25, జులై 2014, శుక్రవారం

164. Love Story 68 (Aarthanaadam)


ఆర్తనాదం

సూర్యుడు అస్తమించ బోతున్నాడు,  చంద్రుడు  అవకాసము కోసం  ఎదురు చూస్తున్నాడు,  ఆకాశ మంత మబ్బులుతో నిండి పోయింది, ఎ మేఘం కురుస్తుందో అర్ధం కాకుండా గాలికి పరిగేడుతున్నాయి మేఘాలు,  బస్సు వేగంగా కదులుతుంది, బస్సులో ఉన్న ప్రయాణీకులకు నిద్ర పట్టుట లేదు, ప్రతి ఒక్కరి మనసు ఏదో కీడు జరుగు తుమ్దేమోనని భయం,  భయముగా కూర్చొని ఉన్నారు,     వీధులన్ని నిర్మానుషంగా, ప్రతి గుమ్మం ముందు చెత్త కాగితాలతో నిండి ఉన్నాయి,  అప్పుడే తెలిసింది నగరంలో కర్ఫీ  విధించారని  ఎవరూ తిరుగ కూడదని ప్రకటనలు వినబడు తున్నాయి. అదే ఒక నాటి భాగ్య నగరం, నేడు హైదరాబాద్

డ్రైవర్ నెమ్మదిగా బస్సు  హైదరాబాద్ నగరము చేరింది,  ఒక వీది చివర కర్రలు, రాళ్ళు, చెట్టు కొమ్మలు ఉంచారు, వెంటనే బస్సు ఆపాడు డ్రైవర్.

వెనుకనుండి కొందరు కార్య కర్తలు కర్రలు పట్టుకొని వచ్చారు, కర్ఫిలో  బస్సు నడప కూడదాని  మీకు తెలియదా అని అడిగారు.

డ్రైవర్ నెమ్మదిగా ఈ బస్సు ఆలస్యముగా బయలుదేరి ఆలస్యముగా నగరము చేరింది అందువల్ల లోపల ఉన్న వారందర్నీ నేను బస్ స్టేషన్ వరకు చేర్చాలి మీరు సహకరించండి అని వేడుకున్నాడు,  కొందరు బస్సు పోవుటకు అడ్డు తొలగించి పొమ్మన్నారు, కొందరు పోకిరి వాళ్ళ అప్పటికే బస్సు పై కొన్ని రాళ్ళు విసరటం జరిగింది.  కొందరు పెట్రోలు పోయటం  జరిగింది, అగ్గి పుల్ల వెలిగించే లోపు బస్సు నడపటం ప్రారంభించి, వేగం పెంచాడు డ్రైవర్. 

బస్సులో ఉన్నావారు అందరు భయముగా కూర్చొనిఉన్నారు, కొందరు దేవుడ్ని ప్రార్ధించు చున్నారు,  లోపల ఉన్నవారికి ఒకరికి రాయి తగిలి రక్తము కారుతుంది.  ఫేస్స్తిడ్ బాక్స్  తీసి వెంటనే కట్టు కట్టాడు అందులో ఉన్న ఒక ప్రయాణీకుడు, బస్సు నెమ్మదిగా పోనిచ్చి దగ్గరలో ఉన్న ఆసుపత్రి దగ్గర ఆపి, దెబ్బ తగిలిన వ్యక్తిని  లోపలకు పొమ్మని సహాయము చేసాడు.

అంతలో కొందరు పరిగెడుతూ  వచ్చి అక్కడ నడిబజారులో ఒక మనిషిని  నరికేయటం జరిగింది,  అటు పోకండి అని చెప్పారు, బస్సు డ్రైవర్ నెమ్మదిగా పోనిస్తున్నాడు.

బస్సులో ఉన్నవారి కందరికి ఏమి పాలు పోనీ పరిస్తితి ....అందరి ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  కొందరి ఫోన్లు పనిచేయుట లేదు. పనిచేస్తున్న ఫోన్ లో ఏకధాటిగా మాట్లాడుతున్నారు కొందరు. 

ఈ బస్సులోనే పుట్టి నింటి నుండి మెట్టి నింటికి బయలుదేరిన జానకి తన   మూడు  నెలల పసి బాబు తో, తల్లి తో,  ప్రయాణముచేస్తున్నాది. భర్త ఫోన్ అందటం లేదు, ఎక్కడున్నాడో తెలియుటలేదు, మరో వైపు పిల్లవాడు ఏడుపు, వాడిని ఒదా ర్చుటకు చాలా కష్టము ఐనది,  తల్లి పార్వతమ్మ  ఎవరి మొఖము  చూసి బయలు దేరామో ఈ కష్టాలు వస్తున్నాయి అని అంటున్నది. అమ్మ కాసేపు నీవు నోరు మూసుకొని కూర్చొ, ఆ దేవుని ప్రార్ధించు, మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుతా ము  అన్నది.     

