ప్రేమసాగరం (2)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సుజాత మ్యారేజ్ అర్ధాంతరంగా ఆగి పోవుట వలన వచ్చినవారు పెళ్లి కోడుకుని
నాలుగు తిడుతూ భోజనం చేసి మరీ వెళ్లి పోతున్నారు, జగదీశ్ , జగదీశ్వరి,
బ్రహ్మానందం ముగ్గురు పెళ్లి కూతురు తండ్రిని, పెళ్లి కూతుర్ని కలసి, ధైర్యము చెప్పి బయటకు వచ్చారు, పెళ్లి కూతురు తండ్రి ఎమీ తీసుకొలేదు, భోజనం చేయమంటే చేయలేదు, ఇవిగో స్వీట్, హాట్ ప్యాకెట్లు మీ కారులో పెట్టిస్తున్నాను,
మీరు వీలు చూసుకొని తినండి, మా అమ్మాయి పెళ్లి ఆగినన్దుకు, మీరు సమయానికి
వచ్చి మాకు వివరాలు తెలుపుట వల్ల అతన్ని పట్టిమ్చ గలిగాము అన్నారు.
రాజేశ్వరి తండ్రి శ్రీ పతిరావుగారు జగదీశ్ వద్దకు వచ్చి మా అమ్మాయిని హాస్టల్ దాక దింపండి నాకు ఇక్కడ కొంత పనిఉన్నది, నేను ఇట్లు అడుగుతున్నందుకు మీరు ఏమనుకోవద్దు అన్న మాటలకు జగదీశ్ నేను దిన్చుతాను మీరు నిదానముగా రండి అని చెప్పారు , అందరికి మరొక్కసారి చెప్పి ముగ్గురు కారులో బయలుదేరారు.కారు వేగంగా పోతున్నది వెనుకసీట్లో ఉన్నవారు దగ్గరకు జరిగారు,.
జగదీశ్
జగదీశ్వరి చేతిని తీసుకుంటు నీవు చాలా తెలివి గలదానివి, అందులో "లా
" చదివినావు, ఒక సినమా కధలా జరిగిపోయింది, పెల్లికూతురె పెళ్లి కొడుకును
పట్టించడం అనేది చాలా ఆశ్చర్యము వేసింది. అంటూ చేతిని ముద్దు
పెట్టుకున్నాడు. అప్పుడే వళ్ళు జలదరించిది, జగదీశ్వరికి జగదీశ్ చేయి
పట్టుకొని మీరెమ్ తక్కువ తిన్నారా, పూర్తి వివరాలు అందించింది మీరె కదా
అంటూ చేతిని ముద్దు పెట్టు కున్నది.
అపుడే బ్రహ్మ నందం మూడో వాడు
ఒకడు ఇక్కడున్నాడు గమనించండి అన్నాడు, ఆమాటలకు ఇద్దరుకొంచము దూరముగా
జరిగారు, అప్పుడే కారు ప్రక్కకు అపేశాడు, కారులో పెట్రోల్ అయి పోయింది,
నేను దగ్గరలో ఉన్న ఊరిలొ పెట్రోల్ తెస్తాను, మీరిద్దరు జాగర్తగా
ఉండండి అని చెప్పి క్యాన్ పట్టుకొని బయలు దేరాడు.
ఇద్దరు కారు నుండి
బయటకు వచ్చి దగ్గరలో ఉన్న మామిడి తోటలోకి వచ్చారు. అక్కడ మామిడి కాయలు
వ్రేలాడు తున్నాయి. వాటిని చూసాక వెంటనే రాజేశ్వరికి కోరిక పుటింది,
ఎగిరితే అందలేదు ఎగురుట చూసి జగదీశ్ నవ్వు ఆపుకోలేక పోయాడు.
అట్లా నవ్వే బదులు ,నన్ను చీర పట్టుకొని ఎత్త కూడదు అన్నది, సరే వెనుకకు తిరుగు, చీర కుచ్చిల్లు సరిగా చేసుకో, నేను ఎత్తే టప్పుడు
నీవు నవ్వకు, నీవు నవ్వా వంటే నిన్ను పడేయగలను, నేను నవ్వనులే అన్నది
జగదీశ్వరి. జగదీశ్ కు చేతులు వనుకు తున్నాయి, ధైర్యముగా పిర్రలు పట్టుకొని
ఒక్కసారు పైకి లేపాడు, అబ్బ బరువుగా ఉన్నావు నీవు , నాకు చక్కిలిగింతలుగా ఉన్నది, నాకు నవ్వు
వస్తున్నది , నవ్వకు పైన మామిడి పండ్ల గుత్తిని గట్టిగా పట్టుకొని ఒక గుంజు గుంజు అన్నాడు. గట్టిగా మామిడి పండ్లు లాగుట వల్ల బ్యాలెన్సు తప్పి ప్రక్కనే ఉన్న గడ్డిలో ఇద్దరు ఒకరిపై ఒకరు పడ్డారు, నెమ్మదిగా కదిలి వళ్ళంతా దులుపుకుంటూ నవ్వు కున్నారు.
