6, జులై 2014, ఆదివారం

150. Life Story -54(2) (సూక్తులు చదవండి - విజ్ఞానాన్ని పెంచుకోండి)
ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                                        1. ప్రకృతిలో  చెట్టు  తీగ పాకకుండా  ఎవరూ ఆపలేరు
    వయస్సులో వచ్చే  మార్పులు  ఎవ్వరు   ఆపలేరు
    మనసులో ఉండే కోరకలను ఎవ్వరు తెలుసుకోలేరు
    వెచ్చ చేస్తున్న  పాల  పొంగును  ఎవ్వరు  ఆపలేరు

2. భార్యను గట్టిగా అడగటానికి  భర్తకు  స్వే చ్చ ఉన్నదా
    భర్తను గట్టిగా  తిట్టడానికి  భార్య కు  స్వేచ్చ  ఉన్నదా
    పిల్లల భవిషత్తు మార్చే శక్తి తల్లి తండ్రులకు  ఉన్నదా
    సంసారం లో దేవున్ని ప్రార్ధించే  సమయము ఉన్నదా

3. నిజమైన నరక  మనేది దారి  లేకుండా  చేయడం
    ఆశల తో   మానవులు చిత్ర హింసకు గురికావడం
    మాట-మాట వ్యత్యాసం వళ్ళ కొందరు విడిపోవడం
    నీటి  కోసం ఎండ మావులను  చూసి  ఆశ పడటం        

4. మీ సందేహములోనే నాకు  సమాదానము దొరికింది
    మీ ఓర్పు వళ్ళ  ఒకసమస్యకు పరిష్కారము దొరికింది
    మీ నేర్పు వళ్ళ దేశ పురోభివృద్ధికి శ్రేయస్కర   మైనది
    మీ తీర్పు వళ్ళ  కొందరికి  ప్రాణ  భయము   తొలగింది

5. దొంగ మారడు,    దొంగలిమ్చడం  మారుస్తాడు
    కోపిష్టి మారాడు, శాంతముగా ఉండా లంటాడు        
    తొందర చేస్తాడు,  ఆరోజే ఆలస్యము అవుతాడు
    ప్రేమించా నంటాడు, పెళ్లి  మాత్రం   వద్దంటాడు

6. రామ-కృష్ణ లక్షణాలను ఎవ్వరు మార్చ లేరు
    విద్య అనే  తెలివిని  ఎవ్వరు  దోచుకో   లేరు
    దైవ సన్నిధిలో అహంకారులు దరి చేరలేరు
    కల్మషము లేని మనిషికి ఆశలు చూపలేరు 

7. సంతృప్తి  లో  సంతోషము దాగి యున్నది
    ఇష్ట పడి చేస్తే కష్టం అనేది తెలియకున్నది
    ఇతరులను పోల్చుకుంటే నరక  మున్నది
    ఆశలకుపోతే  సంసారం వీధిన పడుతుంది

8. కోపం లేకుండా నవ్వుతూ సంసారం చేయాలి
    శాంతము తో సఖ్యత తో ప్రేమను    పంచాలి
    ఆరోగ్యముతో భాగస్తునిని సంత్రుప్తి  పరచాలి
    వయస్సుబట్టి  కాలాన్నిబట్టి నడుచు కోవాలి

9. సామర్ద్యాన్ని ప్రదర్సించ డానికి ఇష్ట పడకు
    సహాయం చేయటానికి మాత్రం వెనుకాడకు
    బల పరీక్షకు దిగి అందరిలో తక్కువ  కాకు
    విద్యా దానం చేయుట  ఎప్పటికి మరువకు

10. ఒకడు  రాతిలో  దేవుని  విగ్రహమును    చూడ గలడు
      మరొకడు   రాయిని   మారణ   హొమంగా  వాడగలడు
      వేరొకడు రాయిని  త్రొక్కి పాడు  చేసి పగల   గొట్ట గలడు
      వ్యాపారి  రాయిని రత్నంగా  వ్యాపారము చేసుకో  గలడు              

11. ఒకరి తిరస్కారమే,  అతనికి అది పురస్కార మవుతుంది
      ఒకరి ద్వేషమే, అతనికి పట్టుదలకు పునాది అవుతుంది
      చెడు తిరుగకుండుటే, అతనికి  మంచి మార్గ మవుతుంది 
      అబద్ధాలు చెప్ప కుండుటే ఉత్తముడయ్యే అవ కాశముంది

12. ద్వేష మున్నచోట ప్రేమ తప్పక వుంటుంది
      విద్య ఉన్న చోట   మూర్ఖ త్వం   ఉంటుంది
      భర్త కాదన్నచోట     భార్య  అవు నంటుంది
      రహస్యమన్న చోట, బహిర్గత మవు తుంది 

13. అలోచనలను ప్రక్కన  పెట్టేందుకు  చేస్తారు  ధ్యానం
      చెప్పకూడనివి చెప్పాల్సి వస్తుందని ఉంటారు మౌనం
      చీకటిలొ వెలుతురు  కోసం  వాడుతారు వత్తి  మైనం
      మానవులు  ఆరోగ్యం   కోసం చేస్తారు  యోగాబ్యాసం

14. మనుష్యుల మాటలను బట్టి అంచనాలు వేయ వద్దు
      కాంక్ష, దురాశ ఉన్న వానిని భుద్ధిమంతుడన  వద్దు
      ఏది మంచో,  ఏది చెడో,  తెలిసి ప్రవర్తిమ్చడమే కద్దు 
      చెప్పిన పనిని చేయుటే తప్ప ప్రశ్నించే హక్కు వద్దు

15. ఇతరుల కష్టాల పట్లా ఉండాలి   సాను భూతి
      ప్రతి ఇంట్లో వెలిగించాలి ప్రేమఅనే దివ్య జ్యోతి
      మనసులో కూడ అలోచిమ్చ వద్దు ప్రాణ భీతి
      ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విదుర, శుక్ర  నీతి

16. దేన్నయిన తెలిసికోవాలన్న ఆ శక్తి   ఉండాలి
      సత్యాన్ని,  తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండాలి
      అర్హత బట్టి ఆత్మ  సమర్పణ  చేసే శక్తి ఉండాలి
      కష్టాలను స్వికరిమ్చే మనస్సుకు శక్తి ఉండాలి

17. అవసర మైనవి ఉంచి,  అనవసర మైనవి  తీసివెయాలి
      ప్రయాణములో తేలికైనవి  ఉంచుకొని ప్రయాణం చేయాలి
      విద్యను మెదడులో  ఉంచుకొని నలుగురికి దానం చేయాలి
      బ్రాహ్మాన  శక్తి  నలుగురిలో గౌరవించే విధముగా ఉండాలి

18. విద్య  నేర్చు  కొనుటకు   మనసు  ఖాలీగా  ఉండాలి
      పెళ్లి  చేసు కొనే  వారికి  శీలం  తప్పక  ఉండి  తీరాలి
      మెదడు చెప్పేది విని నీవు  నీ మనసు  బట్టి పోవాలి
      వయస్సును బట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతూ బ్రతకాలి

19. నమ్మ కాలతో మనల్ని  మనమే మోసగించు  కోవచ్చు
      రాయిని చేతిలో పెట్టి నిప్పుకణిక అని నమ్మిమ్చ వచ్చు 
      నమ్మకమనేది ఆవహిస్తే  నిప్పు కణిక కనపడక పోవచ్చు
      నిజాలు తెలియా లంటే మాయ నుండి బయట పడవచ్చు  

20. మానవులు తన చుట్టూ ఒక  ప్రపంచాన్ని  అల్లు కుంటారు
      మనసులో అను కున్నదే కళ్ళకు కనిపిమ్చినదని అంటారు
      యదార్ధము గ్రహించలేక బ్రమలతో   మునిగి   పోతుంటారు
      వాస్తవాణ్ని తెలుసుకున్న కాలచేక్రాన్ని వెనక్కి  త్రిప్ప లేరు

21.సహజత్వం రావాలంటే  నేను -నువ్వు  అనేది  ఉండ కూడదు
     ప్రేమ తతత్వానికి వావి  వరుసల భేదం  అనేది ఉండ కూడదు
     శృంగారం ప్రక్రుతి వరం, నేను-నువ్వు అనే భేదం ఉండ కూడదు
     మత తత్వానికి సహాయము చేయుట తప్ప వ్యతిరేకత ఉండదు

22. సత్య సందర్శనం కోసం  అతిగా ప్రయత్నం చేయవద్దు
      జ్ఞానోదయం కోసం అదేపనిగా గురువును నమ్మ వద్దు
      విజ్ఞానం ఇంకా పెరగాలని ఆశతొ ఖండాలు తిరగ వద్దు 
      అనుభవ సాహిత్యాన్ని అందరికి పంచటమే నీ  హద్దు

23. అహం అనేది  మనిషిలో  మేఘంలా  వచ్చి మాయ మవుతుంది
      ఆలోచన అనేది మనిషిలో మెరుపులా వచ్చిమాయ మవుతుంది
      మైనపువత్తి మనుష్యులకు వెలుగును పంచి మాయమవుతుంది
      స్త్రీ - పురుషులు కలిసే దాక సుఖం, తర్వాత మాయ మవుతుంది

24.యవ్వనం నిలబడాలంటే  జీవితం  మీద  ఉండాలి  దృష్టి
     జీవన  మధువును  సేవించిన  వారికి   నిత్య    చైతన్యం
     తల్లితండ్రులను పోషించాలని తపన ఉంటె  పెరుగును శక్తి
     స్త్రీ-పురుషుల  కలయికతో  క్రొత్తగా  పుట్టును  బ్రహ్మ శక్తి   

25. తా నొకటి  తలచిన   దైవ   మొకటి   తలచు
      సూర్యొదయం వచ్చిన చంద్రోదయం ముడుచు
      సూర్యుడు నిద్రించిన చంద్రుడు వెన్నెల పరచు          
      భర్త తాపాన్ని భార్య ముద్దులిచ్చి శాంత పరచు