అందలో ఒక ముసలావిడ  బన్దులేమిటో, ఈ సమ్మెలేమిటో,  డబ్బున్నవారికి అన్ని సదుపాయాలూ ఉంటాయి, ఏమి లేనివారికి వీదు  లే  శరన్యమని తిరుగు తుంటారు, మద్య తరగతి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచర మవుతుంది. వీరికి రెక్కాడితేగాని డొక్కా నిండదు, ఈ బందులవల్ల ఎన్నిరోజులు పస్తు లున్డాలో అని భాదతో,  ప్రజల బాదలు  పట్టిమ్చు కోలేని ప్రభుత్వములు ఉన్నా లేనట్లే, బస్సులో ఉన్నవారెవరో అధికార పార్టి వారే బందు ప్రకటించారు అని అన్నారు,

ఆ ముసలావిడ ఏంచేయాలి  నాయనా బ్రతుకంతా బాధలతో నిండి పోయింది, ఇపుడు కొడుకు రమ్మనమంటే వెళుతున్నాము ఇప్పు డు ఈ కష్టము వచ్చింది అని మరోకరన్నారు.

అతి  కష్టము మీద బస్సును బస్సు ప్రాంగణనమునకు తీసుకెల్లటం  జరిగింది.

బస్సు నుండి  ఒకరి తర్వాత ఒకరు దిగి,  వారి సామాను తీసుకొని,  నెమ్మదిగా ఎటు పోవాలని ఆలోచిస్తున్నారు కొందరు,  కొందరు బస్సు స్టేషన్ లో ఉండి ఇళ్ళకు ఫోన్ చేస్తున్నారు, బయటకు పోవుటకు ఒక్క వాహనము  కనుచూపులొ కనబడుట లేదు, దిగినవారు నగరములో వెళ్ళుటకు అన్ని అవకాశాలు మూసి వేసారు, వెంటనే స్టేషన్ లో ఉన్న   లాడ్జిలోకి వెళ్లి "జానకి " నాకు స్పెషల్ రూం ఇవ్వమని అడిగింది,  ఇక్కడ రూం లు ఖాలీలు  లేవు అని చెప్పారు, చేసేది లేక బస్సు స్టేషన్  లోనే సామాను పెట్టుకొని కూర్చున్నది  తల్లితో జానకి ,  ఒక వైపు చీకటి  పడుతున్నది, ఇక్కడ ఉండుటకు కష్టం, అక్కడ ఒక్క షాపు కూడా   లేదు అన్ని మూసి ఉన్నాయి,  రాష్ట్ర రోడ్డు రవాణా యూనియన్  కూడా బందు  చేయుటము వల్ల, బస్ స్టేషన్ అంతా   నిర్మానుషంగా ఉన్నాది.

కొందరు ఆకలితో అలమటిస్తున్నారు, కొందరు ఎటు పోలేక మూలుగుతూ కూర్చున్నారు, కొందరు కోపముతో   బస్సుల  యాజమాన్యాన్ని  గట్టిగా అడుగుతున్నారు, మీకు ఆని ఏర్పాలు చేస్తాము, స్పెషల్ బస్సు ఏర్పాటు చేసి మీ గమ్యాన్ని చేరుస్తాము అని చెపుతున్నారు,

అప్పుడే ఆకలికి ఏడుస్తున్నాడు పసిపిల్లవాడు,  పిల్లవాడి  మెడ క్రింద చేతులు పెట్టి, మురిపంగా గుండెలకు హత్తుకొని, తన పైట చెంగును ప్రక్కకు తొలగించుకొని తన రేవికకు ఉన్న గుండీలు తీసి తన రొమ్మును వాడి నోటికి అందించింది. తెలియని ఆనందం  పొందింది, ఒక్క ప్రాణి కడుపు నిండటానికి తనవంతు  ప్రయత్నం  చేసింది జానకి.

అమ్మాయి ఆకలి చంపేస్తుంది నన్ను, నాకేదైనా పెట్టు అన్నది తల్లి పార్వతమ్మ జానకితో, తన బ్యాగును తీసి చూడగా తినే వస్తువులు ఎమీలేవు, త్రాగటానికి  నీరు కూడా  లేవు.

అమ్మ కాస్త ఓపిక పట్టమ్మా, కనీసమ్ నీరు అయినా తెస్తాను,  కాసేపు  ఇక్కడే ఉండి సామాను చూస్తు ఉండు అని అన్నది జానకి.

