28, జులై 2014, సోమవారం

165. Love Story 69 (పెళ్లి కాని ప్రసాద్)


                         ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                            
చక్రధర్ గారు ప్రభుత్వ ఉద్యోగములో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు, తనకు తెలిసిన వారితో తన కుమారుని వివాహము గురించి చెపుతున్నారు. మా అబ్బాయి ఇంజనీర్ంగ్ చదివి కష్టపడి ఉద్యోగము సంపాదించుకున్నాడు, మంచి జీతములో ఉన్నాడు. మంచి సంభందము ఉంటె మా అబ్బాయికి  చెప్పండి, ఇది మా అబ్బాయి ఫోటో అని అందరి చూపిమ్చాడు, మ్యారేజి బ్యూ రో వాళ్లకు కూడా పర్టిక్యు లర్స్ ఇచ్చాడు.

చక్రధర్ గారు మీ అబ్బాయి ఫోటో చూసాను, మా ఇంటి  వద్ద ఒక సంభంధం ఉన్నది, చెప్పమంటారా మీరు అని అడిగాడు అకౌంటెంట్ సుబ్బారావు. చెప్పు  సుబ్బారావు,  మా బాబాయ్ అదృష్టం ఎక్కడుందో,  నేను ఎట్లా చెప్పగలను, అమ్మాయి నచ్చితే మా అబ్బా యి ప్రసాద్ కి   పెళ్లి చేద్దామని  అనుకుంటున్నాను అన్నాడు. 

ఇదిగోనండి కాసిన మజ్జిగ త్రాగండి అని భార్య బారతి అందించింది గ్లాసును, అందుకొని గబ గబా త్రాగి శ్రావణ మాసంలో ఎండలు ఎమోటో వర్షాలు పడాల్సింది  "ఎండతో చమటలు పట్టి స్తుంది  సూర్య తేజస్సు " అన్నాడు. అవునండి ఇది కలియుగం కదండి.

అవును ఇన్తకీ మీరు పోయిన పని ఏమైనది.  కాయా,  పండా అని అడిగింది.

కాయ పండు సంగతి దేవుడెరుగు, అసలు పని మల్లీ మొదటి కొచ్చింది అన్నాడు.

అని తల మీద చేతులు పెట్టుకొని కూర్చున్నాడు, ఏమిటండి అలా  తలమీద చేతులు పెట్టుకొని కూర్చున్నారు, అలా పెట్టుకో కూడ  దని మాకు మీరె చెప్పేవారు కదండీ  అన్నది భార్య.  అవునే నేను చెప్పాను కాని మన అబ్బాయి పట్టు కొనేటట్లు చేస్తున్నాడు అన్నాడు భార్యతో .

ఇన్తకీ ఏమి చేసాడండి , ఇంకేం చేయాలి అతి కష్టం మీద మన  అబ్బాయికి మంచి  సంభందము అని తలచి వారి ఇంటికి పోయి మన అబ్బాయి ఫోటో ఇచ్చి చూపిమ్చి,  వాల్లమ్మాయిని కూడా  వప్పించి తామ్బూలాలు తీసుకుమ్దామని, ఒక తారీఖు నిర్ణయించి చెప్పారు (పేస్ బుక్ లో అమ్మాయి ఫోటోను చూసి ఒప్పుకున్నాడు  ప్రసాదు) ఆ తారీఖున మన అబ్బాయి కూడా  వస్తానన్నాడు.

మరి ఇంకేముంది  ఆ తారీఖు ఎప్పుడో చెప్పండి, మనమందరం వెళ్లి అమ్మాయిని చూసి ఖాయం చేద్దాం కదా అన్నది భార్య.

మనాబ్బాయికి ఒక పాడు అలవాటు ఉన్నదికదా, బైకులో తిరగటం, బైక్ పందాల్లో  పాల్గొనడం అలవాటు, అమ్మాయిని చూద్దామనుకున్న రోజు పందాలలో పాల్గోనుట వల్ల ఆరోజు పోలేక పోయాడు, మనము పోలేదు.

నాకు ముందు చెపితే నేను మన అబ్బాయిని పోకుండా అపె దానిని కదా అని అన్నది. మన ప్రసాదుకు మంచి రోజులు ఇంకా రాలేదు. కాని పెళ్లి కూతురు వారు అన్న మాటలకే నాకు తలపట్టేసినట్లు ఉన్నది అన్నడు.

ఏమన్నారండి.