ఇద్దరు కలసి పాట పాడుతున్నారు
ఆ : మామిడి పండులా వున్నావు, దడపుట్టిస్తున్నావు
దగ్గర చేరి పరువంతో గిలిగింతలు పెడుతున్నావు
ఆ: నా ముఖార విన్దాన్ని చూసి, మురిసి పోతున్నావు
పండ్ల కదలికలకే మైమరచి, ముగ్దుడవుతున్నావు
అ జామ పండుల వున్నావు, జారి పోతున్నావు
జరా జరా చేరి "జర్రిలా" నన్ను, ఆడి స్తున్నావు
ఆ : రాత్రి కలలోకి వచ్చి, గిలిగింతలు పెడుతున్నావు
జామ్ జామ్ అంటూ, చీమలా కుట్టేస్తున్నావు
అ: యాపిల్ పండులా ఉన్నావు, యాద మరిచావు
యారణాల పెట్టిలా గలగలా ,నన్ను నవ్విస్తున్నావు
ఆ: నా యదపొంగులు, నీ సొత్తు, ఎప్పటికి మారవు
ఎప్పుడు పడితే అప్పుడు, సిగ్నల్ లేందే రైలుఎక్కలేవు
ఇద్దరు : నీవు మామిడి పండు, లాగున్నావు, నీవు జామ పండు లాగున్నావు,
నీవు యాపిల్ పండులాగున్నావు, నీవు దబ్బ పండు లాగున్నావు
పాడుతూ నవ్వు కుంటున్నారు , అప్పుడే వర్ష పు చినుకులు ప్రారమ్భ మైనాయి,జగదీశ్ చొక్కా విప్పి ఆమె భుజాలపై కప్పాడు, వర్ష ము పెరిగింది ఇద్దరు బాగా తడిసారు. అంతలో వాన వెలిసింది.
తడిసిన బట్టలతో కారులో కూర్చొవటం కష్టం అని భావించి ఇక్కడే అరేసుకొని పోదామని అనుకున్నారు ఇద్దరు.
అప్పుడే
వయ్యారాన్ని వలకపొస్తూ, వలపులన్ని విస్తరేస్తూ, కొంగు జార్చి ప్రక్కకు తడి
నీరు పిండుతూ, ఉంటె జగదీశ్ గుండె గుబెలు మన్నది, కవ్విస్తున్నది, అంటే
మనసునిలువ నంటున్నది, అలా పైట కొంగును పైకి గాలిలిలో అరే సినప్పుడు
ఎదపొంగులు మనసు తొలిచెసినాయి, జగదేక సుందరి లో ఉన్న శ్రీదేవిలా ఏమి
రూపమది, అజంతా సిల్పాన్ని మించినది, బాపు గీసిన బొమ్మకన్నా మించిన అందాలు
నా కగుపిస్తున్నాయి, ఎల్లోరా శిల్ప సుందరిలా పరువాలు విరజిమ్మినట్లు ,
తెల్లటి పాలరాయి లాంటి దేహాన్ని చూసి,, చందమామ లాంటి అందమైన ముఖాన్ని
చూసి, అల్లరి చేసే కళ్ళు కదలికలు చూసి, మనసును దోచే చెవుల జూకాలను
కదలికలికలు చూసి, సుడిగుండం లాంటి నాభిని చూసి, అందాలన్నీ
విస్తరేసి ముచ్చటగా చీర కట్టుకొని తెలుగు ఆడ బడుచులా నాకళ్ళకు కనిపించింది
రాజేశ్వరి, ఏమిటి అల గుడ్లప్పగించి చూస్తున్నావు, అందాలని , చీర
సర్దుకొని ఇక పోదామా అన్నది , అప్పటికి కాని మనలో కానికి రాలేదు, సౌందర్య లహరి నుండి జగదీశ్.