అమ్మాయి నాకు అసలే భయము, త్వరగా రా, ఇక్కడే ఉంటాను అన్నది,  అప్పడే తెరిచినా బస్ స్టేషన్ లో ఒక షాపు పై జనం ఎగపడినారు, ఎంగిలి ఇస్తర్లపై కుక్కలు పోట్లాడు కున్నట్లు,  బలమైనవారు పోట్లాడి  కావలసినవి తెచ్చుకో కలిగినారు, బలహీనులు ఎమీ  తీసుకో లేకపోయారు, కాని జానకి మాత్రము పోరాడి మంచి నీరు ప్లాస్టిక్ బాటిల్ తే కలిగింది.

వచ్చిన జన్నాన్ని తట్టు కోలేక చివరికి షాపు వారు  షాపు మూసేసారు. అప్పుడే అనుకున్నది జానకి మానుష జన్మ ఎత్తి ఓపిక లేక నక్కలు కుక్కలు లాగా పోట్లాడుకొని నోటికి అందిన కూడు  పాడుచేసు కున్నారు. ఎవ్వరికి అందకుండా అక్కడ ఉన్న తినే పదార్ధాలను  కొనుక్కొనే దారి లేకుండా ఆవేసపరులు పోట్లాడారు, పరిస్తితులు అనుకూలముగా లేవని షాపు మూసి వేసారు.           

ఇదా  మన ప్రజలు చేస్తున్న పని దానిని  ఎవరూ ఆపలేరు, క్రమ శిక్షణ అనేదే లేదు,   స్వా ర్ధం కోసం రాజకీయ నాయకులు బందు చేస్తారు, ప్రజల భాదలు పట్టించుకోకుండా ఎ.సి రూముల్లో  ఉండి  ప్రజల గురించి అన్ని  ఏర్పాట్లు చస్తున్నాము, ఎవ్వరూ కష్ట పడుటలేదు అని ఊక దంపుడు ఉపన్యాసాలు  ఇస్తున్నారు, ఇదేమి ప్రభుత్వమూ అని అనుకున్నది
    
నీరు  తెచ్చి తల్లి త్రాగిమ్చిమ్ది, వోపిక తెచ్చు కొని బస్ స్టేషన్ బయటకు నెమ్మదిగా నడ చింది, అక్కడ ఒక రిక్షా ఉన్నది, అది సమానులు తీసుకు వెళ్ళే రిక్షా, చివరికి జానకి గత్యమ్తరము లేక,  వేరే దారి లేక ఆ రిక్షా ఎక్కాలని నిర్ణయించుకున్నది, అమ్మ ఆ రిక్షా ఎక్కుదాము ఆ రిక్షా వాడు ఎక్కడున్నాడో చూడాలి అన్నది.  ఏమిటే ఈ రిక్షా లో మనము వెళ్ళేది ఇంటికి, మరేదారి లేదు,  కాస్త  ఓపిక చేసుకొని కూర్చొ ఈ రిక్షాలో అన్నది, ఎం చేద్దాం ఈ రిక్షానే హంస వాహనం అనుకుంటా అన్నది, నీ ఇష్టం ఏదైనా అనుకో అన్నది జానకి .

రిక్షా నడిపే  వానిని పిలిచింది. ఇప్పు డు ఈ రిక్షా రాదు అని చెప్పాడు, మీరు వేరే రిక్షా చూసు కొండి , నగరమంతా  బందు ఉన్నది, ఒక వైపు పొలీసులు తిరుగుతున్నారు, వారు పట్టుకుంటే చాలా ప్రమాదం అన్నాడు, అదే నీ ఇంట్లో వారు ఎవరన్న వస్తే ఇట్లాగే  అంటావా అని అడిగింది, అదేవేరు ఇది వేరు, నన్ను నీ చెల్లి ననుకో, నీ చెల్లి అడిగితె పని చేసి పెట్టావా అన్నది, ఆమాటలకు మనసు కరిగి రిక్షా డ్రైవర్ నా ప్రాణాలు పోయినా సరే, మీరు చేరాల్సిన స్తలం చెప్పండి చెరుస్తా నన్నాడు. రిక్షాలో బ్యాగులు సద్ది,  ఎక్కి కూర్చొని రిక్షావాడికి తన చిరునామా చెప్పి  తీసుకెల్లమని అడిగింది జానకి, జానకి భాద చూసి, ముసలి తల్లిని చూసి, ధైర్యముతో చేరుస్తానని బయలు దేరాడు రిక్షా వాడు.            

ఆకాశంలో దీపాలు వెలుగు తున్నాయి, కుక్కలు అరుపులు వినబడు తున్నాయి, ఇళ్ళల్లో ఉండే ఫాన్ శబ్దాలు విన బడుతున్నాయి, దీనికి తోడూ రిక్షా కిర్రు కిర్రు అని శబ్ద చేస్తూ కదిలింది, అమ్మ సరిగ్గా కూర్చున్నావా, నేను సరిగ్గా కూర్చున్నా, ఆపిల్లవాడ్ని జాగర్తగా పట్టుకో, కనీసమ్ ఆరు నెలలు  ఉండమంటే, మూడో  నెల బయలు దెరవు, మాఅయనకు ఇబ్బందని   అమ్మ ఏమిటే గొను కుంటు న్నావు, నాకు గొనుక్కోటాని కన్నా హక్కు ఉన్నదా,  పిల్లలు ఏట్లా చెపితే ఆట్లా  నడుచుకోవటం తప్ప  అన్నాది.

సరే జాగర్తగా కూర్చో అన్నాది, అంతలోనే ఒక గుంటలో ఒక చక్రం పడి రిక్షా అంతా ఒక్కసారి  పైకి  ఎగిరింది, బాబు నెమ్మదిగా పోనీ రిక్షాను, అసలే ముసలి దాన్ని, నాప్రాణాలు ఇప్పుడే పోయినా పోవచ్చు అన్నాది, అమ్మ ఏమిటే ఆమాటలు, అమ్మగారు నెమ్మదిగానే పోనిస్తున్నాను, ఏదో గుంట వచ్చి కొద్దిగా రిక్షా కదిలింది అంతే.

జగర్తాగా పొనీ అన్నది, అంతలోనే కరంటు పోయింది, రోడ్డు అంతా చిమ్మ చీకటిగా మారింది, ఒక్క సారి రిక్షా ఆపాడు రిక్షా,  చీకట్లో  తొక్కడం కష్టం అన్నాడు, నాదగ్గర సెల్ లైట్  వేస్తాను నెమ్మదిగా తీసుకెల్లు అన్నాది, సెల్ లైట్ వెలుతురులో  మీద నెమ్మదిగా నడుపుతున్నాడు, వెనుక వేగంగా ఒక జీపు వచ్చి,  రిక్షాను దాటి, ఒక్కసారి జీపు ఆపి దానిలో నుండి పొలీసులు దిగి ఎక్కడి నుండి వస్తున్నారు, చీకటిలొ ఎక్కడకు పోతున్నారు అని అడిగాడు.   ఈ ప్రక్కనే మా యిల్లు బస్సు స్టేషన్ నుండు వస్తున్నాము అన్నది జానకి, ఐతే టిక్కెటు చూపండి అన్నారు  పొలీసులు , తన వద్ద ఉన్న టికెటు చూపించింది, సరే జాగర్తగా పోండి, అసలే చీకటిలొ దొంగలు పడుతున్నారు, కొందరు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు, కొందరు బాంబులు  విసురు తున్నారు, అంటూ  జీపు ఎక్కి పొలీసులు బయలుదేరారు.

రిక్షా వాడు మీరు చాలా అదృష్ట  వంతులమ్మా, కొందరు పొలీసులు  స్టేషన్ లోకి తీసుకెల్లేవారు, కేసులు పెట్టెవారు, కామాన్ధులకు     కొందరు బలి అయిన రోజులు కూడా ఉన్నాయమ్మా అన్నడు,   బాబు ఆమాటలు ఇప్పుడు చెప్పకు, అసలే నాలో వణుకు పుడుతున్నది, భయము వేస్తున్నది, గుండె దడ పెరుగుతున్నది, అన్నదో లేదో, దనా అని పెద్ద శబ్దం వినబడింది.

ఒక్కసారి బ్రేక్ వేసినట్లు రిక్షా ఆగింది, ఏమైంది బాబు రిక్షాకు, ఏమైంది అని అడుగుతారు ఏమిటి  ఎప్పుడేగా పెద్ద శబ్దము వినబడింది, అదే మన రిక్షా టైర్ బరేస్టు అయింది,  ఒక్కసారి  పార్వతమ్మ ఉలిక్కి పడి అమ్మో  నా ప్రాణాలు పొతున్నాయి  అని పెద్దగా ఆర్తనాదం చేసింది.  యమ ధర్మరాజు అడుగో వస్తున్నాడు అని అరిచింది.  యమ ధర్మరాజు  కాదు వాళ్ళు పొలీసులు వచ్చారు అన్నది జానకి , ఏమైన్దిక్కడ పెద్ద శబ్దం వచ్చింది అని అడిగారు పొలీసులు, రక్ష టైర్ బరేస్ట్ అయింది అని చెప్పాడు రిక్షా డ్రైవర్, ఎవమ్మ మీరు ఎక్కడకు పోవాలి అని అడిగారు వారు, మేము ఈ ప్రక్కనే ఉన్న బజార్లో మా యిల్లు అని చెప్పింది జానకి. అసలే పెద్దవిడను పెట్టుకొని, ఆ పిల్లవాడ్ని పెట్టుకొని ఈ నగరమునకు రాక పొతే ఏమిటమ్మ, సరే వచ్చారుగా  జాగర్తగా వెళ్ళండి. అనే చెప్పి పొలీసులు వెళ్లి పోయారు.