అన్ని ఏర్పాట్లు చేసుకొని రడీగా ఉన్నప్పుడు మీరు రాలే దంటే,  మీరు మాట తప్పేవారని మేము అనుకోవలసి వచ్చింది, ఎందుకంటే కనీసము ఫోన్ చేసి కూడ చెప్పలేదు, మా అమ్మాయి అన్నది " నాన్న మాట తప్పేవారి సంభందం చేసుకున్న భాద పడవలసి వస్తుంది, ఇంకో సంభంధం చూడండి నాన్న అని అన్నాది. దయచేసి మీరు ఎప్పుడు ఆడపిల్లవారితొ ఆడు కోకండి అని అన్నారు అన్నాడు.

అంత మాటన్నారా వాళ్ళు, మరి అనక ఏమంటారు.

దీనికొసమ్ అంత  భాద పడనక్కరలేదు, మన అబ్బాయిని చేసుకొనే అదృష్టం ఆ అమ్మాయికి లేదనుకోండి అని అన్నది.సరే గుంటూరు  సంభందం చూసారు కదా  అది ఏమైనదో చెప్పలేదు,  అది కూడా  అటకెక్కిమ్ది, అది కుడా మన అబ్బాయి నిర్వాకం. అదేమి జరిగింది. అది కూడా చెపుతా విను,   నీకు ఇంట్లో పని ఏమి లేదా అని అన్నాడు, ఉన్నది లెండి, ఇదిగో ఈ మిక్ష్చర్ తింటూ చెప్పండి అన్నది భారతి కుర్చీలొ కూర్చుమ్టు.

మనందరం కలసి వెళ్లి అమ్మాయిని చూసాము, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు,  నిశ్చయ తామ్బూలాలు కూడా  తీసు కుందామని నిర్ణ యిమ్చుకున్నాము, పెళ్లి కూడా ఖాయం చేసాము.

మరి అమాట నాకు సంతోషముగా చెప్పొచ్చుకదా అంత నీరసముగా చేపుతారేటి అన్నాది.

అక్కడే ఉన్నది తిరకాసు అన్నాడు. ఏమిటి ఆ తిరకాసు అని అడిగింది.

కాబోయే పెల్లి కూతురుతో అదేపనిగా మనవాడు ఫోను మీద ఫోన్లు చేస్తున్నాడు, అన్నీ  విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు, మరింకేముంది మంచిదే  కదండీ. అందులో ఉన్నది అసలైన గమత్తు అన్నాడు, అసలు ఎం జరిగిందో చెప్పండి కబుర్లు చెప్పక అన్నాది . మన అబ్బాయి ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది " ఈ  పెల్లికూతురు కణ్య కాదుట, విచారించి పెళ్లి చేసుకోండి అని వ్రాసారు ఆకాశ రామన్న".

మనబ్బాయి  అనుమానం  తీర్చుకొవటానికి   అమ్మాయికె ఫోన్ చేసాడుట.

ఏ మని చేసాడండి అని అడిగింది.

ఆ మెసేజ్  ఆ అమ్మాయికి పంపించాడు, ఫోన్లో నేను ఆలోచించాల్సిన పరిస్తితి వచ్చింది ఆ మెసేజ్ కు నీ సమాదానము ఏమిటో తెలిసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు అంతే.

పెళ్లి కాకముందే   ఏదో మెసేజ్ పట్టుకొని నన్ను అనుమానిస్తున్నారు మీరు, మీ లాంటి అనుమానం ఉన్న వానితో నేను కాపురం చేయలేను, నన్ను మర్చి పొండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసు కొను  అనిమొహమ్మీద అనేసిందిట.

నాతొ ఆడ పిల్లవారు  ఫోన్ చేసి, మీరు ఇంత  అనుమానోస్తులని మేము తెలుసుకో లేక పోయాము, ఇప్పుడు తెలిసింది  మేము మీ సంభంధం  వదులు కుంటున్నాము, మా అమ్మాయిని కలిసిన మాట్లాడటానికి ప్రయత్నిమ్చిన, మిమ్మల్ని, మీ అబ్బాయిని పొలీస్ స్టేషన్లొ పెట్టిమ్చగలము ఆ మాటలకు నాకు భాద వేసింది మనాబ్బా యిని ఏమి అనక, నేను భాద పడటం తప్ప,  ఏమి చేయలేని పరిస్తితి  అని అన్నాడు భార్యతో చక్రధర్.