ఆ పోదాము అంటూ కారు దగ్గరకు వచ్చారు , అప్పుడే
బ్రహ్మానందం పెట్రోల్ పోసి రడీగా ఉన్నాడు, మాది ఆలస్యమైనదా, నీవు వచ్చి
చాలా సేపఇనదా అని అడిగాడు జగదిశ్, మీది కుర్రకారు మీ ఆలోచనులు మీవి
నాకెందుకు కారు ఎక్కండి, మల్లీ వానోచ్చిందంటే నా కళ్ళు కనిపించవు మనం
చాలా కష్టపడాల్సివస్తుంది, పోదాం అన్నాడు. సరే , సరే
ఎవరో య్యాక్సిడెంట్ చేసి వెళ్లి నట్టున్నారు, అక్కడ పడి ఉన్న వ్యక్తి ని ఎవ్వరు పట్టించుకోన్నట్లు లేదు, వెల్లిచూద్దాము అక్కడకు పొనీయి కారు బ్రహ్మానందం అన్నది, మన కెందుకమ్మా ఇరుకుల్లో
పడతాం అన్నాడు, మానవత్వం ఉన్నవాడు ఎవరూ అట్లా అనరు అన్నది, అంటే నాకు
లేదా మానవత్వం, అది నీకె తెలియాలి అన్నది, డాక్టర్ గారు ఆతను బ్రతికి
ఉన్నాడో లేదో చూస్తారా అని అడిగింది. కొన ఊపిరిలొ ఉన్నాడు, కారులో
తీసికెల్తె బ్రతక వచ్చు పట్టుకో పడుకోబెడదాం అని కారులో తీసుకెల్లి ప్రక్కన
ఉన్న హాస్పటల్లో చేర్చారు, అతని సంచిలో ఉన్న ఫోటోను చూసి జగదీశ్వరి ఆశ్చర్య
పోయింది .
డాక్టర్ మీరు నన్నెందుకు బ్రతికించారు, నాలాంటి వారు ఈ లోకంలో బ్రతకలేరు, బ్రతకాలన్న బ్రతక నివ్వరు, వ్యవస్థ అలా మారి పోయింది . జగదీశ్ గారు, జగదీశ్వరి గారు మీరు నన్ను బ్రతికిన్చినందుకు మీకు ధన్యవాదాలు, నాకధమీకు చెపుతాను వినండి.
నేను గుంటూరు లో అగ్రహారంలో నివసించే వాన్ని, మానాన్నగారు ప్రైవేట్ స్కూల్లొ మాష్టర్గా పనిచేసినారు, , నేను ఎమ్, ఏ. (తెలుగు) చదివాను, మా అక్క , బి .ఎ . చదివింది, అప్పు మానాన్న ఘనంగా పెళ్ళిచేసి పంపించాడు , మానాన్నగారు అర్ధంమ్తరంగా యాక్సిడెంట్లో మరణించారు, అప్పుడే కష్టాలు మొదలైనాయి , మా అక్కమాత్రము భర్తతో హైదరాబాద్ వెళ్లిపోయింది, నేను ఉద్యోగము కోసం వేతకని ప్రాంతము లేదు , స్కూలు లేదు, ఎందుకు బాబు పనికిరాని తెలుగు చదివావు , అది కూడు పెడుతుందా, గుడ్డ ఇస్తుందా, అనే వారున్నారు, దానికి కారణం ప్రభుత్వం, అధికార భాషా సంఘం, పదవులు వచ్చాక తెలుగెందుకు వద్దు , మొత్తము అంగ్లం మాత్రమే బోధించాలని తెలుగు మీడియమ్ స్కూల్లు తీసివెసి ఆగ్లమీడియమ్ స్కూల్లుగా మార్చటం వళ్ళ, ఎవరికి ప్రయోజనం , భాషా సంఘం వారు ఉపన్యా సములు భాషా పండితులను ప్రోత్చహిమ్చటం లేదు, తెలుగును వృద్ది పరచాలని ప్రభుత్వము వారు కృషి చేయుట లేదు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను .
నేను గత్యంతరము లేక ఒక ఆర్టిస్ట్ వద్ద పనివాడిగా చేరాను, నేర్చుకున్నాను, తెలుగు అక్షరాలు వ్రాయటం , దానిమీద బ్రతుదామను కుంటే అప్పుడే కప్యూటర్ ప్రిన్టింగ్ వచ్చింది, గోరుచుట్టుపై రోకటి పోటులా బ్రష్ లతో వ్రాయించు కొనే వారు లేక మా జీవనాధారములేక జీవిత సమస్య ఏర్పడినది. కనీసమ్ గుడిలో పూజారిగా అన్న పనిచేద్దామని అనుకున్నా అక్కడ కూడా పొటీ వచ్చింది .
మా అమ్మ ప్రొత్చాహముతొ బి. ఎ. చదివిన అమ్మాయి ని పెళ్లి చేసుకున్న, పెళ్ళైతే ఉద్యోగము వస్తుందిరా కష్టాలు తొలిగిపొతాయి , చదువుకున్నవారికి ఎప్పటికైనా మంచి ఉద్య్యోగము వస్తుంది అన్నాది మా అమ్మ.
నా భార్య ప్రోత్చాహము తో పోటీ పరిక్షలు వ్రాసాను, కాని ఉద్యోగము రాలేదు, కాని దరిద్రునికి ఆకలెక్కువ అన్నట్లు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు, వారి పాల డబ్బాలకు, మందులకు ఖర్చులు పెరిగి పోయి నాయి, మా అమ్మ మాత్రము ఆఇంట్లో , ఈ ఇంట్లో వంటలు చెస్తూ మాకు అన్నం పెడు తున్నాది.
మా అమ్మ ఓపిక లేకున్నప్పుడు పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టలేని వాడివి, పిల్లలెందుకు కన్నావు, పెళ్ళాం ఎందుకు అని ఎత్తి పొడుస్తుంది
నా భార్య కుడా ఒక పెద్ద వ్యాపారి ఇంటిలో వంట మనిషిగా చేరింది, నేను ఒక కంపెనీలో గెట్ కీపరుగా చేరాను, సంతోషముగా మొదటి నెల జీతములు అందుకున్నాము, నాభార్య పనిచేస్తున్న ఇంటిలో ఓనర్ కొడుకు ఒట్టి జులాయి వాడు, మా అవిడ మీద అసబ్య కరంగా ప్రవరిమ్చ బోయాడు, వాడికి బుద్ధి చెప్పి ఉద్యోగము మానేసింది, నాకు గేట్ వద్ద కరంటు మిషన్లు పెడుతున్నాము ఇక నీవు కాపలా అక్కర్లేదు అని ఉద్యోగము తీసేసారు. అప్పుడే మా అమ్మకు గుండె జబ్బు వచ్చింది, డాక్టర్ కు చూపగా 3 లక్షలు కావాలి అవి తెస్తేగాని మీ అమ్మ బాగు పడదు అని చెప్పరు ,
అపుడే అనుకున్న నాలాంటి వారికీ మరణమే తప్ప వేరే మార్గము లేదని ఇంత దూరముగా వచ్చి మరీ విషం త్రాగాను, కాని నాకు చావు రాలేదు అని తన కధ చెప్పుకున్నాడు .
వెంటనే డాక్టర్ జగదీశ్ ఇక నీవు అధైర్య పడ నవసములేదు, నా నర్సింగ్ హోం లో నీకు ఎకౌంటు ఉద్యోగము (కంప్యూటర్ నేర్పి ) ఇస్తున్నాను . నీ భార్యకు నావద్ద నర్సుగా ట్రైనింగ్ ఇచ్చి తీసు కుంటాను , మీ పిల్లలను చక్కగా చది విన్చికోవచ్చు, మీ అమ్మకు నేనే ఉచితంగా ఆపరేషన్ చేస్తాను అని చెప్పాడు.
జగదీశ్వరి ఇంతకీ ఆఫొటో లొఉన్న అమ్మాయి ఎవరు , మా పెదనాన్న కూతురు, వీరి పరిస్తితి ఇంత దిగజారిందని తెలియక పోవచ్చు, ఇంత వరకూ నాకే తెలియదు .
కొందరు అను కుంటారు నాకేవ్వరక్కరలేదు, నన్ను ఆదరించే వారు లేరు అని మనసులో అనుకుంటారు, భాద పడుతుంటారు అది తప్పు , ఒకరి భాద ఒకరు పంచు కోవటం లో ఉన్నది సంతోషం, చెప్పుకుంటే సహాయము చేస్తారు, లేదా చేయము అని చెపుతారు మనసులో భాద పెట్టుకొని ఆరోగ్య ము పాడుచేసు కుంటున్నారు ఎందుకు అవసర మనుకున్నాపుడు గోపాల డంత వాడు కాళ్ళు పట్టుకున్నాడు, అహం ప్రక్కన పెట్టి, స్నేహనికి విలువనిచ్చి, భందుత్వాన్ని గౌరవించి, ధ్యేర్యముగా బ్రతకాలి ఎట్టి పరిస్తితిలో అధైర్య పడ కూడదు, మంచి రోజులు ముందున్నాయని జీవించాలి అన్నది రాజేశ్వరి.
అప్పుడే బ్రహ్మ్ నందం చెవిలో పువ్వు పెట్టుకొని వచ్చాడు, ఇప్పుడే వినాయకునికి గుంజీల్లు తీసి వచ్చాను ఆసుపత్రిలో ఉన్న వారందరూ బాగు పడాలని కోరుకున్నాను అన్నాడు
అప్పుడే రాము భార్య, పిల్లలు తల్లి, వచ్చారు. నేను మీకు ఏమి తక్కువ చేసాను , నాకు చేతనై నంతవరకు కష్ట పడు తున్నాను, నన్ను అన్యాయము చేసి ఎందుకు చని పోదామను కున్నారు, పిల్లలు మేము ఇది కావాలని, అది కావాలని కోరను , తల్లికి బాబుకి, నా ఆరోగ్యం కోసం మందులు కావాలని వేదిమ్చను, నన్ను క్షమించు బాబు , మేమ్మదరం కలసి నిన్ను కష్ట పెట్టాము అన్నది రాము తల్లి .
రాము భార్య జానకిని రాజేశ్వరి గుర్తు పట్టి మీ కష్టాలు తీర్చుటకు మేము ఉన్నాము మమ్ము మరువకండి అనిచెప్పింది,
కారు రడి చేయండి డ్రైవర్ గారు అన్నది రాజేశ్వరి
జగదీ శ్ రాము భార్య చేతిలో కార్డు పెడుతూ మీరుభాధ పడకండి నన్ను కలవండి . ఇక్కడ మొత్తం ఫీజు కట్టేసాను, అని చెప్పి బయలు దేరారు.
బయట హారన్ కొడుతూ ఉన్నాడు.
గాలిలొఎగురు కుంటూ ఒక కాగితము వచ్చి పడింది జజగదీశ్ దగ్గరకు
తీసి చదవటం బిగిన్ చేసాడు
వరదలు వచ్చిన, వాగులు పొంగిన, కడలిలో చిక్కిన
మేఘాలుకమ్మిన, కిరణములు కమ్మిన,వలలోచిక్కిన
భరణాలు ఇచ్చిన, భావాలు పంచిన, కలలో కొచ్చిన
బాలల ప్రార్ధన, కీర్తనల వలన , ఓం కారము మారునా
సంఘాలు, మతాలూ, కులాలు ఎన్ని ఏర్పడిన
తల్లులు, తండ్రులు, ముత్తాతలు ఏమి చేయ కన
లడ్డూలు, జాంగ్రీలు, చెక్రాలు, బజ్జీలు ఏమిపెట్టకన
పులగం, మీగడ, కృష్ణ ప్రేమ, వెన్న, వద్ద నినా
ఆహారం, ఆరోగ్యం, అర్ధం, చుట్టూ తిరిగిన
విరహం, వియ్యారం, కామం చుట్టూ నలిగిన
పరువం, వినయం, పతివ్రతా చుట్టూ ఉండిన
వ్యసనం ఉన్నా మనిషి కున్న ప్రేమ తగ్గునా
కష్టంలో ఒక అను భవం చూస్తారు జగాన
సుఖంలో భగవాన్ని మరుస్తారు యుగాన
నవ్వులతో భంధాలను మారుస్తారు నయాన
భాధలో మనుష్యులు మారుస్తారు భయాన
జరిగింది మన మంచికే అనుకుంటే ప్రసామ్తమున
జరిగింది చెడు అనుకుంటే మనస్సులో ప్రకంపన
మనము అద్రుష్టంపై ఆధారం మనసుకు ఆవేదన
అందరు మంచి పని చేస్తే మనస్సు సంతోషమునా
అంటూ కారులో పాత పెట్టుకుంటూ నడిపాడు బ్రహ్మానందం
--((***))--
jagadeeswari,jagadish lovers.saradaga cenema patalu padukontu,rechagottukuntu love chesukone lovers.madhya lo brahmanandamu charector.katha serious avutondi.inka purtyi kaledu.
రిప్లయితొలగించండి