బాబు ఈ డబ్బులు తీసుకొని జాగర్తగా రిక్షా ను బాగు చేసుకో అని చెపుతూ ఇచ్చింది. సరే నమ్మ మీరు జాగర్తగా వెల్లండి.

మీ అమ్మగారు మిమ్మల్ని గాబరా పెట్టేస్తున్నారు అని చెప్పి వెల్లి పోయాడు రిక్షా వాడు.

అమ్మ నెమ్మదిగా నడవమ్మ,  నేను బ్యాగ్సును, బాబుని పట్టుకొని నడుస్తాను అన్నది.

అమ్మాయి నా గుండె దడ బాగా పెరుగు తున్నది, ఒక వైపు ఆకలేస్తున్నది,  కాళ్ళు  నడవనంటున్నాయి యెట్లాగే నడిచేది, నేను వద్దంటే నీవు బయలు దేరావు, పొనీ అల్లుడు వచ్చాడా రాలేదు, ఎక్కడున్నాడో కూడా  నీకు తెలియదు, నావల్ల కావటములేదు నేను నడవలేను  అని ఒక బండ మీద కూర్చున్నది,  అంతలో పొలీసు వ్యాన్ సౌండ్ వినబడింది.

అమ్మ నీవు నడవక పోయావంటే ఆ పొలీసులు పట్టికెళ్ళి జైల్లో పెడతారు అన్నది,  అక్కడ చిప్పకూడు పెడతారు అప్పుడు నీ ఆకలి తీరు తుంది అన్నాది కోపంగా, ముందు నడువు అని గట్టిగా అరిచింది.

అవునే మంత్ర సాని చేసేవారు ఏదైనా పట్టాలంటారు, నేను నీతొపాటు వచ్చానుగా నీవు ఎన్ని అన్న పడాలి పడతాను, ఎన్నో కలలు కన్నాను , అల్లుడు కారు తెస్తాడని ఆ కారులో వేల్లోచ్చని అనుకున్నాను.  అసలే చీకటి  పడింది నడువు అన్నది. అప్పుడే కరంటు వచ్చింది, అమ్మయ్య కరంటు వచ్చింది నేను నడుస్తాలే  అన్నది పార్వతాం కూతురితొ.

మొత్తానికి ఇంటికి చేరారు ఇద్దరు, ఇంటిముందు పెద్ద తాళం కనిపించింది.

పార్వతమ్మ మీ అయన ఈ బందులో ఎక్కడ ఇర్రుక్కు పోయాడో  ఏమో, ఎపుడో స్తాడో ఏమో, తాళం ఎక్కడ పెట్టాడో వెతకవే అన్నది కూతురుతొ.

అమ్మ కాసేపు నోరు మూసు కుంటావా  నీవు, తాళం  ఇక్కడ లేదు, ప్రక్క్ ఇంటిలో ఉన్నవారికి ఏమైనా ఇచ్చారో కనుక్కొని వస్తాను,   సామాను ఇక్కడపెట్టాను , చూస్తూ ఉండు అని చెప్పి ప్రక్క ఇంటికి బయలు దేరింది జానకి తాళం కోసం.

జానకి   నెమ్మదిగా  బాబును  ఎత్తుకొని, ప్రక్కనే ఉన్న ఇంటి వద్దకు వేల్లుతున్నది, అప్పడే పోలీసు వారు గమనిక అంటూ మైకులో ప్రకటన వినిపిస్తున్నారు, ప్రజలన్దరికి మనవి చేయునది ఏమనగా రేపు ఉదయం 8 గంటలకు నుండి 10 గంటలవరకు కర్ఫీ సడలింపు ఉన్నది ఆ సమయాన అందరు నిత్యావసర సరుకులు తీసుకొవాలి,  పాల ప్యా కెట్లు అందు బాటులో ఉంచుతారు తీసుకోవాలి , మంచినీరు పట్టుకోవాలి, అందరు క్రమ శిక్షనగా నడుచు కోవాలి, మరియు ఈ రోజు రాత్రి ఎవరు బయటకు రాకండి, తలుపులు వేసుకొని జాగర్తగా ఉండండి, ఏదైనా అనుమానముగా ఉంటె మీరు ఫోన్ 100 నెంబరుకు చేయండి, మేము మీకు రక్షణగా ఉంటాము అని చెప్పుతూ వ్యాన్ వెళ్ళింది.

ప్రక్క ఇంటి తలుపు కొట్టింది, బెల్ నొక్కింది, కాని ఎవ్వరు రాలేదుమరి ఏంచేయాల అని ఆలోచిస్తున్నది, వెంటనే ఒక అలోచన వచ్చింది కొన్ని గులక రాళ్ళును తీసి తలుపుపై విసిరింది, వెంటనే తలుపు తీసి ఒక లావుగా ఉన్న  స్త్రీ బయటకు వచ్చి ఎవ్వరు ఇంటిపై  రాళ్ళు విసిరేది అని గట్టిగా అరిచింది, బాబు ఎత్తుకొని నేనే తలుపు కొట్టాను అన్నది.

అసలు నీవెవరు అని అడిగింది. మీ ప్రక్క  ఉన్న ఇంటిలో అద్దెకు ఉన్న రఘు రామ్ గారి భార్యని అని చెప్పింది, ఐతే ఇప్పు డు ఎందుకు వచ్చావు అని అడిగింది.

మావారు ఏమైనా తాళం ఇచ్చారోమో నని అడుగుదామని వచ్చాను నేను,

మీ అయన ఎవరో అమ్మాయితో వెళ్ళటం నేను చూసాను, నాకు మాత్రం తాళం ఇవ్వలేదు అని చెప్పి లోపలికి వెళ్లి తలుపు దభీమని వేసింది.

మల్లి తలుపు కొట్టింది జానకి.

తలుపు తెరుస్తూ తలుపు ఎందుకు కొట్టావు అని గట్టిగా అడిగింది.

మంచినీరు బాటిల్ ఇస్తారని తలుపు కొట్టాను.

దయచేసి మరల తలుపు కొట్టకు, నేను ఇప్పుడే ఫ్రిజ్లో ఉన్న బాటిల్ తెచ్చి ఇస్తాను ఉండండి అని లోపలకు వెళ్ళింది.

ఒక్క నిముషములో తెచ్చి బాటిల్ ఇచ్చి మరలా రాకమ్మ నేను చేప్పా నని అనుకోకు అసలే కర్ఫు, నగరమంతా గందర గోళంగా ఉన్నది అని చెప్పుతూ  తలుపు వేసింది దభీమని.

మారు మాట్లాడకుండా వెనుకకు వచ్చింది. దగ్గర ఉన్న రాయిని తీసి ఇంటికున్న  తాళం పగల కొట్టింది.

అమ్మా రామ్మా లోపలకు, ఏమిటే ఇది బూత్ బంగళాగా ఉన్నది, ఎటు చూసినా సాలి గూడులు, బూజు వేలాడుతుంది అంటూ ఒకటే దగ్గు  దగ్గు తుంది పార్వతమ్మ గారు.

అమ్మ ఏమిటే దగ్గు తున్నావు, దగ్గక ఏమ్చేయ మంటావు అటువంటి ఇంట్లో కి తెచ్చావు,  అసలు మీ ఆయన ఇల్లు తాళం తెరిచినట్లు లేదనుకుంట, ఎ అమ్మాయితో తిరుగు తున్నాడో,  అందుకనే అంటా మొగుణ్ణి బుట్టలో పెట్టుకోవే అని నెత్తి నోరు మొత్తు కుంటా, నామాట వినవుకదా, మా అయన ఉద్యోగస్తుడు,  సెలవులు ఉండవు అని అంటావు, కనీసమ్ నీ ఫోన్ సమాధానమూ లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ చేయలేదు అని అంటూ మరలా  దగ్గు తున్నది, మరోవైపు ఆయాస పడుతున్నది.

అమ్మ నీవు మాట్లాడకుండా ఈ కుర్చీలొకూర్చొ కాస్సేపు అన్నది.

అంతేగా నేను చేయ గలిగినది కూర్చుమ్టా లేమ్మ,  నీవు ఇల్లంతా సర్దు ముందు, ఇంట్లో ఎమన్నా జీడి పప్పు, పల్లీలు ఉంటె నామోహణ కొట్టు అవితిని కాస్త ఆకలి తీర్చుకుంటా.

అమ్మ ఫ్రిజ్ ఖాలీగా ఉన్నది, గ్యాసు నిండు కున్నది, నిత్యవసర వస్తువులు (బియ్యం, పపు,వుప్పు, కారం ) కనిపించుటలేదు, నీకు పెట్టాలంటే ఇక్కడ ఎమీలేవు, ఇప్పుడు ఏంచేయాలో నీవె చెప్పు నీ అనుభవముతో అన్నది జానకి.

నేను నీకు చెప్పెదాన్నైతే  నీవు వద్దన్నా ఏకాదశి ఉప్పొషం ఉండే దాన్నా, ద్వాదశి కుడా ఉప్పొషం ఉండాల్సిన పరిస్తితి ఉంటుందని కల కున్నానా, అసలే నాకు లో B.P. Sugar. ఉన్నవి, ఎప్పుడు ఈ ప్రాణం గుటుక్కు మంటుందో  తెలియ కుండా  ఉన్నది అందుకేనే ఆకలేసి ఆకలి ఆకలి అన్నాను అన్నది.

అమ్మ నాకు మాత్రం ఆకలి కావటం లేదను కున్నావా  నీవు పైకి అన్నవు,  నేను అనలేకపోతున్న అంతే.

అంతలో ఒక పెద్ద దగ్గు వచ్చి ఒక్క సరిగా కుప్పకూలిమ్ది పార్ఫతమ్మ

అమ్మ ఏమైందే ఆట్లా పడిపోయావు, కల్లు తెలేస్తూ నోటి సైగలతో మంచి నీల్లు అడిగింది అప్పుడే తెచ్చిన నీరు పట్టింది తల్లికి జానకి

నెమ్మదిగా తల్లిని చెతులమీద ఎత్తుకొని మంచముమీద పడుకో పెట్టింది.

కాస్త నిద్ర పోయిందని తెలిసాక బాబుకు పాలిచ్చి తను కూడా  నడుం వాల్చింది ఆకలితో (బందుల ప్రభావము మనుష్యుల ప్రాణాలు తో ఆడుకుంటున్నది, డబ్బులున్న ఏమి చేయలేని పరిస్తితి ఏర్పడింది అనుకుంటూ) నిద్రలోకి జారుకుంది.

జానకికి నిద్రపట్టుటలేదు, తల్లి గుండె ఎగసి పడుతున్నది, నిద్రలో కూదా ఆకలి ఆకలి అని కలవరిస్తున్నది, అందుబాటులో కనీసము త్రాగటానికి నీరు కూడా  లేవు వారి వద్ద తెచ్చిన కాసిని తల్లికి పట్టడం జరిగింది.

అర్ధరాత్రి ఒక్కసారిగా తల్లి ఒక పెద్ద ఆర్తనాదం చేస్తూ, నాప్రాణాలు ఎవరో తోడేస్తున్నారు, నాకు త్రాగటానికి కనీసము తులసి నీల్లన్న  పోయి అమ్మాయి అని పెద్దగా అరిచింది. తల్లిని చూడగా కళ్ళు తెలేస్తున్నది, నాలిక త్రిప్పుతున్నది, ఆ పరిస్తితులో ఏమి చేయాలో తోచలేదు జానకికి.
                              
                                                                    

తల్లి ప్రాణాలు రక్షించుకోవాలి ఎట్లా అని పూజ గదిలోకి పోయి తను నిత్యమూ ఆరాధించే ఆంజనేయస్వామికి తల్లి భాదను విన్నవిమ్చుకోన్నది.  తక్షణం నా పరిస్తితి గమనించు తండ్రి,  నీవె నాకు దిక్కు చూపాలి, మా అమ్మ భాద తగ్గాలి అని నమస్కరిస్తూ పద్మాసనంలో కూర్చొని ప్రార్ధించింది. అనుకోని విధముగా ఒక వెలుగు లాంటి ఆలోచన మనసుకు తట్టింది జానకికి, వెంటనే అమలు పరిచింది. (వక్షోజాల వత్తుకొని క్షీర ధారలను గ్లాసులో పట్టుకొని) తల్లి దగ్గరకు గబా గబా వెళ్లి ఒక గ్లాసుతో  పాలు తల్లిని కూర్చొపెట్టి త్రాగిమ్చిమ్ది, అప్పడే అమ్మ ప్రాణం లేచి వచ్చినట్టున్నది అమృతం త్రాగినట్టుమ్ది అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.

తల్లి ఆత్మ సామ్తిమ్చాలని ఆదేవుడ్ని మరొక్కసారి ప్రార్ధించ్చింది.

తెల్లవారుజామున ఫోన్ శబ్దము విని లేచింది జానకి. ఫోన్ తీసి నిద్ర మత్తులో హలో అని అన్నది.

డార్లింగ్ నేను రఘురాం, నాగొంతు గుర్తుపట్ట లేదా అని అన్నాడు,  ఎలా గుర్తు పట్టగల నండి, నేను చేసిన ఒక్క ఫోన్ సమాదానము  లేదు మీకు  అసలు ఒక పెల్లాము, బిడ్డ ఉన్నాదని మీకు గుర్తుందా .

కోపం వచ్చిందా నేను ఫోన్ చేయలేదని నీకు, మరి రాదా ఏమిటి?  పుట్టిమ్టిలో ఉన్నది, అమ్మలక్కలు ఏమంటారో కూడా మీకు తెలియ దాండి. నన్ను అనుమానిమ్చకే నేను శ్రీ రఘు రాముడ్ని  వేరొక స్త్రీని కన్నెత్తికూడా  చూడను, నీవు అనుమానించ పనిలేదు, మరి ఎందుకు ఫోన్ చేయలేదు అని అడిగింది.

అనుకోని విధముగా మా అఫీసు తరఫున సింగపూర్ పోవటం జరిగింది అక్కడ 3 నెలలు ఉండవలసి వచ్చింది. ఎన్నిసార్లో ప్రయత్నమూ చేసాను నీ ఫోనుకు కాని నాకు లైను కలవలేదు అందువల్ల చేయలేక పోయాను అని అన్నాడు. సరే మీరు ఈరొజు వస్తున్నారుగా మన ఇంటికి అని అడిగింది.  ఉదయంకల్ల హైదరాబాద్ రాగలుగుతాను, బాబుకు ఎం పేరు పెడదామను కున్నావు, మీరొ చ్చాకె  పెడదామనుకున్నాను, బాబుకు నీకు ముద్దులు , మీ అమ్మను అడిగినట్లు చెప్పు నేను వస్తున్నట్లు చెప్పు  అన్నాడు రఘురాం.

సరే జాగార్తగారండి, వచ్చేటప్పుడు ఫోన్ చేయండి అన్నాది జానకి.

జానకి ఇల్లంతా సర్ది, గ్యాసు బండ తెచ్చుకొని, పాల ప్యాకెట్టులు తెచ్చి, మమ్చినీరు పట్టుకొని, పాలు కాచి త్రాగి, తల్లిని లేపుదామనుకున్నది. తల్లి ఘాడ నిద్రలో ఉన్నది. వెంటనే బయటకు పోయి నిత్యవరవస్తువులు తెచ్చుకొన్నది.

అమ్మ నీవు నిద్ర లేస్తావా అని అడిగింది, నిద్ర లెస్తూనె రాత్రి అమృతం ఇచ్చావు నాకు, అసలు ఆకలి అనేది మరిచాను,  నాకు తెలీలెదె బ్రహ్మాండముగా నిద్ర పట్టింది.

ఇప్పుడు ఆకలి అవటములేదు, నీ ఇష్టము వచ్చినప్పుడు పెట్టు అన్నది తల్లి. ఇన్తకీ నాకు రాత్రి పాలు ఇచ్చావు ఎక్కడ నుంచి తెచ్చావు  అన్నది.  ఎక్కడ నుండి తేలేదు,  పిల్లవాడికి పట్టే పాలు నీకు పట్టాను, వేరే దారిలేక అన్నది. నిన్ను బ్రతికిమ్చుకోనటానికి నీ భాధనుచూడలే క

నీవె నాకు తల్లివి నేను నీకు బిడ్డను అన్నది పార్వతమ్మ, అట్లా అనకమ్మ నీవె నా తల్లివి ఆపదలొఉన్నవారిని ఆదు కోవటమే  కనీస ధర్మం అదే నెను చేసాను , నీకు మంచి కబురు చెబుదామని లేపాను,  మా అయన నుండి ఫోన్ వచ్చింది  వస్తున్నారు, ఈ మూడు నెలలు ఆఫీసు  పనిమీద  సింగపూర్ లో ఉన్నారుట.

అమ్మాయి అల్లుడు వచ్చాక నేను ఊరికి వెళ్ళిపోతాను నన్ను ఉండమని ఆపకు, ఆకలి ఆకలి అని నిన్ను ఎడిపిమ్చను, పెద్దగా ఆర్తనాదము చేయను అన్నది.

అమ్మ నీ ఆరోగ్యము జాగర్తగా చూసుకొ, నాకు రాత్రి చాల భయమేసింది

భయ మెందుకమ్మ ఆదేవుడు మనయందు వున్నాడు, మనమేమి తప్పు చేయలేదు హాయిగా ఉండమ్మ, నేను ఆరోగ్యముగా ఉంటాను అంటూ  నవ్వుతూ పలికింది, అమాటలకు బాబు కూడా నవ్వుతున్నాడు,  బాబు నవ్వులు చూసి జానకి నవ్వుకున్నది. అప్పుడే అడుగు పెట్టిన రఘురాం నవ్వు ల్లో ముమ్చెసాడు అందరిని.                             

 

                                                                            

2 కామెంట్‌లు: