంటూ చెప్పి వెళ్లి పోయాడు సుబ్బారావు.

పద్మిని డిగ్రి పరిక్షలు పూర్తి అయిన సందర్బముగా స్నేహితురాలు రాగిణి తో  కలసి కామత్ హోటల్ కు వచ్చింది. పగలు నక్షత్రాలు కనిపిస్తాఐ, చల్లని వాతావరణంలో ప్రేత్యేక గదిలో కూర్చొని ఉన్నారు  టేబుల్ పై ఉన్న టిఫిన్ లిస్టు చదివి ఆర్డర్ ఇచ్చింది రాగిణి.

రాగిణి కి మాత్రము మొగవాల్లను చూస్తె కొంటె వేషాలువేయాలని ఉన్నాది. ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు గోపాలం.

గోపాలం నీటుగా సఫారి వేసుకొని  ఉండటం గమనించారు  పద్మిని, రాగిణి.లు.

పద్మిని నీవు ఏమనుకోవద్దు ఒక ఆట ఆడించాలని  నీ వుడ్ బి  ని, ఒక పట్టు పట్టాలని,  కోపం తెచ్చుకోకు అన్నది రంగంలో దిగింది.

హోటల్ లోపల చీకటిగ ఉన్నది , సప్లైర్ నెమ్మదిగా టిఫెన్ తెస్తున్నాడు, ఆ సమయాన రాగిణి అతనికి అడ్డంగా కాలు పెట్టింది, వెంటనే సప్లైర్ బాలన్స్ తప్పి ముందుకు పడపోతుంటే  గోపాల్ అతని ఆపగా చేతిలోవి టిఫిన్ ప్లేటులు  క్రిందకు జారినవి.

వెంటనే పద్మిని వద్దకు వచ్చి మీరు ఆడవారు మనుష్యులను గౌరవించే విదానాన్ని ఇదేనా, రాగిణి గారు మీరు కూడా  మగవారు అందరు మూర్ఖులుగా భావించటం తప్పు,  ప్రేమనేది బయటకు కనిపించదు, కాని హృదయాలు స్పందన  అని మరవకండి.  ప్రేమ అనేది ఇరువురి మద్య తెలియకుండా పుడుతుంది. జీవితాన్తమ్ కష్ట సుఖాలు పంచు కుంటు  బ్రతకాలి, ప్రేమించిన వారికీ తల్లి తండ్రులు ఎప్పుడు సహకరించుట తక్కువ, ఏది ఏమైనా పద్మిని గారు నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, నాప్రేమను మీరు పొందాలని మీలొ నామీద ప్రేమ ఉన్నాదని నేను భావిస్తున్నాను,  కనుక  మీరు తప్పకుండా రేపు సాయంత్రం పార్కుకు రాగలరు, రాగిణి గారు మీరు కుడా మొగవారిని తక్కువ అంచనా  వేయకండి, మొగవారు  లేందే ఆడవారు  ఉండరని,  ఆడవారు లేందే మగవారు  ఉండరని, ఇరువురిని సృష్టించిన దేవుడు ప్రకృతిలో బ్రతకాలని తెలియపరిచాడు.

నెమ్మదిగా బయటకు నడిచాడు గోపాలం,  తప్పు తెలుసుకొని  రాగిణి, పద్మిని,  బయటకు వచ్చి ఆటో ఎక్కారు.
   .       .                   .    .                      
 సుబ్బారావు సిగరెట్టు దమ్ము మీద దమ్ము పీలుస్తు ఉన్నాడు, అపుడే లోపలకు అన్య మనస్సుతో ప్రవేశించాడు గోపాలం.  ఏమైంది అంత నీరసంగా ఉన్నావు అని అడిగాడు, ఎమీ కాలా నేను నిదానంగా ప్రేమ విషయం చెప్పాలనుకున్నా, కాని, కొంత కోపం ప్రకటించి మరీ చెప్పాను,  దానికి పద్మిని ఏమైనా భాదపడిన్దా  అని అనుమానముగా ఉన్నది, నా ప్రేమ ఫలిస్తుమ్దంటావా అని ఆడిగాడు.

అప్పుడే పద్మిని నుండి ఫోన్ వచ్చింది.

దూరంగా  పోయి మాట్లాడాడు, క్షమాపణ అప్పుడే చెపుదామనుకున్నా కాని చెప్పలేకపోయాను, రాగిణి చేసింది తప్పే, దాని తరుఫున నేను మీకు క్షమాపణ చెపుతున్నా, నా  ప్రేమను మీకు వ్యక్తం చేయాలని చాలా సార్లు ప్రయత్నించాను, కుదరలేదు, నా మనసులో ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాలని ఉన్నది, అన్యధా భావించకుండా మీరు నేడే టాన్కబండ్ వద్ద ఉన్న సీతారాముల విగ్రహాలవద్ద  మీకోసం  ఎదురు చూస్తు  ఉంటాను,  మీరు వస్తారు కదూ అన్నది

గోపాల్ ఒక్కసారిగా ఎగిరి గంతేసి సుబ్బారావును గట్టిగా పట్టుకొని ఒక్క ఊపు ఊపాడు, అంతే  గిర గిర తిరిగి క్రింద పడ్డాడు సుబ్బారావు,  తొందర పడకు ఇల్లు అలుక గానే పండుగ కాదు, నీవు కలిశాకా ఏమ్చేపుతుందో,  నీకెమన్నా చెప్పిందా, లేదు మరి అంత తొందరెందుకు

ప్రేమ అంటే అంత తేలిక కాదు ఆది అర్ధం చేసుకో అన్నాడు

గోపాలం నీలాగా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని కూడా అన్నది, మరి ఏమైందో కానీ నన్ను మరచి పొమ్మని చెప్పి వేరేవారిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి పోయింది, ఆమెను మరువలేక, మరొకరిని పెళ్లి చేసుకోలేక ఇప్పటిదాకా ఉన్నాను. కాని నిన్ననే నేను ప్రేమించిన వ్యక్తిని చూసను, ఒక బాబుతో ఉన్నది. నన్ను పలకరించింది మంచిగా,. భర్త యాక్సిడెంట్ లో మర నిన్చాడుట ఆనాటి నుండి ఆర్ధిక పరిస్తితి తల్ల  క్రిందల అయిందట నన్ను కలుస్తాను అని మరల చెప్పి వెళ్ళింది. ఈరొజు నుండి నేను నీకు దూర మవవచ్చు, నేను ప్రేమించిన ఆమెనే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అది నీకు చెపుదామని నీ ప్రేమ విజయము పొందాలని కోరుతున్నాను, నీ పెళ్ళికి నాకు  శుభలేఖ పంపితే నేను రాగలను, పెల్లయిన దానినే చేసు కుందామని అనుకున్నావా,  ఆ దేవుడు  నా ప్రేమను ఇలా మార్చాడు అందుకనే ఆమెను ఆదరించాలని అనుకున్నాను. నీ ఈ  నిర్ణయము బావున్నది, నీకు ఎ అవసరమున్నా నీ స్నేహితుడున్నాడని మరువకు కాకితో కబురంపిన వెంటనే వస్తాను. మీరు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి నేను సంతకాలు పెడతాను. మన స్నేహం మారదు , మనం తరుచుగా కలుసుకుందాం  అన్నాడు గోపాల్. 

గోపాల్ బయలు దేరి ట్యాంక్ బండ్ మీద  ఉన్న శ్రీ సీతారముల విగ్రహాల్వద్దకు చేరాడు, అప్పటికే వచ్చింది పద్మిని
మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటాను  అన్నాది పద్మిని,  కోరికలు గుర్రాలుకావచ్చు కానీ కదను తొక్కనివ్వకూడదు, అసలు నాలో ఏమున్నదని ప్రేమించానని గట్టిగా చెప్పారు మీరు,  కనీసమ్ కైపెక్కే విధముగాను ఉండను, కవ్వింపులు చేయను, ఆధునిక దుస్తులు ధరించాను, కేవలము ఆకు పచ్చ పరికిణి, పాల నురుగు లాంటి ఓని, రెండు జడలతో అప్పుడపుడు పూలు పెట్టుకొని ఉంటానేమో, అందులో నేను తెల్లని పిల్ల అని అందరు అంటారు.
                                                


పద్మిని నీవే కావాలి,   మన్మధుని మైమరిపించే నీ ఒంపు సొంపులు కావాలి, అధరాల  యొక్క అమృతాన్ని పొందాలని నీ మనసులొ చోటు కావాలి,  అందుకే నేను నిన్ను ప్రేమించాను.

అయితే నేను చెప్పేవి అన్ని ఆచరిస్తావా అని అడిగింది. నీకొసమ్ ప్రాణాలు ఇమ్మన్న ఇస్తాను అని గట్టిగ చెప్పాడు గోపాల్.

మనస్సులు ప్రేమ భావనతో కలసి పోవాలి, ఇద్దరు సమానమని తలవాలి, ప్రేమతో భావాలు పంచుకోవాలి, భౌతిక సుఖాలు సాస్వితము కాదు, జీవితామ్తము ఒకరికోరు సహాయము చేసుకుంటూ బ్రతకాలి,  ప్రతి పలుకులో, చేష్టలలో, ఊహల్లొ, ఆనందం ఒకరికొకరు పొందాలి అన్నాది,  మనిద్దరమూ ఒకే శ్వాస, ఒకే దిస, ఒకే ద్యాసా, ఒకే మాట, ఒకే గమ్యం , ఒకే శయ్య, ప్రేమ రసస్వాదమును పొందటమే నిజమైన జీవితమని నేను అనుకుంటున్నాను. అందుకే నీవు  జీవితాన్తము సుఖపెడతాను, కష్ట పెట్టను అని నా చేతిలో ప్రమాణము చేయాలి, అన్నది. నీవు చెప్పినట్లుగా నేను ప్రమాణము చేయు చున్నాను అన్నాడు గోపాల్

దీనికి సమ్మతమైతే మీ తల్లి తండ్రులు, ఇటు మా తల్లి  తండ్రులు ఒప్పుకుంటే మనము దేవుని గుడిలో అతి అక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుందాము,  ఇదే నా అభిప్రాయము,  కాని " నేను ఒక పెళ్లి కొడుకును  చూడాలి,  ఆతను నాకు నచ్చలేదని చెప్పాలి,  ఆ తరువాతే మన అలోచనలు అమలు చేయటానికి మా ఇంటిలో నేను నీ  గురించి చెపుతాను, నీవు నా గురించి మీ ఇంటిలో చెప్పవచ్చు అన్నది.            

ఇన్తకీ నీవుచూడ బొయె ఆ పెళ్లికొడుకు  ఎవ్వరో తెలుసుకోవచ్చా అన్నాడు గోపాల్.

ఎవరా అని అడుగుతున్నావు ఇంకెవరు ఈ ఫోటోలో ఉన్నవారు అంటూ చూపించింది  అంతే  చూసి కళ్ళు తిరిగి క్రింద పడ్డాడు గోపాల్

ఆ ఫోటో ఎవ్వరిదో  మీకు తెలిసి  పోయి  ఉంటుంది కదు వేరే చెప్పనక్కరలేదు మన కధ  హీరొ. .