ఏమిటిరా బాబు అంత నీరసముగా ఉన్నావు, మెన్న పెళ్లి సంభందాలు పోయాయని దిగులుగా ఉన్నదా, అది కాదమ్మా నాకు పెళ్లి అసలు అవుతుందా, కాదా, తెలియుట లేదు  లేదా పెళ్లి కాని ప్రసాద్ మిగిలి పోతానని అనుమానంగా ఉన్నాది.

అట్లా అనకు నీకు ఎక్కడో ఉండి తీరుతుంది త్వరలో కలుస్తావు ఆమ్మాయిను అన్నది.

అవునమ్మ మా ఆఫీసులో నా ప్రక్క సీటులొ పనిచేసే "అక్షర" నన్ను అదేపనిగా చూస్తూ ఉంటుంది. చిన్న పనికి పెద్ద పనికి నన్ను సంప్రదించు తుమ్టుంది, మా ముందుకు వంగి నన్ను ఇబ్బంది పెట్టుతూ ఉంటుంది. ఆమె ఉద్దేశ్యము నాకు ఎమీ తెలియుటలేదు

పిల్లి మీద ఎలుక మీద పెట్టి  చచ్చు జోక్సు వేస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తున్నది, అమ్మా

నాకు ఎందుకో భయమేస్తుంది, ఆ అమ్మాయిని తప్పిమ్చూకొవటమ్ నావల్ల కావటములేదు, అందుకనే నేను ఉద్యోగము  మానేద్దామని అనుకుంటున్నాను అన్నాడు.

ఆమ్మాయి కోసమ్ నిక్షేపం లాంటి ఉద్యోగము వదులు కోవట మెందుకు, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొనిరా అన్నది తల్లి భారతి.    

మరలా ఆ అమ్మాయి నీదగ్గర ఎలా ప్రవ్వర్తిసుమ్ది అని అడిగింది, చాలా  మర్యాదగల పిల్ల లాగా ఉన్నది, మెన్న నా  లంచికి తీసుకెల్లినది  తను తిని ఆమె లాంచీ బాక్స్ నాకిచ్చింది ఆమె చేసుకొచ్చిన వంటకాలు కూడా  బాగున్నాయి, రోజు ఇద్దరం కలసి కాఫీ త్రాగి వస్తాము,  మా ఆఫీసులొ వారందరు మమ్మల్ని చిలకా గోరింక, లవ్ బర్డ్స్ అనటం మొదలు పెట్టారు.  అని చెప్పాడు తల్లితో.

అంతలో తండ్రి  కుడా అక్కడకు వచ్చి కొడుకు చెప్పిన కధ విని కొంత సంతోషము వచ్చింది. దానినే ప్రేమ అంటారు. ఆ ప్రేమనన్న చివరిదాకా ఉంచురా. ఈ పెల్లిచూపులు  లాగా  వదిలేయకు, ఆ అమ్మాయిని,  నీవు ఇష్టపడితే ఇక్కడకు ఒకసారి తీసుకురా అమ్మనేను కూడా  చూస్తాము అని అన్నాడు కన్న తండ్రి.

ఇంటికి ఒకసారి తెచ్చాడు ప్రసాద్ అక్షరను.

అక్షరాను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, తండ్రి పెద్ద పోలిస్ ఆఫీసర్ అని , ఒక్కటే కూతురని, గారాబంగా పెరిగిందని, ఆమె మాటకు  ఎదురుండదని తెలుసుకున్నది తల్లి.

తల్లి పెట్టిన  స్విట్ హాట్ తినకుండా ప్రక్కన పెట్టినది. వేల్లోస్తానండి అని చెప్పి వెళ్ళింది.

అమ్మ అక్షర పుట్టిన రోజు,   ఈరోజు ఏదైనా గిఫిటు తీసుకెల్దామని అనుకున్నాను, అమ్మ నీవు మంచి గిఫిట్ చెప్పమ్మా అని అడిగాడు ప్రసాద్.

అరటిదోప్పలో సంపెంగ పూలు కోసుకెల్లు, ఆపూలు ఆడపిల్లలకు చాల ఇష్టం అని అన్నది.

అక్షర ఇంటికి చేరాడు, ఆ ఇల్లు చాల  పెద్దది, లోపలకు అడుగు పెట్టగానే నాన్న అని ప్రసాదుని  పరిచయము చేసింది.

బాబు మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నది,  మీ ఇంట్లోవారు కూడా  మా అమ్మాయిని  ఇష్ట పడినట్లు చెప్పింది.                   

అందుకనే ఎవ్వరిని పిలవకుండా నిన్ను మాత్రమె పిలిచింది అమ్మాయి సంతోషమేనా నీకు,   సంతోషము అని అన్నాడు, నాన్న మేము అలా  తిరిగి వస్తాము అని అన్నది o.k carry on అన్నాడు.

చేతిలో పెట్టిన  పూలను బయటకు విసిరేసి, నాకు ఈపూలు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అన్నది.

బైకు తీయి అలా  తిరిగొద్దాము అని అన్నది.

నెమ్మదిగా పోనిస్తున్నాడు బైకును ప్రసాద్, ఏమి నీకు బైక్ నడపటం రాదా,  ఇమిటి  అంత నెమ్మదిగా నడుపుతున్నావు,  పోటిలొ కూడా  పాల్గోన్నావు అన్నారు మన ఆఫీసులో వారు, అని రెచ్చ కొట్టింది  బైకు మీద కూర్చొని నడుము గట్టిగ పట్టుకొని
 అన్నాది.

అంతే  వేగం పెంచాడు, సెల్ మొగుతున్నది. నెమ్మదిగా  చేబులోనుమ్చి తీసి మాట్లాడుతూ వేగముగా నడుపుతున్నాడు.

అంతలో ఒక కారు అడ్డు రావటం దాని తప్పిమ్చ పోయి ప్రక్కన ఉన్న స్తంబానికి కొట్టి అవతల పడ్డారు ఇద్దరు. అక్షరకు మాత్రము ఏమి దెబ్బలు తగల లేదు, కాని ప్రసాద్ కు మాత్రము వెనుక భాగం ఎముకలు విరిగాయి, కుడికాలుకు బాగా దెబ్బ తగిలింది, మొహమంత రక్తంతో నిండి పోయింది. కారులో వారు దిగి గబ గబా ఇద్దరిని కారులో ఎక్కించుకొని హాస్పటల్ ల్లో  చేర్చారు.

చిన్న దెబ్బలు తగిలి హాస్పటల్ నుండి అక్షర, ఒక్కసారి ప్రసాద్ ఉన్న పరిస్తితిని చూసి ఇంటికి వెళ్ళింది.

ప్రసాద్ తల్లి తండ్రులు వచ్చి డాక్టర్ ను కలసి ప్రసాద్ ఆరోగ్య పరిస్తితి  తెలుసుకున్నారు.

అప్పుడే  డాక్టర్ చెప్పారు కన్నిసము 3 నెలలు బెడ్ రెష్టు లో ఉండాలి, ఒక కాలుకు బాగా దెబ్బ తగిలింది, నరము చిట్లింది, దానికి రా   డ్ వేసి కట్టు కట్టాలి అని చెప్పారు.

తల్లే దగ్గర ఉండి    అన్ని సేవలు చేసింది ప్రసాదుకు     .

ప్రసాదుకు దిగులు మాత్రం తగ్గలేదు, ఎందు కంటే తనను ప్రేమిమ్చానన్న "అక్షర" రాకపోవటం  భాద పెరిగింది.

అనారోగ్యం వల్ల ఉద్యోగమునకు పోకపోవటం వళ్ళ వారు ఉద్యోగము నుండి  తీసి వేసారు. వేరే ఉద్యోగము రాలేదు ప్రసాదుకు.

అక్షర ఒకసారి ప్రసాద్ ఇంటికి వచ్చి మిమ్మల్ని భాద పెట్టి నందుకు నన్ను క్షమించండి, మానాన్న గారిమాటకు బద్దురాలినై మీ అబ్బాయిని వివాహము చేసుకోలేక పోతున్నాను, ముఖ్యముగా మానాన్నగారికి   ట్రాన్స్ఫర్   ఇక్కడనుంచి డిల్లికి మారింది. వేము వెంటనే వెళ్లి పోతున్నాము అని చెప్పింది.

అంతలో లోపల నుండి కుంటుతూ  బయటకు వచ్చి మన ప్రేమ ఏమైనట్లు అన్నాడు ప్రసాద్, నేను నీ ప్రశ్నకు సమాధానము నాదగ్గర లేదు నిన్ను విడువ లేక విడిచి పోతున్నాను అని చెప్పి  ప్రసాద్ తల్లి తండ్రులకు దండము పెట్టి మరీ వెళ్ళింది.

ఏవండి నేను ఈ మూడు నెలలు ఎప్పుడు కష్టపడనట్లు ఇప్పుడు కష్ట పడాల్సి సమయం వచ్చింది, డాక్టర్ ర సలహా ప్రకారం, నర్సులు మనబ్బాయికి సేవ చేసి, నేనే దగ్గరుండి అన్ని మందులు, బలానికి పండ్లు, వేల తప్పకుండా ఆహారము అందిస్తూ కంటికి రెప్పలాగా కాపాడి నాను, నాతోపాటు మీరు కూడా  చాల  కష్టపడ్డారు, ముఖ్యంగా నాకోసం, మనబిడ్డకోసం చాల  కష్టపడ్డారు, ఉద్యోగమునకు    సెలవు పెట్టి మరీ తిరిగారు, దేవుని దయవల్ల కొంత కోలుకున్నాడు ఇంట్లో తిరుగు తున్నాడు.
మనబ్బాయి ప్రేమించిన అమ్మాయి,  తనదారి తానూ చూసుకున్నది అదే నండి  నాకు కొంత భాద కలిగింది.
అవునే మనబ్బాయిని ఏమి చూసి పెళ్లి చేసు కుంటుంది, మన  ఆస్తి హరితి కర్పూరంలా,  డాక్టర్ ఫీజులకు మందులకు కర్చు  అయి నది, ఉన్న ఉద్యోగము కూడా పోయినది, మరియు  ఆరోగ్య పరిస్తితి ఇంకా అర్ధం కాని పరిస్తితిలో ఉన్నది.

నీవు భయ పడకు మనం పిల్లలు కనటానికి మాత్రమే సహకరిమ్చగలము, వారి కర్మలకు మనం భాద్యులు కాలేము, డాక్టర్ గారుచేప్పారు కదా రోజు మందులు వాడుతూ ఉంటె ఒక సంవచ్చరానికి సంసారానికి పనికోస్తాడని చెప్పారుకదా, ముందు వెన్ను పూస గట్టి పడాలి కదా అన్నాడు.
నీకొ కధ చెపుతాను విను. ఒక భక్తురాలు తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షము చేసుకున్నది. నీకు  ఏమి వరము కావాలో కోరుకో అని అన్నాడు.  నాకు సంతానము కలిగే విధముగా వరము ఇవ్వమన్నది. నీకు సంతాన యోగము లేదు కనుక నీకు స్వర్గ సుఖాలు ఇస్తున్నాను అన్నాడు దేవుడు.  అయితే నాకు ఒక మెగ బిడ్డనైనా ప్రసాదించండి అని దేవుడ్ని వేడుకున్నది. అప్పుడు దేవుడు నీకు మొగ బిడ్డ బదులు అమృతం ఇస్తాను అన్నాడు. అప్పుడు కూడా  దేవుడు మాటలు వప్పుకోలేదు ఆ భక్తురాలు.
దేవుడు మరలా భక్తురాలితో బిడ్డ మీద మమకారము ఎందుకు అని అడిగాడు దేవుడు.  అప్పుడు ఆ భక్తురాలు ఆ పసి గుడ్డులో స్వర్గాన్ని, చిరునవ్వులో అమృతాన్ని పొంద కలుగుతాను అన్నది. పుత్రుడు ఉంటె తలకు కొరివి పెట్టడానికి పనికోస్తాడుకదా స్వామీ అని అన్నది. తదాస్తు నీకు బిడ్డ పుడతాడు తరువాత జన్మలో అని చెప్పి అంతర్ధాన    మయ్యాడుట   అనిచెప్పాడు భర్త చక్రధర్ భార్యభారతితో.
అవునండి  ఆభాక్తురాలు గతజన్మలో నేనే నండి, ఈ జన్మలో కుడా నాకు ఒక బిడ్డ కదా  పుట్టింది దేవుడి మా టలువ్యర్ధము కాలేదు అన్నది భారతి.
అవునండి ఆదేవుడు మన అబ్బాయికి  భార్యగా, మనకు కోడలుగా ఎక్కడో పుట్టి  ఉంటుంది  ఆ అదృష్ట ఘడియలు ఎప్పు డొస్తాయో అప్పటిదాకా మన అబ్బాయి పెళ్ళికాని ప్రసాద్ ఉండాలి కదండీ అన్నది. అవునే మనము ఆ శ్రీ లక్షిమి శ్రీనివాసుని ప్రార్ధించటం తప్ప మనమేమి చేయలేము, ఎవరి కర్మ వారు అనుభవించ గలరు. నాకు నీవు నీకునేను జీవిత రధాన్ని నడుపుకోవటమే మన ముందున్న లక్ష్యం.               
               

                                      

1 కామెంట్‌: